-కార్పెట్ అనుకోకుండా కాలితే వెంటనే ఆలుగడ్డ ముక్కవేసి గట్టిగా రుద్దండి. నల్లమరకలు పోతాయి. -కార్పెట్ మరకలు పడి పాతగా కనిపిస్తుంటే పచ్చి ఆలుగడ్డ ముక్కతో మరకలు ఉన్నచోట రుద్ది వేడినీళ్లలో ముంచిన బట్టతో శుభ్రంగా ఒత్తితే మళ్లీ కార్పెట్ కొత్తదానిలాగా కనిపిస్తుంది. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Tuesday, May 21, 2013
చిరిగిపోయిన పాత కార్పెట్‌తో...
Friday, May 17, 2013
మైక్రోవేవ్ ఓవెన్ గురించి కొన్ని విశేషాలు,వివరాలు..
లాభాలు:
1. అన్నం, కూరలు చిటికలో వేడి చేసుకోవచ్చు/వండుకోవచ్చు.
2. ఒక్క ళ్ళే వున్నప్పుడు మీ దగ్గర మైక్రో వేవ్ కుక్కర్ వుంటే దానిలో అన్నం వండుకోవచ్చు. (ఇది చిన్నది పెద్ద గా ఖరీదు కూడా వుండదు). ఇందులోనే ఇడ్లీ కూడా వేసుకోవచ్చు.
3. కూరలు దీనిలో వేడి చేసుకున్నాప్పుడు చాలా ఫ్రెష్ గా వుంటాయి ముఖ్యం గా బంగాళ దుంప చికెన్ వంటివి.
4. పిల్లలకు అప్పటి కప్పుడు స్కూల్ నుంచి రాగానే స్నాక్ కావాలని గోల పెడితే మనం చేసి ఇచ్చే నూడుల్స్ ఈ మైక్రోవేవ్ లో చాలా తొందర గా పోషకాహార విలువలు పోకుండా చేసుకోవచ్చు.
5. పిల్లలకు కేక్ ల వంటి వి కూడా తొందర గా చేసి ఇవ్వవచ్చు.
మనలో చాలా కామన్ గా వుండే అపోహలు ఈ మైక్రోవేవ్ గురించి:
1. దీని మూలం గా ఆరోగ్యం పాడైపోతుంది, ఇందులో నుంచి వెలువడే రేడియో యాక్టీవ్ తరంగాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి.
2. ఇందులో ఆహారం సమం గా వుడకదు.
3. ఇందులో వండిన పదార్ధాలలో పోషకాహార విలువలు మాయం అవుతాయి.
4. ఇందులో ఏదో మిగిలి పోయిన కూరలు వేడి చేసుకోవటం తప్ప పెద్ద వుపయోగం లేదు, దాని కోసం అంత ఖర్చు పెట్టి కొనటం దండుగ.
పైన చెప్పిన అపోహలకు కొన్ని సమాధానాలు.
1. దీని మూలం గా ఆరోగ్యానికి వచ్చిన నష్టం ఏమి లేదు, మనం సాధారణం గా అన్ని రకాల ఎలక్ట్రో మాగ్నెటిక్ తరంగాలను రేడియో యాక్టీవ్ తరంగాలనే అంటాము. (రేడియో తరంగాలు, ఎక్స్ రే తరంగాలు, మైక్రోవేవ్స్, కాంతి తరంగాలు, ఆల్ట్రా వయొలెట్ తరంగాలు) కాని నిజానికి దాన్లో శక్తి వాటి వేవ్ లెంత్ తో కొలుస్తారు. హ్రస్వమైన (షార్ట్ వేవ్ లెంత్ ) కిరణాలకు ఎక్కువ శక్తి (ఎక్స్ రే, గామా రే), దీర్ఘ(లాంగర్ వేవ్ లెంత్) కిరణాలు తక్కువ శక్తి (మైక్రో వేవ్) ను బహిర్గతం చేస్తాయి. నిజానికి vhf uhf రేడియో తరంగాలకంటే మాత్రమె ఈ మైక్రోవేవ్ తరంగాలు బలమైనవి ఈ రకమైన కిరణాల కుటుంబం లో.
అందుకనే ఏదైనా వేడి చేసే టప్పుడు దాని మీద మూత వుంచి వేడి చేస్తే సమం గా వేడి అవుతుంది, ఆహారం బిరుసేక్కినట్లు అవ్వదు (తేమ అలాగే వుంటుంది కాబట్టి) , అలాగే ఇది ఎటు వంటి ఆరోగ్య సమస్య లు కలిగించాడు.
2. పైన చెప్పిన సమాధానమే దీనికి కూడా, మనం మూత పెట్టి వండి/ వేడి చేసినప్పుడు ఇది చక్క గా సమ తుల్యం గా వుడుకుతుంది.
3. ఇందులో వండటం వలన పోషకాహార విలువలు వుండవు అనేది కేవలం ఒక అపోహ. నిజానికి దీని మూలం గా మనం పోషకాహార విలువలను వృధా చేయటం తగ్గుతుంది అని FDA అప్రువ్ చేసింది. దీనికి కారణం ప్రోటీన్ లు వుండే ఆహారం ఎక్కువసేపు పొయ్య మీద వేడి అవటం మూలం గా వాటిలోని A మరియు E వైటమిన్ లను కోల్పోయే ప్రమాదం వుంది కాని మైక్రోవేవ్ తో అలా కాదు ఎందుకంటే తొందర గా వేడి అవుతుంది కాబట్టి.
4. వుపయోగించుకోవటం తెలియాలే కాని ఇది నిజం గా చాలా సహాయకారి. దీనితో అన్నం కూరలు వేడి చేసుకోవటమే కాదు, అన్నం ఇడ్లీ వండుకోవచ్చు కూడా, అంతే కాదు మనం రోజు వండుకునే కూరలు వుదాహరణకు దొండకాయ పొయ్య మీద పెట్టి దానిని చాలా సేపు చాలా నూనె తో వేయించితే కాని మంచి రుచి రాదు కాని మైక్రోవేవ్ లో, కోసిన దొండకాయలను కొంచం వుప్పు కొంచం నీళ్ళు చిలకరించి మూత పెట్టి ఒక 5- 8 నిమిషాల మధ్య ( ఒక కిలో కాయలకు) వేడి చేసి తరువాత పొయ్య మీద వేసుకుంటే నూనె తక్కువ పడుతుంది తొందర గాను ఐ పోతుంది.
రుచి కూడా చాలా బాగుంటుంది, పోషకాహార విలువలు పోవు తక్కువ సేపు వండుతున్నాము కాబట్టి. ఇలానే వంకాయ (ముఖ్యం గా గుత్తి వంకాయ కు), కేలిఫ్లవర్, క్యాబేజ్, తోట కుర, బీట్రూట్, కేరట్ వంటివి ఇలా చేస్తే చాలా మంచిది. (బెండకాయ మాత్రం ఇలా చేసి , నన్ను తిట్టవద్దు).
5. కాఫీ, టీ లు చాలా ఈజీ చెయ్యటం, ఒక కప్పు లో పాలు నీళ్ళు మీకు కావలసిన నిష్పత్తి లో కలుపుకుని దానిలో ఒక టీ బేగ్ వేసుకుని ఒక 2 నిమిషాలు వేడి చేసుకోండి టీ రది. కాఫీ ఐతే ఈ పాలు , నీళ్ళు కలిపిన కప్ ను 2 నిమిషాలు వేడి చేసి బయటకు తీసి మీకు ఇష్టమైన బ్రూ నో నేస్కేఫ్ నో వేసుకుని పంచదార వేసి తిప్పుకుంటే కాఫీ కూడా రడి.
ట్రిక్స్:
1. మూత మామూలు పింగాణీ మూత కాకుండా ప్లాస్టిక్ లోనే మందమైనవి ప్రత్యేకం గా మైక్రోవేవ్ లో వేడి చేసుకునే వాటి మీద మూతల కోసం చేసినవి దొరుకుతాయి అవి వుపయోగించండి, తొందర గా సమం గా వేడి అవుతాయి.
2. పచ్చళ్ళు అస్సలు వేడి చెయ్యకండి వాటి రంగు రుచి కూడా పోతాయి.
3. మైక్రోవేవ్ లో స్టీల్ గిన్నెలు పెట్టకూడదు, ప్లాస్టిక్ దొరుకుతాయి వీలైనంత వరకు గోల్డ్ లైనింగ్ లేని పింగాణి, లేదా కార్నింగ్ వేర్ గిన్నెలు వాడండి. అవి మంచివి.
4. కొంచం ఎక్కువ మొత్తం గా వేడి చేస్తున్నప్పుడో లేదా చారు వంటి ద్రవ పదార్ధాలు వేడి చేసేప్పుడు లేదా చాలా కాలం గా ఫ్రిజ్ లో వున్నవాతినో వేడి చేసేప్పుడు మధ్య లో ఒక్క సారి డోర్ తీసి కలియబెట్టి మళ్ళీ వేడి చేస్తే చాలా సమం గా కింద వరకు ఒకేలా వేడి అవుతాయి.
5. పండగలప్పుడు పాయసం వంటివి చేసేప్పుడు బెల్లం తరుగు కోవటం ఒక పనే కదా, ఆ బెల్లం గడ్డ ను ఒక గిన్నెలో వేసి కొంచం నీటి చుక్కలు చిలకరించి మైక్రోవేవ్ లో 2 నిమిషాలు వేడి చేసి చూడండి బెల్లం పాకం రడీ.
6. చింతపండు నాన పెట్టటం మర్చి పోయారా పప్పు చారు లోకి. కొంచం చింతపండు గిన్నెలో వేసి కొంచం నీళ్ళు పోసి ఒక నిమిషం వేడి చేయండి (మూత మర్చి పోవద్దు), గుజ్జు రడీ.
7. పైన సూత్రమే పిల్లలకు తల అంటే టప్పుడు కుంకుడుకాయలు అప్పటికప్పుడు నాన పెట్టుకోవటానికి కూడా వుపయోగ పడుతుంది.
8. అంట్లు తోముకునే స్పాంజ్ తో చికెన్, రోయ్యాలో వండిన గిన్నెలో, చికెన్ కడిగి వుంచుకున్న గిన్నో, కోడిగుడ్డు ఆమ్లెట్ వేసిన పెనమో తోమి తరువాత దానితో పాల గిన్నె తోమాలంటే కొంచం ఇబ్బంది గానే వుంటుంది.
వాసన ఒక చిరాకు, ఆ బేక్టీరియా మిగతా వాటికి వస్తుందేమో అని మనసు లో ఒకటే నస గా వుంటుంది. అది పోవాలంటే ఆ స్పాంజ్ ను తడిచేసి ఒక రెండు నిమిషాలు మైక్రోవేవ్ లో వేడి చేయండి. ఆ రేడియేషన్ కు బేక్టీరియా ఫ్రీ అవుతుంది అట, వాసన కూడా వుండదు.
9. కాఫీ టీ లు పెట్టుకునేప్పుడు ముందే పంచదార వేసి వేడి చేయకండి పంచాదర వేసి మైక్రోవేవ్ లో పెడితే పాలు పొంగి పోతాయి.
Thursday, May 16, 2013
చిట్కాలు
1. బియ్యంలో మట్టిగడ్డలు ఎక్కువగా ఉంటే చారెడు ఉప్పు వేసి 10 నిమిషాలు
నాననిస్తే మట్టిగడ్డలు నీళ్ళలో కరిగిపోతాయి.
2. కూరలు తరిగేటప్పుడు కత్తిపీట క్రింద పాత పేపరు వేసుకుంటే, తరిగిన తొక్కలను
అలాగే పేపరుతో ఎత్తి బైట పారేయవచ్చు. లేకపోతే అనంతరం ఊడ్చుకోవడం
శ్రమ, టైం వేస్టూనూ.
3. కాయగూరల్ని ముందుగా నీటిలో శుభ్రంగా కడిగి, ఆ తరువాతనే తరగాలి.
అంతేగాని ముందుగా తరిగేసి,తరువాత కడగకూడదు.
4. ముందుగా కడిగినా కూడా అరటికాయ మొదలైనవాటిని తరిగి నీళ్ళలోనే
వేయాలి. ఇటువంటి కూరలు రెండుసార్లు శుభ్రపడవలసిందే.
5. కూరగాయముక్కల్ని పసుపు కలిపిన నీటిలో ఉంచితే ఏవైనా క్రిములు ఉంటే
అవి పైకి తేలిపోతాయి.
6. కూరలను మరీ సన్నగాను నాజూకుగానూ తరగకూడదు. అందువల్ల వాటిలోని
పోషకాంశాలు నశించే ప్రమాదముంది.
7. కొన్ని కూరలు తరిగేటప్పుడు చేతులు బంకగానో, పొరలు గానో వచ్చేస్తూనో
ఉంటాయి అరటి పనస వంటి కూరలు.తరిగేముందు చేతులకు కొంచెం నూనె
రాసుకుని తరిగితే ఆ విధంగా జరగదు.
8. కంద పెండలం వంటివి తరిగేటప్పుడు చేతుల్ని చింతపండు రసంలో
తడుపుకుంటే దురదలు పుట్టవు.
9. తరిగిన కాకరకాయ ముక్కలను కొంచెం ఉప్పు వేసి నలిపితే చేదు తగ్గుతుంది.
10. బంగాళాదుంపలు మెత్తబడినట్లయితే తరగబోయేముందు వాటిని ఒక అర
గంట ఐస్ వాటర్లో ఉంచితే గట్టిపడతాయి.
12. వంకాయలు, అరటికాయలు తరిగేటప్పుడు కొంచెం పెరుగు కలిపిన నీళ్ళలోకి
తరిగితే కనరెక్కకుండా ఉంటాయి.
13. వంకాయ ముక్కల్ని బియ్యం కడిగిన నీళ్ళలోకాని, ఉప్పు వేసిన నీళ్ళలో వేస్తే
కనరెక్కకుండాను, నల్లబడకుండానూ ఉంటాయి.
14. అరటిపువ్వును దంపేటప్పుడు పసుపు వేసి దంపితే నల్లబడదు.
15. ఉల్లిపాయలను ఒక అరగంట సేపు నీళ్ళలో నాననిచ్చి, ఆ తర్వాత తరిగితే
కళ్ళమ్మట నీళ్ళు రావు.లేదా ఫ్రిజ్లో పెట్టి తీసినా సరే.
16. కాలిఫ్లవర్ ను ఎప్పుడుగానీ చిన్న ముక్కలుగా తరిగి ఉప్పు వేసిన గోరువెచ్చటి
నీళ్ళలో వేసి కొద్ది సేపు తర్వాత తీసి వండుకోవాలి. ఇలా చేస్తే అందులోని
క్రిములు చచ్చిపోతాయి.
17. ఉల్లిపాయ తరిగేటప్పుడు రెండువైపులా కోసి మధ్యకి తరిగితే పైనున్న పొర
త్వరగా వచ్చేస్తుంది.
18. వెల్లుల్లికి కొద్దిగా నూనె రాసి కొద్దిసేపు ఎండలో బెడితే పొట్టు తేలిగ్గా వస్తుంది.
19. నిమ్మకాయను నేలమీద పెట్టి అరచేత్తో అదిమి కాస్త మెత్తబడ్డాక కోస్తే రసం
పిండటం తేలికగా ఉంటుంది ఎక్కువ వస్తుంది కూడా.
20. పగిలిన గ్రుడ్డును కొంచెం వెనిగర్ కలిపిన నీళ్ళలో ఉడకబెడితె లోపలి ద్రవం
బైటకు రాకుండా బాగా ఉడుకుతుంది.
21. గ్రుడ్లను ఉడకబెట్టిన తర్వాత వెంటనే చన్నీళ్ళలో ఉంచితే పైపెంకు
ఒలవడం తేలికవుతుంది.
22. ఉడికిన గ్రుడ్లను చన్నీళ్ళలో ముంచిన కత్తితో కోస్తే బాగా తెగుతాయి.
23. కోడిగ్రుడ్లను అల్యూమినియం, లేదా వెండిపాత్రలలో పగలగొడితే
అందులోని సల్ఫర్ కారణంగా పాత్రలు నల్లబడతాయి.
24. తడిగా ఉన్న పాత్రలలోకి పగలగొడితే గ్రుడ్డులోని పసుపు భాగం పాత్రకు
అంటుకోకుండా ఉంటుంది.
25. ఆమ్లెట్లు వేసేముందు గిన్నెలో ఉప్పు కారం మసాలా అన్నీకలిపి కొద్దిగ
నీరుపోసి కలిపిన తర్వాత గ్రుడ్లను కొట్టి కలిపితే అవి సమానంగా కలుస్తాయి.

పాలకులంటే ఇలా ఉండాలి,,,,,,,,,,,,,దైవాలజీ
హజ్రత్ ఉమర్ (ర) గొప్పనాయకుడు. ప్రజారంజక పాలకుడు. పరిపాలనా దక్షుడు. ప్రతిక్షణం ప్రజాసంక్షేమం కోసమే ఆలోచించే ప్రభువు. పగలంతా పాలనావ్యవహారాల్లో తలమునకలై ఉన్నా, రాత్రుళ్లు కూడా సరిగా నిద్రపోయేవారు కారు. తన పాలనలో ప్రజలెలా ఉన్నారోనన్న ఆలోచన ఆయన్ను అనుక్షణం వెంటాడేది. ఈ ఆలోచనే ఆయన్ను గస్తీలు తిరిగి ప్రజల యోగక్షేమాలు తెలుసుకునేలా ప్రేరేపించేది. ఖలీఫా హజ్రత్ ఉమర్ తరచుగా మారువేషంలో గస్తీ తిరిగి ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారు. ఒకరోజు హజ్రత్ ఉమర్ యథాప్రకారం గస్తీ తిరుగుతూ ఓ మారుమూల ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ ఒక చిన్న పూరిపాకలో ఓ వితంతువు నివసిస్తోంది. కూలినాలి చేస్తూ తన ముగ్గురు పిల్లల్ని పోషించుకుంటోంది.
‘‘అమ్మా! పిల్లలు ఎందుకలా ఏడుస్తున్నారు? ఏమిటీ విషయం?’’ అంటూ ఆరా తీశారు, ఏం మాట్లాడాలో ఆమెకు అర్థం కాలేదు. పొంగుకొస్తున్న దుఃఖాన్ని పంటికింద బిగబట్టుకుని, ‘‘అది... అది కాదండీ... నిజానికి ఈ గిన్నెలో ఏమీ లేవు. పిల్లల్ని ఓదార్చడానికి కాసిని నీళ్లు, నాలుగు రాళ్లు పోసి వారిని నమ్మిస్తున్నాను, ఇంతకంటే ఇంకేమీ చేయలేని నిస్సహాయురాలిని’’ అన్నదామె కొంగుతో కళ్లు తుడుచుకుంటూ. పసిపిల్లల ఆకలిబాధను కళ్లారా చూసిన ఖలీఫాకు కూడా అప్రయత్నంగానే కళ్లవెంట నీళ్లు జలజలా రాలాయి. ‘‘అమ్మా! ఈ విషయం ఖలీఫాకు (పాలకుడు) చెప్పలేదా? పాలకుల దృష్టికి తీసుకెళితే నీకేమైనా సహాయం అందేదేమో!’’ అన్నారు ఉమర్. ‘‘అయ్యా! పేదవితంతువును. పాలకుల వద్దకు వెళ్లగలనా? అయినా తన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత పాలకులకు లేదా? ప్రజాసంక్షేమం పట్టనివారు, కనీస ధర్మం నెరవేర్చలేని వారు పాలకులుగా ఎలా ఉంటారు?’’ అన్నదామె ఒకింత ఆవేదనతో. బాధ, నిస్సహాయతల్లోంచి ఆవేశంగా దూసుకొచ్చిన ఈ మాటలు ఖలీఫా ఉమర్ గుండెకు తూటాల్లా తగిలాయి. మారుమాట్లాడకుండా శరవేగంతో వెనుదిరిగిన ఉమర్ కోశాగారానికి చేరుకున్నారు. ఆ కుటుంబానికి కావలసిన వస్తువులన్నీ గోనెసంచిలో నింపుకుని స్వయంగా తన భుజాలపై మోసుకొచ్చి ఆమెకు అందజేశారు. స్వహస్తాలతో వండి పిల్లలకు తినిపించారు. ఈ ఆప్యాయతకు, ఇంతటి సహాయానికి కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో తెలియని ఆ స్త్రీ ‘‘అయ్యా... పాలకుడిగా (ఖలీఫాగా) ఉండాల్సింది నిజంగా మీరే. ఆ ఉమర్ కానేకాదు. పాలకుడికి ఉండాల్సిన లక్షణాలన్నీ మీలో ఉన్నాయి’’ అంటూ కృతజ్ఞతగా తెలిపిందామె. పశ్చాత్తాప భావంతో కుమిలిపోతున్న ఉమర్ ‘‘అమ్మా! ఇప్పటివరకు మీ కష్టసుఖాలు తెలుసుకోలేకపోయిన ఉమర్‌ను నేనేనమ్మా! నన్ను మన్నించండి. నా వల్ల పెద్ద పొరబాటే జరిగిపోయింది. ఇకముందు అలా జరగకుండా చూసుకుంటాను’’ అంటూ ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి, పింఛను కూడా మంజూరుచేశారు. ఇంతటి జవాబుదారీతనం, బాధ్యతాభావం ఉండబట్టే ఖలీఫా హజ్రత్ ఉమర్ పాలనా కాలాన్ని చరిత్రకారులు సువర్ణాక్షరాలతో లిఖించారు. ఇందులో కనీసం వందోవంతైనా నేటి పాలకులు ఆచరించగలిగితే బాగుండు. |
మంచి మాట
దైవాన్ని మెచ్చుకునే భజనలు కట్టిపెట్టు - దైవం మెచ్చుకునే పనులు మొదలెట్టు
పెళ్లి అంటే మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కాదు, మంచి జీవిత భాగస్వామివి కావడం. -:
పెళ్లి అంటే మంచి జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కాదు, మంచి జీవిత భాగస్వామివి కావడం. -:
నొప్పిలేకుండా రూట్‌కెనాల్ చేయవచ్చు...డెంటిస్ట్
పుచ్చు అనేది పంటికి ఎలా వ్యాపిస్తుంది? దానికి కారణాలు ఏమిటి?
దీనికి అనేక కారణాలు ఉంటాయి. 1) వంశపారంపర్యంగా 2) బ్రషింగ్ సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల 3) మన ఆహారపు అలవాట్ల వల్ల. పైన పేర్కొన్న పద్ధతుల ద్వారా పుచ్చు వ్యాప్తి చెందుతుంది.
పుచ్చు అనేది మొదటి దశలో పంటి మీద ఒక నల్లటి మచ్చలాగా ఏర్పడుతుంది. ఈ దశలో మనకి అసలు నొప్పి ఉండదు. తర్వాత గుంట లాగా ఏర్పడుతుంది. అప్పుడు మనం తీసుకునే పదార్థం దానిలో ఇరుక్కుంటుంది. ఈ క్రమం ఇలాగే కొనసాగినట్లయితే అది మెల్లగా పంటి మూడో పొర అనగా పల్ప్‌కి వ్యాపిస్తుంది. అప్పుడు పంటిలో నొప్పి మొదలయి పంటి వేరుకి వ్యాపిస్తుంది.
పుచ్చుపళ్ళకి ట్రీట్‌మెంట్ ఏవిధంగా ఉంటుంది?
1. మొదటి దశలో పుచ్చుకి ట్రీట్‌మెంట్ - నల్లగా మచ్చగా ఏర్పడిన ప్రాంతాన్ని శుభ్రపరచి సిమెంట్‌తో నింపుతారు. పంటి పల్ప్‌కి గనుక ఇన్‌ఫెక్ట్ అయితే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయాలి.
రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ పద్ధతి ఏమిటి? అది ఎలా చేస్తారు?
ఇందుకు ముందుగా పంటిలో ఇన్‌ఫెక్ట్ అయిన నరాన్ని మొత్తం తొలగించాలి. ఆ తర్వాత ఇన్‌ఫెక్షన్ అంతా పోయిందని నిర్థారించుకుని ఆ భాగాన్ని మెడికేటెడ్ పదార్థంతో నింపుతారు. ఆ తర్వాత పంటిపైన క్యాప్ అమర్చుతారు.
రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్‌లో ఆధునిక పద్ధతులు ఏమిటి?
1) రోటరీ రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ 2) లేజర్ ద్వారా రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్.
ఆధునిక రూట్‌కెనాల్ పద్ధతుల ద్వారా ఉపయోగాలు ఏమిటి?
వీటి ద్వారా ఇన్‌ఫెక్షన్‌ని తక్కువ సమయంలో తొలగించవచ్చు. దీనిద్వారా ట్రీట్‌మెంట్ చాలా తక్కువ సమయంలో ఏ ఇబ్బందీ లేకుండా పూర్తి అవుతుంది.
దీనికి అనేక కారణాలు ఉంటాయి. 1) వంశపారంపర్యంగా 2) బ్రషింగ్ సరైన పద్ధతిలో చేయకపోవడం వల్ల 3) మన ఆహారపు అలవాట్ల వల్ల. పైన పేర్కొన్న పద్ధతుల ద్వారా పుచ్చు వ్యాప్తి చెందుతుంది.
పుచ్చుపళ్ళకి ట్రీట్‌మెంట్ ఏవిధంగా ఉంటుంది?
1. మొదటి దశలో పుచ్చుకి ట్రీట్‌మెంట్ - నల్లగా మచ్చగా ఏర్పడిన ప్రాంతాన్ని శుభ్రపరచి సిమెంట్‌తో నింపుతారు. పంటి పల్ప్‌కి గనుక ఇన్‌ఫెక్ట్ అయితే రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్ చేయాలి.
రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ పద్ధతి ఏమిటి? అది ఎలా చేస్తారు?
ఇందుకు ముందుగా పంటిలో ఇన్‌ఫెక్ట్ అయిన నరాన్ని మొత్తం తొలగించాలి. ఆ తర్వాత ఇన్‌ఫెక్షన్ అంతా పోయిందని నిర్థారించుకుని ఆ భాగాన్ని మెడికేటెడ్ పదార్థంతో నింపుతారు. ఆ తర్వాత పంటిపైన క్యాప్ అమర్చుతారు.
రూట్ కెనాల్ ట్రీట్‌మెంట్‌లో ఆధునిక పద్ధతులు ఏమిటి?
1) రోటరీ రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్ 2) లేజర్ ద్వారా రూట్‌కెనాల్ ట్రీట్‌మెంట్.
ఆధునిక రూట్‌కెనాల్ పద్ధతుల ద్వారా ఉపయోగాలు ఏమిటి?
వీటి ద్వారా ఇన్‌ఫెక్షన్‌ని తక్కువ సమయంలో తొలగించవచ్చు. దీనిద్వారా ట్రీట్‌మెంట్ చాలా తక్కువ సమయంలో ఏ ఇబ్బందీ లేకుండా పూర్తి అవుతుంది.
గర్భవతులకు వచ్చే నడుమునొప్పి... తగ్గేదెలా? - గైనిక్ కౌన్సెలింగ్
నేను గర్భవతిని. ప్రస్తుతం ఏడోనెల నడుస్తోంది. ఈ మధ్య నాకు నడుమునొప్పి విపరీతంగా వస్తోంది. దీని నుంచి విముక్తి ఎలా? ఈ విషయంలో నేను పాటించవలసిన, పాటించకూడని వాటిగురించి చెప్పండి.
- రమ, విశాఖపట్నం
గర్భవతుల్లో నడుమునొప్పి రావడం సాధారణం. ఇది జబ్బు ఎంతమాత్రం కాదు. దీని గురించి ఆందోళన పడవలసిన అవసరం లేదు. గర్భం దాల్చాక మహిళలు 10 కిలోల వరకు బరువు పెరుగుతారు. దానికి తోడు పొట్ట ముందుకు పెరుగుతుంది. సహజంగానే మహిళల గరిమనాభి (సెంటర్ ఆఫ్ గ్రావిటీ) లో మార్పు వస్తుంది. దీనికి తగినట్లుగా శరీరం వంగడం వల్ల నడుము మీద ఒత్తిడి పడి నొప్పి రావడం చాలా సాధారణం. దీనికి తోడు నెలలు నిండుతున్నకొద్దీ ప్రసవాన్ని సులభతరం చేసేందుకు ఓవరీస్ నుంచి ‘రిలాక్సిన్’ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది కేవలం ప్రసవం జరిగే మార్గంలోని కండరాలను, ఎముకలనే గాక మన వెన్నెముకలోని వాటినీ రిలాక్స్ చేస్తుంది. ఫలితంగా ఇది వెన్నుపై ఒక రకంగా తన ‘సైడ్‌ఎఫెక్ట్’ను చూపుతుందన్నమాట. గర్భవతుల్లో నడుమునొప్పి రావడానికి దోహదపడే వాటిలో ఇదీ ఒక అంశమే. ఇక దీనికి తోడు ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నవారిలో, గర్భంలో కవలలు ఉన్నవారిలో నడుమునొప్పి ఎక్కువగా వస్తుంటుంది.
జాగ్రత్తలు: నడుమునొప్పి ఎక్కువగా ఉన్న మహిళలు తాము నిల్చున్నప్పుడు, కూర్చున్నప్పుడు, పడుకునే సమయంలో నడుముపై ఒత్తిడి పడని విధంగా ఉండే భంగిమ (బాడీ పోశ్చర్)ను పాటించాలి. ఉదాహరణకు నడిచే సమయంలో వెన్నును వీలైనంత నిటారుగా ఉంచాలి. కూర్చున్నప్పుడు మోకాలిపై మరో మోకాలు వేసి ఎక్కువసేపు కూర్చోకూడదు. పాదరక్షల విషయంలో హైహీల్స్ పూర్తిగా మానేయాలి. అలాగే పూర్తిగా ఫ్లాట్‌గా ఉండే చెప్పులనూ వేసుకోకూడదు. దీనికి బదులు మన పాదంలో సహజంగా ఉండే ఆర్చ్‌లాంటి వంపునకు సపోర్ట్ ఇచ్చేలా కొద్దిపాటి హీల్ ఉండే చెప్పులను వేసుకోవాలి. బరువులు ఎత్తే సమయంలో వంగకూడదు. దీనికి బదులు కూర్చుని బరువులు ఎత్తాలి. ఇక పడుకుని టీవీ చూస్తున్నప్పుడు ఎడమవైపునకు ఒరిగి చూడాలి. పడుకునే సమయంలోనూ ఎడమవైపునకు తిరిగి పడుకోవడం మంచిది.
మందుల విషయానికి వస్తే... నడుమునొప్పి తగ్గడం కోసం ఎలాంటి నొప్పి నివారణ మందులూ వేసుకోకూడదు. నొప్పి నివారణ మందులు ఏవైనా సరే... పుట్టబోయే బిడ్డకు మంచిది కాదని గుర్తుంచుకోవాలి. ముఖ్యంగా బిడ్డ కిడ్నీలపై ఇవి దుష్ర్పభావం చూపుతాయి. ఒక్కోసారి నొప్పి నివారణ మందులు పిండంపై చూపే దుష్ర్పభావంతో ఉమ్మనీరు తగ్గిపోయి, అది కడుపులోనే చనిపోయే ప్రమాదమూ ఉంది. అందుకే డాక్టర్ సలహా లేకుండా ఎలాంటి నొప్పి నివారణ మందులూ వాడకూడదు. నొప్పి నివారణ కోసం వాడే పైపూత మందులను సైతం వాడకూడదు.
ఒకవేళ నొప్పి మరీ ఎక్కువగా ఉంటే వేడినీళ్లతో కాపడం లేదా చన్నీళ్ల కాపడం (హాట్ వాటర్ ప్యాక్, కోల్డ్ వాటర్ ప్యాక్) పెట్టుకోవచ్చు. టాబ్లెట్ వేసుకుంటేగానీ తగ్గదనిపిస్తే సాధారణ పారాసిటమాల్ మాత్రను పరిమితంగా వాడవచ్చు. నొప్పి మరీ భరించలేకుండా ఉన్నప్పుడు ఒకసారి మీ డాక్టర్‌ను సంప్రదించి తగు సలహా, చికిత్స తీసుకోండి. ఇది గర్భధారణకు సంబంధించిన (ప్రెగ్నెన్సీ రిలేటెడ్) నొప్పి కాదని నిర్ధారణ అయితే అప్పుడు ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించి, వారి సలహా మేరకు ‘లో బ్యాక్ స్ట్రెచ్’ వ్యాయామాలు చేయాలి. వీటితో మంచి ఉపశమనం ఉంటుంది.

ఆపరేషన్ తర్వాత ఈ అవస్థలేమిటి?
జెంటిల్‌మెన్ కౌన్సెలింగ్
నాకు 29 ఏళ్లు. నా కిడ్నీలో రాయి ఉందని చెప్పి మూత్రనాళం ద్వారా దాన్ని తొలగించారు. ఆపరేషన్ చేసినప్పటి నుంచి మూత్రంలో మంట, సెక్స్ చేసేటప్పుడు విపరీతమైన నొప్పి, అప్పుడప్పుడు మూత్రంలో కొంచెం రక్తం పడటం జరుగుతోంది. ఆపరేషన్ సమయంలో మూత్రనాళంలోని రక్తనాళాలు ఏమైనా చిట్లాయేమోనని భయంగా ఉంది. నా సమస్యకు తగిన పరిష్కారం చెప్పండి. - ధనరాజ్, ఏలూరు
మీరు యూరిన్ కల్చర్ పరీక్ష చేయించుకుని సరైన యాంటీబయాటిక్స్ వాడితే ఇది పూర్తిగా నయమవుతుంది. ఇక ముఖ్యమైన అంశం ఏమిటంటే... ఈ తరహా సర్జరీ (ఎండోస్కోపీ)లో కిడ్నీలో ఒక స్టెంట్ కూడా ఉంచుతారు. దాన్ని ఒక నెల తర్వాత తీయించుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మరచిపోయి అలా తీయించుకోకపోతే కూడా ఇన్ఫెక్షన్ సమస్యలు వస్తాయి. దీనికి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఆపరేషన్ చేసిన డాక్టర్‌ను మరోమారు సంప్రదించండి. |
పురుషులో జుట్టురాలడం అరికట్టేందుకు పరిష్కారం..!
నేటి ఉరుకుల, పరుగుల జీవితంలో మన గురించి మనం పట్టించుకునే తీరిక సమయాన్ని కేటాయించుకుంటూ చివరికి మరచిపోతున్నది మాత్రం మన ఆరోగ్యాన్నే. ఒడిదుడుకుల మధ్య సాగుతూ మరింత ఫ్యాషన్ గా కనపడడానికి జుట్టుకు రంగులు, డైలు వాడుతున్నారు. ఆధునిక జీవితంలో పని ఒత్తిడి, వాతావరణ కాలుష్యం ప్రభావంతో జుట్టు నిర్జీవంగా మారుతోంది.
అలాంటి జుట్టుపై ట్రిమ్మింగ్, ఫర్మింగ్, కలరింగ్ డై చేయించడం మూలంగా కుదుళ్లు కూడా బలహీనపడుతున్నాయి. ఇలాగే కొనసాగితే కొంత కాలనికి బట్టతల వచ్చేస్తుంది.జుట్టు రాలడానికి మరొక ప్రధాన కారణం ఒత్తిడి. జుట్టు రాలడానికి ప్రధానంగా శరీర తత్వం, అనారోగ్యం, ఆపరేషన్లు, విటమిన్ల లోపం, థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల అసమానత, మందుల సైడ్ ఎఫెక్ట్స్ కారణాలుగా ఉంటాయి. సాధారణంగా పురుషుల్లో ఈ సమస్య వంశపారంపర్యంగా వస్తుంది. ఒక వయసు దాటాక పురుషుల్లో స్త్రీల కంటే ఎక్కువగా వెంట్రుకలు రాలిపోతుంటాయి. కుటుంబంలో ఎవరికైనా బట్టతల ఉంటే అది పురుషులకు వస్తుంది.
ఇలాంటి వారికి జుట్టు ఎక్కువగా రాలుతుంది. దీన్నే ‘మ్యాన్ ప్యాటర్నల్ బాల్డ్ నెస్' అంటారు. పురుషుల్లో ‘ఆండ్రోజన్' హార్మోన్ ఎక్కువైనా జుట్టు రాలిపోతుంది. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరుస్తుంది. ఇలా రాలిన జుట్టు తిరిగి రావడం కష్టం తరచుగా చుండ్రు, ఫంగల్ ఇన్ ఫెక్షన్ వస్తూ ఉంటే జుట్టు వేగంగా రాలిపోతుంది. ఫలితంగా బట్టతల వచ్చేస్తుంది..కాబట్టి బట్టతల రాకముందే అసలు జాగ్రత్తలు పాటించండి...కొన్ని పరిష్కార మార్గాలు మీకోసం...

ప్రతిరోజూ తేలికపాటి షాంపూతో మీ జుట్టును కడగండి : మీ జుట్టును, తలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ప్రతిరోజూ తలస్నానం చేయడం అనేది జుట్టురాలడాన్ని నిరోధించడంలో ఒక భాగం. ఇలా చేయడం వల్ల, జుట్టు రాలడం, జుట్టు విరగడం వంటి సమస్యలకు దారితీసే అ౦టువ్యాధులను, చుండ్రు సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాక శుభ్రంగా ఉన్నజుట్టు ఎక్కువ పరిమాణంలో ఉన్న అనుభూతిని ఇస్తుంది.

జుట్టు రాలినపుడు విటమిన్లు : విటమిన్లు ఆరోగ్యంగా ఉండడానికే కాకుండా మీ జుట్టుకి కూడా చాలా మంచిది. విటమిన్ ఎ, మీ తలమీది సిబం ఆరోగ్యకర నిర్మాణానికి ప్రోత్సహిస్తుంది. విటమిన్ ఇ, మీ తలమీద రక్తప్రసరణ సరిగా ఉండేటట్లు చేసి కోల్పోయిన జుట్టును తిరిగి పొందడానికి సహాయపడుతుంది. విటమిన్ బి మీ జుట్టు ఆరోగ్యకరమైన రంగుతో ఉండడానికి సహాయపడుతుంది.

ప్రోటీన్లతో సంపన్న ఆహరం : శుష్క మాంసాలు, చేపలు, సోయా లేదా ఇతర ప్రోటీన్లను తీసుకోవడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా జుట్టు రాలడాన్ని కూడా అరికడుతుంది.

హెడ్ మసాజ్: జుట్టు రాలుతున్న వారు కొన్ని నిముషాలు సుగంధ తైలాలతో తలపై కొంత సమయం పాటు మర్దనా చేసుకోవడం తపానిసరి. ఇది మీ జుట్టుకుదుళ్ళను ఉత్సాహభరితం చేయడానికి సహాయపడుతుంది. మీరు బాదాం లేదా సేసమే నూనెలో లవేండర్ ని కలపవచ్చు.

తడి జుట్టును దువ్వకండి : జుట్టు తడిగా ఉన్నపుడు, చాలా బలహీనమైన స్థితిలో ఉంటుంది. అందువల్ల తడి జుట్టును దువ్వితే జుట్టురాలే అవకాసం ఎక్కువగా ఉంటుంది. కానీ తడి జుట్టును దువ్వవలసి వస్తే, వెడల్పు పళ్ళ దువ్వేనను ఉపయోగించండి. అదేవిధంగా తరచుగా జుట్టును దువ్వడం మానండి దీనివల్ల జుట్టు దెబ్బతిని ఎక్కువగా రాలుతుంది. చిక్కుబడ్డ వెంట్రుకలకు మీ వేళ్ళను ఉపయోగించండి, దువ్వెన లేదా బ్రష్ వాడకండి
వెల్లి రసం, ఉల్లి రసం లేదా అల్లం రసం
మీ తలపై ఏదోఒక రసాన్ని రుద్దండి, రాత్రంతా ఉంచి పొద్దున్న కడిగేయండి. ఒక వారంపాటు ఇలా చేయండి, ఫలితాన్ని మీరే గుర్తిస్తారు.

మిమ్మల్ని మీరు ఆర్ద్రీకరణ స్థితిలో ఉంచుకోండి : జుట్టు కుదుళ్ళు పావువంతు నీటిని కలిగిఉంటాయి అందువల్ల మీరు రోజులో కనీసం నలుగు నుండి ఎనుమిది కప్పుల నీరు తీసుకొని ఆర్ద్రీకరణ తో ఉండాలి, దీనివల్ల ఆరోగ్యకరమైన జుట్టు పెరుగుతుంది.
మీ జుట్టుకు గ్రీన్ టీ ని పట్టించండి : గ్రీన్ టీ ని జుట్టుకు పట్టించడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుందని అధ్యయనాలు తెలియచేస్తున్నాయి. మీరు చేయవలసినదల్లా ఒక కప్పు నీటిలో రెండు బాగ్ ల గ్రీన్ టీ ని కాయండి, చల్లబడిన తరువాత, మీ జుట్టుకు అప్ప్లై చేయండి. ఒక గంట తరువాత మీ జుట్టును పూర్తిగా శుభ్రం చేయండి. ఇలా ఒక వారం నిండి పదిరోజులు చేసి, ఫలితాన్ని చూడండి.

జుట్టుకు చేడు ఏమిటో తెలుసుకోండి : మీరు మీ ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనుకుంటే, ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో తప్పక తెలుసుకోవాలి. టవలుతో పొడి జుట్టును రుద్దకూడదు, అలాకాకుండా జుట్టు సహజంగా ఆరనివ్వాలి.

మద్య పానీయాలను తగ్గించండి : మీకు జుట్టు రాలుతుంటే మద్యపానం తగ్గించండి ఎందుకంటే మద్యపానం జుట్టు పెరుగుదలను అరికడుతుంది. అందువల్ల మీరు మీ జుట్టు పెరుగుదలను చూడాలి అంటే మద్యపానం తగ్గించని లేదా మానేయండి.

పొగత్రాగడం మానేయండి : సిగరెట్లు తాగడం వల్ల తలలో తగినంత రక్తప్రసరణ జరగదు ఇందువల్ల జుట్టు ఎదుగుదల తగ్గిపోతుంది.
శారీరక శ్రమ : ప్రతిరోజూ శారీరక శ్రమకు కొంత సమయం కేటాయించండి. నడక, ఈత లేదా బైక్ సవారీ ప్రతి రోజూ 30 నిముషాలు చేయడం వల్ల హార్మోన్ల స్థితి సరిగా ఉండడం, ఒత్తిడి స్థాయిని తగ్గించి జుట్టు రాలడం తగ్గడానికి సహాయపడుతుంది.

ఒత్తిడి లేకుండా ఉండడం : జుట్టు రాలడానికి ఒత్తిడి తో సంబంధం ఉన్నట్లు వైద్య పరిశోధన అధ్యయనాలు కనుగొన్నాయి. మిమ్మల్ని మీరు ఒత్తిడికి గురుకాకుండా చూసుకోండి; ప్రాణాయామం నేర్చుకోవడం ఒక మార్గం. ప్రాణాయామం, యోగా వంటివి కేవలం ఒత్తిడిని తగ్గించడమే కాకుండా హార్మోన్ల స్థితిని పునరుత్పత్తి చేస్తాయి.
ఎప్పుడూ వేడిగా & పొడిగా ఉంచకండి : మీరు తరచుగా మీ జుట్టును వేడిగా, పొడిగా ఉంచడం మానుకోండి. వేడి జుట్టు ప్రోటీన్లను నీరసింప చేస్తాయి, ఎపుడూ వేడిగా, పొడిగా ఉంచడం వల్ల బలహీనంగాం ,పెళుసుగా అయ్యి జుట్టు తాలుతుంది.

మీ తలలో చెమట లేకుండా చూసుకోండి : ఆయిలీ జుట్టు గల పురుషులు, వేసవిలో చెమటవల్ల చుండ్రుకి గురౌతారు, జుట్టురాలే ప్రమాదం కూడా ఉంది. కలబంద, నిమ్మ ఉన్న షాంపూలు మీ తలను చల్లగా ఉంచి, చుండ్రును నివారిస్తాయి. అంతేకాకుండా, హెల్మెట్ ధరించే పురుషులు వేసవిలో జుట్టురాలడం ప్రధాన సమస్య. చెమట రంధ్రాలలో పేరుకుని జుట్టు కుడుల్లను బలహీన పరచి పురుషులలో జుట్టురలడం సంభవిస్తుంది. అందువల్ల మీ జుట్టుకి స్కార్ఫ్/చేతి రుమాలు లేదా టెర్రీ క్లాత్ హెడ్ బాండ్ ధరించడం వల్ల జుట్టురాలడాన్ని నివారిస్తుంది.
మీ జుట్టు శైలిని మార్చుకోవడం (పొడవు జుట్టు గల పురుషులు): మీరు మీ జుట్టును ఇప్పటివరకు కోల్పోకుండా ఉంటె, జుట్టును లూజుగా వదిలేయండి. పోనీటైల్, బ్రైడ్, కృత్రిమ కేశాలంకరణ, జుట్టు మోడళ్ళు లాగి కట్టడం వంటివి బట్టతలకు దారితీస్తాయి.

మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి : ఆరోగ్య సమస్యలు జుట్టురాలడానికి దోహదపడతాయి. మీరు దీర్ఘకాల వ్యాధితో, అధిక జ్వరంతో, అంటువ్యాధులను సరిగా సమర్ధించుకుంటే మీ జుట్టు ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించుకోవచ్చు.

మందుల విషయంలో శ్రద్ధ వహించాలి : కొన్ని మందులు దుష్ఫలితాలను కలిగిఉండడం వల్ల జుట్టు రాలవచ్చు. వైద్యుడిని సంప్రదించి మీరు మీ పరిస్థితిని తెలియచేయండి. మందుల వల్ల జుట్టు రాలుతుందేమో తెలుసుకోండి, అదే కారణమైతే మందులు మార్చమని అడగండి.
రసాయనాలను దూరంగా ఉంచండి : గాఢమైన రసాయనాలు, శాశ్వత జుట్టు రంగులు జుట్టు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మీకు జుట్టు రాలుతుంటే, మీ జుట్టుకు రంగు వేయవద్దని సూచన.
ఆరోగ్యంతో పాటు, రుచి, సుగంధ పరిమళమించే మీ గార్డెన్ మొక్కలు.!
ఇండియన్ కుషన్స్ లో సుగంధ ద్రవ్యాలు (మసాలా దినుసులు ) అధిక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇవి లేకుండా చేసే వంటలు చాలా సింపుల్ గా ఉంటాయి. వీటిని ఆహారాల్లో చేర్చడం అటుంచితే. వీటిలో అత్యద్భుతమైన ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి. చాలా మంది ఇటువంటి మసాలా దినుసులను తమ తమ గార్డెన్లో పెంచుకోవాలని అనుకుంటారు.
కానీ అన్ని మసాలా దినుసులను మన హోం గార్డెన్ లో పెంచుకోవడానికి సాధ్యం కాదు. అందుకు వివిధ కారణాలున్నాయి. పరిసర ప్రాంతాలు మరియు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. హోం గార్డెన్ లో స్పైసీలు(మసాలాదినుసుల మొక్కలు లేదా దుంపలను)పెంచుకోవాలనుకుంటే.. మీకు నచ్చిన కొన్ని స్పైసీల ఎంపిక చేసే మీ హోం గార్డెన్ లో పెంచుకోండి. అయితే వాతావరణ పరిస్థితులను మాత్రం మరవకండి. ఎటువంటి మొక్కలకైనా వాతావరణం ముఖ్యం.
మన ఇంటి గార్డెన్ లో సులభంగా పెంచుకొనే అనేక స్పైసీ మొక్కల్లో రెండు రకాల ప్రయోజనాలున్నాయి. ఔషధగుణాలతో పాటు కులినరీ బెనిఫిట్స్ పుష్కలంగా ఉన్నాయి. అంటువంటి స్పైసీ మొక్కలు మీ హోంగార్డెన్ లో సులభంగా పెంచుకొనే మొక్కలు మీకోసం కొన్ని..

తులసి: వెచ్చని వాతావరణంలో సంవత్సరం పొడవునా ఈ తులసి మొక్కను మన ఇంటి ఆవరణంలో లేదా గార్డెన్ లో పెంచుకోవచ్చు. ఇది వేడి వాతావరణంలో, ఎండ వేడిలో పెరుగుతుంది నీళ్ళు మరియు మొక్క పెరగడానికి అనుకూలమైన ప్రదేశం వేళ్ళు పాకడానికి వీలుగా .. విశాలంగా ఉండే ప్రదేశం ఉండాలి. అందుకు కొంచెం పెద్దగా ఉండే కుంపటి(పాట్)ను ఎంపిక చేసుకోవడం మంచిది.

పచ్చిమిర్చి: పచ్చిమిర్చి మొక్కలు చిన్నగా మరియు మీడియం సైజ్ మొక్కలుగా పెరుగుతాయి. అర మీటర్ నుండి రెండు మీటర్ల పొడవుంటాయి. పచ్చిమిర్చి విత్తనాలు మొలకెత్తడానికి20డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం. మొక్క పెరిగి కాయ కాయడానికి లేదా పండుకావడానికి 30సెంటీగ్రేడ్ ల ఉష్ణోగ్రత అవసరం. ఇక ఈ మొక్కలకు రాత్రి ఉష్ణోగ్రత 15డిగ్రీ సెంటీగ్రేడ్ కు తగ్గకుండా చూసుకోవాలి.

అల్లం : ఇది మొక్క కాదు. కానీ భూమిలోపల పెరుగుతుంది. దీనికి సన్నని సూర్యరశ్మి మరియు వెచ్చని వాతావరణం మరియు మంచి మంటి ఉంటే చాలు అద్భుతంగా పెరుగుతుంది. అల్లం పెంచుకోవడానికి వింటర్/వింటర్ వదిలి వసంత కాలంలోనికి ప్రవేశించినా సరే అల్లం బాగా పెరుగుతుంది.

రోస్మెరీ: రోస్మెరీ పెరినైల్, ఇది రెండు నుండి మూడేళ్ళ పాటు పెరుగుతుంది. దీనికి మంచి డ్రైనేజ్ ఉండాలి. అలాగే ఎయిర్ సర్క్యులేషన్ మరియు ఎక్కువగా సన్ లైట్ ఉండాలి. చిన్నమొక్క తీసుకొని మట్టి కుండీలో పూడ్చాలి. కుండీలో మట్టి మరియు కాక్టస్ సాండ్ వేసి అందులో అర్ధ మొక్క వరాకూ మంట్టిలోనికి పూడ్చాలి. దీనికి ఎక్కవ నీరు పట్టాల్సిన అవసరం లేదు. మట్టి ఎప్పుడైతే ఎండినట్టు అనిపిస్తుందో అప్పుడు నీరు పడితే సరిపోతుంది.

మరువం : ఈ మొక్కను చాలా ఇల్లలో ఎక్కువగా పెంచుకుంటారు. వేళ్ళు పాకడానికి వీలుగా .. విశాలంగా ఉండే ప్రదేశం ఉండాలి. దీనికి అప్పుడప్పడూ నీరు పడుతుంటే చాలు. ఇది సువాసనకు మాత్రమే కాదు,ఔషధగుణాలు కూడా పుష్కలమే.

కరివేపాకు: ఈ మొక్కను చాలా ఇల్లలో ఎక్కువగా పెంచుకుంటారు. ఇది 26-37డిగ్రీ సెంటీగ్రేడ్ లో బాగా పెరుగుతుంది. ఇది ట్రోపికల్ క్లైమెట్ లో బాగా పెరుగుతుంది.

కొత్తిమీర: ధనియాలకు ఎక్కువ జాగ్రత్తతీసుకోవల్సిన పనిలేదు. దీనికి నీరు ఒక్కటుంటే చాలు. బాగా పెరుగుతుంది. పువ్వులు రావడం గమనిస్తే చాలు. ఈ మొక్క 4-6వారాలు పెరగడానికి సమయం పడుతుంది. అదే చల్లని వాతావరణంలో అయితే ఎక్కువ నెలలు పడుతుంది. దీనికి అప్పుడప్పడూ నీరు పడుతుంటే చాలు.

సోంపు: సోంపును వంటల్లో సువాసనకు మాత్రమే కాదు, తిన్న ఆహారం సులభంగా జీర్ణం అవ్వడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. దీనికి బాగా ఎండిన ప్రదేశం కావాలి. దాంతో పాటు, అధిక సూర్య రశ్మి కూడా అవసరం.

పుదీనా: పుదీనా వేర్లు మంటి కుంపట్లో లేదా భూమిలో పాతి పెడితే చాలు. వేర్లు బాగా అల్లుకుంటాయి. తగినంత సూర్యరశ్మిలో ప్రతి రోజూ ఒక్కసారి నీళ్ళు చిలకరిస్తే చాలు బాగా పెరుగుతంది. ఇది వంటల సువాసనకు మరియు రుచికి మాత్రమే కాదు, ఔషధగుణాలు కూడా పుష్కలమే.

మెంతులు: మెంతులు తడి పొడిగా ఉన్న వాతావరణంలో బాగా పెరగుతుంది. పొడిగాఉన్న నేలమీద మెంతులు చల్లి, ప్రతి రోజూ నీరు పడితే నెలరోజుల్లో మెంతి మొక్కలు బాగా మొలుస్తాయి. వీటిని వంట రుచికి మాత్రమే వాడరు. మెంతి ఆకుల్లో అనేక ఔషధ గుణాలున్నాయి.

వాము మొక్క :దీని వేర్లు బాగా అల్లుకుంటాయి. తగినంత సూర్యరశ్మిలో ప్రతి రోజూ ఒక్కసారి నీళ్ళు చిలకరిస్తే చాలు బాగా పెరుగుతంది. ఇది వంటల సువాసనకు మరియు రుచికి మాత్రమే కాదు, ఔషధగుణాలు కూడా పుష్కలమే.
పిల్లలకి అజిర్తికి చక్కని ఔషదం. దీనికి అప్పుడప్పడూ నీరు పడుతుంటే చాలు.

తమలపాకు: ఇది చూడటానికి మనీ ప్లాoట్ లా ఉoటుoది. ఇందులో ఔషధగుణాలు కూడా ఎక్కువె,దీనిని ఇంట్లో కూడ పెంచుకొవచ్చు . దీనికి అప్పుడప్పడూ నీరు పడుతుంటే చాలు.

Subscribe to:
Posts (Atom)