all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Monday, June 17, 2013
ఐ క్రీములు వాడితే...
చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా చేయటంలో ఐ క్రీములెంతగానో తోడ్పడుతాయి. ముఖంలో కంటి చుట్టూ ఉండే చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. దాని వల్లే ఆ ప్రదేశంలో మాయిశ్చరైజర్ ప్రభావం ఉండదు. ఈ సున్నితమైన చర్మం మాయిశ్చరైజర్ తాలూకూ గుణాన్ని గ్రహించదు. ఈ కంటి చుట్టూ ఉండే ప్రాంతాన్ని టిష్యూ పేపర్‌తో పోల్చవచ్చు. మిగతా ముఖంలో ఉండే చర్మాన్ని రైటింగ్ పేపర్‌తో పోల్చవచ్చు. సో... కంటిచుట్టూ ఉండే ప్రాంతంలో వాడే ఏ క్రిములైనా మంచివి, సున్నితమైనవి వాడాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా సున్నిత చర్మానికి నష్టం వాటిల్లుతుంది. కాబట్టి ఎలాంటి ఐక్రీములు వాడాలో తెలుసుకుందాం. - లైట్ క్రీములు వాడండి. తెలిసి తెలియక మాయిశ్చరైజర్‌లు రాస్తే ఫలితం కనబడదు సరికదా వాపులు లాంటివి రావచ్చు. - పడుకునే ముందు ఐ క్రీములు వాడండి. - కనురెప్పలను చాలా శ్రద్ధగా చూసుకోవాలి. - ఐజెల్‌లు కూడా మార్కెట్‌లో దొరుకుతాయి. అలాంటి వాటితో కంటి క్రింద చారలు, నల్లటి లేయర్లను లేకుండా చేసుకోవచ్చు. - నైట్ క్రీములు చర్మానికి రాసినప్పుడు చర్మకణాలతో కలిసిపోయి చర్మానికి కొత్తదనంతో పాటు పోషకవిలువలు కూడా ఇస్తాయి. - ఎలాంటివి కొనాలి? ఏ వస్తువులు కొనాలి? బ్యూటీ ఉత్పత్తులు కొనటం తలనొప్పిగా ఉందా? - క్లెన్సర్, టోనర్, మాయిశ్చరైజర్ లాంటి అందాన్నిచ్చే సౌందర్య ఉత్పత్తులు కొనే ముందు మీకు కావలసిన పోషక పదార్థాలు ఉన్నాయో లేదో చూడండి. అయితే మీ చర్మ తత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని మీ చర్మానికి ఏది సరిపోతుందో తెలుసుకుని వాడండి. లేదా బ్యూటీషియన్‌ను సంప్రదించండి. |
చిన్ని మనసుతో స్నేహంగా...
'చిన్ని పసిబుర్రలో ఎన్ని ఆలోచనలో' అంటూ ఒక్కోసారి పిల్లల్లో ఉన్న సృజనాత్మకతకు మురిసిపోతూ, మరొకవైపు ఆశ్యర్యపోతూ ఉంటారు తల్లితండ్రులు. నిజమే పసివయసులో వారికి ప్రత్యేకించి సృజనాత్మకతను నేర్పనవసరంలేదు. వారే అనేక ఆలోచనలకు పునాది వేస్తారు. ఆ పసిమనసు మెదడులో ఎంత ఆలోచనా శక్తి ఉందో ప్రతి తల్లికీ తెలిసే ఉంటుంది. అయితే వారిలోని కళలకు ప్రోత్సాహం ఒక్క పొగడ్తకో, ముద్దుల వర్షంతో ముం చెత్తడానికో పరిమితమై పోకూడదు. వారి సృజనాత్మకతకు ఊతమివ్వాలి. అప్పుడే వారిలోని కళ ఇంటిల్లి పాదికీ కళను తెస్తుంది. విద్యార్థిగా పరిచయం కాకముందునుంచే ఇంట్లో వాతావరణం, ప్రోత్సాహాన్ని బట్టి చాలా మంది చిన్నారుల్లో అనేక కళలు ఉట్టి పడుతుంటాయి. ఇంటిదగ్గర అప్పటికే చదువుకుంటున్న వారిని చూసి వారి పలక, పుస్తకాలను లాక్కుని పిచ్చిగీతలు గీయడంతో తమ చేతివ్రాత ప్రస్థానాన్ని మొదలుపెడతారు ఈ బుడతలు. ఈ వయసులోనే ఒక్కోసారి ఊహించని రీతిలో వారికి ఆడుకోవడానికి కొని ఇచ్చిన బొమ్మల రూపాలను గీయాలని చూడటం, ఇంట్లో ఉన్న చిన్నచిన్న వస్తువులతో ఏదో రూపాన్ని తయారు చేయడానికి ప్రయత్నించటం చేస్తుంటారు. ఇవే పిల్లల్లో సృజనాత్మకతను గమనించడానికి ప్రధానమైన ఆధారాలు అంటున్నారు నిపుణులు. ఇక్కడి నుంచే వాళ్ళకళలకు పదును పెట్టడం కూడా అంత కష్టంతోనూ, ఖర్చుతోనూ కూడుకున్నది కాదు అంటున్నారు. కావలసిందల్లా వారిని కాస్త దగ్గరగా గమనిస్తూ మరికాస్త శ్రద్ధ జోడించడం. అలా కాకుండా... ఏదైనా కాగితంపై గీతలు గీస్తుంటే చాలు 'ఏయ్...ఏంటి ఆ పిచ్చిగీతలు, అన్నీ నాశనం చేస్తున్నావ్' అంటూ పెద్దగా అరుపులు వినిపిస్తాయి. నిజానికి పిచ్చి గీతలకు, బాపు బొమ్మకు తేడా తెలియదు వారికి. ఆమాటకొస్తే ఎంత గొప్ప చిత్రమైనా రూపుదిద్దుకోవలసింది ప్రధానంగా గీతతోనే కదా! అందరితో ఆడుకోవలసిన అంత చిన్న వయసులోనే ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ పసివారిలో, అదేదో చేయకూడని పని అనే ముద్రను ఎందుకు వేయడం? అలాంటి సమయంలో వారికి బొమ్మకు, పిచ్చిగీతలకు తేడా చూపించే ప్రయత్నం చేయండి. వారు పెట్టిన గీతలకే బొమ్మరూపం తెచ్చి చూపించండి. వారి ఆలోచన మరింత ముందుకు నడుస్తుంది. అంతే కాదు మంచిమంచి బొమ్మలు, చిత్రాలు వారికి సులభంగా అర్థమయ్యేవి తెచ్చి ఇవ్వండి. ఇవి కొత్తకొత్త ఆలోచనలు చేసే బుల్లి మేధావి మెదడుకు సాయం చేస్తాయి. అవి గొప్పవే మరి కాస్త ఎదిగే కొద్దీ వారు వేస్తున్న చిన్న చిన్న పెయింట్స్ ఎంతో ఆలోచింపజేసేవిగా అంతకుమించి అందంగా కూడా ఉంటాయి. అలాంటివాటిని బాగుందమ్మా అంటూ పక్కన పెట్టడం అలవాటు. కానీ ఇలాంటి వాటిని చక్కగా ఫ్రేమ్ కట్టించి ఇంట్లో గోడకు అమర్చితే అది చూసిన ప్రతిసారీ వారికి ఇంకా మంచి పెయింట్ వేయాలనో, ఇంకా మంచి కళాకృతిని తయారు చేయాలనో అనిపిస్తుంది. ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులు వాటిగురించి అడగటం మీరు చెప్పడం, వాళ్లు మీ చిన్నారులను మెచ్చుకోవటం ఇవన్నీ వారికి మంచి ప్రోత్సాహాన్నిచ్చే టానిక్‌లా పనిచేస్తాయి. ఇంట్లో గది గోడలకు నిండుదనాన్ని, గదికి అందాన్ని ఇస్తాయని అప్పుడప్పుడూ బజార్లో చిత్రపటాలు కొంటూ ఉంటారు. కానీ ఆ ఖర్చు కంటే తక్కువ ఖర్చుతోనే మీ పసివాళ్ల కళాఖండాలకు ఫ్రేమ్‌లు కట్టిస్తే రెండు విధాలా మంచిది. వాళ్లలో సృజనాత్మకతను పెంపొందించే (అందుబాటులో ఉండే వస్తువులతో చేసిన) కళాకృతులు ఏవైనా తెచ్చి వారికి బహుమతిగా అందజేస్తే వాటినుండి ఎన్నో కొత్త ఆలోచనలను స్వీకరిస్తారు పసివాళ్లు. అందుకే వారి చేతుల్లో రూపుదిద్దుకున్న దేన్నీ అశ్రద్ధగా పక్కన పడేసే ప్రయత్నం చేయకుంటే మంచిది. కాస్త ఆలోచించి... ప్రస్తుతం మార్కెట్లో వస్తున్న వస్తువులన్నీ చిత్రలేఖనం, మంచిమంచి హస్తకళలతో మెరుగులు దిద్దుకొని వస్తున్నాయి. గ్లాసు దగ్గరనుంచి ప్లేటువరకు, గడియారం దగ్గరనుంచి టేబుల్ ల్యాంప్ వరకూ అన్నింటిలోనూ హస్త కళల ఉనికిని చాటే సామాగ్రి ఎక్కువగా వస్తోంది. ఇది కూడా మీ పిల్లల కళలను ప్రోత్సహించడానికి ఉపయో గపడుతుంది. చేయ వలసిందల్లా ఇంటికి సంబం ధించి ఏదైనా సామాగ్రి కొనేటపుడు కాస్త ఆలోచిం చి, చిన్నారుల అభిరుచు లకు దగ్గరగా, ప్రోత్సా హకరంగా ఉన్న వాటిని కొంటే చాలు. మంచి పెయింటింగ్స్, హస్త కళలతో రూపుదిద్దుకున్నవి కొంటే నిత్యం వాటి అవసరం ఉన్న పిల్లలు వాటిని గమనిస్తూనే ఉంటారు. అచ్చం అలానే మరొక వస్తువుపై వేసే ప్రయత్నమూ చేస్తారు. దానికి మీరు ప్రత్యేకించి వారిని ఉత్సాహ పరచవచ్చు. క్రమేపి ఇంట్లో ఉన్న వస్తు వులపై మీ పిల్లల కళానైపుణ్యం దర్శన మివ్వటానికి ఎంతో కాలం పట్టదు. అది వారికి భవిష్యత్తును ఇచ్చే మంచి వృత్తిగా మారినా ఆనందమే కదా! మీరు వెళ్లే ఫంక్షన్‌లకు వారే మంచిమంచి గిఫ్ట్స్‌తయారు చేసి ఇస్తే ఎంత సంతృప్తిగా ఉంటుంది. |
జీవితాన్ని మలిచే చక్కటి ఆలోచన
జీవితంలో విజయానికి ఎన్నో ఉపాయాలున్నాయి. కాని మనం పనిచేయనిదే అవి పనిచేయవు. ఎప్పటిపని అప్పుడు పూర్తిచేసుకొంటే మనసు ఉత్తేజపడుతుంది. మరో కార్యానికి కార్యోన్ముఖుడిని చేస్తుంది. గమ్యాన్ని చేరుకోవడం కన్నా ఆ దిశగా కార్యసిద్ధికి ప్రయాణించడమే ముఖ్యం. అందుబాటులో ఉన్న మంచితనంతో పొందటమే ముఖ్యం. జీవితంలోని మంచి వినండి. అనండి. చూడండి. తలంచండి. చేయండి. చేయించండి. అదే అతిగొప్ప కళ. - మనుషుల చేత వాడబడుతున్న అతిశక్తివంతమైన మందులు మాటలు. మన నాలుక మనం చెప్పినట్లు వినకపోవడమే అన్ని అనర్థాలకు మూలం. మాటలు తెలివైన వారికి పాచికల వంటివి. తెలివిలేని వారికి డబ్బుల వంటివి. మీరు చెప్పడానికి ఏమీ లేనప్పుడు మాట్లాడకండి. - హితమితప్రియభాషణం మనిషికి అరుదైన భూషణం. కలిసిపో మంచి మనసున్న వారితో కలిసి జీవించాలి మనసైనవారితో. - నీవు ఎవరికైనా ఉపకారం చేస్తే దాన్ని స్మరించకండి. ఎవరైనా మీకు ఉపకారం చేస్తే దాన్ని విస్మరించబోకండి. - జీవితంలో ఎదురయ్యే సాధారణ విషయాలను కూడా అసాధారణంగా ఆలోచించి పరిష్కరించగలిగినప్పుడు నీవు ప్రపంచాన్ని శాసించగలిగే స్థాయికి చేరుకుంటావు. - ఉన్న వైపుకు పురోగమించడమే కాని ఉన్నదాన్ని పెంచడంలో పురోగతి ఉండదు. సాధించాలనే సత్‌సంకల్పం ఉంటే సాధ్యం కానిది ఏదీ లేదు. - తోటివారితో మంచిగా జీవించాలి, మీ మంచితనాన్ని తోటివారికి పంచాలి. అదే మిమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడుతుంది. మానవుడు దానవుడుగా మారడం అతని ఓటమి. మనిషి మహామనిషిగా రూపాంతరం చెందటం అతని చమత్కారం. మానవుడు మనిషిగా మారడం గెలుపు. నిన్ను చూసి నీవు మనసారా నవ్వగలిగిన రోజున నీ అభివృద్ధి ప్రారంభమవుతుంది. జీవితం అనేది రాళ్ల గని వంటిది. మంచిశిలను ఎంచుకుని శిల్పాన్ని మలిచినట్లే మన వ్యక్తిత్వాన్ని అందంగా మలుచుకోవాలి. - పనిలో నిమగ్నమై పట్టుదలతో పనులు చేసేవారికి ఆరోగ్యం చెడిపోదు. ముసలితనం రాదు. తన వృత్తిని పవిత్రంగా, గౌరవంగా భావించే వ్యక్తి, ఒక క్షణం కూడా సోమరిగా ఉండలేడు. మనం చేయవలసిన పని మానేసి మరెవరో వచ్చి చేసిపెడతారని ఎదురు చూడడం వెర్రితనం. పనిచేసేతత్వమూ, పనిపట్ల విశ్వాసము విజయానికి మూలకారణాలు. మనం ఎలాంటి పనులు చేయాలో మనం నిర్ణయించుకొనేటట్లుగానే మనం ఎటువంటి వారమో మనం చేసే పనులు నిర్ణయిస్తాయి. - జీవితం ఒక రంగుల వలయం. రంగుల రాట్నం. దాన్ని మలచుకునే విధానంలోనే ఫలితాలు ఆధారపడి ఉంటుంది. నీతినిజాయితీతో కష్టపడి పనిచేస్తే తప్పకుండా సంతోషకరమైన జీవితం లభిస్తుంది. - మనం ఎంత చేయగలమో దానిని బట్టి మన విలువను నిర్ణయించుకుంటాము. బయటి వారు మనం ఎంత చేశామో దానిని బట్టి విలువ కడతారు. మీలో తప్పిదాలు ఉన్నప్పుడు వాటిని ఒప్పుకుని తక్షణమే తొలగించుకోవడానికి ఏమాత్రం భయపడకు. - సంకల్పం, బలం ఉన్నచోట అపజయమనేది ఉండదు. స్వశక్తిని నమ్ముకొన్న వారే దేనినైనా సాధించగలరు. ఏమి చేశారన్నది కాదు ఎటువంటి ఉద్దేశంతో చేశారన్నది పరిశీలించాలి. నమ్మకంతో ప్రారంభమైన కార్యం సంశయాలతో ముగుస్తుంది. సందేహాలతో మొదలుపెట్టిన పని నమ్మకానికి దారితీస్తుంది. మనిషి జీవితాన్ని మలిచేది అతని ఆలోచనే. ఉన్నతంగా ఆలోచించే వారికి ఎన్నడూ ఒంటరితనం ఉండదు. వారికి ఆలోచనే మిత్రులు, నేస్తాలు. - నీతికి నీవు కట్టుబడి ఉంటే అందుకుంటావు ప్రగతి మెట్లు. భీతిని వీడి ముందుకేగితే విజయమే నిన్ను వరిస్తుంది. మనిషి సాటి మనిషిని ప్రేమిస్తే సమాజం, మనిషి తోటి మనిషిని హింసిస్తే అరణ్యం. - మంచి ప్రవర్తన, మంచి నైతిక విలువలు మనకు స్థిరమైన, శ్రేష్ఠమైన నేస్తాలు, మనిషి తన జీవనమార్గంలోని రెండు పటిష్టమైన దారులని ఏమాత్రం పట్టు సడలనివ్వకూడదు. ఆ రెండు దారులే ఆశ, నమ్మకం. మంచి సామర్థ్యం కలిగి ఉండడం గొప్ప విషయమే. కానీ ఇతరుల సామర్థ్యాన్ని గుర్తించడం అన్నది మరీ గొప్పవిషయం. - ఎంత చదివినా ఎన్ని వ్రాసినా క్రమశిక్షణలేని జీవితం వ్యర్థం. ఎంత గొప్పవాడయినా క్యారెక్టరు లేని మనిషి బ్రతుకు శూన్యం. ఎంత సంపాదించినా ఒకనాడది వదలి వెళ్లాల్సిందే. ఎంతకాలం కలిసి ఉన్నా చివరకు విడిపోవాల్సిందే. - ఎంతకాలం జీవించినా ఒకనాడు మృత్యువాత పడాల్సిందే. నీవెంత పైకెదిగినా ఈ జీవిత సత్యాలను అనుభవించాల్సిందే. కోపమొక్కటి నీ దరిచేరకున్న ముఖమున చిరునవు్వ వెలుగుచున్న ఎంత ధనమున్న వీటి ముందు సున్నా. ఓరిమి జీవితానికి ప్రకాశం ఉద్రేకం బ్రతుకుకు వినాశం. - పరిశీలనతో పరిష్కరించుకోగల ఆత్మస్థయిర్యం ఉండాలి. సర్దుకుపోవడం, అవగాహనతో మెలగడం, పరులను ప్రేమించగలగడం, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం అలవచ్చుకోవాలి. మనకి జీవితంలో తారసపడే ప్రతి వ్యక్తీ ఏదో ఒక విధంగా మనకంటే గొప్పవాడై ఉంటాడు. అలాంటి వ్యక్తుల నుండీ ఎంతో కొంత నేర్చుకోగలిగితే జీవితం ధన్యమవుతుంది. - ఆర్వీఎమ్ |
తిర్యక్ తాడాసనం యోగా ఎలా చేయాలి?
యోగా:
పాదాలను దగ్గరగా ఉంచి చేతులను శరీరానికి ఇరువైపులా తాకించి నిటారుగా సమస్థితిలో నిలబడాలి. చేతులను నిదానంగా పైకి తీసుకుని ఫొటోలో ఉన్నట్లుగా ఒక చేతి వేళ్లను మరో చేతి వేళ్లతో కలిపి ఉంచాలి. పూర్తిగా శ్వాస తీసుకుని రెండు అరచేతులు ఆకాశాన్ని చూస్తున్నట్లుగా ఉంచాలి. ఇప్పుడు నిదానంగా శ్వాస వదులుతూ శరీరాన్ని ఎడమవైపుకి తిప్పి కాలివేళ్ల మీద నిలబడాలి. ఈ స్థితిలో శరీరాన్ని వీలైనంత వరకు పైకి లాగిపట్టి ఉంచాలి. ఇలా ఉండగలిగినంత సేపు ఉన్న తర్వాత శ్వాస తీసుకుంటూ యథాస్థితికి రావాలి. ఇదే క్రమాన్ని కుడివైపు కూడా చేయాలి. అలాగే పాదాలను ఒక అడుగు దూరంలో ఉంచి కూడా చేయాలి. ఇలా ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం మూడు నుంచి ఐదుసార్లు చేయాలి. ఉపయోగాలు పొడవు పెరగడానికి దోహదం చేస్తుంది. కండరాలు, నరాలు, పేగులు, వెన్ను ఉత్తేజితమవుతాయి. మలబద్దకం వదులుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది, కాళ్లు చేతులు, నడుము శక్తిమంతం అవుతాయి. కండరాల నొప్పులు, కండరాలు పట్టేయడం వంటివి క్రమంగా తగ్గిపోతాయి. రక్తప్రసరణ క్రమబద్ధమవుతుంది.శరీరం చైతన్యవంతం అవుతుంది. దేహాన్ని మెలితిప్పడం వల్ల ఛాతీ కండరాలు శక్తిమంతం అవుతాయి. శ్వాస క్రియ చక్కగా జరుగుతుంది. మానసిక ఒత్తిడులు తొలగిపోతాయి. జాగ్రత్తలు మోకాళ్ల నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు చేయకూడదు. భుజాలు అరిగిపోయిన వాళ్లు, స్పాండిలోసిస్‌తో బాధపడుతున్న వాళ్లు చేయకూడదు. కాలివేళ్లు, మడమలకు సంబంధించిన ఎలాంటి సమస్య ఉన్నా ఈ ఆసనాన్ని సాధన చేయరాదు. మోడల్: ఎస్. దుర్గాహర్షిత, నేషనల్ యోగా చాంపియన్ | |||
పదినెలల బాబుకు విరేచనాలు... ఏం చేయాలి?
ఆయుర్వేదం
మా బాబు వయసు 10 నెలలు. గత మూడు వారాలుగా పలుచగా నీళ్లలాగ విరేచనాలవుతున్నాయి. పరిమాణం స్వల్పమే అయినా, రోజుకి 9-10 సార్లు అవుతున్నాయి. ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. ఈ సమస్యకు ఆయుర్వేదంలో మందులు తెలియజేయగలరు.
- భానుమతి, జహీరాబాద్ నీళ్ల విరేచనాలను ఆయుర్వేదంలో అతిసారం అంటారు. ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేవి ఒక వర్గంగాను, ఇతర కారణాల వల్ల వచ్చేవి ఇంకో వర్గంగాను ఆయుర్వేదంలో వివరించారు. వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవల్ (ఆంత్రకృములు) మొదలైనవి సాధారణంగా కలిగే ఇన్ఫెక్షన్స్. ఇతర కారణాల్లో ముఖ్యమైనవి... కొందరికి తల్లి పాలు పడకపోవడం కొన్ని ఆహార పదార్థాలకు అసాత్మ్యత కారం, పులుపు ఎక్కువగా తినడం కొన్ని మందుల వల్ల కలిగే దుష్ర్పభావాలు జీర్ణకోశసమస్యలు భయం, కోపం, విచారం వంటి మానసిక ఉద్వేగాలు, పిల్లలకు దంతాలు జనిస్తున్నప్పుడు మొదలైనవి. మీ బాబు వయసు రీత్యా ఇది ‘దంతోద్భవజన్య అతిసారం’ కావచ్చు. విరేచనాలతో బాబు వాంతులు, జ్వరం లేకపోతే పెద్దగా కంగారు పడవద్దు. పిల్లలకు ప్రతిదినం ఇచ్చే ఘనాహారం, ద్రవాహారం అదేవిధంగా ఇవ్వాలి. ముఖ్యంగా సోడియం, పొటాషియం కలిగి ఉన్న ద్రవాహారం పుష్కలంగా తాగించాలి. సహజసిద్ధమైన కొబ్బరినీళ్లు ప్రశస్తమైన ద్రవాహారమని గుర్తుంచుకోండి. పలుచని మజ్జిగ, బార్లీ నీళ్లు కూడా మంచివే. ఒక కప్పు నీళ్లలో (మరిగించి చల్లార్చినవి) ఒక చెంచా శర్కర, చిటికెడు ఉప్పు, మూడు చుక్కల నిమ్మరసం కలిపి, ఇంట్లో తయారుచేసుకుని, ఆరారా తాగిస్తే డీహైడ్రేషన్ (శోష) రాకుండా ఉంటుంది. ఔషధం కర్పూరరస (మాత్రలు) ఉదయం 1 - రాత్రి 1 లశునాదివటి (మాత్రలు) ఉదయం 1 - రాత్రి 1 దాడిమాష్టకచూర్ణం : ఒకటి, రెండు గ్రాములు (పిల్లలకు) తేనెతో గాని, పాలతోగాని, రోజూ మూడుపూటలా గమనిక : ఈ మూడింటిలో ఏ ఒక్క మందైనా సరిపోతుంది. శిశువుకు ఆరవ నెల వచ్చినప్పటి నుంచి ఈ కింది మందులు వాడితే దంతాలు జనించేటప్పుడు కలిగే అనేక సమస్యల (జ్వరం, విరేచనాలు, వాంతులు మొదలైనవి) నివారణకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఇవి ఎంతకాలమైనా వాడుకోవచ్చు. జహర్‌మొహర్ పిష్ఠి మరియు ప్రవాళపిష్ఠి (భస్మాలు): వీటిని ఒక్కొ క్క చిటికెడు తీసుకుని తేనెతో రోజూ రెండు పూటలా నాకించాలి. అరవిందాసవ (ద్రావకం): ఒక చెంచా మందుకి ఒక చెంచా నీళ్లు కలిపి రెండు పూటలా తాగించాలి. విరేచనాలు తగ్గటానికి సాధారణ చిట్కాలు (గృహవైద్యం) వామును కొద్దిగా వేయిచి, నీళ్లతో మరిగించి తాగాలి. శిశువులకు : ఒక చెంచా రెండు లేదా మూడు పూటలా. పెద్దలకు: ఐదు చెంచాలు రెండు లేదా మూడుపూటలా. జాజికాయని అరగదీసి ముద్దగా చేసి పావు చెంచా మోతాదును తేనెతో రెండుపూటలా నాకించాలి. అతిసార నివారణకు జాగ్రత్తలు ( ముఖ్యంగా వర్షాకాలంలో) మరిగించి చల్లార్చిన నీళ్లు తాగాలి. బయటి ఆహారం జోలికి పోవద్దు. నిల్వ ఉంచిన ఆహారం, ఫ్రిజ్‌లో ఎక్కువకాలం దాచి ఉంచిన ఆహారం తినవద్దు. తేలికగా జీర్ణమయ్యే ఆహారం మంచిది. ఐస్‌క్రీములు, శీతలపానీనియాలు, నూడుల్స్ వంటి వాటికి దూరంగా ఉండాలి. ఆహారాన్ని తాజాగా వేడివేడిగా ఉన్నప్పుడే తినాలి. ఇల్లు, పరిసరాల పరిశుభ్రత చాలా అవసరం. పిల్లలకు పాలిచ్చే తల్లులు తమ ఆహారంలో కారం తగ్గించాలి. రోజూ వెల్లుల్లిపాయలు తినడం మంచిది. | |||
Thursday, June 13, 2013
Wednesday, June 12, 2013
నిద్రలేమిని అధిగమించడమెలా?
ప్రస్తుత సమాజంలో ప్రతి నలుగురిలో ఒకరు నిద్రలేమితో బాధపడుతున్నారు. రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టక పోవడాన్ని నిద్రలేమి (ఇన్‌సోమ్నియా) అంటారు.
కారణాలు పని ఒత్తిడి హృదయ, శ్వాససంబంధ వ్యాధులకు సంబంధించిన మందులు వాడటం వలన విపరీతమైన ఆలోచనలు శక్తికి మించిన పని చేయటం, కోపం, చిరాకు పడటం మానసిక ఆందోళన దాంపత్య జీవితం సరిగా లేకపోవటం ఆహార విహారాలు మొదలగునవి. లక్షణాలు కారణం లేకుండా నిద్రపట్టకపోవటం లేదా నిద్రపట్టిన తర్వాత గాఢనిద్రలోకి చేరుకోలేకపోవడం కొంతమందికి తొందరగానే నిద్రపడుతుంది కాని అర్ధరాత్రి మెలకువ వస్తుంది. చాలామంది నిద్రపోయిన తర్వాత నిద్రలేచే సమయానికంటే చాలా ముందరే మెలుకుంటారు. ఆ తర్వాత తిరిగి ఎంత ప్రయత్నించినా వీరికి నిద్రరాదు. మగవారిలో కన్నా ఆడవారిలో నిద్రలేమి ఎక్కువగా ఉంటుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ వ్యాధి వాత, పిత్త, కఫ దోషాల ప్రభావం వలన నిద్రలేమి వ్యాధి వస్తుంది. వాత వ్యాధి వలన వచ్చే నిద్రలేమి భయం, ఉద్వేగం అనే లక్షణాలు ఉంటాయి. దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు -రాత్రి పదిగంటలకు నిద్రపోవాలి -పడుకునే ముందు పాలు త్రాగాలి. -వేడి ఆహరం తినటం మంచిది -ఒత్తిడితో కూడిన పని చేయరాదు. పిత్తదోష జనిత నిద్రలేమి నిద్ర త్వరగా వస్తుంది. కాని మధ్యలో చాలా సార్లు మెలకువ వస్తుంది. శరీరం నొప్పులు, భయం, కోపం, బాధ మొదలగునవి లక్షణాలుంటాయి. దీనికి తీసుకోవలసిన జాగ్రత్తలు: -మసాలా పదార్థాలు తీసుకోకపోవటం మంచిది. - ఉపవాసం చేయరాదు. కఫదోష జనిత నిద్రలేమి తెల్లవారు త్వరగా నిద్రలేవటం జరుగు తుంది. అలసట ఉంటుంది. సమయానికి ముందే మెలకువ వస్తుంది. దీనిని నివారించుకోవటానికి -వ్యాయామం చేయటం -గోరు వెచ్చని నీరు త్రాగాలి. -తీపి, పులుపు, లవణ పదార్థాలు తినటం తగ్గించాలి. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నిద్రలేమి వ్యాధిని ఔషధ సేవనం ద్వారా, పంచకర్మ చికిత్సల ద్వారా పూర్తిగా నివారణ చేయవచ్చును. ప్రాణాయామం చేయటం ద్వారా ఒత్తిడిని నివారించవచ్చును. ఒత్తిడి తొలగి పోవడం వల్ల మంచి నిద్ర పడుతుంది. ఆయుర్వేద వైద్యనిపుణుల పర్యవేక్షణలో రోగ నిర్ధారణ చేసుకుని ఈ వ్యాధిని పూర్తిస్థాయిలో తగ్గించవచ్చు. నిద్రలేమి అధిగమించాలి అంటే ప్రతి ఒక్కరు... -వ్యాయామం చేయాలి. - కెఫిన్ లాంటి పదార్థాలు తీసుకోకూడదు. -మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. - ఒత్తిడి తగ్గించు కోవాలి. - పగటి నిద్ర మంచిది కాదు. -ఆహార విహారాలు మార్చు చేసుకోవాలి. -పడుకునే ముందు పాలు త్రాగాలి. -కడుపును ఖాళీగా ఉంచకూడదు. అలాగని మరీ మితిమీరి కూడా తినకూడదు. డాక్టర్ రమణ రాజు, ఎం.డి (ఆయుర్వేద), స్టార్ ఆయుర్వేద, సికింద్రాబాద్, కూకట్‌పల్లి, దిల్‌సుఖ్‌నగర్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాజమండ్రి, కర్ణాటక ph: 7416 101 101 / 7416 102 102 |
నువ్వులు ,.,.,కమ్మటి కొసర్లు
ఉండలు - నువ్వుండలు...
అరిసెలు - నువ్వరిసెలు... తేడా పట్టేసే ఉంటారు! నువ్వులు మిక్స్ ఐతే ‘స్వీట్ నథింగ్స్’ అయినా సరే సమ్‌థింగ్ స్పెషల్ అయిపోతాయి! జంతికలు, పొడులు... పులగాలు, చికెన్లు - మటన్లు ఏవైనా నువ్వుల టచ్ పడితే చాలు హై పిచ్‌లోకి వెళ్లిపోతాయి! విడిగా నువ్వులు... కలివిడిగా కమ్మటి కొసర్లు. కమ్మటి కొసర్లు కావలసినవి: నువ్వులు - 2 కప్పులు; బెల్లం తురుము - 2 కప్పులు; ఏలకులపొడి - తగినంత; పుట్నాలు - 2 టీ స్పూన్లు; మైదాపిండి - 2 కప్పులు; నూనె - సరిపడా; ఎండుకొబ్బరి తురుము - 4 టీ స్పూన్లు; బియ్యప్పిండి - 2 టీ స్పూన్లు. తయారి: నువ్వులలో కొద్దిగా నీరు చల్లి బట్టపై పోసి, బియ్యప్పిండి వేసి చేతితో బాగా రుద్ది, చెరిగితే పొట్టు పోతుంది తరవాత బాణలిలో పోసి స్టౌ మీద ఉంచి, మంట తగ్గించి కలిపి, బాగా వేగాక స్టౌ ఆపేయాలి నువ్వులలోనే బెల్లంతురుము కూడా వేసి బాగా కలపాలి చల్లారాక పొడిపొడిగా ఉండేలా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసి, పుట్నాలు, కొబ్బరితురుము, ఏలకుల పొడి కూడా వేసి బాగా కలపాలి మైదాలో... టీ స్పూను నూనె, నీరు పోసి చపాతీపిండిలా తడిపి గంటసేపు నాననివ్వాలి చిన్న ఉండగా పిండిని తీసుకొని పొడిపిండి అద్దుతూ పూరీలాగ పల్చగా ఒత్తాలి తగినంత నువ్వుల మిశ్రమం ఉంచి అంచులను చేత్తో నొక్కాలి. చక్రం ఉండే స్పూనుతో రోల్ చేస్తూ అంచులను తీసేయాలి. ఇలా చేసి కాగిన నూనెలో వేసి బంగారురంగు వచ్చేవరకు వేయించి తీయాలి. ఇవి వారం పదిరోజుల వరకు నిల్వ ఉంటాయి. కీమా - నువ్వులు రోల్స్ కావలసినవి: కీమా (మటన్) - 200 గ్రా; ఉప్పు - తగినంత; కారం - టీ స్పూను; పసుపు - చిటికెడు; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; ఉల్లితరుగు - కప్పు; పెరుగు - పావు కప్పు; ధనియాలు, జీలకర్ర, లవంగాలు, ఏలకులు, దాల్చినచెక్క (అన్నిటినీ పొడి చేయాలి) - టీ స్పూను; మైదా - అర కిలో; డాల్డా లేదా నెయ్యి - మూడు టేబుల్ స్పూన్లు; కోడిగుడ్లు - 2; నూనె - వేయించడానికి సరిపడా; బేకింగ్ సోడా - పావు టీ స్పూను తయారి: మైదాలో బేకింగ్ సోడా, కొద్దిగా ఉప్పు వేసి కలపాలి కరిగించిన నెయ్యి లేదా డాల్డా, గిలక్కొట్టిన కోడిగుడ్డు తెల్లసొన పిండిలో వేసి కలపాలి కొద్దిగా నీరు జతచేస్తూ మైదాపిండి మిశ్రమాన్ని చపాతీపిండిలా కలిపి నాలుగైదు గంటలు నాననివ్వాలి ఒక పాత్రలో కీమా తీసుకుని, అందులో పసుపు, కారం, అల్లంవెల్లుల్లిపేస్ట్, మసాలాపౌడర్, కొద్దిగా పెరుగు అన్నీ కలిపి అరగంటసేపు నాననిచ్చి, మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా అయ్యేలా చేయాలి స్టౌ మీద బాణలి ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక, ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి తయారుచేసి ఉంచుకున్న కీమా మిశ్రమం, ఉప్పు జత వేసి బాగా వేయించాలి మైదాను చిన్నచిన్న ఉండలుగా చేసుకుని, ఒక్కో ఉండను పల్చగా చపాతీలా ఒత్తి, నలుచదరంగా ఉండేలా చాకుతో కట్ చేసి పక్కన ఉంచుకోవాలి తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని సన్నగా పొడవుగా రోల్‌లా తయారుచేసి చపాతీ మీద ఉంచి నెమ్మదిగా రోల్ చేయాలి ఇలా ఒకదాని మీద ఒకటి మూడు చపాతీలను పొరలుగా రోల్ చేయాలి అప్పడాల పీట మీద నువ్వులు చల్లి, మరొక పొర తీసుకుని అప్పడాలకర్రతో ఒత్తి, ముందుగా తయారుచేసి ఉంచుకున్న రోల్‌ను ఈ పొర పై ఉంచి మరోమారు రోల్ చేయాలి ఫొటోలో చూపిన విధంగా కట్ చేసి, చివర్లు విడిపోకుండా లవంగం కాని టూత్ పిక్ కాని ఉంచాలి స్టౌ మీద బాణలిలో నూనె పోసి కాగాక వీటిని ఒకటొకటిగా వేస్తూ డీప్ ఫ్రై చేయాలి సాస్ కాంబినేషన్‌తో స్నాక్‌లా తింటే రుచిగా ఉంటాయి. నువ్వుల రొట్టెలు కావలసినవి: బియ్యప్పిండి - 4 కప్పులు; నువ్వులు - కప్పు లేదా ఒకటిన్నర కప్పులు; ఉప్పు - తగినంత తయారి: ఒక కప్పు పిండిని పొడిపిండి కోసం వేరే గిన్నెలో ఉంచుకోవాలి ఒక గిన్నెలో మూడుకప్పుల నీరు, తగినంత ఉప్పు వేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ఒక పెద్ద పాత్రలో బియ్యప్పిండి, మరిగించిన నీరు పోసి చపాతీపిండిలా కలపాలి చల్లారాక నీళ్లు అద్దుకుంటూ ముద్దగా చేసుకోవాలి జామకాయ సైజులో పిండిని తీసుకుని నువ్వులను రెండువైపులా, చుట్టూరా పట్టేలా అద్ది, పొడిపిండి వేసుకుని చపాతీలా (చేతితోకాని చపాతీకర్రతో కాని) పెద్దదిగా ఒత్తుకోవాలి స్టౌ మీద పెనం ఉంచి, వేడయ్యాక ముందుగా తయారుచేసి ఉంచుకున్న రొట్టెను వేసి రెండుమూడు నిముషాలయ్యాక కొద్దిగా నీళ్లు జల్లి, మరో రెండునిముషాలయ్యాక తిరగ తిప్పాలి బాగా కాలిన తరవాత తీసేయాలి పల్లీ చట్నీ, నువ్వుల చట్నీ, వంకాయ చట్నీ కాంబినేషన్‌తో ఈ రొట్టెలు బాగుంటాయి (ఈ రొట్టెలను నిల్వ చేసుకోవాలంటే, చిన్న మంటపై గట్టిగా కాల్చి, చల్లారాక డబ్బాలో పెట్టుకోవాలి. నెలరోజుల దాకా నిల్వ ఉంటాయి) నువ్వుల సకినాలు కావలసినవి: బియ్యం - 4 కప్పులు; నువ్వులు - 2 కప్పులు; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి సరిపడినంత; అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను; నెయ్యి - 2 టీ స్పూన్లు తయారి: బియ్యంలో నీళ్లు పోసి మూడు గంటలు నాననివ్వాలి బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు వంపేసి పొడి వస్త్రం మీద పోసి ఆరనివ్వాలి కొద్దిగా తడిగా ఉండగానే బియ్యాన్ని గ్రైండ్ చేసి పిండిని జల్లించుకోవాలి ఈ పిండిలో నువ్వులు, ఉప్పు, నెయ్యి, అల్లంవెల్లుల్లిముద్ద వేసి కలపాలి నీళ్లు పోస్తూ ముద్దగా చే యాలి సకినాల మాదిరిగా చుట్టి, పొడివస్త్రం మీద పెట్టుకోవాలి మొత్తం పిండిని ఈ విధంగా తయారుచేసి పక్కన ఉంచుకోవాలి స్టౌ మీద బాణలి ఉంచి, నూనె పోసి కాగనివ్వాలి తయారుచేసి ఉంచుకున్న సకినాలను ఒక్కటొక్కటిగా నూనెలో వేసి బంగారువర్ణం వచ్చేవరకు వేయించి తీసేయాలి. (ఇష్టపడేవారు కారం కూడా వేసుకోవచ్చు) నువ్వుల పులగం కావలసినవి: బియ్యం - కప్పు; నువ్వుపప్పు - అర కప్పు; బెల్లం - ఒకటిన్నర కప్పులు; ఏలకుల పొడి - చిటికెడు; పాలు - 2 కప్పులు; డ్రైఫ్రూట్స్ - తగినన్ని; నెయ్యి - 5 టీ స్పూన్లు; బియ్యప్పిండి - పావు కప్పు. తయారి: బియ్యంలో నాలుగు కప్పుల నీరు పోసి మెత్తగా అన్నం వండాలి నువ్వులను ఇసుక లేకుండా చూసుకొని కొన్ని నీళ్లు చల్లి బట్టపై పోసి, బియ్యప్పిండి వేసి చేతితో బాగా రుద్దాలి పొట్టును విడదీసి, నువ్వులను బాణలిలో పోసి స్టౌ పై పెట్టి చిన్నమంటపై ఉంచి, వేగిన తరువాత దించాలి చల్లారాక గ్రైండ్ చేసి పెట్టుకోవాలి బాణలిని స్టౌ మీద ఉంచి వేడయ్యాక డ్రైఫ్రూట్స్ వేసి వేయించాలి ఈ నేతిలోనే ఉడికించిన అన్నాన్ని, నువ్వలపొడిని కూడా వేసి పాలు పోసి ఉడకనివ్వాలి ఐదు నిముషాల తర్వాత బెల్లం వేసి ఉడికిన తర్వాత ఏలకులపొడి కూడా వేసి కలిపి దించాలి డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేయాలి (అన్నం ఉడికించేటప్పుడు రెండుకప్పుల పాలు, రెండు కప్పుల నీరు కూడా పోసుకోవచ్చు) నువ్వులపొడి కావలసినవి: ఇనువ్వులు - పావుకేజీ; ఎండుమిర్చి - 50 గ్రా.; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - పావు టీ స్పూను; ఇంగువ - కొద్దిగా; నూనె - టీ స్పూను; ఉప్పు - తగినంత తయారి: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక నువ్వులు వేసి దోరగా వేయించి దించేయాలి అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేగాక ఎండుమిర్చి కూడా వేసి వేయించి దించేయాలి చల్లారాక మిక్సీలో ముందుగా పోపు వేసి గ్రైండ్ చేయాలి నువ్వులు, ఉప్పు, ఇంగువ కూడా వేసి మరోసారి గ్రైండ్ చేయాలి ఇది అన్నంలోకి రుచిగా ఉంటుంది. నువ్వుల ఉండలు కావలసినవి: నువ్వులు - కప్పు; బెల్లంతురుము - ఒకటిన్నర కప్పులు; ఏలకులపొడి - అర టీ స్పూను; జీడిపప్పు, కిస్‌మిస్‌లు - రెండు టీ స్పూన్లు; నెయ్యి - రెండు టీ స్పూన్లు తయారి: స్టౌ మీద బాణలి ఉంచి కాగాక నువ్వులు వేసి వేయించి దించి, చల్లారనివ్వాలి. మిక్సీలో నువ్వులు వేసి మెత్తగా చేయాలి బెల్లం తురుము, ఏలకులపొడి వేసి అన్నీ కలిసేలా బాగా తిప్పాలి ఈ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని చేతికి నెయ్యి చేసుకుంటూ ఉండకట్టాలి పైన జీడిపప్పు, కిస్‌మిస్‌లను అద్దాలి రోజుకొక ఉండ తింటుంటే శ రీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా దొరుకుతుంది. కర్టెసీ: పి.సాయిజ్యోతి, అచ్చంపేట, మహబూబ్‌నగర్ జిల్లా నువ్వుల చరిత్ర నువ్వులు... పూలమొక్క జాతికి చెందినది. ఇది అతి ప్రాచీనమైన పంట. సుమారు 3000 సంవత్సరాల క్రితం నుంచి ఈ పంటను పండిస్తున్నారు. పంటలు పండటానికి అనువుగాని ప్రదేశాలలో కూడా ఈ పంట చక్కగా పండుతుంది. ఈ పంటకు నీరు ఎక్కువగా అవసరం లేదు. ఇది బర్మా, ఇండియా, చైనా, ఆఫ్రికా ఖండంలోని కొన్ని దేశాలలో ఎక్కువగా పండుతుంది. నువ్వులను గింజల కోసం, నూనె కోసం అధికంగా పండిస్తారు. ప్రపంచంలోకెల్లా నువ్వులను అత్యధికంగా ఎగుమతి చేసే దేశం భారతదేశం అయితే, అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశం జపాన్. ఈ దేశస్థులు తమ వంటకాలలో నువ్వులనూనెను ఎక్కువగా వాడతారు. ఇది అధిక లాభాన్ని తీసుకువచ్చే వాణిజ్యపంట. |
Subscribe to:
Posts (Atom)