all

Wednesday, November 21, 2012

Rana -interview

జీవితం రెండోసారి దొరకదని రానాకు తెలుసు.
దానిని ఎంజాయ్ చేయాలి... చేస్తాడు.
దుబారా చేయకూడదు... చేయడు.
ఫ్రెండ్స్- ఫన్ - పార్టీస్... అదొక లెవల్.
కాని తన కారు తాను నడుపుకుంటూ,తన లగేజ్‌ను తాను మోసుకుంటూ, అవసరమైతే బ్రెడ్ తిని, వీలు లేకపోతే మెట్ల మీద పడుకొని.... అది ఇంకో లెవల్!
డబ్బున్నోళ్ల అబ్బాయిల స్టీరియోటైప్ లైఫ్‌ను రానా నుంచి ఎక్స్‌పెక్ట్ చేయడం ఒక సైడ్.
కాని- అమరచిత్ర కథల గురించి, తెలుగు భాష గురించి, మన కల్చరల్ లెవల్స్ గురించి అతను మాట్లాడం మాత్రం కచ్చితంగా అదర్‌సైడ్!!


హడావిడిగా కనిపిస్తున్నారు..?
రానా: డిసెంబర్ మొదటి వారంలో మా చెల్లెలి పెళ్లి... కొంచెం పనుల్లో బిజీగా ఉన్నా. ఇంట్లో ఆడపిల్లకు జరిగే శుభకార్యం అవడంతో అన్ని పనులూ నెత్తినేసుకుంటున్నా. (నవ్వుతూ) మీ దగ్గరకు రావడంలో ఆలస్యం అయ్యింది కూడా అందుకే. సారీ.. ఏం అనుకోకండీ..

అయ్యో... భలే వారు...
రానా: లేదండీ... ఈ బిజీ ఏదో నాకు రాసిపెట్టినట్టుంది. ఏ ముహూర్తంలో నటునిగా అడుగుపెట్టానో కానీ... అప్పట్నుంచి ఇప్పటివరకూ ఒక్క రోజు కూడా ఖాళీగా లేను. ఇప్పుడు చెల్లి పెళ్లి అవడంతో నా అంతట నేనే గ్యాప్ క్రియేట్ చేసుకున్నానుకాని లేకపోతే ఏదో ఒక షూట్‌లోనో డబ్బింగ్‌లోనో డిస్కషన్‌లోనో ఉండేవాణ్ని. అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది చదువుకునేరోజులే హ్యాపీ... ఏ దిగులూ చింతా లేకుండా ఉండేవని!

టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నా... మీరు ఎలాంటి స్టూడెంట్?
రానా: యావరేజ్. కానీ ఇష్టమైన సబ్జెక్ట్‌లో మాత్రం మంచి మార్కులు తెచ్చుకునేవాడ్ని. (నవ్వుతూ) అకౌంట్స్‌లో 90కి తక్కువ ఎప్పుడూ రాలేదు.

తెలుగు సంగతి?
రానా: తెలుగంటే నాకు మొదట్నుంచీ ఇష్టం. నేను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదివినా ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకూ ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగే! అందుకే ‘కృష్ణంవందే జగద్గురుమ్’లో సమాసభూయిష్టమైన సంభాషణలను అలవోకగా చెప్పేశాను. నా దృష్టిలో భాష అంటే అమ్మతో సమానం! కానీ దురదృష్టం ఏంటంటే మనం దానికి రోజురోజుకూ దూరం అవుతున్నాం. నా ఇంటర్‌మీడియట్ టైమ్‌లోనే ఫస్ట్ లాంగ్వేజ్ వాళ్లమంతా కలిపి కేవలం ఎనిమిది మందిమి ఉండేవాళ్ళం. ఇక డిగ్రీలో అయితే ముగ్గురే. ఫ్రెంచ్ క్లాస్‌లో మాత్రం 30, 40 మంది ఉండేవాళ్లు. మనం హైదరాబాద్‌లో ఫ్రెంచ్ మాట్లాడతామా? మనకెందుకు ఫ్రెంచ్? ఇప్పుడైతే ఇంకా దారుణంగా తయారైంది. ప్రస్తుతం మా కజిన్స్ అక్కడే చదువుతున్నారు. వాళ్లను ఏమైనా అడిగితే తెలుగులో సమాధానం చెప్పడం రాదు. ఒకవేళ మాట్లాడినా, ఆ తెలుగు అస్సలు వినలేం. విద్యావ్యవస్థలో వస్తున్న మార్పుల కారణంగా తెలుగు భాష అడుగంటిపోతోంది.

తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల వాళ్లతో పోలిస్తే మన తెలుగువాళ్లకి భాష పట్ల స్వాభిమానం తక్కువని అనిపిస్తుంది... ఏకీభవిస్తారా?
రానా: కచ్చితంగా! అక్కడ వాళ్లల్లో ఆ ఫీలింగ్ ఎక్కువ. అంతేకాదు, అక్కడ ఎవరూ ఒకే రంగాన్ని నమ్ముకొని బ్రతకరు. సాధ్యమైనంత వరకూ ప్రతి ఒక్కరికీ వేరే రంగంలో ప్రవేశం ఉంటుంది. వాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కానివ్వండి, ఏ జాబ్‌లో అయినా ఉండనీయండి... సాయంత్రం అవ్వగానే ఏదో ఒక కళపై దృష్టిని సారిస్తాడు. నాటకం, సంగీతం, చిత్రలేఖనం... ఇలా ఏదో ఒకటి. ప్రస్తుతం మనకైతే ఆ పరిస్థితి లేదు. ఉదాహరణకి ఈ మధ్యే జరిగిన ఒక సంఘటన చెప్తా... మా చెల్లెలి శుభలేఖను తెలుగు చిత్రకారుడు రమేష్ గురజాల ఆర్ట్‌తో డిజైన్ చేయించాం. ఆ శుభలేఖను ఇక్కడ చాలామందికి పంచాం. ఒక్కరు కూడా ఆ శుభలేఖపై ఉన్న చిత్రం గురించి మాట్లాడిన పాపానపోలేదు. కానీ బెంగళూరు, చెన్నై, ముంబైల్లో మాత్రం ఆ బొమ్మ చూసిన వారందరూ ‘రమేష్ గురజాలది కదా..’ అనడిగారు. దాన్ని బట్టి వారిలోని కళాభిరుచిని అర్థం చేసుకోవచ్చు. ఆన్ ద అదర్‌సైడ్, మనవాళ్లు ఎంత అభిరుచిహీనులో కూడా అర్థం చేసుకోవచ్చు. ఎక్కడో ఏదో విధానాలలో మార్పు రావాలి. వస్తుంది లేండీ... ఒకప్పుడు హైదరాబాద్‌లో ఉండేవారు పై చదువుల కోసం చెన్నయ్, బెంగళూర్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా హైదరాబాద్ అభివృద్ధి చెందింది. ఈ అభివృద్దితో పాటు పరిశీలనాత్మక దృష్టి కూడా తోడైతే మనం ఎక్కడో ఉంటాం.

కాస్త టాపిక్ మారుద్దాం... మీకు భారీ విజయం రాకపోయినా అమ్మాయిల్లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది... కారణం ఏంటంటారు?
రానా: (నవ్వుతూ) ఈ ప్రశ్న ఎవరు అడిగినా నాకు చాలా ఆనందంగా ఉంటుంది. నాకూ అర్థంకాని విషయం ఏంటంటే... లవ్‌స్టోరీల్లో నటించేవాళ్లకే రొమాంటిక్ ఇమేజ్ వస్తుంది. నేను ఇప్పటివరకూ ఒక్క లవ్‌స్టోరీ కూడా చేసింది లేదు. కానీ అమ్మాయిలు అభిమానిస్తున్నారంటే నాకే ఆశ్చర్యకరంగా ఉంటుంది. బహుశా... నా లైఫ్ స్టైల్, హైట్, నా ఫిట్‌నెస్ వాళ్లకు నచ్చి ఉండాలి.

అమ్మాయిలు మిమ్మల్ని ఇష్టపడడం సరే, మీరు ఎలాంటి అమ్మాయిని ఇష్టపడతారు?
రానా: ప్రత్యేకమైన టేస్ట్ అంటే ఏమీలేదు. అంతేకాదు, నేను ఎవరిమీదా అంచనాలు పెట్టుకోను. ఎదుటివారి వద్ద ఉన్న మంచి లక్షణాలను వెతుక్కొని వాటితోనే సరిపెట్టుకోవడం నాకు అలవాటు. అంచనాలు పెట్టుకోకుండా పెళ్లి చేసుకున్నామనుకోండి.. లైఫ్ మొత్తం దేవుడిచ్చిన బోనస్‌లా ఉంటుంది. అంచనాలు పెట్టుకుంటే... జీవితం మొత్తం వెలితిగానే అనిపిస్తుంది. అందుకే ఫలానా లక్షణాలున్న అమ్మాయిలంటే ఇష్టం అని చెప్పలేను.

టీనేజ్‌లోగానీ, ఇప్పుడు గానీ మిమ్మల్ని డిస్టర్బ్ చేసిన అమ్మాయి ఎవరన్నా ఉన్నారా?
రానా: అసలు నేను దేనికీ డిస్టర్బ్ అవ్వడం ఇష్టపడను. అందుకే హారర్ సినిమాలు కూడా చూడను. రామ్‌గోపాల్‌వర్మ రెండు మూడుసార్లు తను తీసిన సినిమాలు చూడటానికి పిలిచాడు... వెళ్లలేదు! ‘అరుంధతి’ సినిమా అంటే నాకిష్టం. కానీ అనుష్క తలపై కొబ్బరికాయలు కొట్టే సీన్ వస్తే మాత్రం లేచి వచ్చేస్తా. అలాంటివి చూడ్డం దేనికీ... డిస్టర్బ్ అవ్వడం దేనికీ అని!

మీరు చాలా తెలివిగా తప్పించుకుంటారు. నేను అడిగిన ప్రశ్న వేరు... మీరు చెప్పిన సమాధానం వేరు! ‘అందంతోగానీ, ప్రవర్తనతోగానీ మిమ్మల్ని మధురమైన బాధకు గురిచేసిన అమ్మాయి ఎవరైనా ఉన్నారా’ అనేది నా ప్రశ్న?
రానా: చెప్పేదాకా వదిలేలా లేరే! సరే, చెబుతున్నాను రాసుకోండి... చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయి మాత్రం నన్ను కాస్త ఇబ్బంది పెట్టింది. కాని ఆ అమ్మాయి నాకు సూపర్ సీనియర్. అందుకే ఆ అమ్మాయితో మాట్లాడలేకపోయా. పెద్ద విషయం ఏమిటంటే... ‘దమ్ మారో దమ్’ ప్రమోషన్ టైమ్‌లో చండీగర్ ఎయిర్‌పోర్ట్‌లో ఏళ్ల తర్వాత ఆ అమ్మాయి నాకు సడెన్‌గా తారసపడింది. ఇబ్బంది అనిపించి పలకరించలేకపోయాను కానీ, ఆరోజు సాయంత్రం అభిషేక్ (బచ్చన్)తో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నా.

ఇంతకీ ఆ అమ్మాయి మిమ్మల్ని గుర్తుపట్టిందా?
రానా: లేదు... నేనెవరో తెలీనట్టు బిహేవ్ చేసింది. బహుశా గుర్తుపట్టలేదనుకుంట!

అంతమందిలో అన్నేళ్ల తర్వాత కూడా ఆ అమ్మాయిని గుర్తు పట్టారంటే... గాఢంగానే ప్రేమించి ఉంటారు?
రానా: ప్రేమ అనే పెద్ద మాటలొద్దండీ. అది చాలా బరువైన పదం! లేత వయసులో కలిగే ఆకర్షణ అదంతా. అయినా ఆ రోజు ఎయిర్‌పోర్ట్‌లో చాలా తక్కువ మంది జనం ఉన్నారు... అందుకే గుర్తుపట్టగలిగాను.

కాని చాలామంది హీరోయిన్లకు మీరంటే ఇష్టమనీ... బిపాషా, శ్రీయ, త్రిష, రిచా గంగోపాధ్యాయ, సమీరారెడ్డి...
రానా: (నవ్వుతూ) అంతేనా మీ లిస్ట్... ఇంకా లేరా! కానీ సీరియస్లీ, రోజు రోజుకీ పెరుగుతున్న ఈ లిస్ట్ వినీ వినీ నాకు ఇంక విసుగొచ్చేస్తోంది. అందుకే అసలు పట్టించుకోవడం మానేశా. ఒకసారి ఓ పేపర్ వాళ్లు నాకు ఫోన్ చేసి, ‘మీపై ఫలానా రూమర్ వినిపిస్తుంది. నిజం ఎంత?’ అనడిగారు. ‘అది తప్పండీ. అలాంటిదేం లేదు’ అని దానికి పూర్తిగా వివరణ ఇచ్చాను. రెండో రోజు ఆ రూమర్ గురించి ఒక వ్యాసం రాసేసి, కింద రానా ఇలా అన్నాడు అని చిన్న కామెంట్ పెట్టారు. అది చూడగానే చాలా కోపం వచ్చింది. అందుకే ఈ గాలివార్తల గురించి ఆలోచించడంమే మానేశా.

ఇంతమంది హీరోలును వదిలేసి మీడియా మిమ్మల్నే ఎందుకు లక్ష్యం చేస్తుందంటారు?
రానా:నాకు మొదట్నుంచీ స్వతంత్య్ర భావాలెక్కువ! మనోభావాలను చంపుకొని బ్రతకలేను. నాకు తెలిసి నాలాగా స్వేచ్ఛను ఇష్టపడే హీరోలలో బాలీవుడ్‌లో రణబీర్‌కపూర్ ఒకడున్నాడంతే! పైగా నాకు ఫ్రెండ్స్ ఎక్కువ. యాక్టర్ అవ్వకముందు ఎలా బ్రతికానో, ఇప్పటికీ అలానే బ్రతుకుతున్నాను. కానీ బయటి ప్రపంచానికి అది తెలియదు కదా! వాళ్లకి నా లైఫ్ స్టైల్ కొత్తగా అనిపిస్తుంది. అందుకే నాపై ఇన్ని రూమర్లు అని నాకనిపిస్తుంది!

ఈ రూమర్లు విని ఇంట్లోవాళ్లు ఎలా స్పందిస్తారు?
రానా: (నవ్వుతూ) మాది ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అండీ... ఇలాంటివి చాలా చూశారు వాళ్లు!

హీరో హీరోయిన్ల బంధాల గురించి బయట సమాజంలో రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు. వారి అభిప్రాయాల్లో నిజానిజాలెంత?
రానా: నిజాలు ఉండచ్చు, ఉండకపోవచ్చు. కానీ ప్రతి రంగంలోనూ లోటుపాటులు అనేవి సహజం‘సచిన్ ఈ బంతి ఇలా అడితే బావుండు’ అని అనడానికి తేలిగ్గా అనేస్తాం. కానీ గ్రౌండ్‌లోకి దిగి ఆడితే తెలుస్తుంది అది ఎంత కష్టమో. ‘ఆ నాయకుడు జనం సొమ్ము తెగ తినేస్తున్నాడు’ అని నింద వేసేస్తాం. ఆ పొజిషన్ వల్ల తను అనుభవిస్తున్న స్ట్రగుల్ ఏంటన్నది అతని స్థానంలోకెళ్లి చూస్తే తెలుస్తుంది. సినిమా రంగంలో కూడా అంతే. హీరో హీరోయిన్లు అనగానే ‘వీళ్ల మధ్య ఏదో ఉందిరా’ అని తేలిగ్గా అనేస్తారు. కానీ ఎవరి జీవితాలు అయినా దగ్గరకొచ్చి చూస్తేనే తెలుస్తుంది... వాళ్ళేంటో... ఆ స్థాయికి వెళ్లడానికి వాళ్లు అనుభవించిన స్ట్రగులు ఏంటో! అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి మాటలు వస్తూ ఉంటాయి.

ఇండస్ట్రీలో మీకు క్లోజ్ ఫ్రెండ్..?
రానా: ఇంకెవరు చరణ్. మేమిద్దరం చిన్నప్పుట్నుంచీ కలిసి చదువుకున్నాం. చెన్నయ్ టి.నగర్‌లోనే మా ఇళ్లు కూడా. ఇప్పటికీ మా స్నేహం అలాగే కంటిన్యూ అవుతోంది.

మరి త్రిష మాటేంటి? మీ ఇద్దరికీ పెళ్లి అనే రూమరు కూడా ఈ మధ్య హల్‌చల్ చేసింది?
రానా: (నవ్వుతూ) ఓ ఆ రూట్లో వచ్చారా! త్రిష కూడా చరణ్ లాగే నాకు చైల్డ్‌హుడ్ ఫ్రెండ్. టి.నగర్‌లోనే తనూ ఉండేది. సౌత్ స్కోప్ మేగ్‌జైన్‌కోసం ఇద్దరం ఫోట్‌షూట్ చేశాం. వాటిని ఆధారాలుగా చూపిస్తూ ‘పెళ్లి’ అని నానా హంగామా చేసేశారు. వాళ్ళిష్టమొచ్చినట్టు రాసేశారు. ఇంతకంటే అన్యాయం మరొకటి ఉండదు.

మీ డ్రెస్సింగ్ స్టైల్ కొత్తగా ఉంటుంది. సపరేట్‌గా డిజైనర్‌ని ఎవరైనా ఉన్నారా?
రానా: నాకు సపరేట్ డిజైనర్లంటూ ఎవరూ లేరండీ! నచ్చినవి తొడుక్కుంటాను అంతే. ఇక నిజానికి నా షూ సైజ్ 13. ఈ సైజ్ షూస్ ఇండియాలో దొరకవ్. అందుకే దుబాయ్ వెళ్లి కొనుక్కుంటా. అక్కడ నా హైట్ ‘షేక్స్’ ఉంటారు కదా. అందుకే అక్కడ దొరుకుతాయ్. అక్కడకెళ్లి ఒక సూట్‌కేస్ నిండా షూస్‌నే నింపేసుకొని తెచ్చుకుంటాను.

మీ ఫిట్‌నెస్ సీక్రెట్ చెబుతారా?
రానా: నేను భోజనప్రియుడ్ని. అందుకే డైటింగ్ జోలికి అస్సలు వెళ్లను. కానీ ప్రతిరోజు గంటన్నర లేక రెండు గంటలు వర్కవుట్లు చేస్తా. షూటింగ్స్ ఉంటే మాత్రం సాయంత్రం పూట చేస్తా. ఏదైనా పొద్దున్నే చేసే వ్యాయామమే ఆరోగ్యం. పాత ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండేది. డైలీ స్విమ్మింగ్ చేసేవాడ్ని. ఇప్పుడున్న ఇంట్లో స్విమ్మింగ్ పూల్ లేదు. అది మాత్రం మిస్సవుతున్నా.

ఎలాంటి కార్లను ఇష్టపడతారు?
రానా: నాకు కార్ల పిచ్చి లేదండీ. చాలాకాలంగా ఒకే కారు వాడుతున్నా. అది కూడా ఈ మధ్య ‘డగ డగ డగ’ అని కొట్టుకుంటుంది. అందుకే అమ్మేద్దాం అనుకుంటున్నా. బై ద వే, నేను డ్రైవింగ్ చండాలంగా చేస్తా!

ఎన్నో దేశాలు తిరిగుంటారు కదా. ఏ దేశాన్ని ఎక్కువగా ఇష్టపడతారు?
రానా: ఇండియా అంటే ఇష్టం. తర్వాత అమెరికా ఇష్టం. అందులోనూ న్యూయార్క్ ఇంకా ఇష్టం. న్యూయార్క్ ఎందుకు ఇష్టమంటే... అక్కడ నేను ఏడాది పాటు పనిచేశా. అదొక మల్టీ కల్చరల్ సిటీ. అక్కడ అమెరికన్ ఫుడ్ ఎలా ఉంటుందో, థాయ్ ఫుడ్ కూడా అలాగే దొరుకుతుంది. ఎంత మంది ఇండియన్స్ ఉంటారో, అంత మంది కొరియన్సూ ఉంటారు. ఇంకా పలు దేశస్తులు అక్కడ నివసిస్తుంటారు. ఇన్ని నాగరికతలు కలిసి ఉండటం వల్ల, ప్రతి ఒక్కక్కరినుంచీ ఏదో ఒకటి నేర్చుకోవచ్చు.

కారు అద్దాల్లోంచి ప్రపంచాన్ని చూసే మీకు ఇంతటి పరిశీలనాత్మక దృష్టి ఎలా సాధ్యమైంది?
రానా: మొదట్నుంచీ తెలుసుకోవాలనే ఆరాటం... కొత్తగా ఏమైనా చేయాలనే ఉబలాటం... నా పరిణతికి అవే కారణం! కొత్త ప్రదేశాలను చూడటం కూడా ఇష్టపడతా. ముఖ్యంగా పుస్తకాలు ఇష్టంగా చదువుతా. అమరచిత్ర కథలంటే నాకు ప్రాణం. భాగవత, ఇతిహాసాల గూర్చిన ఎన్నో విషయాలు ఆ పుస్తకాలవల్లే నాకు తెలిశాయి. మీరు నమ్మండీ నమ్మకపోండీ.. రియల్ లైఫ్‌లో సగటు మనిషిగా జీవిస్తాన్నేను. నాకు స్టాఫ్ కూడా ఎక్కువ ఉండరు. నా కారు నేను డ్రైవ్ చేసుకుంటా. నా సామాన్లు నేనే మోసుకుంటా. షూటింగ్స్‌లో కారవాన్‌ను కూడా పెద్దగా వాడను. ఏ విషయాలనూ మరొకరితో షేర్ చేసుకోను. ఇక్కడ మీకో విషయం చెప్పాలి. ‘నా ఇష్టం’ షూటింగ్ మలేషియాలో జరుగుతోంది. నాకు మధ్యాహ్నం పూట భోంచేసి కాసేపు పడుకోవడం అలవాటు. మలేసియాలో ఎండ ఓ రేంజ్‌లో ఉంటుంది. అంత ఎండలో కుమారస్వామి గుడిముందు ఓ గట్టుపై కచ్చీప్‌ని మొహంపై వేసుకొని పడుకున్నా.. మధ్యలో ఎందుకో కళ్లు తెరిచి చూశా. ఇద్దరు వ్యక్తులు నా మొహానికి దగ్గరగా వచ్చి తీక్షణంగా చూస్తున్నారు. వారెవరో కాదు. అలీ, జెనీలియా. ‘నీ లైఫ్‌లో ఎప్పుడన్నా అనుకున్నావా... ఇలా గుడి మెట్లపై పడుకుంటావని’ అని అడిగాడు అలీ నవ్వుతూ. ఈ మాట ఎంత లోతైనదో నాకు తెలుసు. జెన్నీ అయితే.. ‘నీ గురించి పేపర్లలో తెగ రాసేస్తుంటారు. కానీ నువ్వేంటి, ఇంత నార్మల్‌గా ఉన్నావు’ అని ఆశ్చర్యపోయింది! అదీ నా లైఫ్ స్టైల్! ఎప్పటిలానే నాకు నచ్చినట్టు ఉంటా!
- సంభాషణ: బుర్రా నరసింహ

‘నీ లైఫ్‌లో ఎప్పుడన్నా అనుకున్నావా...ఇలా గుడి మెట్లపై పడుకుంటావని’ అని అడిగాడు అలీ నవ్వుతూ. ఈ మాట ఎంత లోతైనదో నాకు తెలుసు! జెనీలియా అయితే.. ‘నీ గురించి పేపర్లలో తెగ రాసేస్తుంటారు. కానీ నువ్వేంటి, ఇంత నార్మల్‌గా ఉన్నావు’ అని ఆశ్చర్యపోయింది!

 

Listings                                                                                                                                                 
Listings                                                                                                         Listings                                                                                                                                              
Listings                                                                                                                                                                                                       
1
Download e-paper
Sakshi Toolbar
%%CACHEBUSTER%%
Home |News |Business |Sports |Cinema |Blogs | Gallery
About Us

 
 
 
Icon    
 
Click Here to Share

kitchen tips

పాలను మరిగించేటప్పుడు గిన్నె అంచులకు నెయ్యి రాయాలి. ఇలా చేయడం వల్ల పాల పొంగు బయటకు రాకుండా ఉంటుంది.

కూరల్లో ఉప్పు ఎక్కువైతే టొమాటో కట్ చేసి వేసి వేయాలి. లేదా టీ స్పూన్ పంచదార వేయాలి. ఉప్పు తగ్గుతుంది.

ఉల్లిపాయలు తరిగేటప్పుడు కళ్లు మండకుండా ఉండాలంటే వాటి పై పొట్టు తీసి, ఫ్రిజ్‌లో పది నిమిషాలు ఉంచాలి.

గట్టిగా అయిన చపాతీలను శుభ్రమైన కాటన్ క్లాత్‌లో చుట్టి, ప్రెషర్ కుకర్‌లో పెట్టి, రెండు విజిల్స్ వచ్చాక దించితే మృదువుగా అవుతాయి.

నిమ్మకాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే వాటి పైన కొబ్బరినూనె రాసి, ఫ్రిజ్‌లో ఉంచాలి.

పచ్చడి లేని భోజనం... చేవ చచ్చిన జీవితం సేమ్ టు సేమ్. మనిషన్నాక కాస్త ఉప్పూకారం తగలాలి. చింతకాయ... మిరపకాయ కలిపి నూరిన కారం నషాళానికి అంటాలి. సిట్యుయేషన్‌ను ఢీ కొట్టాలంటే పచ్చడికి మించిన ఉత్ప్రేరకం లేదు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్... దేనిలోనైనా సరే పచ్చడే విన్నర్. తెలుగువారు కోరుకునే పచ్చళ్లు ఇవి. లొట్టలకు తెరిచే వాకిళ్లు ఇవి.
కొబ్బరి పచ్చడి

కావలసినవి
పచ్చికొబ్బరి తురుము - కప్పు, పచ్చిమిర్చి - 2 (కట్ చేయాలి), పుట్నాలపప్పు - టేబుల్ స్పూన్ (వేయించాలి), పెరుగు - అర కప్పు, ఉప్పు - తగినంత

పోపుకోసం...
జీలకర్ర - పావు టీ స్పూన్, ఆవాలు - టీ స్పూన్, మినప్పప్పు - టేబుల్ స్పూన్, ఎండుమిర్చి - 2, కరివేపాకు - రెమ్మ, నూనె - 2 టేబుల్ స్పూన్లు

తయారి
పుట్నాలపప్పును గ్రైండ్ చేసి, అందులో కొబ్బరి తురుము, పెరుగు, తగినంత ఉప్పు వేసి, పేస్ట్‌లా చేయాలి. (పలచగా ఉండటానికి తగినన్ని నీళ్లు కలుపుకోవచ్చు). స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి, వేయించాలి. ఈ పోపును కొబ్బరి మిశ్రమంలో కలపాలి. ఇలా తయారుచేసుకున్న కొబ్బరి పచ్చడి ఇడ్లీ, దోసె, ఊతప్పంలలోకి రుచిగా ఉంటుంది.

పెసరపప్పు పచ్చడి

కావలసినవి:
పెసరపప్పు - కప్పు
ఎండుమిర్చి - 7
పచ్చిమిర్చి - 4
జీలకర్ర - అర టీ స్పూన్
ఇంగువ - చిటికెడు
ఉప్పు - తగినంత

పోపుకోసం... నూనె - టీ స్పూన్
ఆవాలు - టీ స్పూన్
శనగపప్పు - టీ స్పూన్
మినప్పప్పు - టీ స్పూన్

తయారి
తగినన్ని నీళ్లు పోసి పెసరపప్పును మూడు గంటల సేపు నానబెట్టాలి. నీళ్లను వడకట్టి ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా అవడానికి కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు. దీంట్లో జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసి మళ్లీ ఒకసారి గ్రైండ్ చేయాలి. స్టౌ పై కడాయి పెట్టి, నూనె కాగాక ఇంగువ, శనగపప్పు, మినప్పప్పు వేసి కొద్దిగా వేగాక, ఆవాలు వేసి చిటపట మనిపించి దించేయాలి. ఈ పోపును పెసరపప్పు పచ్చడిలో కలపాలి.

టొమాటో పచ్చడి

కావలసినవి:
టొమాటోలు - 4 (ముక్కలు చేయాలి) వెల్లుల్లి రెబ్బలు - 8, ఉల్లికాడలు (తెల్లని భాగం మాత్రమే తరగాలి) - పావు కప్పు ఉల్లికాడలు (పచ్చని భాగం తరగాలి) - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 2 (నీళ్లలో నానబెట్టాలి), కొత్తిమీర తరుగు - టేబుల్ స్పూన్, ఉప్పు - రుచికి తగినంత

పోపుకోసం...
నూనె - టీ స్పూన్, ఆవాలు, జీలకర్ర - అర టీ స్పూన్ చొప్పున, ఎండుమిర్చి - 2,
మినప్పప్పు - టీ స్పూన్,
కరివేపాకు - రెమ్మ
తయారి: నీళ్లలో నుంచి తీసిన ఎండుమిర్చిని సన్నగా తరగాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె వేసి, వేడయ్యాక తెల్ల ఉల్లికాడలు, పచ్చ ఉల్లికాడలు, వెల్లుల్లి రెబ్బలు వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాలు వేయించాలి. దీంట్లో ఎండుమిర్చి, ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి 10 నిమిషాలు ఉడికించాలి. గరిటెతో టొమాటోలను బాగా చిదమాలి. చల్లారిన తర్వాత, మెత్తగా నూరుకోవాలి. స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి, వేయించాలి. ఈ పోపును టొమాటో పచ్చడిలో కలపాలి.

పుదీనా - కొత్తిమీర పచ్చడి

కావలసినవి:
పుదీనా - కట్ట
కొత్తిమీర - కట్ట
వెల్లుల్లి రెబ్బలు - 5
అల్లం - చిన్నముక్క
పచ్చిమిర్చి - 2
పంచదార - టీ స్పూన్
ఉప్పు - అర టీ స్పూన్
నిమ్మరసం - 2 టీ స్పూన్లు

తయారి:
కొత్తిమీరను కట్‌చేసి పక్కన ఉంచుకోవాలి. పుదీనా ఆకులను వేరు చేసి పెట్టుకోవాలి. రెండింటినీ నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలి. కొత్తిమీర, పుదీనా, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, పంచదార, ఉప్పు కలిపి మెత్తగా నూరుకుని, నిమ్మరసం కలపాలి. స్టౌ మీద పాన్ పెట్టి, నూనె కాగాక ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, మినప్పప్పు వేసి వేయించాలి. ఈ పోపును పుదీనా, కొత్తిమీర మిశ్రమంలో కలపాలి. (ఈ పచ్చడిని పలచగా కావాలంటే కొద్దిగా నీళ్లు కలుపుకోవచ్చు) ఈ పచ్చడి ఇడ్లీ, దోసె, వడలలోకి రుచిగా ఉంచింతపండు పచ్చడి
కావలసినవి:
చింతపండు - 200 గ్రా.
బెల్లం - 300 గ్రా. (తరగాలి)
జీలకర్ర పొడి - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
నల్ల ఉప్పు - టీ స్పూన్
గరం మసాలా - టీ స్పూన్

తయారి:
ఒక గిన్నెలో ఐదు కప్పుల నీళ్లు పోసి, అందులో చింతపండు వేసి, స్టౌ మీద పెట్టి సన్నని మంట మీద పది నిమిషాలు ఉడికించాలి. దాంట్లో బెల్లం, కారం, జీలకర్రపొడి, ఉప్పు, గరంమసాలా వేసి కలపాలి. బెల్లం పూర్తిగా కరిగి, చిక్కటి మిశ్రమంలా అయ్యేవరకు ఉంచి, దించాలి. చల్లారిన తర్వాత సర్వ్ చేయాలిటుంది.


 

hair tip

టేబుల్ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్‌ను నాలుగు కప్పుల నీళ్లలో కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి, తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు కండిషనర్‌గా ఉపయోగపడి, శిరోజాలు మృదువుగా అవుతాయి
టొమాటోలు ఎక్కువగా ఉండి, పండిపోతుంటే వాటిని మిక్సీ పట్టి, ఐస్‌ట్రేలో పోసి, డీప్ ఫ్రిజ్‌లో పెట్టాలి. అవసరమైనప్పుడు టొమాటో క్యూబ్స్‌ను సూప్ లేదా కూరల్లో గ్రేవీ కోసం ఉపయోగించుకోవచ్చు

irregular periods

నా వయసు 27. పెళ్లయి రెండేళ్లవుతోంది. ఇప్పటి వరకు పిల్లల కోసం ప్లానింగ్ చేసుకోలేదు. బర్త్ కంట్రోల్ పిల్స్ కాకుండా కండోమ్స్ వాడుతున్నాం. మూడు నాలుగేళ్లుగా పీరియడ్స్ క్రమం తప్పుతున్నాయి. డాక్టర్ని సంప్రదించి హార్మోన్ ట్యాబ్లెట్స్ మూడు నెలల పాటు వాడాను. పీరియడ్స్ మాత్రం రెండు, మూడు నెలలకు ఓసారి వస్తున్నాయి. బ్లీడింగ్ చాలా ఎక్కువగా అవుతోంది. మొదటి రోజున రక్తస్రావం గడ్డలుగా అవుతోంది. ఎందుకిలా? తెలియజేయగలరు.
- కె. రాజీ, సూర్యాపేట

పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా రావడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. తరచూ కనిపించే కారణాలలో కొన్నింటిని చూద్దాం.

మొదటిది : హార్మోన్ల ప్రభావం వల్ల కలిగే సమస్యలు. పీరియడ్స్ సక్రమంగా రావడానికి థైరాయిడ్, ప్రొలాక్టిన్, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టరాన్, ఎఫ్.ఎస్.హెచ్, ఎల్.హెచ్, టెస్టోస్టిరాన్ వంటి ఎన్నో హార్మోన్లు దోహదపడతాయి. ఈ హార్మోన్లలో ఏదైనా హెచ్చుతగ్గులు కలిగినా, లేక వీటి నిష్పత్తిలో తేడా వచ్చినా పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తాయి.

రెండో అంశం: గర్భసంచి, ఓవరీస్‌కు సంబంధించిన సమస్యలు. పుట్టుకతోనే యూటెరస్, ఓవరీస్ సరిగ్గా ఎదగకపోవడం, జన్యుపరమైన లోపాలు ఉండటం, ఓవరీలో సిస్టులు లేక గడ్డలు వంటివి, యూటెరస్‌లో ఎండిమెట్రియోసిస్ వంటి సమస్యలు, యూటెరస్ ఆకృతి, పనితీరుకు సంబంధించిన సమస్యలన్నీ పీరీయడ్స్‌పై ప్రభావం చూపుతాయి.

మూడు: వయసుకు సంబంధించిన సమస్యలు. యుక్తవయసులో ఓవరీస్ పరిపక్వత చెందకపోవడం వల్ల, నలభై ఏళ్లు దాటిన స్త్రీలలో ఓవరీ పనీతీరు తగ్గిపోవడం వల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులర్‌గా వస్తాయి.

నాలుగు: శారీరక శ్రమ లోపించిన జీవనశైలి, ఊబకాయం వల్ల కలిగే సమస్యలు మొదలైనవి. అన్ని వసతులు కలిగిన ఈ ఆధునిక యుగంలో ఏ మాత్రం శ్రమ లేకుండా మిషిన్ల ద్వారా అన్ని పనులూ జరిగిపోతున్నందున మనం తీసుకునే ఆహారానికి పడే శ్రమకు మధ్య పొంతన లేకుండా పోతోంది. దీని వల్ల రకరకాల హార్మోన్ల సమస్యలు, ఊబకాయం వంటివి వస్తున్నాయి.అవి ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కి కారణం అవుతున్నాయ.

ఐదు: సొంతవైద్యం. మందులు, అవి కలిగించే ప్రభావంపై ఏమాత్రం అవగాహన లేని వైద్యుల సలహాపై హార్మోన్ మాత్రలను ఎప్పుడంటే అప్పుడు, ఎన్నిపడితే అన్ని తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ సక్రమంగా రాకపోవచ్చు. ఇక మీ విషయంలో సరైన పరీక్షల ద్వారా ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు కారణం కనుక్కోండి. దాన్ని బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. ఇక మీ పీరియడ్స్ క్రమబద్ధమైపోయాక స్వాభావికంగానే మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం చాలావరకు ఉంటుంది.
 

winter skin care

నా వయసు 42. ఈ మధ్య చర్మం ముడతలు పడటం గమనిస్తున్నాను. చలికాలంలో ఈ సమస్య మరీ ఎక్కువ. ముడతల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయండి.
- ఆర్.ఎస్.సూర్యప్రభ, వనస్థలిపురం

చలికాలం పిల్లల చర్మం కూడా ముడతలు పడటం గమనిస్తుంటాం. తాగే నీరు, తీసుకునే ఆహారాన్ని బట్టి చర్మం పొడిబారుతుంది. పొడి చర్మం గలవారికి చలికాలం ఈ సమస్య మరీ ఎక్కువ. ఒక ఏడాది చలికాలంలో చర్మ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోకపోతే ఐదేళ్లు వయసు పై బడినట్టుగా కనిపించే అవకాశాలు ఎక్కువ. చర్మం పొడిబారుతుంది కదా అని నూనెలు, మాయిశ్చరైజర్లు ఎక్కువగా రాసేస్తుంటారు. తర్వాత సబ్బులు, స్క్రబ్‌లతో చర్మాన్ని బాగా తోముతుంటారు. ఫలితంగా చర్మం మండుతుంటుంది.

ర్యాష్ కూడా వస్తుంటుంది. పైగా విపరీతమైన ఆవిరి పడుతుంటారు. దీంతో పోర్స్ ఓపెన్ అయి, చర్మం సాగుతుంది. ఆవిరి వల్ల లాభం తక్కువ, నష్టం ఎక్కువ అని గ్రహించాలి. ఇక ఈ కాలం చర్మానికి స్క్రబ్ కూడా ఎక్కువ చేస్తుంటారు. వీటన్నింటి వల్ల చర్మం ఇంకా డల్‌గా, డ్రైగా అయిపోతుంది. మీ ముఖ చర్మం ముడతలు తగ్గాలంటే సరైన మార్గం ఫేస్ ఎక్సర్‌సైజ్‌లు. నుదురు, బుగ్గలు, కళ్లు, గడ్డం.. ఇలా ఒక్కో పార్ట్‌ని సాగదీస్తూ 5-10 నిమిషాలు ఫేస్ ఎక్సర్‌సైజులు చేయాలి. ఆరోమ ఎసెన్షియల్ ఆయిల్స్ మాత్రమే రాయాలి. ఇవి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి.

సహజంగా చర్మంలో నీటిశాతం ఉంటుంది. చలికాలం తక్కువ నీళ్లు తాగడం వల్ల చర్మంలో నీటి శాతం తగ్గిపోతుంది. దీని వల్ల చర్మం ఇంకా పొడిబారుతుంది. అందుకని రోజూ మూడు లీటర్ల మంచినీళ్లు తాగండి. శరీరంలో ఉండే మెకానిజమ్ కాలాలను తట్టుకునే శక్తి ఉంటుంది. కాలానుగుణంగా సమతుల ఆహారం తీసుకుంటే చర్మం పొడిబారడం సమస్య ఉండదు.

beauty tip

రెండు టేబుల్ స్పూన్ల కార్న్‌ఫ్లోర్‌లో రెండు టీ స్పూన్ల బాదంనూనె, కొద్దిగా నిమ్మరసం, తగినంత రోజ్‌వాటర్ కలపాలి. ఈ మిశ్రమంతో ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రపరచుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తుంటే చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది

shoping tips

షాపింగ్‌కి వెళ్ళి ఆఫర్ ఉన్నది కొనడం కాకుండా, మీరు ఏమి కావాలనుకుంటున్నారో ఇంటివద్దనే జాబితా తయారు చేసుకోండి. దీనివలన మీకు సమయంతో పాటు నగదు కూడా పొదుపు అవుతుంది.

అప్పుడే షాపింగ్ పూర్తి చేసుకొచ్చిన నీరజ నీరసంగా సోఫాలో కూర్చొంది. షాపింగ్ కోసం తిరిగిన నీరసానికి తోడు... బిల్లు చూసి భర్త నిరంజన్ ఏమంటారోనన్న ఆందోళన మరోవైపు. వివిధ కంపెనీలు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇస్తుండటంతో బిల్లు గురించి పట్టించుకోకుండా ఖర్చు పెట్టేసింది. ఇలా ఆఫర్ల మోజులో పడి కొనేవారు మనకు తరచుగా కనిపిస్తూనే ఉంటారు. వ్యాపార సంస్థలు వినియోగదారులను ఆకర్షించడానికి అనేక ఆఫర్లు, ప్రకటనలతో హోరెత్తిస్తారు. ఈ వ్యాపార సంస్థల వలలో పడకుండా, మీ బడ్జెట్‌లోనే కావల్సిన వస్తువులను కొనుగోలు చేయడం ఎలానో ఇప్పుడు చూద్దాం...

లిస్ట్ తయారుచేసుకోండి...
షాపింగ్‌కి వెళ్ళి ఆఫర్ ఉన్నది కొనడం కాకుండా, మీరు ఏమి కావాలనుకుంటున్నారో ఇంటివద్దనే జాబితా తయారు చేసుకోండి. దీనివలన మీకు సమయంతో పాటు నగదు కూడా పొదుపు అవుతుంది. అనవసర వస్తువులు కొనుగోళ్లకు దూరంగా ఉండగలుగుతారు. ఒకసారి మీ లిస్ట్ అయిన తర్వాత ఈ వస్తువులు ఎక్కడ తక్కువకు లభిస్తాయన్నది పరిశీలించండి. ఇందుకోసం ఆన్‌లైన్ లేదా వివిధ పేపర్లలో కంపెనీలు ఇస్తున్న ప్రకటనలు, ఇరుగుపొరుగువారి సమాచారంపై ఆధారపడొచ్చు. సాధారణంగా చాలా సంస్థలు పండగల సందర్భంగా వివిధ ఆఫర్లను ప్రకటిస్తాయి. ఇలాంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి. కొనే ముందు ఆ వస్తువు తయారయిన సమయం, ఎక్స్‌పైరీ డేట్‌ను తప్పక పరిశీలించండి. ఇలాంటి ఆఫర్లలో ఎక్స్‌పైరీ డేట్‌కు దగ్గరగా ఉన్న వస్తువులను వదిలించుకునే పనిచేస్తుంటాయి. ఇప్పుడు ఇటువంటి ఆఫర్లు మనకు సంవత్సరం పొడుగునా కనిపిస్తూనే ఉంటున్నాయి. కాబట్టి ఈ ఆఫర్ మిస్ అయితే మళ్ళీ మనకు ఇటువంటి అవకాశం రాదన్న ఆందోళన అవసరం ఉమ్మడిగా అయితే బెటర్: పండుగల సమయంలోనైతే ఆఫీసులోని సహద్యోగులు లేదా ఇరుగుపొరుగు వారు నలుగురైదుగురు కలిసి బల్క్‌లో తీసుకోవడం మంచిది.

కార్డులు ఉపయోగించండి:షాపింగ్‌లకు జరిపే లావాదేవీలన్నీ నగదు కంటే మీ దగ్గర ఉన్న క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డులను ఉపయోగించడం వలన అదనపు ప్రయోజనం లభిస్తుంది. పండగల సమయంలోనైతే కార్డుల ద్వారా చేసే షాపింగ్‌లపై బ్యాంకులు అదనపు రివార్డు పాయింట్లను అందిస్తుంటాయి. ఈ రివార్డు పాయింట్ల ద్వారా మీరు గిఫ్ట్ వోచర్లను పొందవచ్చు.



అర్శమొలలు (పైల్స్ లేదా హెమరాయిడ్స్) అంటే మలద్వారం వద్ద ఉన్న కణజాలం ఉబ్బిపోవడం. ఇది సాధారణంగా పెద్దవాళ్లలో కనిపిస్తుంది.


పైల్స్ అంటే : మలాశయాన్ని, మలద్వారాన్ని కలిపే ప్రదేశాన్ని యానల్ కుషన్ అంటారు. ఆ యానల్‌కుషన్‌లోని కణజాలం గుండ్రంగా ఉబ్బి ద్రాక్షపండ్లలా తయారవుతాయి. ఆ కండిషన్‌ను పైల్స్ అంటారు.

లక్షణాలు
మలద్వారం నుంచి రక్తస్రావం అవుతుంటుంది.

మలద్వారం వద్ద గడ్డ

మలవిసర్జన సమయంలో నొప్పి, బాధ

మలద్వారం నుంచి శ్లేషం బయటకు వచ్చి దురద కలిగిస్తుంది

మలవిసర్జన సంతృప్తికరంగా ఉండదు.

కారణాలు : పైల్స్ రావడానికి కారణాలు ఇదమిత్థంగా తెలియదు. అయితే యానల్‌కుషన్స్... ఇంకా దానికింద ఉండే కండరాలు బలహీనం కావడం ఒక కారణమని చెప్పవచ్చు. ఈ బలహీనత వల్ల యానల్ కుషన్స్ కిందికి జారతాయి.

ఈ కింది అంశాలు పైల్స్ వచ్చేందుకు దోహదపడతాయి.
మలబద్దకం ( మలవిసర్జన కోసం ఎక్కువగా కష్టపడటం, ముక్కడం)

పీచుపదార్థాలు తక్కువగా తీసుకోవడం

ఎక్కువ రోజులు విరేచనాలతో బాధపడటం

గర్భవతుల్లో హార్మోన్ల వల్ల రక్తనాళాల మీద ఒత్తిడి పడటం, ఇంకా పొట్టలో శిశువు బరువు పెరగడం

కుటుంబంలోని పెద్దవారిలో పైల్స్ ఉండటం

పొట్టలో క్యాన్సర్ లేదా ఏవైనా గడ్డలు పెరగడం వల్ల లేదా ఒత్తిడి పెరగడం వల్ల.

గుర్తించడం ఎలా :
లక్షణాల ద్వారా, అనంతరం పరీక్షల ద్వారా

మెడికల్ హిస్టరీని బట్టి

ప్రాక్టోస్కోప్‌తో పరీక్ష చేసి

సిగ్మాయిడోస్కోప్ ద్వారా పెద్దపేగు మొత్తం చూడటం ద్వారా

కొలనోస్కోపీ... అంటే సన్నటి గొట్టంతో పెద్దపేగును చూడటం ద్వారా

నివారణ, చికిత్స:
రోజూ మలవిసర్జన సులువుగా అయ్యేలా చూసుకోవడం. దీనికి చేయాల్సిందల్లా ఆహారంలో పీచుపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడమే. అంటే మనం తినే ఆహారపదార్థాల్లో తాజా పండ్లు, కూరగాయలు, ముడిబియ్యం, పొట్టుతీయని గోధుమలు ఎక్కువగా తీసుకోవడం, నీళ్లు ఎక్కువగా తాగడం. లక్షణాలను బట్టి యాసిడ్‌నైట్రికమ్, నక్స్‌వామికా, సల్ఫర్ లాంటి అనేక మందులు వాడవలసి ఉంటుంది.

- డాక్టర్ ఎం. శ్రీకాంత్
సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్

More Headlines

                                                                       Listings                                                                                                                    
Listings                                                                                                                                                                                 
Listings                                                                                                                                                                                                       
                                                                      
Download e-paper
Sakshi Toolbar
%%CACHEBUSTER%%
Home |News |Business |Sports |Cinema |Blogs

beauty tip

అందమె ఆనందం
పెసరపిండిలో కొద్దిగా పచ్చిపాలు కలిపి పేస్ట్ చేసి ముఖానికి ప్యాక్ వేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా తయారవుతుంది

beauty tip


అందమె ఆనందం
చలికాలంలో రోజూ తలస్నానం చేయడం వల్ల మాడు పై చర్మం పొడిబారి వెంట్రుకలు చిట్లడం, రాలడం వంటి సమస్యలు తలెత్తుతాయి. తలస్నానం చేశాక కండిషనర్‌ని వాడాలి. జుట్టును ఆరబెట్టడానికి డ్రయ్యర్‌ని ఉపయోగించకూడదు.