గుడ్డును హిందీలో ‘అండ’ అంటారని మనందరికీ తెలుసు.
తెలుగులో ‘అండ’ అంటే ఆదరవు అని కూడా మనకు బాగా తెలుసు.
మనకు ఇంకా బాగా తెలియాల్సిన విషయం ఏంటంటే...
‘అండ’ అలియాస్ ‘గుడ్డు’ అలియాస్ ‘ఎగ్’
మన ఆరోగ్యానికి ఎప్పుడూ అండ దండగా ఉంటుంది.
అంతేనా!
బోలెడు టే స్ట్‌ను కూడా టైమ్ వేస్ట్ కాకుండా ఇచ్చేస్తుంది.
ఈ రోజే వేడి వేడిగా ఇలా వండండి అలా వడ్డించండి.
వెరీ గుడ్డు అనిపించుకోండి. థాయ్ పంప్‌కిన్ కస్టర్డ్ కావలసినవి చిన్న గుమ్మడికాయ - 1
కొబ్బరి పాలు - 1
గుడ్లు - 4
బెల్లం తరుగు - కప్పు
ఉప్పు - అర టీ స్పూన్
వెనీలా ఎసెన్స్ - టీ స్పూన్
తయారి గుమ్మడికాయ పైన తొడిమ దగ్గర గుండ్రంగా కట్ చేసి, స్పూన్‌తో లోపలి గింజలను తీసేయాలి.
ఒక గిన్నెలో గుడ్లలోని సొన వేసి, బాగా గిలకొట్టాలి.
గుడ్ల మిశ్రమంలో కొబ్బరిపాలు పోసి, కలపాలి. దీంట్లోనే పంచదార, ఉప్పు, వెనిల్లా ఎసెన్స్ వేసి కలపాలి.
ఈ మిశ్రమాన్ని గుమ్మడికాయలో పోయాలి. ఆవిరి మీద 45 నిమిషాలు ఉడికించి, తీయాలి.
సర్వ్ చేసేముందు కట్ చేసి, నచ్చిన పండ్లతో గార్నిష్ చేసుకోవాలి.
పుడ్డింగ్ కావలసినవి గుడ్లు - 6, పంచదార - 6 టీ స్పూన్లు
ఏలకుల పొడి - టీ స్పూన్
చిక్కనిపాలు - గ్లాసు
తయారి గిన్నెలో గుడ్లలోని సొన వేసి బాగా గిలకొట్టాలి.
దీంట్లో పంచదార, ఏలకుల పొడి వేసి బాగా కాలిపి ఒక టిఫిన్ బాక్స్‌లో పోసి మూత పెట్టాలి.
మరో పెద్ద గిన్నెలో అడుగున నీళ్లు పోసి, స్టౌ మీద పెట్టి మరిగించాలి. మరుగుతున్న నీళ్ల మీద టిఫిన్ బాక్స్‌ను పెట్టి, స్టౌ సిమ్ చేయాలి.
పదినిమిషాల సేపు ఉడికిన తర్వాత బయటకు తీయాలి. మూత తీసి ప్లేట్‌లోకి బోర్లించాలి.
మృదువుగా తయారైన పుడ్డింగ్ మీద నచ్చిన గార్నిష్ చేసుకోవాలి.
జుగల్‌బందీ కావలసినవి ఉడికించిన పచ్చ బఠాణీలు - అర కప్పు
ఉడికించిన క్యారెట్ ముక్కలు - అర కప్పు
ఉడికించిన గుడ్ల ముక్కలు (తెల్లసొన) - కప్పు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్
కారం - కొద్దిగా
గ రం మసాలా - పావు టీ స్పూన్
మైదా - తగినంత
తయారి స్టౌ పై పాన్ పెట్టి, టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లిపేస్ట్, కారం, గరం మసాలా వేసి 5 నిమిషాలు వేయించాలి. దీంట్లో గుడ్ల ముక్కలను వేసి 2 నిమిషాలు వేయించాలి. ఈ మిశ్రమం చల్లారనివ్వాలి.
మైదాను ముద్దలా కలపాలి. అచ్చు పరికరంలో కొద్దిగా పిండి పెట్టి, వత్తి, కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. ఇవి చిన్న చిన్న కప్పుల మాదిరిగా వస్తాయి. వీటిలో గుడ్లముక్కలు అందంగా సర్దుకొని, తయారుచేసుకున్న పచ్చిబఠాణీల మిశ్రమం వేసి స్టఫ్ చే సి, సర్వ్ చేయాలి.
స్పినాచ్ అండ్ కాటేజ్ చీజ్ రౌల్డ్ కావలసినవి గుడ్లు - 4,
కాటేజ్ చీజ్ తరుగు - కప్పు
పాలు - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - పావు టీ స్పూన్
మిరియాలపొడి - పావు టీ స్పూన్
పాలకూర తరుగు - కప్పు
క్యాప్సికమ్ (రెడ్ అండ్ ఎల్లో) తరుగు - అర కప్పు
పాలమీగడ - ముప్పావు కప్పు
చీజ్ తరుగు - అర కప్పు
ఉప్పు, మిరియాల పొడి - రుచికి తగినంత
తయారి ముందుగా అవెన్‌ను 200 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడి చేసి, పాన్ అడుగున బటర్‌పేపర్ సెట్ చేయాలి.
గిన్నెలో గుడ్ల సొన, పాలు, ఉప్పు, మిరియాల పోడి వేసి కలపాలి. దీంట్లో కాటేజ్ చీజ్ తరుగు కలిపిన తర్వాత ఈ మిశ్రమాన్ని వేడెక్కిన పాన్‌లో పోసి 20 నిమిషాలు బేక్ చేయాలి.
స్టౌ పై మరొక పాన్ పెట్టి, టీ స్పూన్ నూనె వేసి, వెలుల్లి వేగిన తర్వాత క్యాప్సికమ్ తరుగు వేసి ఉడికించాలి. తర్వాత పాలకూర తరుగు వేసి కలపాలి. కూర ఉడికిన తర్వాత తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి కలపాలి. నీరంతా పోయే వరకు ఉడికించాలి.
అవెన్ నుంచి పాన్‌ను బయటకు తీసి పైనంతా పాలకూర, క్యాప్సికమ్ మిశ్రమాన్ని పరచాలి.
కావలసిన సైజులో పొడవుగా కట్ చేసి, చుట్టాలి.
ఇలా అన్నింటిని రోల్ చేసిన తర్వాత మరో పది నిమిషాలు అవెన్‌లో బేక్ చేసి, తీసి, సర్వ్ చేయాలి.
నిల్వ పచ్చడి కావలసినవి కోడిగుడ్లు - 12, కారం - పావు కేజీ, ఉప్పు - 200 గ్రా.
పసుపు - 2 టీ స్పూన్లు, మెంతులు - టీ స్పూన్
ఆవాలు - టీ స్పూన్, జీలకర్ర - టీ స్పూన్
ఎండుమిర్చి - 6, చింతపండు గుజ్జు - పావు కేజీ
నూనె - పావు కేజీ, వెల్లుల్లి - 2 పాయలు
తయారి కోడిగుడ్లను ఉడకబెట్టి, పై పొట్టు తీయాలి.
గుడ్లను నూనెలో వేయించి, పక్కన పెట్టాలి.
ఒక గిన్నెలో కారం, పసుపు, ఉప్పు, చింతపండు పేస్ట్, ఆవాలు, మెంతులు, పిండి, నూనె వేసి కలపాలి. దీనిలో గుడ్లు వేసి కలపాలి.
మిగిలిన నూనెను వేడి చేసి, ఎండుమిర్చి, జీలకర్ర ఆవాలు వేసి పోపు పెట్టాలి.
వెల్లుల్లి పాయల పొట్టు ఒలిచి, రెబ్బలను పచ్చడిపైన గార్నిష్ చేయాలి.
రసమలై కావలసినవి పాలు(వెన్నశాతం ఉన్నవి) - లీటరు
పాలపొడి - 2 కప్పులు
గుడ్డు - 1
పంచదార - 100 గ్రా.
బాదం, జీడిపప్పు, కిస్‌మిస్ - గార్నిష్ కోసం తగినన్ని
తయారి ఒక వెడల్పాటి గిన్నెలో పాలు పోసి, అర లీటర్ అయ్యేంతవరకు సన్నని సెగ మీద మరిగించాలి.
మరొక గిన్నెలో గుడ్డు సొన వేసి, గిలకొట్టాలి. ఇందు లో పాల పొడి నెమ్మదిగా పోస్తూ బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు కట్టి, మరుగుతున్న పాలలో వేయాలి. కొన్ని నిమిషాలసేపు వేడి మీద ఉంచాలి.
మంట తీసేసి, చల్లారనివ్వాలి.
సర్వ్ చేసే ముందు వేయించిన బాదం, జీడిపప్పు, కిస్‌మిస్‌లతో గార్నిష్ చేయాలి.
చిట్కాలు గుడ్డు తాజాగా ఉన్నదా లేదా పరీక్షించడానికి నీళ్లలో వేసి చూడాలి. గుడ్డు అడుగు (వెడల్పాటి) భాగం నీళ్లలో ఉంటే తాజాగా ఉన్నదని నిర్ధారించుకోవాలి.
కోడిగుడ్డును తడిపాత్రలో పగలకొట్టి, వాడుకున్న తర్వాత శుభ్రపరచడం తేలికవుతుంది.
గుడ్డును ఉడికించేటప్పుడు కొద్దిగా ఉప్పు నీళ్లలో వేస్తే, త్వరగా ఉడుకుతుంది.
గుడ్డు ఉడికి, వేడిగా ఉన్నప్పుడే చల్లటి నీళ్లలో వే స్తే పై పెంకు త్వరగా వ స్తుంది. లోపలి పసుపు సొన రంగుమారకుండా ఉంటుంది.
ఉడకబెట్టిన గుడ్డు నిల్వ ఉండాలంటే చల్లటి నీటిలో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి.
ఆమ్లెట్ మృదువుగా, రుచిగా రావాలంటే గుడ్డు సొనను గిలకొట్టేటప్పుడు స్పూన్ పాలు కలపాలి.
పెనంపై వెన్నరాసి, వేడెక్కెక ఆమ్లెట్ వస్తే పెనానికి అంటుకోదు.
గుడ్డు వాడకుండా పుడ్డింగ్ చేయాలంటే గుడ్డుకు బదులుగా పాలు, జెలటిన్ కలుపుకోవచ్చు.
గుడ్డు చేజారి కిందపడి పగిలినప్పుడు దాని మీద ఉప్పు చల్లి, కొద్దిసేపు వదిలేయాలి. మిశ్రమం గట్టిపడ్డాక టిష్యూపేపర్ లేదా గుడ్డతో తీసేయాలి.ఆ తర్వాత కొద్దిగా వెనిగర్ చల్లి తడిగడ్డతో తుడవాలి. ఇలా చేస్తే దుర్వాసన రాదు.
No comments:
Post a Comment