వేసవిలో పుచ్చకాయ, కర్బూజా పండ్లను మార్కెట్లో రాసులుగా పోసి అమ్మటం సర్వసాధారణం. వాటి ధర కూడా సరసంగానే ఉంటోంది. ఈ రెండు పండ్ల నుండి తయారయిన షర్బతులు, పానీయాలు వేసవిలో సేదతీర్చటానికి, తాపోపశమానికి బాగా ఉపకరిస్తాయి. వీటి తయారీ గురించి, ఇంకా పుచ్చకాయ నుండి రసం తీసుకున్న తరువాత మిగిలిపోయే డొప్పలు లేక పెచ్చుల నుండి రుచికరమైన స్వీట్ చట్నీ, మిక్స్‌డ్ ఫ్రూట్ చట్నీ తయారీ గురించి తెలుసుకుందాం. పుచ్చకాయ స్క్వాష్:- బాగా పక్వానికి వచ్చి లోపల చక్కని ఎరుపు రంగు వచ్చిన పండ్లను ఎంచుకోవాలి. - పై పెచ్చులు లేక డొప్పల నుండి స్వీట్ చట్నీ తయారీకి అనుగుణంగా పండ్లపైన చెక్కును ఆకుపచ్చ రంగు లేనంతవరకు తీసివేయాలి. - దాన్నుంచి రసం ఉన్న భాగాన్ని వేరుచేయాలి. - ఆ భాగాన్ని ముక్కలుగా కోసి మిక్సీలో ఆడించి గాని, గిన్నెలో వేసి గరిటెతో గాని పెద్ద చెంచాతో గాని బాగా కుదిపి స్టీలు వైరు జల్లెడలో వేసి రుద్ది రసం పట్టుకోవాలి. షర్బతు తయారీకి ఈ క్రింది పాళ్లలో అన్ని వస్తువులను సమకూర్చుకోవాలి. పుచ్చకాయ రసం -3కప్పులు నిమ్మరసం-ఒక కప్పు చక్కెర-4 కప్పులు మంచినీరు-రెండున్నర కప్పులు నిమ్మ ఉప్పు-5 గ్రా సోడియం బెంజోయెట్(లీటరు షర్బత్‌కు) -ఒక గ్రా. తయారుచేసే విధానం: ముందుగా నీటిని మరిగించి చక్కెరను కలిపి తయారయిన పాకాన్ని గుడ్డలో వడగట్టాలి. పాకంలో పుచ్చకాయ-నిమ్మపండ్ల రసాలను బాగా కలగలపాలి. నిమ్మ ఉప్పును, సోడియం బెంజోయేట్‌లను కొద్దిపాటి నీటిలో కరిగించి తయారైన షర్బతులో బాగా కలపాలి. శుభ్రమైన సీసాల్లోకి నింపి బిరడాలను గట్టిగా బిగించి భద్రపరచుకోవాలి. ఇలా తయారయిన షర్బతు ఆరునెలలకు పైగా నిల్వ ఉంటుంది. పుచ్చకాయ షర్బతును ఒక కప్పుకు మూడుకప్పుల చల్లని నీరు కలిపి సేవించవచ్చు. ఇక కర్బూజాపండ్లు సాధారణంగా తయారుచేసే స్క్వాష్‌ల కంటే ఫ్రూట్ నెక్టార్ అనే ఒక విశిష్టమయిన ప్రత్యేక పానీయం తయారుచేసుకోవడానికి బాగా అనువ్ఞగా ఉంటుంది. కర్బూజా పండ్ల నుండి నెక్టార్ చేసుకునే విధానం: బాగా మాగి మంచి సువాసన గల పండ్లను ఎంచుకోవాలి. పండ్ల చెక్కును, గింజలను తీసి మిక్సీలో వేసి గాని, ఇతరత్రా గాని రసాన్ని లేక గుజ్జును తయారుచేసుకోవాలి. ఈ క్రింది పాళ్లలో చక్కెర, నీరు వగైరాలను కలుపుకోవాలి. కర్బూజా పండ్ల రసం-మూడు కప్పులు చక్కెర-ఒకటిన్నర కప్పులు మంచినీరు-ఐదున్నర కప్పులు నిమ్మఉప్పు-3గ్రా సోడియం బెంజోయేట్-250మిల్లీగ్రా. తయారుచేసే విధానం: బాగా మరిగించిన నీటిలో పంచదార వేసి బాగా కరిగిన తరువాత వడగట్టాలి. పాకాన్ని పండ్ల గుజ్జుతో బాగా కలగలపాలి. ఇలా తయారయిన నెక్టారులో నిమ్మ ఉప్పును, సోడియం బెంజోయేట్‌ను కొద్దిపాటి నీటిలో కరిగించి బాగా కలగలపాలి. పానీయాన్ని బాగా చల్లబర్చి నేరుగా సేవించవచ్చు. నీరు కలిపే పనిలేదు. తయారయిన నెక్టారును శుభ్రమయిన సీసాల్లో నింపి మూతలను గట్టిగా బిగించి ఆరుమాసాలకు పైగా నిల్వ చేసుకోవచ్చు. పుచ్చ డొప్పల చట్నీకావలసినవి: పుచ్చకాయ ముక్కలు, గుజ్జు-2.5కిలోలు చక్కెర-2.5 కిలోలు ఉప్పు-100గ్రా అల్లం ముద్ద-12.5గ్రా. కారం -12.5గ్రా గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్-2.5 మిల్లీ లీటర్లు సోడియం బెంజోయేట్ -2.5గ్రా మీకు నచ్చిన మసాలా పొడి-తగినంత తయారుచేసే విధానం: ఆకుపచ్చ రంగు లేకుండా చెక్కు తీసిన పుచ్చకాయ డొప్పల నుండి రసం ఉన్న భాగాన్ని వేరు చేసిన తరువాత చిన్నచిన్న ముక్కలుగా చేయాలి. చట్నీకి అనువైన సైజులో ఉండేట్లు ముక్కలను కోసుకోవచ్చు. లేక మిక్సీలో వేసి కచ్చాపచ్చాగా నల్లగ్గొట్టి వాడొచ్చు. ఇలా తయారుచేసిన పదార్థానికి కిలోకి 100గ్రా. చొప్పున పుచ్చకాయ గుజ్జును చేర్చి స్వీట్ చట్నీ తయారుచేస్తే రంగు ఎరుపు తిరిగి కంటికి ఇంపుగా ఉంటుంది. చట్నీకి పాళ్లు ఈవిధంగా కలుపుకుంటే మంచిది. ముందుగా పండ్ల ముక్కలు గుజ్జును బాగా మెత్తగా ఉడికించాలి. మీకు నచ్చినమసాలా పొడిని తగినంత పాళ్లలో కారంతో గూడా కలిపి చట్నీలో వేసి మరికొంత సేపు ఉడికించాలి. ఇంచుమించు హల్వా పాకం వచ్చిన తరువాత గ్లేషియల్ ఎసిటిక్ యాసిడ్ వేసి పొయ్యి మీద దింపాలి. కొద్దిపాటి నీటిలో సోడియం బెంజోయేట్‌ను కరిగించి చట్నీలో బాగా కలగలపాలి. తయారయిన చట్నీని వెడల్పు మూతగల శుభ్రమైన సీసాల్లో నింపి గట్టిగా మూతలు బిగించి ఆరునెలలకు పైగా నిల్వ ఉంచుకోవచ్చు. ఈవిధంగా పుచ్చకాయ నుండి రసం గుజ్జు తీసుకున్న తరువాత మిగిలిపోయి పారవేసే డొప్పలు లేక పెచ్చులను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ డొప్పలు కాయ బరువులో సుమారు నాల్గవ వంతు నుండి మూడవ వంతు వరకు అంటే 25 నుండి 33శాతం ఉంటాయన్నది మనం గమనించాల్సిన ముఖ్య విషయం. ఒకవేళ చట్నీ గట్టిపడకుండా జారుగా ఉంటే మీరు కోరుకున్న గట్టిదనం వచ్చేందుకు సరిపడ అరటి లేక వేరే పండ్ల గుజ్జును కలుపుకోవచ్చు. ఈ చట్నీలోనే ఇతర పండ్ల ముక్కలను లేక తురుముగాని, గుజ్జుగాని కలుపుకుని మీకిష్టమైన విధంగా మిక్సెడ్ ఫ్రూట్ చట్నీని కూడా తయారుచేసుకోవచ్చు. పుచ్చకాయ స్వీట్ చట్నీకి సూచించిన ఫార్ములానే దీని తయారీలో కూడా ఉపయోగించవచ్చు. అయితే అన్ని రకాల పండ్ల ముక్కలు లేక గుజ్జును 2.5 కిలోలు ఉండేటట్లు చూసుకోవాలి. ముద్ద ఖర్జూరం, అంజూర, కిస్‌మిస్, బాదం, వగైరా పప్పులను చేర్చి మనోరంజకమైన ఇతర రకరకాల కదంబం చట్నీలను కూడా చేసుకుని ఆహ్లాదకరంగా సేవించవచ్చు. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Thursday, March 21, 2013
వేసవి చల్లదనానికి...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment