ఏ సీజన్లో అయినా కనిపించేవి, వెంటనే కొనాలని అనిపించేవి జామకాయలు.
పూర్వం ప్రతి ఇంట్లో ఓ జామచెట్టు తప్పనిసరిగా ఉండేది.
సాధారణంగా ఏ పండ్లూ ఇష్టపడని వాళ్ళు కూడా మరో ఆలోచన లేకుండా ఆరగించేది జామ.
మధుమేహం లాంటి వ్యాధిగ్రస్తులూ నిర్భయంగా తీసుకునేది జామ.
ఎక్కడబడితే అక్కడ దొరుకుతుంది కదా అని దీన్ని తక్కువగా తీసిపారేయాల్సిన పని లేదు.
నిజానికి జామలో ఉన్నన్ని సుగుణాలు మరే పండులోనూ కనిపించవు.
ఇది దోరగా జామ కొరికితే వచ్చే కమ్మదనం అంత నిజం! ఓ రకంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరికీ అందుబాటులో దొరికే పండు కూడా!
జామ పండ్లలో విటమిన్ సి బాగా దొరుకుతుంది. నమ్మడానికి కష్టంగా ఉన్నా కమలా ఫలాల కన్నా, జామ పండ్లలో 5 రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుందట. అంటే జామను నిమ్మ, ఉసిరి పండ్లకు సాటిగా చెప్పుకోవచ్చు.
కేవలం విటమిన్ సి మాత్రమే కాదు, జామలో విటమిన్ ఎ, బిలూ వున్నాయి.
క్యాల్షియమ్, ఫాస్ఫరస్, పొటాషియం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లాంటి పోషకాలకు జామపండ్లు పెట్టింది పేరు.
జీర్ణశక్తిని పెంపొందించే ఫైబర్‌కు స్థావరం జామ.
అవే కాకుండా స్త్రీలలో సర్వసాధారణంగా ఎదురయ్యే ఋతుస్రావ సమస్యలను దూరం చేస్తుంది.
రక్తపోటును నియంత్రిస్తుంది.
గుండె పనితనాన్ని మెరుగుపరుస్తుంది.
స్కర్వీవ్యాధిని దూరం చేయడంలో జామ పండ్లు ఎంతో శక్తిమంతమైనది.
కాస్తంత జలుబు వచ్చి, ముక్కు కారుతోందని అనగానే జామ పండ్లు తినరు కొందరు. కానీ, వైద్య శాస్త్ర విషయాలు తెలిసిన ఆహార నిపుణులు చెబుతున్నది ఏమిటంటే, జలుబుకు విరుగుడుగా జామ సమర్థంగా పనిచేస్తుందిట.
డయేరియా, డిసెంట్రీలకు జామ విరుగుడు అని వైద్య పరిశోధనలు చెబుతున్నాయి.
చర్మ సంరక్షణ పెంపొందించడంలో దీనికి ఇదే సాటి.
స్థూలకాయ బాధితులకు జామ పండ్లు తినడమే మంచి పరిష్కారం. జామకాయ తినడంతో సులువుగా కడుపు నిండి ఎక్కువ తినలేరు.
దానాదీనా చెప్పొచ్చేది ఏమిటంటే, మీ ఆహారంలో జామకూ సముచిత స్థానమివ్వండి. ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోండి.

No comments:
Post a Comment