గుణశేఖరుడు అనే గురువు వద్ద అనేకమంది శిష్యులు విద్య అభ్యసిస్తుండేవాళ్లు. శిక్షణ పూర్తయిన తర్వాత గురువు తన శిష్యులకు తగిన వృత్తిని సూచిస్తూండేవాడు. హితేంద్రుడు, జితేంద్రుడు అనే ఇద్దరు శిష్యులు చదువు పూర్తిచేసుకుని వెళ్లిపోతుండగా గురువు హితేంద్రుడిని పిలిచి ‘‘నీవు మాటలను నమ్ముకుంటే పైకి వస్తావు’’ అని చెప్పాడు. జితేంద్రుడితో ‘‘మౌనాన్ని నమ్ముకుంటే పైకి వస్తావు’’ అన్నాడు.
చాలా దూరం వచ్చిన తర్వాత హితేంద్రుడికీ, జితేంద్రుడికీ గురువు ఎవరిని మాటలను నమ్ముకోమన్నారు, ఎవరిని మౌనాన్ని నమ్ముకోమన్నారు అనే విషయంలో తికమక ఏర్పడి ఇద్దరూ వాదులాడుకున్నారు. చివరికి హితేంద్రుడు మౌనాన్ని, జితేంద్రుడు మాటలను నమ్ముకోవాలని గురువు చెప్పినట్లు భావించి ఎవరిదారిన వాళ్లు వెళ్లిపోయారు. హితేంద్రుడు ఒక పాఠశాలలో అధ్యాపకుడుగా చేరాడు. గురువు తనను మౌనాన్ని నమ్ముకోమన్నాడనుకుని అతను విద్యార్థులతో ఎక్కువగా మాట్లాడకపోవడంతో ఇతనికి ఏమీరాదనుకుని ఉద్యోగంలో నుంచి తీసివేశారు. జితేంద్రుడు ఒక జమీందారు వద్ద లెక్కలు రాయడానికి చేరాడు. గురువు తనను మాటలను నమ్ముకోమని చెప్పాడనుకుని అతను జమీందారుతో, నౌకర్లతో విపరీతంగా మాట్లాడుతుండటంతో లెక్కలన్నీ తప్పులు పోయేవి. దాంతో జమీందారు అతనిని పని నుండి తీసివేశాడు. ఎవరు ఏ పనిచేయాలో తెలియకపోవడం వల్ల ఇద్దరూ ఎదురుదెబ్బ తిన్నారు. |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Thursday, March 21, 2013
మాట - మౌనం..kids story
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment