మాత్రా-మంతీ
రక్తహీనత (అనీమియా) సమస్య తీవ్రంగా ఉన్నవారు తప్పనిసరిగా ఐరన్ టాబ్లెట్లు వాడాలి. అలాగే గర్భవతులకు ఐరన్, ఫోలిక్‌యాసిడ్, విటమిన్ బి12 మాత్రలను ఇస్తుంటారు. రక్తహీనత రోగులు ఐరన్ మాత్రలు వాడుతున్నప్పుడు కొన్ని దుష్ర్పభావాలు కనిపిస్తుంటాయి. ఉదాహరణకు కొంతమందిలో ఐరన్ మాత్రల వల్ల వికారం, వాంతులు ఉండవచ్చు. అలాంటప్పుడు మాత్రల మోతాదును గాని లేదా మాత్రలను మార్చాల్సి ఉంటుంది. ఐరన్ మాత్రల వల్ల మలం నల్లగా వస్తుంది. ఇది చాలామందిలో ఇది ఆందోళనగొలుపుతుంది. అయితే దీనికి భయపడాల్సిందేమీ ఉండదు. ఐరన్ మాత్రల వల్ల అలా జరుగుతోందని గ్రహించి నిశ్చింతగా ఉంటే చాలు.
వయాగ్రాతో మరో మేలు...! అంగస్తంభన లోపంతో బాధపడే వారికి వయాగ్రా మంచి ఔషధంగా ప్రపంచ ప్రతీతి పొందింది. అయితే ఒక ప్రధాన ప్రయోజనం కోసం దీన్ని వాడితో పనిలోపనిగా మరో అదనపు ప్రయోజనమూ కలుగుతోందని చెబుతున్నారు డెట్రాయిట్‌లోని హెన్రీఫోర్డ్ హాస్పిటల్‌కు చెందిన పరిశోధకులు. రక్తనాళాలు విశాలమయ్యేలా చేసే వయాగ్రా ప్రభావంతో మెదడుకు కూడా రక్తప్రభావం అధికమవుతుందట. దాంతో కొన్నిసార్లు మెదడులో దెబ్బతిన్న కణాలు పునరుజ్జీవం పొందే అవకాశాలు ఎక్కువట. అయితే వయాగ్రా వాడినప్పుడు రక్తం వేగంగా పరుగెత్తేలా చేసే గుణం వల్ల తాత్కాలికంగా కళ్లకు రక్తసరఫరా చేసేందుకు ఉపయోగపడే కోరాయిడ్ పొరలకు రక్తప్రసరణ తగ్గుతుందట. దాంతో తాత్కాలికంగా కలర్‌బ్లైండ్‌నెస్ వచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి వయాగ్రా వాడాక 12 గంటల పాటు డ్రైవింగ్ చేయకపోవడం మంచిదని సెలవిస్తున్నారు ఆ పరిశోధకులు. |
No comments:
Post a Comment