all

Wednesday, December 26, 2012

ఎంత ధైర్యం!-స్పందన

 
 



ఎదుటివారిని హింసించే అధికారం ఏ ఒక్కరికీ లేదని చాటి చెప్పాలి! 
ఆరుగురు పురుషులు ఒక యువతిని మానభంగం చేసిన ఈ ఘటన పాశవికమైన అమానుష చర్య. దీనికి మనం ప్రతిస్పందిస్తున్న తీరు కేవలం కొన్ని రోజులకు పరిమితమై చల్లబడిపోకూడదు. ఇలాంటి సంఘటనే రెండేళ్ల క్రితం జరిగింది... రాత్రి క్యాబ్‌లో ఇంటికి తిరిగి వస్తుండగా ఒక కాల్ సెంటర్ ఉద్యోగినిపై అత్యాచారం జరిగింది. ఇన్నాళ్లయినా ఆ కేసు ఇంకా కోర్టుకు చేరలేదంటే ఏం చెప్పాలి?

అంటే... ఏం జరిగినా, ఏం చేసినా, ఎవరూ ఏమీ చేయరనే, ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యమే ఈ అఘాయిత్యాలకు పాల్పడేవారిలో చోటు చేసుకుంటోంది. అందుకే ఇలాంటి దురాగతాలను, దుర్ఘటనలను, దౌర్జన్యాలను, దౌష్ట్యాలను జరగకుండా చూడాలి. అందుకోసం మనమంతా.. అంటే... నేతలు, మీడియా, మేధావులు, ఈ సంఘటనను నిరసించే సామాన్యులూ... అంతా ఏకమై, ఒక సమాజంగా, న్యాయం జరిగే వరకు పోరాడాలి. 

ఇలాంటి దౌర్జన్యాలు జరగకుండా మన సమాజాన్ని మనమే చైతన్యపరచుకోవాలి. టీచర్లు, తల్లిదండ్రులు, బంధువులు, అధికారులు... ప్రతి ఒక్కరం మనందరి హక్కుల కోసం పోరాడాలి. ఇతరులను ఏవిధంగానూ బాధించే, వేధించే అధికారం ఏ ఒక్కరికీ లేదని అందరికీ తెలపాలి. మనం రాసే వ్యాసాల్లో, మనం తీసే సినిమాల్లో, మనం చెప్పే పాఠాల్లో ఎదుటివారిని హింసించేందుకు, వారిని నొప్పించేందుకు అధికారం, హక్కు ఏ ఒక్కరికీ లేదని గట్టిగా చాటిచెప్పాలి.

డిసెంబర్ 16, 2012 - రాత్రి 9.30 గంటలకు...
దట్టంగా మంచు కురుస్తోంది. హాలీవుడ్ అద్భుతం... లెఫ్ ఆఫ్ పై. త్రీడీ మూవీ. కళ్లముందునుంచి ఆసినిమా గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. సౌత్ ఢిల్లీలోని మునిర్కా నుంచి ఆయువతి, స్పేహితుడితో కలిసి బయల్దేరింది. యూపీలోని బలియానుంచి ఇంటర్న్ షిప్ కోసం 23 ఏళ్ల ఆ యువతి ఢిల్లీ వచ్చింది. ఆదివారం కదా అని సరదాగా స్నేహితుడితో కలిసి సినిమాకు వెళ్లింది. ఇద్దరూ పాలం చేరాలి. బస్ స్టాపులో ఆగారు. అంతలోనే బస్ వచ్చింది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ బస్ ఎక్కారు. బస్సులో ఉన్నది కేవలం ఆరుగురే. డ్రైవర్‌తో కలిసి. రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లారో లేదో ... బస్సు రూటు మారింది. 

వెళ్లాల్సిన మార్గంలోకాకుండా.. మరో దారిన పోతున్నట్లు ఆ అబ్బాయి గుర్తుపట్టాడు. ఏదో కీడు శంకించాడు. బస్సులో ఉన్న డ్రైవర్ ను అడగడానికి ముందుకు వచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ. ఒక్కొక్కరుగా చుట్టుముట్టారు. వినలేని మాటలు.., వికృత చేష్టలు. ముందు మాటలు, ఆపై చేతులు. ఆధునిక దుశ్సాసన పర్వం అది. అడ్డుకునేందుకు ఆ అమ్మాయి స్నేహితుడు ప్రయత్నించాడు. ఆవేశంగా వారిపై విరుచుకుపడ్డారు. ఆ దుర్మార్గులకు తెలుసు... దేశానికి రాజధాని అయినా.... ఆడదాని మాన, ప్రాణాలకు రక్షణ లేదని.. ఉండదని. ఎన్ని చూడలేదు వారు... ఎన్ని వినలేదు. 

బస్సు ఆగింది. డ్రైవర్ రామన్ సింగ్ చేతిలోని ఇనపరాడ్డుతో తలపై కొట్టాడు. దెబ్బలకు తట్టుకోలేక ఆ అమ్మాయి స్నేహితుడు స్పృహ కోల్పోయాడు. ఉన్న చిన్న అడ్డు తొలగిపోయింది. చరిత్రలో ఏ ఆడదీ మరిచిపోలేని... దారుణ ఉదంతం మొదలైంది. 

బస్సు వెనుక భాగంలో డ్రైవర్ రామ్ సింగ్.. రావణుడై... ఆయువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బస్సు మళ్లీ నడవడం మొదలైంది. ఈలోపల ఒక్కొక్కరుగా ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. సాయంకోసం ఆమె ఆర్తనాదాలు ఏ ఒక్కరికీ వినిపించలేదు. వినిపించినా పట్టించుకోలేదో... ఇంత జరుగుతున్నా... బస్సు నడుస్తూనే ఉంది. ఆ చావుకేకలు, ఆ అమ్మాయి ఆక్రందనలు... డ్రైవర్‌కి సంగీతంలా వినిపించాయేమో.. ఎక్కడా ఆపలేదు. రాత్రి 9:45 నిమిషాలకు మొదలైన బస్సు... అలా అలా... ఢిల్లీరోడ్లపై ప్రయాణిస్తూనే ఉంది. ఆ అమ్మాయి అరణ్యరోదనలు వింటూ... దడదడ శబ్దంచేస్తూ... ముందుకు సాగిపోతూనే ఉంది. తర్వాత.. అదే ఇనుపరాడ్డుతో.. 45 నిమిషాలసేపు దారుణం. ఆ అమ్మాయిని కొడుతూనే ఉన్నారు. శరీరంలో ఎక్కడపడితే అక్కడ. 

పేగు తెగిపోయింది. కామాంధుల సరదా తీరిందేమో... రాత్రి 11 గంటల సమయంలో మహిపాల్ పూర్ ఫ్లై ఓవర్ సమీపంలో... ఢిల్లీ విమానాశ్రయానికి అతిదగ్గరగా నడుస్తున్న బస్సులోనుంచి రోడ్డుపైకి ఆ ఇద్దర్నీ విసిరేసారు దుర్మార్గులు. అదే రోడ్డుపై వెళ్తున్న సగటు మనిషి పోలీసుకు విషయం చేరవేశాడు. వెంటనే స్థానిక ఆస్పత్రిలో ఇద్దరినీ చేర్పించారు పోలీసులు . 

శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరిందామె. ఐదురోజులపాటు వెంటిలేటర్ పై పోరాటం చేసింది. ఎట్టకేలకు శ్వాస నిలిచింది. తనకు తానుగానే గాలిని పీల్చుకునే పరిస్థితి. స్పృహకూడా వచ్చింది. కాని పరిస్థితి మాత్రం ఇంకా విషమం. రాడ్డుతో కొట్టడంతో శరీరంలో చాలా భాగాలు కమిలిపోయాయి. చిన్నప్రేగు పూర్తిగా దెబ్బతింది. దీంతో రక్తం విషంలా మారింది. శరీరంలోని చాలా భాగాలకు ఆ విషం వ్యాపిస్తోంది. శరీరంలోని దాదాపు 600 సెంటీమీటర్ల చిన్న ప్రేగు ఎందుకూ పనికిరాదని దీన్ని వీలైనంత త్వరగా తొలగించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. 

అదే జరిగితే... తినే ఆహారం ఏదీ కూడా జీర్ణంకాదు... జీర్ణప్రక్రియ మొత్తం అస్తవ్యస్తం. ఇక జీవితాంతం... కృత్రిమ పద్ధతులపై బతకాల్సిందే. వైద్యులకు ఇదే పరీక్షే. ఉన్న ఒకేఒక్క అవకాశం. అవయవ మార్పిడి. బ్రెయిన డెడ్ అయిన లేదా బతికున్న మనిషి నుంచి చిన్న ప్రేగును సేకరించి దాన్ని బాధితురాలికి అమర్చాలి. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ప్రముఖ ఆస్పత్రులన్నీ ఈ ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చాయి. కాని చిన్న ప్రేగు సేకరణ వారికి పెద్ద సమస్య. కష్టపడి మార్పిడి చేసినా... జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. మందులతో బతకాలి.. మందులు తిని బతకాలి. మరి ఆమె ఏం తప్పు చేసిందని ఇంతటి శిక్ష అనుభవించాలి?

అమ్మాయిలూ నిగ్గదీయండి! 
‘ప్రతిఘటిస్తూ చెయ్యి కొరికింది అన్న కోపంతో ఇనుప రాడ్ ఆమె మర్మాంగంలోకి తోశాను...’ ఇది మొన్న ఢిల్లీ బస్ డ్రైవర్ చెప్పిన విషయం! ఫలితం... మన డాక్టర్ల భాషలో- ఛిన్నాభిన్నమైపోయిన ఆ పేగులకైన తీవ్ర గాయం... వైద్య చరిత్రలో కనీవినీ ఎరగని ఘట్టం! ఇంత దారుణం జరిగాక కూడా మనం అన్నం తినగలుగుతున్నాం... ఉద్యోగాలు చేసుకోగలుగుతున్నాం... క్లాసులకి వెళ్లగలుగుతున్నాం అంటే... మనం జాతిగా చచ్చిపోయినట్టు లెక్క! దీనికితోడు... ఇంత చేసిన రాక్షసులని ఏమీ చేయలేమేమో అన్న నిస్సహాయత! దీనికితోడు... ఆ టైంలో బయటికి వెళ్లకుండా ఉండాల్సింది అని రాజ్యసభలో నేతల కామెంట్లు! ఇంకా చెప్పాలంటే... డ్రెస్సింగ్ మార్చుకుంటే ఇలాంటివి జరగవు అనే పోలీస్ అధికారులు!

ఈరోజు భారతీయులుగా మనం సిగ్గుపడాలి... పైసాకి కొరగాని కొందరు రాజకీయ నాయకులు చస్తే అవనతం చేసే మన జాతీయ జండాని ఈవేళ అందరం సమిష్ట్టిగా అవనతం చేస్తే కొంచెం జాతి గౌరవం నిలబడుతుందేమో!

అమ్మాయిలూ చెప్పండి... ప్లీజ్... గొంతెత్తి చెప్పండి... ‘మా ఇష్టం... మా ఇష్టం వచ్చినట్టు మేం ఉంటాం... రక్షణ కల్పించడం ఈ దేశం బాధ్యత’ అని! బోధించే వాళ్లని నిలదీయండి - ‘మీరు చెప్పినట్టు వింటే మేము అర్ధరాత్రి ఒంటరిగా తిరగగల గ్యారంటీ ఇవ్వగలరా? ఆరు గంటలకు బస్సులు, ఏడు గంటలకు పబ్బులు మూసెయ్యగలరా? అలా కానప్పుడు మాకు వెళ్లే అధికారం లేదని ఎలా చెప్తున్నారు’ అని! మేము మీకు రక్షణ ఇవ్వలేమంటే... మమ్మల్నే కాదు, అందర్నీ ఇళ్లలో కూర్చోమనండి అని, ఆరింటికి అన్నీ మూసేసి కూర్చోండి అని, ఇదే మేము చెయ్యగలిగింది అని చెప్పుకోమనండి. 

అమ్మాయిలూ... ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యామని సంబరపడకండి! మీకు అన్యాయం జరుగుతోంది... మీపై అమానుషాలు జరుగుతాయి పోరాడండి.. ప్లీజ్.. పాలించేవాళ్లని రోడ్డుమీదకి లాగి, వాళ్ల మురికి కొంచెం కడిగి.. మాకు రక్షణ కల్పించే శాసనాలు చెయ్యండని... నిగ్గదీయండి! ఎక్కడో ఢిల్లీలో ఏదో అమ్మాయికి జరిగిన విషయం కాదిది... ఇది మన జాతి మనుగడకి సంబంధించిన సమస్య. ప్లీజ్ స్పందించండి... మేము మిమ్మల్ని ఎక్ట్స్రార్డినరీ చేస్తాం అన్న పిచ్చి మాటలకి చప్పట్లు కొట్టకండి... 

మిమ్మల్ని మీరు నమ్ముకోండి! ఈ సృష్టిలో ఉన్న ఎలాంటి వారైనా... ఏ మూలలో ఉన్నా స్పందించండి... వినిపించండి మీ గొంతు! ప్లీజ్... మన బతుకుల్లో కొంచెం జీవం నింపుదాం... ఈ దేశాన్ని రక్షించుకుందాం!
- శేఖర్ కమ్ముల, సినీ దర్శకుడు 

ఈ హింసాప్రవృత్తి జంతు హింస నుంచే మొదలవుతుంది...
మహిళలు, పిల్లలపై అత్యాచారాలను అన్నిచోట్లా, అన్ని రంగాల్లో, అన్ని సమాజాల్లో గర్హించాలి. ఎదుటివాళ్లను మనం ఏం చేసినా మనల్ని ఎవడేం చేయలేడనే అన్న మొండి ధైర్యంతో పుట్టుకొచ్చే ఇటువంటి దుశ్చర్యలను అరికట్టేందుకు అన్నివిధాలా కృషిచేయాలి. ఇలాంటి ప్రవృత్తి జంతు హింస నుంచి మొదలవుతుందని మనం గ్రహించాలి. ఈ హింసా ప్రవృత్తి మన మెదళ్ల నుంచి అంతరంగానికి పాకకుండా చేయడానికి కేవలం శిక్షలు మాత్రమే చాలవు... ఇంకేదో, ఇంకెంతో చేయాల్సి ఉంది.
- అమల, సినీనటి, జంతుప్రేమికురాలు 

మన ఆడబిడ్డలను కాపాడుకుందాం!
చాలా బాధ కలిగించింది. దేశ రాజధానిలోనే మహిళలకు సెక్యూరిటీ లేదంటే సిగ్గుచేటు. ఇలా చేసిన వాళ్లని ఉరితీయాలి. నిన్న ఢిల్లీలో యువత స్పందించిన తీరు చూస్తే తెలుస్తుంది రియాక్షన్ ఎలా ఉందో! ఇలాంటివి జరగకుండా ప్రతిఒక్కరూ స్పందించాలి. మన ఆడబిడ్డలను కాపాడుకుందాం... ఇలాంటివి జరక్కుండా చూద్దాం!
- కృష్ణంరాజు, సినీ దర్శకుడు 

21వ శతాబ్దం కూడా స్త్రీలు సురక్షితంగా లేరంటే ఏమనాలి?
ఈ సంఘటన గురించి చదవగానే నాకు కోపం, బాధ, ఆక్రోశం... ఇలా ఎన్నో ఉద్వేగాలు కలి గాయి. ఈ 21వ శతాబ్దంలోనూ మహిళలు సురక్షితంగా ఉన్నామని భావించడం లేదంటే మనం సాధించిందేమిటి అనిపించింది. ఒక్క ఢిల్లీలోనే కాదు... మరెక్కడా కూడా ఇలాంటివి జరగకుండా మనకు సాధ్యమైన పరిధిలో మనమంతా కృషిచేయాలి. ప్రస్తుతం ఈ సంఘటనపై జరుగుతున్న ఉద్యమ వేడి చల్లబడకుండా, ఇలాంటి హీనమైన నేరానికి పాల్పడినవారికి కఠిన శిక్ష విధించేలా అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలి. మన దేశంలో ఉన్న చట్టాలకు అనుగుణంగా ఇలాంటివి పునరావృతం కాకుండా ఎంత త్వరగా నేరస్తులకు శిక్ష విధించగలమో అంత వేగంగా ఆ శిక్షను అమలుపరిస్తేనే దీనికి పరి ష్కారం దొరుకుతుంది, న్యాయం జరుగుతుంది. 
- వెంకటేష్, సినీ నటుడు

ఐకమత్యమే బలం

 
 సందేశం...
ఈ ప్రపంచంలో చాలా జాతులు ఉన్నాయి. ఒక్కొక్క జాతి ఒక్కొక్క దేశంగా ఏర్పడింది. ఒక దేశంలో పుట్టి పెరిగిన వారంతా ఒక జాతివారు. అయినా ఎన్నో మతాలకు, సంప్రదాయాలకు చెందినవారు జాతీయభావనచే ప్రభావితులై ఒక దేశవాసులుగా మెలుగుతున్నారు. జాతీయత సంస్కృతికి మారుపేరయినది. ప్రతిజాతికీ విశిష్టమైన చరిత్ర, నాగరికత ఉంటాయి. భాషలు, రాష్ట్రాలు వేరైనా ప్రజలంతా ఐక్యతగా ఉండటాన్నే జాతీయసమైక్యత అంటారు.

నిజానికి సంస్కృతి సహజసిద్ధమైనది కాదు. అది వ్యక్తిగతమైన వారసత్వం కూడా కాదు. సంఘంలోని అధిక సంఖ్యాకుల జీవనవిధానమే సంస్కృతి. అది భూతకాలపు ప్రతిబింబం. ఆచార వ్యవహారాల ద్వారా ఒక తరం నుండి మరొక తరానికి సంక్రమిస్తుంది. సమాజ సాంఘిక, నైతిక అవసరాలను అది తీరుస్తుంది. సంస్కృతి ఒక క్రమపద్ధతికి లోబడి ఉంటుంది. దేశసౌభాగ్యం జాతీయసమైక్యత మీదనే ఆధారపడి ఉంటుంది.

గతంలో మన నాయకులు ఎన్నో త్యాగాలు చేసి స్వాతంత్య్రాన్ని సంపాదించారు. మనలో ఐక్యత లేకపోతే ఈ స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడం కష్టమవుతుంది. కనుక ఇప్పటి నాయకులు కులమత భాషా తత్వాలకు అతీతంగా వ్యవహరించాలి. ఉపాధ్యాయులు విద్యార్థుల్లో జాతీయ దృక్పథాన్ని పెంపొందించాలి. చలనచిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాలు మన సంస్కృతిని ప్రతిబింబించాలి.

నిజానికి మన భారతీయ సంస్కృతికి చాలా పెద్ద చరిత్ర ఉంది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు భారతీయ సంస్కృతికి మూలాధారాలు. ఎన్నో వందల సంవత్సరాలుగా భారతీయులు సంస్కృతీ విలువల్ని కాపాడుకుంటున్నారు. రాజకీయంగా పలుమార్పులు వచ్చినా అనాదిగా భారతీయులంతా ఒకటిగానే ఉంటున్నారు. ఎన్నో మతాలవారు, కులాలవారు ఇక్కడ నివసిస్తున్నారు. అందరి మధ్యా జాతీయతా భావం బలీయంగానే ఉన్నప్పటికీ, ఈనాడు కులమత తత్వాలు దేశ సమైక్యతను కొంతవరకూ దెబ్బతీస్తున్నాయి.

కులం పేరిటా, మతం పేరిటా పోట్లాటలూ ఘర్షణలూ జరుగుతున్నాయి. దీని వలన ప్రజల ఆస్తిపాస్తులకు తీరని నష్టం వాటిల్లుతోంది. హింసాకాండ చెలరేగుతోంది. భాషా దురభిమానం, ప్రాంతీయ తత్వం దేశసమైక్యతను విచ్ఛిన్నం చేస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదాలు, నదీజలాల వివాదాల్లాంటివి జాతీయతా భావాన్ని మట్టుపెడుతున్నాయి. అంతేగాక ఉద్యోగాలలో, విద్యావకాశాల విషయాలలో వివాదాలు భారతీయుల మధ్య ఐక్యతను బలహీనపరుస్తున్నాయి. 

ఈ విచ్ఛిన్నకర ధోరణులకు ప్రజలు స్వస్తి చెప్పాలి. దేశసుస్థిరతను భంగం చేసే శక్తులను రూపుమాపాలి. భారతీయులంతా ఒక్కటేనన్న భావం అందరిలోనూ కలిగించాలి. ఐకమత్యమే బలం అన్న కఠోర వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. అప్పుడే మానవజాతి అభ్యుదయానికి బంగారుబాట పడుతుంది.

- చోడిశెట్టి శ్రీనివాసరావు
ఎంత ఇస్తున్నామన్నది కాదు, ఎంత ప్రేమగా ఇస్తున్నామన్నది ముఖ్యం.
- మదర్ థెరిసా 

చిన్నప్పటినుంచి పళ్ల సమస్యే!

 
డాక్టర్‌ని అడగండి - హోమియో
మా అబ్బాయికి ఆరేళ్లు. వాడికి పళ్లు రావడంలోనే పిప్పిపళ్లుగా మారుతున్నాయి. చాక్లెట్స్ వంటివి తినకపోయినా ఇలా జరగటం బాధగా ఉంది. ఈ పాలదంతాలు పోయిన తరువాత వచ్చే పళ్లు కూడా పిప్పిపళ్లు వస్తాయేమోనని భయంగా ఉంది. భవిష్యత్తులో సమస్య లేకుండా ఉండటానికి హోమియో మందులు ఉంటే సూచించగలరు.
-అరవింద, హైదరాబాద్ 


కొందరిలో శుభ్రత లోపించడం వలన అంటే, కొందరు పిల్లలకు పొద్దున్న లేచిన తరువాత ముందుగా నోరు శుభ్రం చేసుకోకుండానే ఆహారం తీసుకునే అలవాటు ఉంటుంది. దీనివల్ల ఇన్‌ఫెక్షన్ సోకి క్రిములు చేరి పళ్లు పాడయ్యే అవకాశం ఉంది. వీరికి హోమియోలో ‘క్రియొసోట్ 30’ పొటెన్సీలో రోజుకు రెండు పూటలా వారానికి రెండు రోజులు వాడినట్లైతే పిప్పి పళ్లు రాకుండా కాపాడవచ్చు. అయితే శుభ్రత పాటించడం తప్పనిసరి. ఎస్‌బిఎల్ హోమియోడెంట్ అనే టూత్‌పేస్ట్ మార్కెట్‌లో లభ్యమవుతుంది. ప్రతిరోజూ దంతాల శుభ్రతకు ఈ పేస్ట్ వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మా అమ్మాయికి 5 నెలల ప్రెగ్నెన్సీ. గర్భవతి అయినప్పటినుండి వాంతి అవుతున్న ఫీలింగ్ ఎప్పుడూ ఉంటోంది. కానీ ఎప్పుడో ఒకసారి మాత్రమే వాంతి అవుతుంది. సాధారణంగా 4 నెలలకే ఈ వామిటింగ్ సెన్సేషన్ తగ్గుతుందని డాక్టర్లు అన్నారు. కాని తనకు అసలు ఏమాత్రం తగ్గలేదు. హోమియో మందులను సూచించండి.
- జి. రాజేశ్వరి, మంచిర్యాల


మీ అమ్మాయికి ‘ఇపికాక్’ 30 పొటెన్సీలో వారానికి ఒక డోసు వాడుతూ సమస్యను బట్టి రోజుకు ఒకటి నుండి 3 సార్ల్ల వరకు సాక్రవ్ ులాక్టిన్ పిల్స్‌ను వాడండి. సమస్య చాలా వరకు అదుపులో ఉంటుంది. తరువాత హోమియో వైద్యుని సంప్రదించండి.


డాక్టర్ రాజశేఖర్, ష్యూర్‌కేర్ హోమియోపతి

రామాయణంలో అనుబంధాలు

 
నిత్య సందేశం
రాముడు, సుగ్రీవుడు అగ్నిసాక్షిగా స్నేహం చేసికొన్నారు. ఒకరి కష్టం మరొకరు తీర్చడానికి ఒప్పందం కుదుర్చుకొన్నారు. రాముని కష్టం విన్నాడు సుగ్రీవుడు. రావణుడు ఒక స్త్రీని బలవంతంగా ఆకాశమార్గంలో తీసుకొని పోతుండగా పర్వతశిఖరం పైనుండి చూశామనీ, ఆమె ‘‘రామా! లక్ష్మణా!’’ అంటూ ఆర్తనాదాలు చేసిందనీ చెప్పాడు సుగ్రీవుడు. ‘‘మమ్మల్ని పైనుండి చూసిన ఆమె తన వద్దనున్న ఆభరణాలు కొన్ని మూటకట్టి మా వద్దకు విసిరింది. వాటిని జాగ్రత్తగా దాచి ఉంచాం. వాటిని మీకు చూపిస్తాను. అవి సీతమ్మవే అయితే సీతను ఎత్తుకు వెళ్ళినదని రావణుడే అనే నిర్ణయానికి రావచ్చు. ఆమెను ఎక్కడ దాచాడో వెతికి పట్టుకోవచ్చు. నిశ్చింతగా ఉండు’’ అని నగలు చూపాడు. 

వాటిని చూసేసరికి రాముడి కళ్ళు నీళ్ళతో నిండి, ‘‘తమ్ముడూ! ఈ నగలను గుర్తించలేకపోతున్నాను. బాధతో నిండిపోయిన నా కళ్ళు ఈ నగలను చూడటానికి సహకరించడం లేదు. నువ్వే చూడు!’’ అన్నాడు. లక్ష్మణుడు ఒకటికి రెండుమార్లు పరికించాడు. సీతాదేవి కేయూరాలు, కుండలాలు ధరిస్తుందని తెలుసు. అయినా గుర్తుపట్టలేకపోయాడు. ‘‘నేను వదిన వద్దకు వచ్చినప్పుడు తల వంచుకొని నిలబడేవాడిని. స్పష్టంగా ఆమె ముఖాన్ని ఏనాడూ తేరిపార చూడలేదు. 
అందువల్ల ఆమె ఎటువంటి కుండలాలు, కేయూరాలు ధరించేదో నాకు సరిగా తెలియదు. కాని ఈ నూపురాలు మాత్రం అనుమానం లేకుండగా వదినగారివే. నిత్యం నీకూ, వదినగారికీ పాదాభివందనం చేసేవాడినిగదా! అందువల్ల మీ వివాహం అయిననాటి నుండి ఆ పాదాలపై నర్తించే నూపురాలు చూసినవాడిని. నిస్సందేహంగా ఇవి మా సీతమ్మతల్లివే’’ అంటూ బోరున విలపించాడు లక్ష్మణుడు. 

ఇదీ మన భారతీయత. ఇదీ మన ఆర్ష ధర్మం. ఇదీ మన సంస్కృతి. 
మనకు ఐదుగురు తల్లులని నీతిశాస్త్రం చెపుతోంది. 
గురుపత్నీ రాజపత్నీ జ్యేష్ఠభ్రాతుః కుటుంబినీ
పత్నీమాతా స్వమాతాచ పంచైతాః మాతరః స్మృతాః!! 
దేశాన్ని పరిపాలించే రాజుగారి భార్య, గురువుగారి భార్య, అన్నగారి భార్య, భార్య తల్లి, కన్నతల్లి ఈ ఐదుగురూ తల్లులే. అందరినీ మాతృభావనతోనే గౌరవించాలి. అలాగే తండ్రులు కూడా ఐదుగురని శాస్త్రం చెప్పింది. 
జనితాచోపనేతాచ యేన విద్యోపదిశ్యతే 
అన్నదాతా భయత్రాతా పంచైతే పితరః స్మృతాః!! అని. 

కన్నవాడు, ఉపనయనం చేసినవాడు, గురువు, అన్నం పెట్టినవాడు, ఆపదలు వచ్చినపుడు కాపాడి భయం పోగొట్టినవాడు... ఈ అయిదుగురూ తండ్రులే. తండ్రుల పట్టికలో అన్నగారి పేరు చేర్చలేదు. కాని ‘భయత్రాత’ ముందుగా అన్నగారే అవుతాడు. తల్లిదండ్రుల తరువాత తనకు కొండంత అండగా అన్నగారే కనిపిస్తాడు. ఏ తమ్ముడైనా అన్నగారి వల్లనే ఆ ఆపద నుండి బయటపడతాడు. పైగా అన్నగారి భార్య తల్లివంటిదని చెప్పాక అన్నగారు తండ్రివంటివారని వేరుగా చెప్పనక్కరలేదు. ఆ ప్రకారంగా ధర్మాన్ని అనుసరించి, అన్నగారిని తండ్రిగాను, వదినగారిని తల్లిగాను గౌరవించినవాడు లక్ష్మణుడు. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఎలా ఉండాలో ఆనాడే లోకానికి తెలియజేసింది రామాయణం. 

- డా. కడిమిళ్ళ వరప్రసాద్

అందమె ఆనందం

 
బియ్యప్పిండిలో పసుపు, నువ్వుల నూనె, టొమాటో గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, సున్నితంగా రుద్దాలి. తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు తగ్గి చర్మం మృదువుగా అవుతుంది.

శరీరానికి ఉపశమనం కలిగించే లెమన్ షవర్ బాత్

శరీరానికి ఉపశమనం కలిగి తిరిగి ఉత్తేజం పొందేందుకు మార్గం సబ్బుని వాడకుండా కేవలం నిమ్మకాయతో స్నానం చెయ్యడం.

ముఖ్యంగా క్లోరినేటెడ్ అయిన ఈత కొలనులోని ఈత కొట్టిన తర్వాత నిమ్మకాయతో స్నానం ఏంతో ప్రయోజనకరం.

నిమ్మకాయలో ఉండే ఆమ్ల గుణం చర్మాన్ని శుభ్రపరిచే తేలికపాటి రసాయనంలా పనిచేసి మృదువైన చర్మాన్ని పెంపొందిస్తుంది.

how shower with lemon


పద్దతులు:

1. ఒక నిమ్మకాయని తీసుకోండి. స్నానానికి ఉపయోగించే నిమ్మకాయ లేత రంగులో ఉండాలి. ఆకుపచ్చని చుక్కలు ఉన్నా పరువాలేదు. ముదురు రంగు నిమ్మకాయల కంటే లేత రంగు నిమ్మకాయలని వాడడం మంచిది.

2. నిమ్మకాయని వలవండి. పెద్ద పరిమాణంలో ఉండేలా తొక్కలు వలిస్తే మంచిది.నిమ్మకాయమీద సన్నని తెల్లని పొరని మిగిల్చేలా వలిచి, నిమ్మకాయని రెండు సమాన భాగాలుగా తరగండి. స్నానం ప్రారంభించండి.

3. మీ జుట్టుని నీళ్ళతో కడగండి. అర చెక్క నిమ్మ బద్దని తొక్క ఉన్న వైపు పట్టుకుని సుతారంగా నిమ్మ రసాన్ని మీ తలపై పిండండి. ఇప్పుడు తొక్క ఉన్న వైపుతో మీ జుట్టుపైన రుద్దండి. ఒక వేల మీరు రసం పిండే వైపు తల పైన రుద్దితే జుట్టులో నిమ్మ కాయకి సంబందించిన గుజ్జు ఇరుక్కుపోయే అవకాశం ఉంది. జుట్టు మొత్తాన్ని ఇలా నిమ్మ చెక్కతో శుభ్రం చెయ్యండి.

4. మీ జుట్టుకి కండిషనింగ్ చెయ్యండి: రెండు చేతులలోని పెద్ద పరిమాణంలో ఉన్న నిమ్మ తొక్కలని తీసుకుని, తొక్క వెనుక భాగంతో మీ జుట్టుపైన రుద్దండి. పొడవైన జుట్టుని శుభ్రం చెయ్యడానికి రెండు చేతులని ఉపయోగించండి. మీ జుట్టుని పూర్తిగా నిమ్మ తొక్కతో రుద్దిన తరువాత శుభ్రంగా కడగండి.

5. మీ ముఖాన్ని, శరీరాన్ని నీళ్ళతో శుభ్రం చేసుకోండి. మీ జుట్టుని ఏ విధంగా నిమ్మ చెక్కతో శుభ్రం చేసుకున్నారో అదే విధంగా మీ ముఖాన్ని నిమ్మ చెక్కతో శుభ్రం చేసుకోండి. మీ ముఖాన్ని కడిగిన తరువాత మిగిలిన నిమ్మ చెక్కలతో మీ శరీరాన్ని శుభ్రం చేసుకోండి.

6.చర్మంపైన ఉన్న నిమ్మ శేషాలు తొలగిపోయే దాకా బాగా కడగాలి. నిమ్మకాయ తో చేసిన స్నానం తర్వాత మృదువైన చర్మపు అనుభూతిని మీ సొంతం చేసుకోండి.చిట్కాలు:నిమ్మ తొక్కని వలిచేటప్పుడు మొత్తం తొక్క ఒకే సారి వచ్చేలా జాగ్రత్తగా వలిచి, నిమ్మ తొక్కని రెండు భాగాలుగా చేయండి.

హెచ్చరిక:

1. నిమ్మరసాన్ని కళ్ళల్లో పడకుండా జాగ్రత్త పడండి.

2. మీ శరీర తత్వాన్ని బట్టి మీ చర్మానికి నిమ్మకాయలోని ఆమ్ల గుణాలని తట్టుకునే శక్తి ఉండకపోవచ్చు. ఒక వేళ మీ శరీరం పైన సున్నితమైన ప్రదేశాలలో మీకు చర్మం మండుతున్నట్లుగా కొన్ని నిమిషాల కంటే ఎక్కువ సేపు అనిపిస్తే, నిమ్మకాయతో స్నానాన్ని ఇకముందు పాటించకండి.

 

పిల్లల కోసం ఆరోగ్యకరమైన అల్పాహార వంటకాలు

బహుశా, మీరు ఈ విషయం ఇంతకు ముందు వినే ఉంటారు. అల్పాహారం రోజు మొత్తంలో అతి ముఖ్యమైన భోజనం, మీకు పిల్లలుంటే, వారికి అల్పాహారం ఆరోగ్యవంతంగా, పోషక విలువలతో కూడి ఉండేలా మీరు చూసుకోవాలి. అలాగే, వారు ఎంతో ఇష్టంగా తినేవిధంగా అల్పాహారాన్ని తయారుచెయ్యాలి. ముడి పప్పు దినుసులు (bran cereals) ని ఒక గిన్నెలో పెట్టి పిల్లల్ని తినమంటే వారు ఇష్టంగా తినకపోవచ్చు. అందుకనే, కొన్ని సాధారణ వంటకాల ద్వారా మీ పిల్లలకి రుచికరమైన, పోషక విలువలతో కూడిన ఆరోగ్యకరమైన అల్పాహారాన్ని అందించవచ్చు. మరి అలాంటి వంటకాలని తెలుసుకుందామా.


గోధుమలతో తయారు చేసిన పాన్ కేకు మరియు పళ్ళు:

మీ పిల్లలకి అల్పాహారంగా గోధుమలతో తయారు చేసిన పాన్ కేక్ మరియు పళ్ళు ఇవ్వడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

హోల్ వీట్ పాన్ కేక్ (whole wheat pancake) తయారు చేయడానికి ఒక అరటిపండు, ఒక కప్పు సోయా పాలు, ఒక టేబుల్ స్పూన్ మాపల్ సిరప్(maple syrup), ఒక కప్పుడు గోధుమ పిండి మరియు రెండు చెంచాల బేకింగ్ పౌడర్ కావలెను.

ఒక గిన్నెలో, అరటిపండుని గుజ్జుగా చేసుకుని పాలు మరియు సిరప్ లతో కలుపుకోవలెను. తరువాత, వేరొక గిన్నెలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్ మరియు తగినంత ఉప్పుని కలుపుకోవాలి.

ఈ మిశ్రమానికి, ముందుగా తయారు చేసుకున్న అరటిపండు మిశ్రమంతో కలపాలి. బాగా కలిపిన తరువాత పెనాన్ని స్టవ్ మిద పెట్టి స్టవ్ ఆన్ చెయ్యాలి. ఒక చిన్న గరిటె తో పెనం మిద ఈ మిశ్రమాన్ని పొయ్యాలి.

ఉడుకుతుండగా, పాన్ కేక్ మీద బుడగలు ఏర్పడినప్పుడు తిరగేసి మళ్లీ ఉడకనివ్వాలి.ఈ పాన్ కేక్స్ ని తాజా పళ్ళతో వడ్డించండి.

స్ట్రాబెర్రిస్, బ్లూ బెర్రీస్, ఆపిల్ ముక్కలు, లేదా అరటిపండు ముక్కలతో చాలా బాగుంటాయి.

ఒక గ్లాసుడు సోయా పాలు మరియు మరో గ్లాసుడు నారింజ రసంతో మీ పిల్లలకి అల్పాహారంగా పాన్ కేక్స్ ని వడ్డించండి.

healthy breakfast recipes kids

మీ పిల్లలు ఈ అల్పాహారంతో సంతోషంగా తమ రోజుని ప్రారంభిస్తారు.

బేక్డ్ ఓట్ మీల్ :

మీ పిల్లలకి బేక్డ్ ఓట్ మీల్ అల్పాహారంగా ఇవ్వడం కోసం ఈ వంటకం తెలుసుకోండి.
త్వరగా వండటం కోసం, ఒక కప్పు చుట్టిన ఓట్స్, అర కప్పు డ్రై ఫ్రూట్స్, రెండు కప్పుల పాలు, పావు కప్పు పంచదార, అరచెంచా వెనిల్లా, తగినంత ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ సిరప్.పై పదార్ధాలతో చెప్పబడిన మోతాదులో తయారు చేస్తే ఇది నాలుగు కప్పులు వస్తుంది.
కాబట్టి నాలుగు బేకింగ్ కప్స్ కావాలి.
ప్రతి కప్ మీద నాన్ స్టికింగ్ స్ప్రే చల్లుకొని పక్కన పెట్టాలి.
ఒక పెద్ద గిన్నెలో, ఓట్స్ మరియు డ్రై ఫ్రూట్స్ని కలుపుకోవాలి.
మరొక గిన్నెలో పాలు, పగలగొట్టిన గుడ్డు సోన, వెనిల్లా, పంచదార, మరియు తగినంత ఉప్పుతో కలుపుకోవాలి.
ఈ రెండు గిన్నెలలో ని మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కస్టర్డ్ కప్స్ లో నింపుకోవాలి.
వీటిని 350 డిగ్రీల వద్ద ఓవెన్ లో బేక్ చెయ్యాలి.

వడ్డించేటప్పుడు, డ్రై ఫ్రూట్స్ ని స్మైలీ లాగ అలంకరించాలి. సిరప్ ని కప్పులపై ఇష్టమైతే చల్లవచ్చు.

సరియైన పదార్ధాలని వాడితే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కష్టమేమీ కాదని గుర్తుంచుకోండి.

సేంద్రియ మరియు సహజ దినుసులు వాడడం, తీపి, ఉప్పు మరియు కొవ్వు తక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

ఈ సూత్రాన్ని పాటిస్తూ మీకు నచ్చినన్ని రకాలుగా ఆరోగ్యకరమైన వంటకాలని తయారుచేసుకోవచ్చు.

ఉదాహరణకి ఒక గోధుమ బ్రెడ్ ని తీసుకుని మధ్యలో రంధ్రం చేయండి. పెనాన్ని వేడి చేసి కుకింగ్ స్ప్రే ని చల్లండి.

మధ్యలో రంధ్రం చేసిన బ్రెడ్ ని పెనం పైన ఉంచి ఆ రంధ్రంలో పగులకోట్టిన గుడ్డు సోనని పొయ్యండి.

గుడ్డు ఉడికే వరకు బ్రెడ్ ని కాల్చండి. దీనిని తాజా పండ్ల ముక్కలతో పాటు వడ్డించండి. ఈ వంటకం చాలా సులభం మరియు ఆరోగ్యకరం.

 

మీ అనారోగ్యానికి భరోసా ఈ పోపుల పెట్టే...


మన వంటగది కేవలం వండివార్చాడానికి మాత్రమే కాదు..ఇది అనేక ఔషధాల నిలయం. దేహంలో చోటు చేసుకునే ఎన్నో అనారోగ్యాలకు నివారణకు, చికిత్సలూ అన్నీ పోపుదినుసులతోనే చేయవచ్చు. ఔషధాల నిలయమైన మన పోపుల పెట్టెతో తగ్గించుకునే కొన్ని అనారోగ్య సమస్యలను తెలుసుకుందాం..

వంట గదిలో ఉండే పదార్థాల విలువ తెలుసుకుంటే అనారోగ్యం దరికే చేరదు. కానీ మనకంత ఆవసరం వుండదు. వంట చేయాలంటే చాలు మన చేతిలో వుండేది పోపులపెట్టె. ప్రతినిత్యం పోపులపెట్టెను, అందులోని దినుసులను వాడుతూనే వుంటాం. కానీ ఏదో పూర్వకాలం నుండీ పెద్దలు వాడుతున్నారు కనుక వాడతాం తప్ప పోపులపెట్టెలోని సరుకుల గురించి, వాటిలో దాగున్న ఔషధ గుణాల గురించి పెద్దగా పట్టించుకోం. ఒకసారి ఆ సుగుణాలను తెలుసుకుంటే పోపు దినుసుల వాడకాన్ని మరింత పెంచుతాం. ఏదో మొక్కుబడిగా కాకుండా గుర్తుంచుకుని మరీ శ్రద్ధగా కూరల్లో వేస్తాం. ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకుంటాం. మరవేంటో చూద్దామా?!


పోపుల పెట్టె కాదు...ఆరోగ్యపు చిట్ట...!

వెల్లుల్లి గుండెకు నేస్తం: పచ్చివెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కీళ్ళనొప్పుల్ని తగ్గిస్తాయి. ఆక్సీకరణ నుంచి శరీరంలోని కొవ్వును నివారించే కార్పినోజెనిక్ మిశ్రమ పదార్థాలు ఏర్పడే యాంటీ ఆక్సిడెంట్ ఇందులో మెండుగా వున్నాయి.

 

అల్లం పైత్యానికి విరుగుడు: అజీర్ణ వ్యాధులకు అల్లం అద్భుతంగా పనిచేస్తుందని, ఉదర సంబంధ వ్యాధులకు అల్లాన్ని మించిన ఔషధం లేదని ఆయుర్వేదం గట్టిగా చెబుతోంది. వికారం, వాంతులు, విరోచనాలకు చెక్ పెడుతుంది. గర్భవతులలో ఉదయం పూట వికారాన్ని, కెమోథెరపీతో పాటు ఎన్నో కారణాలవలన వచ్చే కడుపునొప్పిని అల్లం నివారిస్తుంది.




 

కుంకుంపువ్వు అందం ఆరోగ్యం: ఇది చాలా ఖరీదైన సుగంధ ద్రవ్యం. దేశ విదేశాలలో ఆహార పదార్థాలలో రుచి, రంగు, సువాసనకోసం వాడే కుంకుమపువ్వులో క్యాన్సర్ నిరోధక గుణాలు వున్నాయి.




చక్కెరను నియంత్రించే దాల్చిన చెక్క: దాల్చిన చెక్కలో ప్రోటీన్లు, పీచు, ఐరన్, సోడియం, విటమిన్ సి ఇంకా ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలోని ఔషధ విలువల వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిపై ప్రభావం చూపుతూ, కొలెస్ట్రాల్, ట్రెగ్లీసెరైడ్ స్థాయిని తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి.
 



లవంగాలు శ్వాసకు మేలు: లవంగాలలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు దంత రక్షణనిస్తాయి. నోటిని, శ్వాసను తాజాగా వుంచుతాయి. హృదయానికి ఆరోగ్యాన్నిస్తాయి. యాంటిసెప్టిక్, యాంటీబయోటిక్ ఔషధాలలో లవంగాలను ఉపయోగిస్తారు.



 

పచ్చి ఏలకులు: ఊపిరితిత్తులలో కఫాన్ని కరిగించి, శ్లేష్మాన్ని తొలగించే శక్తి ఏలకులకు ఉంది. శ్వాస సంబంధిత ఇబ్బందులతో బాధపడే పిల్లలకు ఏలకులు వేసిన పాలను తాగించాలి. ఇవి జీర్ణక్రియ వ్యవస్థపై చక్కగా పనిచేస్తుంది. అజీర్ణం, కడుపు ఉబ్బరాన్ని తొలగిస్తుంది.


ఆవాలు: ఆవాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. శరీరానికి కావలసిన విటమిన్లు వీటిలో ఉన్నాయి. కీళ్ళనొప్పులు, కండరాల నొప్పులు తగ్గిస్తుంది. శ్వాస అవరోధాలను దూరం చేస్తుంది.




 
జీర్ణశక్తికి జీలకర్ర: జీర్ణశక్తిని బాగా పెంచుతుంది. దీనిలోని క్యూమిక్ డీహైర్ అనే పరిమళం లాలాజల గ్రంధులను క్రీయాశీలం చేస్తుంది. ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ వ్యవస్థను ఎలాంటి అంటురోగాలు సోకకుండా ఆరోగ్యంగా వుంచుతుంది.
 


 
మిరియాలు: ఘాటుగా వుండి నాలుకను చురుక్కుమనిపించే మిరియాలు జీర్ణక్రియకు తోడ్పడతాయి. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ యాసిడ్‌ను విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాలపొడి వేసుకుని తాగితే ఋతుక్రమ సమయంలో ఇబ్బందుల నుంచి ఉపశమనం ఇస్తుంది.


మెంతులు: పచ్చిమెంతుల పొడి ప్రతిరోజు 10 లేదా 15 గ్రాములు తింటే మధుమేహం పూర్తిగా అదుపులో ఉంటుంది. ప్రసవం అనంతరం వచ్చే నొప్పులు మెంతులు వేయించి బెల్లంతో కలిపి ఇస్తే నొప్పులు తగ్గుతాయి. బాలింతలకు పాలు బాగా పడతాయి. మెంతులలో చక్కెర కలిపి తినిపిస్తే బరువు తగ్గిన పిల్లలు మామూలుగా తయారవుతారు. మెంతులు నూరి తలకు పట్టిస్తే చుండ్రు పోవడమే కాక శిరోజాలు బాగా పెరుగుతాయి.





 
గసగసాలు: గసగసాలను ఒక గంట వేడినీటిలో నానబెట్టి తాగితే తలనొప్పి తగ్గుతుంది. మజ్జిగలో కలిపి తాగితే నీళ్ల విరోచనాలు తగ్గుతాయి. గొంతు వాచి నొప్పిగా ఉన్నప్పుడు ఈ కషాయం పుక్కిలిస్తే వాపు నొప్పి తగ్గిపోతుంది.





ధనియాలు: కాచి చల్లార్చిన నీటిలో ధనియాలపొడివేసి రెండు గంటలు నానబెట్టి తాగిస్తే విషజ్వరాలు ఇట్టే తగ్గుతాయి. జలుబు, దగ్గులకు ధనియాల చారు మంచిది.

 

 

Tuesday, December 25, 2012

మార్గశిర లక్ష్మీపూజతో బంగారు కాసులు


"మహా దేవ్యైచ విధ్మహే
విష్ణు పత్నీచ ధీమహీ
తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్"

"నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహీ
తన్నో విష్ణు: ప్రచోఅదయాత్"





ద్వాపరయుగంలో సౌరాష్ట్రలో శ్రవణుడు అనే రాజు ఉండేవాడు. ఆయన చాలా తెలివైనవాడూ, వేదాలు, శాస్త్రాలు , పురాణాలు చదివినవాడు. ప్రజల శ్రేయస్సే ముఖ్యం అనుకుని చిత్తశుద్ధితో పరిపాలించేవాడు. శ్రవణుడి భార్య సురత చంద్రిక. ఆమె కూడా ఉత్తమురాలు. గొప్ప భక్తురాలు. వారికి ఎనిమిదిమంది సంతానం. ఏడుగురు కొడుకులు, ఒక కూతురు. ఆ రాజు పాలనలో ప్రజలు సుఖంగా, సంతోషంగా ఉన్నారు.

ఇదిలావుండగా, ధనధాన్యాలిచ్చే లక్ష్మీదేవి సౌరాష్ట్రకు వెళ్ళాలని, రాజును, ప్రజలను దీవించాలని నిర్ణయించుకుంది. లక్ష్మి ఒక వృద్ధ స్త్రీ రూపంలో రాజభవనానికి వెళ్ళింది. అక్కడ మహారాణి దగ్గర పనిచేసే దాసీ ''ఎవరమ్మా నువ్వు?” అనడిగింది.

''నేను మహారాణిని కలవడానికి వచ్చాను. ఆమె క్రితం జన్మలో ఒక పేద వైశ్యుని భార్య. ఆ పేదరాలు ఒకరోజు అంతులేని నిరాశతో ఇళ్ళు విడిచి నడుస్తూ వెళ్ళి అడవి చేరింది. అక్కడ ఆకలితో అలమటిస్తూ, చలికి తాళలేక తిరగసాగింది.

అది చూసిన లక్ష్మీదేవి ఆమెమీద జాలితో మామూలు స్త్రీగా కనిపించి ''మార్గశిర లక్ష్మీదేవి పూజ చేసుకోమని'' చెప్పింది. దాంతో ఆమె వెంటనే ఇల్లు చేరి ఆ పూజ చేసింది. వెంటనే వారి కష్టాలు తీరాయి. ఆ ఇళ్ళు సంపదలతో తులతూగింది...'' అంటూ చెప్పింది.

దాసి వెళ్ళి మహారాణితో అదంతా చెప్పింది. రాణీకి ఆ మాటలు ఎంతమాత్రం నమ్మశక్యంగా తోచలేదు. ''ఈవిడెవరో పబ్బం గడుపుకోవడానికి ఏదో చెప్పింది'' అనుకుని ఆ వృద్ధ స్త్రీని కలవనేలేదు. దాంతో లక్ష్మీదేవికి కోపం వచ్చి నగరం విడిచి వెళ్ళిపోడానికి సిద్ధమైంది.

ఈ సంగతి తెలిసిన రాకుమారి పరుగున వెళ్ళి వృద్ధస్త్రీని నిలవరించింది. ''మా అమ్మను క్షమించు తల్లీ! మార్గశిర లక్ష్మీ పూజ నేను చేస్తాను'' అంటూ వేడుకుంది. చెప్పినట్లుగానే లక్ష్మీపూజ ఎంతో నమ్మకంతో భక్తిగా చేసింది. లక్ష్మీదేవి సంతోషించింది. ఆ రాకుమారికి ధీరుడు, వీరుడు అయిన రాజుతో వివాహం జరిగింది.

కొంతకాలానికి సౌరాష్ట్ర రాజు శ్రవణుడికి కష్టకాలం దాపురించింది. వర్షాభావంతో పంటభూములు బీడుల్లా మారాయి. విపరీతమైన కరవు వచ్చింది.

మహారాణి సలహా మేరకు, శ్రవణుడు కూతురి ఇంటికి వెళ్ళాడు. ఆమె ఎంతో సానుభూతి చూపి ఒక పాత్ర నిండా బంగారు కాసులు నింపి, మాత బిగించి తండ్రికిచ్చింది. ఆయన రాజ్యానికి తిరిగివచ్చి ఆ పాత్ర మూత తెరిచాడు. అయితే దాన్నిండా బొగ్గు కనిపించింది. అది చూసి రాజు దుఃఖంతో కన్నీళ్ళు కార్చాడు. రాణి అయితే కోపంతో ఊగిపోయింది. ''సాయం చేయకపోగా ఇంత అవమానిస్తుందా'' అంది. ''ఎందుకిలా పరాభావించిందో వెళ్ళి అడుగుతాను'' అంటూ వెళ్ళింది.

రాణి వెళ్ళేసరికి కూతురు మార్గశిర లక్ష్మీపూజ చేసుకుంటోంది. ఆమె తల్లిని చూసి సంబరపడి ''అమ్మా, నువ్వూ పూజ చేయి'' అంది. తల్లి ''చేయలేను'' అంటూ అడ్డంగా తల ఊపింది. కానీ కూతురు విడిచిపెట్టక తల్లితో కూడా పూజ చేయించింది. ఇక రాణి కూతుర్ని ఏమీ అడక్కుండానే పూజ ముగిసిన తర్వాత ఇంటికి తిరిగివెళ్ళింది. రాణి రాజ్యం తిరిగి చేరేసరికి ఆశ్చర్యకరంగా పూర్వ వైభవం తిరిగి వచ్చింది. రాజభవనం కళకళలాడిపోతోంది. ప్రజలంతా మునుపటిమాదిరిగానే సుఖసంతోషాలతో సంతృప్తిగా కనిపించారు.

అదంతా మార్గశిర లక్ష్మీదేవి పూజ మహిమేనని మహారాణికి స్పష్టమైంది. ఇక అప్పటినుంచీ ప్రతి సంవత్సరం మార్గశిర లక్ష్మీవ్రతం నియమం తప్పకుండా చేయసాగింది. శ్రవణుడు ''ప్రజలంతా మార్గశిర లక్ష్మీవ్రతం చేసుకోవాలని, లేకుంటే అనర్ధమని'' చాటింపు వేయించాడు.


గృహిణిలు అందంగా.. ఉత్తమంగా ఉండడం ఎలా?







తల్లి అయిన తరువాత అందాన్ని కాపాడుకోవడం కొంచం కష్టమైనా పనే. అందాన్ని కాపాడుకోవడానికి తగిన సమయాన్ని మరియు డబ్బుని చాలా మంది తల్లులు కేటాయించలేరు. ఇంట్లోనే ఉండే తల్లులకి వారి రూపురేఖల్ని తీర్చి దిద్దుకోవడానికి సరిపడా సమయం ఉండదు. బయటికి ఎక్కువగా వెళ్ళే అవసరం ఉండదు కాబట్టి వారు కూడా అందం పైన ఎక్కువగా శ్రద్ధ కనబరచరు. అటువంటి గృహిణిలు సులభమైన పద్దతులలో అందంగా కనిపించేందుకు కొన్ని సూచనలు

 


1. పరిశుభ్రతకి తగిన ప్రాధాన్యతనివ్వండి. క్లాసీ మామ్ గా ఉండడానికి ఇది ముఖ్యమైన ప్రాధమిక నియమం. కొత్తగా తల్లి అయిన వారికి ఎన్నో పనులుండడం వల్ల రోజుకొకసారి స్నానం చేయడానికి కూడా సమయం చిక్కదు. కానీ స్నానానికి ప్రాధాన్యత నివ్వండి. స్నానం చేసిన తరువాత మీరు ఎంతో ఉత్తేజం పొందుతారు.

తల్లిగా మీరు చేయవలసిన పనులని ఎన్నైనా చాకచక్యంగా త్వరత్వరగా పూర్తి చేయగలుగుతారు.
మీ ముఖాన్ని చక్కటి క్లేన్సేర్ తో కడగండి.
షాంపూ చేసి కండీషనర్ చేసుకోండి.
మీ చంకలో షేవ్ చేసుకోండి.
మీ కాళ్ళని, ఇంకా బికినీలోని ప్రాంతాన్ని షేవ్ చేసుకోండి.
పూర్తిగా వదిలేయడం కంటే, ఇలా వారానికి ఒకసారి చేసినా పరవాలేదు.

2. మీకు నప్పే సొగసైన హెయిర్ స్టైల్ ని ఎంచుకోండి.
గర్భిణి గా ఉన్నప్పటినుండి హెయిర్ స్టైల్ గురించి పట్టించుకునే తీరిక ఉండదు.
సెలూన్ కట్ మరియు రంగులు ఖరీదైనవి. అంతే కాక ఆ రంగులు మంచివి కావు కూడా.
తొమ్మిది నెలల తరువాత మారిపోయిన జుట్టు తీరుని తీర్చిదిద్దుకునేందుకు సమయం మరియు డబ్బు అందుబాటులో ఉండవు. కాబట్టి, మీ హెయిర్ స్టైల్ ని పొందికగా అందంగా తీర్చిదిద్దుకునేందుకు ఇది అనువైన సమయం.




how be classy mom


మీకు ఒక వేల పొట్టి జుట్టు నచ్చితే బాబ్ స్టైల్ ని ప్రయత్నించండి. పొడవైన జుట్టు నచ్చితే లాంగ్ లేయర్స్ ని ప్రయత్నించండి.

సులభంగా మీకు నచ్చిన హెయిర్ స్టైల్ కోసం ట్రిం చేయించుకోండి.మీ జుట్టు పొడవుగా ఉన్నట్టయితే, ఒక వైపు జుట్టుని పోనీ టైల్ గా కట్టుకుని ఎలాస్టిక్ ని పెట్టుకోండి. ఈ హెయిర్ స్టైల్ జిమ్ హెయిర్ స్టైలే కంటే బెటర్ గా ఉంటుంది. ఈ హెయిర్ స్టైల్ సులభంగా చేసుకోవచ్చు.

ఇంట్లో వేసుకోగలిగే సహజమైన రంగులని మీ జుట్టుకి అప్లై చెయ్యండి.మీ ఐబ్రోస్ ని వాక్సింగ్ చేయించుకోలేకపోతే కనీసం అనవసరపు జుట్టుని తీసివేయడానికి ప్రయత్నించండి.

3. మీ మేకప్ ని సింపుల్ గా ఉండేటట్లు చూసుకోండి తప్ప ఎప్పుడూ మేకప్ ని స్కిప్ చేయవద్దు.
సన్ స్క్రీన్ కలిగిన మోయిస్చరైజర్ ని తప్పకుండా వాడండి.
మీకు సమయం తక్కువగా ఉన్నప్పుడు ఐ లాషెస్ ని వంపు తిప్పి మస్కారా అప్లయ్ చేయండి.
మాములు రోజుల్లో ఐ లైనర్ మరియు ఐ షాడో అప్లయ్ చేసుకోండి. పింక్ లేదా బ్రౌన్ రంగులకి ప్రాధాన్యత నివ్వండి.

4. సాధారణమైన మరియు సులభంగా మైంటైన్ చేయగలిగిన బట్టలని ఎంచుకోండి.
సులభంగా ఇంట్లోనే ఉతుక్కోగలిగిన స్వేట్టర్స్ మరియు కార్డిగన్స్ ని ఎంచుకోండి.
చదునైన నిట్ టాప్స్ మరియు కాప్రిస్ లని ఎండాకాలం లో ఉపయోగించేందుకు కొనండి.
జీన్స్, స్లాక్స్ మరియు బాలెట్ ఫ్లాట్స్ కి జతగా వేసుకోవడానికి తక్కువ హీల్ కలిగిన బూట్లని ఎంచుకోండి.
వర్కౌట్ కి వాకింగ్ కి వెళ్ళినప్పుడు తప్ప మిగతా సమయాలలో టెన్నిస్ షూస్ ని వాడడం తగ్గించండి.

5. రోజువారి వాడకానికి సాధారణమైన నగలని ఏర్పాటు చేసుకోండి.
చిన్న పిల్లలు మెడలో ఉన్న నగలతో, చెవి రింగులతో ఆడడం సర్వ సాధారణం. అలా అని నగలు వాడటాన్ని పూర్తిగా నిర్మూలించవద్దు.

6. క్రమం తప్పకుండా మానిక్యుర్ మరియు పెడిక్యుర్ చేయించుకోండి.
రెండు వారాలకొకసారి మీ చేతులు మరియు పాదాలు అందంగా కనిపించడానికి సెలూన్ కి వెళ్లకపోయినా వీలైనప్పుడల్లా వెళ్ళండి.

7.తగినంత వ్యాయామం చేయండి.
మీ పిల్లలని సరదాగా నడకకి తీసుకు వెళ్లడమో లేదా మీ కుటుంబంతో కలిసి డిన్నర్ తరువాత సరదాగా నడవడమో చేయండి.
ఇంటి దగ్గర చేయగలిగే వ్యాయామాలను తెలుసుకోండి.
టీవీ లో ఇంట్లో చేయగలిగే సాధారణ వ్యాయామాల గురించి వచ్చిన ప్రోగ్రామ్స్ చూసి అవి ప్రయత్నించండి.
మీరు మధ్యాహ్నం పూట కునుకు తీసే సమయంలో నే సరిపోయే ఈ వ్యాయామాల వల్ల ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.
మీ బేబీ బరువుని కూడా తగ్గించాలనుకుంటే ఆన్ లైన్ కాలరీ కౌంటర్ లో చేరవచ్చు.

8. మీ చిరునవ్వు అందంగా, తెల్లగా ఉండేలా జాగ్రత్త పడండి.
క్రమం తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించండి. ఇంట్లోనే వైట్నింగ్ సిస్టం ని పాటించండి.

9. ప్రశాంతంగా, వినయంగా ఉండండి.
అలసిపోవడం, ఒత్తిడికి గురవడం వల్ల ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావాలు కనబడతాయి.
వారానికి ఒక సారైనా బయటికి వెళ్ళండి.
సహాయం కోసం మీ లాంటి తల్లుల గ్రూప్ లో చేరండి.

పనిలో తీవ్రంగా మునిగిపోవడం వల్ల మీ ప్రియమైన వారిమీద లేదా ఇతరుల మీద చిటపట లాడే అవకాశం కలదు. కాబట్టి, ప్రశాంతంగా ఉండండి.

జాగ్రత్తలు:
వ్యాయామం మొదలు పెట్టే ముందు మీ డాక్టర్ ని సంప్రదించండి.
ప్రసవం తరువాత మీరు వ్యాయామం మొదలు పెట్టాలనుకుంటే తప్పనిసరిగా వైద్యుని సలహా తీసుకొనవలెను.

 

మీ జీవిత భాగస్వామి మోసం చేస్తున్నారని పసిగట్టడం ఎలా?



ఆహ్లాదంగా సాగిపోతున్న మీ సంసార జీవితంలో హఠర్త్తుగా మీ జీవిత భాగస్వామి ప్రవర్తన తేడాగా ఉందనే భావన మీకు కలిగిందా,వారిలో మార్పు కనిపించింది.బహుశా వారు మనల్ని మోసం చేస్తున్నారేమో ....




how catch cheating partner







 



















1. మార్పును గమనించండి: మీ జీవిత భాగస్వామి ప్రవర్తనలో వచ్చిన మార్పులన్నిటిని గుర్తించాలి. వారు మనతో గడపడానికి కేటాయించే సమయాన్ని తగ్గించుకోవడం, అలాగే బహుమతులు ఇవ్వడం లేదా వంటి చిన్న చిన్న విషయాలను విషయాలలో తేడాలు గమనించాలి.

2. ఐ లవ్ యూ అనే అంశం: వారు మీతో ఐ లవ్ యూ అని అనడం మర్చిపోవచ్చు. లేదా చెప్పకుండానే మానేయవచ్చు ఒకవేళ మీరు చెప్పినా దానికి ప్రతిస్పందించకపోవచ్చు.

3. తికమక పెట్టే అంశాలు(తప్పులు): ఒక్కోసారి వారు తికమక పడి మిమ్మల్ని వేరే పేరుతొ పిలవడం, అలాగే మన పేరు ఏమిటని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయటం వంటి అంశాలు గమనించాలి.

4. ఫోన్(ఆమెది/అతనిది)చెక్ చేస్తే: మీ జీవిత భాగస్వామి ఫోన్ ను చెక్ చేస్తే మన అనుమానాలకి సమాధానం దొరుకుతుంది.అనుమానం వచ్చనప్పుడు ఒక సారి ఫోన్ డీప్ గా చెక్ చేయండి.

5. అతని/ఆమె రొటీన్ జీవితంలో గమనించండి: వారి రొటీన్ జీవితంలో ఏమి చేస్తున్నారో అనే దానిపై ఓ కన్నేసి ఉంచండి.

6. రహస్యంగా అనుసరించండి: మీకు వారి మీద అనుమానం వచ్చినప్పుడు వారిని రహస్యంగా ఫాలో చేయాలి.

7. స్నేహితులు: వారి స్నేహితులతోను, మీ ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ తోనూ టచ్ లో ఉంటూ మాట్లాడుతూ ఉండాలి.


జాగ్రత్తలు/సూచనలు:

1. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి.
2. వారు మనల్ని మోసం చేస్తున్నారని బాధ పడకండి.
3. వారిని ఒకసారి దండించి ఇక చాలించండి అని అనండి.
4. ప్రతీది కామ్ గా చేయండి.
5. అవసరమైతే ఒక ఫ్రెండ్ సాయం తీసుకోండి.

హెచ్చరికలు:

1. వ్యవహారాన్ని తెగే దాకా లాగకండి.
2. చెడు ఫ్రెండ్ సహాయం మాత్రం తీసుకోకండి.

 

 

తవా ముర్గ్ - స్పెషల్ స్టార్టర్స్‌

మాంసాహార ప్రియులు వివిధ రకాల వెరైటీలను తయారు చేసుకొని తింటుంటారు. అయినా కూడా మరేదో కొత్తరకంను ఆశిస్తుంటారు. అటువంటి వారికోసం తయారు చేసిన ఈ తవా ముర్గ్ చాలా టేస్టీగా ఉంటుంది. టేస్ట్ ఒక్కటి మాత్రమే కాదు.. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. అతి తక్కువ సమయంలో తయారు చేసేసుకోవచ్చు.ఈ తవా ముర్గ్ చికెన్ బ్రెస్ట్ తో తయారుచేసుకోవచ్చు. కొన్ని పదార్థాలతో మ్యారినేట్ చేసుకొని తవాలో ఫ్రై చేయడం వల్ల తవా ముర్గ్ అంటారు. కొన్ని మసాలా దినుసులతోనే అద్భుతమైన రుచితో తయారయ్యే ఈ స్పెషల్ ముర్గ్ ను లంచ్ లేదా డిన్నర్‌ కి ముందు స్టార్టర్స్‌లా తీసుకోవచ్చు.

 Tawa Murgh



కావలసిన పదార్థాలు:

చికెన్ బ్రెస్ట్ పీస్: 250grms
శనగపిండి: 2tbsp
గుడ్డు సొన: 1tbsp
వెనిగర్: 2tbsp
కారం: 1tsp
ఉప్పు: రుచికి తగినంత
ధనియాలపొడి: 2tsp
జీలకర్రపొడి: 1tsp
గరం మసాల పౌడర్: 1tsp
నిమ్మరసం: 2tbsp
నూనె: 1tbsp
అల్లంవెల్లుల్లి పేసు: 1tbsp

తయారు చేయు విధానం:

1. ముందుగా చికెన్ బ్రెస్ట్ పీస్‌ని శుభ్రంగా కడిగి పలుచని స్లైస్ గా కట్ చేసుకోవాలి.

2. తర్వాత ముక్కల మీద శనగపిండి చల్లి చేత్తో కలపాలి. శనగపిండి ముక్కల్లో తడిని పీల్చుకోవడమే కాక పచ్చివాసనని కూడా తగ్గిస్తుంది.

3. ఇప్పుడు ఒక బౌల్‌లో చికెన్ పీసెస్, అల్లంవెల్లుల్లి ముద్ద, వెనిగర్, గుడ్డు సొన, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరమ్ మసాల పౌడర్, నిమ్మరసం కలిపి 10 నిమిషాలపాటు నానబెట్టాలి.

4. తర్వాత నాన్ స్టిక్ పాన్ లేదా తవా ని స్టౌ మీద పెట్టి నూనె వేయాలి. నూనె వేడెక్కాక నానబెట్టిన చికెన్ ముక్కలని వేసి తక్కువ సెగ మీద ఎరుపు రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి.

వీటిని లంచ్ లేదా డిన్నర్‌ కి ముందు స్టార్టర్స్‌లా తీసుకోవచ్చు.

గ్రిల్డ్ మసాలా ఫిస్ ఫిల్లెట్-క్రిస్మస్ స్పెషల్

సాధారణంగా ఫిష్ వంటలంటే చాలా మాసాహారులకు చాలా ఇష్టం. అందులోనూ ఫిష్ మసాలా అంటే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే. ఎర్రగా ఉండే గ్రేవి, డీఫ్ ఫ్రై చేసిన ఫిష్ ఫిల్లెట్..ఇలా ఒకటేమిటి.

వివిధ రుచులు. అయితే ఎప్పుడూ రొటీన్ గా తయారు చేసే ఫిష్ వంటకాలకు భిన్నంగా ఇండియన్ స్టైల్ లో తయారు చేసుకొని గ్రిల్డ్ ఫిష్ మసాలా చాలా అద్భుతమైన రుచిని అందిస్తుంది. అందులోనూ ఇండియన్ మసాలాలు వాడటంతో మరింత టేస్టీగా ఉంటుంది.గ్రిల్డ్ స్నాక్స్ అన్నీ కాంటినెంటల్ స్టైల్లో వండుతారు. అదే స్టైల్లో గ్రిల్డ్ మసాలా ఫిష్ అద్భుతమైన టేస్ట్ తో ఈవెనింగ్ స్నాక్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం....


christmas special grilled masala fish fillets

కావలసిన పదార్థాలు:

పాంప్రెట్ ఫిస్ ఫిల్లెట్: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
జీలకర్ర పొడి: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
పసుపు: 1 pinch
అజ్వైన్(ఇంగువ): 1/2 tsp
నిమ్మరసం: 2tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2tbsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఓవెన్ ను 300డిగ్రీల వరకూ వేడి చేయాలి.

2. తర్వాత ఫిష్ ఫిల్లెట్ ను శుభ్రం చేసి తడి ఆరనివ్వాలి. శుభ్రం చేసిన ఫిష్ ఫిల్లెట్ మీద ఉప్పు, పసుపు చిలకరించు పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ధనియాలపొడి మరియు జీలకర్రపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు శుభ్రం చేసి ఉప్పు పట్టించి పెట్టుకొన్న ఫిష్ ఫిల్లెట్ ను ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని మ్యారినేట్(చేపమొత్తానికి బాగా పట్టించాలి)చేసి దాని మీద కొంచె అజ్వైన్ మరియు నిమ్మరసం చిలకరించి ఇరవై నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

5. ఇరవై నిముషాల తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొన్ని ఫిష్ ఫిల్లెట్ మీద నూనెను చిలకరించి ఓవెన్ గ్రిల్లింగ్ రాక్ మీద పెట్టాలి.

6. 60డిగ్రీల హీట్ పెట్టి 15-20నిముషాల పాటు ఫిఫ్ ను గ్రిల్(బేక్) చేయాలి. మద్య మద్యలో ఫిష్ ను అన్ని పక్కలకూ తిప్పుతూ బాగా కాలేలా చూసుకోవాలి.

అంతే గిల్డ్ మసాలా ఫిస్ ఫిల్లెట్ తయారైన వెంటనే కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

చికెన్ టిక్కా బిర్యానీ-క్రిస్మస్ స్పెషల్

చికెన్ బిర్యానీ ఓ ట్రెడిషిన ల్ వంటకం. ఇది ఇండియా, పాకిస్తాన్ లో ఓ పాపులర్ రైస్ డిష్. బిర్యానీ వంటకంలో చాలా వెరైటీలు కలిగి ఉన్నాయి చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బీఫ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, సింధీ బిర్యానీ, షాన్ చికెన్ బిర్యానీ, వెజిటేబుల్ చికెన్ బిర్యానీ ఇలా... చాలా వెరైటీలే ఉన్నాయి.

ఇండియా, పాకిస్తాన్ లో చికెన్ టిక్కా బిర్యాని చాలా పాపులర్ రిసిపి.ఇది చాలా టేస్ట్ గా కలర్ ఫుల్ గా ఉంటుంది. చికెన్ టిక్కాను బిర్యానీ మిక్స్ చేయడం వల్ల టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. చికెన్ టిక్కా బిర్యానీ తయారు చేయడం అంత సులభం కాదు. అతి త్వరగా చేసి వడ్డించే వంటకం కాదు. దీన్ని తయారు చేయడానికి కొంచెం ఎక్కువ సమయం తీసుకొన్నా ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. మరి మీరూ ఈ స్పైసీ చికెన్ టిక్కా బిర్యానీ తయారు చేసి లచ్ డిన్న సర్వ్ చేసి అద్భుతమైన రుచితో ఎంజాయ్ చేయండి.


chicken tikka biryani recipe chritmas special


కావలసిన పదార్థాలు:

బోన్ లెస్ చికెన్: 1kg (చిన్న ముక్కలుగా క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి)
బాస్మతి రైస్ : 1kg
అల్లం పేస్ట్: 1tsp
వెల్లుల్లి పేస్ట్: 1tsp
పెప్పర్ పౌడర్: 1tsp
నిమ్మరసం: 1tbsp
పచ్చిమిర్చి పేస్ట్: 3tbsp
కారం: 2tsp
పసుపు: 1/3tsp
చాట్ మసాలా: 1tbsp
ఉల్లిపాయలు: 2onion
టమోటో: 2
పెరగు: 1cup
లవంగాలు: 5
బిర్యానీ ఆకు: 2
యాలకులు: 4
చెక్క: 2-3( అంగులపొడవు )
ఉప్పు: రుచికి సరిపడా
నెయ్యి: 2tbsp
నూనె: 1cup
పసుపు కలర్ ఫుడ్ కలర్: 1/4tsp
కుంకుమ పువ్వు: చిటికెడు
పాలు: 1/2cup

తయారు చేయు విధానం:

1. ముందుగా బియ్యాన్ని శుభ్రం చేసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. అలాగే వేడిగా ఉన్న పాలను ఒక కప్పు తీసుకొని అందులో కుంకుమ పువ్వు వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలి.

2. ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో బోన్ లెస్ చికెన్ ముక్కలు, పెరుగు, కారం, పచ్చిమిర్చి పేస్ట్, పసుపు, ఉప్పు, లవంగాలు, చెక్క, యాలకులు, ఛాట్ మసాలా, నిమ్మరసం, ఎల్లో ఫుడ్ కలర్, అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి. ఈ చికెన్ ను 1-2 గంటలపాటు అలాగే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. లేదా ఫ్రిజ్ లో పెట్టాలి.

3. ఇప్పుడు ఒక పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించి, అందులోనే టమోటో వేసి చిక్కటి గ్రేవి తయారయ్యే వరకూ ఉడికించాలి. ఇప్పుడు అందులోనే బిర్యానీ ఆకులు కూడా వేసి మసాలామిశ్రమంతో నానబెట్టి పెట్టుకొన్న చికెన్ ముక్కలను కూడా అందులో వేసి 5-10నిముషాల పాటు మీడియం మంట మీ ఉడికించుకోవాలి. చికెన్ కొద్దిగా ఉడికిన తర్వాత స్టౌ ఆఫ్ చేసి పాన్ తీసి పక్కన పెట్టుకోవాలి.

4. తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని బియ్యానికి సరిపడా నీళ్ళు పోసి బాగా కాగనివ్వాలి. నీరు మరిగేటప్పుడు అందులో బియ్యాన్ని వేసి 10నిముషాలు ఉడికించి గంజి వంపేసి పక్కన పెట్టుకోవాలి.

5. ఇప్పుడు చికెన్ గ్రేవీ మిశ్రమాన్ని, వండిని అన్నంను రెండింటినీ లేయర్ గా పరచుకోవాలి. మొదటి అన్నంను ఒక ఇంచ్ మందగా పరవాలి. దానీ మీద చికెన్ మిశ్రమాన్ని పరవాలి. ఇలా మూడు నాలు లేయర్స్ పరచి చివరగా(టాప్ లో) చికెన్ గ్రేవి లేయర్ వచ్చేలా చూసుకోవాలి.

6. ఇప్పుడు ఈ అన్నం మీద పాలలో నానబెట్టుకొన్ని కుంకుమ పువ్వు, పాలతో సహాయ చిలకరించాలి. ఇప్పుడు మూత పెట్టి ఐదునిముషాల పాటు తక్కువ మంటమీద ఆవిరిమీద ఉడికించాలి.

అంతే చికెన్ టిక్కా బిర్యానీ రెడీ. ఈ బిర్యానీని రైతా, గ్రీన్ సలాడ్, నిమ్మకాయతో సర్వ్ చేయాలి. అంతే...

వాసనలని గ్రహించే శక్తి మెరుగుపరుచుకోవటం ఎలా ?

వాసనలని గుర్తించే శక్తిని మీరు పెంచుకోవాలనుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రధాన కారణం, మన ఆహార పదార్ధాలలోని రుచులకి మరింత రుచిని కలిగించే శక్తి వాసనకి ఉండడం. ఒకసారి మీ ముక్కు మూసుకుని ఆహారాన్ని రుచి చూడడానికి ప్రయత్నించండి. మీకే ఆ బేధం తెలుస్తుంది.ఆహారానికి రుచిని పెంచడంలో వాసన ప్రధాన పాత్ర పోషిస్తుంది. వైన్, కాఫీ, బీర్ ల లోని సువాసనలని ఆగ్రాణించి అనుభూతిని గుర్తించి వివరించడం కుడా ఒక కళే.

ఈ కళ ఒక సాధారణ టీ సువాసనని గ్రహించడానికి కుడా వర్తిస్తుంది. వాసనలని గుర్తించే ప్రక్రియలో ఎన్నో చిన్న చిన్న విషయాలే మనకి అద్వితీయమైన అనుభూతిని కలిగిస్తాయి. వాటిలో పూవులలోని సువాసనలలోని సూక్ష్మ బేధాల్ని గుర్తించడం, లేదా మనసైన వారి చర్మపు సువాసనని గుర్తించడం, లేదా రాలిన ఆకుల లోని వాసన లోని బేధములని గుర్తించడం వంటివి ముఖ్యమైనవి. మరొక ఆశ్చర్య పరిచే విషయం ఏమిటంటే సగటు మానవుడి ముక్కు సుమారు 10,000 రకాల వాసనలను గుర్తించగలదు. అంతటి అద్బుతమైన పాత్ర పోషిస్తున్న వాసన గ్రహించే శక్తిని పెంపొందిచుకునే మార్గాలు తెలుసుకుందామా మరి.

how improve your sense smell


1. మీరు వాసనని పీలుస్తున్న వాటి మీద శ్రద్ద పెట్టండి. ఆంగ్లం లో 'యూస్ ఇట్ ఆర్ లూస్ ఇట్' అనే నానుడి కండరాల విషయం లో ఉంది. అంటే ఎంత వాడితే అంత ఉపయోగపడుతుంది లేకపోతే నిరుపయోగమవుతుంది. మన ఇంద్రియాలకి కూడా ఈ నానుడి వర్తిస్తుంది. మీరు మీ ఇంద్రియాలని ఎంతగా వాడితే అంత బాగా అవి పనిచేస్తాయి. వాసనలు గుర్తించి వాటిని వర్ణించడానికి ప్రయత్నించండి. అదనపు సాధన కోసం, మీరు కళ్ళకి గంతలు కట్టుకుని, ఎవరినైనా రక రకాల వాసనలు కలిగిన వస్తువులను ఒక దాని తర్వాత ఒక దానిని పట్టుకొని ఉండమని, మీరు ఆ వస్తువులని గుర్తించడానికి ప్రయత్నించండి.

2. కొన్ని ప్రత్యేకమైన వాసనలు మీకు ఎటువంటి అనుభూతులు కలిగిస్తాయో గుర్తించండి. వాసనలని గుర్తించే నరాలు నేరుగా మెదడులో ఉన్న ఉద్వేగపూరితమైన భాగాలకి అనుసంధానమయి ఉంటాయి కాబట్టి కొన్ని రకాల వాసనలు కలిగించే అనుభూతులు వేరు వేరుగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం, ఫాస్ట్ ఫుడ్ వ్రాపెర్స్ నుండి వచ్చే వాసనలు, తాజా బ్రెడ్ లేదా పేస్ట్రి నుండి వచ్చే వాసనలకి వాహనం నడిపేటప్పుడు కలిగే ఒత్తిడి పెరిగి వాహన చోదకులకి అకారణమైన హింసాత్మక కోపం అధికమయ్యే అవకాశాలు ఎక్కువ. అలాగే, పిప్పరమింట్ మరియు దాల్చిన చెక్కల నుండి వచ్చే వాసనలు వాహన చోదకులకి ఏకాగ్రతని పెంచి ఒత్తిడిని తగ్గించే గుణం కలదు. సాధారణంగా, కాఫీ మరియు నిమ్మ వాసనలకు స్పష్టమైన ఆలోచనలు కలుగచేసి, ఏకాగ్రత స్థాయిలని పెంచే లక్షణం ఉంది.

3. జలుబుని, కఫాన్ని పెంచే ఆహార పదార్ధాలని సాధ్యమైనంత వరకు తగ్గించండి. మీరెప్పుడైనా గమనించారా, మనకి జలుబు చేసినప్పుడు వాసనలని గుర్తించే శక్తి తగ్గిపోతుంది. తీవ్ర మైన జలుబు తో బాధపడుతున్నప్పుడు వాసనలని గుర్తించే శక్తి పూర్తిగా అదృశ్యం కూడా అయిపోతుంది. ముక్కులోని పొరలకు కలిగే రక్తచలన దోషము వల్ల వాసనని గుర్తించే నరముకి ఉన్న సామర్ధ్యం తగ్గుతుంది. అందుకే ముక్కు దిబ్బడని కలిగించే పాలు, వెన్న, ఐస్ క్రీం వంటి వాటికి జలుబు తగ్గేంత వరకు దూరంగా ఉండడం ప్రయోజనకరం. ముక్కులో ఉండే ఇంద్రియ కణాలకి గొంతు వెనుకభాగానికి కలిపే మార్గం వల్ల మనం తినే ఆహార పదార్ధాల రుచులపై కూడా ప్రభావం ఉంది. ఎందుకంటే, జలుబు చేసినప్పుడు ఈ మార్గం మూసివేయబడుతుంది. తద్వారా, రుచి ని గుర్తించే శక్తి కూడా మందగిస్తుంది.

4. వాసనని పసిగట్టే శక్తి ని బలహీన పరిచే పదార్ధాలని దూరంగా ఉంచండి. జలుబుని తగ్గించే కొన్ని చిట్కాల వల్ల వాసనని పసిగట్టే శక్తి తగ్గిపోవచ్చు. ధూమపానం వల్ల వాసనని పసిగట్టే శక్తి తగ్గిపోతుంది. మద్యపానాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించండి. మద్యం సేవించడం వల్ల రక్తంలో మద్యం స్థాయి పెరిగి వాసనని పసిగట్టే శక్తి బలహీనపడుతుంది.

5. ఆహారంలో జింక్ ని ఎక్కువగా వాడండి. హైపోస్మియా(Hyposmia) అనే వ్యాధి జింక్ ఖనిజ లోపం వల్ల వస్తుంది. హైపోస్మియా వల్ల వాసనని గుర్తించే శక్తి సన్నగిల్లుతుంది. జింక్ సమృద్దిగా లభించే పదార్ధాలని ఆహారంలో తీసుకొనడం ద్వారా వాసనని పసిగట్టే శక్తి ని వృద్ది చేసుకొనవచ్చు. ఆయిస్టర్ (Oysters -సముద్రపు చిప్ప లేక గుల్ల ), పప్పుధాన్యాలు, పొద్దుతిరుగుడు పువ్వు విత్తనాలు, పెకన్స్(Pecans) ల వంటి వాటిలో జింక్ సమృద్దిగా లభిస్తుంది. లేదా 7 mg జింక్ సప్ప్లిమెంట్స్ ని ప్రతిరోజూ తీసుకోవడం మంచిది.

6. వ్యాయామం చెయ్యండి. కొన్ని అధ్యయనాల ప్రకారం, వ్యాయామం చేసిన తర్వాత వాసనని పసిగట్టే ఇంద్రియం చాలా చురుకుగా పని చేస్తుంది. కాబట్టి వ్యాయామం ద్వారా ఆరోగ్యమే కాకుండా వాసనని పసిగట్టే శక్తి ని కూడా వృద్ది చేసుకోవచ్చు.

7. గాలిలో తేమ శాతం ఉండేలా జాగ్రత్త తీసుకోండి. గాలిలో తేమ ముక్కుని తేమగా ఉంచుతుంది. తద్వారా, వాసనని పసిగట్టే శక్తి పెరుగుతుంది.

8. దుర్వాసనల నుండి దూరంగా ఉండండి. ఎక్కువసేపు దుర్వాసనలకి బహిర్గతం అవడం వల్ల, వాసనని గుర్తించే శక్తి మందగిస్తుంది.

9. ఏదైనా వాసనని గుర్తించడానికి ప్రయత్నించేటప్పుడు ఒకే సారి గట్టిగా పిల్చేకంటే మెల్ల మెల్ల గా చిన్న చిన్న గా పీల్చండి. ఇలా చెయ్యడం వల్ల వాసనని పసిగట్టే శక్తి పెరుగుతుంది. కుక్కలు, పిల్లులవంటివి ఎవైన వాసనని పసిగట్టేటప్పుడు ఇదే పద్దతిని పాటిస్తాయి.

10. ఆహార పదార్ధాలని షాపింగ్ చేసేటప్పుడు బాగా వాసన వచ్చే పదార్ధాలే మీ శరీరం ఎక్కువగా కోరుకునే పదార్ధాలు. ఉత్తమ వాసన కలిగిన ఆహార పదార్ధాలనే కొనండి. రై బ్రెడ్ లేదా వెన్నలని ఎంచుకోనేటప్పుడు వాటి నుండి వచ్చే సువాసనలే మనకి అవి మంచివా కావా అని తెలియచేస్తాయి.


మన శరీరం ఎక్కువగా ఏమి కోరుకుంటుందో మనం ఎక్కువగా ఇష్టపడే వాసనల ద్వారా గుర్తించవచ్చు. ఔషదం లేదా విటమిన్ సీసాల వాసనల ద్వారా కూడా మన శరీరానికి ఏ ఔషదం లేదా విటమిన్స్ అవసరమో తెలుసుకొనవచ్చును.అయినప్పటికీ ఔషదాలు లేదా విటమిన్స్ ని వాడే ముందు వైద్యున్ని సంప్రదించండి.

పోపుధినుసు కాదు...ఆరోగ్య దివ్యఔషధ ధినుసు..!

ఇండియన్ మసాలా దినుసుల్లో ఒకటి లవంగాలు. లవంగాలు రుచి కోసం కూరలలో వేసుకునే ఒకరకమైన పోపుదినుసులు. ఒక్కసారి మీ వంటింట్లోని పోపులపెట్టెలోకి చూడండి...కనిపించాయా నల్లని పూమొగ్గలు... అవేనండీ లవంగాలు. అద్భుత ఔషధ సుగంధద్రవ్యాలు!

విచ్చీవిచ్చని పూమొగ్గలే లవంగాలు. అందుకే మనం వీటిని ముద్దుగా లవంగమొగ్గలనీ పిలుస్తుంటాం. ఇండొనేషియాలోని స్పైస్‌ ఐల్యాండ్స్‌గా పిలిచే మొలక్కస్‌ దీవులే వీటి స్వస్థలం. ప్రస్తుతం వీటిని బ్రెజిల్‌, ఇండియా, వెస్టిండీస్‌, మారిషస్‌, జాంజిబార్‌, శ్రీలంక, పెంబా దేశాల్లోనూ పండిస్తున్నారు.

తాజాగా ఉన్నప్పుడు కాస్త గులాబీరంగులో ఉండే మొగ్గల్ని కోసి ఎండబెడతారు. దాంతో అవి క్రమంగా ముదురు గోధుమరంగులోకి మారతాయి. భారత్‌, చైనాల్లో రెండు వేల సంవత్సరాలనుంచీ దీన్ని వంటల్లో వాడుతున్నారు. మాంసాహార వంటలే కాదు, మసాలా ఘాటు తగలాలంటే శాకాహార వంటల్లోనూ లవంగమొగ్గ పడాల్సిందే. లేకుంటే కిక్కే రాదంటారు మసాలాప్రియులు. ఇది శృంగారప్రేరితం కూడానట. పరిమళాలు, సాంబ్రాణి కడ్డీల్లోనూ వీటి వాడకం ఎక్కువే. వీటిలో మంచి సువాస మాద్రమే కాదు.. విలువైన పోషకాలు ఉన్నాయి. ఇనుము, కార్బోహైడ్రేట్లు, కాల్సియం, ఫోస్ఫరాస్, పొటాసియం, సోడియం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్, మంగనీష్, విటమిన్ లు... ఎ,సి , ఉంటాయి. మరి ఇన్ని పోషకాలు, ఔషదగుణాలున్న లవంగాలు ఆరోగ్య పరంగా ఏవిధంగా ఉపయోగపడుతాయో చూద్దాం....


health benefits clove

1. లవంగాల నుంచి నూనె తీయనివి ఆరోగ్యానికి చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

2. జలుబు- దగ్గు: గొంతునొప్పి, జలుబులను తగ్గించేందుకు లవంగాల కషాయం దివ్యౌషధంగా పనిచేస్తుంది.

3. కఫం-పిత్తం: ఎవరైనా కఫం, పిత్త రోగాల బారిన పడినవారుంటే ప్రతి రోజు లవంగాలను సేవిస్తుంటే ఈ జబ్బులు మటుమాయమౌతాయి.

4. దప్పిక:
ఎక్కువగా దప్పిక వేసినప్పుడు లవంగ పలుకులు తింటే దప్పిక తీరి ఉపశమనం కలుగుతుంది.

5. జీర్ణశక్తికి: జీర్ణశక్తి తగ్గినట్లనిపిస్తే రెండు లవంగాలు తీసుకోండి. మీ శరీరంలోని జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది.

6. లవంగాలు సేవిస్తే ఆకలి బాగా వేస్తుంది. వీటి వలన జీర్ణక్రియకు అవసరమైన రసాలు ఉదరంలో ఊరుతాయంటున్నారు వైద్యులు.

7. పంటినొప్పితో బాధపడేవాళ్లు ఓ లవంగమొగ్గను బుగ్గన పెట్టుకుంటే వెంటనే తగ్గుతుంది. నోటి దుర్వాసననీ పోగొట్టి శ్వాసని తాజాగా ఉంచుతుంది. లవంగనూనెలో దూదిని ముంచి దంతాలు, చిగుళ్లులో నొప్పి వచ్చేచోట పెడితే ఇట్టే తగ్గిపోతుంది.

8. లవంగాలు తెల్ల రక్త కణాలను పెంపొదిస్తుంది. అలాగే జీవిత కాలాన్ని పెంపొందించే గుణాలు ఇందులో ఉన్నాయి.

9. ఇది వ్యాధి నిరోధక శక్తిగా కూడా ఉపయోగపడుతుంది.

10. ఎలాంటి చర్మ వ్యాధినైనా లవంగాలు ఇట్టే మాయం చేసేస్తాయి. దీనిని చందనంతోపాటు రుబ్బుకుని లేపనంలా చర్మానికి పూస్తే చర్మ వ్యాధులు మటుమాయమంటున్నారు వైద్యులు.

11. లవంగాలను చైనీయులు వెక్కిళ్ల నివారణా ఔషధంగా ఉపయోగిస్తారు. అంతేగాకుండా వీటితో తామర లాంటి చర్మ సంబంధ వ్యాధులు. ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్లు బాగా తగ్గుతాయని వారు చెబుతుంటారు. లవంగ నూనెను పొట్టుపై రాస్తే జీర్ణ సంబంధ సమస్యలు దూరమవు తాయని మనదేశీయులు భావిస్తారు. పంటినొప్పిని నివారించటంలోనూ లవంగాలు కీలకపాత్ర పోషిస్తాయి.

12. ఉబ్బసం, నులిపురుగులను తగ్గించేగుణం కూడా వీటికి మెండుగా ఉంది. వాంతి అవుతుందని అనిపిస్తుంటే.. నాలుగు చుక్కల లవంగ నూనెను ఓ గ్లాసు నీటిలో వేసి పుక్కిలిస్తే వాంతులు రావు. అలసటను, రుమాటిక్‌ నొప్పులను తగ్గించ టంలో కూడా లవంగాలు బాగా తోడ్పడతాయి.

13. పాలలో లవంగం పొడి, ఉప్పు కలిపి నుదుటమీద ప్యాక్ వేసినచో తలనొప్పి తగ్గుతుంది.

14. దీనికి రక్తాన్ని శుద్ధి చేసే గుణము ఉన్నందున శరీరము లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

15. రెండు లవంగాల్ని బుగ్గనపెట్టుకుని నమిలితే మద్యం తాగాలన్న కోరిక మాయమవుతుందట.

వేడి నీళ్ళ స్నానంతో విశ్రాంతి పొందడం ఎలా...?

బాగా పనిచేసిన రోజు సాయంత్రం విశ్రాంతినిచ్చే స్నానం చేయాలంటే, మీ స్నానాన్ని ఒక స్పా లాగా బాగా విశ్రాంతిగా ఉండాలంటే ఏమి చేయాలో తెలుసుకోవడానికి ఈ వ్యాసం చదవండి.


how relax with hot bath


చర్యలు :

1. మీ కోసం మీరు చివరిసారిగా ఒత్తిడులన్నీ దూరం అయ్యేలా ఎప్పుడు స్నానం చేసారో గుర్తు తెచ్చుకోండి.

2. విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయించుకోండి. మీరు విశ్రాంతి తీసుకునేలోగా మీ దైనందిన చర్యలు, ఇంటి పనీ చేసేసుకోండి. కాసేపు మీ మనసు, శరీరం, ఆత్మ మీద ధ్యాస వుంచి మీ బాధలన్నీ కాసేపు మర్చిపోండి.

3. స్నానాన్ని ప్రత్యేకం చేసుకోండి. ఫోన్ ను హుక్ మీద నుంచి తీసివేయండి. మీకోసం గ్లాసులో వైన్ పోసుకోండి, ఒక పుస్తకం తీసుకోండి, స్నానాల గదిలో లైట్లు ఆర్పివేసి కొవ్వొత్తి వెలిగించండి(సుగంధ భరితమైనవి ఐతే మంచిది), బాత్ ఆయిల్, బుడగలు లేదా బాత్ బాంబ్స్ ఉపయోగించి వేడి నీళ్ళు కలుపుకొండి. ఈ మధ్య సుగంధ చికిత్సల ఎంపికలు కూడా చాలానే దొరుకుతున్నాయి. బజార్లో చాలా మంచి స్నానపు ఉత్పత్తులు దొరుకుతున్నాయి - అవి కొని తెచ్చుకోవడం కూడా మంచి ఆలోచనే.


4. మిమ్మల్ని మీరు టబ్ లో ముంచుకోండి - మీ బాధలన్నీ టబ్ లోంచి బయటకు పొంగే నీటితో పాటు కొట్టుకు పోనీండి.

5. విశ్రాంతిగా వుండండి. మీ బాధలన్నీ నీటిలో కరిగిపోనీయండి. సూర్యుడు తారాడే సాగర తీరాలు, తారలతో వెలిగిపోయే ఆకాశాలు లాంటి సంతోషకరమైన ఆలోచనలు రానీయండి - పిల్లలు, పని, డబ్బుల గురించిన ఆలోచనలు ఆవిరైపోనీయండి. మీ మనసును తెరవండి, ధ్యానం చేయండి, కేవలం ఆస్వాదించండి.

6. సాధ్యమైనంత ముందుగానే స్నానం చేయండి, దాని వల్ల మీరు త్వరగా శుభ్ర పడతారు - అలా మురికిగా ఎక్కువ సేపు ఉండకుండా.

7. స్నానం చేసేటప్పుడు వినడానికి హాయిగా వుండే పాటల ప్లే లిస్టు తయారు చేసుకోండి.

8. మంచి స్నాన౦ చేయడానికి ముఖానికి పూత, మంచి పుస్తకం కూడా అవసరమే. కాస్త సృజనాత్మకంగా ఆలోచించి ఇంట్లోనే ఒక అరటి పండు (గుజ్జు చేసినది), ఒక టేబుల్ స్పూన్ తేనె, అయిదు టేబుల్ స్పూన్ల ఓట్లు కలిపి ముఖానికి పూత తయారు చేయండి. కాస్త అందుబాటు ధరల్లో వుండే ముఖం పూతలను దుకాణాల నుంచి కూడా తెచ్చుకోవచ్చు.

చిట్కాలు :

మీరు నీటిలో నానుతుండగా మీకు ఇష్టమైన పానీయాన్ని తాగడానికి బాత్ టబ్ పక్కనే ఉంచుకోండి.

ముఖం మీద పూత వేసుకుని నిజంగా స్పా లో వున్న అనుభూతి పొందండి.

హెచ్చరికలు :

స్నానపు తొట్టె లో వుండగా ధ్యానం చేయడం ప్రమాదకరం కావచ్చు, మునిగి పోకుండా ఉండేలా అభ్యాసం చేయ౦డి, లేదా మీరు ఎక్కడ వున్నారో, ఏం చేస్తున్నారో ఇతరులకు చెప్పి మిమ్మల్ని ఆటంక పరచ వద్దని చెప్పండి.

స్నానం చేసేటప్పుడు మరీ ఎక్కువగా వైన్ తాగకండి. అది ఒలికిపోవచ్చు లేదా కారిపోవచ్చు.

గోరువెచ్చటి లేదా వేడి నీళ్ళలో కూర్చుని ఆల్కహాల్ తాగితే మీకు బాగా నెప్పులు కూడా రావచ్చు.

స్నానం చేసేటప్పుడు మీకు రేడియో, టేపులు లేదా సి డి లు వినడం ఇష్టమైతే, మీరు వాడుతున్నది ఏదైనా సరే పొరపాటున కూడా జారి నీళ్ళలోకి పడనటువంటి ప్రదేశంలో వుంచండి.

మీరు గమని౦చ గలిగేంత సురక్షితమైన దూరంలో కొవ్వొత్తి వుంచండి.నీళ్ళలో మరీ ఎక్కువ సేపు ఉండకండి - దాని వల్ల చర్మం త్వరగా వయసు మీరుతుంది.