ఎదుటివారిని హింసించే అధికారం ఏ ఒక్కరికీ లేదని చాటి చెప్పాలి!
అంటే... ఏం జరిగినా, ఏం చేసినా, ఎవరూ ఏమీ చేయరనే, ఎవరూ ఏమీ చేయలేరనే ధైర్యమే ఈ అఘాయిత్యాలకు పాల్పడేవారిలో చోటు చేసుకుంటోంది. అందుకే ఇలాంటి దురాగతాలను, దుర్ఘటనలను, దౌర్జన్యాలను, దౌష్ట్యాలను జరగకుండా చూడాలి. అందుకోసం మనమంతా.. అంటే... నేతలు, మీడియా, మేధావులు, ఈ సంఘటనను నిరసించే సామాన్యులూ... అంతా ఏకమై, ఒక సమాజంగా, న్యాయం జరిగే వరకు పోరాడాలి.
ఇలాంటి దౌర్జన్యాలు జరగకుండా మన సమాజాన్ని మనమే చైతన్యపరచుకోవాలి. టీచర్లు, తల్లిదండ్రులు, బంధువులు, అధికారులు... ప్రతి ఒక్కరం మనందరి హక్కుల కోసం పోరాడాలి. ఇతరులను ఏవిధంగానూ బాధించే, వేధించే అధికారం ఏ ఒక్కరికీ లేదని అందరికీ తెలపాలి. మనం రాసే వ్యాసాల్లో, మనం తీసే సినిమాల్లో, మనం చెప్పే పాఠాల్లో ఎదుటివారిని హింసించేందుకు, వారిని నొప్పించేందుకు అధికారం, హక్కు ఏ ఒక్కరికీ లేదని గట్టిగా చాటిచెప్పాలి.
డిసెంబర్ 16, 2012 - రాత్రి 9.30 గంటలకు...
దట్టంగా మంచు కురుస్తోంది. హాలీవుడ్ అద్భుతం... లెఫ్ ఆఫ్ పై. త్రీడీ మూవీ. కళ్లముందునుంచి ఆసినిమా గుర్తులు ఇంకా చెరిగిపోలేదు. సౌత్ ఢిల్లీలోని మునిర్కా నుంచి ఆయువతి, స్పేహితుడితో కలిసి బయల్దేరింది. యూపీలోని బలియానుంచి ఇంటర్న్ షిప్ కోసం 23 ఏళ్ల ఆ యువతి ఢిల్లీ వచ్చింది. ఆదివారం కదా అని సరదాగా స్నేహితుడితో కలిసి సినిమాకు వెళ్లింది. ఇద్దరూ పాలం చేరాలి. బస్ స్టాపులో ఆగారు. అంతలోనే బస్ వచ్చింది. ఇద్దరూ సరదాగా మాట్లాడుకుంటూ బస్ ఎక్కారు. బస్సులో ఉన్నది కేవలం ఆరుగురే. డ్రైవర్‌తో కలిసి. రెండు మూడు కిలోమీటర్ల దూరం వెళ్లారో లేదో ... బస్సు రూటు మారింది.
వెళ్లాల్సిన మార్గంలోకాకుండా.. మరో దారిన పోతున్నట్లు ఆ అబ్బాయి గుర్తుపట్టాడు. ఏదో కీడు శంకించాడు. బస్సులో ఉన్న డ్రైవర్ ను అడగడానికి ముందుకు వచ్చాడు. ఇద్దరి మధ్య గొడవ. ఒక్కొక్కరుగా చుట్టుముట్టారు. వినలేని మాటలు.., వికృత చేష్టలు. ముందు మాటలు, ఆపై చేతులు. ఆధునిక దుశ్సాసన పర్వం అది. అడ్డుకునేందుకు ఆ అమ్మాయి స్నేహితుడు ప్రయత్నించాడు. ఆవేశంగా వారిపై విరుచుకుపడ్డారు. ఆ దుర్మార్గులకు తెలుసు... దేశానికి రాజధాని అయినా.... ఆడదాని మాన, ప్రాణాలకు రక్షణ లేదని.. ఉండదని. ఎన్ని చూడలేదు వారు... ఎన్ని వినలేదు.
బస్సు ఆగింది. డ్రైవర్ రామన్ సింగ్ చేతిలోని ఇనపరాడ్డుతో తలపై కొట్టాడు. దెబ్బలకు తట్టుకోలేక ఆ అమ్మాయి స్నేహితుడు స్పృహ కోల్పోయాడు. ఉన్న చిన్న అడ్డు తొలగిపోయింది. చరిత్రలో ఏ ఆడదీ మరిచిపోలేని... దారుణ ఉదంతం మొదలైంది.
బస్సు వెనుక భాగంలో డ్రైవర్ రామ్ సింగ్.. రావణుడై... ఆయువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. బస్సు మళ్లీ నడవడం మొదలైంది. ఈలోపల ఒక్కొక్కరుగా ఆమెపై దారుణానికి ఒడిగట్టారు. సాయంకోసం ఆమె ఆర్తనాదాలు ఏ ఒక్కరికీ వినిపించలేదు. వినిపించినా పట్టించుకోలేదో... ఇంత జరుగుతున్నా... బస్సు నడుస్తూనే ఉంది. ఆ చావుకేకలు, ఆ అమ్మాయి ఆక్రందనలు... డ్రైవర్‌కి సంగీతంలా వినిపించాయేమో.. ఎక్కడా ఆపలేదు. రాత్రి 9:45 నిమిషాలకు మొదలైన బస్సు... అలా అలా... ఢిల్లీరోడ్లపై ప్రయాణిస్తూనే ఉంది. ఆ అమ్మాయి అరణ్యరోదనలు వింటూ... దడదడ శబ్దంచేస్తూ... ముందుకు సాగిపోతూనే ఉంది. తర్వాత.. అదే ఇనుపరాడ్డుతో.. 45 నిమిషాలసేపు దారుణం. ఆ అమ్మాయిని కొడుతూనే ఉన్నారు. శరీరంలో ఎక్కడపడితే అక్కడ.
పేగు తెగిపోయింది. కామాంధుల సరదా తీరిందేమో... రాత్రి 11 గంటల సమయంలో మహిపాల్ పూర్ ఫ్లై ఓవర్ సమీపంలో... ఢిల్లీ విమానాశ్రయానికి అతిదగ్గరగా నడుస్తున్న బస్సులోనుంచి రోడ్డుపైకి ఆ ఇద్దర్నీ విసిరేసారు దుర్మార్గులు. అదే రోడ్డుపై వెళ్తున్న సగటు మనిషి పోలీసుకు విషయం చేరవేశాడు. వెంటనే స్థానిక ఆస్పత్రిలో ఇద్దరినీ చేర్పించారు పోలీసులు .
శ్వాస తీసుకోలేని పరిస్థితుల్లో ఆస్పత్రిలో చేరిందామె. ఐదురోజులపాటు వెంటిలేటర్ పై పోరాటం చేసింది. ఎట్టకేలకు శ్వాస నిలిచింది. తనకు తానుగానే గాలిని పీల్చుకునే పరిస్థితి. స్పృహకూడా వచ్చింది. కాని పరిస్థితి మాత్రం ఇంకా విషమం. రాడ్డుతో కొట్టడంతో శరీరంలో చాలా భాగాలు కమిలిపోయాయి. చిన్నప్రేగు పూర్తిగా దెబ్బతింది. దీంతో రక్తం విషంలా మారింది. శరీరంలోని చాలా భాగాలకు ఆ విషం వ్యాపిస్తోంది. శరీరంలోని దాదాపు 600 సెంటీమీటర్ల చిన్న ప్రేగు ఎందుకూ పనికిరాదని దీన్ని వీలైనంత త్వరగా తొలగించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.
అదే జరిగితే... తినే ఆహారం ఏదీ కూడా జీర్ణంకాదు... జీర్ణప్రక్రియ మొత్తం అస్తవ్యస్తం. ఇక జీవితాంతం... కృత్రిమ పద్ధతులపై బతకాల్సిందే. వైద్యులకు ఇదే పరీక్షే. ఉన్న ఒకేఒక్క అవకాశం. అవయవ మార్పిడి. బ్రెయిన డెడ్ అయిన లేదా బతికున్న మనిషి నుంచి చిన్న ప్రేగును సేకరించి దాన్ని బాధితురాలికి అమర్చాలి. ఇప్పటికే ఢిల్లీలో ఉన్న ప్రముఖ ఆస్పత్రులన్నీ ఈ ఆపరేషన్ చేసేందుకు ముందుకు వచ్చాయి. కాని చిన్న ప్రేగు సేకరణ వారికి పెద్ద సమస్య. కష్టపడి మార్పిడి చేసినా... జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. ఆరోగ్యపరమైన సమస్యలు ఉంటాయి. మందులతో బతకాలి.. మందులు తిని బతకాలి. మరి ఆమె ఏం తప్పు చేసిందని ఇంతటి శిక్ష అనుభవించాలి?
అమ్మాయిలూ నిగ్గదీయండి!
ఈరోజు భారతీయులుగా మనం సిగ్గుపడాలి... పైసాకి కొరగాని కొందరు రాజకీయ నాయకులు చస్తే అవనతం చేసే మన జాతీయ జండాని ఈవేళ అందరం సమిష్ట్టిగా అవనతం చేస్తే కొంచెం జాతి గౌరవం నిలబడుతుందేమో!
అమ్మాయిలూ చెప్పండి... ప్లీజ్... గొంతెత్తి చెప్పండి... ‘మా ఇష్టం... మా ఇష్టం వచ్చినట్టు మేం ఉంటాం... రక్షణ కల్పించడం ఈ దేశం బాధ్యత’ అని! బోధించే వాళ్లని నిలదీయండి - ‘మీరు చెప్పినట్టు వింటే మేము అర్ధరాత్రి ఒంటరిగా తిరగగల గ్యారంటీ ఇవ్వగలరా? ఆరు గంటలకు బస్సులు, ఏడు గంటలకు పబ్బులు మూసెయ్యగలరా? అలా కానప్పుడు మాకు వెళ్లే అధికారం లేదని ఎలా చెప్తున్నారు’ అని! మేము మీకు రక్షణ ఇవ్వలేమంటే... మమ్మల్నే కాదు, అందర్నీ ఇళ్లలో కూర్చోమనండి అని, ఆరింటికి అన్నీ మూసేసి కూర్చోండి అని, ఇదే మేము చెయ్యగలిగింది అని చెప్పుకోమనండి.
అమ్మాయిలూ... ఇంజనీర్లు, డాక్టర్లు అయ్యామని సంబరపడకండి! మీకు అన్యాయం జరుగుతోంది... మీపై అమానుషాలు జరుగుతాయి పోరాడండి.. ప్లీజ్.. పాలించేవాళ్లని రోడ్డుమీదకి లాగి, వాళ్ల మురికి కొంచెం కడిగి.. మాకు రక్షణ కల్పించే శాసనాలు చెయ్యండని... నిగ్గదీయండి! ఎక్కడో ఢిల్లీలో ఏదో అమ్మాయికి జరిగిన విషయం కాదిది... ఇది మన జాతి మనుగడకి సంబంధించిన సమస్య. ప్లీజ్ స్పందించండి... మేము మిమ్మల్ని ఎక్ట్స్రార్డినరీ చేస్తాం అన్న పిచ్చి మాటలకి చప్పట్లు కొట్టకండి...
మిమ్మల్ని మీరు నమ్ముకోండి! ఈ సృష్టిలో ఉన్న ఎలాంటి వారైనా... ఏ మూలలో ఉన్నా స్పందించండి... వినిపించండి మీ గొంతు! ప్లీజ్... మన బతుకుల్లో కొంచెం జీవం నింపుదాం... ఈ దేశాన్ని రక్షించుకుందాం!
- శేఖర్ కమ్ముల, సినీ దర్శకుడు
ఈ హింసాప్రవృత్తి జంతు హింస నుంచే మొదలవుతుంది...
- అమల, సినీనటి, జంతుప్రేమికురాలు
మన ఆడబిడ్డలను కాపాడుకుందాం!
- కృష్ణంరాజు, సినీ దర్శకుడు
21వ శతాబ్దం కూడా స్త్రీలు సురక్షితంగా లేరంటే ఏమనాలి?
- వెంకటేష్, సినీ నటుడు
No comments:
Post a Comment