all

Sunday, January 13, 2013





సంబరాల సంక్రాంతి ….....తెచ్చింది విశ్రాంతి !

సంక్రాంతి పండుగ ఎపుడు ? ఈ నెల 14 వ తేది సోమవారం... అలసి సొలసిన హై టెక్ నగర జీవులకు నాలుగు రోజుల పాటు ఎంతో విశ్రాంతిని తెచ్చింది. ఈ పండుగకు చాలా మంది నగర వాసులు గ్రామీణ ప్రాంతాలలోని తమ ఇండ్లకు వెళ్లి కుటుంబ సభ్యుల కలయిక లో బాగా ఆనందిస్తారు.

ఎంత హై టెక్ జీవనాలు సాగించినప్పటికి, పండుగ ప్రత్యేకతలు నాటికి నేటికి...గంగిరెద్దులు, హరిదాసులు, ఇంటి ముంగిట రంగుల ముగ్గులు, మామిడి తోరణాలు, చెరుకు గడలు, పిండివంటలు, సూర్యుడు కి నైవేద్యం చేసిన కొత్త బియ్యపు పొంగలి అన్నీ కొనసాగుతూనే వున్నాయి.
పచ్చని ప్రదేశాలతో, ఆహార ధాన్యాల ఉత్పత్తి లో దేశానికి వెన్నెముకగా, అన్నపూర్ణ గా ఖ్యాతి గాంచిన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ వాతావరణం సంక్రాంతి పండుగ సమయంలో ఒక అద్భుత దృశ్యం. వాస్తవం లో ఈ పండుగను నగర వాసులు అనుభవించక పోయినా, బాపు, రమణ ల వంటి గొప్ప వ్యక్తులు మన తెలుగు సంక్రాంతి సంబరాలను, సంప్రదాయాలను ప్రతిబింబించేలా చిత్రీకరించిన సినీ ఘట్టాలను చూసి ఆనందించని వారుండరు. ఆంధ్ర రాష్ట్రం లో నాలుగు రోజుల పాటు ఈ పండుగను చేస్తారు.

అవి ...మొదటి రోజు 'భోగి', రెండవ రోజు 'మకర సంక్రాంతి ' (ఇది అసలైన పండుగ రోజు) మూడవ రోజు 'కనుమ', చివరి రోజు లేదా నాల్గవ రోజు 'ముక్కనుమ' గా చెపుతారు.
భోగి రోజున కుటుంబం లోని పెద్దలూ పిల్లలూ అందరూ కలసి ఉదయం వేళ కొయ్య దుంగలతో రోడ్లపై భోగి మంటలు వేస్తారు. తమ తమ ఇండ్లలోని, పనికిరాని పాత చెక్క వస్తువులను, ఇతర వస్తువులను మంటలలో పడవేసి, పనికిరాని పాతకు స్వస్తి చెప్పి కొత్త దనాన్ని కోరతారు. ఈ చర్య పాత చెడు అలవాట్లని మాని కొత్త మంచి అలవాట్లని చేసుకోవాలని కూడా సూచిస్తుంది.
చాలా కుటుంబాలలో శిశువులకు, పిల్లలకు అంటే సాధారణంగా, మూడు సంవత్సరాల వయసు లోపు వారికి ఒక సాయంకాల వేడుకగా రేగిపండ్లు, పూవులు, చిల్లర నాణేలు కలిపి వారి తలపై పోసి ఆనందిస్తారు. దీనినే భోగి పండ్లు పోయటం అంటారు. రుచికరమైన తీపి పదార్థాలు తయారు చేసి అందరికి పంచుతారు.

కుటుంబం లోని సభ్యులు ఎవరెవరు ఎక్కడ ఉన్నప్పటికీ, ఈ పండుగనాడు ఒకే చోట కలసి ఆనందిస్తారు. సోదరులు లేదా, తల్లి తండ్రులు, వివాహం అయిన తమ ఇంటి ఆడ పిల్లలని పండుగకు పిలిచి వారికి బట్టలు, ఇతర బహుమానాలు పంచి వారి ప్రేమాప్యాయ తలను చాటుకుంటారు. ఇంటి లేదా, దుకాణాల, ఇతర ప్రైవేటు సంస్థల యజమానులు తమ సిబ్బంది కి బోనస్ గా కొంత సొమ్ము లేదా, బట్టలు వంటివి పంచి వారిని ఆనందింప చేస్తారు.

రెండవ రోజు మకర సంక్రాంతి లేదా ' పెద్ద పండుగ'. అంటే ఇది పండుగలలో అన్నిటికంటే పెద్ద పండుగ అని అర్ధం. ఈ రోజు అందరూ కొత్త దుస్తులు ధరిస్తారు, దేముని పూజిస్తారు, ఈ రోజున సూర్యుడు మకర రాశి లో ప్రవేశిస్తాడు. కనుక దీనిని మకర సంక్రమణం అని కూడా అంటారు.

మరణించిన తమ పూర్వీకులకు సాంప్రదాయకంగా కొన్ని కర్మలను ఆచరిస్తారు. ఇంటిలో తయారు చేసిన పిండి వంటలతో కుటుంబ సభ్యులు అందరూ కలసి భోజనాలు చేస్తారు.
మకర సంక్రాంతి పండుగ మూడవ రోజున, పశు పక్ష్యాదులను లను గుర్తు చేసుకుంటూ ప్రత్యేకించి ఆవులను, ఎద్దులను పూజిస్తారు. దీనిని కనుమ పండుగ లేదా పశువుల పండుగ అని కూడా అంటారు. ఈ రోజున ప్రయాణించటం ఆశుభంగా భావిస్తారు. ఈ రకంగా సంక్రాంతి పండుగలో తమ సంప్రదాయ, సాంస్కృతిక విలువలు ప్రదర్శిస్తూ కొత్త మార్పులని ఆచరిస్తారు. గురువులు, తమ శిష్యులను ఆశీర్వదిస్తారు. ఇంటి పెద్ద కుటుంబంలోని సభ్యులకు దుస్తులు అందించి ఆశీర్వదిస్తారు.

pongal third day special kanuma

సంక్రాంతి పండుగ నాల్గవ రోజు ను 'ముక్కనుమ' అంటారు. సంక్రాంతి పండుగ మొదటి మూడు రోజులు కోస్తా ఆంధ్ర ప్రాంతం లోని ప్రజలు మాంసం లేదా చేపలు వంటి ఆహారాలు తినరు. కాని మూడవ రోజు అయిన కనుమనాడు మామ్సాహారాలను అధికంగా తింటారు. తెలంగాణా ప్రాంతం లో ఈ పండుగ రెండు రోజులు మాత్రమే చేస్తారు.
వీరు మొదటి రోజు నువ్వుల తో కలిపి వండిన అన్నాన్ని తిని,
రెండవ రోజు అయిన పండుగనాడు మాంసం తింటారు. ఈ పండుగకు అన్ని కుటుంబాలు అరిసెలు, అప్పాలు వంటి పిండి వంటలు చేసి దేముడికి నైవేద్యం చేసి వారు తింటారు.
ఈ పండుగకు దక్షిణ దేశపు ఆటలు అయిన కోడి పందేలు, ఆంధ్ర కోస్తా జిల్లాలలో ఆడగా, తమిళనాడు రాష్ట్రం లో ఎద్దుల పందేలు, కేరళ లో ఏనుగుల మేళా నిర్వహిస్తారు. ఈ పందేలలో చట్టబద్ధం కానప్పటికీ అధిక మొత్తాలలో పందేలు కాయటం ఈ ప్రాంతాలలో ఆనవాయతీగా వస్తోంది.
ఈ పండుగ మరో ప్రత్యేకత పండుగ ఇంకా నెల రోజులు వున్నదనగానే, ప్రతి రోజూ ఉదయం వేళ రంగుల దుస్తులు ధరించి హరిదాసులు, గంగిరెద్దులు ప్రతి ఇంటి ముందుకు తెచ్చి ఇంటి వారికి ఆశీర్వాదాలు ఇచ్చి సొమ్ము అడుగుతారు.
ఈ పండుగకు హైదరాబాద్, తెలంగాణ జిల్లాలలో పిల్లలు, పెద్దలు కలసి రంగు రంగుల గాలి పటాలు తమ భావనాలపైకి ఎక్కి ఎగుర వేసి ఆనందిస్తారు. ఆంద్ర దేశం తో పాటు, పొరుగునే కల కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలు కూడా ఈ పండుగను పొంగల్ పేరుతో ఆచరిస్తాయి.
ఈ పండుగ రోజున ఉదయం వేళ ప్రతి ఇంట్లో ఈ సంవత్సరంలో కొత్త గా తాము పొందిన పంటలోని బియ్యాన్ని ఎంతో కృతజ్ఞతగా వండి పొంగలి తయారు చేసి సూర్యుడు కి నైవేద్యం చేసి తాము తింటారు. దక్షిణ భారత దేశం లో ఇది పెద్ద పండుగలలో ఒకటి. ఇండ్లను పూవులతో, రంగు రంగుల ముగ్గులతో అలంకరిస్తారు. కుటుంబం లో ప్రతి ఒక్కరూ కొత్త దుస్తులు ధరించి ఆనందిస్తారు.
తమిళనాడు రాష్ట్రం లో పొంగల్ పండుగ మరియు, వారి కొత్త సంవత్సరం ఒకే రోజున వస్తాయి. మకర సంక్రాంతి పండుగను ఉత్తర భారత దేశం మరియు, మరికొన్ని ఇతర భాగాలలో లోరీ, బిహు, హడగా, పొకి మొదలైన పేర్లతో పంట కోతల పండుగ గా చేస్తారు.
మరి ఇంత చేటు ఆనందోత్సాహాలను కలిగించి అందరికి ఎంతో మార్పు ఇస్తూ సంవత్సరానికి ఒక్కసారి వచ్చే ఈ పండుగను తప్పక ఆచరిద్దాం, ఆనందాల హేలను పలికిద్దాం.

ఆహ్లదకరమైన వాతావరణంలో సంతోషాలు వెళ్ళువిరిసే ‘కనుమ’

మకర సంక్రాంతి మరుసటి రోజు అంటే ముచ్చటగా మూడవ రోజు(భోగి, మకరసంక్రాంతిlink, కనుమ) కనుమ అంటారు. ఈ రోజున పల్లెల్లో రైతుకు వ్యవసాయంలో సహకరించే పశువులను పూజించడం ఆచారం.
ఆ రోజున పశువుల పాకలను చక్కగా అలంకరించి అక్కడ పాలు, కొత్తబియ్యంతో పొంగలి వండుతారు. ఆ పొంగలిని దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత పొలానికి తీసుకెళ్లి చల్లుతారు.

దీన్నే పొలి చల్లటం అని అంటారు. అంటే దాని అర్థం ఆ సంవత్సరం పాటు పండే పంటలకు చీడ-పీడలు సోకకుండా కాపాడమని దేవతలను ప్రార్ధిస్తారు.
ఇలా చేస్తే పంటలు బాగా పండుతాయన్నది వారి నమ్మకం. అయితే ఈ పొలి పొంగలిలో పసుపు, కుంకుమ కలిసి కొద్దిగా కుంకుమ రంగు ఎక్కువగా ఉన్న పొలి పొంగలిని చల్లుతుంటారు.
అలాగే మంచి గుమ్మడి కాయను దిష్టి తీసి పగులకొడతారు.


pongal third day special kanuma

కనుమనాడు ఆవులు, ఎద్దులు, గేదెలు, దున్నలను పసుపు, కుంకుమ, పువ్వులు, బెలూన్లతో అలంకరించి పూజించటం జరుగుతుంది.
ఆ రోజున వాటితో ఏ పని చేయనీయక వాటిని పూజ్య భావంతో చూస్తారు. ఎందుకంటే పల్లెల్లో పశువులే గొప్పసంపద, అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం, పంటల్లో వీటి పాత్ర ఎంతో ఉంది.

వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు.మరో ప్రత్యేక అంశం కొన్ని ప్రాంతాల్లో ‘కనుమ' నాడు ‘మినుములు' తినాలనే ఆచారం. అందుకే ‘మినపగారెలు' చేసుకొని తింటారు.
పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలు, అత్తింటికి వెల్ళిన అల్లుళ్ళు కూడా కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు.

కనుమ రోజు కాకి కూడ కదలదని సామెత. ఇక పిండివంటలlink ప్రత్యేకతే వేరు... మాంసాహారం తినేవాళ్ళు కనుమనాడు తప్పక మాంసాహర విభిన్న రుచులను వండుకొని తింటారు.

అలాగే ఈ రోజున బొమ్మల కొలువు ఎత్తటం అని పేరంటం చేస్తారు. బొమ్మలకు హారతి పట్టి ఒక బొమ్మను శాస్త్రార్థ పరంగా ఎత్తి పెడతారు.

అంతే కాదు గొబ్బెమ్మల పూజలు, హరిదాసుల రాకపోకలు, ఎడ్ల పందాలు, ఎడ్లను ఊరేగించడం, కొన్ని ప్రాంతాల్లో కోడి పందాలు, బంతిపూలతో తోరణాలు, కొత్త జంటల విహారాలు, బావమరదల్ల ఇకఇకలు, పకపకలు ఎంతో ఆహ్లదకరంగా ఉంటాయి.
ఇదే కనుమ యొక్క ప్రత్యేకత..

ఆంధ్రులకు అతి పెద్ద పండుగ ‘సంక్రాంతి’

ఆంధ్రులకు అతి పెద్ద పండుగ సంక్రాంతి. సంక్రాంతి సంబరాలు..అంబరాన్నంటేలా జరుపుకే ఈ పండుగ ‘భిన్నత్వంలో ఏకత్వం' అనే పదానికి సంక్రాంతి పండుగ బాగా నప్పుతుంది. సంక్రాంతి లేదా సంక్రమణము అంటే ‘మారడం' అని అర్థం.

సూర్యడు మేషాది ద్వాదశ రాశులందు క్రమంగా పూర్వరాశి నుంచి ఉత్తరాశిలోకి ప్రవేశించడం సంక్రాంతి. అందుచేత సంవత్సరానికి పన్నెండు సంక్రాంతులు ఉంటాయి. ఈ పన్నెండు సంక్రాంతుల్లోనూ పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది జనవరి నెలలో వస్తుంది. మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 14న సూర్యుడు ఉత్తరాయణ పథంలో అడుగుపెడతాడు.

ఈ రోజు నుంచి స్వర్గద్వారాలు తెరచి ఉంటాయని పురాణాలు పేర్కొన్నాయి.ఈ సంక్రాంతి పండుగను ఆంధ్రులు చాలా ఘనంగా జరుపుకుంటారు.

ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలలో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని, మహారాష్ట్ర, గుజరాత్ లలో మకర్ సంక్రాంతి అని, పంజాబ్, హర్యానా లలో లోరీ అని పిలవబడే ఈ పండుగను మూడు రోజుల పాటు జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో సంక్రాంతిని కోస్తా జిల్ల ప్రజలు వైభవంగా జరుపుకుంటారు. ముఖ్యంగా పంట చేతికొచ్చిన ఆనందంలో రైతులు ఈ పండుగ జరుపుకోవడం ఆనాటి కాలం నుండి ఆనవాయితి.

pongal the four days big festival


ఈ పండుగను జరుపుకొనే మూడు రోజుల్లో మొదటి రోజును భోగి అని, రెండవ రోజును సంక్రాంతి అని, మూడవ రోజును కనుమ అని పిలుస్తారు. ఇలా మూడు రోజులు ఎంతో అత్యంత వైభవంగా జరుపుకొనే ఈ పండుగను పెద్ద పండుగ అంటారు. ఇంకా మరికొంత మంది కనుమ తర్వాత నాలగవ రోజును ముక్కనుమని అని నాల్గవ రోజూనూ సెలబ్రేట్ చేసుకొంటారు.

ముక్కనుమ రోజు బంధువులు, స్నేహితులతో కలిసి వారి బహుమతులను అంధించడం ఆనవాయితి. వారికి మాత్రమే కాదు, వ్యవసాయధారులకు, పనివారికి కూడా మంచి బహుమతులను అంధిస్తారు. నిజం చెప్పాలంటే ఈ ధనుర్మాస నెల ప్రారంభం కాగానే నెల రోజుల పాటు వాతావరణం చలిచాలిగా తెలుగునాట ప్రారంభమవుతుంది.

ఈ నెల రోజులూ తెలుగు పల్లెలు ఎంత అందంగా, ఆహ్లాదకరంగా అలరారుతూ ఉంటాయో చూసి తీరాల్సిందే...సంక్రాంతి నెల ఆరంభం కాగానే ప్రతీ రోజూ తమ ఇళ్ళ ముంగిళ్ళలో రంగవల్లులు, ప్రత్యేకంగా ఆవు పేడతో తయారు చేసే గొబ్బెమ్మలతో రకరకాల పువ్వులతో అలంకరిస్తారు. మరో ప్రక్క బుడబుక్కలవాళ్లు, పగటి వేషధారుల, వివిధ రకాలజానపద వినోద కళాకారలు నెలమొత్తం వీధుల్లో అలరిస్తుంటారు.

ఇక భోగి రోజు భోగి మంట విధిగా వేయవలసిందే. ఆ రోజు సాయంత్రం పేరంటంలో పిల్లలకు భోగిపళ్ళు తప్పవు. ఈ పెద్ద పండగకు కొత్త అల్లుడు అత్తవారింటికి వస్తాడు.ఈ సంక్రాంతికి మరో ప్రత్యేకత ఉంది అదేంటంటే ఏ పల్లెలో చూసినా కోడి పందాలు, ఎడ్ల బళ్ళ పందాలు జరుపుకొంటారు.

ఇంట్లో ఉన్న పశువులను పువ్వులు, బెలూన్స్ తో అత్యంత ఆకర్షణీయంగా అలంకరిస్తారు. ఇవన్నీ సంక్రాంతి పండుగకు శోభ చేకూర్చే సర్వ సామాన్య విషయాలు.

 

సకల శుభాలకు శోభ తెచ్చే మకర సంక్రాంతి...

పండుగల్లో అతి పెద్దగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లె వాతావరణానికి కొత్త కాంతి వచ్చినట్లే. ఎక్కడ చూసినా ఆనందం, సంతోషం వెల్లువిరుస్తుంటుంది. పండగ సంబరాలు కనిపిస్తుంటాయి. మనకు ఉన్న చాలా పండుగలు ఒకటి రెండు రోజుల మాత్రమే జరుపుకుంటారు. అయితే సంక్రాంతిని మాత్రం మూడు... నాలుగు రోజులు జరుపుకుంటారు.

మొదిటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుక అయితే మరికొందరు నాలుగవ రోజుకూడా ముక్కనుమ పేరుతో సంబరాలు జరుపుకుంటారు.సంక్రాంతి మొదటి రోజు భోగి గురించి మునపటి వ్యాసంలో తెలుసుకున్నాం..

ఇక రెండవ రోజు సంక్రాంతి పండుగ గురించి తెలుసుకుందాం.. ముఖ్యంగా రెండవ రోజును మకర సంక్రాంతి అంటారు. ఆ రోజున కొత్త పొయ్యి, కొంత కుండలు తెచ్చి వాటిలో పాలు పొంగించి, దానితో మిఠాయిలు తయారు చేస్తారు. కొన్ని ప్రదేశాల్లో పితృదేవతలకు తర్పణాలు ఇస్తారు. ఉత్తరాయణ పుణ్యదినమైన మకర సంక్రాంతి అంటేనే డూడూ బసవన్నలు, హరిదాసుల పాటలు మనకందరికీ గుర్తుకు వచ్చేస్తుంటాయి. అయితే మకర సంక్రాంతికి నిజమైన అర్థం సూర్యుడు ప్రతీ ముప్పై రోజులకు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తాడు.



మకర సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశించే సమయం. సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే సమయంలో ఉత్తర ముఖంగా ప్రయాణిస్తాడు. కనుక ఈ కాలాన్ని ఉత్తరాయణ కాలం అంటారు.దాంతో సంక్రాంతి నుంచే ప్రకృతిలో ప్రధానమైన మార్పులు వస్తాయి. పంటలు చేతికి వచ్చి జీవితం సుఖసంతోషాలతో ఉత్సాహిత మౌతుంది. ముఖ్యంగా ఈ పండుగ రోజున కలవాడు లేనివారికి దానాలు ధర్మాలు చేస్తారు. ఉత్తరదేశంలో గొంగళ్ళు దానం చేయడం కూడా సాంప్రదాయంగా వస్తున్నది. ఇది కూడా శీతవాత హర సూచకమే.



కొత్త అల్లుళ్ళు అత్తవారి ఇళ్ళకు వెళ్తారు. అత్తవా రింటిలో మరదళ్ళతో ముచ్చట్లు, వదినల వరసలతో సరదాగా కుటుంబ సభ్యులు సందడిగా గడుపు తారు. పండుగరోజున పల్లె ప్రాంతాల్లో గంగిరెద్దుల ఆటలు ప్రధాన వినోదంగా సాగుతాయి. ఇంకొన్ని చోట్ల కోడి పందాలు జోరుగా సాగుతాయి. పిల్లలు రంగురంగుల గాలిపటాలు ఎగురవేస్తారు. ఈరోజు ముఖ్యంగా ఆడపడుచులు రథాకారంలో ఉండే రంగవల్లికలను ఇంటిముందు తీర్చిదిద్దుతారు. మరి కొంతమంది బొమ్మలకొలువును ఏర్పాటు చేస్తారు.




Pongal Second Day Special Makara Sankranti

తమ ఇంట పంట చేరినందుకు గుర్తుగా వరికంకులను ఇళ్ళ వసారాలలో పక్షులకు ఆహారంగా ఉంచుతారు.ఇక ఈ పండుగ రోజు గంగిరెద్దులను ఆడించే గంగిరెద్దుల వారు చక్కాగా అలకరించి వాటిని ఇళ్ల చుట్టూ తిప్పుతూ డోలు సన్నాయి, రాగాలకు అనుగుణంగా వాటితో చేయించే నృత్యాలు చూడటానికి చాలా రమణీయంగా ఉంటాయి.

 ఇక మనం ఇచ్చే కానుకలను తీసుకుంటున్నట్లు తలలు ఊపుతూ మోకాళ్ల మీద వంగటం వంటి విద్యలను వాటికిత నేర్పిస్తారు. ఇక అయ్యగారికి దండం పెట్టు, అమ్మగారికి దండం పెట్టు అంటూ గంగిరెద్దుల వాళ్లు సందడి చేస్తూ కొత్తగా వచ్చిన ధాన్యాన్ని తీసుకుంటారు. హరిలో రంగహరి అంటూ నడినెత్తిపై నుండి ముక్కుదాక తిరుమణి పట్టెలతో, గజ్జెలతో ఘల్లుఘల్లు మంటూ చిందులూ వేస్తూ హరిదాసులు ప్రత్యక్షమవుతారు. కాబట్టే పట్టణమైనా, పల్లెలైనా, సంక్రాంతి శోభ పరచుకుంటాయి.

అందుకే తెలుగు వారికి అత్యంత ముఖ్యమైన పండుగ సంక్రాంతి.

సంక్రాంతి మొదటి రోజు ‘భోగి’ భాగ్యాల విశిష్టత

పండుగల్లో అతి పెద్దగా జరుపుకొనే పండుగ సంక్రాంతి. సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లె వాతావరణానికి కొత్త కాంతి వచ్చినట్లే. ఎక్కడ చూసినా ఆనందం, సంతోషం వెల్లువిరుస్తుంటుంది. పండగ సంబరాలు కనిపిస్తుంటాయి. మనకు ఉన్న చాలా పండుగలు ఒకటి రెండు రోజుల మాత్రమే జరుపుకుంటారు. అయితే సంక్రాంతిని మాత్రం మూడు... నాలుగు రోజులు జరుపుకుంటారు.

మొదిటి రోజు భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడవ రోజు కనుక అయితే మరికొందరు నాలుగవ రోజుకూడా ముక్కనుమ పేరుతో సంబరాలు జరుపుకుంటారు.మొదటి భోగి రోజు ప్రత్యేకత తెలుసుకుందాం...

భోగి రోజు తెల్లవారు జామునే ఇంటిలోని వారంతా తలంటుస్నానం చేయటం, కొత్త బట్టలు ధరించటం, అడుతూ, పాడుతూ గడపటం పరిపాటి. ఉదయం పూట భోగి మంట ఓ మధురాను భూతి కలిగిస్తుంది. ఈ భోగి మంటకు పిల్లలు పెద్దలు అందరూ ఉండి సంతోషంగా భోగి మంటలు వేసుకొంటారు. భోగి రోజు ఉదయాన్నే ప్రతి ఇంటి ముందూ భోగి మంట మండాల్సిందే.
అందరూ తమ ఇళ్ళలోని పాత వస్తువులు, వాడకంలో లేని పలు సామాగ్రిని పోగుపెట్టి భోగి మంటగా వేస్తారు.‘భగ' అనే పదం నుండి ‘భోగి' అన్న మాట పుట్టిందని చెబుతారు. భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం. దక్షిణాయనంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతిచేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు ‘భోగి మంటలు'మకర సంక్రాంతి నెలంతా కన్నెపిల్లలు తమ ముంగిళ్ళలో ఆవుపేడతో పెట్టిన గొబ్బిళ్ళను పిడకలుగా చేసి, ఆ పిడకలతో భోగి మంట వేస్తారు. ఇది భోగి మంట ప్రాధాన్యత.

pongal first day special bhogi mantalu

 ఆవు పేడలోని ఔషధగుణాలు కారణంగా మంటల నుండి వెలువడిన పొగ వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తుంది. భోగి రోజు ఉదయాన్నే అభ్యంగన స్నానాలు చేసి భోగి మంటలపై వండిన మధుర పదార్ధాల్ని తింటారు. ఈ రోజు సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోస్తారు. ఇలా చేయడం వలన పిల్లలకు దృష్టి దోషం తొలుగుతుందని భావిస్తారు.కుటుంబంలోని వారందరూ తలస్నానాలు చేసి "సంక్రాంతి లక్ష్మి" ని పూజిస్తారు. కొత్త బట్టలు కట్టుకుంటారు. భోగి రోజు మూడు లేక ఐదు కూరగాయలను కలిపి కూరగా వండుతారు. దీన్ని "కలగూర" అంటారు. "నువ్వు పులగం, పొంగలి", ప్రధాన వంటకాలు. సాయంత్రము చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి పేరంటము జరుపుతారు. బొమ్మల కొలువును ఏర్పరచడం కూడ వుంటుంది. బొమ్మలకు హారతి యిచ్చి, పేరంటం చేస్తారు. ఇదే భోగి యొక్క విశిష్టత.

 

ఆకలేస్తే అన్నం పెడతా... చాన్సిస్తే మళ్లీ వస్తా...యానా గుప్తా

 
అజ్ఞాతవాసం
‘‘బాపూజీ జర ధీరే చలో’’ పాటను గుర్తు చేస్తే మరుక్షణం మనసులో మెదులుతుందామె. పొడుగ్గా ఉన్న అమ్మాయిలు కూడా పొగరు, వగరు నృత్యాలు అదరగొట్టేయగలరని నమ్మడం మొదలైంది ఆ పాట తర్వాతే. విదేశీ లుక్స్ స్వదేశీ వెండితెరపై హిట్స్ కొట్టగలవని నిరూపితమైంది ఆ అమ్మాయితోనే. ఎగసే సముద్రపు హోరులాంటి పాటకు తగ్గట్టుగా పోటెత్తిన ఆ అరుదైన సౌందర్య ప్రవాహం తన దిశను ఎటు మార్చుకుంది? పేరులోనే కాదు కెరీర్‌లోనూ సగం భారతీయతను మేళవించిన ఆ ఫ్యూజన్ గాళ్... కనపడకుండా కన్‌ఫ్యూజ్ చేస్తోందేం? 

యానా సింకోవా. మనకే మాత్రం సింకైనట్టు లేదు కదూ! అయితే చివరి పేరు తీసేసి గుప్తా తగిలించండి, హమ్మయ్య అనిపిస్తుంది. ఈ ఇంట్రెస్టింగ్ నేమ్‌కు సొంతదారు ఐదడుగుల ఎనిమిది అంగుళాల పొడగరి... యానాగుప్తా. చెక్ రిపబ్లిక్ పౌరురాలైన యానా, టాప్ మోడల్. ఇంగ్లిష్, గ్రీక్, హిందీ, స్పానిష్, జపనీస్... ఇలా పలు భాషల్లో ప్రవీణురాలు. పదహారేళ్లకే మోడలింగ్ కెరీర్‌ను స్టార్ట్ చేసిన యానా... మిలన్, పారిస్, వియెన్నా, మ్యూనిచ్, హ్యాంబర్గ్, టోక్యో వంటి ప్రాంతాలెన్నో తిరిగింది.

కెల్విన్ క్లెన్, విక్టోరియా సీక్రెట్, టయోటా, హోండా, సోనీతో పాటు నివ్యా, రెక్సోనా, ష్యూమురా, షిషిడో వంటి కాస్మొటిక్ కంపెనీలకూ పనిచేసింది. చదువుకునే వయసులోనే జపాన్‌లో మోడల్‌గా ఒక వెలుగు వెలిగింది. పార్క్ ఆర్కిటెక్చర్- గార్డెనింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చే శాక జపాన్‌ను వదిలిపెట్టి, ‘కొత్తదనం’ కోసం భారత్‌కు వచ్చేసింది. ఇక్కడ ఆథ్యాత్మిక పరిమళాలను అద్దుకునే క్రమంలో ‘ఓషో’ ఆశ్రమంలో కలిసిన పంజాబీ చిత్రకారుడు సత్యకామ్, గుప్తాను ప్రేమించి పెళ్లాడింది. పుణెలో నివాసం ఏర్పరచుకుంది. 

మ్యారేజ్... నాట్ ఎ డ్యామేజ్!
పెళ్లయితే సినిమా కెరీర్‌కు ఫుల్‌స్టాప్ పడినట్టే! ఇక మోడలింగ్ గురించైతే మాట్లాడడం కూడా అనవసరం. ఇలాంటి అభిప్రాయాలు బాగా ఉన్న రోజులవి. కానీ యానాగుప్తా వీటన్నింటికీ మినహాయింపు. పెళ్లయ్యాక కూడా లిమ్కా, ఎంటీవీ, లాక్మె వంటి టాప్ బ్రాండ్స్‌కు వర్క్ చేస్తూ స్టార్ మోడల్‌గా వెలిగింది. పెద్ద పెద్ద హీరోయిన్లు ఎంతోమంది పెళ్లి చేసుకుని గృహిణులుగా సెటిలైపోతుంటే, యానా మాత్రం ఓ పెద్ద సినిమాలో ఐటమ్‌సాంగ్ చేసే చాన్స్ కొట్టేసింది. 

సందీప్‌చౌతా సంగీతం, సమీర్ సాహిత్యం, సుఖ్వీందర్, సోనూల గానం... ఇన్ని ఉన్నా, యానా లేకపోతే సున్నా అన్న రేంజ్‌లో ‘దమ్’ ఐటమ్‌సాంగ్ ఆమెకు పేరు తెచ్చింది. ‘బాపూజీ జర థీరే చలో’ పాటకి జతగా యానా వేసిన స్టెప్స్‌కి థియేటర్లు విజిల్స్‌తో మార్మోగాయి. అదే ఊపులో అర్జున్ రామ్‌పాల్ సరసన ఏక్ అజ్‌నబీ, రక్త్ వంటి చిత్రాల్లో వరుసగా నర్తించింది. తెలుగులో రెండు, తమిళంలో, కన్నడంలో ఒక్కొక్కటి చొప్పున అవకాశాలు దక్కించుకుంది. చిన్నితెర ఆఫర్లు కూడా బాగానే అంది పుచ్చుకుంది. జూమ్‌టీవీలో మ్యూజికల్ కౌంట్‌డౌన్ షోకి యాంకర్‌గా పనిచేసింది. తెలుగులో మెగాస్టార్ సరసన తళుక్కున మెరిసింది. అయితే ఉన్నట్టుండి కనపడకుండా మాయమైంది. ఏమైంది? ఏం చేస్తోంది?

యానా... మళ్లీ వచ్చేనా? 
ప్రేమపెళ్లి కొంతకాలానికే పెటాకులైంది. ప్రేమించిన వ్యక్తి దూరమైన వేదనో, సరైన చాన్సులు రాని బాధో గాని, యానా గ్లామర్ రంగం నుంచి విరామాన్ని కోరుకుంది. విడాకులు తీసుకున్న ఈ 35 సంవత్సరాల ప్రౌఢకు అభిరుచిగా నేర్చుకున్న పియానో, ఫ్లూట్‌లు నేస్తాలయ్యాయి. ఆనందాన్ని, సంతోషాన్నిచ్చే డ్యాన్స్‌ను తోడు చేసుకుంది. ఇప్పటిదాకా అరకొర కార్యక్రమాల్లోనో, అడపాదడపా ఇంటర్వ్యూల్లోనో తప్ప కనిపించని ఈ క్రేజీ సుందరి... ఇప్పుడిప్పుడే తిరిగి కెరీర్ వైపు దృష్టి సారిస్తోంది. కార్టూన్స్, గేమ్స్ ఆధారిత చిత్రాలు తీసే ఇండియా గేమ్స్ అనే సంస్థతో ఇటీవలే ఒప్పందం కుదర్చుకుంది.

పూర్తి వెజిటేరియన్ అయిన యానాకి ఫిట్‌నెస్ మీద కూడా మంచి పట్టు ఉంది. ఆ పట్టుతోనే ‘హౌ టు లవ్ యువర్ బాడీ అండ్ గెట్ ది బాడీ యు లవ్’ పేరిట ఓ పుస్తకాన్ని రాస్తోంది. మన దేశం తనకి ఇచ్చిన ప్రతిదీ యానాకు నచ్చిందే. కెరీర్ నుంచి కేర్ టేకర్ దాకా. మనకూ విదేశీ గ్లామర్ రంగానికీ ఉన్న వ్యత్యాసాన్ని ప్రస్తావిస్తూ... ‘‘యూరోపియన్ డిజైనర్స్‌లో ఎక్కువమంది డ్రెస్సుల మీదే తమ దృష్టి కేంద్రీకరిస్తారు. అందుకే ర్యాంప్‌షోలు డల్‌గా అనిపిస్తాయి. 

అదే భారతదేశంలో అయితే డిజైనర్స్ చిన్నపాటి డ్రామాను, హంగామాను క్రియేట్ చేస్తారు. మోడల్స్‌ను కూడా అందులో ప్రధాన భాగం చేస్తారు’’ అంటూ ఇక్కడి గ్లామర్ రంగాన్ని ప్రశంసిస్తుందామె. భారతీయ పౌరసత్వం తీసుకోవాలని, త్వరలో తన సొంత ఇంగ్లిష్ ఆల్బమ్‌ను విడుదల చేయాలని యానా ప్లాన్ చేస్తోంది. తిరిగి సినిమాల్లోకి ప్రవేశించాలని కూడా ఆశిస్తోంది. యోగా+మెడిటేషన్+వర్కవుట్ వెరసి వన్నె తరగని ఈ సౌందపర్యరాశి కలే సాకారమైతే... మరో సూపర్ సాంగ్‌కు ఆకారం వచ్చినట్టే!
- ఎస్.సత్యబాబు

వడ్డీ భారం తగ్గుతోందా? పెరుగుతోందా?

 
టిప్స్
నేరుగా అనకూడదు కానీ, అవకాశమొస్తే వినియోగదారులను ముంచడానికి కొన్ని ఆర్థిక సంస్థలు సిద్ధంగా ఉంటాయి. మనం ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది. ముఖ్యంగా పర్సనల్ లోన్, బైకు లోన్లలో ఇలాంటివి జరుగుతుంటాయి. మనకేమో 14-16 శాతం వడ్డీ అని చెబుతారు కానీ, 24-36 శాతం వేస్తారు. అంటే 36,000 రుణం తీసుకుని, నెలకు మూడు వేలు చెప్పున కడుతున్నారనుకుంటే, ప్రతి నెలా వడ్డీ తగ్గాలి. కానీ, కొన్ని ఆర్థిక సంస్థలు మొదటి ఈఎంఐ నుంచి చివరి ఈఎంఐ వరకు, 36,000 కు వడ్డీ కట్టించుకుంటాయి.

మొదటి ఈఎంఐ తర్వాత మనం 33,000 కు, రెండో ఈఎంఐ తర్వాత 30,000 వేలకు, మూడో ఈఎంఐ తర్వాత 27,000లకు వడ్డీ కట్టాలి. అయితే, మనకు ఆర్థిక జ్ఞానం లేనితనాన్ని అలుసుగా తీసుకుని, ప్రతి నెలా చెల్లించిన రుణానికి కూడా వడ్డీ కట్టించుకుంటారు. కాస్త అప్రమత్తంగా ఉండి ఇలాంటి వడ్డీలు వసూలు చేసేవారిని ప్రశ్నించండి. మీ డబ్బుకు మీరే రక్ష. తప్పనిసరి అయితే, బంగారాన్ని బ్యాంకులో పెట్టి అవసరాలు తీర్చుకుని నెలనెలా బ్యాంకుకు ఈఎంఐ కట్టడమే చాలా మంచిది. 
- ప్రకాష్ చిమ్మల

కాళ్లు కడగకుండా ఇంట్లోకి ఎందుకు రాకూడదు?----ఔనా ?

 
 
ఎందుకు 

ఇది చాదస్తం, మూఢాచారం కాదు, ఆరోగ్యసూచన. ఇప్పుడైతే పాదాలను పూర్తిగా కవర్ చేసే బూట్లు వాడుతున్నాం కానీ పూర్వం పాదరక్షలు ఇంత పకడ్బందీగా ఉండేవి కాదు. చాలామంది అసలు పాదరక్షలు వాడేవారు కాదు కూడ. అలాంటప్పుడు బయట నడిచినప్పుడు పాదాలకు దుమ్ము అంటుతుంది. ఆ దుమ్మును బయట వదిలించుకుని ఇంట్లోకి శుభ్రంగా రమ్మని చెప్పడమే ఈ నియమం ఉద్దేశం. అలాగే కొంతమంది కాళ్లు కడుక్కోవడం సంగతి దేవుడెరుగు, బయటకు వాడిన చెప్పులతో ఇల్లంతా తిరుగుతుంటారు. పిల్లలకు చిన్నప్పుడే చెప్పులు బయట లేదా ఇంట్లో ఒక మూల వదలడం, ఇంటికి వచ్చిన వెంటనే కాళ్లు కడుక్కోవడం ఒక నియమంగా నేర్పిస్తే పెద్దయ్యాక ఆ అలవాటు కొనసాగుతుంది. 

ఏమిటి
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు...
ప్రమాదం జరిగిన తర్వాత నివారణ చర్యలు తీసుకున్నారని చెప్పే సందర్భం ఇది. ఇప్పుడైతే వంట చేసేటప్పుడు స్టవ్ మీద నుంచి పాత్రలను దింపడానికి హోల్డర్స్, టాంగ్స్ వంటి పరికరాలు వాడుతున్నారు. ఒక యాభై అరవై ఏళ్ల క్రితం వేడి పాత్రలను పట్టుకోవడానికి పాత వస్త్రాన్ని వాడేవారు. అంతకంటే ముందు ఆకులను వాడేవారట. బాదం ఆకులు, లేకపోతే ఇంటి పెరట్లో ఉన్న ఏదో ఒక చెట్టు ఆకులను వాడేవారు. సన్నటి ఆకులైతే రెమ్మలతో సహా విరిచి వాడేవారు. పాత్రల వేడికి చేతులు కాలకుండా కాలానుగుణంగా అందుబాటులో ఉన్న వస్తువులతో తీసుకునే రక్షణ చర్యలు ఇవన్నీ. 

అయితే... వేడి పాత్రను పట్టుకుంటున్నాం... కాలకుండా జాగ్రత్త తీసుకోవాలి అన్న స్పృహ లేకుండా పట్టుకుని, కెవ్వుమని, కాలిన చేతులను చూసుకుని... అప్పుడు ఆకుల కోసం వెతుక్కునే హైరానా మనుషులకు బుద్ధి చెప్తూ ‘చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం’ అన్నారు పెద్దవాళ్లు. అది క్రమంగా నానుడిగా మారిపోయింది. ఇప్పుడు ఈ మాట ప్రభుత్వాల అసమర్థతను ఎత్తి చూపించడానికి, చేయాల్సిన పనులను ఆలస్యంగా చేసిన సందర్భాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ఉదాహరణకు తుఫాను హెచ్చరికకు వెంటనే స్పందించి నష్టనివారణ పనులు చేయకుండా, వరదలు ముంచెత్తిన తర్వాత దాని గురించి ఆలోచించడం వంటి సందర్భాలన్నమాట. 


ఎలా
మణికట్టు, అరచేతి నొప్పి తగ్గాలంటే...
కంప్యూటర్‌పై అదేపనిగా పనిచేయడం వల్ల మీడియన్ నర్వ్ అనే నరం మణికట్టు వద్ద ఒత్తిడికి లోనై కొందరిలో అరచేతి వేళ్లలో నొప్పి వస్తుంది. ఆ నొప్పిని కార్పెల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారు. ఇది కాస్త ఎక్కువే విసిగిస్తుంది కానీ, కాస్త జాగ్రత్తగా ప్రయత్నిస్తే దీన్నుంచి విముక్తి పొందవచ్చు. అందుకు ఏం చేయాలంటే...
నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే 
చన్నీళ్లతో గాని, ఐస్‌తో గాని కాపడం పెట్టాలి. 
చన్నీళ్ల కాపడం తర్వాత వేణ్ణీళ్ల కాపడం కూడా పెట్టవచ్చు. అప్పుడు నొప్పి తీవ్రత మరింత తగ్గుతుంది. 
ఆ తర్వాత స్క్రేప్ బ్యాండ్‌తో మణికట్టు కదలకుండా కట్టు వేసి ఉంచుకోవాలి. దీనికోసం మార్కెట్‌లో దొరికే రిస్ట్ సపోర్టర్ కూడా వాడవచ్చు. 
కంప్యూటర్‌పై అదేపనిగా పని చేయడం వల్లనే ఇది వస్తుంది కాబట్టి నొప్పి తగ్గేవరకు మణికట్టుకు విశ్రాంతి ఇవ్వాలి. పై చర్యల తర్వాత కూడా నొప్పి తగ్గకపోతే ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించాలి. 

ఎలా చేద్దాం
హోమ్ టిప్ 
బంగాళాదుంప, చిలగడ దుంపలకు మొలకలు వస్తే, వాటిని ముక్కలుగా కోసి కుండీలలో, జార్‌లలో నీళ్ళు పోసి పెంచొచ్చు. ఇండోర్ ప్లాంట్‌గా ఇంటి అందాన్ని పెంచుతాయి. 

హెల్త్ టిప్
జలుబుతో ముక్కు, ఛాతి పట్టేసినట్లుంటే... రెండు కప్పుల నీటిలో తొక్క తీసి సన్నగా తురిమిన అల్లం వేసి పది నిమిషాల సేపు నాననివ్వాలి. అల్లం సారం నీటిలోకి ఊరిన తర్వాత వడపోసి అందులో కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగాలి. వేడిగా లేదా వెంటనే తాగాలనిపిస్తే నీటిలో అల్లం వేసి ఒక నిమిషం పాటు వేడి చేయవచ్చు. 

బ్యూటీ టిప్
జుట్టు పెరగాలంటే రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని కొబ్బరి నూనెతో మర్దనచేసి ఉదయం తలస్నానం చేయాలి.

సమంత -విశ్వమంత!

 
 
‘ఏ మాయ చేసావె’లో జెస్సీలా...
సమంత ఒక మామూలు అమ్మాయి!
ఇప్పుడు స్టార్‌డమ్ వచ్చింది.
అయినా మామూలు అమ్మాయే!
లైఫ్ అంటుంది...
అప్స్ అండ్ డౌన్స్ అంటుంది...
ఏదీ శాశ్వతం కాదంటుంది...
ఏంటీ పిల్ల?
బుగ్గపై చిన్న పింపుల్ వస్తేనే...
జీవితం తలకిందులైనట్లు ఒకప్పుడు
బాధపడిన సమంతలో... సడెన్‌గా...
విశ్వమంత పరిణతి ఎక్కడది? 
ఏ దేశపు ఫిలాసఫర్‌ది?
చెరగని ఆ చిరునవ్వు ఏ రంగు పువ్వుది?
ఫీచర్స్ ఎడిటర్ ఇందిర పరిమితో సమంత ‘అదర్‌సైడ్’లో!


ఇందిర: మీ ఫ్యామిలీ - చిన్నతనం గురించి..
సమంత: నాన్న తెలుగువారు, అమ్మ మలయాళీ... నేను పుట్టి పెరిగింది మాత్రం చెన్నైలో! నాన్నవాళ్ల ఫ్యామిలీస్ తరాలుగా చెన్నైలో సెటిలవడంతో ఆయనకు తెలుగు రాదు. నేను కూడా ఫస్ట్ టైం ఆంధ్రాలోకి అడుగుపెట్టింది .. ఒక సినిమా ఆడిషన్ కోసం! నేను ఇప్పుడు కాస్తంత తెలుగు మాట్లాడుతున్నానంటే అది నా స్టాఫ్ వల్లే!

ఇందిర: స్టూడెంట్ డేస్ గురించి...
సమంత: చదువంతా చెన్నైలోని గర్ల్స్ స్కూల్, కాలేజీల్లోనే జరిగింది! బి.కాం దాకా చదివాను. దాని తర్వాత ఎం.బి.ఏకని ఆస్ట్రేలియా వెళ్లి చదువుకోవాలనుకున్నాను. చిన్నప్పటినుంచీ మంచి స్టూడెంట్‌ని అవడంతో అందరూ అదే అనుకున్నారు... ఎవరూ ఊహించలేదు... ఈ ఫీల్డ్‌లోకి వస్తానని!

ఇందిర: అసలు ఈ ఫీల్డ్‌లోకి ఎలా వచ్చారు..?
సమంత: ఫ్రెండ్స్‌తోపాటు ఓసారి బర్త్‌డే పార్టీకని వెళ్లినప్పుడు ఎవరో ప్రెస్ ఫోటోగ్రాఫర్ మా ఫొటో తీసి, పేపర్లో వేశారు. అది చూసిన చెన్నైలోని ఒక ప్రముఖ ఫొటోగ్రాఫర్ వెంకట్రామన్ నన్ను అప్రోచ్ అయ్యి, నాకు ఫోటో షూట్ చేసి, నాయుడు హాల్ అనే బట్టల షాపుకి మోడలింగ్ చేసే అవకాశం ఇప్పించారు. అసలు ఈ మోడలింగ్‌లవీ నాకేమీ ఇంట్రస్ట్ అనిపించకపోయినా, కేవలం పాకెట్ మనీకోసం చేయడం మొదలెట్టాను. ఆ తర్వాత దాదాపు 100 యాడ్స్ దాకా మోడలింగ్ చేశాను. అవి చూసిన రవివర్మన్ అనే ఓ తమిళ సినిమాటోగ్రాఫర్ నాకు సినిమాల్లో మొదట అవకాశం ఇచ్చారు. కానీ, ఆ సినిమా కంటే ముందు గౌతమ్ మీనన్ డెరైక్ట్ చేసిన ‘ఏం మాయ చేసావె’ రిలీజైంది. 

ఇందిర: గౌతమ్ మీనన్ తీసిన రెండు త్రిభాషా చిత్రాల్లో (కొన్నిట్లో గెస్ట్ రోల్స్ అయినా) నటించారు. అంటే... ఆరు సినిమాలకు లెక్క! ఇదికాక ఆయన, ఏఆర్ రెహమాన్ కలిసి చేసిన ఒక మ్యూజిక్ వీడియోలో నటించారు. సో, ఆయన్ని మీ గాడ్‌ఫాదర్ అనుకోవచ్చా..! ఆయన దగ్గర పనిచేయడం, మీపై ఆయన ఇన్‌ఫ్లుయెన్స్...
సమంత: ఏ హీరోయిన్ అయితే ఫస్ట్ గౌతమ్ మీనన్‌తో పనిచేస్తారో ఆ హీరోయిన్ లైఫ్ సెటిల్! ఎందుకంటే ఆయన హీరోయిన్‌లని అందంగా చూపించడమే కాదు, ఆ పాత్రలకు పెద్దపీట వేస్తారు. ఆయన ఒక స్త్రీ పాత్ర గురించి రాసినప్పుడు తన తల్లిని, భార్యను, చెల్లిని, స్నేహితురాలిని ఇన్‌స్పిరేషన్ కింద తీసుకుని, వాటిని తీర్చిదిద్దుతారు. అందువల్ల ఆ క్యారెక్టర్ చాలా అందంగా, సహజంగా ఉంటుంది. చూసేవాళ్లు చాలా తొందరగా కనెక్టయిపోతారు.

ఇందిర: ఒక్క గౌతమ్ మీనన్‌నే కాదు... ఇప్పటిదాకా చేసినవన్నీ పెద్ద డెరైక్టర్ల దగ్గరే! ఐ థింక్ యు ఆర్ వెరీ లక్కీ...
సమంత: నిజమే! నాకన్నా ఎంతోమంది అందమైన హీరోయిన్లు ఉన్నారు. నాకన్నా... అత్యంత టాలెంట్ ఉన్న హీరోయిన్స్ ఉన్నారు. అయినా, ఈరోజు పెద్దపెద్ద డెరైక్టర్లందరూ నాకు మంచిమంచి అవకాశాలిస్తున్నారంటే... నేను లక్కీనే, కాదనను! కానీ, అలా అని నేను లైఫ్‌లో ఏదీ టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా తీసుకోను. ఒకవైపు ప్రతి సినిమా మొదటి సినిమా అన్నట్టుగా చాలా కష్ట్టపడతాను... మరోవైపు వచ్చిన ప్రతి మంచి అవకాశాన్నీ పూర్తిగా సద్వినియోగపరచుకుంటాను. ఉదాహరణకు - నాకు ‘ఈగ’లో చేసే అవకాశం వచ్చినప్పుడే మరో పెద్ద సినిమా చేసే అవకాశం కూడా వచ్చింది. దీనికన్నా డబుల్ రెమ్యునరేషన్‌తో! అయినా ‘ఈగ’ లాంటి సినిమాలో నటించే అవకాశం మళ్లీమళ్లీ రాదని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదని రెండోదాన్ని కాదన్నాను. సో, లక్ అనేది కూడా ఒక్కోసారి మన చేతుల్లో ఉంటుంది!

ఇందిర: సినిమాకు సంబంధించిన నిర్ణయాలు ఎవరు తీసుకుంటారు? మీ కెరియర్‌లో తల్లిదండ్రుల జోక్యం ఎంతవరకు ఉంటుంది?
సమంత: నాకు 25 ఏళ్లు... నా నిర్ణయాలను నేను సొంతంగా తీసుకోగలను... నాకు ఆ తెలివి ఉంది. అందుకే నా కెరీర్‌లో ప్రతీ నిర్ణయం నేనే తీసుకున్నాను... తీసుకుంటాను కూడా! అంతేకాదు, మా తల్లిదండ్రులది కూడా జోక్యం చేసుకునే మెంటాలిటీ కాదు. వాళ్లకు నాపై ఎంత కాన్ఫిడెన్స్ అంటే... వాళ్లు షూటింగ్ లొకేషన్‌లకు కూడా నాతోపాటు ఏరోజూ రాలేదు, రారు. నాకో విషయం అర్థమే కాదు... హీరోయిన్లు అమ్మలను తోడుగా షూటింగ్‌లకు ఎందుకు తీసుకెళ్తారు? అసలు ఆ అవసరమేముంది? మీరు మీ జాబ్‌కి మమ్మీ డాడీలను తీసుకెళ్తారా? సో హీరోయిన్లు మాత్రం ఎందుకు తీసుకెళ్లాలి? నాకు తెలిసి సినిమా ఇండస్ట్రీలో ఉన్నంత ప్రొఫెషనలిజం ఇంకెక్కడా ఉండదు.... ప్రత్యేకించి తెలుగు సినిమా ఇండస్ట్రీ! నేను ఓ మహిళను కాబట్టి, హీరోయిన్ను కాబట్టి నన్ను అందరూ ప్రత్యేకంగా చూస్తారనో, ఒకలా చూస్తారనో ఎప్పుడూ అనిపించలేదు. 

ఇందిర: ఓసారి ఎక్కడో జనం మీదపడి... ఏదో గొడవ అయినట్టుంది?
సమంత: యా, తిరుపతిలో ఓ షాప్ ఓపెనింగ్‌కు వెళ్లినప్పుడు... జనం విపరీతంగా రావడం, తగ్గట్టు బౌన్సర్లు ముగ్గురే ఉండడంతో గందరగోళం జరిగింది. నేను వాళ్లను తోసుకుపోయే క్రమంలో చెయ్యి విదిలించాను. దాన్ని అందరూ వేరేగా అర్థం చేసుకుని... నేనేదో కొట్టానని ప్రచారం చేశారు. కానీ, నేమ్, ఫేమ్‌తోపాటు ఇవన్నీ తప్పవని వదిలేయాలి!

ఇందిర: హీరోయిన్లు మామూలుగా పెళ్లి విషయాన్ని తొందరగా బయటపెట్టరు. కానీ, మీరు మాత్రం ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎవరినో ఇష్టపడ్డారని, రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పారు...
సమంత: రిలేషన్‌షిప్‌లో ఉన్నా, ‘అయామ్ సింగిల్... రెడీ టు మింగిల్’ అని చెప్పడం నా వల్ల కాదు! నేనూ మనిషినే... నాకూ ఇష్టాయిష్టాలుంటాయి; నాకూ లైఫ్ ఉంటుంది... నాకూ బాయ్‌ఫ్రెండ్ ఉంటాడు (నవ్వుతూ) అయినా, ఉన్నది ఒక్కడే కదా... అది చెప్పుకోవడానికి ఎందుకు సిగ్గుపడాలి... ఎందుకు అబద్ధాలాడాలి? సినిమాల్లో ఎలాగూ నటిస్తాం.. బయట కూడా నటించడం ఎందుకు? 

ఇందిర: మీ చేతికున్న ఉంగరం చూస్తే ఎంగేజ్‌మెంట్ కూడా అయిపోయినట్టనిపిస్తోంది...
సమంత: (నవ్వుతూ) అయ్యో, ఇది ఎంగేజ్‌మెంట్ రింగ్ కాదు! ‘ఏ మాయ చేసావె’ సినిమాకి వచ్చిన మొదటి రిమన్యూరేషన్‌తో (బర్త్‌స్టోన్ డైమండ్‌తో) చేయించుకున్న ఉంగరం! ఇది నాకు అత్యంత లక్కీ ఉంగరం. ఎప్పటికీ తీయను!

ఇందిర: తన గురించి....
సమంత: అచ్చు నాలానే చాలా సాదాసీదాగా ఉంటాడు. అంతేకాదు, చాలా తెలివైనవాడు కూడా! తన దగ్గర నుంచి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాను. తనవల్ల రోజురోజుకీ బెటర్ పర్సన్‌ని అవుతున్నాను! అయామ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద మ్యాన్ అయామ్ విత్! 

ఇందిర: ఇంతకీ అతనితో ఎన్నాళ్ల పరిచయం..
సమంత: చాలారోజుల నుంచి. (తెలుగువాడా?) కాదు. (తమిళా?) (పకపకా నవ్వుతూ) ఇది టూమచ్... ఇంక ఇంతకన్నా చెప్పను! (ఫైనల్ క్లూ... ఇండస్ట్రీ వ్యక్తా?) కొన్నాళ్లు వెయిట్ చేస్తే మీకే తెలుస్తుంది. (పోనీ, పెళ్లెప్పుడు?) ఇప్పుడప్పుడే చేసుకోను... కనీసం మూడేళ్ల దాకా! 

ఇందిర: ఏ హీరోనైనా చూసి ‘ఇలాంటి భర్త కావాలి’ అని అనుకున్న సందర్భాలున్నాయా? మీ బాయ్‌ఫ్రెండ్ దానికి మ్యాచ్ అయ్యారా?
సమంత: నేనూ ఒక యాక్టర్ని కాబట్టి నాకు బాగా తెలుసు... అవన్నీ సినిమాలకే పరిమితం అని! (నవ్వుతూ) ఇప్పుడు నన్నే తీసుకోండి... సినిమాల్లో ఎంత స్వీట్‌గా, ముద్దుగా ఉంటాను... బయట కూడా అలా ఉంటాను అనుకుంటే ఎలా? వాళ్లూ అంతే..! అందుకే నాకు అలాంటి ఊహలుండవు. ప్రాక్టికల్‌గా ఉంటాను.

ఇందిర: మీ సినిమాలకు మీరే డబ్బింగ్ చెప్పుకుంటారని అప్పట్లో టాక్ వచ్చింది...
సమంత: తెలుగు ఇప్పుడిప్పుడు బాగానే మాట్లాడుతున్నాను. కానీ, ఇంకా డబ్బింగ్ చెప్పేంత లేదు. (నవ్వుతూ) అయినా నేను తెలుగు డబ్బింగ్ చెప్తే చిన్మయి ఫ్యాన్స్ బాధపడతారు. 

ఇందిర: చిన్మయి డబ్బింగ్ మీ సక్సెస్‌కి బాగా హెల్పయిందనుకుంటా?
సమంత: బాగానా..? నా సక్సెస్‌లో 50% సక్సెస్ ఆమెకే ఇవ్వాలి! ఆమె నా బెటర్‌హాఫ్! నా స్క్రీన్ ప్రెజెన్స్‌కి తను ఎంత ఉపయోగపడిందో నాకు తెలుసు. అందుకే, అదే విషయాన్ని నేనందరికీ నా ట్వీట్స్ ద్వారా చాలాసార్లు తెలియజేశాను! డబ్బింగ్ గురించి టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను... నేను తమిళ్ సినిమా ‘నేన్ వాడు వసంతం’లో డబ్బింగ్ చెప్పాక... డబ్బింగ్ అంటే చిన్నపని కాదని, యాక్టింగ్ కంటే పెద్దపని అని, కష్టమైన పని అని తెలుసుకున్నాను. మేము అందరం కలిసి 60 రోజులపాటు ట్రావెల్ చేసి, తీసిన సినిమాని, వాళ్లు కేవలం మూడు రోజుల్లో, మొత్తం సినిమాని, అదీ... ఒక గదిలో కూర్చుని, పక్కన సహనటులు ఎవరూ లేకుండా, అంతా ఊహించుకుంటూ, పాత్రలో లీనమై, డైలాగ్‌లు అంత బాగా చెప్పడం... అదీ లిప్ సింక్ అయ్యేలా చూసుకుంటూ... ఓ మైగాడ్! వాళ్ల మీద నాకు ఎంత గౌరవం పెరిగిందో చెప్పలేను. వాళ్లందరికీ పెద్ద నమస్కారం పెట్టాలనిపించింది.

ఇందిర: రెండు మూడు సినిమాల్లో హీరోలతో లిప్‌లాక్ సీన్స్ చేశారు.. 
సమంత: ఇబ్బందిగానే ఎందుకనిపించలేదు... కొంచెం షైగానే అనిపించింది కానీ, రెండు సినిమాల్లోనే చేశాను. ‘ఏం మాయ చేసావె’లో ఆ సీన్ గురించి చెప్పినప్పుడు మొదట చాలా ఇబ్బందిగా అనిపించినా, గౌతమ్ మీనన్ చాలా ఈస్థటిక్‌గా షూట్ చేయడంతో అంత ఇబ్బంది అనిపించలేదు. ‘దూకుడు’లో చేసినదాన్ని మీరు కిస్సింగ్ అనడానికి లేదు. ఏదో ఇద్దరి తలలు కొట్టుకున్నట్టుగా ఉండింది. (నవ్వుతూ) అయినా ఇకనుంచి నేను అలాంటి సీన్లు చేయదలచుకోవడం లేదు. ఇలాగే చేస్తూ పోతే నేను ‘సౌత్ సిమ్రాన్ హష్మి’ అయిపోతాను!

ఇందిర: ఆ మధ్యకాలం మీరు ఓ మూడు నెలలు మాయమైతే... జనాలు రకరకాలుగా అనుకున్నారు. అసలేం జరిగింది?
సమంత: ఒక్కోసారి శరీరంలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మంచి బ్యాక్టీరియా కూడా చెడుగా మారి, ఒకదానితర్వాత ఒక ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుంది. అంతేకాదు, ఒకసారి వాడిన మందుకు బాడీ ఇమ్యూన్ అయిపోయి, మరోసారి అదే మందు పనిచేయని పరిస్థితి ఏర్పడుతుంది. అదే నాకూ జరిగింది. రకరకాల మందులు వాడడం, అవేవీ పనిచేయకపోవడంతో, రెండు నెలల్లోనే నా పరిస్థితి చాలా సీరియస్ అయింది.

ఇందిర: ఆ టైంలో మీలో వచ్చిన ఆలోచనలు... మార్పులు...
సమంత: బతుకుతానని అయితే అనుకోలేదు... ఎందుకంటే, ఆ టైంలో ఏ మందూ పనిచేస్తున్నట్టు అనిపించలేదు. అంతేకాదు, డెత్ అనే థాట్ రావడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా భిన్నంగా కనిపించడం మొదలైంది. అప్పటిదాకా టాప్‌లో స్మూత్‌గా నడుసున్నట్టనిపించిన నాకు, సడెన్ బ్రేక్ పడ్డట్టయింది. మంచి సక్సెస్, చేతిలో అద్భుతమైన సినిమాలు, అన్నీ ఉండగా ఇలా జరగడం... నా ఆలోచనా క్రమాన్ని చాలా మార్చింది. శంకర్ సినిమా వదులుకున్నాను. మణిరత్నం సినిమా కాదనుకున్నాను. తెలుగులో కూడా దిల్‌రాజు గారితో సహా అందరికీ చెప్పేశాను... నాకోసం ఆగవద్దు... వేరేవాళ్లను తీసుకోండి అని! అన్నీ చేతిలో ఉన్న దగ్గర నుంచి, రెండు నెలల్లో ఏమీ లేని స్థితికి వచ్చినట్టు అనిపించింది. అప్పుడే అనిపించింది - జీవితంలో ఏదీ శాశ్వతం కాదని! 

ఇందిర: ప్రత్యూష ఫౌండేషన్‌కి చేయూతనివ్వడానికి అదే కారణమా?
సమంత: నేను మొదటినుంచి జనరస్ పర్సన్‌నే! అయితే, అప్పటిదాకా కేవలం ఫ్యామిలీ వాళ్లను, నా దగ్గర వాళ్లను, నా దగ్గర పనిచేసే వాళ్లను మాత్రమే చూసుకున్నాను. బయటవాళ్లకు పెద్దగా సాయం చేయలేదు. ఆ ఆలోచన నాకు సాయం చేసిన వాళ్లను చూశాకే కలిగింది. ‘ఇంతమంది నాకు సాయం చేస్తున్నారు... నేను ఇప్పటిదాకా ఎంతమందికి సాయం చేశాను?’ అని! ‘ప్రపంచంలో ఎన్నెన్ని సమస్యలు ఉన్నాయి... ప్రజలు డబ్బులేక, తిండిలేక, చదువులేక, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా డబ్బులేక బాధపడుతుంటే... ఇక్కడ నేను ఒక చిన్న పింపుల్ వస్తేనో, టాన్ అయ్యాననో బయటికి వెళ్లడానికి ఇష్టపడేదాన్ని కాదు... ఎంత తక్కువగా ఆలోచించాను’ అని అనిపించింది. అంతేకాదు, కేవలం అద్దంలో కనిపించిన సమంతానే ప్రపంచంగా అనుకుంటూ అంత స్వార్థంగా, ఏమీ పట్టనట్టుగా ఇన్నాళ్లు ఎలా బతికానా? అని కూడా అనుకున్నాను. ట్రూ సఫరింగ్, ట్రూ పెయిన్ మొదటిసారి ఫీలయింది అప్పుడే! నా బాధని చూడలేని మా అమ్మ కళ్లను చూసి అనిపించింది... ఈ కష్టం ఇంకే తల్లీ అనుభవించ కూడదని! అందుకే, నాకు చేతనైనంత సాయం చేయాలనుకున్నాను. హిమోఫీలియా, తలసీమియా లాంటి జబ్బులతో నిత్యం బాధపడే పిల్లలకు సాయం చేయాలని నిర్ణయించుకుని, ప్రత్యూష ఫౌండేషన్‌తో కలిసి పనిచేయడం మొదలెట్టాను. డబ్బు డొనేట్ చేయడం, వ్యాధిపట్ల అవేర్‌నెస్ పెంచడం దగ్గర నుంచి మెడికల్ క్యాంపులు నిర్వహించడం దాకా ఎంత సాయం చేయగలిగితే అంత సాయం చేస్తున్నాను. మనం చేస్తున్న కాస్త సాయానికి ఒక పిల్లో పిల్లవాడికో నయమవుతుంటే... వాళ్లను చూస్తున్నప్పుడు నాకు కలిగే ఆనందం... ఏ బ్లాక్‌బస్టర్ సినిమా ఇవ్వదు.

ఇందిర: ఈ రెండు నెలల సమయంలో ఇంతటి మార్పా?
సమంత: ఇతరులకు సాయం చేసే విషయంలోనే కాదు... ఫిలసాఫికల్‌గా కూడా నాలో ఎంత మార్పు వచ్చిందో నాకు తెలుసు. ఇంతకుముందు చిన్నచిన్నవాటికి అప్సెట్ అయిపోయేదాన్ని. ఇప్పుడు,పెద్దగా దేనికీ తొణకను. జీవితంలో ఈ అప్స్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయని, ఆ డౌన్ తర్వాత ఇప్పుడు అప్‌లో ఉన్నానని, మళ్లీ నాకు డౌన్ తధ్యమని, ఈ సర్కిల్ ఆఫ్ లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ తప్పవని, అన్నిటినీ సమతుల్యంగా తీసుకోవడం మొదలెట్టాను. అయితే వీటన్నిటిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే... ఈ అప్స్ డౌన్స్ మధ్యలో నిన్ను నువ్వు ఎట్లా నియంత్రించుకున్నావు, ఎంత నిలకడగా ఉన్నావు, ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నావు, ఉన్నంతలో ఎలా ఉన్నావు, నీ ప్రవర్తన ఎలా ఉంది... ఇవన్నీ హ్యాండిల్ చేసిన తీరుకు నువ్వు గర్వపడుతున్నావా లేదా అనేది చాలా ముఖ్యం అనిపిస్తుంది. అసలు నాలో ఈ మార్పు తేవడానికే దేవుడు ఇలా చేశాడేమో అని అనిపిస్తుంది.

ఇందిర: వెనక్కి తిరిగి చూసుకుంటే లైఫ్ ఎలా అనిపిస్తోంది?
సమంత: నన్ను నేను ప్రతిరోజూ ప్రశ్నించుకుంటూనే ఉంటాను... ఆశ్చర్యపోతూనే ఉంటాను... అసలు నేనిక్కడకి ఎలా వచ్చానా అని... ఇదంతా ఎలా జరిగిందని! 
బ్యాక్ టు బ్యాక్ ఐదు సినిమాలు... అన్నీ అంతపెద్ద హిట్ అవడం... ఒక్కసారిగా కిందపడ్డం... మళ్లీ ఈరోజు నేను ఈ స్థితిలో ఉండడం... అంతా కలలాగా అనిపిస్తుంది. నేను కూడా నా జీవితానికి ఇంత మంచి స్క్రిప్ట్ రాసుకోలేకపోయేదాన్నేమో... దేవుడు అంత బాగా రాశాడు. దిసీజ్ టు గుడ్ టు బి ట్రూ!

పర్సనల్ బైట్స్...

అమ్మ - నా వెన్నెముక. నాలో కొంచెం ఏదైనా మంచి ఉంది అనుకుంటే... అది ఆవిడ వల్ల వచ్చిందే! తనంత సహృదయురాలిని నేనింతవరకు చూడలేదు!

పెద్దన్న - చాలా ఫ్రాంక్‌గా, స్ట్రిక్ట్‌గా ఉంటాడు. కాంప్లిమెంట్‌లు అస్సలు ఇవ్వడు. అలాంటిది తమిళ్ ‘ఈగ’ చూసిన తర్వాత ‘అయామ్ ప్రౌడ్ ఆఫ్ యు’ అన్నాడు.

చిన్నన్న - నేనంటే ఇష్టం... నేనేది చేసినా మురిపెం. నన్నెప్పుడూ మెచ్చుకుంటూనే ఉంటాడు.

ఫ్యాన్స్ - ఆ పదానికి అర్థం ఇప్పటికీ తెలీలేదు కానీ, నన్ను మొదటిరోజు నుంచీ అభిమానించే వారు కొందరున్నారని మాత్రం తెలుసు. వాళ్లలో కొందరితో నేను రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాను... అప్పుడప్పుడూ వాళ్లతోపాటు కాఫీ షాప్‌లకు కూడా వెళ్తుంటాను. వాళ్లకి నేనంతే ఎంత అభిమానమంటే.... బ్లాగ్‌ల్లో ఎక్కడైనా నా గురించి చెడుగా రాస్తే, వెంటనే తీసేస్తూ ఉంటారు. కానీ, నాతో మాత్రం వాళ్ల అభిప్రాయాల్ని నిర్మొహమాటంగా చెప్తూ ఉంటారు. నేను చేసే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలకు కూడా వాళ్లు తోడుగా ఉంటారు. 

ఫ్రెండ్స్ - నా చిన్నప్పటి ఫ్రెండ్స్ చాలామంది బాంబేలో సెటిలయ్యారు. వాళ్లకి ఇక్కడ నా స్టార్‌డమ్ గురించి పెద్దగా తెలీదు. కానీ ఎప్పుడైనా పేపర్‌లో సడెన్‌గా నా ఫోటో చూస్తే ‘ఏంటి? నువ్వు అంత పెద్ద యాక్ట్రెస్సా సౌత్‌లో?’ అంటారు. ‘అయ్యో అంతలేదు’ అని నవ్వేస్తాను. వాళ్లతో వర్క్ గురించి పెద్దగా మాట్లాడను. ఎక్కువశాతం పర్సనల్ విషయాలే మాట్లాడతాను.

స్టాఫ్ - వాళ్లు లేనిదే నేను లేను. వాళ్లు నాకు ఫ్యామిలీ మెంబర్స్‌తో సమానం.

డెరైక్టర్లు - నా అదృష్టం... నాకు దొరికిన డెరైక్టర్లందరూ నన్ను చాలా అభిమానిస్తారు... ప్రొటెక్టివ్‌గా చూసుకుంటారు. (నవ్వుతూ) నేనెప్పుడైనా గ్లామరస్‌గా కనిపిస్తానన్నా, వాళ్లే ముందు ఒప్పుకోరు!

హైదరాబాద్ - పుట్టిన పెరిగింది చెన్నైలో అయినా, నాకు హైదరాబాద్ అంటేనే ఇష్టం. ఆ విషయం ఓపెన్‌గా అందరికీ చెప్తూంటా. ఇక్కడ అపార్ట్‌మెంట్ కూడా కొనుక్కున్నాను. ఇక్కడే సెటిలయిపోదామనుకుంటున్నాను!

స్టార్ బైట్స్...

నాగచైతన్య - ఇండస్ట్రీలో నాకు మొదటినుంచి ఉన్న ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ తనే! ఇప్పుడు నేను తనతో ఇంకో సినిమా కూడా చేయబోతున్నాను... ఎదురుచూస్తున్నాను!

జూనియర్ ఎన్టీఆర్ - తనకున్న టాలెంట్, తనలోని ఎనర్జీ, తను డైలాగ్‌లు చెప్పే తీరు నేనింతవరకు ఎవ్వరిలోనూ చూడలేదు... ఇకముందు చూస్తానని కూడా అనుకోను. అతనితోపాటు సేమ్ ఫ్రేమ్‌లో నించోవడం... అసాధ్యం! తన సినిమా సంగతి వదిలేయండి... తన సినిమా మేకింగ్ విడియో బయటకు రిలీజ్ చేసినా, అది సినిమా కంటే పెద్ద హిట్ అవుతుంది!

మహేష్ - ‘దూకుడు’ సినిమా మొదటిరోజున తను నాతో - ‘ప్రతి సినిమాని మొదటి సినిమా అనుకుని చెయ్యి’ అన్నాడు. థ్యాంక్స్ టు హిమ్... అదే నేను ఇప్పటికీ, ఎప్పటికీ ఫాలో అయ్యే మంత్ర!

నానీ - తనను చూస్తే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈరోజు తను ఈ స్థాయిలో ఉన్నాడంటే అది కేవలం తన స్వయంకృషి వల్లే! సినిమా పట్ల తనకున్న పాషన్, తనకున్న దూకుడుతనం తనని ఎంతోదూరం తీసుకెళ్తుందని నాకు గొప్ప నమ్మకం! 

సిద్దార్ధ - నందినీరెడ్డి సినిమా షూటింగ్ మొదలయ్యే వరకూ ఎప్పుడూ అనుకోలేదు... తను ఈరోజున నాకు ఇంత క్లోజ్ అవుతాడని! నేను తనతోనే కాదు, వాళ్ల అమ్మతో, నాన్నతో, చెల్లితో కూడా చాలా క్లోజ్! అంతటి స్వీట్ ఫ్యామిలీని ఇప్పటిదాకా చూడలేదు. ఇక సిద్దార్ధ గురించి చెప్పాలంటే - తనంత తెలివైనవాణ్ణి, ప్రపంచంలో ఎన్నో విషయాల పట్ల అంతటి అవగాహన ఉన్నవాణ్ణి చూడలేదు.


క్విక్ బైట్స్...


ఖాళీ సమయాల్లో - ఫ్రెండ్స్‌తో గడుపుతాను. సినిమాలు విపరీతంగా చూస్తుంటాను. కానీ ఈమధ్యకాలం ఏమాత్రం టైమున్నా ప్రత్యూష ఫౌండేషన్‌కి వెళ్తున్నాను.

హీరోయిన్ కాకపోయి ఉంటే - ఆస్ట్రేలియాలో ఎంబిఏ చేసి, అక్కడే పనిచేస్తూ ఉండేదాన్ని.

జాతకాల మీద నమ్మకం - ఒకప్పుడు ఉండేది కాదుకానీ, ఈ మద్య నమ్ముతున్నాను. దానికి కారణం... నేను బాగా సిక్‌గా ఉన్నప్పుడు ఓ జ్యోతిష్యుడు నాతో - ‘ఆగస్టు 15కల్లా వర్క్‌కి వెళ్లిపోతావు’ అన్నాడు. అప్పుడు నమ్మలేదు. కానీ, నన్ను ఆశ్చర్యానికి గురిచేసిన విషయమేంటంటే... కరెక్ట్‌గా నేను ఆగస్టు 15 నాడే షూటింగ్‌కి మళ్లీ వెళ్లిపోయాను. ఆరోజే అతనికి కాల్‌చేసి అడిగాను - ‘అంత కరెక్ట్‌గా ఎలా చెప్పగలిగారు?’ అని! ‘నక్షత్ర బలాన్ని బట్టి చెప్పగలిగాను’ అన్నాడు. అప్పటినుంచి ఆస్ట్రాలజీ చాలా ఇంట్రస్టింగ్‌గా అనిపిస్తోంది.

కాలం వెనక్కి తిరిగొస్తే - గతంలో నేను చేసిన ప్రతి పనీ గర్వించదగ్గవి కాదు. వాటిలో కొన్ని ఖచ్చితంగా ‘మళ్లీ చేయను’ అనేవి ఉన్నాయి. అవి పక్కన పెడితే, పోయినదాన్ని మళ్లీ దక్కించుకోవాలనుకుంటున్నాను... మణిరత్నం సినిమాలో నటించాలని ఉంది.

మీలో మీకు నచ్చేవి - నేను చాలా చాలా కష్టపడతాను. అది అందరికీ తెలుసు. అంతేకాదు, ఏ విషయాన్నైనా తొందరగా గ్రహిస్తాను. 

మీలో మీకు నచ్చనివి - ఆత్మ విమర్శ ఎక్కువ... ఎంత ఎక్కువంటే, నన్ను నేను హర్ట్ చేసుకునేంత! దగ్గర వాళ్లను కూడా బాగా విమర్శిస్తూంటాను. ఇక ఫిజికల్‌గా అంటే... నా నవ్వు... నా కళ్లు బాగుంటాయనిపిస్తుంది!

సమ్మప్ సమంత ఇన్ త్రీ వర్డ్స్ - రియల్, హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ లవింగ్. 

సంక్రాంతి అంటేనే ముగ్గుల పండుగ..కలర్ ఫుల్ ముగ్గులతో కళకళలాడాల్సిందే...





రంగోలి అంటే ముగ్గులు వేయడం. కలర్ ఫుల్ గా ముగ్గులు వేయడం అనేది కూడా ఓ మంచి కళ. ఇంటి ముంగిళ్ళలో వివిధ రాకలుగా ముగ్గులు వేస్తేరు. చుక్కలు పెట్టి, చక్కలు పెట్టకుండా..డ్రాయింగ్ లా, గీతలు గీయడం ఇలా పలు రకాలు ఉన్నాయి. ముగ్గులు పెట్టాలంటే క్రియశీలకమైన సజనాత్మకత కలిగి ఉండాలి. రంగోలిని బియ్యం పిండితో వేస్తారు. ఆ ముగ్గులు మరింత కలర్ ఫుల్ గా బ్రైట్ గా కనబడాలంటే వాటికి వివిధ రకాల రంగులు కలుపుకొని షేడ్ చేస్తారు.మరి సంక్రాంతి సంబరాలు దగ్గరలో రానున్నాయి కాబట్టి ప్రతి ఇంటి ముందు కలర్ ఫుల్ ముగ్గులతో ప్రతి ఇల్లు కళకళలాడాల్సిందే . సంక్రాంతి అనగానే ముందుగా మనకి గుర్తు వచ్చేవి ముగ్గులు.

రంగుల హరివిల్లుముత్యాల ముగ్గులు..రత్నాల గొబ్బెమ్మలు..మహిళల కళాదృష్టికి చిహ్నంగా ముంగిళ్ళ ముగ్గులు పెడతారు. ధనుర్మాసం నెల పెట్టింది మొదలు సంక్రాంతి పండుగ దాకా ప్రతి ఇంటి లోగిలి రకరకాల ముగ్గులతో కళకళలాడుతాయి. సంక్రాంతి పండుగ రోజున ఆడపిల్లలు ముగ్గుల మధ్యన అందంగా గొబ్బిళ్లను తీర్చి దిద్ది, వివిధ రకాల పువ్వులతోటి గొబ్బెమ్మలను అందంగా, ఆకర్షణీయంగా అలంకరిస్తారు.ధనుర్మాసం ఆరంభం నుండే - ప్రతీ రోజు తమ ఇళ్ళ ముంగిళ్ళను రంగవల్లులు, గొబ్బెమ్మ లతో అలంకరిస్తారు. ముగ్గులు వేయటానికి ప్రత్యేకంగా బియ్యపు పిండిని వాడతారు. పేడ కళ్లాపి ముంగిలిలో తోచిన ముగ్గును ముచ్చటగా తీర్చిదిద్దితే! ఎలా కుదిరినా వర్ణశోభితమే! ఎందుకంటే, అది మనం స్వయంగా 'ముగ్గు' ఓడ్చి తీర్చిదిద్దిన వర్ణచిత్రం!
నేలమ్మ నుదుట తిలకంలా శోభిల్లే రంగవల్లికలు మనసుకు పంచే ఆహ్లాదం చెప్పతరం కాదు. అనుభవంతో తెలుసుకోవాల్సిందే! మరి అలాంటి ముగ్గులు కొన్ని తిలకిద్దామా....

 




ఫ్లవర్ రంగోలి: ఇది మరో అందమైన రంగోలి డిజైన్. సంక్రాంతి సెలబ్రేషన్ ను ఫర్ ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది. ఈ ముగ్గును పూర్తిగా తాజా పువ్వుల రేకులతో అలంకరించబడినది. కలర్స్ ను మిక్స్ చేసి ముగ్గులను షేడ్ చేయడం కంటే ఈ ఫ్లవర్ స్ప్రెడ్ రంగోలి చాలా అద్భుతంగా సువాసన భరితంగా చూడముచ్చటగా ఉంటుంది.







తామర మెరుపులు: ఈ సంక్రాంతికి ఇలా ఓ తామర పువ్వు ఆకారం కలిగి ముగ్గును ఇంటి ముందు తీర్చిదిద్ది ఇలా డార్క్ కలర్స్ షేడ్స్ చేయడం వల్ల మరింత లుక్ ను ఇస్తుంది. ఈ ముగ్గులో డార్క్ బ్లయూ డార్క్ రెడ్, డార్డ్ ఎల్లో, డార్క్ పింక్ కలర్స్ ఉపయోగించడం వల్ల చాలా అద్భుతంగా కనబడుతోంది.





సితార ముగ్గు: ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న డిజైన్. ఈ సంక్రాంతి సెలబ్రేషన్స్ కు మీకు సమయం కుదరనప్పుడు ఇటువంటి చిన్న ముగ్గులను కలర్ ఫుల్స్ గా వేసుకోవచ్చు.

 





క్రియేటివ్ ఆర్ట్: ఇది మోడ్రన్ స్టైల్ రంగోలి. సంక్రాంతిలో గాలిపటాల ఆటలు తప్పనిసరిగా ఉంటాయి. కాబట్టి గాలిపటాలను పోలిన ఈ రంగోలి కలర్ ఫుల్ గా కనబడుతోంది.

 







కలర్ ఫుల్ స్టోన్స్ రంగోలి: ఈ సంక్రాంతి సంబరాలకు ఏదైనా కొత్తదనం కోరుకొనే వారు ఇలాంటి రంగోలిని ఎంపిక చేసుకోవచ్చు. ఈ రంగోలిని కలర్ ఫుల్ స్టోన్స్, మరియు ఉప్పుకు వివిధ రంగులు అద్ది ముగ్గుకు షేడ్ చేయబడినది.

 



సర్కిల్ ముగ్గు: ముగ్గులు వేయడానికి క్రియేటివిటి ఉండాలన్నాం కదా. క్రియేటివిటి అనేది ఇలా ఉండాలి. ఈ ముగ్గును ఎంత పెద్దగా అన్నా వేసుకోవచ్చు. ఇటువంటి ముగ్గులను ఇంటి ముఖద్వారం వద్ద మరియు పూజగది ముందర వేసుకోవచ్చు . ఈ ముగ్గులో డార్క్ గ్రీన్ షేడ్ చాలా అద్భుతంగా కనబడుతోంది. అలాగే మద్యలో కుంకుమపువ్వు కలర్, తెలుపు, బ్లూ కూడా ఎక్స్ ట్రాగా కనబడుతున్నాయి.







మార్బల్ మరియు స్టోన్ రంగోలి: సంక్రాంతి సంబరాలను కొంచెం స్టైలిష్ గా మార్చుకోవచ్చు. ఇలాంటి ముగ్గులు ఈ మోడ్రన్ యుగానికి చాలా బాగా నప్పుతాయి. ఈ ముగ్గుకు వైట్ మార్బల్ పీసులు, మరియు కలర్ ఫుల్ స్టోన్స్ తో అలంకరించి అద్భుతంగా ఆకట్టుకొనేలా చేస్తున్నాయి.

 

Friday, January 4, 2013

వెన్నునొప్పి చికిత్సకు ముందు కారణాలు తెలుసుకోండి...!

సాధారణంగా మనుషులను ఎక్కువగా బాధించే అనారోగ్య సమస్యల్లో చాలా తరచుగా ఏర్పడే సమస్య వెన్నునొప్పి ఒకటి. ప్రతి మనిషి జీవిత కాలంలో ఏదో ఒక టైమ్ లో బ్యాక్ పెయిన్ కు గురైయ్యే ఉంటారు. దానికి ఎన్నో కారణాలు. కారణము ఏదైనా అది రాకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ప్రస్తుత జీవన శైలిలో నడుము నొప్పి లేని వారు చాలా తక్కువ మందే ఉంటారు. దీనికి కారణం మారిన జీవన శైలే ముఖ్య కారణం. ఒకప్పుడు వయసైపోయిన వారిలో కనిపించే బ్యాక్ పెయిన్, నేటి ఆధునిక యుగంలో యుక్త వస్కులను సైతం బాధింస్తుంది.
నడుము నొప్పి అనేది మహిళలకు మాత్రమే ప్రత్యేం కాదు. స్త్రీపురుషులందరికీ అది వచ్చేదే అయినా, మహిళలకు కొంచెం ఎక్కువగానే వస్తుంటుంది. ముఖ్యంగా గర్భధారణ సమయంలో మరీ అధికం. మగవాళ్ళకన్నా స్ర్తీలు సాధారణంగా శారీరకంగా తక్కువ శ్రమ ఉండే పనులు చేస్తుంటారు. అయితే గర్భధారణ సమయంలో మాత్రం వెన్నుపూసమీద భారం అధికమౌతుంది. సాధారణ వ్యక్తుల్లో వెన్ను నొప్పి రావడానికి కారణాలేంటి? వాటికి తీసుకోవాలసిన జాగ్రత్తలేంటో చూద్దాం...
సాధారణంగా వచ్చే వెన్నునొప్పి ముఖ్యంగా వారు కూర్చొనే విధానం మీదే ఆధారపడి ఉంటుంది. ఈ వెన్ను నొప్పికి సరైన సమయంలో సరైన జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ముందు ముందు అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. శారీరకంగా వెన్నునొప్పి, మెడనొప్పి ఎక్కువగా బాధిస్తుంది. కాబట్టి కూర్చొనే విధానంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ వెన్ను నొప్పిని తగ్గించుకోవచ్చు.

సంక్రాంతి స్పెషల్ కర్జూరాలు లేదా డైమండ్ స్వీట్

సంక్రాంతి పండుగ అనగానే వారం పది రోజుల ముందు నుండే మహిళలంతా పిండి వంటల తయారీలో నిమగ్నమయిపోతారు. ఎందుకంటే ఈ పండగను మూడు రోజు పాటు సంబరంగా జరుపుకుంటారు కాబట్టి ఇంటికి వచ్చే అతిథులు.. చిన్నారుల కోసం పిండి వంటలెన్నో తయారు చేస్తారు.
పండుగ ఒక్కటే అయినా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పిండివంట ఈ పండక్కి ప్రత్యేకం. ఉదా రాయలసీమలో ప్రత్యేకంగా తీపి గుమ్మడి కూడర, సజ్జరొట్టెలను ఎంతో ఇష్టంగా తింటారు. ఆంధ్రప్రాంతంలో అరిసెలు, బూరెలు, గారెలు, గులాబీలు వంటి పదార్థాలను ఎంతో ఇష్టంగా తయారు చేసుకుంటారు అయితే ఇవి ఎప్పుడూ చేసే పిండివంటలే అయినా పండుగ రోజు చేసే ఈ పిండి వంటలకు మాత్రం రుచి అమోఘమనే చెప్పాలి. సంక్రాంతికి పిల్లలకు పెద్దలకు ఇష్టమైన, టైం పాస్ కు తయారు చేసుకొని డైమండ్ స్వీట్స్ ఎలాతయారు చేయాలో తెలుసుకుందాం...

కావల్సిన పదార్థాలు:
మైదా: 2cups
పంచదార: 2cups
యాలకులు: 2
నెయ్యి: 2tbsp
గుడ్లు: 2
నూనె: వేయించడానికి సరిపడ
ఉప్పు: చిటికెడు
వంటసోడా: చిటికెడు
సోంపు: ఒక స్పూను
బొంబాయి రవ్వ: 2tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పంచదారను పొడి చేసుకోవాలి.

2. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండిని తీసుకుని అందులో చక్కెర, గుడ్లు, యాలకుల పొడి, కొద్దిగా నెయ్యి, ఉప్పు వంటసోడా, సోంపు, రవ్వను వేసి సరిపడినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా మృదువుగా కలుపుకోవాలి.

3. తర్వాత ఈ మొత్తాన్ని నాలుగు బాగాలుగా చేసి, ఉండచుట్టుకొని చపాతీ పీట మీద వేసి పిండిని ఒక అంగు ళం మందంగా ఒత్తుకోవాలి.

4. తరువాత చాకు తీసుకుని డైమండ్‌ లేదా నచ్చిన ఆకారంలో కట్‌ చేసుకోవాలి.

5. తరువాత స్టౌ మీద పాన్ పెట్టి నూనె పోసి వేడి చేయాలి. అందులో కట్ చేసి పెట్టుకొన్న డైమండ్స్ ను కాగే నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఇవి వారం పది రోజుల వరకు నిలవ వుంటాయి.

బ్రింజాల్(వంకాయ)రైస్-సౌంత్ ఇడియన్ స్పెషల్

వాంగీబాత్ లేదా బ్రింజాల్ రైస్ ఈ వంట సౌంత్ ఇండియన్ స్పెషల్ వంటకం. మరీ ముఖ్యంగా ఈ వాంగీ బాత్ ను కర్ణాటకవాసులు ఎక్కువగా చేసుకుంటారు. ఇది కారంగా ఉండే రైస్ తో తయారు చేసే వంట. ఇండియన్ మసాలలతో తయారు చేసే ఈ వంట టేస్టీగా ఉంటుంది.
ముఖ్యంగా బియ్యం, వంకాయ, మసాలా దినుసులు ఈ వంటకానికి కావల్సిన పదార్థాలు. దీన్ని బ్రేక్ ఫాస్ట్ గాను, మధ్యహాన భోజనంగాను తీసుకోవచ్చు.
బియ్యం: 250 grams (నెయ్యివేసి ఉడికించిన అన్నం)
వంకాయలు: 100 grams (sliced)
ఆవాలు: 1/2 tsp
కరివేపాకు : రెండు రెమ్మలు
శెనగపప్పు: 1tbsp
నిమ్మరసం: 1tbsp
వేయించిన పల్లీలు: 10
పసుపు: 1 pinch
ఇంగువ: 1 pinch
నూనె: 2tbsp
ఉప్పు: రుచికి సరిపడా
పేస్ట్ తయారు చేసుకోవడానికి కావల్సిన పదార్థాలు
ఎండుమిర్చి: 3
ధనియాలు: 1tsp
గసగసాలు: 1/2 tsp
జీలకర్ర: 1/2 tsp
నువ్వులు: 1/2 tsp
చెక్క: 1 inch
లవంగాలు: 2
కొబ్బరి తురుము: 1/2 cup
ఉద్దిపప్పు: 1tbsp
కందిపప్పు: 1tbsp
తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యంకు సరిపడా నీరుపోసి, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా నేయ్యి వేసి అన్నం వండి పెట్టుకోవాలి.

2. తర్వాత ఫ్రైయింగ్ పాన్ వేడి చేసి, అందులో జీలకర్ర, లవంగాలు, చెక్క, ఎండు మిర్చి వేసి లైట్ గా వేగించి పక్కన పెట్టుకోవాలి.

3. తర్వాత అందులోనే ఒక చెంచా నూనె వేసి వేడి అయ్యాక అందులో ఉద్దిపప్పు, కందిపప్పు వేసి మరో నిముషం పాటు వేగించి పక్కన పెట్టుకోవాలి.

4. అలాగే అదే పాన్ లో గసగసాలు, నువ్వులు మరియు కొబ్బరి తురుము వేసి రెండు నిముషాలు ఫ్రై చేసుకోవాలి.

5. ఇప్పుడు ముందుగా నూనెలో వేయించి పెట్టుకొన్న మసాలా దినుసులు, తర్వాత ఫ్రై చేసి పెట్టుకొన్న పోపు దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరం అయితే కొద్దిగా నీళ్ళు కలుపుకోవచ్చు.

6. ఇప్పుడు ఒక డీప్ బాటమ్ పాన్ లో కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత అందులో ఆవాలు, కరివేపాకు వేసి ఒక నిముషం వేయించాలి. అందులోనే శెనగపప్పు వేసి వేగించి అందులోనే పసుపు, ఇంగువను చిలకరించి ఫ్రై చేయాలి.

7. ఇప్పుడు అందులో వంకాయ ముక్కలను వేసి, ఉప్పు చల్లి 5-10నిముషాల పాటు వేగించాలి. వంకాయలు కొద్దిగా వేగిన తర్వాత మిక్సీలో పేస్ట్ చేసుకొన్న మసాలాను అందులో వేసి మరో 5నిముషాలు వేయించాలి.

8. వంకాయ మెత్తబడ్డాక అందులో ముందుగా వండిపెట్టుకొన్న అన్నం కలిపి మరో రెండు మూడు నిముషాలు వేయించి సర్వ్ చేయాలి. అంతే వాంగీ బాత్ రెడీ.

మకర సంక్రాంతి స్పెషల్ నేతి అరిసెలు

అరిసెలు తెలుగువారి అత్యంత ప్రీతిపాత్రమైన పిండివంటలలో ఒకటి. ఒకరకంగా మన సంప్రదాయ వంట అని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా సంక్రాంతి పండుగకు అరిసెలు తప్పనిసరి. పిన్నా పెద్దలు మిక్కిలి ఇష్టంతో అరిసెలను ఆరగిస్తారు. ఈ అరిసెలు పెళ్ళైన ఆడపిల్లకి పెట్టే సారెలో కూడా తప్పకుండా పెడతాము.
అరెసెలు చేయటం కొంచెం కష్టమైన పనే అయినా... చాలా రుచికరంగా ఉంటాయి. అరిసెలు చేయడం రెండు రోజుల పని. మొదటి రోజు బియ్యం నానబెట్టుకోవటం, రెండవ రోజు ఆ నానిన బియ్యాన్ని పిండి పట్టించి మెత్తగా జల్లించి ఈ పిండిని బెల్లం పాకం పట్టి అందులో జల్లించిన పిండిని కలిపి అరిసెలు చేసుకోవటం ఇది అరిసెల ప్రహసనం....
కావలసిన పదార్థాలు:
బియ్యం: 1kg
బెల్లం తరుము: 1/2kg
నువ్వులు: 100grms
నీరు: 1cup(తగినంత)
యాలకులు: 2-4(మెత్తగా పొడిచేసుకోవాలి)
నెయ్యి: 1/2cup
నూనె: వేయించడానికి సరిపడా


తయారు చేయు విధానం:
1. ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి 24 గంటలు నానబెట్టుకోవాలి. ఉదయం చిల్లులగిన్నెల్లో వడవేసి పిండి పట్టించుకోవాలి. పిండి తడి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచుకోవాలి.

2. తర్వాత స్టౌ మీద మందపాటి గిన్నె పెద్దది పెట్టుకుని అందులో చిదిమిన బెల్లాన్ని వేసి కొద్దిగా నీరు పోసి పాకం పట్టుకోవాలి. (అరిసెలు గట్టిగా కావాలంటే ముదురుపాకం, మెత్తగా కావాలంటే లేతపాకం) పాకం రాగానే నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి వేసి కలుపుకోవాలి.

3. తర్వాత బియ్యం పిండి ఒకరు వేస్తుంటే మరొకరు ఉండ చుట్టకుండా కలపాలి. ఉండలు చేసుకోవడానికి వీలుగా ఉండేంతవరకూ పిండి వేసి కలపాలి.

4. ఇలా పిండి పాకంతో తయారు చేసుకొన్న తర్వాత స్టౌ ఫ్రైయింగ్ పాన్ పెట్టుకోవాలి. అందులో నూనె వేసి కాగనివ్వాలి.
ఈలోపు పిండిని చిన్న చిన్న ఉండలు చేసుకొని ప్లాస్టిక్‌ కవర్‌ మీద అరిసెలు వత్తుకొని కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి.
బంగారు వన్నె రాగానే వాటిని తీసి అరిసెల పీటపై (గరిటెలు కూడా ఉంటాయి) ఉంచి వత్తుకోవాలి. దీనివల్ల అరిసెల్లో అదనంగా ఉన్న నూనె పోతుంది. వీటిని ఆరబెట్టుకోవాలి. ఆరిన తర్వాత భద్రపచుకోచ్చు.

ఇవి ఒక నెల రోజుల పాటు నిలవ ఉంటాయి. అంతే నోరూరించే అరిసెలు రెడీ..!

క్యాబేజ్ కూటు-స్పెషల్ టేస్టీ సైడ్ డిష్

సాధారణంగా ప్రతి రోజూ మనం తీసుకొనే ఆహారంలో క్యాబేజీ ఒక ఆకుకూర.  ఈ క్యాబేజీ తలను పచ్చిగా, ఉడకబెట్టి లేదా ఊరబెట్టి అనేక వంటకాలలో ఉపయోగిస్తారు. క్యాబేజీ ద్వారా శరీరానికి అవసరమైన "ప్లేవనాయిడ్స్" సమృద్ధిగా అందుతాయి.రక్తములో చెక్కెరస్థాయి సమతుల్యము చేస్తుంది. శరీరములొ కొవ్వు నిల్వలు పేరుకు పోకుండాచేస్తుంది. నిద్ర పట్టేందుకు దోహదం చేసే " లాక్ట్యుకారియం (Lactucarium)" అనే పదార్ధము ఇందులో ఉంటుంది.
క్యాబేజీతో వివిధ రకాల వంటలు, వండుతారు. ఫ్రై, సాంబార్, మిక్స్డ్ వెజిటేబుల్ సలాడ్స్, సూప్స్ లోనూ రకరకాలుగా తింటుంటారు. అయితే కొంచెం వెరైటీగా ఓ స్పెషల్ సైడ్ డిష్ క్యాబేజ్ కూటును తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇది ప్లెయిన్ రైస్, చపాతీ, పూరీలలోనికి చాలా రుచికరంగా ఉంటుంది. మరియు ఆరోగ్యానికి మంచిది కూడా...
cabbage kootu special side dish

కావల్సిన పదార్థాలు:
క్యాబేజ్: 1/2 (shredded)
పచ్చిశెనగపప్పు: 1/3 cup
పెసరపప్పు: 1/4 cup
పసుపు: 1/4tsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీరతరుగు: కొద్దిగా
పోపు వేయించడానికి :
ఆవాలు: 3/4 tsp
జీలకర్ర: 1 tsp.
ఉద్దిపప్పు: 1 tsp.
ఇంగువ: 1/4 tsp.
ఎండు మిర్చి: 2 (పెద్దవి)
కరివేపాకు: రెండు రెమ్మలు
నూనె: సరిపడా
పేస్ట్ తయారు చేయడానికి కావల్సినవి:
కొబ్బరి తురుము: 3 tbsp.
పచ్చిమిర్చి: 3-4
జీలకర్ర: 1 tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చిశెనగపప్పును 1గంట పాటు నానబెట్టుకోవాలి. ఒక గంట నానిన తర్వాత వాటిని కుక్కర్ లో వేసి, వాటితో పాటు క్యాబేజ్ తురుము, పసుపు, పెసరపప్పు వేసి ఒకటి లేదా రెండు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి వేడి చేసి, అందులో ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక, అందులోనే ఉద్దిపప్పు, ఎండు మిర్చి వేసి లైట్ గా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు, ఇంగువకూడా వేసి మిక్స్ వేయించాలి.
3. పోపు వేగిన తర్వాత అందులో ముందుగా ఉడకబెట్టుకొన్న క్యాబేజ్ మిశ్రమాన్ని పోయాలి. అందులోనే ఉప్పు, కొబ్బరి పేస్ట్ ను వేసి మిక్స్ చేసుకోవాలి.
4. దీన్నంతటిని 5నిముషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత స్టౌ ఆఫ్ చేసి, వేడి వేడిగా, సైడ్ డిష్ గా సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. అంతే క్యాబేజ్ కూట్ రెడీ. ఇది ప్లెయిన్ రైస్, చపాతీ, పూరీలలోనికి చాలా రుచికరంగా ఉంటుంది.

స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ : సేమియా బిసిబేళబాత్

సాధారణంగా సేమియా అంటేనే పాయసం గుర్తొస్తుంది. ఎందుకంటే సేమియా పాయసం అంటే అందరీకి ఇష్టం కనుక. సేమియా పాయసం లేనిదే ఏ పండుగ, శుభకార్యాలు జరగవంటే అతిశయోక్తి కాదు. సేమియాతో వివిధ రకాల వంటలు చేస్తారు. సేమియా ఉప్మా, సేమియా పాయసం... అందరికీ తెలిసిన స్వీట్ అండ్ సాల్ట్ ఐటమ్స్! సేమ్ టు సేమ్ కాకుండా... సేమ్యాను ఇంకోరకంగా చేసుకోలేమా? కచ్చితంగా ప్రయత్నిస్తే ఓ కొత్త రుచిని చూడవచ్చు.

బిసిబేళబాత్ ఇది కర్ణాటక స్పెషల్ బ్రేక్ ఫాస్ట్, బియ్యం, కందిపప్పు, కూరగాయలతో తయారు చేసే ఈ బ్రేక్ ఫాస్ట్ అక్కడ చాలా ఫేమస్. అదే తరహాలో కొంచెం డిఫరెంట్ గా ఆంధ్రా స్టైల్లో బిసిబేళబాత్ బియ్యం కాకుండా సేమియాతో ట్రై చేస్తే చాలా అద్భుతమైన సాఫ్ట్ బ్రేక్ ఫాస్ట్ తయారవుతుంది. ఈ బ్రేక్ ఫాస్ట్ ను పిల్లలు, పెద్దలు అందరూ హ్యీపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు.

కావలసినవి:
సేమియా: 250grms
కందిపప్పు : 1cup
మునగకాడలు: 2
వంకాయ ముక్కలు: 1/2cup
ఉల్లి తరుగు: 1cup
క్యారట్ తరుగు: 1cup
టొమాటో తరుగు: 1cup
పచ్చిమిర్చి తరుగు: 4
ఆవాలు: 1tsp
జీలకర్ర: 1tsp
ఇంగువ : చిటికెడు
చింతపండుగుజ్జు: 2tbsp
ఎండుమిర్చి : 2, లవంగాలు : 3
పసుపు : 1/2tsp
దాల్చినచెక్క : చిన్నముక్క
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : చిన్న కట్ట
నూనె : గరిటెడు, ఉప్పు : రుచికి తగినంత
కారం : 1/2tsp
సాంబారు పొడి: 1tsp

తయారు చేయు విధానం:
1. ముందుగా మూడు కప్పుల నీటిలో టీ స్పూను నూనె వేసి సేమియాను ఉడికించాలి. ఉడికిన సేమ్యాను చల్లని నీటితో బాగా కడిగి నీరు వడకట్టి పక్కన పెట్టుకోవాలి.

2. తర్వాత కందిపప్పు కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి.

3. ఇప్పుడు పాన్ లో కొద్దిగా నూనె కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి. తరవాత లవంగాలు, దాల్చిన చెక్క, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి.

4. తరవాత కూర ముక్కలన్నీ వేసి, కొద్దిగా నీళ్లు పోసి ఉడికించాలి. ముక్కలు మెత్తబడ్డాక చింతపండురసం, సాంబారు పొడి వేసి బాగా కలిపి, ఉప్పు, కారం, ఉడికించిన కందిపప్పు, కొద్దిగా నీళ్లు పోసి పది నిమిషాలసేపు ఉడికించాలి.
చివరగా ఉడికించిన సేమియా, కొత్తిమీర వేసి రెండు నిమిషాలు ఉడికించి దింపేయాలి. అంతే సేమియా బిసిబేళబాత్ రెడీ..

ఖర్చు చేయకుండానే సౌందర్యాన్ని పెంచే 7వస్తువులు

అందం గురించి చెప్పాలంటే చాలా జాగ్రత్తలు తీసుకొంటే తప్ప ఉన్న అందాన్ని మరింత రెటింపు చేసుకోలేరు. అయితే తమ అందాన్ని కాపాడుకోవడానికి మహిళలు నానా తంటాలు పడుతూ, డబ్బును వధా చేస్తుంటారు. చివరగా వారికి మిగిలేది జీరో. బ్యూటీ పార్లర్స్ కు వెళ్ళి వచ్చిన ఒకటి రెండు రోజులకు కొంచెం తేడా కనిపించినా తర్వాత.. తర్వాత తిరిగి యాథా స్థితికి చేరుకుంటుంది.

డబ్బు కర్చుతో పాటు, బ్యూటీ పార్లర్స్ లో ఉపయోగించే రసాయనాలు ప్రభావం ముఖంలో మొటిమలు, మచ్చలు. ప్రయోజన లేనివాటికి డబ్బు ఖర్చు చేసే కంటే ప్రయోజనం ఉన్న మన వంటింటి వస్తువును ఉపయోగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాఅని వంటింటిట్లో ఉపయోగించే అన్ని వస్తువులు సౌందర్యానికి ఉపయోగపడుతాయనుకోకూడదు. అందులో మంచి ఫలితాలనిచ్చే వస్తువు కొన్ని మీకోసం...

బేకింగ్ సోడా:అందాన్ని పెంచుకోవడంలో బేకింగ్ సోడా ఒకటి. అది మీకు తెలుసా? మీ పళ్ళు తెల్లగా మిళమిళ మెరవాలన్నా.. గారపళ్ళు తెల్లబడాలన్నా ఈ బేకింగ్ సోడాను చిటికెడు పళ్ళు రుద్దే బ్రెష్ మీద చిలకరించుకొని రుద్దితే మంచి ఫలితాన్ని మీరు చూడవచ్చు. అలాగే బేకింగ్ సోడాతో పాటు కొంచె తేనె కూడా చేర్చి స్ర్కబ్ చేయాలి. కాబట్టి బేకింగ్ సోడాను వేస్ట్ చేయకుండా అందమైన పళ్ళ కోసం ఉపయోగించండి.


ఆలివ్ ఆయిల్:
ఇంట్లో ఉపయోగించే ఆలివ్ ఆయిల్ ను శరీరానికి మాత్రమే కాదు, చర్మానికి కూడా మంచిది.!చాలా మంది ఈ ఆలివ్ ఆయిల్ ను బాడీ మాయిశ్చరైజర్ గానూ, కంటి మేకప్ ను తొలగించడానికి, స్లాప్ ట్రీట్మెంట్ లోనూ విరివిగా ఉపయోగిస్తుంటారు. ఎక్కువ జిడ్డు చర్మం కలిగిన వారు బాడీ ఆయిల్ కు బదులు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం వల్ల మెరిసే చర్మం మీ సొంతం అవుతుంది.

చెక్క:ఇది అద్భుతమైన సువాసననిచ్చే వంటింటి మసాలా దినుసు. ఇది వంటలలో అద్భుతమైన రుచిని అంధిచడమే కాదు, చర్మ సౌందర్యాన్ని పెంచడంలో కూడా చాలా బాగా పనిచేస్తుంది. ముఖ్యంగా మొటిమల మీదా దీని ప్రభావం బాగా పనిచేస్తుంది మూడు చెంచాల తేనెకె ఒక చెంచా చెక్క పొడిని చేర్చి మెత్తని పేస్ట్ లా తయారు చేసి రాత్రి పడుకొనే ముందు ముఖానికి పట్టించి, ఉదయాన్నే చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

డ్రైయర్ షీట్స్:ప్రతి రోజూ మీ కురులను పొడిగా అందంగా ఉంచుకోవాలనుకొన్నప్పుడు ఈ డ్రైయర్స్ షీట్స్ బాగా ఉపయోగపడుతాయి. ఈ డ్రైయర్ షీట్స్ వివిధ రకాలుగా మార్కెట్లో లభ్యం అవుతాయి. కాబట్టి వీటిని తీసుకొని తలను తుడుచుకోవడం వల్ల కురులు మెత్తగా తడి ఆరేలా చేసి, చిక్కు పడకుండా చేస్తుంది.

కుక్కింగ్ స్ప్రే:కుకింగ్ స్ర్పే నిజమైన బ్యూటీ ప్రొడక్ట్. మీరు దరించే టాప్స్, కోట్స్ అతి త్వరగా ఆరబెట్టుకోవాలన్నా, చేతులకు నెయిల్ పాలిష్ త్వరగా ఆరేలా చేసి, డబుల్ కోట్ వేసుకోవాలన్నా, ఈ వాసనలేని కుక్కింగ్ స్ప్రేను ఉపయోగించవచ్చు.

టూట్ పేస్ట్:టూత్ పేస్ట్ క్లాసిక్ బ్యూటి కిచెన్ సహాయకారిని. ఇది స్పాట్ ట్రీట్మెంట్ గా ఉపయోగపడుతుంది. కాలిన మచ్చలు పోగట్టడానికి, తక్షణ ఉపశమనానికి సహాయపడుతుంది. గోళ్ళును శుభ్రం చేసి తెల్లగా మార్చడానికి ఈ టూత్ పేస్ట్ చేతులకు రాసుకొని శుభ్రం చేసుకోవచ్చు.

పెట్రోలియం జెల్లీ:పెట్రోలియం జెల్లీ తో చాలా రకాల ప్రయోజనకరమైన ఉపయోగాలున్నాయి. ఇది అందానికి మాత్రమే కాదు, కాలుకు తొడిగే షూ వల్ల కాళ్ళుకు ఏర్పడే బొబ్బలు నివారించడానికి బాగా పనిచేస్తుంది..


షాంపూ మరియు కండీషనర్ తో తలస్నానం చెయ్యడం ఎలా ?

ఏ కాలం లో అయినా చర్మం కాంతివంతంగా ఉండాలంటే నీరు ఎక్కువగా తీసుకోవాలి. జుట్టు కాంతి వంతంగా ఉండాలంటే  నీరు ఎక్కువగా తాగటంతో పాటు రోజూ షాంపూయింగ్ చేస్తూ ఉండాలి. ప్రతి రోజూ తల స్నానం చేస్తే  జుట్టు రాలిపోతుంది అనేది ఒక అపోహ మాత్రమే. ప్రతి రోజూ తల స్నానం చేయడం వల్ల  జుట్టు రాలిపోవడం ఏమీ ఉండదు. మనం వాడే షాంపులు, అనారోగ్య కారణాలే జుట్టు రాలిపోడానికి కారణం.
తలస్నానం చెయ్యడం, వినడానికి ఎంతో సులభంగా అనిపించినా, ఎక్కువ మంది తప్పు పద్దతిలో జుట్టుని వాష్ చేస్తారు. అయితే, మెరుస్తున్న, ఆరోగ్యకరమైన జుట్టుని పొందేందుకు తలస్నానం చేసే సరైన పద్దతిని ఈ వ్యాసం ద్వారా తెలుసుకుందాం.
how take proper head bath

పద్దతులు:
1. షాంపూ, కండిషనర్ మరియు ఒక దువ్వెనని తీసుకోండి.
2. చిక్కు పడకుండా ఉండేందుకు తలస్నానానికి వెళ్ళే ముందు మీ జుట్టుని చక్కగా దువ్వుకోండి.
3. గోరువెచ్చని నీటితో మీ జుట్టుని పూర్తిగా కడగండి. 30 సెకండ్ల పాటు జుట్టుని తడిగా ఉంచుకోండి.
4. మీ అరచేతిలో కొంత షాంపూని తీసుకోండి. మీ జుట్టు పొడుగు మరియు ఒత్తుని బట్టి షాంపూ ని వాడే మొత్తం మారుతుంది. సాధారణంగా ఒక డాలర్ లేదా కాయిన్ సైజులో తీసుకోవచ్చని అంచనా.
5. మీ ముని వేళ్ళతో తలపై నున్న చర్మంపై సుతారంగా మర్దనా చెయ్యాలి. గోర్లని వాడవద్దు. తలపై న భాగంలో మర్దనా చేయండి. షాంపూ తో జుట్టు కుదుళ్ళకి కండిషన్ ని జుట్టు చివర్లకి వాడితే మంచి ఫలితాలు ఉంటాయి.
6. గోరు వెచ్చని నీటితో జుట్టుని కడగండి. షాంపూ మొత్తం పోయేవరకు జుట్టుని శుభ్రపరచాలి.
7. ఇప్పుడు కొంత కండీషనర్ ని మీ అర చేతిలోకి తీసుకోండి. మెడ వెనుక భాగంలో నుండి మీ మునివేళ్ళతో జుట్టుని కండీషనర్ తో రాయండి. మీ జుట్టు మొనలని చేరే వరకు ఇలా రాయండి.
8. తరువాత రెండు మూడు నిమిషాలు కండీషనర్ జుట్టుకి పట్టేంతవరకు సమయం ఇవ్వండి. జుట్టు మొత్తానికి కండీషనర్ వ్యాప్తి చెందేందుకు మెల్లగా దువ్వండి.
9. ఇప్పుడు గోరువెచ్చని నీటితో కండీషనర్ మొత్తం తొలగిపోయేవరకు జుట్టుని కడగండి.
10. మీ కేశాలు అందంగా మెరవడం కోసం చల్లని నీటితో మీ జుట్టుని శుభ్రం చెయ్యండి.
11. ఒక తువ్వాలు తీసుకుని జుట్టు తడి అరిపోయేవరకు తుడవండి. జుట్టుని గట్టిగా పిండకండి.
12. జుట్టుని సహజంగా తడి ఆరబెట్టండి. డ్రైయర్ వాడడం మంచిది కాదు.
చిట్కాలు :
రేడియో వింటూ తలస్నానం చెయ్యడం ఏంటో ఆనందాన్ని కలుగచేస్తుంది. ఎంతో ఆహ్లాదంగా, రిలాక్సింగ్ గా ఉంటుంది. అయితే, మీ రేడియోని లేదా ఏవైనా ఎలక్ట్రానిక్ వస్తువుల పై తడి పడకుండా జాగ్రత్తపడండి.:
హెచ్చరిక :
తలస్నానం తరువాత జుట్టుని జాగ్రత్తగా శుభ్రం చెయ్యండి. లేకపోతే జుట్టు జిడ్డుగా ఉంటుంది.
తడిగా ఉన్నప్పుడు జుట్టుని దువ్వకండి. జుట్టు చిట్లి, పాడైపోయే అవకాశం ఉంటుంది.
జుట్టు బాగా తడి ఆరాక దువ్వితే మంచిది.
జుట్టు పైన షాంపూని రాసేటప్పుడు చిక్కు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా తలస్నానం చెయ్యండి.

కాంతివంతమైన చర్మానికి నేచురల్ స్కిన్ బ్లీచ్...

నేచురల్ స్కిన్ బ్లీచింగ్ చేసుకోవడం వల్ల దాని ఫలితం తక్షణం చూపెట్టకపోయినా..సున్నితమైన చర్మం కలవారు ఇలా స్కిన్ బ్లీచ్ చేసుకొనే పద్దతి మహిళలకు మంచి పద్దతి. బయట మార్కెట్లో దొరికె కెమికల్ బ్లీచ్ లు అన్ని రకాల చర్మాలకు సరిపోవు. కొందరిక మాత్రమే ఇవి ఎటువంటి హాని కలుగజేయవు. అయితే సున్నితమైన చర్మం కలవారికి కెమికల్స్ ను బ్లీచింగ్ లో వాడటం వల్ల చర్మం మంట పెట్టడం లేదా దద్దర్లు, చారలు ఏర్పడటం వంటివి జరుగుతాయి. కాబట్టి అటువంటి వారు నేచురల్ బ్లీచ్ ను ఇంట్లోనే చేసుకోవడం చాలా ఆరోగ్యకరం.
సాధారణంగా మన చర్మం, పొడి బారడం, మొటిమలు, మచ్చలతో అసహ్యంగా కనబడుతుంటుంది అటువంటప్పుడు బ్లీచింగ్(మెడకు కూడా)చేసుకోవడం చాలా మంచిది. అందుకు ఇక్కడ నార్మల్ బ్లీచింగ్ చేసుకోవడానికి కొన్ని హోం రెమడీస్ మీకు అందిస్తున్నాం. అవి మీకు ఎటువంటి ఫలితాన్ని గమనించండి. అయితే వెంటనే ప్రభావం చూపకపోయినా... కొద్దికాలం తర్వాత ఖచ్చితంగా మంచి ఫలితాన్ని మీరు పొందవచ్చు.

ఆలివ్ ఆయిల్- సుగర్ స్ర్కబ్: ఒక మిక్సింగ్ బౌల్ లో ఆలివ్ ఆయిల్ మరియు పంచదారా రెండింటీని వేసి బాగా మిక్స్ చేసి ముఖం మెడకు పట్టించి ఇరవై నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం సున్నితంగా కాంతివంతంగా మారుతుంది.

ఆరెంజ్ తొక్క మరియు పాల క్రీమ్: సిట్రస్ ఆసిడ్ కు సంబంధించిన ఏ పండ్లు, కూరగాయలైనా చర్మానికి సహజ సౌందర్యాన్ని ఇస్తుంది. వాటిలో యాంటిఆక్సిడెంట్స్ అధికంగా కలిగి ఉండటం వల్ల అవి బ్లీచింగ్ వస్తువులుగా ఉపయోగపడుతాయి. ఆరెంజ్ తొక్కలను బాగా ఎండబెట్టి పొడి చేసి, దానికి పాలక్రీమ్ చేర్చి ముఖానికి, మెడకు పట్టించి 10 నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

టమోటో గుజ్జు మరియు నిమ్మరసం: టమోటో గుజ్జులో కొద్దిగా నిమ్మరసం కలిని, ముఖ చర్మానికి పట్టించాలి. తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకొన్న తర్వాత మార్పును గమనించండి ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే ఇందులో ఆసిడ్స్ ఎక్కువగా ఉన్నందును త్వరగా ఫలితాన్నిస్తుంది.

కీరదోస-నిమ్మరసం-పెసరపిండి: కొన్ని కీరదోస ముక్కలను పేస్ట్ చేసి అందులో నిమ్మరసం పిండి, అందులోనే శెనగపిండి లేదా పెసరపిండి వేసి బాగా మెత్తగా పేస్ట్ లా తయారు చేసి ముఖానికి, మెడకు పట్టించి శుభ్రం చేసుకొంటే ముఖం తాజాగా కాంతివంతంగా మారుతుంది.

కీరదోస-నిమ్మరసం-పెసరపిండి: కొన్ని కీరదోస ముక్కలను పేస్ట్ చేసి అందులో నిమ్మరసం పిండి, అందులోనే శెనగపిండి లేదా పెసరపిండి వేసి బాగా మెత్తగా పేస్ట్ లా తయారు చేసి ముఖానికి, మెడకు పట్టించి శుభ్రం చేసుకొంటే ముఖం తాజాగా కాంతివంతంగా మారుతుంది.

వైట్ వెనిగర్: సాధారణంగా మొటిమలు మచ్చలు తొలగించడానికి వైట్ వెనిగర్ ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే ఇది మంచి కలర్ ను తీసుకురావడానికి కూడా బాగా సహాపడుతుంది. సూర్యరశ్మి నుండి చర్మాన్ని కాపాడి, మొటిమలు, మచ్చలు ఏర్పడకుండా చర్మా శుభ్రం చేసి క్లియర్ స్కిన్ ఏర్పరుస్తుంది. కాటన్ బాల్స్ ను వైట్ వెనిగర్ లో నానబెట్టి తర్వాత ముఖానికి శుభ్రం చేసుకోవాలి.

మెంతి-గసగసాలు-నిమ్మరసం: మెంతులు, గసగసాలు మెత్తగా పేస్ట్ చేసి, అందులో నిమ్మరసం కలిపి ముఖానికి పట్టించాలి. పది నిముషాలు ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తుకోవడం వల్ల బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ తొలగిపోయి, చర్మం క్లియర్ గా మారుతుంది. తాజాగా కనబడుతుంది.