మీరు ఫేస్‌బుక్‌లో కొత్తగా దుకాణం పెట్టారా. ఐ మీన్, అకౌంట్ ఓపెన్ చేసారా. వెంటనే యమ స్పీడుగా బోలెడుమంది ఫ్రెండ్స్‌ను మీ అకౌంటుకు జోడించుకునే ఉంటారు. ఎంతైనా సరసులు మరి. అన్నట్టూ, మీ ఈ-మెయిల్ ఖాతాలో రోజూ ఫేస్‌బుక్ తాలూకు ఈ-మెయిల్స్ బోలెడు నోటిఫికేషన్స్ పేరుతో వస్తూండాలే? ఔను మరి. ఫేస్‌బుక్‌లో ఉండే వీరులందరినీ మిత్రులుగా చేసుకునే తాపత్రయం. ఏం జేస్తాం. రోజూ మీ మెయిల్ బాక్స్‌లో ఫేస్‌బుక్ నోటిఫికేషన్స్ బోలెడు చిరాకెత్తించేస్తాయి. సగం జీవితం వాటిని క్లియర్ చేసుకోవడంతోనే గడిచిపోతుంది. ఫేస్‌బుక్‌తో బుక్కయిపోయాంరా బాబూ! అనుకునేస్తాం. ఈ సమస్య మీకే కాదు. ఎందరికో ఉంది. కాబట్టి డోంట్ వర్రీ అని చాలామంది మిత్రులు ఈపాటికే చెప్పేసి ఉంటారు. కానీ ఫేస్‌బుక్‌లో మీరు ఎంచుకున్న గ్రూప్స్ నుంచీ నోటిఫికేషన్స్ రాకూడదనుకుంటున్నారా? ఐసీ.. ఐతే నో ప్రాబ్లెం. మీ ఈ-మెయిల్ ఖాతాకు గ్రూప్ నోటిఫికేషన్స్ రాకూడదనుకుంటే, ఇలా చేయండి.
ముందుగా మీరుండే గ్రూప్‌ను దర్శించండి. అందులో ఎడిట్ సెట్టింగ్స్ అనేదాన్ని ఎంచుకోండి. ఇందులో కస్టమ్స్ నోటిఫికేషన్స్ అనే దానిలో చిత్రంలో చూపినట్లు ఉన్న రెండు చెక్ బాక్స్‌లను అన్ చెక్ చేయండి. బస్. అంతే.
అలా కాకుండా, గ్రూప్ నోటిఫికేషన్స్ కావాలీ అనుకుంటే, దాని కోసం మీరో ఈ-మెయిల్ ఐడిని ప్రత్యేకంగా క్రియేట్ చేసుకోండి. దానిని ప్రస్తుతం ఉండే మీ (పాత) ఈ-మెయిల్ ఐడి స్థానంలో ఉంచండి. అంటే, ఫేస్‌బుక్ గ్రూప్ నోటిఫికేషన్స్ కోసం మాత్రం ఈ కొత్త ఈ-మెయిల్ ఐడిని యాక్సెస్ చేస్తారన్నమాట. మరీ, ఇతర నోటిఫికేషన్స్ మాటేంటీ అంటారా? ఒకవేళ సెలెక్టివ్‌గా కొన్ని నోటిఫికేషన్స్ మాత్రమే కనిపించేలా సెట్ చేసుకోవాలనుకుంటే, అదీ సాధ్యమే. చిత్రంలో Notify me when అని ఒక డ్రాప్ డౌన్ బాక్స్ కనిపిస్తోంది కదూ. డిఫాల్టుగా A member posts or comments అని కనిపిస్తోది కదా. అదికాక A member posts, A friend posts, only posts I am following అని ఇంకా మరో 3 ఆఫ్షన్స్ ఉన్నాయి.
వీటిలో A member posts or comments అనేదాన్ని ఎంచుకుంటే, గ్రూప్ మెంబర్స్ కామెంట్ చేసినా లేదా కొత్త పోస్ట్స్ పెట్టినపుడు మాత్రమే ఈ-మెయిల్ నోటిఫికేషన్స్ వస్తాయి. అదే A member posts అనేదాన్ని ఎంచుకుంటే, గ్రూప్ మెంబర్స్ కొత్త పోస్ట్స్ పెట్టినపుడు మాత్రమే ఈ-మెయిల్ నోటిఫికేషన్స్ వస్తాయి.
అలా కాకుండా A Friend posts అనేదాన్ని ఎంచుకుంటే, ఫ్రెండ్స్ కొత్త పోస్ట్స్ పెట్టినపుడు మాత్రమే ఈ-మెయిల్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఇవేమీ కాకుండా Only posts I am following అనే ధాన్ని ఎంచుకుంటే, మీరు ఫాలో అయ్యే పోస్టింగ్స్‌కు సంబంధించిన వాటికి మాత్రమే ఈ-మెయిల్ నోటిఫికేషన్స్ వస్తాయి. ఫాలో అవుతున్న వాటినించి నోటిఫికేషన్స్ వద్దనుకుంటే unfollow posts ఎంచుకుని అన్‌ఫాలో కూడా అవ్వచ్చు. అన్నట్టు, వీటన్నిటిలోనూ Only posts I am following అనేధాన్ని ఎంచుకుంటేనే బెటర్. ఏమంటారూ

No comments:
Post a Comment