అయితే చాలా సందర్భాల్లో ఆ నిల్వ చేసిన నెయిల్ పాలిష్ బాటిల్స్ నెయిల్ పాలిష్ ఎండిపోవడం కానీ లేదా చిక్కగా మారడం కానీ జరుగుతుంటుంది. అటువంటప్పుడు నెయిల్ పాలిష్ ఎండిపోకుండా చిక్కబడకుండా ఉండేందకు ఎలా నిల్వ చేయాలి. తెలుసుకోవాలంటే ఈ క్రింది చిట్కాలు చూడండి..
1. నెయిల్ పాలిష్ ఎండిపోకుండా వుండాలంటే సీసాను ఫ్రిజ్‌లో వుంచండి. నెయిల్ పాలిష్ ను రిఫ్రిజరేటర్ లో ఉంచేటప్పుడు బ్యూటి కిట్ షెల్స్ సెపరేట్ గా ఉంటుంది. అందులో స్టోర్ చేయాల్సి ఉంటుంది. స్టోర్ చేసిని నెయిల్ పాలిష్ లను ఒక నెలలోపుల వినియోగించాలి. లేదా అది ఎడిపోకుండా లేదా చిక్కబడక ముందే ఉపయోగించవచ్చు.
2. మరో బెస్ట్ ఆప్షన్ సూర్యరశ్మి తగలని ప్రదేశంలో కూడా నెయిల్ పాలిష్ ను స్టోర్ చేసుకోవచ్చు. అందువల్ల త్వరగా పాడవకుండా ఉంటాయి.
3. నెయిల్ పాలిష్ బాటిల్స్ ను స్టోర్ చేసేటప్పుడు అవి నిటారుగా ఉండేలా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల త్వరగా ఎండిపోకుండా ఉండటమే కాకుండా ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంటుంది. ఒక వేళ నెయిల్ పాలిష్ బాటిల్ పడిపోయినా వెంటనే దానిని తిరిగి నిటారుగా పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల నెయిల్ పాలిష్ బాటిల్ లో ఉన్న పదార్థాలు విడిపోకుండా నిరోధిస్తుంది.
4. నెయిల్ పాలిష్ కొనే ముందు మంచి నాణ్యత కలిగినది కొనాలి. తక్కువ ధర ఉన్న నెయిల్ పాలిష్ అతి త్వరగా గోరు నుండి తొలగిపోతుంది. మరియు అది మందగా అప్లై చేయాలన్నా కష్టం అవుతుంది. కాబట్టి డబ్బు ఖర్చైనా, నాణ్యతకు విలువ ఇవ్వండి.
5. ఎనామెల్ పెయిట్ గోళ్ళకు అప్లై చేసిన తర్వాత, బాటిల్ మూతను గట్టిగా మూసివేయాలి. దాంతో నెయిల్ పాలిష్ త్వరగా ఎండిపోకుండా ఉంటుంది. ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
6. నెయిల్ పాల్ అప్పుడప్పుడు ఆయిల్ గా మారి కలర్ సెపరేట్ అవుతుంటుంది. దీన్ని నివారించాలంటే సీసా మెడ(మూత)బాగంలో పెట్రోలియం జెల్లీని రాసి మూత గట్టిగా బిగించాలి. దాంతో గాలి లోపలికి చొరవడకుండా అడ్డుకుంటుంది. మరియు మీరు దాన్ని తిరిగి ఉపయోగించదల్చుకొన్నప్పుడు తెరవడానికి సులభం అవుతుంది.
7. ఒక వేళ ఎనామిల్ పెయింట్ బాటిల్లో సెపరేట్ అవ్వడం లేదా ఎండిపోడం జరిగితే అందులో నెయిల్ పాలిష్ థిన్నర్ లేదా నెయిల్ పాలిష్ రిమూవర్ ను వేసి బాగా షేక్ చేసిన తర్వాత ఉపయోగించాలి.
8. కొన్ని సందర్భాల్లో నెయిల్ పాలిష్ బాటి మూత దగ్గర బాగా డ్రై అయ్యి మూత తెరవడానికి కూడా చాలా కష్టం అవుతుంది. అటువంటప్పుడు నెయిల్ రిమూవర్ లిక్విడ్ ను గ్లాస్ నిండుగా పోసి అందులో నెయిల్ పాలిష్ బాటిల్ ను డిప్ చేయాలి. కొన్ని నిముషాల తర్వాత బయటకు తీసి పొడి వస్త్రంతో తుడిచి తర్వాత ఓపెన్ చేసే సులభంగా వచ్చేస్తుంది.
ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో విలువైన నెయిల్ పాలిష్ బాటిల్స్ ను స్టోరి చేసి, నెయిల్ పాలిష్ ను, డబ్బును సేవ్ చేయవచ్చు. ఎక్కువ కాలం మన్నేలా చేయవచ్చు. నెయిల్ పాలిష్ ఉపయోగించే ముందు ఎక్కువగా షేక్ చేయకూడదు. ఎక్కువ షేక్ చేయడం వల్ల చిన్న చిన్న బుడగలు ఏర్పడుతాయి. ఈ బుడగలు గోళ్ళ మీద అలాగే పాలిష్ చేయడం వల్ల అపరిశుభ్రంగా కనిపిస్తాయి. కాబట్టి నెయిల్ పాలిష్ అప్లై చేసే అరగంట మందు బాటిల్ ను రెండు చేతులకు మధ్యలో అరచేతుల్లో పెట్టి బాగా రుద్ది తర్వాత ఉపయోగించాలి.
Sensually Romantic by Charu Parasha...