all

Saturday, November 24, 2012


NewsListandDetails కావలసినవి
ఓట్స్‌-ఒక కప్పు
గోధుమరవ్వ-అరకప్పు, పెరుగు-అరకప్పు
కేరట్‌ తురుము-రెండు టేబుల్‌ స్పూను్ల
ఉప్పు-తగినంత
నిమ్మకాయరసం-ఒక టేబుల్‌ స్పూన్‌
నీళ్లు-సరిపడా
అల్లం తురుము-ఒక టీస్పూన్‌
పచ్చిమిరపకాయలు-రెండు
కొత్తిమీర తురుము-ఒక టేబుల్‌ స్పూన్‌
ఆవాలు-ఒక టేబుల్‌ స్పూన్‌
శనగపప్పు-ఒక టేబుల్‌ స్పూన్‌
మినపప్పు-అర టేబుల్‌స్పూన్‌
కరివేపాకు-ఒక రెబ్బ
నూనె-సరిపడా
తయారుచేసే విధానం:
ముందుగా ఓట్స్‌ని మిక్సీలో వేసుకుని పొడిచేసుకోవాలి. ఇందులో గోధుమరవ్వ కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద గిన్నె పెట్టి సరిపడా నూనెపోసి ఆవాలు శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, అల్లం, పచ్చిమిరప కాయలు వేసి వేయించాలి. తరువాత కేరట్‌ తురుము, కొత్తిమీర కూడా వేసి వేయించి తీసేయాలి. దీన్ని ఓట్స్‌పొడిలో వేసి బాగా కలపాలి.
తర్వాత నీళ్లు, పెరుగు, ఉప్పు వేసి మరోసారి కలుపుకోవాలి. ఈ పిండితో అప్పటికప్పుడే ఇడ్లీలు వేసుకోవచ్చు. పులవాల్సిన పనిలేదు. వీటిని కొబ్బరి చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి.

No comments: