all

Saturday, November 24, 2012

మళ్ళీ మళ్ళీ తినాలనిపించే స్పైసీ చికెన్ మసాలా...

సాధారణంగా మనకు ఇష్టమైన వంటలు కొన్ని ప్రత్యేకంగా ఉంటాయి. వాటిని మళ్ళీ మళ్ళీ తయారు చేయడానికి విసుగు అనిపించదు. ఎందుకంటే వాటి రుచి అంత అద్భుతంగా ఉంటాయి కాబట్టి. అలాంటి వాటిలో కుటుంబ సభ్యులు, స్నేహితులు అమితంగా ఇష్టపడే వంట స్పైసీ చికెన్ మసాలా కర్రీ. ఇది చూడటానికి, తినడానికి రెస్టారెంట్ వంటాల అనిపిస్తుంది కానీ రెస్టారెట్ ఐటమ్ మాత్రం కాదు. మనమే ఇంట్లో స్వయంగా చేసుకొనే ఈ చికెన్ రిసిపి చాలా సులభంగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం....
spicy chicken masala

కావల్సిన పదార్థాలు:
మ్యారినేట్ చేయడానికి:
చికెన్: ½ kg( శుభ్రం చేసుకొని కావల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి)
పెరుగు: 3 tbsp
కారం: 2tsp(తర్వాత మీకు కారం సరిపోయే విధంగా అడ్జెస్ట్ చేసుకోవాలి)
పసుపు: ¼ tsp
ఉప్పు: రుచికి సరిపడా
మసాలా కోసం:
జీడిపప్పు: 6-7
పాలు: 4-5 tbsp
వేయించి పొడి చేసుకోవడానికి కావల్సినవి:
చెక్క: చిన్న ముక్క
కరివేపాకు: రెండు రెమ్మలు
లవంగాలు: 4-6
వేయించడానికి కావల్సినవి
నూనె: సరిపడా
ఉల్లిపాయలు: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)
టమోటో: 1(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అల్లం పేస్ట్: 1tsp
ధనియాల పొడి: 1tsp
బ్లాక్ పెప్పర్: 3/4 tsp(ఇవికూడా మీకు కారం సరిపడే విధంగా వేసుకోవాలి)
జీలకర్ర పొడి: ¼tsp
కొత్తిమీర తరుగు: గార్నిష్ కోసం కొద్దిగా
తయారు చేయు విధానం:
1. ముందుగా శుభ్రం చేసి పెట్టుకొన్న చికెన్ ముక్కలకు కారం, పసుపు, పెరుగు, ఉప్పు వేసి బాగా కలిపి అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి.
2 . చికెన్ కారంలో మ్యారినేట్(నానే)లోపు జీడిపప్పు, పాలు వేసి మెత్తగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత చెక్క, లవంగాలు మరియు కరివేపాకు లైట్ గా వేయించి, చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
4. కుకింగ్ పాన్ లో నూనె వేసి, వేడయ్యాక అందులో ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేయించాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మీడియం మంట మీద మరో ఐదు నిముషాలు వేయించాలి.
5. ఇప్పుడు అందులో ధనియాలపొడి, జీలకర్రపొడి వేసి బాగా మిక్స్ చేసి మరో ఐదు నిముషాలు వేయించాలి
6. తర్వాత టమోటో ముక్కలను కూడా చేర్చి టమోటో మెత్తబడే వరకూ వేయించాలి. ఇప్పుడు స్టౌ ఆఫ్ చేసి ఫ్రై చేసి మిశ్రమాన్ని క్రిందికి దింపుకొని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీలో వేసి మెత్తగా మసాలా పేస్ట్ చేసుకోవాలి
7 . ఇప్పుడు మరో పాన్ లో కొద్దిగా నూనె వేసి వేడయ్యాక అందులో మ్యారినేట్ చేసి పెట్టుకొన్న చికెన్ అందులో వేసి ఐదు నిముషాల పాటు వేగించాలి. మంట తగ్గించి మరో ఐదు నిముషాలు బాగా వేయించాలి.
8. చికెన్ ముక్కలు వేగి, నూనె తేలే సమయంలో గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాల పేస్ట్, జీడిపప్పు పేస్ట్, చెక్కలవంగాలుకరివేపాకు పౌడర్ వేసి బాగా మిక్స్ చేస్తూ వేయించాలి.(గ్రేవీకి సరిపడా నీళ్ళు పోసి మెత్తగా ఉడికించుకోవాలి. వేయించేటప్పుడు ఉప్పు, కారం ఒక సారి సరిచూసుకొని కలుపుకోవాలి. చివరగా కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి అంతే స్పైసీ చికెన్ మసాలా రెడీ...

 

No comments: