all

Saturday, November 24, 2012

తుంటరి కోతి తంటాలు!
కథ


ఒక గ్రామంలో ఒక పెద్ద వేపచెట్టు ఉండేది. దాని కింద ఒక ఎద్దు ఉండేది. దాని కొమ్ములను, తోకను పట్టుకొని పిల్లలు ఆడుతుండేవారు. అది మాత్రం ఏమీ అనేది కాదు. చిన్నపిల్లలైతే ఒకరిద్దరు దాని మీద ఎక్కి కూర్చునేవారు. దానికీ సరదాగా ఉండేది. ఎద్దు ముసలిది కావడంతో ఆ గ్రామస్తులు దాన్ని జాగ్రత్తగా చూసుకునే వారు.



ఎద్దు ఒక చెట్టునీడలో పడుకునేది. ఆ చెట్టు మీదకి ఒక కోతి వస్తుండేది. దానికి ఎద్దును ఏడిపించాలంటే మహాసరదా! నిద్రపోతున్నపుడు గట్టిగా అరవడం, మెల్లగా కిందికి దిగి దాని తోక లాగటం చేస్తుండేది. ఎద్దు మాత్రం ఏమీ అనేది కాదు. దాంతో గొడవపడటం ఎద్దుకి ఏమాత్రం ఇష్టంలేదు. కోతి గనుక కోతి చేష్టలే చేస్తుందని ఊరుకునేది. ఎంతో దయ చూపేది. కొమ్ములు పట్టి లాగినా, వెక్కిరించినా తన్నేది కాదు.

ఒకరోజు మధ్యాహ్నం ఎద్దు ఎటో వెళ్లింది. ఊళ్లో ఉన్న పెద్ద రైతు ఎద్దు తన యజమాని ఇంటికి వెళుతూ అలా చెట్టు నీడన వచ్చి నిలిచింది. సరిగ్గా అదే సమయానికి కోతి తన మిత్రుడే అనుకుని ఒక్కసారిగా వచ్చి మీద పడింది.

అంతే! ఈ ఎద్దు వెర్రికోపంతో దాన్ని వీపు మీంచి కిందపడేసి తన బలమైన కాలితో గట్టిగా తన్నింది. కోతి కీచు కీచుమంటూ ఎదురుగా ఉన్న ఓ ఇంటిగోడకి ఢీకొని తీవ్ర గాయాలతో ఎలాగో ప్రాణాలు దక్కించుకుంది.

No comments: