రొట్టె..రొట్టెకు ఓ కోరిక
మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగకు నెల్లూరు బారాషాహీద్ దర్గా ప్రాంతం జనసంద్రమరుు్యంది. వారం ముందుగానే భక్తుల రాక మెుదలరుు్యంది. దేశ, విదేశాల నుంచి వచ్చే లక్షలాది మంది భక్తులు ఇక్కడ జరిగే రొట్టెల పండుగకు తరలి వస్తున్నారు. 25నుంచి రొట్టెల పండుగ జరగనుంది. 26న బారాషాహీద్ దర్గా గంథ మెత్సవం, 27న రొట్టెల మార్పిడి, 28న ముగింపు వేడుక జరుగుతుంది. గంథ మెత్సవం తరువాత భక్తులు తమ కోర్కెలు తీర్చాలంటూ దర్గా వద్ద ఉన్న స్వర్ణా చెరువులో కోర్కెల రొట్టెలు మార్చుకోవడం జరుగుతుంది.
అసలుసిసలు లౌకిక పండుగ
‘‘ఆల్ హమ్దు లిల్లాహి రబ్బిల్ ఆలమీన్,
ఆల్ ఖాఇ...లు పి కితాబిహిల్ కరీమ్’’
(సమస్త స్తోత్రాలకు అర్హుడు అల్లాహుతా అల్లా మాత్రమే. ఆయన తన గ్రంథంలో అన్నాడు)
నెల్లూరు రొట్టెల పండగ భక్తుల్లో విశ్వాసాన్ని పెంచుతోంది. రాను...రాను భక్తుల సంఖ్య పెరుగుతూనే ఉంది. క్రిందటి సంవత్సరం 7 లక్షల భక్తులు వస్తే.....ఈ సంవత్సరం అది 12 లక్షలు దాటుతుందని అంచనా . ఒక కోరిక తీరిన వారు, మరో కోరిక నెరవేరాలని వస్తుంటారు. కులమతాలకు అతీతంగా ఇక్కడకు రావటం మతసామరస్యానికి ప్రతీకగా చెప్పవచ్చు. దేశ, విదేశాల్లో ప్రసిదిచెందిన రొట్టెల పండుగ సందడి.... నెల్లూరు స్వర్ణాల చెరువు వద్ద జరుగుతోంది. మరోపక్క ఈ రొట్టెల పండగకు నిలయమైన బారాషహీద్ దర్గాను అలంకరించారు. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలతో పాటు మన రాష్ర్టంలోని దూర ప్రాంతాల భక్తులు దర్గా ప్రాంతానికి ముందుగానే చేరుకున్నారు. స్వర్ణాల చెరువులో ముందస్తు పండగను జరుపుకున్నారు. కోర్కెలు తీరడం, ఆ కోరికల పేరుతో రొట్టెలను చెరువులోకి దిగి వదిలేందుకు వచ్చిన భక్తుల నుంచి..... ఆయా కోరికలు తీరాలని వచ్చిన భక్తులు అందుకునే కార్యక్రమం జరుగుతోంది. రొట్టెలు మార్చుకున్న భక్తులు.... బారాషహీదులు (మృతవీరులు) సమాధులను దర్శించుకుని గలేఫాలు సమర్పిస్తూ ప్రత్యేక ప్రార్థన జరుపుతారు. అక్కడి ముజావర్లు ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలు జరుగుతాయి.
దీనికీ కథ ఉంది
నెల్లూరు చెరువు.... దీన్నే స్వర్ణాల చెరువంటారు. దీని ఒడ్డున 12మంది అమరవీరుల సమాధుల నుంచి మహిమలు చాటుకుంటూ.... కుల మతాలకు అతీతంగా రొట్టెల పండగగా జరుగుతోంది. పరమాత్ముడు ఇక్కడే ఉన్నాడంటూ కేవలం రొట్టెల పట్టి... విడిచిపెట్టుకోవడం వల్లే ఎన్నో కోరికలు...కష్టాలు తీరుతాయని నమ్మకాన్ని చాటిచెప్పే పవిత్ర పండుగకు ‘రొట్టెల పండుగ’గా పేరొచ్చింది. సౌదీ అరేబియాలో మక్కా షరీఫ్ అనే ప్రాంతం ఉంది. అక్కడి నుంటి ఇస్లాం మతవ్యాప్తి కోసం ప్రత్యేక య్త్రా మొదలెైంది. ఈ యాత్రలో కొందరు మన దేశం వచ్చారు. అప్పట్లో ఈ కర్నాటక రాజ్యం హైదర్‌ఆలీ పాలనలో ఉంది. ఆ కాలంలో వీరు హైదర్‌ఆలీ నవాబుతో పాటు అనేక ప్రాంతాల్లో ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేస్తూ మంచి చెడులను ప్రజలకు తెలుపుతూ ఉండేవారు. నెల్లూరు ప్రాంతాన్ని నవాబులు పాలించే కాలంలో ముస్లింల సంస్కృతికి అనుగుణంగా ఈ పరిసరాల్లో పెద్ద సంఖ్యలో మసీదులు, దర్గాషరీఫ్‌లు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో నెలకొన్న మత విభేదాలు ఇక్కడ కూడా ప్రారంభమయ్యాయి. 1751 సంవత్సరంలో జిల్లాలోని కొడవలూరు మండలం గండవరంలో రెండు వర్గాల మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది.
ఈ కాలంలో మత వ్యతిరేక పాలన చేస్తున్న తమిళనాడు వాలాజా రాజులపెై దండెత్తడానికి బీజాపూర్ నుంచి ఒక బృందం ఇస్లాం మత వ్యాప్తి కోసం బయలుదేరింది. ఈ బృందం నెల్లూరు మీదుగా ప్రయాణిస్తూ గండవరం చేరుకుంది. ఇక్కడ ఉన్న నెల్లూరు నవాబులు ఈ బృందాన్ని బంధించి వాలాజా రాజులకు సమాచారాన్ని అందజేయడంతో వాలాజా సైన్యం రాత్రికి రాత్రే మూకుమ్మడి దాడి జరిపింది. వీరి మధ్య జరిగిన భీకరపోరులో జుల్పెఖార్‌బేగ్‌తో 12 మంది షహీద్ ఆయ్యారు. ఈ షహీదులు 12 మంది తలలు గండవరంలో పడిపోగా... కేవలం తలలు లేని మొండాలను గుర్రాలు నెల్లూరు స్వర్ణాల చెరువు వద్దకు చేరుకున్నాయి. ఒక చాకలి ఈ దృశ్యాన్ని చూసి సృహతప్పి పడిపోయాడు. అతని కలలో 12 మంది షహీదులు కనబడి ఖాజీ సహాయంతో ఈ ప్రాంతంలో తమ తలలు పడి ఉన్న గండవరం గ్రామంలో సమాధులు కట్టించాలని చెప్పారు. అదే కల అప్పటి నెల్లూరు ఖాజీకి కూడా రవడంతో ఈ విషయాన్ని వాలాజా నవాబులకు వివరించారు. దీంతో ఆ నవాబులు వెంటనే నెల్లూరుకు వచ్చి చెరువు పక్కనే 12 మంది సమాధులు కట్టించి చుట్టూ దర్గా నిర్మించారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని బారాషహీద్ దర్గా అని, చుట్టూ ఉన్న ప్రాంతాన్ని దర్గా మిట్ట అని పిలవడం జరిగింది.
రొట్టెల పండుగ మూలం
అప్పట్లో ఈ మార్గంలో వెళ్ళే యాత్రికులు ఇక్కడ సేదతీరేవారు. ఇక్కడి స్వర్ణాల చెరువు వద్ద రొట్టెల భుజించడం వల్ల శుభం జరగడంతో భక్తులకు నమ్మకం ఏర్పడింది. అదే రొట్టెల పండుగకు మూలమైంది. ఆర్కాట్ నవాబుల కాలంలో మరింత ప్రాచుర్యంలోకి వచ్చింది. భక్తులు తమ కోర్కెలు తీరినందుకు రొట్టెలను మొక్కులుగా చెల్లిస్తారు. కొత్తగా కోర్కెలు కోరుకొనేవారు వాటిని స్వీకరిస్తారు.. దర్గాలోని బారాషహీదులను స్మరించుకుంటూ ఏటా మొహర్రం నెలలో చంద్రుడు కనిపించిన 11వ రోజు నుంచి మూడు రోజుల పాటు రొట్టెల పండుగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
అప్పట్లో బియ్యం రొట్టె
ఇప్పుడు రొట్టెల పండుగ అంటేనే అప్పుడప్పుడే నిప్పుపెై...పెనెంపెై కాల్చుకునో గోధుమల రొట్టె. బెల్లంను మార్చుకోవడం మనం చూస్తున్నాం. కానీ అప్పట్లో కేవలం బియ్యం రొట్టె, ఆకుకూర లను మాత్రమే మార్చుకునేవారు.
నాడు వెయ్యి... నేడు లక్షలు
దాదాపు 40 ఏళ్ల కిందట కేవలం రొట్టెల పండుగకు వెయ్యిమం దిలోపే జనం వచ్చేవారు. కాలక్రమేణ రొట్టెల పండుగకు వచ్చే వారికి జరుగుతున్న మహిమలు పెద్దఎత్తున ప్రచారం జరగ డంతో నేడు వేలు కాదు... లక్షల్లోకి వెళ్లిపోయింది. జిల్లా నుంచే కాదు... రాష్ట్రాల సరిహద్దులను దాటి కూడా జనం వస్తున్నారు. రాష్ట్రాలే కాదు...దేశ దేశాల నుంచి కూడా బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు భక్తులు రావటం విశేషం.
పులి కథ ఏమిటంటే
50 ఏళ్ల క్రితం ప్రస్తుతం దర్గా ఉన్న ప్రాంతం నెల్లూరుకు శివారు ప్రాంతంగా ఉండేది. అప్పట్లో జనసంచారం ఉండేదేకాదు. ఆ సమయంలో నిత్యం ఓ పులి దర్గా వద్దకు వచ్చి రాత్రంతా బారా షహీదులకు కాపలాగా ఉండేది. ఈ దృశ్యం చూసి అప్పటి ముస్లిం పెద్దలు కూడా కథలుకథలుగా చెప్పుకొనేవారు. తెల్లవారు జామున పులి అక్కడి నుంచి వెళ్తూ తన తోకతో బారాషహీదులను అంతా శుభ్రం చేసి వెళ్లేది. ఈ వింత చూసి అప్పట్లో ఆశ్చర్య పోయేవారు. ఇందుకు గుర్తుగానే బారాషహీద్ దర్గా వద్ద పులిబొమ్మను భక్తులు చూడవచ్చు.
దర్గా ప్రత్యేకత
బారాషహీద్ దర్గా కేవలం ముస్లింలకే కాక అన్ని మతాలకు...కులాలకు పుణ్యక్షేత్రమై విరాజిల్లుతుంది. రోగులుఅరోగ్యం కోసం, నిరుద్యోగులు ఉద్యోగం కోసం, పెళ్ళికాని వారు పెళ్లిళ్ల కోసం, పేదవారు సౌభాగ్యం కోసం, పదవులు రాని వారు పదవుల కోసం ఇలా ఒక్కటేమిటి వివిధ రకాల కోరికల కోసం ఈ దర్గాలో భక్తులు మొక్కుకుంటూ తమ కోరికలు చెప్పుకొంటూ రొట్టెలు వదులుతారు. ఇలా ఏటా మొహ్రర్రం నెల మొదలెైన 11వ రోజు నుంచి బారాషహీద్ రొట్టెల పండుగ వేడకలు వొదలవుతాయి. ఇక్కడి నుండి వరుసగా మూడురోజుల పాటు ఈ రొట్టెల పండుగ సాగుతుంది. ముందుగా గంధోత్సవం వేడుక జరుపుతారు.
భక్తులకు మౌలిక వసతులు కల్పన జిల్లా కేంద్రంలో నాలుగు రోజుల పాటు జరగనున్న బారాషహీద్ దర్గా రొట్టెల పండుగకు హజరయ్యె భక్తులకు అవసరమైన మౌలిక వసతులను కల్పించగం జరిగిందని నగర పాలక సంస్థ కమిషనర్ డాక్టర్ టియస్‌ఆర్ ఆంజనేయులు తెలిపారు. భుక్తులకు ఎటువంటి అసౌకర్యలు కల్గకుండా దర్గా ప్రాంగణంలో ఏడు జోన్లుగా విభజించి అధికారులను ప్రత్యేకంగా నియమించినట్లు ఆయన చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని మరుగు దోడ్లు ఏర్పాటు, స్థానపు గదులు, విద్యుత్ దీపాలు, మంచి నీటి సౌకర్యం, సమాచార కేంద్రం, త్రాగునీటి వసతి, పారిశుద్య ఏర్పాటులు చేశామని అన్నారు. అధిక సంఖ్యలో పోలీసు బందోబస్తు, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ గట్టి చర్యలను చేపట్టినట్లు కమీషనర్ పేర్కొన్నారు. స్వర్ణాల చెరువులో పవిత్ర స్థానాలు ఆచరించే భక్తులకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు, ఆరోగ్య రక్షణకు 108 వాహనాలు, ఉచిత మెడికల్ శిభిరాలను ఏర్పాటు చేశామన్నారు.

- ఆర్. వెంకట స్వామి, మేజర్ న్యూస్, నెల్లూరు

No comments:
Post a Comment