కోట శ్రీనివాసరావు...గొప్ప యాక్టర్ అన్న విషయం అందరికీ తెలుసు. కాని ఆయన
సొంతూరికి వెళితే...ఆయన క్యారెక్టర్ మారిపోతుంది. ఆయన్ని చూడగానే ఊరివాళ్లంతా 'మన
ఊరి డాక్టరుగారి అబ్బాయి వచ్చాడంటూ....'ఎదురొస్తారు. "మా ఊళ్లో ఇంటి స్థలంతో పాటు
మా నాన్నగారు మాకిచ్చిన పేరు ప్రతిష్టలు కూడా పదిలంగా ఉన్నాయి. నాన్న కట్టిన
ఆసుపత్రి, అమ్మ చేసిన గరిక పచ్చడి, అన్నయ్య వేసిన నాటకాలు...ఇప్పటికీ నా మనసులో
మెదులుతూనే ఉంటాయి'' అని తన సొంతూరు కంకిపాడు(కృష్ణాజిల్లా) గురించి కోట
శ్రీనివాసరావు చెప్పిన కబుర్లే ఈవారం 'మా ఊరు'
"వారానికో పదిరోజులకో ఒకసారి నాన్న ఇంటికి వచ్చేటప్పుడు దారిలో ఉండే గరికను వేళ్లతో పీక్కొచ్చేవారు. అమ్మ దాన్ని నాలుగైదుసార్లు శుభ్రంగా కడిగి సన్నగా తరిగి నూనెలో వేగించి చింతపండు వేసి పచ్చడి చేసేది. వేడి వేడి అన్నంలో గరిక పచ్చడి మీద వెన్న వేసుకుని కలుపుకుని తినేవాళ్లం. ఆ పచ్చడి రుచి ముందు గోంగూర పచ్చడి ఎందుకూ పనికిరాదు. ఇంటినిండా కూరగాయలు ఉన్నా...ఆ గడ్డితో పచ్చడి చేసుకునే కర్మేంటి? అని అనేవాళ్లు ఉండేవారు. కాని ఆ పచ్చడి చేయడం మా నాన్నగారి ఆజ్ఞ. 'పిల్లలకు ఐరన్ ఉండాలంటే గరిక తినాల్సిందే' అనేవారాయన. ఆయన చెప్పినట్టే వినేవాళ్లం...మేమే కాదు మా ఊరి జనమంతా. ఎందుకంటే ఆయన డాక్టర్ కాబట్టి. కృష్ణా జిల్లాలోని కంకిపాడు మా ఊరు. గ్రామపంచాయితి కావడంతో చుట్టుపక్కల ఊళ్లకంటే మా ఊళ్లోనే కాస్తో కూస్తో అభివృద్ధి కనిపించేది. ఆంజనేయస్వామి గుడి, శివాలయం, విష్ణాలయంతో పాటు మా నాన్నగారి ఆసుపత్రి కూడా ఒక ఆలయాన్ని తలపించేది. చెరుకు తోటలు, వరి పంటలతో కంకిపాడు ఎప్పుడూ పచ్చనితోటలా ఉండేది.
ఎల్ఎంపి డాక్టర్...
మా నాన్నగారు కోట సీతారామాంజనేయులు ఎల్ఎంపీ డాక్టర్. అప్పట్లో ఎల్ఎంపీ అంటే ఎంబీబీఎస్ అంత గొప్పన్నమాట. మా చుట్టుపక్కల పది ఊళ్లకు మా నాన్నే డాక్టరు. మా తాతగారిది గుడివాడ దగ్గర బేతవోలు. ఆయన టీచర్‌గా పనిచేసేవారట. 1936లో ఓ జమీందారు మనవడికి ధనుర్వాతం వస్తే నాన్నే వైద్యం చేసి బతికించారు. ఆ జమీందారు కృతజ్ఞతతో కంకిపాడులో నలభై సెంట్ల భూమి ఇచ్చారు. దాంతో నాన్న అక్కడికి వచ్చి ఆ స్థలంలో ఆసుపత్రి కట్టుకున్నారు. నాకు ఇద్దరు అక్కలు, ఇద్దరు చెల్లెళ్లు, ఒక అన్నయ్య, ఒక తమ్ముడు. నాన్న పొద్దున ఎనిమిదింటికల్లా ఆసుపత్రికి వెళ్లి ఓ రెండు గంటలు కూర్చుని పదింటికల్లా గుర్రపుబండి ఎక్కేసేవారు. చుట్టుపక్కల ఊళ్లకు వెళ్లి మంచం పట్టిన పేషెంట్లను, గర్భిణిలను చూసుకుని మళ్లీ మధ్యాహ్నం ఒంటిగంటకు ఊళ్లోని ఆసుపత్రికి వచ్చేసేవారు. అప్పటి నుంచి రాత్రి పదింటివరకూ అక్కడే ఉండేవారు. నాన్న దగ్గర ముగ్గురు కాంపౌండర్లు, ముగ్గురు నర్సులు పనిచేసేవారు. ఎవ్వరికీ కూడా ఓ గంట విశ్రాంతి ఉండేది కాదు.
మేడ ఇల్లు
నాన్న ఆసుపత్రితో పాటు పెద్ద ఇల్లు కూడా కట్టారు. పైన ఆరు గదులు కింద నాలుగు గదులుండేవి. వీటితో పాటు పురిటి గది విడిగా ఉండేది. అప్పట్లో చాలామంది ఇళ్లలో పురిటి గదులు విడిగా ఉండేవి. అయితే మా ఇంట్లో ఉండే పురిటి గది మా ఇంటివాళ్లకోసమే కాదు మా ఊళ్లో వారి కోసం కూడా. ఎవరికి పురిటి నొప్పులు వచ్చినా పగలయితే నేరుగా ఆసుపత్రికి తీసుకొచ్చేవారు.
సాయంత్రం సమయంలో అయితే మా ఇంటికే తీసుకొచ్చేసేవారు. ఆ రాత్రికి మా ఇంట్లోనే ఉండేవారు. ప్రసవం తర్వాత తల్లీ బిడ్డా క్షేమంగా ఉంటేనే ఇంటికి పంపించేవారు. లేదంటే మా ఇంటిదగ్గరే మకాం. వాళ్లకి భోజనం కూడా మా ఇంట్లోనే. ఆచరాలు, పట్టింపులు చాలా గట్టిగా ఉన్న రోజుల్లోనే మా నాన్నగారు కులం గోత్రం మాటెత్తకుండా వైద్యం కోసం వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చేవారు. అందుకే మా ఊళ్లో చాలామంది ఆయన్ని మేము పిలిచినట్లుగానే 'నాన్నగారు...' అనే పిలిచేవారు. ఆయన హస్తవాసి మంచిదని మా ఊరివాళ్ల నమ్మకం.
దుంపలన్నీ ఉట్టిమీద...
అప్పట్లో ఎవరి చేతిలోనో గాని డబ్బులు కనిపించేవి కావు. అన్నీ వస్తు మార్పిడి ద్వారానే జరిగేవి. మా ఇంటికి ఎవరొచ్చినా పొట్లకాయో, ఆనపకాయో, గుమ్మడికాయో..ఏదో ఒకటి చేత్తో పట్టుకుని వచ్చేవారు. దాంతో కూరగాయలకు కొదవుండేది కాదు. కాని దుంపలు మాత్రం దొరికేవి కావు. అవి ఎక్కువగా లంకల్లో పండేవి. డిసెంబర్ నెలలో బండ్లమీద అమ్మకానికి వచ్చేవి.
అప్పుడే అందరూ ఐదారు నెలలకు సరిపడా బంగాళా దుంపలు, చామదుంపలు, కంద లాంటివన్నీ కొనుక్కుని ఇంట్లో ఉట్టిమీద దాచుకునేవాళ్లం. చామదుంపలు, కంద అయితే వేసవికాలం వరకూ పాడవకుండా ఉండేవి. కిలోన్నర దోసకాయలిస్తే కిలో చామదుంపలు వచ్చేవి. లేదంటే వడ్లు ఇచ్చినా సరే. ఇలా ప్రతి వస్తువునీ మరో వస్తువుతో కొనుక్కునే రోజుల్లోనే మా నాన్నగారికి ఆంధ్రాబ్యాంకులో అకౌంట్ ఉండేది. ప్రతి వారం వెళ్లి పాతికరూపాయలు బ్యాంకులో వేసుకుని వచ్చేవారు. ఆ విషయాన్ని ఊరు వాళ్లందరూ గొప్పగా చెప్పుకునేవారు. ఎందుకంటే వందల ఎకరాలు ఉన్న రైతులున్నా చేతిలో నోట్ల కాగితాలుండేవారు చాలా అరుదు.
వేపచెట్టు కూలర్...
వేసవికాలం వచ్చిందంటే జనమంతా విలవిల్లాడిపోయేవారు. ఇప్పుడంటే కూలర్లు, ఏసీలు వచ్చాయి కాని అప్పట్లో ఎంతటి ధనవంతులకైనా సౌకర్యాలు అంతంతమాత్రమే ఉండేవి. వారి సంగతి పక్కన పెడితే రోజంతా ఎండలో పనిచేసే వాళ్ల పరిస్థితి మరీ దయనీయంగా ఉండేది. వడదెబ్బ తగిలి ఆసుపత్రికి వచ్చే పేషెంట్ల కోసం నాన్న ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసేవారు. ఆసుపత్రి పక్కనే పెద్ద వేపచెట్టు ఉండేది. దాని కింద పూరి పాక వేయించారు.
వడదెబ్బ పేషెంట్లని అందులో పడుకోబెట్టేవారు. వేపచెట్టు నీడ...పాక చల్లదనం వల్ల పేషెంట్లు ఇట్టే కోలుకునేవారు. వేసవంటే గుర్తొచ్చింది....సెలవు రోజులు కావడం వల్ల మా అమ్మ(విశాలాక్షి) మాకోసం ప్రత్యేక వంటలు చేసేది. ఎన్ని రకాల వంటలు వండినా....ఆమె చేసే ఉలవచారు, గోంగూర పచ్చడి, గరిక పచ్చడి ముందు అన్నీ దిగదుడుపే. పొద్దున్నే ఒంటికి వెన్నపూస రాసి నలుగు పెట్టి వేడి నీళ్లతో స్నానం చేయించేది. అదంతా ఊరి సాగుబడి. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా ఆ భోగం ఉండదు.
రెండు గదుల బడి...
మా ఊరి పాఠశాలలో రెండే గదులు ఉండేవి. నేను స్కూల్లో ఏం చేసినా...ఊళ్లో ఏం చేసినా నాన్నకి వెంటనే తెలిసిపోయేది. నా చిన్నప్పుడే మా ఊళ్లో సినిమా థియేటర్ ఉండేది. పొరపాటున సినిమాకి వెళ్లానా...బయటికొచ్చేలోపు నాన్నకి తెలిసిపోయేది. 'డాక్టరుగారు మీ అబ్బాయి ఫలానా చోటున్నారు...' అంటూ ఎవరో ఒకరు ఆయన చెవిన పడేసేవారు. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ కూడా చెప్పుకోవాలి. ఊళ్లో డాక్టరు పిల్లలు, లాయరు పిల్లలు, కరణం పిల్లలు, మునుసబు పిల్లలు...ఇలా ఒక హోదాలో ఉండేవారి పిల్లలపై చాలామంది కన్నేసి ఉంచుతారు. వీరి పిల్లలు మంచి చేసినా ఊరంతా చెప్పుకునేవారు. ఏదైనా వెధవ పనిచేసినా కూడా అంతే పబ్లిసిటీ ఉండేది. దాంతో మేం ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండేవాళ్లం. మా ఊరి బడిలో ఐదో తరగతి పూర్తయ్యాక పక్కనే ఉన్న పునాదిపాడు స్కూల్లో ఆరో తరగతిలో చేరాను.
నేను స్కూల్లో ఏం చేసినా...ఊళ్లో ఏం చేసినా నాన్నకి వెంటనే తెలిసిపోయేది. నా చిన్నప్పుడే మా ఊళ్లో సినిమా థియేటర్ ఉండేది. పొరపాటున సినిమాకి వెళ్లానా...బయటికొచ్చేలోపు నాన్నకి తెలిసిపోయేది. 'డాక్టరుగారు మీ అబ్బాయి ఫలానా చోటున్నారు...' అంటూ ఎవరో ఒకరు ఆయన చెవిన పడేసేవారు. అయితే ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ కూడా చెప్పుకోవాలి. ఊళ్లో డాక్టరు పిల్లలు, లాయరు పిల్లలు, కరణం పిల్లలు, మునుసబు పిల్లలు...ఇలా ఒక హోదాలో ఉండేవారి పిల్లలపై చాలామంది కన్నేసి ఉంచుతారు. వీరి పిల్లలు మంచి చేసినా ఊరంతా చెప్పుకునేవారు. ఏదైనా వెధవ పనిచేసినా కూడా అంతే పబ్లిసిటీ ఉండేది.
నాటకాల కోట...
నాన్న డాక్టరన్నమాటే కాని ఆయన వేషధారణ చాలా సంప్రదాయ బద్ధంగా ఉండేది. పొద్దున పూజ చేయందే బయట అడుగుపెట్టేవారు కాదు. చిన్నచేతుల షర్టు, పంచెతో స్టెతస్కోపు చేతిలో పట్టుకుని గుర్రం బండి ఎక్కేవారు. ఆయన వృత్తిలోనే కాదు మిగతా విషయాల్లో కూడా చాలా క్రమశిక్షణగా ఉండేవారు. నాకు, అన్నయ్య (కోట నర్సింహరావు)కు నాటకాలు వేయడం చాలా ఇష్టం. నాన్నకు ఆ పేరెత్తితేనే కోపం. మేము నాటకాలు వేసామన్న విషయం నాన్నకు తెలిస్తే మాత్రం ఊరుకునేవారు కాదు.
మాట్లాడితే చదువు, ఉద్యోగం అనేవారు. కాని నా దృష్టంతా నాటకాలపైనే ఉండేది. అలాగని నాన్న మాటని ఎదిరించే ధైర్యం లేదు. ఇంట్లోవాళ్లకైనా..వీధిలో వాళ్లకైనా బాగా భయపడే రోజులవి. భయం అంటే గుర్తుకు వచ్చింది. నా చిన్నప్పుడే మా ఊళ్లో పోలీస్ స్టేషన్ ఉండేది. అయినా మా ఊరివాళ్ల తరపున నెలకొక్క కేసు కూడా నమోదయ్యేది కాదు. ఏ వాడలో సమస్య వచ్చినా అక్కడే ఆగిపోయేది. లేదంటే రచ్చబండ దగ్గరికి వచ్చేది. అంతేగాని పోలీస్ అన్నమాట వినిపించేది కాదు. పోలీస్ పేరు చెబితేనే పారిపోయేవారు. కొడతారనో....ఇంకేదో చేస్తారనో కాదు..పరువు కోసం కూడా బాగా పాకులాడేవారు.
డబ్బులిచ్చే పండగ...
ఎవరికైనా జీతాలు సంక్రాంతి పండగప్పుడే ఇచ్చేవారు. చాకలి...మంగలి...కంసాలి ఇలా అందరికీ- రైతులైతే వడ్లు పెట్టేవారు, మాలాంటి వారైతే డబ్బులిచ్చేవారు. అందుకే ఆ పండగని చాలా గొప్పగా చేసుకునేవారు. భోగి రోజు మా ఇంటిముందు చాలా పెద్ద మంట వేసేవారు. ఆ మంటలో చిన్నా పెద్దా కర్రలతో పాటు పెద్ద దుంగ ఒకటి పడేసేవారు. అది మర్నాడు పొద్దుటి వరకూ మండుతూనే ఉండేది. దీపావళి పండుగంటే కూడా నాకు బాగా ఇష్టం. టపాసులు ఆ రోజు మొదలుపెడితే నాగులచవితి వరకూ కాలుస్తూనే ఉండేవాళ్లం. టపాసుల్లో చాలావరకు ఊళ్లోనే తయారుచేసేవాళ్లు. గోడ టపాకాయలు, తాటాకు టపాకాయల్ని నేను ఎక్కువగా కాల్చేవాడ్ని. మా ఇంటికి దగ్గరగా ఉండే ఆంజనేయస్వామి దేవాలయం అంటే కూడా నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ప్రతి మంగళవారం గుడికి వెళ్లి దణ్ణం పెట్టుకునేవాడ్ని.
బ్యాంక్‌లో ఉద్యోగం...
పక్కూరిలో ఎస్ఎస్ఎల్‌సి పూర్తయ్యాక విజయవాడలో రూము తీసుకుని పై చదువులు పూర్తిచేశాను. డిగ్రీ అవగానే నాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గుమస్తా ఉద్యోగం వచ్చింది. నా మొదటి జీతం 135 రూపాయలు. 19 సంవత్సరాలు బ్యాంక్‌లో ఉద్యోగం చేశాక సినిమాల్లో అవకాశం వస్తే వెళ్లాను. మొదట్లో రెండు మూడు సినిమాల్లో నటించినా ప్రతిఘటన సినిమాతోనే నాకు మంచి పేరొచ్చింది. ఆ పేరు, ప్రశంసలు నాన్నగారి చెవిన పడ్డాయి. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆయన చనిపోయారు. ఆయన దగ్గర నన్ను ఎంతమంది పొగిడినా...'ఎందుకొచ్చిన వేషాలు... చక్కగా కుర్చీలో కూర్చుని ఉద్యోగం చేసుకోక' అనేవారు. నేను సినిమాల్లోకి వెళ్లాక కూడా ఊరికి అప్పుడప్పుడు వెళుతుండేవాడ్ని. ఊళ్లో ఆసుపత్రిని అద్దెకు ఇచ్చేశాం. ఇల్లు బాగా పాడవడం వల్ల పడగొట్టేశాం.
ఎమ్మెల్యే అయ్యాక...
చంద్రబాబునాయుడు హయాంలో విజయవాడ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాను. ఆ సమయంలో ఊరికి కావాల్సిన కొన్ని అభివృద్ధి పనులు చేయించాను. ఇప్పుడు మా ఊరు మండల కేంద్రం. మా నాన్నగారు యాభైఏళ్లపాటు ఊళ్లో వైద్యం చేసి మంచి పేరు సంపాదించారు. 'ఆంజనేయులు డాక్టరుగారు ఉన్నారు మాకు ....' అని ఊరివాళ్లంతా గుండెమీద చెయ్యివేసుకుని చెప్పుకునే భరోసా ఇచ్చారాయన. ఇప్పటికీ ఊరెళితే నన్ను గొప్ప యాక్టర్ అనే కంటే ముందు 'మన డాక్టర్‌గారి అబ్బాయి వచ్చాడు' అంటారు. ఆ మాట వినగానే ఒళ్లంతా గర్వంతో పొంగిపోతుంది. ఊళ్లో మాకున్న స్థలంతో పాటు డాక్టర్‌గారి అబ్బాయి అన్నమాట కూడా నాకున్న మరో ఆస్తిగా భావిస్తాను.

No comments:
Post a Comment