మిక్స్చ్‌ర్ పొట్లం
కీడెంచను గాక ఎంచను
"నేను
మిమ్మల్ని కాకుండా మరెవర్నయినా పెళ్లాడి ఉంటే ఎలా ఉండేదో ఆలోచించారా?'' గోముగా
అడిగింది అలివేలు.
"ఇతరుల నాశనాన్ని కలలో కూడా కోరను అలివేలూ'' నిట్టూరుస్తూ అన్నాడు ఆనందం.
సుబ్బి పెళ్లి ఎంకి చావుకి
"ఏమిట్రా అంతలా వెంట్రుకలు పెంచావు? ఏ దేవుడికి మొక్కు?'' అడిగాడు సూరిబాబు.
"మొక్కా, పిండా కూడా? బయట కొన్న సవరాలు పనికి రావట మా ఆవిడకి. సవరం కోసం ఇలా పెంచమంటోంది'' కోపంగా అన్నాడు రాంబాబు.
తేడా!
"కాపీకి రీసెర్చ్‌కి తేడా ఏమిట్రా?'' అడిగాడు టీచర్.
"ఒక విషయాన్ని ఒకే బుక్కులో చూసి రాస్తే కాపీ, ఎక్కువ బుక్కుల్లో చూసి రాస్తే రీసెర్చ్'' ఠపీమని చెప్పాడు స్టూడెంట్.
ఇంటి పేరు తర్కంవారు
"చూడండి మేడమ్, మీరు ఖాళీగా ఉంటే రోజురోజుకూ లావెక్కిపోవడం ఖాయం. రోజుకి కనీసం 2 గంటలపాటు ఈత కొడితే బాగా సన్నబడతారు'' సలహా ఇచ్చాడు డాక్టర్ సదానందం.
"ఈత కొడితే మాత్రం సన్నబడతానంటారా డాక్టర్. సముద్రంలో ఉండే తిమింగలం నిత్యం ఈదుతూనే ఉంటుందిగా ... సన్నబడిందా?'' అనుమానంగా ప్రశ్నించింది ఆండాళ్లు.

No comments:
Post a Comment