all

Saturday, November 24, 2012

చలికాల చర్మసంరక్షణకు 5 సులభ ఫేస్ మాస్కులు

బ్యూటీ ట్రీట్ మెంట్ లో ఫేస్ మాస్క్ కి చాలా ప్రత్యేకత ఉంది. పూర్వ కాలంలో ఇలాంటి మాస్క్ ల వల్ల వారి అందాన్ని మరింత రెట్టింపు చేసుకొంటున్నారు. సహజ సౌందర్య సాధనాలను ఉపయోగించి చర్మాన్ని సున్నితంగా, నునుపుగా మరియు అందంగా మార్చుకొంటున్నారు. ఈ ఫేస్ మాస్క్ లు అందాన్ని ఇవ్వడమే కాకుండా యవ్వనంగా కనబడేలా చేస్తాయి. వింటర్ చలిగాలి చల్లగా వచ్చి మేనిని తాకుతుంటే ఎంతో హాయిగా, ఆహ్లాదంగా ఉంటుంది. కానీ ఆ తరువాతే చర్మం పొడిబారిపోయి అందవికారంగా తయారవుతుంది. పొడి చర్మంతో బాధపడేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే స్కిన్ మాయిశ్చరైజ్ అయి కాంతులీనుతూ ఉంటుంది. ఈ శీతాకాలంలో మీ చర్మ సౌందర్యాన్ని కాపాడే కొన్ని ఫేస్ ప్యాక్ లున్నాయి. వాటిని ఉపయోగించి మీ అందాన్ని మరింత రెట్టింపు చుసుకోండి...


అవొకాడో ఫేస్ మాస్క్: చలికాలంలో అవొకాడో ఫేస్ మాస్క్ డ్రై స్కిన్ కలవారికి ఫర్ఫెక్ట్ గా ఉంటుంది. వింటర్ సీజన్ లో పొడి బారిన చర్మంతో చాలా మంది విసుగు చెందుతుంటారు. అలాంటప్పుడు ఈ అవొకాడో ఫేస్ మాస్క్ ఉపయోగించడం వల్ల చర్మం నునుపుగా మారుతుంది. అవొకాడోను బాగా చిదిమి, అందులో ఆలివ్ ఆయిల్ ను వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. దాంతో ముఖ చర్మానికి కావల్సిన విటమిన్స్, మినిరల్స్, యాంటిఆక్సిడెంట్స్ అంధించి విటర్ లో చర్మం పొడిబారినియ్యకుండా చేస్తుంది.


కల్చర్డ్ మిల్క్ ఫేస్ మాస్క్: కల్చర్డ్ మిల్క్ ఫేస్ మాస్క్ చాలా త్వరగా ప్రభావం చూపించడమే కాకుండా, అలసిన చర్మానికి స్వాంతన కలిగిస్తుంది. కొద్దిగా పెరుగు తీసుకొని అందులో మజ్జిగ, సోర్ క్రీమ్, లేదా కెఫైర్ వేసి బాగా మిక్స్ చేసి కళ్ళ చుట్టు వదిలేసి మిగిలిన ముఖభాగం అంతటికి కవర్ చేయాలి పదిహేను నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో చర్మం మృదువుగా మారి, నేచురల్ పిహెచ్ స్థాయిని బ్యాలెన్స్ చేయడం వల్ల చలి గాలలు నుండి రక్షణ కల్పించబడుతుంది.


ఎగ్ వైట్ మాస్క్: ముఖంలో ఎక్కువ రంధ్రాలు, మచ్చలు ఉన్నవారికి, జిడ్డు చర్మం కలవారికి ఈ మాస్క్ బాగా పనిచేస్తుంది. అందుకు ఎగ్ లోని వైట్ ను మాత్రం తీసుకొని ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల ముఖాన్ని తాజాగా ఉంచి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. ఆయిల్ స్కిన్ ముందు కంటే బెటర్ గా కనబడేలా చేస్తుంది.

  ఓట్ మీల్ మాస్క్: చల్ల గాలుల నుండి కాపాడడానికి అద్భుతంగా పనిచేసేది ఓట్ మీల్. ఓట్ మీల్ పొడికి గుడ్డులోని పచ్చసొన, తేనె చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి 20 నిముషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకొంటే మీ చర్మం తాజాగా, మృదువుగా, మారుతుంది. చలికాలపు పగుళ్ళ నుండి చర్మాన్ని రక్షింపబడుతుంది.


అరటి పండుతో ఫేస్ మాస్క్: చలికాలంలో మీ చర్మ అధికంగా భాదిస్తుంటే కనుక ఈ మృదువైన బనానా ఫేషియల్ మాస్క్ బాగా పనిచేస్తుంది. బాగా పండిన అరటిపండును చిదిమి ఫ్రెష్ స్వీట్ క్రీమ్ తో మిక్స్ చేసి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. దాంతో చలి వల్ల ఏర్పడే చర్మ సమస్యలను దూరంగా ఉంచుతుంది మరియు చర్మానికి కావల్సిన న్యూట్రిషియన్స్ ను అందిస్తుంది.

No comments: