all

Saturday, November 24, 2012

కుక్క పిల్లిని చంపింది..ఇతడికి మూడేళ్లు జైలు పడింది!!
వింత లోకం



మన దగ్గర కార్లు కుక్కల మీదకు వచ్చేసినా... కోతులెక్కువయ్యాయని వాటిని చంపేసినా... మెదడు వాపు వ్యాధి పేరుతో వరాహాలను షూట్ చేసినా ఎవరూ పట్టించుకోరుగాని అమెరికాలో అలా కాదు. గూబ గుయ్‌మంటుంది. ఇక్కడ చూడండి. 82 ఏళ్ల హ్యూమ్ హామిల్టన్ అనే పెద్దాయన ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్ అనే ఊరిలో తన కుక్కతో షికారుకు బయలుదేరాడు. ఆ కుక్క ఏ మూడ్‌లో ఉందోకాని దారిన సేద తీరుతున్న పిల్లి మీద ఒక్క ఉదుటున దాడి చేసింది. పెద్దాయని తేరుకుని లాగే లోపు దాని మెడ కొరికి చంపేసింది.

కాసేపటికి పిల్లి ఓనరు వచ్చి గుండెలు బాదుకొని పోలీసులకు ఫోన్ చేస్తే వాళ్లొచ్చి ఇతణ్ణి వెంటనే అరెస్టు చేశారు. కేసు కోర్టుకెళ్లింది. తీవ్రమైన వాదోపవాదాల తర్వాత హ్యూమ్ హామిల్టన్‌కు మూడేళ్ల జైలు శిక్ష పడింది. జైలు నుంచి బయటకు వచ్చాక కుక్క, కోతి అని పెంపుడు జంతువులను పెంచుకుంటానంటే తోలు తీస్తా అని జడ్జి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఏమిటో... ఇదంతా పిచ్చి కాకపోతే అనిపిస్తుంది మనలాంటివాళ్లకు.

 

Listings                                                                       Listings                                                                                                                                       
Listings                                                                                                                                         Listings                                                                           

No comments: