all

Saturday, November 24, 2012


NewsListandDetails కావలసినవి
బీట్‌రూట్‌ తురుము-2 కప్పులు
పంచదార-కప్పు
పాలు-అరలీటరు
తేనె-పావ్ఞకప్పు
మిల్క్‌మెయిడ్‌-కప్పు
కొబ్బరి తురుము-అరకప్పు
యాలకులపొడి-టీస్పూన్‌
నెయ్యి-8టీస్పూను్ల
జీడిపప్పు-24
కిస్‌మిస్‌లు-24
తయారుచేసే విధానం

బాణలిలో రెండు టీస్పూన్ల నెయ్యి వేసి జీడిపప్పు, కిస్‌మిస్‌ వేయించి తీయాలి. తరువాత అందులోనే కొబ్బరి తురుము, బీట్‌రూట్‌ తురుము వేసి బాగా కలిపి రెండు కప్పుల నీళ్లు పోసి ఉడికించాలి. తరువాత పంచదార, పాలు పోసి ఉడికించాలి. మిల్క్‌మెయిడ్‌ కూడా వేసి ఓ పొంగు రానివ్వాలి. ఇప్పుడు వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్‌లు వేసి యాలకులపొడి వేసి కలపాలి. చివరగా తేనె పోసి మిగిలిన నెయ్యి వేసి కలపాలి. ఇది వేడిగా తాగినా బాగుంటుంది. లేదంటే చల్లారిన తరువాత ఫ్రిజ్‌లో పెట్టుకుని చల్లగా తిన్నా బాగుంటుంది.

No comments: