వివాదం ముందు పుట్టి తర్వాత అమలాపాల్ పుట్టింది.
ఫలానా పాత్ర- వివాదం. ఫలానా దర్శకుడితో స్నేహం- వివాదం.
ఫలానా హీరోతో తెర మీద ముద్దు- వివాదం. అమలాపాల్ భయపడదు.
సెలబ్రిటీలకు ఆ మాత్రం పన్నీరు తగలకపోతే ఎలా అంటుంది.
రాటుదేలకపోతే రాలిపోతాం అని కూడా అంటుంది.
ముద్దు ముద్దు మాటలు మాట్లాడాల్సిన గ్లామర్‌స్టార్ బరువైన విషయాలను చర్చించడం ఆశ్చర్యమే. సవాళ్లను కాలిజోళ్లుగా మార్చుకొని ముందుకు నడుస్తున్న ఈ అందాల హరికేన్ అదర్‌సైడ్ ఇది.
అసలు మీ పేరు అనకా..? అమలా?
అమలాపాల్: అమ్మానాన్న పెట్టిన పేరు అమలే. కానీ నా పేరు అనకా అని, సినిమాల కోసం అమలా అని మార్చుకున్నానని చాలామంది అనుకుంటున్నారు. అనకా ఎవరో నాకు తెలియదు. మా నాన్న పేరు పాల్ వర్గీస్. అమ్మ పేరు అన్నీస్ పాల్. మాది కేరళ. నాన్న పేరు కలుపుకుని నేను ‘అమలాపాల్’ అయ్యాను.
హీరోయిన్ ఎలా అయ్యారు?
అమలాపాల్: ప్లాన్ చేసుకొని రాలేదు. లైఫ్ అంటే ఏమిటో తెలియకముందే సినిమాల్లోకి వచ్చేశాను. హీరోయిన్ అయినప్పుడు నా వయసెంతో తెలుసా? జస్ట్ 16! మోడలింగ్ అంటే ఇష్టం ఉండేది. నా ఫ్రెండ్ ఆర్జేగా చేసేది. తనతో పాటు ఒకసారి ఒక టీవీ చానల్‌కి వెళ్లాను. అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ నన్ను చూసి ఫొటోలు తీశారు. ఆరోజు మొహానికి కనీసం పౌడరు కూడా రాసుకోలేదు. అయినా ‘న్యాచులర్ బ్యూటీ’ అంటూ ఆయన ఫొటోలు తీశారు. అవి బాగా వచ్చాయి. ఆ ఫొటోషూట్ ఇచ్చిన కిక్‌తో మరికొన్ని ఫొటోషూట్స్ చేశాను. అవి చూసి దర్శకుడు లాల్‌జోస్ మలయాళ చిత్రం ‘నీలతామర’లో నటించమని అడిగారు.
ఇంట్లోవాళ్లేమన్నారు?
అమలాపాల్: నాన్న చాలా స్ట్రిక్ట్... నో అనేశారు. అమ్మ కూడా దాదాపు నో చెప్పేసింది. కానీ సినిమాలంటే నాకు ఇంట్రస్ట్. కలర్‌ఫుల్‌గా ఉండే క్రియేటివ్ ఫీల్డ్ అంటే చిన్నప్పట్నుంచి ఇష్టం. మిస్ ఇండియా, మిస్ వరల్‌్్కి సంబంధించిన షోస్‌ని కళ్లార్పకుండా చూసేదాన్ని. మిస్ ఇండియా కిరీటం అందుకుంటున్నప్పుడు వాళ్లెలా ఫీలవుతున్నారో చూసి థ్రిల్ అయ్యేదాన్ని. కేరళలో ‘మిస్ బ్యూటిఫుల్ స్మయిల్’ అవార్డు అందుకున్నప్పుడు నేను కూడా వాళ్లలానే ఫీలయ్యాను. కెమెరా ఫ్లాష్‌లంటే నాకు ఇంట్రస్ట్ ఉందని మెల్లిగా అర్థం అవ్వసాగింది. అందుకని లాల్‌జోస్ అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం హీరోయిన్ అయిపోవాలని బలంగా ఫిక్స్ అయ్యాను. మా అన్నయ్య అభిజిత్ నాకు అన్ని విషయాల్లోనూ సపోర్ట్. అందుకని అమ్మానాన్నలను ఒప్పించే బాధ్యత తను తీసుకుని, సినిమాల్లో చేయడానికి నాకు అనుమతి ఇప్పించాడు.
అప్పుడేం చదువుతున్నారు?
అమలాపాల్: ఇంటర్! ఫ్రెండ్స్‌కి తెలియగానే ‘హీరోయిన్’ అని పిలవడం మొదలుపెట్టారు. నాైకైతే తెలియని భయం ఒకవైపు... మరోవైపు ప్రపంచాన్ని జయించినంత ఫీలింగ్! అసలు నేను మొదటి సినిమా ఒప్పుకోవడానికి కారణం చెబితే మీరు నవ్వుతారు. ఆ సినిమా షూటింగ్‌ని మధురైలో చేస్తామన్నారు. నేను మధురై వెళ్లింది లేదు. నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం. అందుకని మధురై చూసినట్టుగా కూడా ఉంటుంది కదా అన్నట్టు సినిమా ఒప్పుకున్నాను (నవ్వుతూ).
మరి.. మధురైని ఎంజాయ్ చేశారా?
అమలాపాల్: (నిట్టూరుస్తూ) దాని గురించి ఎందుకు అడుగుతారులెండి! అప్పటివరకు ఇల్లు, స్కూలు వరకే నా లైఫ్. దాంతో షూటింగ్ వాతావరణం సెట్ అవ్వలేదు. సిక్ అయిపోయాను. ఎలాగోలా షూటింగ్ చేసేసి, ఈ ఒక్క సినిమాతో గుడ్‌బై చెప్పేద్దామని డిసైడ్ అయిపోయాను. అయితే అప్పుడే తమిళ పరిశ్రమ నుంచి ‘మైనా’ ఆఫర్ వచ్చింది. ఆ కథ నచ్చడం, ఆ సినిమా షూటింగ్ కేరళలోనే చేస్తామనడంతో ఒప్పుకున్నాను.
ఆ సినిమాతో మీకు పింపుల్స్ బ్యూటీ అనే పేరొచ్చినట్టుంది?
అమలాపాల్: ఔను. అప్పుడు టీనేజ్‌లోఉండటంవల్ల నాకు బాగా పింపుల్స్ ఉండేవి. అవి కనిపిస్తే బాగుండదని భయపడ్డాను. డెరైక్టర్ ప్రభుసాల్మన్ గ్రాఫిక్స్‌లో తీసేస్తాలే అన్నారు. కానీ అవి తీసేస్తే న్యాచురాల్టీ మిస్ అవుతుందనుకుని ఉంచేశారు. కానీ పింపుల్స్‌తో స్క్రీన్ మీద నేను క్యూట్‌గానే ఉన్నాననిపించింది. ‘అమలాపాల్ అట.. క్యూట్‌గా ఉంది’ అని చాలామంది అన్నారు. చివరికి ఆ పింపుల్స్ ఉంచేసి మంచి పని చేశారనిపించింది.
పింపుల్స్ పోగొట్టుకోవడానికి ఏమైనా చేసేవారా?
అమలాపాల్: ‘ఈ క్రీమ్ రాయండి. వారంలో మీ పింపుల్స్ మటుమాయం’ అని ఏదైనా క్రీమ్ పైన రాసి ఉంటే, అది కొనేసేదాన్ని. ఆ క్రీమ్ రాయడం మొదలుపెట్టిన తర్వాత అవి మాయమైనట్లే అనిపించేది. మళ్లీ కొన్నాళ్లకు ప్రత్యక్షమయ్యేవి. మరీ విచిత్రం ఏంటంటే.. రాత్రి నిద్రపోయి తెల్లారి నిద్రలేచి అద్దం ముందు నిలబడితే... పింపుల్ కనిపించేది. రాత్రికి రాత్రి ఎలా వచ్చిందబ్బా? అనుకునేదాన్ని. ఫ్రెండ్స్ అందరూ ఇది ‘టీనేజ్ ప్రాబ్లమ్’ లైట్ తీస్కో అనడంతో పింపుల్స్ గురించి ఆలోచించడం మానేశాను.
మీ ఫ్రెండ్స్ గ్యాంగ్‌లో అబ్బాయిలుండేవారా?
అమలాపాల్: చాన్సే లేదు! ఎందుకంటే నేను చిన్నప్పట్నుంచీ చదువుకున్నది గాళ్స్ స్కూల్లోనే. కాలేజ్ కూడా గాళ్స్‌దే. ఇంటిపక్కన కూడా ఎవరూ అబ్బాయిలు లేకపోవడంతో నాకు బాయ్‌ఫ్రెండ్స్ లేరు.
స్కూల్, కాలేజ్ నుంచి ఇంటికెళుతున్నప్పుడు అబ్బాయిలు ఫాలో అయ్యేవారా?
అమలాపాల్: సాయంత్రం అయితే చాలు.. అదేదో పార్ట్‌టైమ్ జాబ్‌లా ఫీలయిపోయి మాకోసం గేటు బయట వెయిట్ చేసేవాళ్లు. మేం వాళ్లని కన్నెత్తి కూడా చూసేవాళ్లం కాదు. కొంత మంది ఐ లవ్ యు అనేవాళ్లు, కొంతమంది లవ్‌లెటర్లు ఇవ్వడానికి ట్రై చేసేవాళ్లు. జాబితా చాలానే ఉంది. అవన్నీ తల్చుకుంటుంటే సరదాగా ఉంటుంది.
ఆ సరదా లైఫ్ నుంచి ఒక్కసారిగా హీరోయిన్ అనే పెద్ద బాధ్యత తీసుకున్నారు. పైగా తమిళంలో రెండో సినిమా (సింధు సమవేలి) తర్వాత ‘నిన్ను వదలం.. చంపేస్తాం..’ అంటూ బెదిరింపు కాల్స్ అందుకున్నారు. అప్పుడేమనిపించింది?
అమలాపాల్: అది ఒక పీడకల. ఆ సినిమా కాన్సెప్ట్ వివాదాస్పదంతో కూడుకున్నది. మామగారితో అక్రమసంబంధం పెట్టుకునే అమ్మాయి పాత్ర నాది. ఆ పాత్రకు చాలా విమర్శలొచ్చాయి. సినిమాని నిషేధించమని పలు సంఘాలు హడావిడి చేశాయి. ఆ పాత్ర చేసినందుకు నన్నూ విమర్శించారు. అప్పుడు నా వయసు 18. ఎలాంటి పాత్రలు చెయ్యాలో నాకు తెలియదు. ఆ సినిమా ఒప్పుకోవడానికి కారణం నా పాత్రలో ఉన్న మూడు షేడ్స్. ఒక సాదాసీదా అమ్మాయి, పెళ్లయిన అమ్మాయి, మామగారితో సంబంధం పెట్టుకునే అమ్మాయి.. ఈ మూడు షేడ్స్‌లో నటన కనబర్చవచ్చని ఒప్పుకున్నాను. అది ఇలా వివాదం అవుతుందని ఊహించలేదు.
ఆ సినిమా చేసినందుకు పశ్చాత్తాపపడ్డారా?
అమలాపాల్: ఏమాత్రం లేదు. ఎందుకంటే ఆ సినిమా కాన్సెప్ట్ నాది కాదు. డెరైక్టర్‌ది. నేను ఒప్పుకున్న పాత్రని చేశాను. పైగా ఆ సినిమాలో నేనేం నగ్నంగా నటించలేదు కదా. ముద్దు సన్నివేశాలు చెయ్యలేదు. ఒక్క సీన్ కూడా అభ్యంతరకరంగా ఉండదు. అంతేకాదు ఆ సినిమా చేసినందకు నాకు బాధ లేదు. అలాగే ఆ చిత్రదర్శకుడు సామి మీద నాకెలాంటి కోపం లేదు. ఇప్పటికీ ఆయనతో నాకు మంచి అనుబంధమే ఉంది.
ఇంత పెద్ద వివాదం ఎదుర్కొన్న సమయంలోనే ‘మైనా’ చిత్రంలో అద్భుతంగా నటించినందుకు రజనీకాంత్, కమల్‌హాసన్‌లాంటి సూపర్‌స్టార్స్ నుంచి కాంప్లిమెంట్స్ కూడా అందుకున్నారు. ఎలా అనిపించింది?
అమలాపాల్: ఒక మంచి వెనకాల చెడు.. చెడు వెనకాల మంచి ఉంటుందంటారు. ‘మైనా’ తర్వాత ఆల్‌మోస్ట్ అందరూ నన్ను అమలాపాల్ అని పిలవడం మానేసి, మైనా అనడం మొదలుపెట్టారు. నా పేరు నేను మర్చిపోయే స్థాయికి తీసుకెళ్లింది మైనా. రజనీ సార్ నన్ను ప్రశంసిస్తూ బొకే పంపించారు. నాకు మాటలు రాలేదు. కమల్‌సార్ అభినందించినప్పుడు కూడా మాటలు రాక అలా నిలబడిపోయాను. ఆ సినిమా నాకు 18,19 అవార్డులు తెచ్చిపెట్టింది. నేను ఆ దేవుడి ముద్దుబిడ్డను కాబట్టే ఇలా జరిగిందనుకుంటున్నాను.
ఒక ఇంటర్వ్యూలో ‘నా ఫ్రెండ్ ఇచ్చిన పార్టీని ఎంజాయ్ చేశాను’ అని మీరు చెప్పిన విషయం వివాదం అయ్యింది..?
అమలాపాల్: ఔను... హీరోయిన్ అయిన తర్వాత నేను ఎదుర్కొన్న పెద్ద వివాదం అది. ‘మీకు పార్టీలు ఇష్టమేనా?’ అని అడిగితే.. ‘ఇష్టమే. ఆ మధ్య ఓ పార్టీలో పాల్గొన్నాను. ఎంజాయ్ చేశాను’ అన్నాను. అంతే... పెద్ద దుమారం రేగిపోయింది. సంప్రదాయాలకు వ్యతిరేకంగా రేగిపోయింది. సంప్రదాయాలకు వ్యతిరేకంగా మాట్లాడుతోందని వివాదం మొదలుపెట్టారు. పార్టీ అంటే చాలామందికి తప్పుడు అభిప్రాయం ఉన్నట్లుంది. పార్టీ చేసుకుంటున్నాం అంటే.. మందు కొడుతున్నారనేనా అర్థం? టీ పార్టీ ఉండదా? రుచికరమైన వంటకాలు వండుకుని, అందరూ కలిసి భోజనం చేయడం పార్టీ కాదా?
‘వేట్టయ్’ సినిమాలో ఆర్యతో ‘పెదవి ముద్దు’ సీన్‌లో నటించారు. ఆ సీన్‌లో మీరే ముందు పూనుకున్నారని, తను తడబడ్డానని ఆర్య చెప్పారని... ఆ మాటలు మీకు కోపం తెప్పించాయనే వార్త కూడా ప్రచారం అయ్యింది...
అమలాపాల్: ఆ న్యూస్ ఎలా వచ్చిందో నాకర్థం కాలేదు. ఏ వెబ్‌సైట్ చూసినా నాకు, ఆర్యకు గొడవ జరిగిందనే వార్త కనిపించింది. నిప్పు లేనిదే పొగ రాదు కదా అని కొంతమంది తెలివిగా ఓ లింకు పెట్టారు. నిప్పు... పొగ సంగతి పక్కనపెడితే నాకు, ఆర్యకు మధ్య ఎలాంటి గొడవా జరగలేదు. ఆ వార్త వచ్చిన తర్వాత తనే నాకు ఫోన్ చేసి, మన గురించి న్యూస్ వచ్చింది విన్నావా? అన్నాడు. ఇద్దరం హాయిగా నవ్వుకున్నాం. మేమిద్దరం ఇప్పటికీ మంచి ఫ్రెండ్సే.
‘నాన్న’ దర్శకుడు విజయ్‌తో ప్రేమలో పడ్డారనే వార్త వినిపిస్తోంది... పెళ్లి కూడా చేసుకోబోతున్నారట?
అమలాపాల్: వినడానికి కామెడీగా ఉంది. నేనెవరితోనూ ప్రేమలో పడలేదు. విజయ్ మంచి వ్యక్తి. చాలా సాఫ్ట్ పర్సన్. తను నాకు మంచి ఫ్రెండ్. సినిమాలకు సంబంధించి ఏమైనా సలహాలు కావాలంటే విజయ్‌ని అడుగుతుంటాను. తన ఫ్యామిలీ కూడా నాకు చాలా క్లోజ్. ఏదేమైనా విజయ్ చాలా మంచి వ్యక్తి. అలాంటి వ్యక్తితో లింకు పెట్టారు కాబట్టి బాధలేదు.
అంటే వివాదాలు అలవాటయ్యాయన్నమాట...?
అమలాపాల్: నిజానికి నేను చాలా ‘ఎమోషనల్ పర్సన్’. వివాదాలను భరించలేను. పాజిటివ్‌ని తీసుకున్నంత తేలికగా నెగటివ్‌ని తీసుకునే పరిపక్వత నాకు ఉండేది కాదు. నా గురించి రాకూడని వార్తొలొచ్చినప్పుడు కుమిలిపోయేదాన్ని. ఒంటరిగా కూర్చుని ఏడ్చేదాన్ని. చిన్న చిన్న విషయాలకే నాకు కన్నీళ్లు వచ్చేస్తాయి. నా ఫ్యామిలీ సపోర్ట్ వల్లే కాంట్రవర్శీలను తేలికగా తీసుకోగలిగాను. ఎవరేమన్నా, ఏం అనుకున్నా మన కుటుంబ సభ్యులు మనల్ని నమ్మితే చాలు. నా విషయంలో మా అమ్మానాన్నలకు పూర్తి నమ్మకం ఉంది. అదీగాక దేవుడు అంతా నాకు మంచే చేస్తాడని నా నమ్మకం.
అంటే.. ఏది జరిగినా అది దేవుడివల్లే అని పూర్తిగా నమ్ముతారా?
అమలాపాల్: మనల్ని ఏదో శక్తి నడిపిస్తుందన్నది మాత్రం నిజం. ఆ శక్తి పేరే ‘దేవుడు’. నాకు దేవుడంటే చాలా నమ్మకం. అలాగని కష్టపడకుండా దేవుడు చూసుకుంటాడులే అనుకోను. మానవ ప్రయత్నం చేస్తే దేవుడి సహాయం ఉంటుందన్నది నా అభిప్రాయం.
దేవుడంటే నమ్మకం అంటున్నారు కాబట్టి.. పండగలవీ బాగా చేసుకుంటారేమో?
అమలాపాల్: తప్పకుండా చేసుకుంటాను. ముఖ్యంగా ఓనం పండగను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాను. పండగలను ఫ్రెండ్స్‌తో చేసుకోవడం నాకిష్టం. క్రిస్మస్ పండగను కూడా మిస్ అవ్వకుండా చేసుకుంటాను.
మీ ఫ్రెండ్స్ అందరిలోకల్లా ఎక్కువ సంపాదిస్తున్నది మీరే కదా.. సో.. ఖర్చంతా మీదేనా?
అమలాపాల్: మాగ్జిమమ్ నాదే. మనం సంపాదించి బ్యాంకులో వేసుకుని, ఎప్పటికప్పుడు బాలెన్స్ షీట్ చూసుకుంటే ఆనందంగానే ఉంటుంది. కానీ ఆ డబ్బుని నచ్చినవాళ్లకోసం ఖర్చుపెట్టినప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. పోయిన సంవత్సరం నా బర్త్‌డేని ఫ్రెండ్స్‌తోనే చేసుకున్నాను. న్యూయర్‌ని ఫ్రెండ్స్‌తో కలిసి మలేసియాలో చేసుకున్నాను. సినిమాల్లోకి రాకముందు ఎలా ఎంజాయ్ చేశానో.. ఇప్పుడూ నా ఫ్రెండ్స్‌తో అలానే ఉంటున్నాను. అందుకే నువ్వేం మారలేదని అంటుంటారు. అందుకు బదులుగా ‘మీరు లేకపోతే నా లైఫ్ జీరో’ అని చెబుతుంటాను. నా ఫ్రెండ్స్‌లో అశ్విని ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. నా కాస్ట్యూమ్స్‌ని తనే డిజైన్ చేస్తానంటోంది. ఇంకో ఫ్రెండ్ ఐశ్వర్య ఇంజనీరింగ్ చేసింది. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చక్కగా సెటిల్ అవ్వడం ఆనందంగా ఉంది.
సినిమాల్లో మీరు చేస్తున్న పాత్రలు చూసి మీ ఫ్రెండ్స్ ఏమంటారు?
అమలాపాల్: వాళ్లకైతే ఆశ్చర్యంగా ఉంటుంది. ఎందుకంటే లంగా, ఓణీ, టైట్ జడ, తలనిండా పువ్వులు.. ఇది నా స్టయిల్ కాదు. నేను చాలా మోడర్న్‌గా ఉంటాను. సిగ్గుపడటం కూడా చేత కాదు. అలాగే రొమాంటిక్ ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం కూడా చేతకాదు. కానీ ఇవన్నీ సినిమాలో చేస్తుంటే మావాళ్లు ఆశ్చర్యపోతున్నారు. స్క్రీన్ మీద కనిపిస్తున్నది నువ్వేనా? అని కూడా సరదాగా అంటుంటారు.
ఇంతకీ డిగ్రీ పూర్తి చేశారా? సినిమాల్లోకి వచ్చిన తర్వాత పుస్తకాలను అటకెక్కించేశారా?
అమలాపాల్: ఎన్ని డబ్బులు సంపాదించినా చదువు ఉండాలి. అందుకే డిగ్రీ కంప్లీట్ చేశా. షూటింగ్ స్పాట్‌లో ఖాళీ దొరికితే చాలు ‘కార్‌వాన్’లో దూరిపోయి చదువుకునేదాన్ని. ఆ మధ్య కాలేజ్‌కి అటెండన్స్ సరిపోకపోవడంతో రెండు నెలలు షూటింగ్‌కి గ్యాప్ తీసుకున్నాను. ఫైనల్ ఇయర్ పూర్తయిన తర్వాత ఊపిరి పీల్చుకున్నాను. రెండు నెలల గ్యాప్ వల్ల రెండు, మూడు సినిమాలు వదులుకున్నాను. కానీ ఫీలవ్వలేదు. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ చేస్తానని నాన్నకి ప్రామిస్ చేశాను. అది నిలబెట్టుకున్నందుకు ఆనందంగా ఉంది.
ఇద్దరు నాయికలున్న చిత్రాల్లో మీరు నటించారు. వాళ్ల అనుభవాలను ఏమైనా అడుగుతుంటారా?
అమలాపాల్: ‘వేట్టయ్’ సినిమాలో నేను, సమీరారెడ్డి కలిసి యాక్ట్ చేశాం. మా ఇద్దరికీ మధ్య మంచి స్నేహం కుదిరింది. తన బుర్ర తినేసేదాన్ని. ‘ఫలానా డెరైక్టర్ నాకలాంటి కాస్ట్యూమ్ ఇచ్చి వేసుకోవాల్సిందే అన్నాడు. నీకూ అలా జరిగిందా? కొంతమంది వెకిలిగా ప్రవర్తిస్తుంటారు. నీకూ ఆ అనుభవం ఉందా?’ అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేదాన్ని. తను ఓపిగ్గా సమాధానాలు చెప్పేది. సినిమా ఫీల్డ్‌లో ఉండే కష్టాలు నా ఒక్కదానికే పరిమితం కాదు. అందరికీ ఉంటాయి. ఆ మాటకొస్తే.. ఏ ఫీల్డ్‌లో అయినా కష్టాలు ఉంటాయి. అందుకే ఈ పరిశ్రమ గురించి నాకు చెడు అభిప్రాయం లేదు. ఎంతో అదృష్టం చేసుకుంటే సినిమాల్లోకి వచ్చాం అనిపిస్తుంటుంది.
మీలో ప్రియాంకచోప్రా, త్రిష.. ఇలా కొంతమంది తారల పోలికలు కనిపిస్తాయి. ఈ విషయాన్ని ఎవరైనా మీతో చెప్పారా?
అమలాపాల్: కొంతమంది డెరైక్టర్స్ ఈ మాట అన్నారు. ఒక్కో యాంగిల్‌లో ఒక్కో కథానాయికలా ఉన్నావని అంటుంటారు. ‘మీ అమ్మకి హీరోయిన్లంటే చాలా ఇష్టం. అందుకని నువ్వు కడుపులో ఉన్నప్పుడు చాలామంది హీరోయిన్ల సినిమాలు చూసింది. అందుకే నీకు అందరి పోలికలు వచ్చాయి’ అని నాన్న సరదాగా ఏడిపిస్తుంటారు.
మీకు మళ్లీ మళ్లీ వచ్చే కల ఏదైనా ఉందా?
అమలాపాల్: ప్రస్తుతం నేను బతుకుతున్నది కలలోనే. ఈ జీవితాన్ని నేనూహించలేదు. అంతా కలలా ఉంది. నేను అమలాపాల్‌గా మిగిలిపోయి ఉంటే.. నేనెలా ఉండేదాన్నో అలానే బతికేదాన్ని. కానీ సినిమాల వల్ల రకరకాల పాత్రల్లో జీవించగలుగుతున్నాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను.
గత ఏడాది సీసీఎల్‌కి బ్రాండ్ అంబాసిడర్‌గా చేశారు.. స్పోర్ట్స్ అంటే ఇష్టమా?
అమలాపాల్: క్రికెట్ అంటే ఇష్టం. స్కూల్ డేస్‌లో బాస్కెట్ బాల్ ప్లేయర్‌ని. నైన్త్ స్టాండర్డ్ తర్వాత వదిలేశాను.
మీ బలం, బలహీనతలు?
అమలాపాల్: మా కుటుంబం నా బలం. ఫలానా దర్శకుడితో పెళ్లట అని వచ్చిన వార్తలు చదివి, ‘రేపు నీ పెళ్లంట. మాకు చెప్పనేలేదు’ అని అమ్మానాన్న ఆటపట్టిస్తారు. అన్నయ్య కూడా ఈ విషయాలు చదివి తేలికగా తీసుకుంటాడు. వారే నా బలం. నా వీక్‌నెస్ ఏంటంటే.. ఎవరైనా కష్టపడితే చూడలేను. ముఖ్యంగా పిల్లల కష్టాలను భరించలేను. అలాంటి దృశ్యాలు కనిపించినప్పుడు అప్‌సెట్ అయిపోతాను.
మీ ఫిలాసఫీ ఆఫ్ లైఫ్?
అమలాపాల్: కష్టపడు.. ప్రతిఫలాన్ని అనుభవించు అనేది నా సిద్ధాంతం. డబ్బు సంపాదించాలి కానీ డబ్బు వెంట పరుగులు తియ్యకూడదు. పరుగులు తీసి తీసి.. పరుగు ఆపి, వెనక్కి తిరిగి చూసుకుంటే మనం పడిన కష్టాలు మాత్రమే కనిపిస్తాయి. కాబట్టి ప్రతి క్షణాన్ని ఎంజాయ్ చెయ్యాలి.
మా పాఠకులకు ఏం చెప్తారు?
అమలాపాల్: స్లో డౌన్! పరుగు ఆపండి. పరిగెత్తడమే పనిగా పెట్టుకోకండి. జీవితం కోసం డబ్బుకాని డబ్బే జీవితం కాదు. హాయిగా ఉండండి. మంచి సినిమాలు చూడండి. పుస్తకాలు చదవండి. వీలైన మంచిపనులు చేయండి. అది వీలు కాకపోతే కనీసం ఎవరికీ నష్టం కలిగించకుండా బతకండి. ధ్యాంక్యూ!

No comments:
Post a Comment