పోయిన చోటే వెతుక్కున్నా!
"లంచం
తీసుకుంటుండగా పట్టుబడి, ఉద్యోగం పోగొట్టుకున్నానన్నావు కదరా! మళ్లీ అదే ఉద్యోగం
ఎలా సంపాదించావు?'' ఆశ్చర్యంగా అడిగాడు శేషాద్రి. "పై ఆఫీసరుకి లంచం ఇచ్చి'' ఠపీమని
చెప్పాడు సింహాద్రి.
ఇన్నాళ్ళకొచ్చింది మరి!
"పదేళ్ల వాడికి ఎల్.కే.జీలో సీటెలా ఇమ్మంటావయ్యా? కుదరదు'' చెప్పాడు ప్రిన్స్‌పాల్. "అడ్మిషను తీసుకోడానికి క్యూలో నిల్చున్నప్పుడు వాడికి ఐదేళ్లే నండి .. '' చెప్పేడు గుర్నాథం.
సోమరి సోంబేరి
అర్ధరాత్రి దొంగలొచ్చిన అలికిడికి మెలకువ వచ్చింది సోంబేరయ్యకి. విలువైన సామాన్లను గోనె సంచెలో వేసుకుంటున్న దొంగల కేసి అర నిమిషం తేరిపార చూసి, "ఇదిగో, మీరు ఏం పట్టుకెళ్తున్నారో లిస్టు రాసి టేబుల్‌మీద పెట్టి మరీ వెళ్లండి. లేదంటే రేపు స్టేషన్లో కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్లినప్పుడు పోలీసోళ్లకి సమాధానం చెప్పలేక చావాలి'' అని, అటు తిరిగి గుర్రుపెట్టాడు.
అది మాత్రం సాధ్యపడదు
"మా వారికి పిచ్చి కుక్క కరిచింది. మీరు వెంటనే రావాలి డాక్టర్'' కంగారుగా ఫోన్ చేసింది సుశీల. "గాభరా పడకండి, నేను వచ్చేలోపు మంచం పైన పడుకోబెట్టండి'' చెప్పాడు డాక్టర్. "ఛీ ఛీ, పిచ్చికుక్కని మంచంపైన ఎలా పడుకోబెట్టమంటారండి .. మీకేమైనా పిచ్చా?'' ఠపీమని అనేసి, నాలుక కరుచుకుంది సుశీల.
'విజయం వచ్చేవరకూ తప్పదండి!
"ఏమయ్యా, ఒకటి కాదు, రెండు కాదు, మూడు పెళ్లిళ్లు చేసుకుంటావా? నేరం అని తెలీదూ?'' అడిగాడు జడ్జి. "ప్రతి మగవాడి 'విజయం' వెనకా ఒక స్త్రీ ఉంటుందంటారు కదండి. ఒకటీ, రెండులతో విజయం రాలేదండి'' నిజాయితీగా సమాధానమిచ్చాడు ముద్దాయి మన్మథరావు.
బొమ్మలు: ఎన్.రాజశేఖర్‌రెడ్డి

No comments:
Post a Comment