రజనీయే అన్నారు... నాది ఆర్టిస్ట్ ముఖమని
'అనగనగా
ఆకాశం ఉంది .. ఆకాశంలో మేఘం ఉంది' పాట గుర్తుంటే చాలు ... మీరింకా ఆ హీరోని
మర్చిపోలేదన్నమాటే. గాయకుడు వి.రామకృష్ణ కుమారుడిగా, బుల్లితెర, వెండితెరల హీరోగా
అందరికీ తెలిసిన నటుడతను. 'నువ్వేకావాలి'తో చిత్రరంగ ప్రవేశం చేసి 'ప్రేమించు',
'సత్తా', 'డార్లింగ్ డార్లింగ్', 'వెంగమాంబ', 'శిరిడి శాయి' వంటి పలు చిత్రాల్లో
నటించారు. అలాగే 'ఆటో భారతి', 'సుందరకాండ', 'అపరంజి' లాంటి బుల్లితెర
సీరియల్స్‌లోనూ కనిపిస్తున్న ఆ యువ నటుడు సాయికిరణ్ హ్యాపీడేసే ఇవి.
అంజలీదేవిగారి ఇంటికి సత్యసాయిబాబాగారు వచ్చినప్పుడు, ఆయన చేతుల మీదుగా నా నామకరణం జరిగిందట. అమ్మానాన్నలు ఇద్దరూ గాయకులే కాబట్టి తరచూ ప్రోగ్రాంల్లో పాల్గొనడానికి ఊర్లు తిరుగుతూ ఉండడంతో, ఏడేళ్ల వరకూ అమ్మమ్మ వాళ్లింట్లో హైద్రాబాద్‌లోనే పెరిగాను. అమ్మమ్మ వాళ్లు అప్పట్లో ఎర్రమంజిల్ కాలనీలో ఉండేవారు. ఆ ఇంటి పక్కనుండే ఫారెస్టు ఆఫీసరు ఒకాయన వికారాబాద్ అడవుల్లో గాయపడ్డ నెమళ్లనీ, జింకలను తీసుకొచ్చి ట్రీట్‌మెంట్ ఇవ్వడం నాకు బాగా జ్ఞాపకం. బహుశా అదే ఆ తర్వాత నేను జంతు ప్రేమికుడిగా మారడానికి దోహద పడిందేమో! సంక్రాంతి పండగ సందర్భంలో ఎగరేసే గాలిపటాల 'మాంజా' కోసుకుని ఎన్నో గద్దలు నేల రాలిపోతుండేవి.
అలా పడిపోయిన గద్దలపై ఒక టర్కీ టవల్ కప్పి, జాగ్రత్తగా కుక్కపిల్లని చంకలో పెట్టుకున్నట్టు పొదువుకొని, ఇంటికి తీసుకొచ్చేవాణ్ణి. అలా నేను కుక్కలు, ఉడుములు, పాములు, తాబేళ్లు, పావురాలు, లవ్ బర్డ్స్, గబ్బిలాలు, గద్దలు, చేపలు, ఊసరవెల్లులు, చిలకలు లాంటి ఎన్నో జంతువుల బాగోగులు చూసుకున్నాను. వీటికోసం ప్రత్యేకంగా పంజరాలను తయారుచేయించడం ... దెబ్బతిన్న వాటి ఆరోగ్యం కుదుట పడగానే యథావిధిగా వాటిని ప్రకృతిలోకి వదిలేయడం ఒక హాబీగా ఉండేది.
ఇంట్లోంచి పారిపోయాను
8వ తరగతిలో ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ రిజల్ట్స్ తెలిసినప్పుడు జరిగిన సంఘటన ఇది. లెక్కల్లో 90 శాతం తెచ్చుకోకపోతే తన్నులు తప్పవని అమ్మ వార్నింగ్ ఇచ్చింది. అయినా నాకు నూటికి 5 మార్కులే వచ్చాయి. ఇంటికి వెళితే తన్నులు ఎలాగూ తప్పవని రిక్షా రాకముందే సిటీ బస్సులో మద్రాసు సెంట్రల్‌కి వెళ్లి చార్మినార్ ఎక్స్‌ప్రెస్ (స్లీపర్‌లో) ఎక్కి దర్జాగా కూర్చున్నాను. రైలు గూడూరు దాటాక టి.సి. వచ్చి టికెట్ అడిగాడు. 'మా అమ్మానాన్నలు కూడా ఇదే రైల్లో ఉన్నారు. వాళ్లు ఏ బోగీలో ఉన్నారో తెలీదు. టికెట్ వాళ్ల దగ్గరే ఉంది' అని అబద్ధం ఆడేశాను. నా భుజానున్న స్కూల్ బ్యాగ్, చేతిలో లంచ్ బాక్స్ చూడగానే టి.సి.కి అనుమానం వచ్చి మెల్లగా కూపీ లాగాడు.
'నీవు రామకృష్ణగారి అబ్బాయివా? నేను మీ నాన్నగారి ఫ్యాన్‌ను తెలుసా' అనడంతో అసలు విషయం కక్కేసి ... అమ్మమ్మ వాళ్లింటికి హైద్రాబాద్ వెళ్తున్నానని చెప్పేశాను. రామకృష్ణగారి అబ్బాయిని కావడంతో టికెట్ విషయం మర్చిపోయి, 'అయ్యో ఒక్కడివీ ఎలా వెళ్తావు' అని బాధపడిపోయి, హైద్రాబాద్‌లో దిగగానే తనకు తెలిసిన మనిషికి నన్ను అప్పగిచ్చి మా అమ్మమ్మ వాళ్లింట్లో దిగబెట్టమన్నాడు. నేను సేఫ్‌గా అమ్మమ్మ వాళ్లింటికి చేరుకున్నాగానీ ... చెన్నైలో మా అమ్మానాన్నలు మాత్రం నిద్రాహారాలు మాని పోలీసుస్టేషన్ల వెంట తిరిగి, వాళ్లకు లంచాలిస్తూ, నా ఆచూకీ కోసం నానా హైరానా పడ్డారట. అమ్మమ్మ ఇంటినుండి వార్త అందిన తర్వాతగానీ వాళ్లు కుదుట పడలేదట. అంత తెగింపు నాకెలా వచ్చిందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయమే కానీ ఆ దెబ్బతో అమ్మానాన్నలు నా విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు. చదువు, చదువు అని వెంటపడ్డం మానేశారు.
ఆ మాటతో హీరోనైపోయా!
మా చిన్న నాన్నమ్మ పి. సుశీలగారి అబ్బాయి పెళ్లి శుభలేఖ ఇవ్వడానికి నాన్న వెంట నేనూ రజనీకాంత్‌గారి వద్దకు వెళ్లాను. అప్పుడాయన 'ఉలైపాళి' అనే తమిళ చిత్రం షూటింగ్‌లో ఉన్నారు. శుభలేఖ తీసుకుంటూ పక్కనే ఉన్న నన్ను చూసి 'ఎవరీ అబ్బాయి? ఆర్టిస్ట్ ముఖం. యాక్టర్‌ని చేయండి' అన్నారు. ఆ మాటతో నా చుట్టూ కెమెరా జూమ్‌తో రెడీగా ఉన్నట్టు, లైట్స్ ఒక్కసారిగా వెలిగినట్టు, ఎక్కడో యాక్షన్ అనే పిలుపు వినిపించినట్టు ఫీలయిపోయా. బయటకి రాగానే 'చూశారా, అందరి కళ్లకు రజనీకాంత్‌గారు యాక్టర్లా కనిపిస్తే ఆయన కళ్లకి నేను యాక్టర్లా కనిపించాను. చదువు మానేసి హీరోనైపోతా' అన్నాను నాన్నతో. ఆయన ముందు డిగ్రీ పూర్తి చేయమని కచ్చితంగా చెప్పేశారు. అదేంటో ఇంటర్మీడియట్ టైంలో గడిచిన ఒక్క సంఘటనా మెదడులో నిక్షిప్తం కాలేదు. ఆ రెండేళ్లూ ఎలా తుడిచి పెట్టుకుపోయాయో ఇప్పటికీ అర్థం కావట్లేదు. డిగ్రీలో ఈ కోర్స్, ఆ కోర్స్ అనీ చివరికీ దేనిమీదా ఇన్‌ట్రెస్ట్ లేక ఆ సంవత్సరం అంతా వృధా. చివరికి హైద్రాబాద్‌లో 'హోటల్ మేనేజ్‌మెంట్' చేస్తానని ఒప్పించి అమ్మమ్మ వాళ్లింటికి వచ్చేశాను.
వాడికోసమే కరాటే నేర్చుకున్నాను
మొదట్లో మా కాలేజీ బేగంపేటలో ఉండేది. అందరూ సరదాకోసం ర్యాగింగ్ చేస్తే అమిత్ అనేవాడు మాత్రం వాడి అవసరానికి ర్యాగింగ్ చేసేవాడు. 'జేబులో ఎన్ని పైసలున్నయో తియ్' అంటూ దాదాగిరి చేసేవాడు. తిరగబడదామంటే నాకు శక్తి సరిపోయేది కాదు. వాడి పుణ్యమా అని సిటీబస్‌కు కూడా డబ్బులు లేక బేగంపేట నుండి జూబ్లీహిల్స్‌కి (అమ్మమ్మవాళ్లు అక్కడ ఉండేవాళ్లు) నడిచి వెళ్లేవాడ్ని. కాళ్లు నొప్పెట్టినప్పుడల్లా వాడిమీద కసి ఇంతింతై వటుడింతై అన్నట్టు పెరిగేది. వాణ్ని తన్నాలంటే నేను దృఢంగా అవ్వాలి అనుకుని, ఉదయం 5 గంటలకే నిద్రలేచి కరాటే క్లాసులకు వెళ్లేవాణ్ణి. సీన్ కట్ చేస్తే ....
సెకండియర్‌కి వచ్చేసరికి పుష్టిగా ఇద్దరు మనుషుల్ని ఒకేసారి కొట్టే బలం, ధైర్యం వచ్చేసింది నాకు. ఒక ఫైన్ ఈవినింగ్ వాడింటికి వెళ్లి బయటకి పిలిచి నన్ను నడిపించిన దృశ్యాలు నెమరేసుకుంటూ చితకబాదుతుంటే లోపల్నుంచి వాళ్ల నాన్న పరిగెత్తుకొచ్చి 'ఎందుకు కొడుతున్నావు? ఏం చేశాడ'ని అరిచాడు. వాడు చేసిన నిర్వాకం చెప్పగానే, కామ్‌గా ఇంట్లోకి వెళ్లిపోయి, 2 రోజుల పాటు వాడిని ఇంట్లోకి రానివ్వలేదట. ఆ తర్వాత నన్ను తన్నించడానికి మనుషుల్ని పెట్టాడని తెలిసింది. అప్పటికే మా కాలేజీ బేగంపేట నుండి కొంపల్లికి మారడంతో నాకోసం రెండ్రోజులు తిరిగి 'నీవిచ్చిన డబ్బులు రెండ్రోజులతో సరి' అని వాడికి చెప్పి వెళ్లిపోయారట. కొసమెరుపు ఏంటంటే ఆ టైంలో నేను కాలేజీకి వెళ్లలేదు.
అమ్మమ్మే నా బెస్ట్ ఫ్రెండ్
మా కాలేజీ పక్కనే ఒక డిగ్రీ కాలేజీ ఉండేది. ఈ రెండు కాలేజీలకు మ««ధ్యలో 'ఇగూ'్ల అనే రెస్టారెంట్. ఖాళీ దొరికితే టీ తాగడానికి అందులోకి వెళ్లేవాళ్లం. అప్పుడే నా కంట్లో పడిందొక నార్త్ ఇండియన్ (మిలట్రీ వాళ్ల) అమ్మాయి. బోయిన్‌పల్లి నుండి వచ్చేది తను. కేవలం ఆ అమ్మాయిని చూడ్డానికే ఇగ్లూకి వెళ్లేవాణ్ణి. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. పెళ్లి చేసుకుంటే తననే చేసుకోవాలని అమ్మమ్మతో వెళ్లి చెప్పా ఒకసారి. 'వద్దురా, ఉత్తరాది అమ్మాయిలు పెళ్లికి ముందు అందంగా ఉంటారు కానీ, పిల్లలు పుట్టగానే అమ్మమ్మల్లా అయిపోతార'ంది. నా మనసు మాత్రం ఊరుకునేది కాదు. అప్పట్లో నేను కాలేజీలో నేర్చిన ఫ్రెంచ్ లాంగ్వేజీని అప్పుడప్పుడు ఇంట్లోనే ట్యూషన్‌గా చెప్పేవాణ్ణి. ఒకరోజు నా క్లాసు వినడానికి తనూ వచ్చింది. అమ్మమ్మకి చూపించి 'చూడు ఎంత అందంగా ఉందో' అన్నాను, అప్పటికైనా మనసు మార్చుకుంటుందేమోనని. 'వయసులో గాడిద పిల్ల కూడా ముద్దుగానే ఉంటుందిరా' అని క్లాసు పీకింది.
మళ్లీ సీన్ కట్ చేస్తే -13 ఏళ్ల తర్వాత ఇప్పుడు అనుకోకుండా ఆ అమ్మాయి నా ఫేస్‌బుక్‌లో కనిపించింది, అమ్మమ్మ మాటని నిజం చేస్తూ. ఈ విషయం అమ్మకి చెబితే 'అందుకేరా, పెద్దల మాట వినాలి' అని మరోసారి క్లాసు పీకడానికి రెడీ అయ్యింది.
డిగ్రీ అవగానే ఉషాకిరణ్ మూవీస్ పిలుపు - 'శివలీలలు' సీరియల్ కోసం మేకప్ టెస్ట్ చేస్తామంటూ. ముందు మన్మథుడి పాత్రకు పిలిచి, తర్వాత శివుడి మేకప్ వేశారు. చివరికి విష్ణుమూర్తి వేషానికి సెలక్టు చేశారు. అలా శివలీలలతో బుల్లితెరంగేట్రం చేశాను. 'నువ్వేకావాలి' చిత్రం కోసం విజయభాస్కర్‌గారు రెండో హీరో కోసం వెతుకుతుంటే కృష్ణవంశీగారు 'రామకృష్ణగారి అబ్బాయిని ట్రై చేయమ'ని సలహా ఇచ్చారట. అలా మరోసారి ఉషాకిరణ్ మూవీస్‌తోనే సినిమాల్లోకి వచ్చాను. చిన్నప్పట్నించీ జీవితాన్ని నాకు నచ్చినట్టే గడిపాను కాబట్టి రోజులన్నీ నాకు హ్యాపీడేసే. అంతేకాదు, రాబోయి రోజులు కూడా కచ్చితంగా హ్యాపీడేస్ అనే నమ్మకం నాది.
'కిడ్నాప్' నుండి తప్పించుకున్నాను
హైద్రాబాద్‌లో చదివింది 2వ తరగతి వరకే గాని టీచర్లని మూడు చెరువుల నీళ్లు తాగించేవాణ్ణి. చదువంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. హోంవర్కు చేయడమంటే యమ బద్ధకం. పూర్వ జన్మలో డాక్టర్నేమో ... నా రాత అర్థం చేసుకోలేక టీచర్ల బుర్ర గిర్రున తిరిగిపోయేది. అయితే చిత్రలేఖనంలో అందె వేసిన చెయ్యి నాది. పొద్దస్తమానం బొమ్మలు గీస్తూ గడిపేవాణ్ణి. టీచర్ కొట్టబోయినప్పుడల్లా 'మాడమ్ మీ శారీ చాలా బాగుంది, మీరు చాలా బాగున్నారు' లాంటి మాటల్ని చెప్పేసి తప్పించుకునే వాణ్ణి. పొగడ్తకంటే తీయనిదేముంది? చుట్టంచూపుగా వచ్చే అమ్మానాన్నల్ని పరాయి వాళ్లలా చూస్తుండడంతో ఇక లాభం లేదని బలవంతంగా చెన్నై తీసుకెళ్లిపోయారు. అమ్మమ్మ నుండి నన్ను విడదీశారని వాళ్లిద్దరిపై మొదట్లో కోపంగా ఉండేది.
స్కూల్‌లో నన్ను దించటానికి, మళ్లీ తీసుకురావడానికి ఒక రిక్షా ఉండేది. ఒకరోజు స్కూల్ వదిలేసి అరగంటైనా రిక్షా రాలేదు. అప్పటికే పిల్లలంతా వెళ్లిపోయారు. ఒక్కడ్నే గేటు బయట అరుగు మీద కూర్చుని రిక్షా కోసం ఎదురుచూస్తున్నా. ఇంతలో నాకు ఎదురుగా ఒక పొడవాటి కారు ఆగింది. అందులోంచి ఒకడు దిగి, 'ఏం పేరు నీది? చాలా బొద్దుగా ఉన్నావు' అంటూ ప్రేమగా మాట కలిపాడు. బెరుకుగానే సమాధానం చెప్పాను. 'అరే నువ్వు సింగర్ రామకృష్ణ అబ్బాయివా? మీ నాన్న నేను మంచి మిత్రులం తెలుసా?' అంటూ మామిడి ముక్కలు కొని తీసుకొచ్చి నా చేతిలో పెట్టాడు. అంతలో మా రిక్షా అతడు వచ్చాడు. 'నీవు వెళ్లిపో, నేను బాబుని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాలే. వీళ్ల నాన్న నేను ఫ్రెండ్స్' అన్నాడు వాడు. నేను కూడా సరే అనడంతో మా రిక్షా వెనక్కి తిరిగింది.
తర్వాత వాడు జేబులోంచి 'స్ప్రే' తీసి 'ఇది చూడు. ఎంత మంచి వాసన వేస్తుందో' అంటూ నా చేతిలో పెట్టబోయాడు. అంతకు ముందురోజే స్ప్రే కొట్టి పిల్లల్ని ఎత్తుకుపోయే ముఠా తిరుగుతోందని, జాగ్రత్తగా ఉండమని అమ్మ చెప్పిన మాటలు గుర్తుకొచ్చి 'వద్దు' అంటూ భయంగా వెనకడుగు వేశాను. ఇంతలో మా రిక్షా అతను వెనక్కి వచ్చి 'బాబు ఇల్లు ఎక్కడో మీకు తెలుసా?' అని అడిగాడు అతన్ని. 'తెలుసు తెలుసు. నీ వెళ్లు' అంటాడేగానీ అడ్రుసు చెప్పట్లేదు. మా రిక్షా అతడికి డౌటొచ్చి కేకలేయడంతో పలాయనం చిత్తగించాడు వాడు. లేకపోతే ఇప్పుడు నేను ఎక్కడ ఉండేవాన్నో?!

No comments:
Post a Comment