చికెన్ మాసాంహార రుచిల్లో చాలా పాపులర్. చికెన్ తో చేసే ఏ వంటైనా సరే నోరూరించాల్సిందే. గ్రేవీ, కర్రీ, ఫ్రై, కబాబ్స్ ఇలా... కబాబ్స్ చాలా రుచిగా ఉంటాయి. వాటిని ఎంత ఇష్టపడినా ఇంట్లో చేయడం తక్కువే. తంగ్డి చికెన్ కబాబ్ చూడటానికి జ్యూసీగా ప్లేట్ మీల్ లా ఉంటుంది. దీన్ని చూడగానే ఎవ్వరికైనా సరే నోట్లో నీరూరాల్సింది. ఫ్యామిలీ మెంబర్స్ ను, ఫ్రెండ్స్ ను టెంప్ట్ చేసే ఈ చికెన్ తంగ్డి కాబాబ్ మైక్రోవేవ్ తో పాటు వచ్చిన బుక్ లో రెసిపీ చూసి చేసిన ఈ చికెన్ కబాబ్ చాలా బాగా కుదిరింది. మారినేషన్ తయారు చేసుకుంటే చాలు సింపుల్ గా అయిపోతుంది. మరి ఎలా తయారు చేయాలో చూద్దాం...
కావలసిన పదార్థాలు:
చికెన్ డ్రమ్‌స్టిక్స్(తొడలు): 8
అల్లంతురుము: 4tsp
వెల్లుల్లితురుము: 6tsp
పండుమిర్చిపేస్ట్: 2tsp
కారం: 2tsp
కొత్తిమీర తురుము: 4tsp
మిరియాలపొడి: 1tsp
గరంమసాలాపొడి: 2tsp
పసుపు: 1/2tsp
నీళ్లు లేకుండా పొడివస్త్రంలో వడకట్టిన పెరుగు: 4tsp
మొక్కజొన్నపిండి: 4tsp
శెనగపిండి: 100grms
ఉప్పు: రుచికి తగినంత
నూనె: సరిపడా
తయారు చేయు విధానం:
1. చికెన్ తొడలకు పదునైన కత్తితో గాట్లు పెట్టుకోవాలి.
2. తరవాత అల్లం, వెల్లుల్లి పట్టించాలి.
3. ఓ చిన్న పాత్రలో మిగిలిన దినుసులన్నీ వేసి బాగా కలపాలి. తరవాత ఈ మిశ్రమాన్ని డ్రమ్ స్టిక్స్ కు దట్టంగా పట్టించి ఓ గంటసేపు అలా ఉంచాలి.
4. తర్వాత ఒక పాన్ లో నూనె పోసి, కాగాక చికెన్ డ్రమ్ స్టిక్స్ ను బాగా వేయించి తీయాలి.
5. చివరగా ఉల్లిముక్కలు, నిమ్మముక్కలతో గార్నిష్ చేస్ సర్వ్ చేయాలి అంతే...

No comments:
Post a Comment