పుల్లని ఉసిరి మెల్లగా మన చెవుల్లో చెబుతుంది... తన గురించి...
జాగ్రత్తగా వినండి. అయినా... జగమెరిగిన రుచికి పరిచయమేల...?
ఉసిరిలో సిరి ఉంది... అది ఆరోగ్య సిరి... అది ఆహ్లాద సిరి... వాహ్... అనిపించే కమ్మదనాల సిరి.
ఇన్ని సిరులున్న ఉసిరి రుచులను ఆస్వాదిద్దాం... ఉసిరి మరోసారి అంటూ మళ్లీ మళ్లీ తిందాం.
ఉసిరి - ఆవ బద్దలు
కావలసినవి:
ఉసిరికాయలు - కేజీ
ఆవపిండి - 50 గ్రా.
బెల్లం - అరకిలో
కారం - 50 గ్రా.
పసుపు - 10 గ్రా.
ఉప్పు - 50 గ్రా.
పోపు కోసం:
ఎండుమిర్చి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, జీలకర్ర (తగినంత)
తయారి:
ఉసిరికాయల్ని ముక్కలుగా తరిగి, గింజలు వేరుచేయాలి. ఒక గిన్నెలో ఉసిరికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కొద్దిగా నీరు వేసి సన్నని మంటమీద ఉడికించాలి. వేరే పాత్రలో బెల్లం, కొద్దిగా నీరుపోసి స్టౌ మీద ఉంచి లేతపాకం వచ్చేవరకు కలుపుతుండాలి. పాకం వచ్చిన తరవాత ఉసిరిముక్కలు వేసి బాగా కలిపి దించేయాలి. ఇందులో కారం, ఆవపిండి, పసుపు వేసి మరోమారు బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. ఒక బాణలిలో కొద్దిగా నూనె వేసి అందులో పోపు సామాను వేసి వేయించి దానిని ఉసిరి ముక్కలలో వేసి కలపాలి.
ఉసిరి - కొబ్బరి పచ్చడి
కావలసినవి:
ఉసిరికాయలు- పావు కేజీ, కొబ్బరికాయ- ఒకటి,
పచ్చిమిర్చి - 10, చింతపండు గుజ్జు- 50 గ్రా.,
ఉప్పు- తగినంత
పోపు కోసం:
నూనె - రెండు టీ స్పూన్లు, ఇంగువ - తగినంత
జీలకర్ర - టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను
శనగపప్పు - టీ స్పూను, ఎండుమిర్చి - 10
ఆవాలు - టీ స్పూను, కరివేపాకు - రెండు రెబ్బలు
పసుపు- తగినంత, ఉప్పు - తగినంత.
తయారి:
ఉసిరికాయలను తరిగి గింజలు వేరుచేసి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక అందులో ఈ ముక్కలు వేసి కొద్దిగా వేయించి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో నూనె వేసి కాగాక పోపు సామాను వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. కొబ్బరికాయ ముక్కలు తరిగి ఉంచుకోవాలి. మిక్సీలో ముందుగా ఉసిరికాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి గ్రైండ్ చేయాలి. అవి మెత్తగా అయిన తరవాత అందులో కొబ్బరిముక్కలు, చింతపండు గుజ్జు, పసుపు వేసి మరోమారు గ్రైండ్ చేయాలి. చివరగా పోపు కూడా వేసి ఒక్క తిప్పు తిప్పి తీసేయాలి. ఇది అన్నంలోకి బావుంటుంది.
ఉసిరి తొక్కు
కావలసినవి:
ఉసిరికాయలు - కేజీ, ఉప్పు - 100గ్రా, పచ్చిమిర్చి - 200గ్రా.
పోపుకోసం:
నూనె - రెండు టీ స్పూన్లు, శనగపప్పు - టీ స్పూను
జీలకర్ర - అర టీ స్పూను, మినప్పప్పు - టీ స్పూను
ఆవాలు - టీ స్పూను, ఎండుమిర్చి - 4, ఇంగువ - కొద్దిగా
తయారి:
ఉసిరికాయలు బాగా కడిగి రెండురోజులపాటు ఆరిన తరువాత వాటిని చెక్కాముక్కగా దంచి, గింజలు వేరుచేసి, గట్టి మూత ఉండే సీసా వంటి దానిలో మూడు రోజుల పాటు ఊరబెట్టాలి. మూడవనాడు ఈ ముక్కలకు ఉప్పు, పచ్చిమిర్చి కలిపి దంచి ముద్ద చేసి గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. కావలసినప్పుడల్లా ఈ మిశ్రమాన్ని తగినంత బయటకు తీసి కొద్దిగా నూనెతో పోపు పెట్టుకోవాలి.
ఉసిరిపాకం
కావలసినవి:
ఉసిరికాయలు- కేజీ, పంచదార- అర కేజీ, ఏలకుల పొడి- తగినంత
తయారి:
ఉసిరికాయల్ని ముక్కలుగా తరిగి, గింజలు వేరుచేయాలి. మందపాటి గిన్నెలో అరలీటరు నీరు, చక్కెర వేసి స్టౌ మీద ఉంచి, ముదురుపాకం వచ్చేవరకు కలపాలి. తరవాత ఈ పాకంలో ఉసిరిముక్కలు వేసి కలియబెట్టాలి. చివరగా ఏలకుల పొడి చల్లి బాగా కలిపి దించి, చల్లారిన తరువాత గాలి చొరని సీసాలోకి మార్చుకోవాలి.
ఉసిరికాయ పప్పు
కావలసినవి:
ఉసిరికాయలు - పావు కేజీ
కందిపప్పు- పావుకేజీ, పచ్చిమిర్చి - 6 (నిలువుగా కట్ చేయాలి), ఉప్పు, చింతపండుగుజ్జు, పసుపు, నూనె - తగినంత
పోపుకోసం:
కరివేపాకు - రెండు రెమ్మలు
జీలకర్ర - టీ స్పూను, ఆవాలు - టీ స్పూను
మెంతులు - అర టీ స్పూను, ఇంగువ - తగినంత
ఎండుమిర్చి - 8
తయారి:
ఉసిరికాయల్ని చిన్నచిన్న ముక్కలుగా తరిగి గింజలు తీశాక, అందులో తగినంత నీరు, ఉప్పు, పసుపు వేసి ఉడకబెట్టాలి. కందిపప్పును శుభ్రంగా కడిగి కుకర్‌లో మెత్తగా ఉడికించుకోవాలి. స్టౌ మీద బాణలిలో నూనె కాగాక అందులో కరివేపాకు సహా పోపు సామాన్లన్నీ వేసి వేయించాలి. బాగా వేగిన తరవాత దానికి చింతపండు గుజ్జు చేర్చాలి. కొద్దిగా దగ్గరపడ్డాక, ఉడికించిన పప్పు, ఉసిరిముక్కలు వేసి కలపాలి. కొద్దిసేపు ఉడికిన తరువాత కొత్తిమీర చల్లి దించేయాలి. కావలసినవారు వెల్లుల్లి రెబ్బలు వేయించి వేసుకోవచ్చు.
ఉసిరి ఊరగాయ
కావలసినవి:
ఉసిరికాయలు- కేజీ
ఆవపిండి- పావు కేజీ
మెత్తటి ఉప్పు- పావు కేజీ
కారం-పావు కేజీ
నూనె- కేజీ
చింతపండు గుజ్జు- 100గ్రా.
వెల్లుల్లి ముద్ద - 100గ్రా.
పసుపు - తగినంత
తయారి:
ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి, ఆరబెట్టి పక్కన ఉంచుకోవాలి. బాణలిలో కొద్దిగా నూనె పోసి కాగిన తరవాత అందులో ఉసిరికాయలు వేసి దోరగా వేయించి, స్టౌ మీది నుంచి దించి పక్కన ఉంచుకోవాలి. కాయలు బాగా చల్లారాక అందులో ఉప్పు, ఆవపిండి, పసుపు, కారం వేసి పై నుంచి కిందకు బాగా కలపాలి. తరవాత మిగిలిన నూనె, చింతపండుగుజ్జు, వెల్లుల్లి ముద్ద వేసి కలియబెట్టాలి. మూడు రోజులపాటు కదలకుండా ఊరనివ్వాలి. ఆ తరవాత వేడివేడి అన్నంలో, వెన్నతో పాటుగా కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
చెఫ్: చీమకుర్తి శ్రీలత,
శ్రీశివానంద స్వదేశీ ఫుడ్స్, విశాఖపట్నం
సేకరణ: చింతకింది శ్రీనివాసరావు
ఫొటోలు: ఎ. శరత్‌కుమార్

No comments:
Post a Comment