అవే వంటలు ... అవే రుచులు...
పాత్రలు వేరు... రూపం వేరు... అనుకుంటున్నారా! కాదు కాదు... కానే కాదు... మీ మనసుకి నచ్చే కడై చోలే, కడై దాల్ తడ్కా, కడై పనీర్, మష్రూమ్ మసాలా, పాలక్ కార్న్, కడై వెజ్ వండండికడైలోకి చేర్చండి... అందంగా అలంకరించండి అతిథులను ఆహ్వానించండి... ఆప్యాయంగా వడ్డించండి. కడై పనీర్ కావలసినవి పనీర్- 100 గ్రా. (ముక్కలుగా కట్ చేయాలి) క్యాప్సికమ్ ముక్కలు - పావు కప్పు ఉల్లి తరుగు - పావు కప్పు ఉల్లిముక్కలు - అర కప్పు (పెద్దవిగా తరగాలి) టొమాటో తరుగు - అర కప్పు పసుపు - చిటికెడు, మిరప్పొడి - టీ స్పూను కొత్తిమీర - కట్ట, పచ్చిమిర్చి - 5 మిరియాలపొడి - అర టీ స్పూను గరంమసాలా - అర టీ స్పూను ఉప్పు - తగినంత, నల్ల ఉప్పు - చిటికెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను షాజీరా - పావు టీ స్పూను డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం పల్లీలు - 10 గ్రా. జీడిపప్పు - నాలుగైదు పలుకులు కర్బూజా గింజలు - 10 గ్రా. బాదంపప్పు - 10 గ్రా., నూనె - 5 గ్రా. (డ్రైఫ్రూట్స్‌ని వేయించి చల్లారాక కొద్దిగా నీరు కలిపి మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి) తయారి బాణలిలో నూనె కాగాక, షాజీరా, ఎండుమిర్చి, ఉల్లి తరుగు వేసి దోరగా వే గాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. టొమాటో తరుగు, మిగిలిన సరుకులను వేసి మరోమారు వేయించి, నూనె పైకి తేలుతున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు వేసి కలపాలి. బాగా వేగిన తరవాత పనీర్ ముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి కలిపి, ఐదు నిముషాలు ఉడికించాలి. కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్‌చేసి సర్వ్ చేయాలి. కడై చోలే కావలసినవి కాబూలీ శన గలు - 250 గ్రా. ఉల్లి తరుగు - 50 గ్రా. టొమాటో తరుగు - 75 గ్రా. పచ్చిమిర్చి - నాలుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూను పుదీనా తరుగు - అరకప్పు కొత్తిమీర తరుగు - కొద్దిగా బిరియానీ ఆకులు - మూడు పసుపు - చిటికెడు, నూనె - 25 గ్రా. మిరప్పొడి, చోలేమసాలా, ఆమ్‌చూర్ పౌడర్ - అర టీ స్పూను చొప్పున గరంమసాలా - పావు టీ స్పూను ఉప్పు - తగినంత తయారి శనగలను ముందురోజు రాత్రి నానబెట్టి, మరుసటి రోజు నీరంతా తీసేసి కుకర్‌లో సుమారు అరగంటసేపు ఉడికించాలి. బాణలిలో కాగాక బిరియానీ ఆకు, గరం మసాలా వేసి వేగాక, ఉల్లి తరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు నిముషాలు వేగాక, టొమాటో తరుగు, మిగతా పదార్థాలు వేసి దోరగా వేయించాలి. ఉడికించుకున్న శనగలలో పావు కప్పు శనగలను మెత్తగా చేసి పై మిశ్రమంలో కలపాలి. మూడు నాలుగు నిముషాల తరవాత నీరు లేకుండా శనగలు, ఉప్పు బాణలిలో వేసి కలిపి, కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. మష్రూమ్ మసాలా కావలసినవి మష్రూమ్ - 10 నూనె - 25 గ్రా. ఉల్లి తరుగు - 30 గ్రా. (పొడవుగా తరగాలి) టొమాటోలు - 50 గ్రా. అల్లం వెల్లుల్లి పేస్ట్ - టేబుల్ స్పూను జీడిపప్పు - 25 గ్రా. పాలు - 50 మి.లీ. తాజా క్రీమ్ - 20 గ్రా. బాదంపప్పు- 20 గ్రా. బిరియానీ ఆకు - 4 లవంగాలు - 4, ఏలకులు - 4 దాల్చినచెక్క - చిన్న ముక్క షాజీరా - టీస్పూను చిరోంజీ - 20 గ్రా. కర్బూజా గింజలు - 20 గ్రా. పసుపు - చిటికెడు మిరప్పొడి - టీ స్పూను ఉప్పు - తగినంత పచ్చిమిర్చి - 4, కొత్తిమీర - కట్ట తయారి టొమాటో, జీడిపప్పు, బాదంపప్పు, పాలు, షాజీరా, లవంగాలు, ఏలకులు, దాల్చిన చెక్క, ఉప్పు, మిరప్పొడి, పసుపు, పచ్చిమిర్చి, చిరోంజీ, అన్నిటినీ మిక్సీలో వేసి పేస్ట్‌లా చేయాలి. బాణలిలో నూనె కాగాక, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించాలి. బిరియానీ ఆకులు, పచ్చిమిర్చి తరుగు, ఉల్లి తరుగు వేసి గోధుమరంగులోకి వచ్చాక, మష్రూమ్స్ వేసి మెత్తబడే వరకు వేయించాలి. ముందుగా తయారుచేసి ఉంచుకున్న మసాలా పేస్ట్‌ని ఇందులో వేసి , ఉడకడం ప్రారంభమయ్యాక స్టౌని సిమ్‌లో ఉంచి సుమారు పది నిముషాలు ఉడికించాలి. కడైలోకి తీసుకుని క్రీమ్, కొత్తిమీరలతో గార్నిష్ చేయాలి. కడై వెజ్ కావలసినవి బీన్స్ తరుగు - 20 గ్రా., క్యారట్ తరుగు - 20 గ్రా. క్యాలీఫ్లవర్ తరుగు - 20 గ్రా., బఠాణీ - 20 గ్రా. బంగాళదుంప ముక్కలు - అర కప్పు (వీటిని కొద్ది నూనెలో వేయించి పక్కన ఉంచుకోవాలి) పనీర్ ముక్కలు - 100 గ్రా. క్యాప్సికమ్ ముక్కలు - 40 గ్రా. ఉల్లిపాయ - 30 గ్రా. (పెద్ద ముక్కలుగా తరగాలి) ఉల్లితరుగు - 20 గ్రా. టొమాటో తరుగు - 40 గ్రా., పసుపు - చిటికెడు మిరప్పొడి - 20 గ్రా., కొత్తిమీర తరుగు - కొద్దిగా పచ్చిమిర్చి - 5, మిరియాలపొడి - 5 గ్రా. గరంమసాలా - 5 గ్రా., ఉప్పు - తగినంత నల్ల ఉప్పు - కొద్దిగా, అల్లంవెల్లుల్లి పేస్ట్ - టీ స్పూను, షాజీరా - 3 గ్రా. డ్రై ఫ్రూట్ గ్రేవీ కోసం పల్లీలు - 10 గ్రా., జీడిపప్పు - 4 -5 పలుకులు కర్బూజా గింజలు - 10 గ్రా., బాదంపప్పు - 10 గ్రా. నూనె - 5 గ్రా. (వీటిని వేయించి, చల్లారాక కొద్దిగా నీరు కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి) తయారి బాణలిలో నూనె కాగాక షాజీరా, ఎండుమిర్చి, ఉల్లితరుగు వేసి వేయించాలి. అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక, టొమాటో ముక్కలు, మిగిలిన పదార్థాలను వేసి నూనె పైకి తేలే వరకు వేయించాలి. పెద్దగా తరిగిన ఉల్లితరుగు, క్యాప్సికమ్ తరుగు వేసి ఉడికించాలి. కూరముక్కలు, డ్రై ఫ్రూట్ గ్రేవీ పేస్ట్ వేసి ఉడికించాలి. కడాయిలోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. కడై దాల్ తడ్కా కావలసినవి కందిపప్పు - 100 గ్రా. నూనె - 25 గ్రా. నెయ్యి - 10 గ్రా. ఆవాలు - టీ స్పూను జీలకర్ర - టీ స్పూను ఎండుమిర్చి - 4 పసుపు - చిటికెడు మిరప్పొడి - అర టీ స్పూను ఉప్పు - తగినంత పచ్చిమిర్చి - 4 కొత్తిమీర - కొత్తిగా కరివేపాకు - రెండు రెమ్మలు ఇంగువ - కొద్దిగా అల్లం తరుగు - కొద్దిగా వెల్లుల్లి తరుగు - కొద్దిగా టొమాటో తరుగు - పావు కప్పు తయారి కడాయిలో నూనె వేసి కాగాక ఇంగువ, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అల్లం తరుగు వేసి దోరగా వేయించాలి టొమాటో, పసుపు, మిరప్పొడి వేసి మరోమారు వేయించాలి. కరివేపాకు, కొత్తిమీర, ఉడికించిన కందిపప్పు వేసి అన్నీ బాగా కలిసేలా రెండు నిముషాలు ఉడికించాలి బాణలిలో నెయ్యి వేసి కాగాక మిరప్పొడి వేసి కొద్దిగా వేయించి, అందు లో పప్పు వేసి కలిపి వేడివేడిగా చపాతీలతో సర్వ్ చేయాలి. పాలక్ కార్న్ కావలసినవి ఉడికించిన కార్న్ - 50 గ్రా. ఉడికించిన పాలకూర - 250 గ్రా. పచ్చిమిర్చి - 10 ఉల్లితరుగు - 10 గ్రా. క్రీమ్ - టేబుల్ స్పూను అల్లంతరుగు - 10 గ్రా. వెల్లుల్లి తరుగు - 10 గ్రా. మిరప్పొడి - 10 గ్రా. ఉప్పు - తగినంత పసుపు - చిటికెడు, నూనె - 25 గ్రా. గరంమసాలా పొడి - 5 గ్రా. తయారి ఒక గిన్నెలో పాలకూర తరుగు, పచ్చిమిర్చి తరుగు, కొద్దిగా ఉప్పు వేసి ఉడికించి, చల్లారాక మిక్సీలో వేసి పేస్ట్ చేయాలి. బాణలిలో నూనె వేసి కాగాక అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు వేసి కొద్దిగా వేగాక ఉల్లితరుగు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించాలి. పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, గరంమసాలా వేసి కలిపి, ఉడికించిన కార్న్, పాలకూర వేసి నాలుగైదు నిముషాలు ఉడికించాలి. కడాయిలోకి తీసుకుని క్రీమ్, కొత్తిమీరలతో గార్నిష్‌చేసి సర్వ్ చేయాలి. కర్టెసీ: సీమా కుక్రేజా హిమానీ దర్బార్ ధాబా,అమీర్‌పేట, హైదరాబాద్ సేకరణ: డా.వైజయంతి |
all
-
స్త్రీ తన శరీరంలో మరో జీవికి ప్రాణం పోస్తున్న సమయం, అంటే గర్భవతిగా మారేటప్పుడు రకరకాల మార్పుల్ని శరీరం సూచిస్తుంది. సహజంగా ఈ మార్పులు సున్న...
-
అందం విషయంలో కేశాలు కూడా ప్రదానం. ఎందుకంటే అందమైన జుట్టు వారి అందాన్ని మరింత ఎక్కువగా చూపెడుతుంది. అందమైన అలలులా ఎగసిపడే జుట్టు మరియు పొడవ...
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్న తర్వాత మహిళలు అంతకుమునుపు ఆహారం ఎలా తీసుకున్నా అప్పట్నుంచి మాత్రం తినే పదార్థాల్లో ఉప్పు, చక్...
-
బ్లడ్ ప్రెషర్(బిపి) అంటే తెలియని వారు ఉండరు. ఎందుకంటే ప్రస్తుత కాలంలో మారుతున్న జీవిన శెలితో పాటు ఆనారోగ్యాలు కూడా ఎక్కువవుతున్నాయి. అందులో...
-
తల్లిపాలు శిశువుకు అమృతంలాంటివి. తల్లిపాలు శ్రేష్టం, ఎంతో ముఖ్యమైన సంపూర్ణ పౌష్టిక ఆహారం. తల్లికి బిడ్డకు ఆరోగ్యవంతమైనది. ఇద్దరి మధ్య మంచి ...
-
డాక్టర్ని అడగండి నా వయసు 20. మలవిసర్జన సమయంలో మల ద్వారం నుంచి రక్తం పడుతోంది. మలవిసర్జనకు వెళ్లినప్పుడు లోనుంచి చిన్న ...
-
http://www.scribd.com/doc/119728850/DHYANAM-DANI-PADHATULU-SWAMI-VIVEKANANDA-SWAMI
-
తెలుగింటి ఆనవాళ్లు... ఆరుగజాల సొగసు చీరలు. తెలుగింటి కళలు... కమనీయకాంతుల చీరలు. తెలుగింటి సింగారాలు... సిరులొలికించే...
-
పాన్ లో ఉల్లిపాయలు ఎర్రగా వేగుతుంటే కొబ్బరి దానికి జతగా చేరితే పెరుగు ఒక అడుగు పసందుగా వేస్తుంది. మీగడ ఒద్దిగకగా ఒదిగిపోతుంది. ఇలంతా ఘుమ...
-
గైనిక్ కౌన్సెలింగ్ నేను ఇప్పుడు మూడో నెల గర్భవతిని. మా అమ్మమ్మ రోజూ పాలలో కుంకుమపువ్వు క...
Thursday, July 11, 2013
కడై వంటలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment