తమిళ వంటలు అనగానే మనకు ఠక్కున గుర్తుకువచ్చేవి ఇడ్లీ సాంబార్.
అంతేనా... ! ఇంకాస్త వెరైటీ డిషెస్ టేస్ట్ చేయలేమా!
అనుకునేవారికి బోలెడన్ని వెరైటీలు తమిళుల ఇంట పసందుగా కనిపిస్తాయి.
శాకాహారంలో ఇంపైనవి మాంసాహారంతో మజా మజా కలిగించేవి ఎన్నో ఉన్నాయి.
తమిళుల వంటల గురించి తెలుసుకుంటే స్వయంగా వారింటికి వెళ్లివచ్చినంత సంబరం కలుగుతుంది.
ఎందుకు ఆలశ్యం... ఈ తమిళ వంటలతో మీ ఇంట రుచుల పంట పండించడానికి సిద్ధం కండి.
నిల కుళంబు (దుంపలకూర)
కావలసినవి:
బంగాళదుంపలు - 150 గ్రా.
కంద - 100 గ్రా. చేమదుంపలు - 100 గ్రా.
చిలగడదుంప - 100 గ్రా.
పెండలం - 100 గ్రా.
కరివేపాకు - రెమ్మ
బెల్లం - 50 గ్రా.
కొత్తిమీర తరుగు - అర కప్పు
ధనియాల పొడి - 50 గ్రా.
కారం - 50 గ్రా.
పసుపు - 10 గ్రా.
టొమాటో - 150 గ్రా.
అల్లం - 25 గ్రా.
వెల్లుల్లి - 50 గ్రా.
ఎండుమిర్చి - 4
గరంమసాలా - టీ స్పూన్
సాంబార్ ఉల్లిపాయలు - 150 గ్రా.
ఆవాలు - టీ స్పూన్
నువ్వులనూనె - 100 మి.లీ.
ఉప్పు - తగినంత గ్రేవీ కోసం:
కొబ్బరి - 500 గ్రా.
సాంబార్ ఉల్లిపాయలు - 150 గ్రా.
చింతపండు - 200 గ్రా.
పచ్చిమిర్చి - 50 గ్రా.
కొత్తిమీర - 50 గ్రా. తయారి:
పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలు, కొబ్బరి, ధనియాలు, పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించాలి. చల్లారిన తర్వాత పేస్ట్ చేయాలి. దుంపముక్కలలో పసుపు, ఉప్పు, చింతపండు గుజ్జు వేసి ఉడికించాలి. మరొక కడాయిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేగాక కరివేపాకు, టొమాటో ముక్కలు, ధనియాలపొడి, కారం, పసుపు వేసి ఉడికించాలి. దీంట్లో పేస్ట్ చేసిన మిశ్రమం వేసి, కొద్దిగా నీళ్లు కలిపి మరో పది నిమిషాలు ఉడికించాలి. ఉడికించిన దుంప ముక్కలను పై మిశ్రమంలో కలిపి, బెల్లం వేయాలి. చివరగా గుండుమిర్చి, కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేయాలి.
వెత్తలై ఎళ్లు సాదం (తమలపాకు నువ్వుల అన్నం)
కావలసినవి:
తమలపాకులు - 100 గ్రా; మినప్పప్పు - 25 గ్రా.
శనగపప్పు - 25 గ్రా; చిన్న ఉల్లిపాయలు (సాంబార్‌లో వేసేవి) - 150 గ్రా; ఎండుమిర్చి - 10 గ్రా; పచ్చిమిర్చి - 50 గ్రా; నువ్వులు - 15 గ్రా; చింతపండు - 50 గ్రా; కరివేపాకు - 2 రెమ్మలు; కొత్తిమీర తరుగు - 50 గ్రా; సోనామసూరి బియ్యం - 500 గ్రా; ఆవాలు - 10 గ్రా; నువ్వులనూనె - 100 మి.లీ.
ఉప్పు - రుచికి తగినంత; కారం - 20 గ్రా. పొడి కోసం: జీలకర్ర - 20 గ్రా; ఇంగువ-చిటికెడు; మినప్పప్పు-25 గ్రా.
శనగపప్పు - 25 గ్రా; ఎండుమిర్చి - 10 గ్రా; కరివేపాకు - రెమ్మ తయారి:
స్టౌ మీద కడాయి పెట్టి, వేడయ్యాక మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఇంగువ కలిపి, పొడి చేయాలి. బియ్యం కడిగి, నీళ్లు పోసి అరగంట సేపు నానబెట్టాలి. తర్వాత అన్నం వండి పక్కన ఉంచాలి. కడాయిలో కొద్దిగా నూనె వేసి, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేయించాలి. తర్వాత సాంబార్ ఉల్లిపాయలు వేసి మూడు నిమిషాలు ఉంచాలి. ఉల్లిపాయలు ఉడికిన తర్వాత కారం, చింతపండు గుజ్జు, ఉప్పు, తమలపాకుల తరుగు వేసి పది నిమిషాలు ఉడికించాలి. తర్వాత అన్నం, మినప్పప్పు పొడి వేసి కలపాలి. చివరగా కొత్తిమీర, వేయించిన నువ్వులు, కరివేపాకుతో గార్నిష్ చేసి, వేడి వేడిగా సర్వ్ చేయాలి.
చెట్టినాడ్ కోళి మసాలా (కోడి మసాలా)
కావలసినవి:
ఉల్లిపాయలు - 50 గ్రా; టొమాటో - 60 గ్రా.
పచ్చిమిర్చి - 5; కరివేపాకు - 2 రెమ్మలు
కారం - టీ స్పూన్; ధనియాలపొడి - టీ స్పూన్
నూనె - 200 మి.లీ.; సోంపు - టీ స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 25 గ్రా; నిమ్మకాయలు - 2
కోడిమాంసం - 500 గ్రా. ఉప్పు: తగినంత
చెట్టినాడ్ మసాలా: మరాఠీ మొగ్గ - 5 గ్రా.
బిర్యానీ ఆకు - 5 గ్రా; లవంగాలు - 5 గ్రా; జాజికాయ - 1
దాల్చినచెక్క - 5 గ్రా; నల్లమిరియాలు - 10 గ్రా.
నల్ల ఏలకులు - 5 గ్రా; పచ్చ ఏలకులు - 5 గ్రా.
ధనియాలు - 20 గ్రా; రోజ్ పెటల్ - 5 గ్రా; జీలకర్ర - 20 గ్రా.
సోంపు - 10 గ్రా; కరివేపాకు (ఎండినది) - 20 గ్రా.
ఎండుమిర్చి - 25 గ్రా; కొబ్బరి తురుము - 10 గ్రా. తయారి:
స్టౌ పై పాన్ పెట్టి, చెట్టినాడ్ మసాలా దినుసులన్నీ వేసి, వేయించుకోవాలి. చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మరొక పాన్‌లో నూనె వేసి, సోంపు, త రిగిన ఉల్లిపాయలు వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. టొమాటో ముక్కలు వేసి ఉడికించాక ఇతర దినుసులు, ఉప్పు కలపాలి. అందులో చికెన్, చెట్టినాడ్ మసాలా కలిపి ఉడికించాలి. చివరగా కొబ్బరి, కొత్తిమీర, వేయించిన కరివేపాకు వేసి కలిపి దించాలి.
కరి మీన్ కుళంబు (చేప మటన్ పులుసు)
కావల్సినవి:
చేపలు - 500 గ్రా.
మటన్ (బోన్‌లెస్) - 500 గ్రా.
కొత్తిమీర తరుగు - కప్పు
పసుపు - 10 గ్రా.
టొమాటో - 250 గ్రా.
బిర్యానీ ఆకు - 1
కరివేపాకు - రెమ్మ
గరం మసాలా - 5 గ్రా.
ఉప్పు - రుచికి తగినంత
నూనె - 150 ఎం.ఎల్.
సాంబార్
ఉల్లిపాయలు - 250 గ్రా. పేస్ట్ కోసం...
పచ్చిమిర్చి - 10 గ్రా.
ఎండుకొబ్బరి - 500 గ్రా.
మిరియాలు - 50 గ్రా.
చింతపండు - 50 గ్రా.
ధనియాలపొడి - 25 గ్రా.
అల్లం పేస్ట్ - 25 గ్రా.
వెల్లుల్లిపేస్ట్ - 50 గ్రా.
నూనె - 50 ఎం.ఎల్
సాంబార్
ఉల్లిపాయలు - 250 గ్రా. తయారి:
స్టౌ పై పాన్ పెట్టి, 50 ఎం.ఎల్ నూనె పోసి, వేడయ్యాక పచ్చిమిర్చి, మిరియాలు, అల్లం, వెల్లుల్లి, కొబ్బరి, ఉల్లిపాయలు వేసి ఉడికించాలి. తర్వాత ధనియాలపొడి, పసుపు, చింతపండుగుజ్జు వేయాలి. చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని పేస్ట్ చేయాలి. మరొక మందపు గిన్నెను స్టౌ మీద పెట్టి 150 ఎం.ఎల్ నూనె పోసి, ఉల్లిపాయలు, తమలపాకు, కరివేపాకు, మటన్, పచ్చిమిర్చి, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. అడుగు మాడకుండా కొద్దిగా నీళ్లు పోయాలి. మటన్ ఉడికిన తర్వాత పేస్ట్ చేసిన మిశ్రమం, చింతపండు గుజ్జు వేసి, కలిపి, ఉడికించాలి. వాసన ఘుమఘుమలాడుతుండగా చేపముక్కలు వేసి, నాలుగు నిమిషాలు ఉంచి, గరం మసాలా, కొత్తిమీర చల్లి దించాలి.
చెఫ్: జి. సోమ సుందరం

No comments:
Post a Comment