ముసురుకున్న చీకట్లను తరిమేసే బ్రైట్‌నెస్ చిన్నారుల సొంతం.
తోకటపాసుల్లా పేలినా... చిచ్చుబుడ్డిల్లా ఎగిసినా
తారాజువ్వల్లా ఎగిరినా .... భూచక్రాల్లా తిరిగినా
కాకరొత్తుల్లా వెన్నెలను విరజిమ్మినావారి సంతోషాల సంబరానికి అంబరమే హద్దు.
దీపావళి వెలుగులను రాశులుగా మదినిండా నింపుకోవాలంటే చిన్నారుల కేరింతలతో జత కట్టాలి.
ఆ దివ్వెల వెలుగుకు ఈ దివ్వమైన రుచులు తోడైతే ...
హా... ఆహా! ఈ దీపావళి ఎంత స్వీటుగా ఉంటుంది!!
చెర్రీ కట్టీ
కావలసినవి:
పాలు - లీటరు; జీడిపప్పు - కేజీ; పంచదార - కేజీ; నెయ్యి - 150 గ్రా; ఏలకులు - 10 గ్రా; చెర్రీ వాటర్ (మార్కెట్లో లభిస్తుంది) - 25 ఎం.ఎల్; చెర్రీ పండ్లు - అలంకరణకు తగినన్ని; కుంకుమపువ్వు - చిటికెడు.
తయారి:
జీడిపప్పును పాలలో లేదా నీథళ్లలో నానబెట్టాలి. తర్వాత జీడిపప్పును గ్రైండ్ చే సి, పంచదార కలిపి సన్నని మంటమీద కుక్ చేయాలి. దీంట్లో నెయ్యి, ఏలకుల పొడి, చెర్రీ వాటర్, కుంకుమపువ్వు వేసి, కలిపి, మరికాసేపు ఉడికించాలి. మిశ్రమం బాగా చిక్కబడ్డాక, దించి చల్లారనివ్వాలి. ప్లేట్‌కి అడుగు భాగాన నెయ్యి రాసి, దాని మీద చిక్కబడిన మిశ్రమం వేసి, పల్చగా పరచాలి. పొడిగా అయ్యాక, డైమండ్ షేప్‌లో కట్ చేయాలి. చెర్రీ, వేయించిన జీడిపప్పులతో అలంకరించాలి.
కారా బిస్కెట్లు
కావలసినవి:
మైదా - ఒకటిన్నర కప్పు; నెయ్యి లేదా బటర్ - 2 టేబుల్ స్పూన్లు; వంటసోడా లేదా బేకింగ్‌సోడా - చిటికెడు; కారం - టీ స్పూన్; ఇంగువ - పావు టీ స్పూన్; ఉప్పు - తగినంత; నూనె - వేయించడానికి తగినంత
తయారి:
బేసిన్‌లో మైదా, వంటసోడా, నెయ్యి, కారం, ఇంగువ, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి, ముద్దలా కలపాలి. పైన మూత పెట్టి, పావు గంట ఉంచాలి. పిండిముద్దను కావలసిన పరిమాణంలో తీసుకొని, చపాతీలా ఒత్తుకోవాలి. కావలసిన షేప్‌లో కట్ చేయాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె కాగిన తర్వాత కట్ చేసినవాటిని అందులో వేసి, రెండువైపులా కాల్చి, తీయాలి. టిష్యూ పేపర్‌లో వేస్తే, అదనపు నూనె పీల్చుకుంటుంది. ఈ కారా బిస్కెట్లను డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు.
నోట్: కారం బదులు మిరియాల పొడి, జీలకర్ర పొడి... ఈ బిస్కెట్లకు రకరకాల ఫ్లేవర్లు జత చేయవచ్చు.
పిస్తా బర్ఫీ
కావలసినవి:
పాలు - 2 లీటర్లు; పంచదార - 400 గ్రా.; నెయ్యి - 150 గ్రా.; కుంకుమపువ్వు - చిటికెడు; ఏలకుల పొడి - టీ స్పూన్; పిస్తా పొడి - 200 గ్రా; పిస్తాపప్పు తరుగు - 50 గ్రా.
తయారి:
పాలను బాగా మరిగించాలి. అందులో పంచదార కలిపి, పేస్ట్ అయ్యేంతవరకు పాలను మరిగిస్తూనే ఉండాలి. అందులో నెయ్యి, కుంకుమపువ్వు, ఏలకుల పొడి వేసి కలపాలి. బర్భీ మౌల్డ్‌కి కొద్దిగా నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని అందులో సెట్ చేయాలి లేదా మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్‌లోకి తీసుకొని, కావలసిన షేప్‌లో కట్ చేసుకోవాలి. తర్వాత పిస్తాపప్పు పొడి, పిస్తా తరుగుతో గార్నిష్ చేసుకోవాలి.
డ్రై ఫ్రూట్ బర్ఫీ
కావలసినవి:
పాలు - 2 లీటర్లు; పంచదార - 400 గ్రా; నెయ్యి - 150 గ్రా; ఏలకుల పొడి - టీ స్పూన్; రోజ్ వాటర్ - 20 ఎం.ఎల్; బాదంపప్పు - 25 గ్రా; జీడిపప్పు - 25 గ్రా; కిస్‌మిస్ - 25 గ్రా; వాల్‌నట్స్ - 25 గ్రా; పిస్తాపప్పు - 25 గ్రా.
తయారి:
పాలను మరిగించి, అందులో పంచదార కలిపి మిశ్రమం చిక్కబడే వరకు గరిటెతో కలపాలి. నెయ్యి, ఏలకులపొడి జత చేసిన తర్వాత రోజ్ వాటర్, డ్రై ఫ్రూట్స్ పలుకులు కలపాలి. ప్లేట్‌కి నెయ్యి రాసి, ఈ మిశ్రమాన్ని వేసి, పల్చగా పరవాలి. ఆరిన తర్వాత కావలసిన షేప్‌లో కట్ చేసుకోవాలి. కిస్‌మిస్, పిస్తాపప్పు పలుకులతో గార్నిష్ చేసుకోవాలి.
కప్ కేక్స్
కావలసినవి:
అన్‌సాల్టెడ్ బటర్ - కేజీ; ఐసింగ్ షుగర్ - కేజీ; గుడ్లు - 20; మైదా - కేజీ; బేకింగ్ పౌడర్ - 20 గ్రా.; వెనిలా ఎసెన్స్ - 10 ఎం.ఎల్
తయారి:
ఒక గిన్నెలో అన్‌సాల్టెడ్ బటర్, ఐసింగ్ షుగర్ వేసి క్రీమ్ అయ్యేవరకు బాగా కలపాలి. దీంట్లో ఒక దాని తర్వాత ఒకటి గుడ్డులోని సొన వేస్తూ, కలపాలి. తర్వాత బేకింగ్ పౌడర్ కలిపి మైదాను జల్లించి ఆ పిండిని నెమ్మదిగా పోస్తూ బాగా కలపాలి. ఉండలు లేకుండా బాగా కలిశాక చివరగా వెనిలా ఎసెన్స్ జత చేయాలి. బేక్ చేయడానికి రకరకాల షేప్‌లున్న గిన్నెలను తీసుకొని, అందులో ఈ పిండి మిశ్రమం నింపి, 180 డిగ్రీ సెంటిగ్రేడ్‌లో ఇరవై నిమిషాలు బేక్ చేయాలి.
నోట్: కప్ కేక్‌లలో రకరకాల ఫ్లేవర్స్ కలుపుకోవచ్చు.
చాక్లెట్ ఆల్మండ్ కేక్
కావలసినవి:
మైదా - కేజీ; ఉప్పు - 20 గ్రా.; బటర్ - 200 గ్రా.; పాల పొడి - 20 గ్రా.; తేనె - 225 గ్రా.; బ్రెడ్ ఇంప్రూవర్ (మార్కెట్లో లభిస్తుంది) - 10 గ్రా.; ఈస్ట్ (మార్కెట్లో లభిస్తుంది) - 20 గ్రా; గుడ్లు - 5; పాలు లేదా నీళ్లు - 350 ఎం.ఎల్
తయారి:
ఒక గిన్నెలో మైదా, ఉప్పు, పాల పొడి, బ్రెడ్ ఇంప్రూవర్, బటర్, పాలు, గుడ్డు సొన, ఈస్ట్, తేనె వేసి కలపాలి. పిండి ముద్దగా అయ్యాక పైన మరొక గిన్నె మూత పెట్టి ఫ్రిజ్‌లో 30 నిమిషాల తరవాత పిండి బయటకు తీయాలి. కావలసినంత పరిమాణం పిండి తీసుకొని, డో షేప్ చేయాలి. రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చేంతవరకు ఉంచాలి. స్టౌ మీద కడాయి పెట్టి, నూనె పోసి, వేడయ్యాక సిద్ధం చేసుకున్న డోన ట్స్‌ను వేసి రెండు వైపులా డీప్ ఫ్రై చేయాలి. ఫ్రై చేస్తున్నంతసేపూ సన్నని మంట ఉండేలా చూడాలి. బయటకు తీసి, చల్లారిన తర్వాత షుగర్ ఫ్రీ చాక్లెట్ తురుము, పిస్తాపప్పుతో అలంకరించాలి.
చాక్లెట్ ఆల్మండ్ కేక్
కావలసినవి:
బటర్ - 1100 గ్రా. (ఒక కిలో + 100 గ్రా.); ఆల్మండ్ పౌడర్ - 600 గ్రా.; ఐసింగ్ షుగర్ - 600 గ్రా.; పంచదార - 900 గ్రా.; గుడ్లు - 24; మైదా - 700 గ్రా; బేకింగ్ పౌడర్ - 10 గ్రా; కోకో పౌడర్- 150 గ్రా.
తయారి:
ఒక గిన్నెలో గుడ్డు సొన, పంచదార వేసి బాగా గిలకొట్టాలి. మైదా, ఆల్మండ్ పౌడర్, ఐసింగ్ షుగర్, కోకో పౌడర్, బేకింగ్ పౌడర్ కలపాలి. ఈ పిండిని గుడ్డు మిశ్రమంలో వేసి బాగా కలపాలి. బటర్‌ను కరిగించి కేక్ చేసే గిన్నెల(మౌల్డ్)లో కొద్ది కొద్దిగా వేసి, చుట్టూ రాయాలి. పిండి మిశ్రమాన్ని కేక్ మౌల్డ్‌లో పోసి బేక్ చేసి, బయటకు తీయాలి. చల్లారిన తర్వాత చాక్లెట్, బాదంపప్పు పలుకులను కేక్ పైన అలంకరించాలి.
ఫిల్లింగ్ కోసం.. ఫ్రెష్ క్రీమ్ - 500 గ్రా; చాక్లెట్ - 500 గ్రా; బటర్ - 100 గ్రా.
తయారి: క్రీమ్‌ని ఒక గిన్నెలో వేసి మరిగించాలి, దాంట్లో చాక్లెట్ వేసి కలపాలి. చాక్లెట్ కరిగిన తర్వాత, బటర్ వేసి కలపాలి.
కర్టెసీ: శ్రీహరి మలిరెడ్డి
వెంకటకృష్ణరాయపురం, కాకినాడ
ఫొటోలు:ఎస్.ఎస్.ఠాకూర్

No comments:
Post a Comment