కోడి కూయకపోతే తెల్లారొచ్చేమోగానీ, కోడికూర లేకపోతే కొందరికి నిజంగానే తెల్లారదు.
ఆపూట ఈపూట ఏపూటైనా కోఢే!
ఇది బోనాల సీజన్. దావత్‌ల సీజన్.
అమ్మ చల్లగా చూడాల్సిన వేళ... అతిథులకు వేడివేడిగా నాటుకోడి వండిపెట్టండి.
నాటు కోడి తందూరి
కావలసినవి:
నాటు కోడి ఖీమా - 250 గ్రా.
ఉల్లిపాయ తరుగు - 2 టీ స్పూన్లు
పచ్చిమిర్చి - టీ స్పూన్
కారం - అర టీ స్పూన్
చీజ్ - టీ స్పూన్
కొత్తిమీర - 2 టీ స్పూన్లు
ఉప్పు - తగినంత
గరం మసాలా (ఏలకులు+లవంగాలు+దాల్చిన చెక్క చిన్న ముక్క కలిపి గ్రైండ్ చేయాలి) - అర టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
ఫుడ్ కలర్ - చిటికెడు తయారి:
కడాయిలో కొద్దిగా నూనె వేసి, కాగాక అందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలను వేసి వేయించుకోవాలి. ఖీమాలో పచ్చిమిర్చి ఉల్లిపాయల మిశ్రమం, చీజ్ తరుగు, కొత్తిమీర, గరం మసాలా, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత ఖీమా మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలు చేసి, పుల్లలకు గుచ్చాలి. కాలుతున్న బొగ్గుల మీద వీటిని కాల్చాలి. తర్వాత పుల్లలను తీసేయాలి. నాటుకోడి తందూరీని వేడి వేడిగా తింటే రుచిగా ఉంటుంది. నచ్చిన చట్నీతో కూడా వీటిని సర్వ్ చేసుకోవచ్చు.
నాటు కోడి పాలక్ వేపుడు
కావలసినవి:
కోడి మాంసం - కేజీ
ఉల్లిపాయలు - 4; పచ్చిమిర్చి - 6
ఎండుమిర్చి - 8; పాలకూర - 150 గ్రా.
అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్
గరం మసాలా (దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగాలు - 5, ఏలకులు - 3 కలిపి పొడి చేయాలి) - అర టీ స్పూన్
పసుపు - అర టీ స్పూన్; పుదీనా - 5 రెమ్మలు
ఉప్పు - సరిపడినంత; కరివేపాకు - రెండు రెమ్మలు తయారి:
కోడి మాంసం కావలసిన పరిమాణంలో కట్ చేసి ఉంచుకోవాలి.
ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని సన్నగా తరగాలి.
కోడి మాంసానికి పసుపు, మసాలా పట్టించి స్టౌ మీద పెట్టి కొద్ది సేపు ఉడికించాలి. ఐదు నిమిషాల తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మరికాసేపు ఉడికించాలి.
మరో స్టౌ మీద కడాయి పెట్టి, నూనె పోసి, కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపేస్ట్, కరివేపాకు, పుదీనా, పాలకూర వేసి వేగాక, ఉప్పు కలిపి, ఉడికిన కోడిమాంసాన్ని వేసి వే యించాలి.
దించే ముందు ధనియాల పొడి, కొత్తిమీర చల్లాలి.
నాటు కోడి మామిడికాయ కుర్మా
కావలసినవి:
కోడి మాంసం - కేజీ; ఉల్లిపాయలు - 4
వెల్లుల్లి రెబ్బలు (కచ్చాపచ్చాగా దంచాలి) - 5
గసగసాలు - 3 టీ స్పూన్లు
పచ్చికొబ్బరి - కప్పు
పుల్లని పెరుగు - కప్పు
ఉప్పు, కారం - తగినంత
జీడిపప్పు - 50 గ్రా.
పచ్చిమిర్చి - 8
అల్లం - 25 గ్రా.
పసుపు - అర టీ స్పూన్
ధనియాలు - 2 టీ స్పూన్లు
గరం మసాలా - అర టీ స్పూన్ (ఏలకులు - 2 , లవంగాలు - 6, దాల్చిన చెక్క కలిపి తయారుచేసుకోవాలి)
కొత్తిమీర తరుగు -3 టీ స్పూన్లు
మైదా - 4 టీ స్పూన్లు
నూనె - 100 గ్రా.
మామిడికాయ - 3 ముక్కలు తయారి:
కోడి మాంసం కావలసిన పరిమాణంలో ముక్కలు కోసి, శుభ్రపరుచుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చిని తరగాలి.
ముక్కలకు కారం, పసుపు మసాలా, పెరుగు కలిపి పదినిమిషాలు ఉంచాలి.
కడాయిలో నూనె పోసి, కాగాక ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలను వేయించాలి. తర్వాత మ్యారినేట్ చేసిన కోడి ముక్కలను వేసి, కలిపి, వేగనివ్వాలి. ఉప్పు కలిపి, మామిడికాయ ముక్కలు, కొబ్బరి వేసి, కొద్దిగా నీరు పోసి ఉడికించాలి.
ముక్క ఉడికిన తర్వాత ధనియాలపొడి, కొత్తిమీర చల్లి దించాలి.
నాటు కోడి 65
కావలసినవి:
నాటుకోడి మాంసం - 250 గ్రా.; గుడ్డు - 1; కార్న్ ఫ్లోర్ - 5 టీ స్పూన్లు; మైదా - 3 టీ స్పూన్లు; నూనె - 200 గ్రా.; పంచదార - చిటికెడు; మిరియాల పొడి - అర టీ స్పూన్; పచ్చిమిర్చి తరుగు - టీ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; ఎండుమిర్చి - 4; పెరుగు - ఒక కప్పు; ఉప్పు - తగినంత; అల్లం, వెల్లుల్లి పేస్ట్ - టీ స్పూన్; చిల్లీసాస్ - టీ స్పూన్; టొమాటో సాస్ - టీ స్పూన్ తయారి:
నాటు కోడి ముక్కలను ఒక్క గిన్నెలోకి తీసుకొని, దానిలో కార్న్‌ఫ్లోర్, మైదా, గుడ్డుసొన వేసి కలపాలి. కడాయిలో నూనె పోసి, కాగాక, కలిపి పెట్టిన కోడి ముక్కలను రెండు వైపులా వేయించి తీయాలి.
మరొక కడాయిలో కొద్దిగా నూనె వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, ఎండుమిర్చిని సగానికి విరిచి వేయాలి. వేగిన తర్వాత పెరుగు, చల్లీసాస్, టొమాటో సాస్, మిరియాలపొడి వేసి కలపాలి.
మంట తీసేసి పై మిశ్రమంలో వేయించిన కోడి ముక్కలను వేసి కలపాలి. కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి.
నాటుకోడి జీడిపప్పు
కావలసినవి:
నాటు కోడి - 1 కేజీ
జీడిపప్పు - 100 గ్రా.; నూనె - 100 గ్రా.
పచ్చిమిర్చి - 50 గ్రా.; టొమాటోలు - పావు కేజీ; ఉల్లిపాయలు - 100 గ్రా.
అల్లం, వెల్లుల్లిపేస్ట్ - 50 గ్రా.; పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత; ధనియాలపొడి - 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి -చిటికెడు; కొత్తిమీర - 2 టీ స్పూన్లు తయారి:
కోడి ముక్కలకు కారం, పసుపు, ధనియాలపొడి పట్టించాలి జీడిపప్పులో కొద్దిగా నీళ్లు పోసి, ఉడికించి, చల్లారిన తర్వాత ముద్ద చేయాలి. స్టౌ మీద గిన్నె పెట్టి, నూనె వేడిచేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఆ తర్వాత టొమాటో ముక్కలు, కోడి మాంసం వేసి, ఉడికించాలి. ముక్క కొద్దిగా ఉడికిన తర్వాత జీడిపప్పు ముద్ద వేసి, కొద్దిగా నీరు పోసి కలిపి ఉడికించాలి. దించేముందు కొత్తిమీర, టొమాటో ముక్కలతో గార్నిష్ చేసుకోవాలి.
చెఫ్: ప్రఫుల్
కర్టెసీ: ప్యాపిరస్ రిసార్ట్స్,తిమ్మాపూర్, మహబూబ్‌నగర్

No comments:
Post a Comment