ఈ పవిత్రమాసం శుభాలను
పూర్తిస్థాయిలో పొందడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలి. దైవంతో సంబంధం పటిష్ట
పరచుకోవాలి. దైవప్రవక్త వారి ప్రతి సున్నత్‌నూ ఆచరించడానికి ప్రయత్నించాలి. నియ
మబద్ధంగా రోజా వ్రతాన్ని పాటిస్తూ, ఐదుపూటల నమాజు, తరావీహ్, జిక్ ్ర, దురూద్, దు ఆ
ల్లో నిమగ్నం కావాలి. ‘రమజాన్’
అత్యంతశుభప్రదమైన, పుణ్యప్రదమైన మహామాసం. ఈ పవిత్ర మాసం కొన్నిరోజులు ఉందనగానే
మమతలమూర్తి ముహమ్మద్ ప్రవక్త (స) విశ్వాసుల సమాజాన్ని మానసికంగా సమాయత్తపరిచేవారు.
ఈ పవిత్ర మాసం శుభాలను పూర్తిగా పొందగలిగే వాతావరణాన్ని సృష్టించేవారు. సభలు,
సమావేశాలు ఏర్పాటుచేసి రమజాన్ ఔన్నత్యాన్ని, ప్రత్యేకతను ప్రజలకు బోధపరిచేవారు.
ఒకసారి ముహమ్మద్ ప్రవక్త (స) షాబాన్ మాసం చివరితేదీన ఏర్పాటు చేసిన
సమావేశంలో ప్రసంగిస్తూ, ‘‘ప్రజలారా! ఒక మహత్తరమైన, శుభప్రదమైన పవిత్రమాసం తన ఛాయను
మీపై కప్పబోతోంది. ఆ పవిత్రమాసంలోని ఒక రాత్రి వెయ్యి మాసాల కన్నా శ్రేష్ఠమైనది. ఆ
మాసం ఉపవాసాలను అల్లాహ్ మీకు విధిగా చేశారు. ఆ రాత్రుల్లో అల్లాహ్ సన్నిధిలో ఆరాధన
(తరావీహ్ నమాజు) చేయడం సఫిల్‌గా నిర్ణయించాడు. ఎవరైతే ఆ మాసంలో దైవప్రసన్నత, ఆయన
సామీప్యం పొందడానికి విధి కానటువంటి ఒక ఆరాధన, అంటే సున్నత్‌గానీ, సఫిల్‌గానీ
చేసినట్లయితే, అది ఇతరదినాల్లో విధిగా చెయ్యవలసిన ఆరాధనతో సమానంగా పుణ్యఫలం
లభిస్తుంది.
అలాగే ఈ మాసంలో ఒక విధిని నెరవేరిస్తే ఇతరకాలంలో 70 విధులు
నిర్వహించిన దానితో సమానం. సహనానికి ప్రతిఫలంగా స్వర్గం లభిస్తుంది. ఇది సానుభూతి
చూపవలసిన మాసం. ఈమాసంలో విశ్వాసుల ఉపాధి వృద్ధి చేయబడుతుంది. ఎవరైనా ఈ మాసంలో
దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఒక ఉపవాసికి ఇఫ్తార్ చేయిస్తే అతని పాపాలు
క్షమించబడతాయి. నరకాగ్ని నుండి విముక్తి లభిస్తుంది. అతనికి ఉపవాసం ఉన్నవారితో
సమానంగా పుణ్యం కూడా లభిస్తుంది. అయితే ఉపవాసం పాటించే వ్యక్తి పుణ్యఫలంలో ఏమాత్రం
కొరత కలగదు.’’
అపుడు ప్రజలు ‘దైవప్రవక్తా! మాలో ప్రతిఒక్కరికీ ఇఫ్తార్
చేయించేంత స్థోమత లేకపోతేనో?’ (పేదలు ఇంత గొప్ప పుణ్యానికి దూరమైపోతారు గదా!) అని
ప్రశ్నించారు.
అప్పుడు ప్రవక్త మహనీయులు ‘కొద్ది మజ్జిగతో లేక గుక్కెడు
మంచినీటితో ఇఫ్తార్ చేయించినా, దైవం అతనికి కూడా అదే పుణ్యం ప్రసాదిస్తాడు. ఎవరైనా
ఒక రోజెదారుకు (ఉపవాసి)కి కడుపునిండా భోజనం పెడితే, అతనికి అల్లాహ్ నా హౌజు (కౌసర్
కొలను) నుండి తనివితీరా తాపిస్తాడు. తరువాత ఇక అతనికి ఎప్పటికీ దాహం వేయదు.
చివరికతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఈ మాసంలోని మొదటి భాగం కారుణ్యం, మధ్యభాగం
క్షమాపణ (మన్నింపు) చివరిభాగం నరకాగ్ని నుండి విముక్తి. ఎవరైతే ఈ మాసంలో తమ సేవకుల
పనిభారాన్ని తగ్గిస్తారో, అల్లాహ్ వారిని క్షమిస్తాడు. వారికి నరకాగ్ని నుండి
విముక్తి ప్రసాదిస్తాడు (బైహఖీ- ఈమాన్ అధ్యాయం).
ఇవీ పవిత్ర రమజాన్‌కు
సంబంధించి కారుణ్యమూర్తి ముహమ్మద్ (స) మనకు బోధించిన అమృత ప్రవచనాలు. అందుకే ఈ
పవిత్రమాసంలో శుభాలను పూర్తిస్థాయిలో పొందడానికి శక్తివంచన లేకుండా కృషి చేయాలి.
దైవంతో సంబంధం పటిష్ట పరచుకోవాలి. దైవప్రవక్త వారి ప్రతి సున్నత్‌నూ ఆచరించడానికి
ప్రయత్నించాలి. నియమబద్ధంగా రోజా వ్రతాన్ని పాటిస్తూ, ఐదుపూటలా నమాజు, తరావీహ్,
జిక్,్ర దురూద్, దు ఆ ల్లో నిమగ్నం కావాలి. ఆర్థిక స్థోమతను బట్టి దానధర్మాలు
అధికంగా చేస్తూ ఉండాలి. సమాజంలోని అభాగ్యులను ఏమాత్రం విస్మరించకూడదు. సత్కార్యం
ఆచరించే ఏ చిన్న అవకాశం ఇచ్చినా దాన్ని జారవిడుచుకోకూడదు. అన్నిరకాల దుష్కార్యాలకు,
దురాలోచనలకు దూరంగా ఉండాలి. రోజా(ఉపవాసం)పాటిస్తూ అబద్ధం పలికితే, అనవసరంగా కడుపు
మాడ్చుకొని పస్తు ఉండటమే తప్ప ఎలాంటి ప్రయోజనం చేకూరదన్నారు ప్రవక్త మహనీయులు.
అనునిత్యం నాలుకపై అల్లాహ్ పవిత్రనామం నర్తిస్తూ ఉండాలి. ఈమాసంలో
ప్రత్యేకంగా నాలుగు విషయాలను శ్రద్ధగా ఆచరించమని ప్రవక్త మహనీయులు సూచించారు.
ఒకటి:
‘లాయిలా హ ఇల్లల్లాహ్’ వచనాన్ని అధికంగా స్మరించాలి.
రెండు: అపరాధాల మన్నింపుకోసం
ఎక్కువగా దైవాన్ని వేడుకోవాలి.
మూడు: స్వర్గాన్ని ప్రసాదించమని అర్థించాలి.
నాలుగు:
నరకాగ్ని నుండి విముక్తికోసం అల్లాహ్ శరణు వేడుకోవాలి.
‘లా యిలా హ ఇల్లల్లహ్,
వస్తగ్ ఫిరుల్లాహ్, అస్ అలుకల్ జన్నత, వ అవుజు బికమినన్నార్’... అంటూ పఠిస్తూ,
వీటికనుగుణంగా జీవితం గడిపితే నిస్సందేహంగా అల్లాహ్‌కృపకు పాత్రులయ్యే అవకాశం
ఉంది’’ అని ప్రవక్త మహనీయులు సెలవిచ్చారు. అల్లాహ్ అందరికీ రమజాన్ శుభాలతో
పునీతులయ్యే భాగ్యం ప్రసాదించాలని కోరుకుందాం.
No comments:
Post a Comment