all

Monday, December 3, 2012

కళ్ళు అనారోగ్యానికి దారితీసే 7 అసాధారణ విషయాలు

కొన్నిసార్లు మనకు తెలయకుండానే మన కళ్ళు అలసటకు గురి అవుతుంటాయి. చాలా వరకు కళ్ళు అలసటకు కారణం కంప్యూటర్ స్ర్కీన్స్. నిజానికి దానికి కారణం అయ్యే ఒక సిండ్రోమ్ ఉంది దాన్నే కంప్యూటర్ ఐ స్ట్రెస్ అంటారు. కానీ అవన్నీ మనకు పట్టనట్టు బద్దకంతో మనమే ఇటువంటి చిన్న చిన్న సస్యలను అంతగా పట్టించుకోము. అయితే ఎప్పుడు ఐతే కళ్ళు ఒత్తిడికి గురిఅవుతాయో అప్పుడు కారణాలు అనేకంగా కనిపిస్తాయి. కళ్ళు మసకగా కనిపిస్తాయి అందుకు కంటి అద్దాలు అవరం. ఒక వేళ అద్దాలు వాడుతున్నట్లైతే ఆ అద్దాల పవర్ వల్ల కూడా కళ్ళ మీద స్ట్రెస్ పెరుగుతుంది. దాంతో ఇతర సమస్యలు ఎదురవుతాయి. తలనొప్పి, కళ్ళ నొప్పులు, కళ్ళ మంటలు ఇలా . వైద్య పరిభాషలో ఆస్తనోఫియా అంటారు. కానీ ఈ అస్తనోఫియాకు ఎలా లక్షణాలు కనబడవు. అయితే మనం వాటిని తెలుసుకోవచ్చు అదేలాగో చూద్దాం....కళ్ళకు అలసటకు కారణం అయ్యే వాటిని కొన్నింటిని తెలుసుకుందాం...
7 things that can strain your eyes

1. పడుకొని పుస్తకాలు చదవడం: పుస్తక ప్రియులు, కొంత మంది ఉంటారు. వారు ఎన్ని పుస్తకాలు చదివినా తనివి తీరదు. వారు పడుకొని, కూర్చొని, లాన్ లో పడుకొని చదవడం వీరికి ఒక ఓ పిచ్చి హాబీ. అయితే పడుకొని చదడం కళ్ళకు అలసటకు గురి అవుతాయి. ఇది చూపును మరల్చుతుంది. దాంతో కళ్ళు మరింత చిట్లించి చూడటం లేదా చిన్నగానో, పెద్దగానో చూసి చదవడం వల్ల కళ్ల మీద మరింత ఒత్తిడి పడుతుంది.
2. కంప్యూటర్ ఐ స్ట్రెయిన్: రోజంతా కంప్యూటర్ ముందు కూర్చొని పనిచేయడం వల్ల తప్పని సరిగా అలసటకు గురిఅవుతాయి. కళ్ళు మండుతాయ. తీవ్రనొప్పికి గురి అవుతాయి. ఇటువంటి సమస్యలనుండి బయటపడాలంటే తప్పనిసరిగా యాంటీ గ్లేర్ గ్లాసెసులను ఉపయోగించాలి.
3. టీవీ చూడటం: కంప్యూటర్ లాగే టెలివిజన్ స్ర్కీన్ కూడా. కాబట్టి టీవీ చూసే సమయంలో సాధ్యమైనంత వరకూ మినిమం డిస్టెన్స్ లో చూడాలి . లేదంటే రోజంతా ఇలాగే ఎక్కువ అలసటకు గురికావల్సి ఉంటుంది.
4. ప్రయాణంలో బుక్ రీడింగ్: ప్రయాణంలో బుక్ చదవడం కూడా కళ్ళకు హానీ కలిగిస్తుంది. అది కారులో కానీవ్వండి లేదా ట్రైయిన్ లో కానీవ్వండి ఇది చెడ్డ అలవాటు. చదివేటప్పటుడు వాహనాలు ఇటు అటుగా వెళ్ళినప్పుడు కాన్ సన్ ట్రేషన్ మరలుతుంది. అప్పుడు కూడా కళ్ళ మీద ఎక్సాట్రా స్ట్రెయిన్ పడుతుంది.
5. ఎండ: కళ్ళకు ఎటువంటి రక్షణ లేకుండా ఎండలో అలాగే బయట తి రగడం వల్ల కూడా కళ్ళు అలసట చెంది, కళ్ళ క్రింద ముడుతలు ఏర్పడుతాయి. అంతే కాకుండా సూర్యకిరణాల్లో ఉండే ఆల్ట్రావయోలెట్ కిరణాలు కళ్ళకు చాలా హానీ కలిగిస్తాయి. కళ్ళ వెంబడీ నీరు కారేలా చేస్తాయి.
6. రాత్రి సమయంలో డ్రైవింగ్: కళ్ళు అలసిపోవడానికి నైట్ డ్రైవింగ్ కూడా ఒక కారణం. రాత్రి సమయంలో ఎక్కువగా హైవేలో డ్రైవ్ చేయడం వల్ల మరుసటి రోజు ఉదయానికి కళ్ళు ఎర్రబడి అందవిహీనంగా ఉండి కళ్ళు మండుతుంటాయి.
7. నీడిల్ వర్క్: ఆశ్చర్యం కానీ ఇది నిజం. నీడిల్ వర్క్ (సూదితో కుట్లు మ రియు అల్లికలు వేయడం వల్ల కూడా కళ్ళు అలసటకు గురి అవుతాయి. సూదితో కుట్లు కుట్టడానికి ప్ర్యేతేకమైన కాంసెంట్రేషన్ ఉండాలి. కళ్ళమీద ఎక్కు ఒత్తిడి ఉంటుంది. కాబట్టి ఇటువంటి చిన్న చిన్న చిట్కాలను ఉపయోగించి కళ్ళకు అలసటను, ఒత్తిడిని కలిగించే ఇటువంటి వాటికి దూరంగా ఉండటం ఎంతైన అవసరం.

మధుమేహంతో మెదడుకు ముప్పెంత.. తీసుకోవల్సిన జాగ్రత్తలు..

డయాబెటిస్ ఎన్ని రకాలుగా శరీరానికి చేటు చేస్తుందో అందరికీ తెలిసిందే.మెదడూ అందుకు మినహాయింపు కాదు. చక్కెర వ్యాధి వల్ల మెదడుకు కలిగే కీడు అటు పక్షవాతం రూపంలోనూ ఇటు మతిమరపుతో పాటు ఇతరత్రా సమస్యల రూపంలోనూ ఉండవచ్చు. చక్కెరవ్యాధి కారణంగా మెదడుపై పడే అనేక దుష్ర్పభావాలు, వాటి నుంచి కాపాడుకోవడం ఎలా...
Can Diabetes Cause Brain Stroke
అన్ని అవయవాల్లాగే డయాబెటిస్‌వల్ల మెదడుపైనా దుష్ర్పభావం పడుతుంది. ఇది ప్రధానంగా పక్షవాతం రూపంలో ఉంటుంది. డయాబెటిస్ లేకపోతే పక్షవాతం వచ్చే రిస్క్ 21 శాతం తక్కువ. కారణం స్వచ్ఛమైన నీళ్లలో కాస్తంత చక్కెర వేస్తే అది గాఢమైనట్లే... రక్తంలో చక్కెర కలిసినా రక్తప్రవాహమూ చిక్కబడి మామూలు కంటే ఎక్కువ ఒత్తిడితో వెళ్లాల్సి వస్తుంది. రక్తం మెదడుకు వెళ్లే రక్తనాళాల్లో చిక్కబడితే అది బ్రెయిన్‌స్ట్రోక్ (పక్షవాతాని)కి దారితీయవచ్చు. చిక్కటి రక్తం రక్తనాళాల్లో ప్రవహించే సమయంలో సాధారణ రక్తం కంటే మరింత ఒత్తిడితో ప్రవహించాల్సి వస్తుంది. దాంతో రక్తపోటూ పెరుగుతుంది. ఫలితంగా ఒక్కోసారి రక్తనాళాలు చిట్లే ప్రమాదం ఉంది. అంతేకాదు... రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ కణాల అడ్డంకుల వల్ల, రక్తంలో పెరిగిన చక్కెర, కొవ్వుల కారణంగా రక్తనాళం లోపలి గోడలు గరుకుగా మారడం వల్ల కూడా రక్తప్రవాహానికి అవరోధం కలిగే అవకాశం ఉంది. ఈ కారణాలన్నీ బ్రెయిన్‌స్ట్రోక్‌కు దారితీయవచ్చు. ఇలా డయాబెటిస్ అన్నది కేవలం మెదడును మాత్రమే గాక గుండె, మూత్రపిండాలు వంటి అనేక అవయవాలను దెబ్బతీయవచ్చు.
మెదడుపై డయాబెటిస్ ప్రభావం ఎలా: డయాబెటిస్ అన్నది కేవలం రక్తనాళాల్లో రక్తం చిక్కబడటం లేదా రక్తనాళాలను చిట్లేలా చేయడం ద్వారానే గాక... నేరుగా మెదడు కణాలపై కూడా ప్రభావం చూపుతుంది. చక్కెర ఎక్కువగా ఉన్న రక్తం మెదడు కణాలను చేరినప్పుడు ఆ కణాల్లోని జీవక్రియ (సెల్యులార్ మెకానిజం)లో సైతం మార్పులు రావచ్చు. వెరసి ఆ మార్పులన్నీ ముందుచెప్పినట్లుగా పక్షవాతాని (స్ట్రోక్)కి గాని లేదా మతిమరపు (డిమెన్షియా)కి గాని దారితీయవచ్చు.
మెదడుపై మరిన్ని ఇతర ప్రభావాలు.... డయాబెటిస్ వల్ల మెదడుపై పడే ప్రభావాల్లో ముఖ్యమైన పక్షవాతం, మతిమరుపుతో పాటు మిగతావి ఇలా ఉంటాయి. అవి... అయోమయం లక్ష్యాన్ని గుర్తించడంలో లోపం. మనసును లగ్నం చేయడం లేదా మనసును కేంద్రీకరించే శక్తి తగ్గడం. విషయంపై దృష్టి నిలిపేశక్తి తగ్గడం. ఒక నిర్ణయానికి వచ్చే శక్తి లోపించడం.ఇక మతిమరపు విషయానికి వస్తే అది రక్తనాళాల కారణంగా వచ్చే వ్యాస్కులార్ రకం అయి ఉండవచ్చు లేదా ఒక వయసు తర్వాత వచ్చే అల్జైమర్స్ తరహాదీ కావచ్చు.
తక్కువ చక్కెరతోనూ మెదడుపై దుష్ర్పభావం... రక్తంలో చక్కెరపాళ్లు ఎక్కువైనప్పుడు మాత్రమే కాదు... అవి తక్కువ కావడం వల్ల కూడా మెదడుపై ప్రభావం పడుతుంది. రక్తంలో చక్కెరపాళ్లు తగ్గడం వల్ల మెదడు కణాలకు పోషకాలు గాని, ఆక్సిజన్ గాని అందవు. ఒక్కోసారి... చక్కెరను అదుపులో పెట్టాల్సిన మందుల మోతాదు ఎక్కువ కావడం వల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. చక్కెర రోగులు క్రమం తప్పకుండా ఆహారాన్ని తీసుకోవడం, అదీ సరైన సమయానికి తీసుకోవడం అవసరం. అలా తగినంత ఆహారం తీసుకోకుండా మందులు మాత్రమే తీసుకోవడం వల్ల అవి రక్తంలో ఉన్న చక్కెరపాళ్లను మరింతగా తగ్గిస్తాయి. దాంతో రోగుల ప్రవర్తనలో మార్పులు, అయోమయం, ఎప్పుడూ నిద్రవస్తున్నట్లుగా అనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇలాంటి రోగులకు సరైన సమయంలో చికిత్స అందకపోతే ఒక్కోసారి అది మూర్చ (ఫిట్స్) లేదా పక్షవాతం లేదా కోమాకు దారితీయవచ్చు. ఇలా రక్తంలో చక్కెరపాళ్లు తగ్గడాన్ని హైపోగ్లైసీమియా అంటారు.
తలనొప్పినీ నిర్లక్ష్యం చేయకండి.. డయాబెటిస్ కారణంగా మెదడుకు ట్యూబర్క్యులోసిస్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. డయాబెటిస్ ఉంటే వ్యాధినిరోధకశక్తి క్రమంగా తగ్గుతుంది. ఫలితంగా ఇలాంటి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు ఎక్కువ. అందుకే మీకు ఒకవేళ డయాబెటిస్ ఉంటే తలనొప్పిని నిర్లక్ష్యం చేయకండి. మీకు తరచూ తలనొప్పి వస్తూ... దాని తీవ్రత క్రమంగా పెరుగుతూ పోతుంటే న్యూరాలజిస్టును సంప్రదించడం అవసరం.
తీసుకోవల్సిన జాగ్రత్తలు: 1. స్థూలకాయం ఉన్నవారు డయాబెటిస్ వచ్చే రిస్క్‌ను తగ్గించుకునేందుకు బరువును అదుపులో పెట్టుకోవడం, వాకింగ్ చేయడం వంటి జాగ్రత్తలు పాటించాలి. పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. రోజూ కనీసం 45 నిమిషాల చొప్పున వారానికి ఐదు రోజులు వాకింగ్ చేయాలి.
2. ఆహారంలో ముదురాకుపచ్చటి ఆకుకూరలు, తాజా పండ్లు ఉండాలి. మంచి ఆహారం అంటే... మనం తీసుకునే ఆహారంలో సగం ఆకుకూరలు, పండ్లు, మిగతా సగంలో ప్రోటీన్లు, ధాన్యాలు ఉండేలా చూసుకోవాలి. దాంతోపాటు రోజూ 250 ఎం.ఎల్. పాలు తాగాలి. ఆహారం తర్వాత ఒక కప్పు పెరుగు తీసుకోవాలి. ఉప్పు, తీపి పదార్థాలు తగ్గించడం కంటే మంచి సూచన మరొకటి లేదు.
3. డయాబెటిస్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు వారు సూచించిన మందులు క్రమం తప్పకుండా తీసుకోవాలి.
4. ఒకవేళ డయాబెటిస్‌ తో పాటు రక్తపోటు లేదా పొగతాగే అలవాటు ఉంటే అలాంటివాళ్లు క్రమం తప్పకుండా డాక్టర్ల సూచనల ప్రకారం యాస్పిరిన్, క్లోపిడోగ్రెల్ వంటి మందులను తీసుకోవాల్సి ఉంటుంది.
5. డయాబెటిస్ ఉన్నవారు క్రమం తప్పకుండా రక్తపరీక్ష, క్రియాటినిన్, యూరిన్ పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. గుండె, కెరోటిడ్, కండ్ల, నరాల పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి.
6. ఒకవేళ బ్రెయిన్ స్ట్రోక్ లక్షణాలు కనిపిస్తున్నా, వచ్చినా... కనీసం అది వచ్చిన 4 నుంచి 5 గంటలలోపు రోగిని ఆసుపత్రికి చేర్చి టీపీఏ అనే చికిత్స చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల కనీసం 50-60 శాతం రోగులు మునుపటిలా కోలుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత వాళ్లకు అటర్వస్టాటిన్స్ అనే మందులు ఇవ్వడం వల్ల మళ్లీ స్ట్రోక్ రావడానికి, ఒకవేళ వచ్చినా దాని తీవ్రతను తగ్గించడానికి అవకాశం ఉంటుంది.

స్పైసీ ఫుడ్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. సైడ్ ఎఫెక్ట్స్..

ఆహారం మరింత రుచిగా తినాలనుకొనే వారు ఘాటుగా మసాలాలను దంటిస్తారు.లేదంటే కారంను ఎక్కువగా వేస్తుంటారు. ఈ మసాలా ధినుసుల ఉపయోగించడం వల్ల వండే పదార్థాలు, రంగు, రుచి, వాసన మారిపోతాయి. అయితే వంటకాల్లో ఉపయోగించే ఈ మసాలాలు చాలా రకాలు ఉన్నాయి. కొన్ని ప్రత్యేకమైనవి ఆయా దేశాలకు మాత్రమే పరిమితంగా ఉంటాయి. మన భారత దేశంలో మాత్రం మనం వండే వంటకాల్లో మసాలా ధినుసులు చాలా రకాలు ఉన్నాయి. అందులో పసుపు, ధనియాలపొడి, కారం, మరియు ఇతర ఆహారాలు . ఈ ఘాటైన మసాలాలు ఆరోగ్యానికి మాత్రమే కాదు..బరువు తగ్గించడానికి కూడా బాగా సహాయపడుతాయి. చాలా మంది కారంను తినడం వల్ల బరువును కోల్పోవచ్చని నమ్మతారు. అందుకే పచ్చిమిర్చి మరియు మరికిన్ని ఘాటు మసాలా దినుసులను ఫ్యాట్ బర్నింగ్ ఫుండ్ అని అంటుంటారు. వీటిలో ఫ్యాట్ మరియు క్యాలరీస్ తక్కువ. ఐతే కారం తినడం వల్ల బరువు తగ్గుతామంటారా? స్పైసీ లను తినడం వల్ల ఉపయోగాలు మరియు నిరుపయోగాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం....
spicy foods aid weight loss

స్పైస్ ఫుడ్ ను తినడం వల్ల ఉపయోగాలు(ప్రయోజనాలు):
1. చాలా ముఖ్య మైన ప్రయోజనం స్పైసీ ఫుడ్ ను తినడం వల్ల బరువును కోల్పొతాం. ఎప్పుడైనా సరే మీరు స్పైసీ ఫుడ్ ను తినడం వల్ల శరీరంలోనున్న ఫ్యాట్ ను కరిగించేస్తుంది. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరంలో వేడి పుట్టిస్తుంది. దానికి కారణంగానే కొన్ని కాలోరీలను కోల్పొవచ్చు.
2. స్పైసీ ఫుడ్ ను తీసుకోవడం వల్ల నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేందుకు సహాయపడుతుంది. కొన్ని రకాల స్పైసీ ఫుడ్ ను తీసుకోవడం వల్ల మీకు చాలా సేపు వరకూ ఆకలి అనిపించదు. కాబట్టి చిరుతిండ్ల మీద మీకున్న ఆశను కూడా కంట్రోల్ చేస్తుంది.
3. స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని అనారోగ్యసమస్యలను నయం చేస్తుంది. జలుబు, తలనొప్పి, ముక్కులో కారడం, దగ్గు, ఉన్నప్పు కొంచెం స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల నాసిల్ పాసేజ్ ను తెరచుకొనేలా చేసి మిమ్మల్ని చురుగ్గా ఉండేలా చేస్తుంది.
4. చాలా వరకూ స్పైసీ ఫుడ్స్(రెడ్ చిల్లి, బ్లాక్ పెప్పర్)లో కాన్ట్సిపేషన్ కలిగి ఉంటుంది. దాని వల్ల వాటిని అంత కారంగా (ఘాటుగా)ఉంచుతుంది . కాబట్టి వీటిని తీసుకోవడం వల్ల ఫ్యాట్ ను కరిగిస్తుంది.
5. ఇంకా ఈ స్పైసీ ఫుడ్ ను తీసుకోవడం వల్ల శరీరంలోని విషాలను బయటకు నెట్టివేయబడుతుంది. దాంతో శరీరం శుభ్రపడుతుంది.
స్పైసీ ఫుడ్స్ తో సైడ్ ఎఫెక్ట్స్:
1. స్పైసీ ఫుడ్స్ వల్ల శరీరానికి మంచిది అయితే పరిమితంగా తీసుకొన్నప్పుడు మాత్రమే . మోతాదుకు మించి స్పైసీ ఫుడ్స్ ను తీసుకోవడం వల్ల కడుపులో సమస్యలను ఏర్పరుస్తుంది. డైసెంటరీ, ఇన్ డైజషన్, స్టొమక్ అల్సర్, ఇన్ ఫ్లమేషన్ వంటి సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.
2. స్పైసీ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల నోరు పగులుతుంది. నోరు మంట పెడుతుంది. ఇంకా నోటి అల్సర్ కు దారి తీస్తుంది.
3. అధింకంగా స్పైసీ ఫుడ్ ను తీసుకోవడం వల్ల కడుపులో యాసిడ్ (ఎసిడి )ఏర్పడి వయస్సు అయ్యేకొద్ది ప్రభావం చూపిస్తుంది.
4. స్పైసీ ఫుడ్స్ వల్ల నోట్లో పళ్ళకు హాని కలిస్తుంది. దాహాన్ని పెంచుతుంది. ఎక్కువ స్పైసీ ఫుడ్స్ తినేవారిలో శరీరంలో అధికంగా దుర్వాసనతో కూడిన చెమట పడుతుంటుంది.
5. కాబట్టి స్పైసీ ఫుడ్స్ వల్ల ప్రయోజనాలు, సైడ్ ఎఫెక్ట్స్ తెలుసుకొని, తగిన మోతాదులో తీసుకోవడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా మంచిది.

మానసిక స్థితిని మార్చే ఆహారం

డిప్రెషన్‌ను ఆహారం ద్వారా చికిత్స చేయవచ్చా? అనే కోణంలో ప్రపంచంలో తొలిసారిగా ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరికి ఎక్కువ పండ్లు, కూరగాయలు, చేపలు, బఠాణీలు, తక్కువ చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులున్న ఆహారాన్ని ఇచ్చారు. ఇంతకు ముందు జరిగిన అధ్యయనంలో డిప్రెషన్‌ ప్రమాదం తగ్గడానికి, ఆరోగ్యకరమైన ఆహారానికి సంబంధం ఉందని వెల్లడైంది. కానీ, ఇప్పుడు డిప్రెషన్‌ ఉందని నిర్ధారణ అయిన తర్వాత దీని లక్షణాలు తగ్గించడానికి ఆహారం తోడ్పడుతుందా? అనే కోణంలో తొలిసారి పూర్తిస్థాయి క్లినికల్‌ ట్రయల్‌ నిర్వహించారు. ఒక వేళ ఇది విజయవంతం అయితే, ప్రపంచ వ్యాప్తంగా డిప్రెషన్‌ బాధితులు మానసిక వైద్యులు సూచించే మందులను వాడడం తగ్గే అవకాశముంది. డిప్రెషన్‌తో బాధపడతున్న మూడొంతుల మంది చికిత్సలో భాగంగా ఇచ్చే యాంటి డిప్రెసెంట్‌ మందులకు లేదా సైకోథెరపీకి స్పందించరు. ఇలాంటి వారికి ఆహార పదార్థాలు కీలకం కానున్నాయి అని పరిశోధకులు పేర్కొన్నారు. 'ప్రపంచ వ్యాప్తంగా మానసిక వైకల్యంలో డిప్రెషన్‌ది అగ్రస్థానం. 2020 నాటికి ఇది ప్రపంచంలో రెండో స్థానాన్ని ఆక్రమిస్తుందని అంచనా. మనకున్న సమర్ధవంతమైన చికిత్స పద్ధతులు వాస్తవంగా పరిమితమే. డిప్రెషన్‌తో బాధపడేవారికి సహకరించేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలి' అని డికిన్‌ యూనివర్శిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన ప్రధాన పరిశోధకులు ఫిలిస్‌ జక తెలిపారు.



అధ్యయనం కోసం 200 మందిని ఎంపిక చేశారు. వీరిలో కొంత మందికి పోషకాహారం ఇచ్చారు. కౌన్సెలింగ్‌ కూడా చేశారు. ఇంకో గ్రూపుకు నియంత్రణ పద్ధతులు అమలు చేశారు. ఈ రెండు గ్రూపులను మూడు నెలలపాటు పరిశీలించారు. సంప్రదాయ ఆహారశైలితో పోలిస్తే, పోషకాహారం ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల కొంత మెరుగుదల కనిపించింది. మధ్యస్థంగా మాంసం తీసుకోవడం వల్ల మహిళల్లో మానసిక అనారోగ్య ప్రమాదం తగ్గింది. 'మానసిక ఆరోగ్యానికి మంచి ఆహారం ముఖ్యం. ప్రధానంగా చేపలు. ఇందులో ఓమెగా-3 ఫ్యాటి యాసిడ్స్‌ ఉంటాయి. అధికంగా మంచి కొవ్వు పదార్థాలుంటాయి. ఎక్కువగా ఫోలేట్‌ ఉండే ఆకు కూరలు మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇవే కాక తృణధాన్యాలు, కాయధాన్యాలు, చిక్కుడు గింజలు తీసుకోవాలి' అని జక తెలిపారు.

మూర్ఛపై అపోహలు తొలగాలి


డాక్టర్‌ గోపాళం శివన్నారాయణ
న్యూరాలజిస్ట్‌
గిరిజ న్యూరోసెంటర్‌
కామయ్యతోపు పెట్రోలు బంకు ఎదురు రోడ్డు, విజయవాడ. ఫోన్‌ : 0866-2586600



రక్తంలో ఏ జబ్బు వచ్చినా బయటికి జ్వరంలాగా వస్తుంది. పేగులకు జబ్బు చేస్తే వాంతులు, చిన్న పేగులకు జబ్బు చేస్తే విరోచనాలు వస్తాయి. ఊపిరితిత్తులకు జబ్బు చేస్తే వచ్చేది దగ్గు. అలాగే మెదడుకు ఏ జబ్బు చేసినా అది బయటికి మూర్ఛలాగా కనిపిస్తుంది. మూర్ఛ వ్యాధిగ్రస్తులను భూతర అని, దయ్యం అని, ఉద్యోగాలకు పనికిరారని, శాపగ్రస్తులని రకరకాల పేర్లు పెట్టారు. పెళ్లి చేసుకోవడానికి పనికిరారని అంటుంటారు. ఇవన్నీ అపోహలే. జనాల్లో ఉన్న అమాయకత్వం, అజ్ఞానం వల్ల మూర్ఛ వచ్చిన వాళ్లను సాంఘికంగా హింసిస్తుంటారు. క్రమం తప్పకుండా మందులు వాడటం వల్ల ఫిట్స్‌ను నియంత్రించొచ్చు. ఈ మందుల వల్ల చెడు ప్రభావాలు చాలా తక్కువేనని అంటున్నారు ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ గోపాళం శివన్నారాయణ. ఈ వారం మూర్ఛపై జనాల్లో ఉన్న అపోహలను, చికిత్సను గురించి వివరిస్తున్నారు. ఈ వివరాలు....

అవగాహన లేకే ఈ వివక్ష
మెదడు విద్యుత్‌ ప్రసరణ వల్ల పనిచేస్తుంది. దీంతో మెదడు శరీరంలో ఒక భాగం నుంచి ఇంకో భాగానికి సంకేతాలను చేరవేస్తుంది. మెదడులో జరిగే ప్రతీ చర్యలో విద్యుత్‌ ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే అకస్మాత్తుగా ఎక్కువ విద్యుత్‌ ఉత్పత్తి అవుతుంది. ఇది మెదడులో ఒక భాగం నుంచి ఇంకో భాగానికి వ్యాపిస్తుంది. ఇలా బయటపడడాన్ని ఫిట్స్‌ లేదా మూర్ఛ అంటారు. జ్వరం వచ్చిన వాళ్లను, వాంతులు వచ్చిన వాళ్లను, దగ్గు, జలుబు వచ్చిన వాళ్లను ఏమనట్లేదు. కానీ మూర్ఛ వచ్చిన వాళ్లను మాత్రమే శాపగ్రస్తులంటున్నారు. మూర్ఛ వచ్చిన వాళ్లను బడికి రానివ్వడం లేదు. పెళ్లి చేసుకోవడానికి వెనకాడుతున్నారు. పెళ్లయినా మూర్ఛ ఉందని వదిలేసిన వాళ్లున్నారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు. ఇవన్నీ అమానుషం. దీనికి ముఖ్యమైన కారణం మూర్ఛ గురించి అవగాహన లేపోవడం, అర్థం చేసుకోలేకపోవడం. వైద్యపరంగా కంటే మూర్ఛకు సాంఘికంగా ఎక్కువ ఇబ్బందులున్నాయి.

గర్భిణులు మందులు వాడొచ్చా ?
మూర్ఛ వ్యాధిగ్రస్తుల్లో అధికంగా మహిళలే తీవ్ర ఇబ్బందులకు గురవుతారు. చిన్న పిల్లలైతే బడికి రానివ్వకపోవడం, పెళ్లీడుకు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రాకపోవడం, గర్భందాల్చినప్పుడు ఏమవుతుందోనని అందోళన చెందడం జరుగుతాయి. మూర్చ వ్యాధి ఉన్నా కూడా పెళ్లి చేసుకుని మందులు వాడవచ్చు. గర్భందాల్చిన తర్వాత కూడా మూర్ఛ మందులు వాడొచ్చు. ఏ మందులు వాడాలో వైద్యులు సూచిస్తారు. గర్భిణిగా ఉన్నప్పుడు మందులు వాడితే పిండానికి ఏమైనా హాని కలుగుతుందా? అనే అనుమానం భార్యభర్తల్లో ఉంటుంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రమాదం లేదని అనుభవంలో తేలింది. మూర్ఛ ఉన్న గర్భిణులు ఆరోగ్యవంతుడైన బిడ్డకు జన్మనిచ్చారు. డాక్టర్‌ సలహా పాటించి, ఫిట్స్‌ బాగా కంట్రోల్‌ అయినప్పుడు గర్భం దాల్చడం ఒక పద్ధతి.

ముందుగా గుర్తించొచ్చా ?
మూర్ఛను ముందుగా గుర్తించే వీలు లేదు. కొంత మంది చిన్న పిల్లలకు జ్వరం వచ్చినప్పుడు మూర్ఛ వస్తుంది. వీరిలో కొంత మందిలో రెండు కంటే ఎక్కువ సార్లు మూర్ఛ రావడం, వచ్చి ఎక్కువసేపు బాధపెట్టే వారికి భవిష్యత్తులో రావొచ్చు. తలకు దెబ్బలు తగిలిన వారిలో ఫిట్స్‌ రావడానికి అవకాశముంది. మెదడుకు రక్తప్రసరణ తగ్గి పక్షవాతం వచ్చిన వారిలో రావొచ్చు. కిడ్నీలు, లివర్‌ ఫెయిల్‌ అయినప్పుడు, ఊపిరితిత్తుల్లో తీవ్ర జబ్బులున్నవారిలో, గుండె జబ్బులున్నవారిలో ఫిట్స్‌ రావడానికి అవకాశముంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో షుగర్‌ డౌన్‌ అవ్వడం వల్ల కూడా ఫిట్స్‌ వచ్చే అవకాశముంది.

నిర్ధారణ పరీక్షలు
ఫిట్స్‌ నిర్ధారణకు సీిటి స్కాన్‌ పరీక్ష చాలు. ఈ పరీక్షను ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా చేస్తున్నారు. ఇదేకాక ఎలక్ట్రోఎన్‌సెఫిలోగ్రాం (ఇఇజి) అనే పరీక్ష చేస్తారు. మందులు ఇస్తున్నా ఫిట్స్‌ నియంత్రణలోకి రానప్పుడు మాత్రమే ఇఇజి పరీక్ష అవసరం. ఫిట్స్‌లో కొన్ని రకాలుంటాయి. అవి ఏ రకమైనవో తెలుసుకోవడానికి ఇఇజి పరీక్ష చేస్తారు. మెదడు వాపు వచ్చినప్పుడు మెదడులో నీరు తీసి పరీక్ష చేయాల్సి ఉంటుంది. ఎక్కువ శాతం జ్వరం వచ్చి, జ్వరం మీద మూర్ఛ వచ్చినప్పుడు అది మెదడువాపు వ్యాధి అవునో? కాదో? నిర్ధారణ చేసుకోవాలి. కిడ్నీలు, కాలేయం బాగున్నాయా? లేదా? రక్తకణాలు బాగున్నాయా? లేవా? షుగర్‌ ఎలా ఉందో? తెలుసుకోవడానికి పరీక్షలు చేస్తారు.

ఆపరేషన్‌ అవసరమా ?
నిజంగా చెప్పాలంటే, చాలా తక్కువ మందికి మాత్రమే ఆపరేషన్‌ అవసరం. నా అభిప్రాయం ప్రకారం 10000 మందిలో కేవలం ఒక్కరికే ఈ ఆపరేషన్‌ అవసరం. రోజుకు రెండు రకాల మందులు తీవ్రస్థాయిలో వాడినా కూడా, రోజుకు రెండు మూడు ఫిట్స్‌ వస్తుంటాయి. ఈ ఫిట్స్‌తో వీరి జీవనం కష్టమవుతుంది. దీన్ని రిఫ్రాక్టివ్‌ ఎపిలెప్సీ అంటారు. అలాంటి వారికే ఆపరేషన్‌ అవసరం.

అపోహలు
మూర్ఛ వచ్చిన వారిని భూతం, దయ్యం, శాపగ్రస్తులని, తెలివితేటలు సరిగ్గా ఉండవని, వీరు చదువుకోకూడదని, పెళ్లీలు చేసుకోకూడదని, ఉద్యోగాలు చేయకూడదనే అపోహలున్నాయి. ఇవన్నీ అవాస్తవాలు. వాస్తవానికి మూర్ఛవ్యాధి ఉన్న వాళ్లు డ్రైవింగ్‌కు పనికిరారు. ఎందుకంటే డ్రైవింగ్‌ చేసేటప్పుడు ఫిట్స్‌ వస్తే ప్రమాదాలు సంభవిస్తాయి. నిప్పు దగ్గర ఉంటే కాలిపోతారు. నీళ్ల దగ్గర ఉంటే మునిగిపోతారు. యంత్రపరికరాల దగ్గర పనిచేసేటప్పుడు ఫిట్స్‌ వస్తే, నలిగిపోవడం జరుగుతుంది. ప్రమాదాలకు గురయ్యే పనులు కాకుండా మిగతా పనులు చేసుకోవచ్చు. మూర్ఛ వ్యాధి వంశపారంపర్యంగా రాదు. వంశపారంపర్యంగా వచ్చే జబ్బుల జాబితాలో ఈ వ్యాధి లేదు.

లక్షణాలు - చికిత్స
మూర్ఛ వచ్చే ముందు తీవ్ర వణుకు, నోటి నుండి చొంగకారడం, మూర్ఛలో నాలుక కొరుక్కోవడం జరుగుతాయి. మళ్లీ కొంత సేపయ్యాక సాధారణ స్థితి నెలకొంటుంది. మూర్ఛ చికిత్సలో అధునాతన పద్ధతులు వచ్చాయి. కానీ వందలో ఒకరిద్దరికి తప్ప ఇవి చాలా మందికి అవసరం లేదు. మిగతా 99 మందికి చాలా సులభమైన పద్ధతుల ద్వారా వైద్యం చేయవచ్చు. మందులతోనే చికిత్స చేయవచ్చు. క్రమ పద్ధతిలో, సరైన డోసులో, డాక్టర్‌ సలహా మేరకు మందులు తీసుకుంటే 99 శాతం మందికి మూర్ఛ నియంత్రణ లో ఉంటుం ది. సాధారణ ంగా మూర్చ వ్యాధిగ్రస్తులు నాలుగేళ్ల నుంచి ఐదేళ్ల వరకు మందులు వాడుతుంటారు. వందలో 5 నుంచి 10 మంది 10 నుంచి 20 ఏళ్లు మందులు వాడాల్సి ఉంటుంది. ఇలా దీర్ఘకాలికంగా మందులు వాడటం వల్ల వచ్చే చెడు ప్రభావాలు తక్కువే. పిల్లలు, గర్భిణులు, పెద్దవాళ్లు అందరూ ఈ మందులు వాడొచ్చు.

ఏం జరుగుతోంది?
వైద్యంలో వ్యాపార ధోరణి ఎక్కువైంది. దీంతో జనం నిజమైన అర్హత ఉన్న వైద్యుల దగ్గరికి వెళ్లడానికి భయపడుతున్నారు. డాక్టర్లలో సామాజిక దృష్టి తగ్గిపోవడం వల్ల వ్యాపార ధోరణి పెరిగింది. ఎంబిబిఎస్‌ డాక్టర్‌ చేయాల్సిన పనిని చేయడం లేదు. మూర్ఛకు ఎంబిబిఎస్‌ డాక్టరు వైద్యం చేయగలరు. కానీ అలా చేయడం లేదు. ప్రతీదానికి సూపర్‌స్పెషాలిటి వైద్యుని దగ్గరికి పంపిస్తున్నారు. ఎంబిబిఎస్‌, ఎండిలు చూడాల్సిన కేసులు నేరుగా సూపర్‌స్పెషాలిటీ డాక్టర్లు చూస్తున్నారు. చిన్న చిన్న సమస్యలన్నీ పెద్ద డాక్టర్‌ దగ్గరికి వెళ్లడంతో అక్కడ విపరీతమైన రద్దీ ఎక్కువైతోంది. దీంతో ఈ డాక్టర్లు రోగులపై శ్రద్ధపెట్టడం మానేస్తున్నారు. డబ్బులపైన శ్రద్ధ ఎక్కువైంది. దీంతో వైద్యం ఖర్చు విపరీతంగా పెరిగిపోయింది. అశాస్త్రీయ పద్దతులు అధికమయ్యాయయి. దీంతో రూపాయితో చేయాల్సిన వైద్యం ఖర్చు వంద రూపాయలవుతోంది. మూర్ఛ రోగికి వైద్యం చేయడానికి డిఎం కోర్సు చేసిన న్యూరాలజిస్టే అవసరం లేదు. ఎంబిబిఎస్‌ డాక్టరు కూడా మూర్ఛకు వైద్యం చేయగలరు.

కుటుంబ సపోర్టు
మూర్ఛవ్యాధి చికిత్సలో కుటుంబ సభ్యుల మద్దతు చాలా అవసరం. ఫిట్స్‌ వ్యాధి నియంత్రణలో కుటుంబ సభ్యుల పాత్ర కూడా కీలకమే. క్రమం తప్పకుండా వైద్యుని దగ్గరికి తీసుకెళ్లాలి. మందులు రెగ్యులర్‌గా వాడేటట్లు చూడాలి. డ్రైవింగ్‌ చేయనివ్వకూడదు. మహిళలు వంట చేసేటప్పుడు తోడుగా ఒకరుండాలి. వీలైనంత వరకు మూర్ఛ ఉన్న పురుషులను నీళ్ల దగ్గరికి వెళ్లనివ్వకూడదు.


వివిధ ప్రాంతాల్లో మూర్ఛ క్యాంపులు
జనవిజ్ఞాన వేదిక- జిబిఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో, డాక్టర్‌ శివన్నారాయణ పర్యవేక్షణలో 12 ఏళ్ల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాల్లో ఫిట్స్‌ క్యాంపులు నిర్వహిస్తున్నారు. నెలకు నాలుగు నుంచి 5 వేల మంది దాకా మూర్ఛ రోగులు వచ్చి క్యాంపులో పాల్గొని మందులు తీసుకెళ్తున్నారు. క్రమశిక్షణతో మందులను వాడటం వల్ల నియంత్రణ సాధ్యమైంది. కొన్నిచోట్ల ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఇంకొన్నిచోట్ల చాలా సబ్సిడీపై నెలకు 30, 40, 50, 100 రూపాయలకు కూడా మందులు ఇస్తున్నారు. మందులు వేసుకున్నాకా ఆ మందుల స్ట్రిప్‌ను తీసుకొచ్చి ఇస్తేనే మళ్లీ ఆ నెలలో వాడాల్సిన మందులు ఇస్తారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఫిట్స్‌ క్యాంపులుజరుగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించే నిర్వాహకుల ఫోన్‌నంబర్లు ఇస్తున్నాం. వారిని సంప్రదించి క్యాంపు వివరాలు తెలుసుకోవచ్చు.

దాచేపల్లి - సాంబశివరావు (9885179084),
మిర్యాలగూడ -శ్రీనివాస్‌ (9849626403), బాపట్ల - గోపాళం రవి (9440264365), వెంకట్రావు (9866131348)
పొదిలి- సుబ్బారెడ్డి (9440018382)
చల్లపల్లి - రామారావు (9440375079),
రాయదుర్గం -లక్ష్మినారాయణ (9440413368)
జంగారెడ్డి గూడెం - రామకృష్ణ (9440985066)
ఏలూరు - రామకృష్ణ (9440985066)
రంపచోడవరం - శ్రీనివాస్‌ (9490887583)
రాజమండ్రి - జవహర్‌ (9396678127)
బళ్లారి - విజయకుమార్‌ (09844804537)
అనంతపురం -రామిరెడ్డి (8008509320)
హిందూపురం-డా||రామ్మూర్తి (9440224585)
కదిరి -నరసారెడ్డి (9493359826)
మంగళగిరి -బాలకృష్ణ (9885170202)

బాల్యం ఒక అందమైన అనుభవం. చందమామలు, గోరుముద్దలు, ఆటలు, పాటలు, కొట్లాటలు, అల్లరి, చాడీలు, దాగుడు మూతలు, గుజ్జన గూళ్లు, చిల్ల-కట్టె ఆటలు, గోళీలాట, కోతి కొమ్మచ్చి, తాడాట, బొమ్మల పెళ్లిళ్లు, తాతయ్య జోకులు, సార్ల కబుర్లు, కుక్కలతో-పిల్లులతో సంభాషణ, నాటకాలు, తొందరగా స్నేహం, అంతకంటే తొందరగా విడిపోవడం, మా ఇంటికి నువ్వు రావొద్దు, మీ ఇంటికి నేను రాను, ఇద్దరం మర్చిపోదాం, ఇక నుండి బాగుందాం, ఇప్పటి నుండి కొట్లాట లేదు-ఇదండీ బాల్యమంటే....ఇంకా ఎంతో, ఎంతో, మరెంతో, అంతులేనంత ఉంది బాల్యానికి. అయితే చిన్నారులందరికీ బాల్యం ఇలా ఉందా !


ఇలా ఉంటేనే చిన్నారులు మానసికంగా, శారీరకంగా సంపూర్ణంగా ఎదుగుతారు. అయితే ఇప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, పేదోల్లు కానీ, ధనవంతుల పిల్లలు కానీ సరైన బాల్యాన్ని అనుభవించడం లేదు. సరైన బాల్యం లేకుంటే సమాజంలో అశాంతి ఏర్పడుతుంది. సమాజం నేరమయమవుతుంది. దోపిడీతత్వం పెరుగుతుంది. ప్రతి చిన్నారి తానేదో కోల్పోయినాను అనుకుంటుంది. చాలా మంది చిన్నారులు తక్కువ జీవన స్థాయిలో, ప్రమాదకరమైన పరిస్థితులలో జీవిస్తున్నారు. మన రాష్ట్రంలో పుట్టిన చిన్నారులలో 1000కి 44 మంది మొదటి పుట్టిన రోజు చూడకుండానే చనిపోతున్నారు. దీన్నే శిశుమరణాల రేటు అంటాం. శిశుమరణాల రేటు సమాజం సామాజిక స్థితిని ప్రతిబింబిస్తుంది. చిన్నారుల పట్ల ఆ సమాజం అనుసరిస్తున్న తీరును ప్రతిబింబిస్తుంది. న్యుమోనియా, విరేచనాలు, ఆహారలోపం, అంటువ్యాధులు మన చిన్నారులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు. మన చిన్నారులు రాళ్లు మోస్తున్నారు. ఇళ్లల్లో పనిమనుషులుగా పనిచేస్తున్నారు. మూటలు మోస్తున్నారు. హోటళ్లల్లో టీలు ఇస్తున్నారు, బల్లలు తుడుస్తున్నారు. ప్రమాదకరమైన కర్మాగారాల్లో పని చేస్తున్నారు. కొందరు ఆడపిల్లలు బాల్యంలోనే సెక్స్‌ వర్కర్లు కూడా ! సెక్స్‌ వర్కర్లుగా ఆడపిల్లలు తీవ్రమైన లైంగిక వ్యాధులకు, మానసిక వ్యాధులకు, న్యూనతా భావానికి, అపరాధ భావానికి గురవుతున్నారు. ఎవరి మీటింగులైనా జేజేలు పలకడానికి ఎండల్లో, వానల్లో కూడా చిన్నారులే ! జేజేలకు పోయి ఎంతో మంది చిన్నారులు వడదెబ్బలకు, ప్రమాదాలకు గురయ్యారు !
బాలల హక్కులు
చిన్నారులకు కొన్ని హక్కులు ఇవ్వడం పౌర సమాజం బాధ్యత. ఈ సమస్య గుర్తించి ఐక్యరాజ్య సమితి నవంబరు 20, 1989న ఒక ప్రతిపాదన రూపొందించి, ఆమోదించింది. ప్రపంచంలోని 2 దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాయి. 1990 సెప్టెంబరులో బాలల కోసం ప్రతిపాదనను ఆమోదించిన దేశాలు ఒక శిఖరాగ్ర సమావేశం నిర్వహించుకున్నారు. ఈ పర్యవసానమే బాలల హక్కులు. ఈ హక్కుల ప్రకారం, ఇందులోని ఆర్టికల్‌ 1 ప్రకారం 18 సంవత్సరాల లోపు వారందరూ బాలలే. ఇందులో 54 ఆర్టికల్స్‌ ఉన్నాయి. ఈ హక్కులు నాలుగు తరగతులుగా విభజించవచ్చు. 1. జీవించే హక్కు. 2. రక్షణ పొందే హక్కు. 3. అభివృద్ధి చెందే హక్కు. 4. సాంఘికంగా అనేక విషయాల్లో పాల్గొనే హక్కు. ఈ హక్కులు నాలుగు ముఖ్యమైన ఆదర్శాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. సమానత్వం, అవివక్ష, బాలల బాగోగులే అత్యున్నత ప్రమాణాలు. అన్నింటా భాగం అందరికంటే చిన్నారులకే ముందు.
కొన్ని ముఖ్యాంశాలు
ఆర్టికల్‌ 6 ప్రకారం ప్రతి శిశువుకు బతికే హక్కు ఉంది.
ఆర్టికల్‌ 24 ప్రకారం ప్రతి రాజ్యం శిశుమరణాలు తగ్గించే ప్రయత్నం చేయాలి.
ఆర్టికల్‌ 24, 25, 27 ప్రకారం మంచి ఆరోగ్యం, సరైన వైద్య సదుపాయాలు, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పరిశుభ్రమైన నీరు, పౌష్టికాహారం పొందటం బాలల హక్కు. చిన్నారులు శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, నైతికంగా ఎదిగే అవకాశాలు కల్పించాలి.
ఆర్టికల్‌ 18, 27, 28, 29 ప్రకారం అందరికీ చదువుకునే హక్కు, నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు, ఉన్నత విద్యలో అవకాశాలు పొందే హక్కు, స్త్రీ-పురుష బేధం లేని వాతావరణం.
అంతేగాక భౌతిక హింస, లైంగిక హింస నుండి రక్షణ పొందే హక్కు ఉంది. అక్రమ రవాణా నుండి చిన్నారుల రక్షణ, చిన్నారులకు శిక్ష-హింస నుండి రక్షణ, అక్రమంగా బందీలు చేయకుండా ఉండటం, బాల కార్మికులు కాకుండా చూడటం, చిన్నారులు యాచకులుగా జీవించకుండా, చిన్నారులను ఉపయోగించకుండా రక్షణ, జోగిని పద్ధతి నుండి విముక్తి, చిన్నారులకు ఆట-పాట, సాంఘికంగా చిన్నారులు పాల్గొనే హక్కులు ఈ హక్కుల్లో పొందుపరిచారు. మన దేశంలో నవంబరు 14ను బాలల హక్కుల పరిరక్షణ దినంగా గుర్తించారు. మన బాలలు గౌరవంగా, ఆరోగ్యంగా, శాంతిగా, సుసంపన్నంగా జీవించే సమాజం నెలకొల్పుదాం.
ఈ అంశాలను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహచరులతో పంచుకోండి ! రండి మన చిన్నారులకు ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం !! మీరు ఆరోగ్యాన్ని గురించి మాట్లాడండి !!!

పెళ్ళి రోజు-చిన్న కథ

ఉదయం నాలుగు గంటలయ్యింది... అప్పటికే నేను లేవడం స్నానం, పూజ పూర్తయ్యింది. కార్తీకమాసం, దాంతో పాటు పెళ్ళి రోజు కావడంతో ఇంటి నిండా దీపాలు అలంకరించాను. వంటింటి గుమ్మానికి ఎదురుగా ఉన్న తులసికోటలో దీపం మరింత వెలుగుతూ... చీకటిలో చాలా అందాన్నిస్తోంది. సృష్టిలో ఇన్ని అందాలున్నా, దీపానికున్నంత అందం దేనికీ లేదేమో. ఇలా అనుకుంటూ అక్కడే ఒక కుర్చీ వేసుకుని కూర్చున్నా... మనసులో ఉన్న వేడి ముందు ఒంటికి తగిలే చల్లగాలి హాయిగా అనిపించింది. ఆ నిశ్శబ్ద వాతావరణం ఒక్క ఉదయమే దొరుకుతుంది. ఇలాంటి సమయాన్ని నా సొంతం చేసుకోవడం నేను పొందే చిరు ఆనందాల్లో ఒకటి. ఎప్పుడు ఎలాంటి బాధ కలిగినా ఇటువంటి సమయంలో చాలా చిన్నగా అనిపిస్తాయి. కానీ ఈరోజెందుకో ఆ వాతావరణం కూడా ప్రశాంతతను ఇవ్వలేకపోతోంది. అందుకు ప్రత్యేకమైన కారణం అంటూ లేకపోలేదు.... తెల్లవారితే ఏది వండాలో, ఎవరికి ఎలా సర్ది చెప్పాలో తెలియక కాస్త అయోమయంగా ఉంది. అదీ కాక ఏదో కారణం చూసుకుని పిల్లలు, ''అమ్మా ఈ రోజు ఏ స్పెషల్‌ చేస్తున్నావ్‌'' అని అడుగుతుంటారు. మనలో ఆనందం ఉన్నా లేకున్నా... ఓపిక ఉన్నా లేకున్నా... నవ్వుతూ వారి ఇష్టాల్ని తీర్చాలి. తప్పదు. వీటన్నిటితో తండ్రికి ఏ సంబంధమూ, బాధా ఉండదు. ఏ ఇబ్బందులైనా తల్లి మాత్రమే పడాలి. నా ఆలోచనలకు అడ్డు తగులుతూ...
''అమ్మా... ఈ రోజు నాలుగు గంటలకే నిద్ర లేపమన్నాను కదా? ఎందుకు లేపలేదు?'' అంటూ ఏడుపు ముఖంతో నందిని నిలబడింది.
'ఆ విషయమే మరచిపోయిన నేను ఉలిక్కిపడి ''లేదురా... నువ్వు మంచి నిద్రలో ఉన్నావు... లేపుదామనుకుంటూనే ఉన్నా... అప్పుడే అయిందా...? వెళ్ళు'' అంటూ బ్రష్‌ చేతికిచ్చి పంపాను.
ఏదో బ్రష్‌ అయిందనిపించి... ''అమ్మా... విష్‌యూ హేపీ మేరీడ్‌ లైఫ్‌'' అంది దగ్గరకు వస్తూ.
ఆ వెనుకే కొడుకు కూడా అదే మాటను మరింత ఇంగ్లీష్‌ యాసతో చెప్పి, దగ్గరకు చేరాడు... నాకర్ధమయింది. వారెందుకు అంత దగ్గరగా చేరారో.
వాళ్లిద్దరి చేతులకు రెండు పాల గ్లాసులు అందించి, ''ఏంటి చెప్పండ్రా?'' అంటూ మరింత దగ్గరగా తీసుకున్నాను... వాళ్లు ఏమడుగుతారో తెలిసినా..
''మరి సాయంత్రం అందరం బయటకు వెళుతున్నామా...?'' నందిని మెల్లగా అడిగింది నేను కోప్పడతానేమోననే భయంతో.
నిన్నటి నుండి నాన్న ఎంతో కోపంతో ఉన్నారని, నాతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, ఏదైనా ఖర్చు పెట్టాల్సి వచ్చినపుడు తన తీరు అలానే ఉంటుందని వీళ్లకి ఎలా చెప్పడం?
''సరేలేరా... ముందు మీరు కాలేజీకి వెళ్ళిరండి... సాయంత్రం కల్లా నాన్నతో మాట్లాడతాలే..'' అన్నా తప్పనిసరై.
''మరి నాన్న ఒప్పుకోకపోతే...?'' అడిగింది నందిని తన తెలివిని ప్రదర్శిస్తూ...
''ఒప్పుకోకపోతే నేనే మీకు స్వీటు చేసి పెడతా... సరేనా?'' అనగానే...
''అమ్మా... ప్లీజ్‌ నువ్వు మాత్రం స్వీటు చేయకు. సరిగా రాదు నీకు...'' అన్నాడు మధ్యలో కొడుకు వంశీ అడ్డు తగుల్తూ..
''సరేలేరా... ముందు మీరెళ్లి చదువుకోండి'' అన్నాను చేసేది లేక విసుగ్గా.
ఏదో నాకు చేతనయింది చేయడం, వారిని ఆ పూటకు కాలేజీకి పంపడంతో నా పని పూర్తి అయిందా అంటే.. అప్పుడే శ్రీవారు లేవడం... ఆయనకి నీళ్లూ, టిఫెను, కాఫీ పని పూర్తయ్యేసరికి దాదాపు రెండు గంటలు పట్టింది.
''సుధా... మరి నేను వెళ్లొస్తాను...'' అని బయలు దేరేంతలో...
''మరి...మరి'' అంటూ ఆగిన నన్ను చూసి...
''ఏంటి ఏదో నసుగుతున్నావు...? చీర గురించేనా? మనకేమైనా కొత్తగా పెళ్లయిందా? దాదాపు పద్దెనిమిదేళ్ళు కావొస్తోంది..'' అన్నాడు.
''నేను చీర కోసం మిమ్మల్ని ఆపటం లేదు... మనకు పెళ్లయి పద్దెనిమిదేళ్లయినా, మన పిల్లలు పెరిగి మీ మ్యారేజీడే అని చెప్పేంత వరకూ మనకు తెలీలేదు. కొత్తయినా పాతయినా ఏదో పిల్లలు కదా... వారేమో సాయంత్రం బయటకు వెళదామంటూంటే...'' అంటూ ఆగాను.
''అలా అని వాళ్ళడిగారా? నువ్వే చెబుతున్నావా?''
''ఏదో ఒకటి మీకు తోచింది అనుకోండి... మీరేమంటారు?''
''సాయంత్రం ఫోను చేస్తాలే...'' అంటూ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు.
***
''అమ్మా... నాన్నను అడిగావా?'' కాలేజీ నుంచి ఇంటికి వస్తూనే అడగింది నందిని.
''ఆ... అడిగాను. సాయంత్రం ఫోను చేస్తానన్నారు'' అంటూ అప్పుడే చేసిన పాయసాన్ని గ్లాసులో పోసి టేబుల్‌పై పెట్టాను.
''అయ్యో... అలా అంటే నాన్న ఒప్పుకోనట్లే...'' అంటూ నాన్న మనసును పూర్తిగా అర్థం చేసుకున్న ఆరిందలా అంది నందిని.
ఇక వాడు చెప్పనే అక్కర్లేదు. వేలకు వేలు ఫీజులు కడుతున్నా, ఇష్టమైన బట్టలు కొనిస్తున్నా... అవసరాలకు పాకెట్‌ మనీ ఇస్తున్నా... ఇంకా ''మీరేం చేశారు? ఎప్పుడైనా మాకు నచ్చిన తిండి పెట్టారా?'' అనే ధోరణిలో మాట్లాడుతుంటాడు. అయినా పిల్లల కోసం ఈ పాట్లు తప్పదు.
పిల్లలకోసం, వారి సంతోషం కోసం ఎన్నోసార్లు ప్రయత్నిస్తే రాత్రి 8 గంటలకు సరే అనే మాట శ్రీవారి నుండి రావడం... అప్పటి దాకా నిరుత్సాహం... నిట్టూర్పులు విడిచిన పిల్లలు హుషారుగా తయారైపోయారు. ''అమ్మా నువ్వు కూడా మంచి చీర కట్టుకో'' అంటూ బలవంతం పెట్టారు.
ఇక తప్పదు అనుకుని ఏదో ఉన్నదాంట్లోనే కాస్త మంచిచీర కట్టుకున్నాను. హోటల్లో భోజనం చేసి, నచ్చని సినిమాను బలవంతంగా చూసి ఏ ఒంటిగంటకో ఇంట్లో పడ్డాం.
సమయం రెండు గంటలవుతోంది.
నిద్ర రావడం లేదు. ఇలా మనసుతో పనిలేని పనులు జీవితమంతా మోస్తూ... అయినా మనసనేది ఎంతసున్నితమైందో చాలా మందికి తెలియదనిపిస్తుంది. అసలు మనసెందుకుంది? అది లేకుంటే ఎంత బావుండేది అనిపిస్తుంది. అసలు మన అనుకునే మనుషుల మధ్య మనంగానే బతకలేని రోజులొచ్చాయని గమనించారేమో... అందుకే స్నేహితుల రోజు, ప్రేమికుల రోజు, నాన్నకో రోజు, అమ్మకో రోజు, పెళ్ళిరోజుకో రోజు, పుట్టినదానికో రోజు ఇలా విభజనల మధ్య మనకు మనం బలవంతంగా గుర్తు తెచ్చుకుని, నవ్వు రాకున్నా నవ్వుకుని, ఇష్టం లేకున్నా తిని, ఆనందం లేకున్నా పిల్లలకోసం ఆనందాన్ని నటించాలి... అనుకుంటుంటే తెలియని విరక్తి నవ్వు ఒకటి పెదవులపై నిలిచింది. పక్కకు తిరిగి చూస్తే...
రోజంతా రోడ్డుపైన తిరిగి అలసిపోయి గురక పెట్టి నిద్రపోతున్న శ్రీవారు, మరో పక్క తాము రోజంతా ఆలోచించి చివరకు అనుకున్న రీతిలో అమ్మ, నాన్న పెళ్ళి రోజు జరుపుకున్నామన్న ఆనందాన్ని పొందిన తృప్తితో పిల్లలు ఆదమరచి నిద్రపోతున్నారు.
మరి నేను....
ఎప్పుడో ఊహ తెలియని రోజుల్లో అమ్మానాన్నల మధ్య గడిపిన పుట్టిన రోజు గుర్తు చేసుకుంటూ బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాను.
 

మాతృత్వం- చిన్న కథ

ఇలాంటి పరిస్థితి వస్తుందని సంధ్య కలలో కూడా ఊహించలేదు. తన తెలివీ, తన చదువూ, తన సమర్థతా, తన మంచితనం... అన్నీ... అన్నీ.. ఎంత వ్యర్థమో అనిపిస్తోంది ఇప్పుడు! భర్త మూర్ఖుడు అని తెలుసుకానీ, మరీ ఇంత మూర్ఖుడు అని తను ఊహించలేదు.
తన స్నేహితురాళ్ళు చాలా మంది ఇద్దరు ఆడపిల్లలతోనే సరిపుచ్చుకున్నారు కొడుకు కోసం ఆశించకుండా. ఇద్దరు కాదు, ఒక్క ఆడపిల్లతోనే సరిపుచ్చుకున్నవాళ్ళు ఎంత మంది లేరు?
తనకి ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరూ ముత్యాల్లాంటి పిల్లలు. తను ఈ ఇద్దరు పిల్లలతోనే ఎందుకు తృప్తిపడలేదో తలచుకుంటే, తనమీద తనకే రోత పుడుతోంది! చిన్న కూతురు పుట్టినప్పుడు ఆపరేషన్‌ చేయించుకుంటానని భర్తని అడిగింది. ససేమిరా అన్నాడు. కొడుకు కావాలన్నాడు. తనకీ కొడుకు ఉంటే బాగుండు అని మనసులో ఓ మూల ఉందేమో! అందుకే భర్త మాటని గట్టిగా ఎదిరించలేకపోయింది. అప్పుడు ఎదిరిస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.
ఇప్పుడు తనకి నాలుగో నెల వచ్చి నాలుగు రోజులు అవుతోంది. రాత్రి భర్త మాటలూ, ఘర్షణే తలపుకి వస్తున్నాయి.
''అయితే ప్రెగెన్సీ విషయం ఏమనుకుంటు న్నావు?'' ముందు సున్నితంగానే అడిగాడు.
''నేను ఏమీ అనుకోవడం లేదు'' భర్త ధోరణి తనకి తెలుసు. విషయం ఆయనకి తెలిసినప్పటి నుంచీ ఏదో విధంగా నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. ''నా మాట విను సంధ్యా... మళ్ళీ ఆడపిల్ల పుడితే మన పరిస్థితేంటి?''
''ఏమవుతుంది?''
''ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చేయాలంటే మాటలా? ముగ్గురు ఆడపిల్లలు అని ఊళ్ళో జనం ఎగతాళి చేస్తారు! అందరిలో తలవంపులు!''
''అదేమిటండీ, అలా మాట్లాడుతున్నారూ? జనం ఎందుకు ఎగతాళి చేస్తారు? ఏం తప్పుపని చేస్తున్నాం? తలవంపులు ఏముంది?''
''ఆడపిల్లలకు గౌరవం ఏం ఉంటుంది? ఈ రోజుల్లో ఆడపిల్లల్ని ఎవరు కోరుకుంటున్నారు? ఇప్పటికే ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారాయె!''
తనకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అంత మూర్ఖమైన మాటలకి తనేం మాట్లాడగలదు?
''హాస్పిటల్‌కి వెళ్ళి టెస్ట్‌ చేయించుకుందాం!''
''అది జరిగే పనికాదు. ఆ ఆలోచన ఏం పెట్టుకోవద్దు!''
మంచిగా మాట్లాడిన అతనే నెమ్మదిగా స్వరం పెంచి వికృత రూపం చూపెట్టడం మొదలు పెట్టాడు. ఘర్షణకు దిగాడు.
''నీకేమే... ఎన్నయినా చెపుతావు? ఇంట్లో కూర్చుని లోకం తెలియడంలా! బయట పరిస్థితులు ఎట్ట వున్నరు? ఆడపిల్లలు అంటే ప్రేమలూ, దోమలూ, మగపిల్లల వేధింపులూ... లేనిపోని సమస్యలూ...''
''అవి అన్నీ చేసేది మగపిల్లలే కదా? అందుకే అలాంటి మగపిల్లలు మనకి వద్దు!''
''అతికి పోవాకు! ఉన్న రెండు దరిద్రాలతోనే చస్తున్నాం! మరో దరిద్రం దాపురిస్తే అవుతుంది మన పని!''
పసిబిడ్డల్ని పట్టుకుని దరిద్రాలంట! ఎంత చీదరమనిషి! ఎంత చీదరమాటలు! ఎంత చీదరబుద్ధులు! బిడ్డల మీద ప్రేమ లేని మనిషి, ఏం మనిషి? పిల్లల్ని ఎత్తుకుని ముద్దు చేస్తుంటాడే! మనసులో నిజంగా ప్రేమ ఉంటే ఇలాంటి మాటలు వస్తాయా?
''పసిబిడ్డల్ని పట్టుకుని కన్న తండ్రి అనవలసిన మాటలేనా అవి? అలా అనడానికి మీకు నోరు ఎలా వచ్చిందండీ?''
''ఆడ పిల్లలు దరిద్రం కాకపోతే ఏమిటి?''
''మీకు దరిద్రాలేమో కానీ, నాకు కాదు. నాకు ధనలక్ష్మిలు! ధాన్యపు రాశులు! బంగారు కొండలు!''
''సరేలే...మాటలకేం కానీ... నాకు మాత్రం అబ్బాయి కావాలి!''
''కావాలంటే ఎలాగ? ఇదేమైనా మార్కెట్లో దొరికే వస్తువా?''
''అందుకే నా మాట విని టెస్ట్‌ చేయించుకో! హాస్పిటల్‌ వాళ్ళ ముఖాన ఎంతోకొంత పారేస్తే ఆడో, మగో చెపుతారు ఆడపిల్ల అయితే అయితే తీసి వేయించుకుందువు!''
''మీరు ఎన్ని అయినా చెప్పండి. అది జరిగే పనికాదు. చూస్తూ చూస్తూ కడుపులో బిడ్డని చంపుకోలేను. నాకు ఎవరైనా ఒకటే!''
''నాకంటే నీకు కడుపులో బిడ్డ ఎక్కువన్నమాట!''
''మీ అర్థం లేని వాదనకి జవాబు చెప్పుకోలేను. మీరు తక్కువా, బిడ్డ ఎక్కువా అని నేను అనలేదు. అన్నీ మీరే అనుకుంటున్నారు. మీ కోసం బిడ్డను బలిచేయలేను. మన ప్రాణం ఎంతో బిడ్డ ప్రాణమూ అంతే!''
''సరే అయితే! నా మాట విననికాడికి నా ఇంట్లో మాత్రం ఎందుకు? నీదారి ఏదో నువ్వు చూసుకోవచ్చు!''
''సంతోషం!'' అంది సంధ్య.
భర్త సుదర్శన్‌ చూపులకి ఎత్తుగా, ఎర్రాగా, బుర్రగా బాగుంటాడు. బుర్రలో మాత్రం ఏం లేదు. మనిషి ఎప్పుడూ టక్‌చేసి, సై ్టల్‌ మెయింటెయిన్‌ చేస్తుంటాడు. పైన పటారం బాపతు!
సంధ్య బిఎస్సీ పాసైంది. చదువులో బాగా చురుకు. తల్లిదండ్రులు పెద్దగా ఉన్న వాళ్ళు కాదు. బిఎస్సీ అయిన వెంటనే తెలిసిన వాళ్ళు చెబితే, మంచి సంబంధం అని ఈ పెళ్ళిచేశారు. తినీ తినకా కూడబెట్టిన డబ్బుతో ఈ అల్లుడ్ని కొనుక్కున్నారు.
అతను గవర్నమెంట్‌ స్కూల్‌ టీచర్‌. గణితం బోధిస్తాడు. ఆ బోధన ఎలా ఉంటుందో!
ఇది ఒక రోజు విషయం కాదు. తను నెల తప్పిన విషయం తెలిసినప్పటినుంచీ అతని మాట తీరులో మార్పు తనకి స్పష్టంగా అర్థం అవుతూనే ఉంది. తనూ ఒక నిర్ణయం తీసుకుంది. భర్త తీరు మారకపోతే తను తీసుకున్న నిర్ణయానికి ఇక తిరుగు ఉండదు.
రాత్రి వాదన తరువాత చివరిగా ''నీ వస్తువులు ఏవైనా ఉంటే తీసుకుని వెళ్ళిపోవచ్చు. ఇక నీకూ నాకూ కుదరదు!'' అన్నాడు.
ఆ మాట అన్న తరువాత, ఇక అతని చూరు పట్టుకుని వేళ్ళాడటం సిగ్గుమాలిన పని! తనకీ ఆత్మాభిమానం ఉంది. ఆరమో, భారమో... తను వేరేగా ఉండటానికే నిశ్చయించుకుంది. అమ్మ కొద్దికాలం ఆసరాగా ఉంటుంది.
తనూ, ఇద్దరు బిడ్డలూ, కడుపులో బిడ్డ ఎలాగోలా బతకాలి! ముందు ఏదైనా ఒక ఉద్యోగం చూసుకోవాలి.
ఇంటినుంచి బయటపడింది సంధ్య.
బయటికి వచ్చిన ఆరు నెలలకి సంధ్యకి పండులాంటి మగబిడ్డ పుట్టాడు.

కాటేసిన ప్రేమ-Real story

ఫిబ్రవరి 12, 2009... కాలిఫోర్నియా రివర్‌సైడ్ కౌంటీలోని ఓ షాపింగ్ మాల్
పెట్రోలింగ్‌కు వచ్చిన ఓ పోలీసు పార్కింగ్ గ్యారేజ్ మూడో అంతస్తులో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఓ మూలగా పార్క్ చేసివున్న కారులో ఏదో కదలిక కనిపించింది. లోపల ఎవరో ఉన్నట్టు అనిపించింది.

మెల్లగా అటువైపు నడిచాడు పోలీస్.
కారు దగ్గరకు వెళ్లి లోపలకు చూశాడు. నల్లటి అద్దాలు మూసి ఉండటం వల్ల ఏమీ కనిపించలేదు. అద్దం మీద చిన్నగా తట్టి... ‘‘లోపల ఎవరు?’’ అన్నాడు. సమాధానం రాలేదు. కానీ కారు కదలికలు ఒక్కసారిగా ఆగిపోయాయి. పోలీసు మనసు ఏదో కీడు శంకించింది.

వెంటనే కారుమీద దబదబా బాదాడు. ‘‘లోపల ఎవరున్నారు? మర్యాదగా బయటికి రండి’’ అంటూ అరిచాడు. అయినా ఫలితం లేకపోవడంతో స్టేషన్‌కి ఫోన్ చేసి టీమ్‌ని రమ్మన్నాడు. క్షణాల్లో పదిమంది వరకూ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అన్ని పక్కల నుంచీ అరుస్తూ, కారు మీద చరుస్తూ ఉన్నారు.

కాసేపటికి వెనక ఒక కిటికీ అద్దం మెల్లగా కిందికి దిగింది. అందులోంచి ఓ వ్యక్తి కనిపించాడు. వెంటనే పోలీసులు ఆ కిటికీ దగ్గరకు చేరుకున్నారు. ‘‘ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావ్? బయటికి రా’’... అరిచాడో పోలీసు.

కారులో ఉన్న వ్యక్తి మాట్లాడలేదు. మౌనంగా కూచుకున్నాడు. ముఖం పాలి పోయింది. చెమటలు కారిపోతున్నాయి.

‘‘సార్... అటు చూడండి, కారులో అమ్మాయి’’... అరిచాడో కానిస్టేబుల్. ఒక్క సారిగా అందరూ లోపలకు తొంగి చూశారు. కారు వెనక సీటులో వెల్లకిలా పడివుందా ఆ అమ్మాయి. గుండెల్లో కత్తి దిగివుంది. రక్తం ధారలుగా కారిపోతోంది.

పోలీసులు ఇక ఆలస్యం చేయలేదు. కారు డోరు బలవంతంగా తెరిచారు. లోపల ఉన్న వ్యక్తిని కస్టడీలోకి తీసు కున్నారు. క్షణాల్లో అంబులెన్సును రప్పిం చారు. కానీ ఏం లాభం...! అప్పటికే ఆమె చనిపోయింది. ఇన్‌స్పెక్టర్ కోపాన్ని పట్టలేకపోయాడు.

‘‘యూ రాస్కెల్...’’ అంటూ కాలర్ పట్టుకున్నాడు. ‘‘ఎవరు నువ్వు?’’ అన్నాడు పళ్లు కొరుకుతూ.
అతడు మాట్లాడలేదు. మౌనంగా తల దించుకునే ఉన్నాడు. పోలీసులు చేతులకు బేడీలు వేసినా, జీపెక్కించినా అతడిలో ఏ మార్పూ లేదు. ఓ ఆడపిల్లని అంత దారుణంగా చంపిన కసాయివాడిలో ఆ నిర్లిప్తత ఏమిటి?

‘‘అయ్యో... బిప్సీ...’’... కూతురి శవాన్ని చూసి కుప్పకూలిపోయింది షెరిల్ ప్లాటో. కంటికి ధారగా ఆమె ఏడుస్తూ ఉంటే, ఖాకీల గుండెలు సైతం క్షణంసేపు కదిలిపోయాయి.

రెండు రోజులుగా కూతురు కనిపిం చడం లేదని కంగారు పడుతోందామె. ఇప్పుడిలా శవమై కనిపించేసరికి ఆమె కన్నకడుపు తరుక్కుపోయింది.

‘‘అందరినీ ప్రేమించడం, అందరితో ఆప్యాయంగా ఉండటమే తెలిసిన నా చిట్టి తల్లికా ఈ గతి పట్టింది! ఎవరు చంపారు ఇన్‌స్పెక్టర్? నా కూతురిని ఎవరు పొట్టన బెట్టుకున్నారు?’’... ఆమె అరుపులకు స్టేషన్ దద్దరిల్లిపోయింది.

‘‘మిక్కీ డేవిడ్ వేగ్‌స్టాఫ్... అతడే మీ అమ్మాయిని చంపింది.’’

‘‘వ్వా....ట్?’’... షాక్ తిన్నట్టుగా అయ్యింది షెరిల్. ‘‘మిక్కీ చంపాడా? అదెలా సాధ్యం సార్? అతడు మా అమ్మాయిని ప్రేమించాడు. త్వరలోనే వాళ్లిద్దరికీ పెళ్లి జరగబోతోంది. నిశ్చితార్థం కూడా అయిపోయింది.’’
ఈసారి ఇన్‌స్పెక్టర్ షాక్ తిన్నాడు. ‘‘పెళ్లి చేసుకోబోతున్నాడా? మరి ఎందుకు చంపినట్టు? ఎంత అడిగినా నోరు తెరవడం లేదు’’ అంటూనే మిక్కీ ఉన్న సెల్‌వైపు నడిచాడు.

గోడకు చేరబడి కూర్చున్నాడు మిక్కీ. శూన్యంలోకి చూస్తున్నాడు. కళ్లలోను, ముఖంలోను అదే నిర్లిప్తత! ఇన్‌స్పెక్టర్ లోనికి వచ్చినట్టు తెలిసినా అతనివైపు చూసే ప్రయత్నం కూడా చేయలేదతడు.
‘‘మిస్టర్ మిక్కీ... ఎలిజబెత్ వాళ్ల అమ్మ వచ్చారు. నువ్వెవరో చెప్పారు. ఇక చెప్పాల్సింది నువ్వే. తననెందుకు చంపావ్?’’

నవ్వాడు మిక్కీ.

‘‘ఎందుకు నవ్వుతున్నావ్? నేనేమైనా జోక్ చేశానా? చెప్పు... ఎలిజబెత్‌ని ఎందుకు చంపావ్?’’
‘‘తనను ప్రేమించాను కాబట్టి.’’
‘‘ప్రేమించావు కాబట్టి చంపావా? ఏం వాగుతున్నావ్?’’ గర్జించాడు.

‘‘యెస్... అందుకే చంపాను. తను లేకుండా నేను ఉండలేను. నేను లేకుండా తను ఉండటానికి వీల్లేదు.’’
బుర్ర తిరిగిపోయింది ఇన్‌స్పెక్టర్‌కి. ప్రేమించడమేంటి? ప్రేమించినందుకు చంపడమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం అతడికి మిక్కీ దగ్గర త్వరగానే లభించింది. ఎలిజబెత్ జీవితమంతా అతనికి కళ్లముందు కనిపించింది.

బిప్సీ... ఎలిజబెత్ ముద్దుపేరు. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది. తండ్రి సంగీతకారుడు. ఇంట్లోనే అతనికో చిన్న స్టూడియో ఉండేది. తండ్రితో పాటు ఆ స్టూడియోలోనే ఎక్కువ గడిపేది. దాంతో సంగీతమంటే ఆసక్తి కలిగింది. స్వయంగా సాధన చేయడం మొదలు పెట్టింది. ఓసారి తండ్రితో కలసి ఓ ఫంక్షన్‌కు వెళ్లింది. అక్కడ పియానో కనిపిస్తే, ఉత్సాహంగా వచ్చినదేదో వాయించడం మొదలుపెట్టింది. అంతే, అందరూ ఆమె సంగీతానికి ముగ్ధులయ్యారు. ఆమెను ప్రశంసల వర్షంలో తడిపి ముద్ద చేశారు. ఆ రోజుతో సంగీతమంటే మరింత పిచ్చి పట్టుకుంది బిప్సీకి.
‘‘మ్యూజిక్ లేదు ఏమీ లేదు. నోరు మూసుకో’’... తండ్రి మాటతో కళ్లలో నీళ్లు తిరిగాయి బిప్సీకి. ఆయనెప్పుడూ అంతే. ఆడపిల్లలు బయటికి వెళ్లకూడదంటాడు. బుద్ధిగా కుదురుగా ఉండాలంటాడు. ఏది చేస్తానన్నా వద్దంటాడు. అతడి పేదరికం కూడా అందుకు కారణం కావచ్చు. కానీ అతని కారణాలు బిప్సీ చిట్టి మనసుకు తెలీదు. అందుకే అది పలుమార్లు గాయపడేది. అయినా ఆమె పట్టు వదల్లేదు. స్టోర్ రూమ్‌లో పడివున్న తన తల్లి పియానోను తీసి బాగు చేసుకుంది. దానిమీదే సాధన చేసేది. పాటలు రాసుకు నేది. తనే స్వరపరిచి చర్చిలో ఆలపించేది.

బిప్సీ తీయటి స్వరం వినిపించకపోతే చర్చి మూగబోయినట్టుగా ఉండేది. అందరూ ఆమె సంగీతాన్ని ఆస్వాదించే వారు. ఇది మాత్రమే కాదు. వయసులో చిన్నదైనా ఆమె మనసు చాలా పెద్దది. ఎవరు కష్టంలో ఉన్నా వెంటనే కదిలి పోయేది. వెళ్లి చేతనైన సాయం చేసేది. అందుకే ఆమె అంటే అందరికీ ఇష్టం.

తానో గొప్ప గాయని కావాలని తపించేది బిప్సీ. ఓ పక్క సంగీతం, మరోపక్క చదువు, ఇంకో పక్క చర్చిలో సేవ... ఎప్పుడూ బిజీబిజీగా ఉండేది. ఒంటరిగా ఉన్నప్పుడు ఓకే. కానీ పెళ్లి తర్వాత ఆమె జీవితంలోకి మరో వ్యక్తి వచ్చాక కూడా అలాగే విరామం లేకుండా గడపడంతో దంపతుల మధ్య పొర పొచ్చాలు వచ్చాయి. విడాకులు వారి బంధాన్ని తెంచేశాయి. ఆ తర్వాత ఆమె మనసులో స్థానం సంపాదించుకున్న వాడే... మిక్కీ డేవిడ్ వేగ్‌స్టాఫ్.

బిప్సీకి మిక్కీ అంటే ఇష్టం. మిక్కీకి బిప్సీ అంటే పిచ్చి. పెళ్లితో ఒక్కటవ్వాలను కున్నారు. నిశ్చితార్థం కూడా అయ్యింది. అంతలోనే ఓ రోజు బిప్సీ కనిపించకుండా పోయింది. వెతికినా ఫలితం లేకుండా పోయింది. రెండు రోజుల తర్వాత ఆమె మరణవార్త అందరినీ నివ్వెరపరిచింది.

కారణం తెలియదు కానీ, కొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా నిన్ను చేసుకోవడం ఇష్టం లేదని మిక్కీతో చెప్పింది బిప్సీ. మిక్కీ ఎంత నచ్చజెప్పినా వినలేదు. దాంతో షాపింగ్‌కు వెళ్దాం రమ్మంటూ ఆమెను తీసుకుపోయాడు. షాపింగ్‌మాల్ గ్యారేజ్‌లో కారును పార్క్ చేసి, తలుపులు లాక్ చేశాడు. పెళ్లికి ఒప్పుకొమ్మంటూ ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అంది. వాదన పెరిగింది. మిక్కీలో ఓర్పు నశించింది. బిప్సీ చేతుల్ని కట్టేసి రేప్ చేశాడు. రెండు రోజుల పాటు పలుమార్లు చేశాడు. అప్పటికీ ఆమె మనసు మారక పోవడంతో... కత్తితో పొడిచి చంపేశాడు.

మిక్కీ చెప్పింది విన్న పోలీసులకు ఒళ్లు జలదరించింది. పెళ్లి చేసుకోను అన్నందుకు ముప్ఫై తొమ్మిది సార్లు కర్కశంగా పొడిచి చంపేశాడు. ఇదేనా ప్రేమంటే?

కోర్టు కూడా మిక్కీని క్షమించలేక పోయింది. బిప్సీ ఎంత మంచిదో చర్చిలో వాళ్లు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా చెప్పాక కోర్టు తీవ్రంగా స్పందిం చింది. మిక్కీకి జీవితఖైదు విధించింది. బెయిలుకు కూడా అప్లై చేయడానికి లేనంత కఠిన కారాగార శిక్షను అనుభవించాలంటూ తీర్పు చెప్పింది.

జీపు ఎక్కబోతూ ఆగి ఎలిజబెత్ కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చాడు మిక్కీ. ‘‘క్షమించండి... మీ అందరినీ చాలా బాధపెట్టాను’’ అన్నాడు కన్నీళ్లతో.

కానీ వాళ్లు క్షమించగలరా? ప్రేమంటే అవతలివాళ్లు సుఖంగా ఉండాలని కోరు కోవడం. మన సుఖం కోసం వాళ్లను హింసించడం కాదు. ఈ విషయం అర్థం కాక రోజుకో మిక్కీ పుట్టుకొస్తున్నాడు. ప్రేమ పేరుతో ఎవరో ఒక అమాయక ఆడపిల్లను బలి తీసుకుంటున్నాడు. ప్రేమంటే ఇది కాదని వారికెలా అర్థమవడం!
 

ఆడపిల్లల(కే) తల్లి

‘‘అమ్మో ఆడపిల్లా’’... సమాజం ఎంత మారిందనుకున్నా, ఎంత ఎదిగిందనుకున్నా... ఇప్పటికీ ఇదే మాట! ‘రోడ్డు పక్కన మూడు రోజుల పసికందు’, ‘ముళ్లపొదలో ఆర్నెల్ల బాలిక’, ‘బస్టాండులో పసిబిడ్డ’... రోజూ ఇలాంటి వార్తలు చూడటం, అయ్యో అనుకోవడం. పంజాబ్‌కు చెందిన ప్రకాశ్ కౌర్ కూడా అరవై ఏళ్ల క్రితం ఇలాగే ఓ రోడ్డు పక్కన పసికందుగా పడి, ఓ అనాథాశ్రమానికి చేరింది. అందుకే పెరిగి పెద్దయ్యాక ఆమె తన కోసం బతకలేదు. తనలాంటి వారికోసం బతుకుతోంది.



జలంధర్‌లోని ‘యునిక్ హోమ్’కు వెళ్లగానే గేటు ముందు ఓ ఊయల కట్టి ఉంటుంది. ఆడబిడ్డను భారమనుకునే వాళ్లు, రోడ్డు పక్కన ఎవరైనా చిన్నారిని చూసినవాళ్లు తీసుకొచ్చి ఆ ఊయల్లో పడుకోబెడతారు. అక్కడ బిడ్డను ఉంచగానే హోమ్‌లో అలారం మోగుతుంది. వెంటనే ప్రకాశ్‌కౌర్‌కు, ఆమె సహచరులకు తమ ఇంటికి కొత్త అతిథి వచ్చారని అర్థమైపోతుంది.

శియను పుట్టిన నాలుగు గంటలకే ఎవరో నల్లటి పాలిథిన్ కవర్లో పెట్టి ఓ కాలువలో పడేశారు. ఇంకెవరో ఆ పాపను తెచ్చి కౌర్‌కు అప్పగించారు. మరో చిన్నారి రేవా హైవే పక్కన దొరికింది. రజియా, రబియాలు జలంధర్ పక్కన పొలాల్లో దొరికారు. వీరందరినీ అమ్మలా ఆదరిస్తున్నారు ప్రకాశ్ కౌర్. రెండు దశాబ్దాలుగా ఆమె చేస్తున్నది ఇదే పని. దాదాపు అరవై మంది ఆడపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. 1993లో ఆరంభమైన ఈ హోమ్‌లో ఒకట్రెండు రోజుల వయసు నుంచి 20 ఏళ్ల వయసున్న అమ్మాయిల వరకూ ఉన్నారు. విరాళాలతో నడిచే ఈ హోమ్‌ను అన్నీ తానై నడిపిస్తున్నారు కౌర్. పిల్లలకు స్నానాలు చేయించడం దగ్గర నుంచి అన్నింట్లోనూ ఆమె పాత్ర ఉంటుంది. ఆమెకు సహాయకులు హోమ్‌లో పెరిగి పెద్దయిన అమ్మాయిలే. కొత్త పాప వస్తే అక్కడ సందడే సందడి. ఆ పాపను బుజ్జగిస్తూ, ఆడిస్తూ, పాలు పట్టిస్తూ మిగతా అమ్మాయిలు లోకం మరిచిపోతారు. ఒక ఆడపిల్లకు అందాల్సిన వసతులు, మురిపాలన్నీ ఇక్కడి అమ్మాయిలకు దొరుకుతున్నాయి.


ఇక్కడి పిల్లలకు మతం లేదు. కులం లేదు. ఒకే కుటుంబం. ఒకే తల్లి. ఒకే పుట్టినరోజు... అది ఏప్రిల్ 24. ఆ రోజు వంద కిలోల కేక్ తెప్పించి ఒకేసారి పుట్టిన రోజు జరుపుకుంటారు. ఇక్కడి పిల్లల్ని కౌర్ ఎవ్వరికీ దత్తత కూడా ఇవ్వరు. దీనికో కారణం ఉంది. గతంలో ఒకరిద్దరిని దత్తత ఇస్తే వాళ్లను సరిగా చూసుకోలేదు. దాంతో తిరిగి తెచ్చేసుకున్నారు. అంత ఇష్టం ఆమెకు ఆ పిల్లలంటే.

చదువులు, పెళ్లిళ్లు....

పిల్లలను పెంచితేనే సరిపోదంటారు ప్రకాశ్ కౌర్. వారికి చదువు చెప్పిస్తారు. చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేయరు. కొన్నాళ్లు ఉద్యోగాలకు పంపుతారు. దీనివల్ల వారిలో సొంతంగా బతకగలిగే ఆత్మవిశ్వాసం వస్తుందన్నది కౌర్ విశ్వాసం. తర్వాత మంచి సంబంధాలు చూసి పెళ్లి జరిపిస్తారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోగా, ఇంకొందరు మేము అమ్మతోనే ఉంటాం అంటూ కౌర్‌ను విడిచిపెట్టి వెళ్లడం లేదట. పెళ్లిళ్లు అయ్యి వెళ్లిపోయిన వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ అమ్మ అండగా ఉంటుంది. అల్కా అనే యువతికి పెళ్లి చేసి పంపితే కొంతకాలానికి భర్త ప్రమాదంలో చనిపోయారు. అత్తమామలేమో చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా తరిమేశారు. ప్రజా సంఘాలతో పోరాడి ఆమె వాటా ఆమెకు వచ్చేలా చేశారు కౌర్.

అమ్మాయిలు స్వతంత్రంగా బతకగలగాలి అన్నది కౌర్ అభిమతం. అందుకే వారు ఏ స్థితిలో హోమ్‌లో చేరారో పెద్దయ్యాక వారికి వెల్లడిస్తారు. దీనివల్ల జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల కలుగుతుందంటారామె. ‘నేను డాక్టర్నయి, నన్ను విసిరేసిన తల్లికి నేనేంటో తెలియ చెబుతా. అమ్మాయి భారం కాదని రుజువు చేస్తా’ అని ముస్సోరిలో ఎనిమిదో తరగతి చదువుతున్న షీబా చెబుతోంది. డిగ్రీ చదువుతున్న లూసీకి ఇంగ్లిష్ ప్రొఫెసర్ కావాలని ఆశ. ఇక్కడున్న ప్రతి పిల్ల తల్లిదండ్రులూ ఈ అమ్మాయిని ఎందుకు వదులుకున్నామా అని చింతించాలి అంటారు కౌర్ భావోద్వేగంతో.
మూడు పెద్దగదులు మాత్రమే ఉన్న హోమ్‌ను విస్తరించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు ప్రకాశ్‌కౌర్. ‘కొందరు ఇక్కడికొచ్చి ఈ అమ్మాయిలను పని మనుషులుగా పంపమని అడుగుతుం టారు. నాకు చాలా కోపం తెప్పిస్తుందా మాట. వీళ్లు అనాథలు కాదు, నా పిల్లలు అని ఘాటుగా సమాధానమిస్తా’ అంటారు కౌర్. అందుకేగా ఆ పిల్లలంతా ఆమెను అమ్మ అనేది!

డబ్బు విషయంలో మన దుర్లక్షణాలు

‘డబ్బున్న ఉన్నవారికే డబ్బు వస్తుంది.. మనలాంటి వారికి ఎక్కడొస్తుంది’ అనే సనాతన, పురాతన, సంప్రదాయ ఆలోచనలు ఏవైనా మీకుంటే వెంటనే వాటిని బుర్రలోంచి తొలగించండి. అసలు మీకు సంపద రాకుండా చేస్తున్నది ఇలాంటి ఆలోచనలే. చాలామందిలో కనిపించే కొన్ని ఆర్థిక దుర్లక్షణాలు మీకోసం. వెంటనే వదిలించేసుకోండి.

జీతంలో కోతేసుకోవద్దు: వినోదం కోసం, విహారయాత్ర కోసం, వృథా చిల్లర ఖర్చుల ఒత్తిడి నుంచి తప్పించుకోవడం కోసం మీరు అప్పులు చేస్తున్నారంటే మీది భస్మాసుర హస్తమే. అంటే మిమ్మల్ని మీరే నాశనం చేసుకునే వర్గం అని. ప్రతి దానికీ ఏదో ఒక లోను తీసుకుని ఏళ్లకు ఏళ్లు బాధపడటం మొదట ఆపేయండి. అత్యవసర ఖర్చులకు తప్ప మరి దేనికీ రుణం తీసుకోవద్దు. కేవలం 50 వేలు లోను తీసుకుంటే రెండు మూడేళ్లు మీ జీతం రెండు మూడు వేలు తగ్గినట్టే.

డబ్బును గౌరవించండి: ప్రతి దానికీ మీ పేదరికాన్ని తిట్టుకోకండి. ప్రతికూలంగా ఆలోచించకండి. ఆర్థిక సూత్రాలు తెలుసుకుని వాటి నుంచి బయటపడే మార్గాలు ఆలోచించండి. అది మానేసి కేవలం డబ్బు కష్టాల గురించి ఆలోచిస్తూంటే అదీ తీరదు, పైగా ఆరోగ్య నష్టం అదనం.

ఖర్చులు తెలుసుకోండి : చాలామంది ఆదాయానికి ఖర్చులకు పొంతన ఉండదు. దీనికి కారణం వారు దాన్ని ఒకమార్గంలో పెట్టకపోవడం వల్లే. తినే తిండి సమయానికి తినకపోతే దేహం ఎలా ఇబ్బంది పడుతుందో, పెట్టే ఖర్చు పెట్టాల్సినపుడు, పెట్టాల్సిన చోట కాకుండా మరోచోట పెడితే మనం అంతే ఇబ్బంది పడతాం. మీ ఖర్చులు తెలుసుకోవడం వల్ల మీకెంతో ఆర్థిక జ్ఞానం వస్తుంది. కావాలంటే ఓ రెండు నెలలు ట్రై చేయండి చాలు.

స్థాయికి మించి బతకొద్దు : మీ ఖర్చు ఎప్పుడూ మీకు సంతృప్తి ఇవ్వాలి గాని ఎదుటి వారికి ఆశ్చర్యాన్ని ఇవ్వకూడదు. అంటే ఇతరుల మెప్పుకోసం బతకొద్దు. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పండి. ‘మీ ఖరీదైన ఫోను అంత ధర పలకడానికి కారణం అందులోని ఫీచర్లు. మరి వాటన్నిటినీ మీరు వాడుతున్నారా?’ ఇలాగే ఉంటాయి మనఖ ర్చులన్నీ. మనకు ప్రస్తుతం ఉపయోగపడేదే కొనాలి అది ఏవస్తువైనా! కష్టాలొస్తే ఎవ్వరూ చిల్లిగవ్వ కూడా ఇవ్వరు కాబట్టి ఇంకొకరి మెప్పు కోసం విలాసంగా బతకకండి. మీకా స్థాయి ఉంటే ఓకే.
చాలాసార్లు చేసే పనిలో పరాజయం పొందడానికి కారణం మనకు జ్ఞానం లేకపోవడం కాదు... లేని జ్ఞానాన్ని ఉన్నదని అనుకోవడం!

అభిషేకం చేసిన జలాన్ని ఎందుకు స్వీకరిస్తారు?

మన సంప్రదాయాల వెనుక నిగూఢంగా ఆరోగ్య సూత్రాలు ఉన్నాయి. పండుగలు, పర్వదినాలు, పూజలు, వ్రతాలకు ఉన్నట్లే దేవుని విగ్రహానికి చేసే ఉపచారాలు కూడా నిర్దిష్టంగా ఉంటాయి. ఈ క్రతువుల్లో ప్రధానమైనది విగ్రహాభిషేకం. దేవుని విగ్రహానికి స్వచ్ఛమైన నీటితో అభిషేకం చేస్తారు. ఆ నీటిని, అంటే అభిషేక జలాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. ఇందులోని ఉద్దేశం దేవుని విగ్రహాన్ని శుభ్రపరచడం అనుకుంటాం, కానీ నిజానికి మన ఆరోగ్యం కోసమే ఇదంతా. విగ్రహాలు దాదాపుగా కొండల నుంచి సేకరించిన శిలలతోనే తయారవుతాయి. ఖనిజ శిలలను సేకరించి విగ్రహంగా మలుస్తారు. ఖనిజ రాతిని తాకిన నీటిలో ఆ గుణాలు కలుస్తాయి. ఆ నీటిని తాగితే స్వల్ప మోతాదులో ఖనిజ లవణాలు అందుతాయి. అందుకే విగ్రహాన్ని చెక్కడానికి రాతిని సేకరించడం కూడా నిపుణులే చేయాలి.

పర్వతాల నుంచి జాలువారే జలపాతంలో స్నానం చేయడం, వాటిని తాగడం వంటి ఆచారాల్లోని ఉద్దేశం కూడా ఇదే. అయితే ఖనిజ సంపదలు నిండిన పర్వతాల నుంచి ప్రవహించే నీటిని తాగడం అందరికీ సాధ్యం కాదు. కాబట్టి ఆ రాతిని సేకరించి విగ్రహం తయారు చేసి, ఇలాంటి ఆచారాన్ని అలవాటు చేశారు మన రుషులు.

ఐశ్వర్యమొస్తే అర్ధరాత్రి గొడుగు పట్టమనేవాడు...

మనస్తత్వాలు రకరకాలుగా ఉంటాయి. కొందరు ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు. కొందరిలో డాబు, దర్పం ప్రదర్శించాలన్న తపన ఎక్కువగా ఉంటుంది. దర్పం ప్రదర్శించాలన్న బుద్ధి ఉంది అంటే... అది ఏదో ఒక రకంగా బయటపడుతూనే ఉంటుంది. ముఖ్యంగా ఉన్నట్లుండి డబ్బు రావడం మొదలైతే విపరీతమైన సౌకర్యాలు కోరుకుంటారు. అలాంటి సందర్భాన్ని ఉదహరిస్తూ చెప్పే సామెత ఇది.

గొడుగు అవసరం ఎండా వానల నుంచి రక్షించుకోవడానికే కదా! సాధారణంగా అర్ధరాత్రి ఎవరైనా ఇంట్లోనే ఉంటారు. వర్షం వస్తే అసలే బయటకు వెళ్లరు. అంటే ఎలా చూసినా ఈ సమయంలో గొడుగు అవసరం ఉండదు కదా! అలాంటప్పుడు కూడా తనకు గొడుగు పట్టమని ఒక సేవకుడికి పురమాయించడమంటే... డాబు ప్రదర్శనకు పరాకాష్ట కాక మరేమవుతుంది?

డాక్టర్‌ని అడగండి - ప్లాస్టిక్ సర్జరీ

నా వయసు 28. ఇంత చిన్నవయసులోనే బట్టతల స్పష్టంగా కనిపిస్తోంది. పైగా నాకింకా పెళ్లి కాలేదు. నా వయసు చెప్పినా ఎవరూ నమ్మడం లేదు. మొదట్లో నాకు ఒత్తై జుట్టు ఉండేది. మనోవేదన భరించలేక హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకుందామని నిర్ణయించుకున్నాను. అయితే ఇటీవల నా ఫ్రెండ్స్ ద్వారా ఒక మాట విన్నాను. ట్రాన్స్‌ప్లాంటేషన్‌తో తలచర్మానికి క్యాన్సర్ రావచ్చని వాళ్లు చెబుతున్నారు. ఇది నిజమేనా? ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత ఏవైనా మందులు వాడాలా? నా అనుమానాలను నివృత్తి చేయండి.
- కె. శేఖర్‌బాబు, హన్మకొండ
హెయిర్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ వల్ల క్యాన్సర్ వస్తుందన్న మాటల్లో ఎలాంటి వాస్తవం లేదు. ఈ ప్రక్రియలో మీ తలపై నాటేందుకు మీ వెంట్రుకలనే ఉపయోగిస్తారు. మన జన్యువులు నిర్దేశించిన విధంగా ఒక వయసు వచ్చాక వెంట్రుకలు రాలడం మొదలవుతుంది. ఇలా రాలడం కూడా యుక్తవయసుకు చేరినప్పటినుంచి సాధారణంగా తల ముందునుంచి ప్రారంభమవుతుంది. దాంతో హెయిర్‌లైన్ క్రమంగా వెనక్కు వెళ్తూ ఉంటుంది. అయితే ముందు భాగంలో ఎలా రాలినా, ఎంతగా రాలినా సాధారణంగా తల వెనకవైపున చెవుల మధ్య భాగంలోని వెంట్రుకలు మాత్రం అంతగా రాలవు. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాల్సి వచ్చినప్పుడు మనం అక్కడి నుంచి వెంట్రుకలను సేకరించి రాలిన భాగంలో అంటే ముందువైపున నాటుతాం. మన వెంట్రుకలే మనకు వాడటం వల్ల అవి పూర్తిగా సురక్షితం. కాబట్టి వాటితో క్యాన్సర్ రావడానికి అవకాశమే లేదు.

ఇక వాటివల్ల ఇతరత్రా సైడ్‌ఎఫెక్ట్స్ కూడా ఉండవు. కాకపోతే ఒకసారి తొలగించాక నాటువేసిన భాగంలో వెంట్రుకలు రావడానికి నాలుగు నుంచి తొమ్మిది నెలలు పట్టవచ్చు. ఒకసారి అవి నార్మల్ అయితే మిగతా నార్మల్ వెంట్రుకల్లాగే వాటినీ స్టైల్ చేసుకోవచ్చు. ఇక మందుల విషయానికి వస్తే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత తొమ్మిది నెలల వరకు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్లు, ఒక హెయిర్ ఆయిల్ వాడాల్సి ఉంటుంది. కొత్తగా అమర్చిన జుట్టుకు అవసరం లేకపోయినా, మిగతా జుట్టు రాలిపోయే ప్రక్రియ స్వాభావికంగా కొనసాగుతూనే ఉంటుంది కాబట్టి దాన్ని ఆపడానికి మాత్రం కొన్ని మందులు వాడాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ప్లాస్టిక్ సర్జన్‌ను సంప్రదించి తగిన సలహా తీసుకోండి.

నేను టీనేజీకి వచ్చినప్పటి నుంచి ముఖంపై చాలా ఎక్కువగా మొటిమలు వస్తున్నాయి. ఆ తర్వాత అక్కడ నల్లటి మచ్చ పడుతోంది. వీటివల్ల ముఖమంతా గుంతలు పడినట్లుగా మారి అసహ్యంగా కనిపిస్తోంది. ఈ విషయమై నాకు మంచి సలహా ఇవ్వండి.
- సుమలత, పాలకొండ


మొటిమ వచ్చిన చోట మచ్చ పడటానికి అనేక అంశాల దోహదపడతాయి. మొటిమ వచ్చిన చోట ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని తెల్లరక్తకణాలు ఎదుర్కొంటాయి. ఒకసారి ఆ ఇన్ఫెక్షన్ తగ్గాక అక్కడ దెబ్బతిన్న చర్మాన్ని నయం (రిపేర్) చేసే ప్రక్రియ మొదలువుతుంది. అందులో భాగంగా అక్కడి కణజాలం నల్లగా మారుతుంది. ఒక్కోసారి ఆ ప్రాంతమంతా ఉబ్బినట్లు కావడమో లేదా గుంతలాగా పడటమో కూడా జరగవచ్చు. అప్పుడది మచ్చలాగానో, గుంతలాగానో మారవచ్చు. ఈ గుంతలను తగ్గించడానికి సర్జికల్ డెర్మాబ్రేషన్ అనే ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి మీకు దగ్గరలోని ప్లాస్టిక్ సర్జన్‌ని కలవండి.


డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం
 
నిజమైన ప్రేమ ఆత్మావలోకం చేసుకోవడానికి అవకాశాలను కల్పిస్తుంది.
- స్కాట్‌పెక్, అమెరికన్ సైకియాట్రిస్ట్

అందమె ఆనందం

పెసరపిండిలో కొద్దిగా పెరుగు, కొబ్బరి నూనె కలిపి చేతులకు రాయాలి. సున్నితంగా రబ్ చేసి, పది నిమిషాలు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రపరుచుకోవాలి. పెసరపిండి, పెరుగులో ఉండే గుణాలు ట్యాన్‌ను పోగొడతాయి. కొబ్బరినూనె చర్మాన్ని మృదువుగా మారుస్తుంది.
నమ్ము... సహాయపడు... సంతోషం పంచుకో...
ఇవీ భార్యభర్తలు పాటించవలసిన సూత్రాలు.
అవి అదుపుతప్పినప్పుడే భర్త చేతిలో భార్య బాధితురాలవుతుంది...
భార్య వల్ల భర్త బాధితుడవుతాడు.
లాయర్‌గా, నటుడిగా కంటే ‘భార్యాబాధితుల సంఘం’ వ్యవస్థాపకుడిగా సివిఎల్ ప్రసిద్ధుడు.
తీరా ఈయన భార్యాబాధితుడా అంటే ‘ఆ సంఘం పెట్టాలనే ఆలోచనే నాది’ అంటారు ఆయన శ్రీమతి అనురాధ.
రొటీన్‌గా కనిపించని ఈ దంపతుల ముప్పై ఏళ్ల దాంపత్య అనుభవాల సారమే ఈనాటి మన బెటర్‌హాఫ్...


సివిఎల్ నర్సింహారావు ఇంటికి వెళుతున్నప్పుడు ఒక్కక్షణం చిన్న అనుమానం వచ్చింది- ఆయన భార్యాబాధితుడిగా కనిపిస్తాడేమోనని. టీ పెడుతూ, బట్టలుతుకుతూ, తిట్లు తింటూ... కాని సికింద్రాబాద్ పద్మారావునగర్‌లోని వారింటికి వెళ్లినప్పుడు ఆయనా, ఆయన శ్రీమతి అనురాధ ముచ్చటైన జంటగా కనిపించారు. వీరితో మాట్లాడుతుంటే వీరి మధ్య ఉన్న బాంధవ్యమే కాదు, ఇద్దరు లాయర్ల మధ్య పోటీతత్వమూ రాధాగోపాళం సినిమాలోలా కళ్లకు కట్టింది.

అతను - ఆమె

‘చాలామంది పెళ్లిళ్లలాగే మాదీ అనుకోకుండా జరిగింది’ అన్నారు సివిఎల్ మొదలుపెడుతూ. ఆయన స్వస్థలం కృష్ణాజిల్లా. ‘మా అన్నయ్య ఫారిన్ నుంచి వచ్చే టైమ్‌కి నా పెళ్లికి నేనే డేట్ ఫిక్స్ చేసుకున్నాను- ఆయన తిరిగి వెళ్లేలోపల ఆ డేట్‌లో పెళ్లి అయిపోవాలని. ఆ ప్రకారమే హడావుడిగా పెళ్లికూతురిని చూడటం మొదలుపెట్టాను. కజిన్ ద్వారా అనురాధ సంబంధం వచ్చింది. అప్పడు ఈమె ఇంటర్మీడియెట్ చదువుతోంది’ అన్నారు సివిఎల్.

‘పెళ్లి గురించి ఎలాంటి అవగాహన లేని వయసది. అందుకేనేమో ముందే ఈయన ‘మా అమ్మను చూసుకోవడం కోసమే నిన్ను పెళ్లి చేసుకుంటున్నాను’ అని చెప్పినా సరేనని తలూపాను’ అన్నారు అనురాధ. ఆమె స్వస్థలం గోదావరి జిల్లా. ఇంటర్మీడియట్‌లో ప్రాక్టికల్ రికార్డ్స్ రాసే బాధ తప్పుతుందని కూడా పెళ్లికి ఒప్పుకున్నారట. వీరి వివాహం 1982లో అయింది. ఆ తర్వాత రెండేళ్లకు బాబు, మరో ఐదేళ్లకు పాప పుట్టారు. ‘పెళ్లి నాటికి నేను మైనర్‌నే. ‘లా’ ప్రకారం ఇది నేరం’ అంటూ ఇప్పటికీ భర్తతో వాదించే ఆమె 30 ఏళ్లుగా సంసారాన్ని సరాగంలా మార్చుకున్న వైనాలెన్నో తెలిపారు.

రాధాగోపాళం...

సివిఎల్ లాయర్ మాత్రమే కాదు. మంచి నటుడు కూడా. ఎన్నో సినిమాల్లో నటించారు. స్టేజీ మీద నాటకాలు వేసేవారు. సామాజిక సేవ చేపట్టారు. రాజకీయాల్లోనూ ప్రవేశించారు. అనురాధ గృహిణి మాత్రమే కాదు, లాయర్ కూడా. భర్త నటుడిగా కెమెరా ముందుకు వచ్చారని ఆమే టీవీ షోలలో పాల్గొన్నారు. డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌కి దర్శకత్వం వహించారు. వృత్తిలో తన సత్తా నిరూపించుకున్నారు. ఫ్యామిలీ కౌన్సెలర్‌గా ఎన్నో సమస్యలు పరిష్కరిస్తున్నారు. ఇద్దరికిద్దరు ఏ విషయంలోనూ తీసిపోరు. ఒకే రంగంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వివాహబంధంలో ఎంతవరకు ఇముడుతారనే విషయం అడగ్గానే -‘నేను ఎంచుకున్న రంగాలలో ప్రవేశించడం వల్లే తను వాటిలోని సాధకబాధకాలు తెలుసుకోగలిగింది. దానివల్లేనేమో నేనెప్పుడైనా కాస్తంత డౌన్ అయినట్టు అనిపించినా ‘నేనున్నాను కదా’ అనే సపోర్ట్ అనురాధ నుంచి లభించింది’ అని తనలోని సగ భాగాన్ని మెచ్చుకుంటూనే, ఆలుమగలు ఒకే రంగంవారైతే కలిగే ప్రయోజనాలనూ తెలియజేశారు సివిఎల్.

‘పెళ్లి వల్ల ఇంటర్మీడియట్‌తో చదువు ఆపేసిన నేను ఈయనకున్న పాపులారిటీ చూసి మొదట్లో కుళ్లుకునేదాన్ని. ఎలాగైనా నేనూ లాయర్ అయి తీరతాను అనేదాన్ని. ఈయన ‘నీవల్లకాదులే’ అన్నట్టు చూసేవారు. ఎందుకు కాదో చూద్దామనే పంతంతో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ చేశాను. పిల్లల పరీక్షలు నా పరీక్షలు ఒకే రోజు ఉండేవి. ఎవరికి ఎక్కువ మార్కులు వస్తాయో చూద్దామా అని పిల్లలతో పోటీపడేదాన్ని. ‘లా’ పూర్తయ్యాక ఎవరిదగ్గరో ఎందుకని ఈయన దగ్గరే జూనియర్‌గా చేరాను. భార్య కదా అని ఏ మాత్రం ఫ్రీగా ఉండనిచ్చేవారు కాదు. మిగతా జూనియర్స్‌కన్నా ఎక్కువ పనులే అప్పజెప్పేవారు. ఏ నోటీస్ రాసినా ఓ పట్టాన నచ్చేది కాదు. ‘ఎంతైనా సీనియర్, తప్పదు’ అనుకుంటూ, కోపాన్ని అణచుకునేదాన్ని. ‘ఎప్పటికైనా ఏదో ఒక కేసులో ఈయన మీద గెలిచి తీరాలి... అప్పుడు తెలిసొస్తుంది నేనేంటో’ అనుకునేదాన్ని.అనుకున్నట్టే ఈ మధ్యే ఓ కేసు విషయంలో ఈయన మీదే గెలిచాను. విచిత్రమేమిటంటే నాకన్నా ఈయనే ఎక్కువ సంతోషించారు...’ అని చెబుతున్న అనురాధ వృత్తిపరమైన కోపాలను ఇద్దరం ఇంటికి తెచ్చేవారం కాదనే విషయాలనూ తెలియజేశారు. గృహిణిగా ఇంటికే పరిమితం చేయకుండా సమాజంలో తనకో ఉనికిని కల్పించిన గురువు తన భర్తేనని సివిఎల్‌ను మనసారా అభినందించారు ఆమె.

ఆడుతు పాడుతు పనిచేస్తుంటే...

చదువు, కోర్టు, పిల్లల బాధ్యతలు, ఇంటి పనులు... బ్యాలెన్స్ చేసుకోవడం గురించి చెబుతూ- ‘కోర్టుకు ఇద్దరం పొద్దున్నే వెళ్లిపోవాలి. నేను చపాతీలు చేస్తుంటే ఈయనే కాల్చిస్తారు. ఈయన కూరగాయలు తరుగుతుంటే నేను కూరచేస్తాను...’ అని పాటలా సాగే సంసారనౌకకు ఆలూమగలు ఇంటి పనుల్లోనూ సమానమే అని తెలిపారు ఈ దంపతులు. ‘ఆర్థిక విషయాల్లో నేనే ఎక్కువ చొరవ తీసుకుంటాను. ఎందుకంటే బ్యాంకు ఖాతాలు, చెక్కుబుక్కులు... ఆ వివరాల గురించి ఈయనకు ఏమీ తెలియదు. ఇప్పటివరకు ఈయన ఒక్క చెక్కు కూడా తన చేతుల మీదుగా బ్యాంకులో వేసింది లేదు’ అని అనురాధ చెబుతుంటే సివిఎల్ మందహాసం చేస్తూ కనిపించారు. ఆ నవ్వుల వెనక... ఆర్థిక విషయాల్లో భార్యామణికి స్వేచ్ఛనిస్తే కుటుంబం సాఫీగా నడిచి పోతుందనే మతలబు కనిపించింది. ఇరువైపుల పుట్టింటివారిని, బంధువులను భార్యాభర్తలు ఎలా చూసుకోవాలనే అంశం గురించి ప్రస్తావిస్తే - ‘నాకు ఐదుగురు అక్కచెల్లెళ్లు. 86 ఏళ్ల మా అమ్మ నా దగ్గరే ఉంటుంది. ‘అత్తయ్యగారూ..’ అంటూ ఈయన నోటి నిండుగా పిలుస్తారు. మా నాన్నగారి కర్మకాండలు దగ్గరుండి చేశారు. భార్య పుట్టింటివారిని కూడా తన కుటుంబంగా భావించి, గౌరవమర్యాదలు ఇచ్చే భర్త అంటే ఏ భార్యకైనా అవ్యాజమైన ప్రేమ కలుగుతుంది’ అన్నారు అనురాధ. ‘అది అక్షరాలా నిజమనే విషయం చాలామంది భర్తలకే కాదు భార్యలకూ అర్థం కాదు కనుకనే ఒకరి మనసును ఒకరు ముక్కలు చేస్తుంటారు’ అన్నారు సివిఎల్.

తోడు... నీడ...

సంసారమన్నాక సమస్యలు తప్పవు. వీరి దాంపత్యంలోనూ ఎన్నో సంఘటనలు సమస్యలను సృష్టించాయి. అందులో ఒకటి ‘భార్యాబాధిత సంఘం’. ఈ విషయం గురించి అనురాధ మాట్లాడుతూ- ‘భార్యాబాధిత సంఘం ఆలోచనే నాది. మంచి భార్యలు చెడ్డ భర్తలతో ఎలాగైతే కష్టాలు పడుతున్నారో, మంచి భర్తలు చెడ్డ భార్యలతో అలాగే కష్టాలు పడుతున్నారు. అలాంటివారిని ఎంతోమందిని చూశాను. నిత్యం మా దగ్గరకు భర్త బాధిత మహిళలే కాదు, భార్యా బాధిత భర్తలు కూడా వస్తుంటారు. అలా వచ్చేవారికి సివిఎల్ నేనూ కౌన్సెలింగ్ ఇస్తున్నాం. ‘మంచి భర్త’కు మేలు కలగాలన్న నా ప్రతిపాదన ఓ రోజు ఈయన ముందు ఉంచాను. ఇద్దరం మాట్లాడుకుని ‘భార్యాబాధిత సంఘం’ పెట్టాం. మరుసటిరోజు హైకోర్టు నోటీస్ బోర్డులో ‘సివిఎల్ ... భార్యాబాధితుడు’ అని రాశారు. ఆరోజు చాలా బాధనిపించింది. మంచి చేద్దామనుకుంటే మన గురించి చెడుగా మాట్లాడుకునేవారు ఎక్కువయ్యారని. ఆ రోజే ‘మేం విడిపోలేదు. కలిసే ఉన్నాం’అని ప్రెస్‌మీట్ పెట్టి చెప్పుకునే పరిస్థితి వచ్చింది. అంతేకాదు, మహిళాసంఘాల నేతల నుంచీ వ్యతిరేకత వచ్చింది. ఇక ఈయన ముక్కుసూటితత్వం, నిజాయితీ కొంతమంది ఉన్నతోద్యోగులకు నచ్చేది కాదు. ఫలితంగా ఒకరోజు... రోడ్డుకు దగ్గరగా ఉందని మా ఇల్లు కూలగొట్టారు. తిరిగి ఆ ఇంటిని నిలబెట్టుకునేందుకు మానసికంగా, ఆర్థికంగా ఎంత కష్టపడ్డామో ఎప్పటికీ మర్చిపోలేం’ అన్నారు అనురాధ.

అబద్ధాలైనా అందమే...

‘కత్రినాకైఫ్ నటించిన మల్లీశ్వరి సినిమాలో ఈయనా ఉన్నారు. ఆ హీరోయిన్ అందం గురించి అడిగితే, ‘నువ్వే నా కత్రినా, నువ్వే నా ఐశ్వర్య... నీకన్నా ఎవరూ అందంగా కనిపించరు నాకు’ అన్నారు. అది నిజమేనని అప్పుడు ఎంత మురిసిపోయానో... కాని...’ అని చెప్పుకుపోతున్న శ్రీమతి వాక్ప్రవాహానికి కళ్లెం వేస్తూ ‘కొన్ని సందర్భాల్లో అబద్ధాలు ఆడకపోతే పనులు జరగవోయ్’ అని నవ్వేస్తూ ‘బాంధవ్యం బాగుండాలంటే అబద్ధాలు ఆడినా పర్వాలేదు’ అన్నారు సివిఎల్.

మ్యారేజ్‌ను ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలిసిన లాయర్ సివిఎల్... లోకం తెలియని తన అర్థాంగిలోని ‘పంతాన్ని’గ్రహించారు. ఆమెను చదువుకునేలా ప్రోత్సహించారు. వృత్తిలో ఎదిగి తన కాళ్ల మీద తను నిలబడగలిగే స్వతంత్రను కల్పించారు. కుటుంబాన్ని చక్కదిద్దే నేర్పును కలిగించారు. అయితే వీటన్నింటినీ తెలుసుకుంటూనే తెలివిగా సివిఎల్‌కి సమవుజ్జీగా నిలిచారు అనురాధ. ‘భార్యభర్తలిద్దరూ సమానమే. కాకపోతే భర్తే కాస్త ఎక్కువ సమానం’ అనే శ్రీవారితో ఇప్పటికీ ఆమె ప్రేమగా వాదిస్తూనే ఉన్నారు.
- నిర్మలారెడ్డి

ఎప్పటికైనా ఏదో ఒక కేసులో ఈయన మీద గెలిచి తీరాలి... అప్పుడు తెలిసొస్తుంది నేనేంటో’ అనుకునేదాన్ని. అనుకున్నట్టే ఈ మధ్యే ఓ కేసు విషయంలో ఈయన మీదే గెలిచాను. విచిత్రమేమిటంటే నాకన్నా ఈయనే ఎక్కువ సంతోషించారు.
- అనురాధ

నేను ఎంచుకున్న రంగాలలో ప్రవేశించడం వల్లే తను వాటిలోని సాధకబాధకాలు తెలుసుకోగలిగింది. దానివల్లేనేమో నేనెప్పుడైనా కాస్తంత డౌన్ అయినట్టు అనిపించినా ‘నేనున్నాను కదా’ అనే సపోర్ట్ అనురాధ నుంచి లభించింది
- సివిఎల్

Health Benefits of Sesame Oil

Sesame seeds and oil are a part of our food preparations. Not many of us are aware that this ingredient is known to possess a number of medicinal properties along with umpteen nutritional benefits.
Read on to know of a few of them:

1. Blood Pressure

Sesame oil aids the lowering of your blood pressure along with the sodium content too. It is important to consciously include sesame oil in your diet in order to enjoy the benefits of this ingredient.

2. Antioxidants

Sesame oil is an extremely rich source of antioxidants which required by the body. By consuming sesame oil you would be helping your body fight against bacteria and also counter the damage caused by viruses in your body.


3. Blood Sugar

For all those of you suffering from diabetes, this is definitely good news. Research shows that sesame oil has an inexplicable effect on the blood sugar level. It is known to reduce the level of sugar, hence, you must certainly think of incorporating it in your diet.

4. Skin
Sesame oil contains Vitamin E and B, which is particularly healthy for the skin. These vitamins not only help your skin in dealing with the damage, if any, but also bring a beautiful glow to the face. To attain spotless and tight skin, use products that contain sesame oil or simply apply it on your skin.

5. Cold

Sesame oil does wonders in helping you fight the congestion you might be facing due to cold. Inhaling the steam from this oil could give you the much-needed relief from severe cold and even sinuses.

6. Hair Care

Massaging your scalp regularly with sesame oil can help you get rid of the dandruff in your hair. You might want to try a shampoo containing this fabulous ingredient if you have dandruff. It will indeed have a soothing effect on the scalp.

7. Stress Relief

Dealing with stress the natural way would be the best decision you would ever make. Consuming sesame oil regularly can reduce your stress levels as well as relieve you of fatigue.
Trying traditional methods to cure and prevent physical and mental problems you might be suffering from, can certainly be a safer and more effective remedy for the longer run. Sesame oil has more than one benefit for your entire body. So, enlist it as a diet essential today.

Saturday, December 1, 2012

అందమె ఆనందం

పచ్చిపాలు, అలొవెరా జెల్, తేనె సమభాగాలుగా తీసుకొని, అందులో ఎసెన్షియల్ ఆయిల్ రెండు చుక్కలు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకొని, ఇరవై నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి. ఈ ప్యాక్ వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా అవుతుంది.

నాకున్న వైకల్యం...నాలో కసి పెంచింది-అనంత్ శ్రీరామ్;-)

కార్కుతో ఓపెన్ చేసి తాగేందుకు కాదు మార్కులు
ఫోర్కుతో పొడిచి తినడానికి పనికిరావు మార్కులు
స్పార్కు ఏదైనా ఎవరిలోనైనా ఉంటే దాన్ని గుర్తించడానికి ఉపయోగపడే స్కేలు మీద ఉండే మార్కింగులే మార్కులు.
అందుకే ప్రహ్లాదుళ్లా చదువుల్లోని సారాన్నే చదివారాయన.
తన మార్కు కనపడేలా కళారంగంలో కుదురుకున్నారు.
సోడాబుడ్డి కళ్లద్దాలంటూ ఎగతాళి చేశారు కొందరు ఫ్రెండ్స్.
కళ్లద్దాల మందం పెరుగుతుందంటే పవరూ పెరిగిందని కదా అర్థం.
అంటే తనకు పవరెక్కువని భాష్యం చెప్పుకున్నారాయన.
అక్షరాలు సాఫీగా సాగితే అది మాట.
మాట మెలికలు తిరిగితే అది పాట.
అవును... వైవిధ్యం ఎప్పుడూ వర్కవుటువుతుంది.
ఆ వైభవానికి సమాజం సాగిలపడుతుంది.
అనంత్ శ్రీరామ్‌లోని మెలికలు తిరిగిన అభిప్రాయాలను అక్షరాలా ఆవిష్కరించే అక్షరాలే ఆయనలోని ‘అదర్‌సైడ్’.


పాట రాయాలంటే మీకు ఉత్ప్రేరకంగా నిలిచేది ఏది? స్మోక్, డ్రింక్... చాలామంది రచయితలు అవి లేకుండా రాయరని అనుకుంటూ ఉంటారు?

అనంత్ శ్రీరామ్: మా తాతయ్య లాయరండీ. ఆయన తాగేవారట. ఆ కారణంగా మా కుటుంబం చాలా నష్టపోయిందని విన్నాను. అలాగే మా మేనమామ కూడా డ్రింక్ చేస్తారు. ఆయన్ను కూడా చాలాసార్లు గమనించాను. ఈ అనుభవాల వల్ల నాకు తెలిసిందేంటంటే. తాగిన మనిషి ఆ క్షణాల్లో విచక్షణను కోల్పోతాడు. అతను ఎంతటి ప్రజ్ఞావంతుడైనా తాగిన క్షణాల్లో అతని గొప్పనంతా సమాజం మరిచిపోతుంది. తిట్టడం మొదలుపెడుతుంది. అన్ని గొప్ప గుణాలను ఆభరణాలుగా చేసుకొని, కేవలం ఓ చిన్న దురలవాటు వల్ల సమాజానికి చులకన అవ్వడం అవసరమా? దాంతో మందునూ ఇతర ఏ వ్యసనాన్నీ దరి చేరనివ్వలేదు.

మరి పాట రాయడానికి కావలసిన మూడ్ కోసం ఏం చేస్తారు?

అనంత్ శ్రీరామ్: మంచి ఆలోచనల కోసం మొదట్లో పాట రాస్తున్నప్పుడు బబుల్‌గమ్ నమిలేవాణ్ని. అప్పుడెవరో శ్రేయోభిలాషులు చెప్పారు అది తింటే కేన్సర్ వస్తుందని. వెంటనే మానేశాను. అసలు ‘అలవాటు’ అనేది నెగిటీవ్‌దే ఎందుకు అయ్యుండాలి. పాజిటివ్ అలవాట్లను ఎందుకు అలవరచుకోకూడదు అనిపించింది. ఆ ఆలోచన రాగానే నాకు దొరికిన పరిష్కారం ‘మెడిటేషన్’. ఎప్పుడైనా ఒత్తిడి ఎక్కువైతే.. నాలుగైదు నిమిషాలు మెడిటేషన్ చేస్తా. అంతే ఒత్తిడంతా దూది పింజలా ఎగిరిపోతుంది. సిగెరెట్, మందు, పేకాటా వీటన్నింటికీ జనం అలవాటు పడేది కూడా ఒత్తిడి తగ్గించుకోడానికే. మెడిటేషన్ ద్వారా ఇప్పుడు అంతకంటే రిలాక్సేషన్, అంతకంటే కిక్కు నాకు దొరికింది.

అసలు ఇంతటి సాహిత్యాభిలాష ఎలా అబ్బింది మీకు?

అనంత్ శ్రీరామ్: చిన్నప్పట్నుంచీ ఉందండీ. కారణం మా నాన్నగారే. ఆయన పద్యాలు బాగా పాడతారు. పద్యాలంటే... సంప్రదాయ పౌరాణిక పద్యాలు కాదు. జంధ్యాల పాపయ్యశాస్త్రి, రాయప్రోలు సుబ్బారావు, విశ్వనాథ సత్యనారాయణ లాంటి వాళ్లు.. మన సంస్కృతి, సంప్రదాయాల గురించి, చరిత్ర ఔన్నిత్యం గురించి రాసిన పద్యాలవి. వాటిని ఆయన పాడుతూ ఉండేవారు. ఆస్వాదించే కొలదీ సాహితీ పరిమళాలు వాటినుంచి ఉద్భవిస్తూ ఉంటాయి. కాలక్రమంలో అవి నాపై చూపిన ప్రభావం అంతాఇంతా కాదు.

మిమ్మల్ని బాగా ఇన్‌స్పైర్ చేసిన బుక్?

అనంత్ శ్రీరామ్: ‘వేదం జీవన నాదం’. దాశరధి రంగాచార్య రాసిన బుక్ అది. ఆ పుస్తకం గురించి పూర్తిగా విపులీకరించలేను కానీ.. కొన్ని విషయాలు మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం చాలామంది తమ టాయిలెట్స్‌లో వెస్ట్రన్ కమోడ్‌లనే వాడుతున్నారు. అది మన భారతీయ విధానానికి విరుద్ధం. మన విధానంలో విరేచనం సాఫీగా అవ్వడానికి ఇచ్చిన ఆసనం ఎంత గొప్పదో చెప్పారు. మన తొడలు పొట్ట కండరాలను నొక్కిపడుతాయ్. తద్వారా పొట్ట కండరాలు వ్యాకోచించి సుఖ విరేచనం అవుతుంది. ఈ విషయం తెలీక టాయిలెట్‌లలో వెస్ట్రన్ కమోడ్‌లకు అలవాటు పడిపోతున్నాం. వాటిలో టాయిలెట్‌కి వెళితే కిడ్నీలు త్వరగా పాడవుతాయి. మన సైన్స్ ఎంత గొప్పదంటే... మగవాళ్లతో గర్భం దాల్పించారు. భరద్వాజ మహర్షి చేసిన ప్రయోగమది. అయితే... అది ప్రకృతి విరుద్ధం కాబట్టి ఆ ప్రక్రియకు అప్పుడే స్వస్తి పలికారు. టెస్ట్‌ట్యూబ్ బేబీ ప్రక్రియ ఓ పాతికేళ్ల కిందట వచ్చింది. కానీ మన చరిత్రలో కౌరవులు ఎవరు? టెస్ట్ ట్యూబ్ బేబీలు కారా? విశ్చిన్నమైన పిండాన్ని భద్రపరచి కౌరవుల జన్మకు కారకుడవ్వలేదా వ్యాసుడు. అయితే... ప్రకృతి విరుద్ధంగా పుట్టారు కాబట్టి కౌరవులు దుర్మార్గులయ్యారు. అందుకే ఆ ప్రక్రియకు అప్పుడే మంగళం పలికారు మనవాళ్లు. విజ్ఞానం అసలు ఎప్పుడు పుట్టింది? ఎలా అభివృద్ధి చెందింది? భారతీయ విజ్ఞానం ఎంతగొప్పది? ఈ విశేషాలన్నీ ‘వేదం జీవన నాదం’ పుస్తకంలో ఉంటాయ్. అలాగే గీత రచయితగా జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి పద్యాలు నాకు ఇన్‌స్పిరేషన్ అని చెప్పొచ్చు.

అసలు మీరేం చదివారు?

అనంత్ శ్రీరామ్: ఇంజనీరింగ్ డిస్‌కంటిన్యూ చేశాను.

ఎందుకు?

అనంత్ శ్రీరామ్: ఇష్టం లేదు. మన విద్యావ్యవస్థ పరమ అసమర్థమైన వ్యవస్థ. ముఖ్యంగా మన రాష్ట్ర విద్యావ్యవస్థ. మరొక్కసారి చెబుతున్నాను వినండి.. మన రాష్ట్ర విద్యావ్యవస్థ పరమ అసమర్థమైన, స్వార్థపూరితమైనది.

ఎందుకంత ఆవేశం?

అనంత్ శ్రీరామ్: మార్కులకు తప్ప మనసులకు విలువివ్వని విద్యావిధానాలు. విజయాలకు తప్ప విజ్ఞతలకు విలువివ్వని విద్యాసంస్థలు మన విద్యా వ్యవస్థను నడిపిస్తున్నాయి. అందుకే అంత ఆవేశం.

మీ ఆవేశానికి కారణం వివరంగా చెబుతారా?

అనంత్ శ్రీరామ్: తప్పకుండా... ముందు నాకు టెన్త్ క్లాస్‌లో జరిగిన కొన్ని అనుభవాలు చెబుతాను. హిందీ సబ్జెక్ట్‌కి వచ్చేసరికి ‘వీజీఎస్’ అని ఓ గైడ్ ఉండేది. దాన్నే ఎక్కువ మంది విద్యార్థులు చదివేవారు. అధ్యాపకులు కూడా విద్యార్థులకు ఆ గైడ్‌నే సూచించేవారు. నాకు మాత్రం హిందీ గైడ్ ‘సుకుమార్’ బాగా నచ్చింది. అందుకే ఆ గైడ్‌ని అనుసరించి పరీక్షలు రాశాను. అయితే... నాకు హిందీలో 42 మార్కులే వచ్చాయి. మిగతా సబ్జెక్టుల్లో మాత్రం 85కి పైగానే వచ్చాయి. దీంతో నాకు స్కూల్ ఫస్ట్ పోయింది. దాంతో రీ వాల్యుయేషన్ కోసం పోరాడాను. చివరికి రీ కౌంటింగ్ పెట్టారు. దాంట్లో కేవలం బిట్ పేపర్‌కే 25కి 24 మార్కులొచ్చాయి. కొశ్చన్ పేపర్‌కి మాత్రం 18 మార్కులే వేశారు. నాకు జరిగిన అన్యాయంపై వాళ్లను నిలదీస్తే... వాళ్లు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? (ఆ గైడ్‌లో నేను చదివిన) సమాధానాలు చిన్నవిగా ఉన్నాయట. నా అక్షరాలే చిన్నవిగా ఉంటాయి. అది నా పాపమా. సమాధానాలు సరైనవా? కావా? అని మాత్రమే వాళ్లు చూడాలి. కానీ సమాధానాలు జానాబెత్తలతో కొలిచి 42 మార్కులు ఇచ్చారు. ఇంత కష్టపడి చదివిన తర్వాత కూడా నాకు రావాల్సిన మార్కులు రాకుండా చేసిన ఈ విద్యావ్యవస్థను నేనెందుకు గౌరవించాలి. ఇంటర్ నేను ‘గీతాంజలి రెసిడెన్షియల్ కాలేజ్’లో చదివాను. వారానికి ఓ పరీక్ష పెట్టేవారు. వారం వారం పరీక్షలంటే... ఏదో ఒకవారం ఎవడికో ఒకడికి ఒంట్లో బావుండదు. ఆ ఒంట్లో బాగుండని వాడికి తక్కువ మార్కులొస్తే.. వాడ్ని అందరి ముందు అవమానంగా మాట్లాడేవారు. చివరకు విద్యార్థులు కూడా ఈ విధానానికి ప్రభావితం అయిపోయారు. మార్కులు తినేద్దాం, మార్కుల్ని తాగేద్దాం అన్నట్టుగా వుండేది ఇలా కడలిలాంటి ఆ కళాశాలలో ఓ కొబ్బరి తెడ్డులా సంస్కృతం మాస్టారు కోటేశ్వరరావుగారు కనిపించారు. ఆయన మాత్రం నన్ను చాలా ఎంకరేజ్ చేసేవారు. అందరూ స్కోరింగ్ కోసం సాంస్క్రిట్ తీసుకునేవారు. నేను మాత్రం ప్రేమించి తీసుకున్నాను. మాస్టారు చెప్పే కాళిదాసు కవితలు, ‘సుధీక్షణాదేవి చూపులతోనే తాగింది’ అనే భావాలు నాలో భావుకతను పెంచాయి.

ఇంజనీరింగ్‌లో ఏం జరిగింది?....

అనంత్ శ్రీరామ్: ఇంజనీరింగ్ కాలేజ్‌లో మన ఆసక్తితో ఎవరికీ పనిలేదు. దేనికి డబ్బొస్తే దానికే విలువ. వాళ్ల దృష్టిలో గొప్ప పెళ్లికొడుకు, గొప్ప పెళ్లి కూతురు ఎవరంటే... ఎంబీబీఎస్, బీటెక్ చేసిన వాళ్లే. అలా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తున్నారు. పైగా కళలు కూడు పెడతాయా? అని ఎప్పటికప్పుడు నిరుత్సాహానికి గురిచేసేవారు. అప్పుడే నాకు కసి పెరిగింది. ‘ర్యాంకులు మీకు గొప్పేమో... కళ నాకు గొప్ప’ అని అప్పుడే వారితో వాదించాను. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ నాకు ఉపయోగపడదని నిర్ణయించుకున్నాను. కళలు మనిషిని మహనీయుడ్ని చేస్తాయని నిరూపించాలనుకున్నాను.

మరిప్పుడు గేయరచయితగా మీరు ఓ మంచి హోదాలో ఉన్నారు. అప్పుడు మిమ్మల్ని రగిలించిన వాళ్ళెవరైనా మీకు తారసపడటం జరిగిందా?

అనంత్ శ్రీరామ్: అప్పుడు మాకు పాఠాలు చెప్పిన ఏ ఉపాధ్యాయులు ఇప్పుడు అక్కడ లేరు. ఎక్కడెక్కడ ఉన్నారో నాకే తెలీదు. అసలు మనల్ని పట్టించుకునే టైమ్ కూడా వాళ్లకు ఉండదు. ఇదంతా నా ఆత్మసంతృప్తికోసం చెబుతున్న విషయాలే.

మరి మీ ఫ్రెండ్స్ కలుస్తుంటారా?

అనంత్ శ్రీరామ్: కాలేజ్ టైమ్‌లో వంశీ, వరుణ్, ప్రియాంక నా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్లందరూ అమెరికాలో ఉన్నా ఇప్పటికీ వారిని నేను వదిలిపెట్టలేదు. ఎప్పటికప్పుడు వారి యోగక్షేమాలను కనుక్కుంటూనే ఉంటాను.

ఇటీవలే మీ పెళ్లయింది. జీవితం ఎలా ఉంది?

అనంత్ శ్రీరామ్: మొదట అసలు పెళ్లంటేనే భయపడేవాడ్ని. ఇంట్లో వాళ్లు చూస్తామన్నా వద్దనేసేవాడ్ని. అమ్మానాన్న మా ఊళ్లో ఉంటారు. ఇక్కడ మొన్నటిదాకా నేనొక్కడ్నే. హోటల్‌లో భోంచేసేవాడ్ని. దానికి తోడు ఇంటి అద్దె. ఖర్చు చాలా ఎక్కువ అయ్యేది. ‘తను దూర సందు లేదు. మెడకో డోలు’ అన్న చందాన, భార్య కూడా వస్తే ఇక ఆ భారం భరించడం కష్టం అని ముందు వద్దన్నాను. కానీ ఆమె వచ్చాక తెలిసింది నా అభిప్రాయం తప్పని. ఇప్పుడు నా ఖర్చులు 30 శాతం తగ్గిపోయాయి. ఇంటి భోజనం వల్ల డబ్బు చాలా ఆదా అవుతోంది. పైగా టైమ్ ప్రకారం భోజనం చేస్తుండటంతో నా ఆరోగ్యం కూడా బలపడింది. గతం కంటే వేగంగా పాటలు రాయగలుగుతున్నాను.

దీన్ని బట్టి మీరు చాలా పొదుపరి అన్నమాట?

అనంత్ శ్రీరామ్: అలాంటిదేం లేదండీ... అవసరానికి తగ్గట్టు ఖర్చు కచ్ఛితంగా ఉంటుంది.

మీ భార్యాభర్తల్లో ఎవరి డామినేషన్ ఎక్కువ?

అనంత్ శ్రీరామ్: ఇంటి వరకు అయితే... ఆమే రాణి. అయితే.. నా వృత్తి విషయాల్లో మాత్రం అస్సలు జోక్యం చేసుకోదు. నేనూ అంతే... ఇంటి వ్యవహారాలన్నీ ఆమెకే వదిలేస్తా.

ఎంత కట్నం తీసుకున్నారూ?

అనంత్ శ్రీరామ్: (నవ్వుతూ) అనవసరంగా అబద్ధాలాడటం నాకు ఇష్టం ఉండదండీ. నేను కట్నం తీసుకోలేదు. ఇది పచ్చినిజం. అసలు నా దృష్టిలో కట్నం తీసుకోవడం దుర్మార్గం. తమ కూతురికి వాళ్లు ఎంతిచ్చినా తప్పుకాదు. అయితే... మా అబ్బాయి అంత చదివాడు, ఇంత చదివాడు. ఇన్ని లక్షలిస్తే తప్ప మీ అమ్మాయిని చేసుకోం అనడం తప్పు అంటున్నాను.

కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకోవాలని ఎందుకనిపించింది?

అనంత్ శ్రీరామ్: కట్నం తీసుకోవడం... వ్యభిచారం చేయడం నా దృష్టిలో ఒక్కటే. అందుకే తీసుకోలేదు. కట్నం తీసుకొని డాబుగా తిరిగే పెళ్లి కొడుకుల్ని నేను చాలామందిని చూశాను. ఒక జీవితాన్ని ఇద్దరు కలిసి పంచుకోవడమే పెళ్లి. మగాడి శక్తిసామర్థ్యాలు సంపాదనలో కనిపిస్తాయి. ఆడదాని శక్తి ఇంటిని చక్కదిద్దుకోవడంలో కనిపిస్తుంది. ఇలా రెండు బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకుంటున్నప్పుడు పర్టిక్యులర్‌గా అబ్బాయే ఎందుకు డబ్బులు తీసుకోవాలి? అనే ప్రశ్న తలెత్తింది. అందుకే ఆస్థిపాస్థుల గురించి పట్టించుకోకుండా, పెళ్లి ఖర్చు కూడా నేనే భరించి, నా భార్యను తెచ్చుకున్నాను.

మీ శ్రీమతికి మీరు రాసిన పాటల్లో ఏ పాటంటే ఇష్టం?

అనంత్ శ్రీరామ్: ఆమెకు ఫిమేల్ సోలోసాంగ్స్ అంటే ఇష్టం. ‘మిస్టర్‌పర్‌ఫెక్ట్‌లో ‘చలిచలిగా అల్లింది...’ పాటను బాగా ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్‌గా ‘జీనియస్’ అనే సినిమాలో ఓ పాట రాశాను. ‘ఏవేవో కలలు...’ అనే పల్లవితో ఆ పాట సాగుతుంది. ఆ పాట కూడా ఆమెకు బాగా ఇష్టం. ‘అసలు అమ్మాయిల మనసులో భావాలు మీకెలా తెలుస్తాయి?’ అని అడుగుతుంటుంది నన్ను.

అదే ప్రశ్న నేనూ అడుగుతున్నాను చెప్పండి?

అనంత్ శ్రీరామ్: దానికి కారణం ఏంటంటే... నా కాలేజ్ టైమ్‌లో నా ఫ్రెండ్సందరూ లవర్సే. ఈ కారణంగా వాళ్లు ప్రేమించే అమ్మాయిలు కూడా నాకు ఫ్రెండ్స్ అయిపోయేవారు. ఆ అమ్మాయిలతో గడిపిన క్షణాలు ఫ్రెండ్స్ నాతో పంచుకునేవాళ్లు. అలాగే నా ఫ్రెండ్స్‌తో గడిపిన క్షణాలు ఆ అమ్మాయిలూ నాతో పంచుకునేవారు. నేనేమో న్యూట్రల్ పర్సన్‌లా ఉండేవాడ్ని. ఈ కారణంగా ప్రేమ గురించి వారికంటే నాకే ఎక్కువ అవగాహన పెరిగేది. ముఖ్యంగా అమ్మాయిల మనోభావాలు మాత్రం చాలా సున్నితంగా అనిపించేవి. ప్రేమ విషయంలో నేను గమనించిన గమ్మత్తు ఏంటంటే... అబ్బాయ్ అగ్రెసివ్ అయితే... అమ్మాయి సాఫ్ట్‌గా అనిపించేది. అబ్బాయ్ సాఫ్ట్ అయితే.. అమ్మాయి వాగుడుకాయ్ అయ్యుండేది. అబ్బాయి చాలా అందగాడైతే... అమ్మాయి ఓ మాదిరి అందగత్తె అయ్యుండేది. ఇలా వ్యతిరేక లక్షణాలున్న వారే జంటగా మారడం నేను గమనించాను. కలవని తీరైనా.. తలపులు వేరైనా.. పరిచయం బలపడిపోతుంది. ఆ మేజిక్ ఏంటో ఎవరికీ అర్థం కాదు... అదే ‘ప్రేమ’ అని నేను గ్రహించాను. నేనే గనుక ప్రేమిస్తే ఒకే అనుభవంతో సరి పెట్టుకోవలసివచ్చేది. అయిదారు ప్రేమకథలు చూశా కదా... అందుకనే ఇంత అవగాహన.

నిజంగా మీరెవర్నీ ప్రేమించలేదా?

అనంత్ శ్రీరామ్: నా మొహం చూసి ఏ అమ్మాయి లవ్ చేస్తుందండీ. అమ్మాయిలు డైనమిక్‌గా ఉండేవాళ్లనే ఇష్టపడతారు. కాగితాలపై పాటలు రాసుకుంటూ తిరిగే నాలాంటివాణ్ని వాళ్లు లైక్ చేయరు.

మీకు సైట్ ఎప్పట్నుంచి ఉంది?

అనంత్ శ్రీరామ్: బై బర్త్. నా మూడు నెలల వయసులో కుడి కన్నుకూ తొమ్మిదో నెలలో ఎడమ కన్నుకూ ఆపరేషన్లు జరిగాయి.

మూడో నెలలో సైట్ అన్న విషయం ఎలా కనిపెట్టారు..?

అనంత్ శ్రీరామ్: కళ్లు తేడాగా కదుపుతుంటే... వాళ్లకు అనుమానం వచ్చిందంట.

ఈ సమస్య వల్ల మీరెప్పుడైనా ఇబ్బంది పడ్డారా?

అనంత్ శ్రీరామ్: శారీరక సమస్య ఉన్నవాళ్లు దురదృష్టవంతులు అంటుంటారు. నేను ఇంజనీరింగ్‌లో ఉన్నప్పుడు బ్లాక్‌బోర్డ్‌పై రాసే అక్షరాలు కనిపించేవి కావు. ‘సార్...నాకు రెండు కళ్లు కాస్త తేడా అండీ... ఎడమ కన్నుకు లేట్‌గా ఆపరేషన్ చేయడం వల్ల ఆ కంటితో చూడ్డం కష్టం అవుతుంది. కుడి కంటితో బాగా చూడగలను. కుడి నుంచి ఎడమకు కళ్లు తిప్పుతుంటే... బాధగా ఉంది. మేటర్‌ని బోర్డ్ మధ్యలో రాస్తారా’ అని అధ్యాపకుడ్ని బతిమాలితే... ఓ రెండుసార్లు నాకోసం రాశాడు. తర్వాత కుదరదని ఖరాకండీగా చెప్పేశాడు. చాలా బాధ అనిపించింది. ఫిజికల్‌గా నేను మైనస్ అన్న సంగతిని మరిచిపోయి, సైకలాజికల్‌గా నేనెక్కడ స్ట్రాంగో గ్రహించి ముందుకు సాగాలని అప్పుడే నిర్ణయించుకున్నాను.

చిన్నప్పుడు ఎవరైనా మీ కళ్లు చూసి ఎగతాళి చేసేవారా?

అనంత్ శ్రీరామ్: చాలామంది. ‘సోడాబుడ్డి అద్దాలు’ అని హేళన చేసేవారు. ఎవరు ఎన్ని అవమానాలు చేసినా పట్టించుకొనేవాడ్ని కాదు. ఎందుకంటే నాకు ఏడవడం అలవాటు లేదు. కన్నీళ్లు చాలా విలువైనవని నా అభిప్రాయం. నాలో కసి రేకెత్తించడానికి నాకున్న వైకల్యం కూడా ఒక కారణం అయ్యింది. అందుకే దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటాను.

మరి మీ ఆవిడ ఎలా ఫీలవుతారు?

అనంత్ శ్రీరామ్: నేను పెళ్లప్పుడే వాళ్ల ఫ్యామిలీ మొత్తానికి చెప్పాను. అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం కరెక్ట్ కదా.

ఏ గేమ్స్ అంటే ఇష్టం?

అనంత్ శ్రీరామ్: క్రికెట్. నేను మంచి బౌలర్‌ని, బ్యాటింగ్ అయితే రాదు.

మీరు శాకాహారా? మాంసాహారా?

అనంత్ శ్రీరామ్: మా ఇంట్లో అందరూ మాంసాహారులే. నేను శాకాహారిని. చిన్నప్పుడు పెట్టడానికి ట్రై చేశారట. కానీ నా శరీరానికి అది పడేది కాదు.

ఇన్ని అనుభవాలు చవిచూసిన అనంతశ్రీరామ్ లక్ష్యం ఏంటి?

అనంత్ శ్రీరామ్: నేను కళను శ్వాసిస్తానండీ.. నా లక్ష్యం కళాకారునిగా ఎదగడమే. ఇప్పటికీ నేను పూర్తి స్థాయి గేయరచయిత అయ్యానని భావించడం లేదు. ఎప్పుైడె తే నా పాట ఎదుటివారిలో మార్పు తెచ్చిందో అప్పుడే నేను గీత రచయితగా ఎదిగినట్లు. నా లక్ష్యం కూడా అదే.
సంభాషణ: బుర్రా నరసింహ

కట్నం తీసుకోవడం... వ్యభిచారం చేయడం నా దృష్టిలో ఒక్కటే. అందుకే తీసుకోలేదు. ఒక జీవితాన్ని ఇద్దరు కలిసి పంచుకోవడమే పెళ్లి. మగాడి శక్తిసామర్థ్యాలు సంపాదనలో కనిపిస్తాయి... ఆడదాని శక్తి ఇంటిని చక్కదిద్దుకోవడంలో కనిపిస్తుంది. ఇలా రెండు బాధ్యతలను ఇద్దరూ సమానంగా పంచుకుంటున్నప్పుడు పర్టిక్యులర్‌గా అబ్బాయే ఎందుకు డబ్బులు తీసుకోవాలి? అనే ప్రశ్న తలెత్తింది. అందుకే ఆస్థిపాస్థుల గురించి పట్టించుకోకుండా, పెళ్లి ఖర్చు కూడా నేనే భరించి, నా భార్యను తెచ్చుకున్నాను.