ఉదయం నాలుగు గంటలయ్యింది... అప్పటికే నేను లేవడం స్నానం, పూజ పూర్తయ్యింది. కార్తీకమాసం, దాంతో పాటు పెళ్ళి రోజు కావడంతో ఇంటి నిండా దీపాలు అలంకరించాను. వంటింటి గుమ్మానికి ఎదురుగా ఉన్న తులసికోటలో దీపం మరింత వెలుగుతూ... చీకటిలో చాలా అందాన్నిస్తోంది. సృష్టిలో ఇన్ని అందాలున్నా, దీపానికున్నంత అందం దేనికీ లేదేమో. ఇలా అనుకుంటూ అక్కడే ఒక కుర్చీ వేసుకుని కూర్చున్నా... మనసులో ఉన్న వేడి ముందు ఒంటికి తగిలే చల్లగాలి హాయిగా అనిపించింది. ఆ నిశ్శబ్ద వాతావరణం ఒక్క ఉదయమే దొరుకుతుంది. ఇలాంటి సమయాన్ని నా సొంతం చేసుకోవడం నేను పొందే చిరు ఆనందాల్లో ఒకటి. ఎప్పుడు ఎలాంటి బాధ కలిగినా ఇటువంటి సమయంలో చాలా చిన్నగా అనిపిస్తాయి. కానీ ఈరోజెందుకో ఆ వాతావరణం కూడా ప్రశాంతతను ఇవ్వలేకపోతోంది. అందుకు ప్రత్యేకమైన కారణం అంటూ లేకపోలేదు.... తెల్లవారితే ఏది వండాలో, ఎవరికి ఎలా సర్ది చెప్పాలో తెలియక కాస్త అయోమయంగా ఉంది. అదీ కాక ఏదో కారణం చూసుకుని పిల్లలు, ''అమ్మా ఈ రోజు ఏ స్పెషల్ చేస్తున్నావ్'' అని అడుగుతుంటారు. మనలో ఆనందం ఉన్నా లేకున్నా... ఓపిక ఉన్నా లేకున్నా... నవ్వుతూ వారి ఇష్టాల్ని తీర్చాలి. తప్పదు. వీటన్నిటితో తండ్రికి ఏ సంబంధమూ, బాధా ఉండదు. ఏ ఇబ్బందులైనా తల్లి మాత్రమే పడాలి. నా ఆలోచనలకు అడ్డు తగులుతూ...
''అమ్మా... ఈ రోజు నాలుగు గంటలకే నిద్ర లేపమన్నాను కదా? ఎందుకు లేపలేదు?'' అంటూ ఏడుపు ముఖంతో నందిని నిలబడింది.
'ఆ విషయమే మరచిపోయిన నేను ఉలిక్కిపడి ''లేదురా... నువ్వు మంచి నిద్రలో ఉన్నావు... లేపుదామనుకుంటూనే ఉన్నా... అప్పుడే అయిందా...? వెళ్ళు'' అంటూ బ్రష్ చేతికిచ్చి పంపాను.
ఏదో బ్రష్ అయిందనిపించి... ''అమ్మా... విష్‌యూ హేపీ మేరీడ్ లైఫ్'' అంది దగ్గరకు వస్తూ.
ఆ వెనుకే కొడుకు కూడా అదే మాటను మరింత ఇంగ్లీష్ యాసతో చెప్పి, దగ్గరకు చేరాడు... నాకర్ధమయింది. వారెందుకు అంత దగ్గరగా చేరారో.
వాళ్లిద్దరి చేతులకు రెండు పాల గ్లాసులు అందించి, ''ఏంటి చెప్పండ్రా?'' అంటూ మరింత దగ్గరగా తీసుకున్నాను... వాళ్లు ఏమడుగుతారో తెలిసినా..
''మరి సాయంత్రం అందరం బయటకు వెళుతున్నామా...?'' నందిని మెల్లగా అడిగింది నేను కోప్పడతానేమోననే భయంతో.
నిన్నటి నుండి నాన్న ఎంతో కోపంతో ఉన్నారని, నాతో ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని, ఏదైనా ఖర్చు పెట్టాల్సి వచ్చినపుడు తన తీరు అలానే ఉంటుందని వీళ్లకి ఎలా చెప్పడం?
''సరేలేరా... ముందు మీరు కాలేజీకి వెళ్ళిరండి... సాయంత్రం కల్లా నాన్నతో మాట్లాడతాలే..'' అన్నా తప్పనిసరై.
''మరి నాన్న ఒప్పుకోకపోతే...?'' అడిగింది నందిని తన తెలివిని ప్రదర్శిస్తూ...
''ఒప్పుకోకపోతే నేనే మీకు స్వీటు చేసి పెడతా... సరేనా?'' అనగానే...
''అమ్మా... ప్లీజ్ నువ్వు మాత్రం స్వీటు చేయకు. సరిగా రాదు నీకు...'' అన్నాడు మధ్యలో కొడుకు వంశీ అడ్డు తగుల్తూ..
''సరేలేరా... ముందు మీరెళ్లి చదువుకోండి'' అన్నాను చేసేది లేక విసుగ్గా.
ఏదో నాకు చేతనయింది చేయడం, వారిని ఆ పూటకు కాలేజీకి పంపడంతో నా పని పూర్తి అయిందా అంటే.. అప్పుడే శ్రీవారు లేవడం... ఆయనకి నీళ్లూ, టిఫెను, కాఫీ పని పూర్తయ్యేసరికి దాదాపు రెండు గంటలు పట్టింది.
''సుధా... మరి నేను వెళ్లొస్తాను...'' అని బయలు దేరేంతలో...
''మరి...మరి'' అంటూ ఆగిన నన్ను చూసి...
''ఏంటి ఏదో నసుగుతున్నావు...? చీర గురించేనా? మనకేమైనా కొత్తగా పెళ్లయిందా? దాదాపు పద్దెనిమిదేళ్ళు కావొస్తోంది..'' అన్నాడు.
''నేను చీర కోసం మిమ్మల్ని ఆపటం లేదు... మనకు పెళ్లయి పద్దెనిమిదేళ్లయినా, మన పిల్లలు పెరిగి మీ మ్యారేజీడే అని చెప్పేంత వరకూ మనకు తెలీలేదు. కొత్తయినా పాతయినా ఏదో పిల్లలు కదా... వారేమో సాయంత్రం బయటకు వెళదామంటూంటే...'' అంటూ ఆగాను.
''అలా అని వాళ్ళడిగారా? నువ్వే చెబుతున్నావా?''
''ఏదో ఒకటి మీకు తోచింది అనుకోండి... మీరేమంటారు?''
''సాయంత్రం ఫోను చేస్తాలే...'' అంటూ ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయారు.
***
''అమ్మా... నాన్నను అడిగావా?'' కాలేజీ నుంచి ఇంటికి వస్తూనే అడగింది నందిని.
''ఆ... అడిగాను. సాయంత్రం ఫోను చేస్తానన్నారు'' అంటూ అప్పుడే చేసిన పాయసాన్ని గ్లాసులో పోసి టేబుల్‌పై పెట్టాను.
''అయ్యో... అలా అంటే నాన్న ఒప్పుకోనట్లే...'' అంటూ నాన్న మనసును పూర్తిగా అర్థం చేసుకున్న ఆరిందలా అంది నందిని.
ఇక వాడు చెప్పనే అక్కర్లేదు. వేలకు వేలు ఫీజులు కడుతున్నా, ఇష్టమైన బట్టలు కొనిస్తున్నా... అవసరాలకు పాకెట్ మనీ ఇస్తున్నా... ఇంకా ''మీరేం చేశారు? ఎప్పుడైనా మాకు నచ్చిన తిండి పెట్టారా?'' అనే ధోరణిలో మాట్లాడుతుంటాడు. అయినా పిల్లల కోసం ఈ పాట్లు తప్పదు.
పిల్లలకోసం, వారి సంతోషం కోసం ఎన్నోసార్లు ప్రయత్నిస్తే రాత్రి 8 గంటలకు సరే అనే మాట శ్రీవారి నుండి రావడం... అప్పటి దాకా నిరుత్సాహం... నిట్టూర్పులు విడిచిన పిల్లలు హుషారుగా తయారైపోయారు. ''అమ్మా నువ్వు కూడా మంచి చీర కట్టుకో'' అంటూ బలవంతం పెట్టారు.
ఇక తప్పదు అనుకుని ఏదో ఉన్నదాంట్లోనే కాస్త మంచిచీర కట్టుకున్నాను. హోటల్లో భోజనం చేసి, నచ్చని సినిమాను బలవంతంగా చూసి ఏ ఒంటిగంటకో ఇంట్లో పడ్డాం.
సమయం రెండు గంటలవుతోంది.
నిద్ర రావడం లేదు. ఇలా మనసుతో పనిలేని పనులు జీవితమంతా మోస్తూ... అయినా మనసనేది ఎంతసున్నితమైందో చాలా మందికి తెలియదనిపిస్తుంది. అసలు మనసెందుకుంది? అది లేకుంటే ఎంత బావుండేది అనిపిస్తుంది. అసలు మన అనుకునే మనుషుల మధ్య మనంగానే బతకలేని రోజులొచ్చాయని గమనించారేమో... అందుకే స్నేహితుల రోజు, ప్రేమికుల రోజు, నాన్నకో రోజు, అమ్మకో రోజు, పెళ్ళిరోజుకో రోజు, పుట్టినదానికో రోజు ఇలా విభజనల మధ్య మనకు మనం బలవంతంగా గుర్తు తెచ్చుకుని, నవ్వు రాకున్నా నవ్వుకుని, ఇష్టం లేకున్నా తిని, ఆనందం లేకున్నా పిల్లలకోసం ఆనందాన్ని నటించాలి... అనుకుంటుంటే తెలియని విరక్తి నవ్వు ఒకటి పెదవులపై నిలిచింది. పక్కకు తిరిగి చూస్తే...
రోజంతా రోడ్డుపైన తిరిగి అలసిపోయి గురక పెట్టి నిద్రపోతున్న శ్రీవారు, మరో పక్క తాము రోజంతా ఆలోచించి చివరకు అనుకున్న రీతిలో అమ్మ, నాన్న పెళ్ళి రోజు జరుపుకున్నామన్న ఆనందాన్ని పొందిన తృప్తితో పిల్లలు ఆదమరచి నిద్రపోతున్నారు.
మరి నేను....
ఎప్పుడో ఊహ తెలియని రోజుల్లో అమ్మానాన్నల మధ్య గడిపిన పుట్టిన రోజు గుర్తు చేసుకుంటూ బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నాను.

No comments:
Post a Comment