మేథీ మరియు మలై (మెంతి ఆకులు మరియు క్రీమ్)ఈ రెండు కాంబినేషన్స్ చాలా వంటకాల్లో ఉపయోగిస్తుంటారు. మేథీ మలై పన్నీర్ ఇండియన్స్ అందరూ ఇష్టపడే ఓ సైడ్ డిష్ . ఈ గ్రీన్ కలర్ పన్నీర్ వంటకాన్నీ చూస్తే పాలక్ పనీర్ గుర్తుకొస్తుంది. అయితే రుచిలో మాత్రం దానికి, దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఈ మేథీ మైలే వంటకాన్ని ముఖ్యంగా పన్నీర్ మాత్రమే కాదు మెంతి ఆకులు మరియు ఫ్రెష్ క్రీమ్ చేర్చడంతో ఇంతటి రుచి వస్తుంది. మెంతి కొంచె పులుపుగా ఉంటుంది. ఈ పులుపు పోయి మంచి టేస్ట్ గా ఉండేందుకు కొన్ని పాలు, ఫ్రేష్ క్రీమ్ను ఉపయోగించడం వల్ల చాలా సూపర్ గా ఉంటుంది. ఇంకా దీనికి గ్రీన్ పీస్ కూడా మంచి కాంబినేషన్ . మరి ఈ మేథీ మలై పన్నీర్ స్పెషల్ వంటకాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం...
కావల్సిన పదార్థాలు:
పన్నీర్: : 200 grams (cut into cubes)
పచ్చిమిర్చి: 2-4 (chopped)
ఉల్లిపాయ: 1 (chopped)
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1tbsp
టమోటో: 1 (chopped)
మేథి (మెంతి ఆకులు): 2కట్టలు
ధనియాల పొడి : 1tsp
కారం: 1/2tsp
పసుపు: 1 pinch
గరం మసాలా: 1tsp
పాలు: 2tbsp
ఫ్రెష్ క్రీమ్: 1 cup
పన్నీర్: 1tsp
నెయ్యి: 1tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా పాన్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత మంట తగ్గించి అందులో పన్నీర్ ముక్కలు వేసి రెండు నిముషాలు వేయించుకొని, పక్కకు తీసి పెట్టుకోవాలి.
2. తర్వాత అదే పాన్ లో మరికొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసి అందులో పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఐదు నిముషాల పాటు వేయించుకోవాలి. 3. తర్వాత అల్లం, వెల్లుల్లిపేస్ట్ వేసి రెండు మూడు నిముషాలే వేయించి, తర్వాత టమోటో, ఉప్పు వేసి బాగా కలుపుతూ ఐదునిముషాలు తక్కువ మంట మీద వేయించుకోవాలి.
4. ఇప్పుడు అందులోనే శుభ్రం చేసుకొన్న మెంతి ఆకులను కూడా వేసి బాగా కలుపుతూ తక్కువ మంటమీదా బాగా మెత్తగా ఉడికించాలి.
5. ఇప్పుడు మసాలా ధినుసుల పొడులన్నీ ఒకదాని తర్వాత ఒకటి కారం, పసుపు, గరంమసాలా, ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసి మరో రెండు మూడు నిముషాలు వేయించాలి. ఇప్పుడు అందులోనే పాలు మరియు క్రీమ్ కూడా మిక్స్ చేసి మరో ఐదారు నిముషాల పాటు వేయించుకోవాలి.
6. ఈ మసాలా పొడులన్నీ పచ్చవాసన పోయేంత వరకూ ఉడికించిన తర్వాత అందులో పెప్పర్ పౌడర్ మరియు వేయించి పెట్టుకొన్న పన్నీర్ ముక్కలను వేసి, గ్రేవి చిక్కబడేవరకూ ఉడికించుకోవాలి. ఐదు నిముషాల తర్వాత స్టౌ ఆప్ చేసి క్రిందికి దింపుకోవాలి. అంతే వడ్డించడానికి మేథీ మలై పన్నీర్ రెడీ. దీన్ని పుల్కాలు లేదా జీరా రైస్ కు మంచి కాంబినేషన్...

No comments:
Post a Comment