డిప్రెషన్‌ను ఆహారం ద్వారా చికిత్స చేయవచ్చా? అనే కోణంలో ప్రపంచంలో తొలిసారిగా ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధకులు ఒక అధ్యయనాన్ని చేపట్టారు. డిప్రెషన్‌తో బాధపడుతున్నవారు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. వీరికి ఎక్కువ పండ్లు, కూరగాయలు, చేపలు, బఠాణీలు, తక్కువ చక్కెర, ఉప్పు, సంతృప్త కొవ్వులున్న ఆహారాన్ని ఇచ్చారు. ఇంతకు ముందు జరిగిన అధ్యయనంలో డిప్రెషన్ ప్రమాదం తగ్గడానికి, ఆరోగ్యకరమైన ఆహారానికి సంబంధం ఉందని వెల్లడైంది. కానీ, ఇప్పుడు డిప్రెషన్ ఉందని నిర్ధారణ అయిన తర్వాత దీని లక్షణాలు తగ్గించడానికి ఆహారం తోడ్పడుతుందా? అనే కోణంలో తొలిసారి పూర్తిస్థాయి క్లినికల్ ట్రయల్ నిర్వహించారు. ఒక వేళ ఇది విజయవంతం అయితే, ప్రపంచ వ్యాప్తంగా డిప్రెషన్ బాధితులు మానసిక వైద్యులు సూచించే మందులను వాడడం తగ్గే అవకాశముంది. డిప్రెషన్‌తో బాధపడతున్న మూడొంతుల మంది చికిత్సలో భాగంగా ఇచ్చే యాంటి డిప్రెసెంట్ మందులకు లేదా సైకోథెరపీకి స్పందించరు. ఇలాంటి వారికి ఆహార పదార్థాలు కీలకం కానున్నాయి అని పరిశోధకులు పేర్కొన్నారు. 'ప్రపంచ వ్యాప్తంగా మానసిక వైకల్యంలో డిప్రెషన్‌ది అగ్రస్థానం. 2020 నాటికి ఇది ప్రపంచంలో రెండో స్థానాన్ని ఆక్రమిస్తుందని అంచనా. మనకున్న సమర్ధవంతమైన చికిత్స పద్ధతులు వాస్తవంగా పరిమితమే. డిప్రెషన్‌తో బాధపడేవారికి సహకరించేందుకు ఇతర మార్గాలను అన్వేషించాలి' అని డికిన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌కు చెందిన ప్రధాన పరిశోధకులు ఫిలిస్ జక తెలిపారు.
అధ్యయనం కోసం 200 మందిని ఎంపిక చేశారు. వీరిలో కొంత మందికి పోషకాహారం ఇచ్చారు. కౌన్సెలింగ్ కూడా చేశారు. ఇంకో గ్రూపుకు నియంత్రణ పద్ధతులు అమలు చేశారు. ఈ రెండు గ్రూపులను మూడు నెలలపాటు పరిశీలించారు. సంప్రదాయ ఆహారశైలితో పోలిస్తే, పోషకాహారం ఉన్న పదార్థాలు తీసుకోవడం వల్ల కొంత మెరుగుదల కనిపించింది. మధ్యస్థంగా మాంసం తీసుకోవడం వల్ల మహిళల్లో మానసిక అనారోగ్య ప్రమాదం తగ్గింది. 'మానసిక ఆరోగ్యానికి మంచి ఆహారం ముఖ్యం. ప్రధానంగా చేపలు. ఇందులో ఓమెగా-3 ఫ్యాటి యాసిడ్స్ ఉంటాయి. అధికంగా మంచి కొవ్వు పదార్థాలుంటాయి. ఎక్కువగా ఫోలేట్ ఉండే ఆకు కూరలు మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తాయి. ఇవే కాక తృణధాన్యాలు, కాయధాన్యాలు, చిక్కుడు గింజలు తీసుకోవాలి' అని జక తెలిపారు.

No comments:
Post a Comment