బాల్యం ఒక అందమైన అనుభవం. చందమామలు, గోరుముద్దలు, ఆటలు, పాటలు, కొట్లాటలు, అల్లరి, చాడీలు, దాగుడు మూతలు, గుజ్జన గూళ్లు, చిల్ల-కట్టె ఆటలు, గోళీలాట, కోతి కొమ్మచ్చి, తాడాట, బొమ్మల పెళ్లిళ్లు, తాతయ్య జోకులు, సార్ల కబుర్లు, కుక్కలతో-పిల్లులతో సంభాషణ, నాటకాలు, తొందరగా స్నేహం, అంతకంటే తొందరగా విడిపోవడం, మా ఇంటికి నువ్వు రావొద్దు, మీ ఇంటికి నేను రాను, ఇద్దరం మర్చిపోదాం, ఇక నుండి బాగుందాం, ఇప్పటి నుండి కొట్లాట లేదు-ఇదండీ బాల్యమంటే....ఇంకా ఎంతో, ఎంతో, మరెంతో, అంతులేనంత ఉంది బాల్యానికి. అయితే చిన్నారులందరికీ బాల్యం ఇలా ఉందా !
ఇలా ఉంటేనే చిన్నారులు మానసికంగా, శారీరకంగా సంపూర్ణంగా ఎదుగుతారు. అయితే ఇప్పుడు గ్రామాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, పేదోల్లు కానీ, ధనవంతుల పిల్లలు కానీ సరైన బాల్యాన్ని అనుభవించడం లేదు. సరైన బాల్యం లేకుంటే సమాజంలో అశాంతి ఏర్పడుతుంది. సమాజం నేరమయమవుతుంది. దోపిడీతత్వం పెరుగుతుంది. ప్రతి చిన్నారి తానేదో కోల్పోయినాను అనుకుంటుంది. చాలా మంది చిన్నారులు తక్కువ జీవన స్థాయిలో, ప్రమాదకరమైన పరిస్థితులలో జీవిస్తున్నారు. మన రాష్ట్రంలో పుట్టిన చిన్నారులలో 1000కి 44 మంది మొదటి పుట్టిన రోజు చూడకుండానే చనిపోతున్నారు. దీన్నే శిశుమరణాల రేటు అంటాం. శిశుమరణాల రేటు సమాజం సామాజిక స్థితిని ప్రతిబింబిస్తుంది. చిన్నారుల పట్ల ఆ సమాజం అనుసరిస్తున్న తీరును ప్రతిబింబిస్తుంది. న్యుమోనియా, విరేచనాలు, ఆహారలోపం, అంటువ్యాధులు మన చిన్నారులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలు. మన చిన్నారులు రాళ్లు మోస్తున్నారు. ఇళ్లల్లో పనిమనుషులుగా పనిచేస్తున్నారు. మూటలు మోస్తున్నారు. హోటళ్లల్లో టీలు ఇస్తున్నారు, బల్లలు తుడుస్తున్నారు. ప్రమాదకరమైన కర్మాగారాల్లో పని చేస్తున్నారు. కొందరు ఆడపిల్లలు బాల్యంలోనే సెక్స్ వర్కర్లు కూడా ! సెక్స్ వర్కర్లుగా ఆడపిల్లలు తీవ్రమైన లైంగిక వ్యాధులకు, మానసిక వ్యాధులకు, న్యూనతా భావానికి, అపరాధ భావానికి గురవుతున్నారు. ఎవరి మీటింగులైనా జేజేలు పలకడానికి ఎండల్లో, వానల్లో కూడా చిన్నారులే ! జేజేలకు పోయి ఎంతో మంది చిన్నారులు వడదెబ్బలకు, ప్రమాదాలకు గురయ్యారు !
బాలల హక్కులు
చిన్నారులకు కొన్ని హక్కులు ఇవ్వడం పౌర సమాజం బాధ్యత. ఈ సమస్య గుర్తించి ఐక్యరాజ్య సమితి నవంబరు 20, 1989న ఒక ప్రతిపాదన రూపొందించి, ఆమోదించింది. ప్రపంచంలోని 2 దేశాలు తప్ప మిగతా అన్ని దేశాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాయి. 1990 సెప్టెంబరులో బాలల కోసం ప్రతిపాదనను ఆమోదించిన దేశాలు ఒక శిఖరాగ్ర సమావేశం నిర్వహించుకున్నారు. ఈ పర్యవసానమే బాలల హక్కులు. ఈ హక్కుల ప్రకారం, ఇందులోని ఆర్టికల్ 1 ప్రకారం 18 సంవత్సరాల లోపు వారందరూ బాలలే. ఇందులో 54 ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ హక్కులు నాలుగు తరగతులుగా విభజించవచ్చు. 1. జీవించే హక్కు. 2. రక్షణ పొందే హక్కు. 3. అభివృద్ధి చెందే హక్కు. 4. సాంఘికంగా అనేక విషయాల్లో పాల్గొనే హక్కు. ఈ హక్కులు నాలుగు ముఖ్యమైన ఆదర్శాలను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. సమానత్వం, అవివక్ష, బాలల బాగోగులే అత్యున్నత ప్రమాణాలు. అన్నింటా భాగం అందరికంటే చిన్నారులకే ముందు.
కొన్ని ముఖ్యాంశాలు
ఆర్టికల్ 6 ప్రకారం ప్రతి శిశువుకు బతికే హక్కు ఉంది.
ఆర్టికల్ 24 ప్రకారం ప్రతి రాజ్యం శిశుమరణాలు తగ్గించే ప్రయత్నం చేయాలి.
ఆర్టికల్ 24, 25, 27 ప్రకారం మంచి ఆరోగ్యం, సరైన వైద్య సదుపాయాలు, ఉండటానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, పరిశుభ్రమైన నీరు, పౌష్టికాహారం పొందటం బాలల హక్కు. చిన్నారులు శారీరకంగా, మానసికంగా, సాంఘికంగా, నైతికంగా ఎదిగే అవకాశాలు కల్పించాలి.
ఆర్టికల్ 18, 27, 28, 29 ప్రకారం అందరికీ చదువుకునే హక్కు, నైపుణ్యాన్ని పెంచుకునే అవకాశాలు, ఉన్నత విద్యలో అవకాశాలు పొందే హక్కు, స్త్రీ-పురుష బేధం లేని వాతావరణం.
అంతేగాక భౌతిక హింస, లైంగిక హింస నుండి రక్షణ పొందే హక్కు ఉంది. అక్రమ రవాణా నుండి చిన్నారుల రక్షణ, చిన్నారులకు శిక్ష-హింస నుండి రక్షణ, అక్రమంగా బందీలు చేయకుండా ఉండటం, బాల కార్మికులు కాకుండా చూడటం, చిన్నారులు యాచకులుగా జీవించకుండా, చిన్నారులను ఉపయోగించకుండా రక్షణ, జోగిని పద్ధతి నుండి విముక్తి, చిన్నారులకు ఆట-పాట, సాంఘికంగా చిన్నారులు పాల్గొనే హక్కులు ఈ హక్కుల్లో పొందుపరిచారు. మన దేశంలో నవంబరు 14ను బాలల హక్కుల పరిరక్షణ దినంగా గుర్తించారు. మన బాలలు గౌరవంగా, ఆరోగ్యంగా, శాంతిగా, సుసంపన్నంగా జీవించే సమాజం నెలకొల్పుదాం.
ఈ అంశాలను మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, సహచరులతో పంచుకోండి ! రండి మన చిన్నారులకు ఒక మంచి సమాజాన్ని నిర్మిద్దాం !! మీరు ఆరోగ్యాన్ని గురించి మాట్లాడండి !!!

No comments:
Post a Comment