all

Monday, December 3, 2012

స్పైసీ మటన్ కుర్మా

ఇది స్పైసీగా ఉండే సౌత్ ఇండియన్ మటన్ కుర్మా రిసిపి. చాలా టేస్టీ గా ఉంటుంది. ఈ మటన్ కుర్మా ఇడ్లీ, దోసె, చపాతీ రైస్ కు చాలా మంచి కాంబినేషన్ దీన్ని ఒకసారి రుచిచూస్తే మళ్ళీ మళ్ళీ తినాలినిపిస్తుంది. కుర్మాని బంగాళదుంపను చేర్చడం వల్ల మరింత చిక్కగా రుచిగా తయారవుతుంది. కాబట్టి మటన్ కుర్మాను మీరు ట్రై చేసి దోసె, ఇండ్లీ, చపాతీతో రుచి చూడండి....
spicy mutton kurma

కావలసిన పదార్థాలు:
మటన్: 1/2kg
ఉడికించిన బంగాళదుంప: 1
ఉప్పు: రుచికి తగినంత
కారం: 2tsp
గరం మసాలా: 1tsp
నూనె: తగినంత
కొత్తిమీర: 2tsp
పెరుగు: 1/2cup
గ్రేవీకోసం కావల్సిన పదార్థాలు:
కొబ్బరిపొడి: 2tsp
వేయించిన పల్లీలు: 20grms
గరంమసాలా: 1tsp
నువ్వులు: 2tspబాదంపలుకులు: 10
తయారు చేయు విధానం:
1. ముందుగా గ్రేవీకోసం సిద్దం చేసుకొన్నపదార్థాలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి.
2. తర్వాత పాన్ లో నూనె వేసి కాగిన తరవాత అందులో ఈ గ్రేవీ మిశ్రమాన్ని వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
3. కొద్దిసేపటి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం వేసి మరోసారి కలపాలి.
3. తరువాత మటన్ వేసి అది మెత్తగా మగ్గిన తరువాత చిదిమిన బంగాళదుంప, పెరుగు, గరం మసాలా, ఉప్పు, తగినంత నీరు పోసి బాగా ఉడకనివ్వాలి.
4. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్‌లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే మటన్ కుర్మా రెడీ.

No comments: