all

Monday, December 3, 2012

కొంచెం కారం... కొంచెం తీపి.. ఆలూ దమ్...

ఇండియన్ వంటల్లో బాగా ప్రసిద్ది చెందిన వంటకాల్లో ఈ ఆలూ దమ్ కూడా ఒకటి. ఈ ఆలూ దమ్ ను ఒక్కో ప్రదేశంలో ఒక్కో రకంగా తయారు చేస్తుంటారు. ఉదాహరణకు పశ్చిమబెంగాల్ లో పోస్టో ఉపయోగించి గ్రేవి చిక్కగా తయారు చేసి ఆలూ దమ్ చేస్తారు. అదే సౌత్ లో గ్రేవీకి కొబ్బరి తురుము ఉపయోగించి తయారు చేస్తారు. ఇక రెస్టారెంట్లలో ఐతే ఇండియన్ మసాలా ధినుసులు, కొబ్బరి తురుము, టమోటో కెచప్ తో ఘాటుగా తయారు చేస్తారు. చాలా మంది ఇంట్లో తయారు చేసేటప్పుడు, టమోటో కెచప్ కు బదులు, టమోటో గుజ్జును ఉపయోగిస్తారు. టమోటో కెచప్ చేర్చడం వల్ల కొద్దిగా తియ్యగా.. ఇండియన్ మసాలలు చేర్చడం వల్ల కారంగా చాలా రుచిగా ఉంటుంది. ఇది రైస్ రోటీకు చాలా ఫర్ఫెక్ట్ కాంబినేషన్..మరి ఆలూ దమ్ ఎలా తయారు చేస్తారా చూద్దాం రండి....
sweet spicy aloo dum recipe

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంప: 5-6(boiled)
ఉల్లిపాయలు: 2
టమోటో: 1
పచ్చిమిర్చి: 3:4
అల్ల వెల్లుల్లి పేస్ట్: 2tsp
కొబ్బరి తురుము: 1tsp
టమోటో కెచప్: 2tbsp
పసుపు: 1tsp
కారం: 2tsp
ధనియాల పొడి: 2tsp
లవంగాలు: 1
చెక్క: 1 inch
యాలకులు: 2
గరం మసాలా: 1tsp
జీకలర్ర: 1tsp
బిర్యాణీ ఆకు: 1
ఎండుమిర్చి: 2
నూనె: 3tbsp
ఉప్పు: రుచికి సరిపడా
తయారు చేయు విధానం:
1. ముందుగా మిక్సీలో టమోటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. మెత్తగా, చిక్కగా అయ్యేందుకు కొద్దిగా నీళ్ళు చేర్చుకోవచ్చు. ఈ పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి.
2. ఒక గిన్నె తీసుకొని అందులో పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసి బాగా కలిపి కొంచె చిక్కగా కలిపిన ఈ మసాలాను పక్కన పెట్టుకోవాలి.
3. తర్వాత ఫ్రైయింగ్ పాన్ స్టౌ మీద పెట్టి అందులో నూనె వేసి వేడయ్యాక అందులో జీకలర్ర, బిర్యాని ఆకు, ఎండు మిర్చి, లవంగాలు, చెక్క మరియు యాలకులు వేసి రెండు నిముషాలు వేయించాలి.
4. ఇప్పుడు అందులో ముందుగా మిక్సీలో పేస్ట్ చేసి పెట్టుకొన్న మిశ్రమాన్ని, దాంతో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ను వేసి పచ్చివాసనపోయేంత వరకూ ఫై చేసుకోవాలి. 5-10నిముషాల తర్వాత కారం, ధనియాల పొడి మసాలా కలుపుకొన్న మిశ్రమాన్ని కూడా ఇందులో పోసి కలుపుతూ రెండు మూడు నిముషాలు బాగా ఉడికించాలి.
5. ఈ మిశ్రమంలో ఉడికేటప్పుడు నూనె పైకితేలే సమయం చూసి కొబ్బరి తురుము, గరం మసాలా మరియు టమోటో కెచప్ వేసి బాగా కలియ బెట్టి మరో రెండు నిముషాల ఉడికించాలి.
6. అంతలోపు ఉడికించి పెట్టుకొన్న బంగాళాదుంపలకు పొట్టి తీసి వాటిని నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టౌ మీద గ్రేవీ చిక్కబడగానే అందు ఈ బంగాళదుంపలను వేసి బాగా మసాలాతో మిక్స్ అయ్యేలా కలిపి మరో ఐదు నిముషాల ఉడికించాలి. అంతే టమోటో కెచప్ తో ఆలూ దమ్ రెడీ. కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ ముక్కలతో గార్నిష్ చేసి రోటీ మరియు రైస్ తో సర్వ్ చేయాలి.

No comments: