ఫిబ్రవరి 12, 2009... కాలిఫోర్నియా రివర్‌సైడ్ కౌంటీలోని ఓ షాపింగ్ మాల్
పెట్రోలింగ్‌కు వచ్చిన ఓ పోలీసు పార్కింగ్ గ్యారేజ్ మూడో అంతస్తులో అటూ ఇటూ తిరుగుతున్నాడు. ఓ మూలగా పార్క్ చేసివున్న కారులో ఏదో కదలిక కనిపించింది. లోపల ఎవరో ఉన్నట్టు అనిపించింది.
మెల్లగా అటువైపు నడిచాడు పోలీస్.
కారు దగ్గరకు వెళ్లి లోపలకు చూశాడు. నల్లటి అద్దాలు మూసి ఉండటం వల్ల ఏమీ కనిపించలేదు. అద్దం మీద చిన్నగా తట్టి... ‘‘లోపల ఎవరు?’’ అన్నాడు. సమాధానం రాలేదు. కానీ కారు కదలికలు ఒక్కసారిగా ఆగిపోయాయి. పోలీసు మనసు ఏదో కీడు శంకించింది.
వెంటనే కారుమీద దబదబా బాదాడు. ‘‘లోపల ఎవరున్నారు? మర్యాదగా బయటికి రండి’’ అంటూ అరిచాడు. అయినా ఫలితం లేకపోవడంతో స్టేషన్‌కి ఫోన్ చేసి టీమ్‌ని రమ్మన్నాడు. క్షణాల్లో పదిమంది వరకూ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అన్ని పక్కల నుంచీ అరుస్తూ, కారు మీద చరుస్తూ ఉన్నారు.
కాసేపటికి వెనక ఒక కిటికీ అద్దం మెల్లగా కిందికి దిగింది. అందులోంచి ఓ వ్యక్తి కనిపించాడు. వెంటనే పోలీసులు ఆ కిటికీ దగ్గరకు చేరుకున్నారు. ‘‘ఎవరు నువ్వు? ఏం చేస్తున్నావ్? బయటికి రా’’... అరిచాడో పోలీసు.
కారులో ఉన్న వ్యక్తి మాట్లాడలేదు. మౌనంగా కూచుకున్నాడు. ముఖం పాలి పోయింది. చెమటలు కారిపోతున్నాయి.
‘‘సార్... అటు చూడండి, కారులో అమ్మాయి’’... అరిచాడో కానిస్టేబుల్. ఒక్క సారిగా అందరూ లోపలకు తొంగి చూశారు. కారు వెనక సీటులో వెల్లకిలా పడివుందా ఆ అమ్మాయి. గుండెల్లో కత్తి దిగివుంది. రక్తం ధారలుగా కారిపోతోంది.
పోలీసులు ఇక ఆలస్యం చేయలేదు. కారు డోరు బలవంతంగా తెరిచారు. లోపల ఉన్న వ్యక్తిని కస్టడీలోకి తీసు కున్నారు. క్షణాల్లో అంబులెన్సును రప్పిం చారు. కానీ ఏం లాభం...! అప్పటికే ఆమె చనిపోయింది. ఇన్‌స్పెక్టర్ కోపాన్ని పట్టలేకపోయాడు.
‘‘యూ రాస్కెల్...’’ అంటూ కాలర్ పట్టుకున్నాడు. ‘‘ఎవరు నువ్వు?’’ అన్నాడు పళ్లు కొరుకుతూ.
అతడు మాట్లాడలేదు. మౌనంగా తల దించుకునే ఉన్నాడు. పోలీసులు చేతులకు బేడీలు వేసినా, జీపెక్కించినా అతడిలో ఏ మార్పూ లేదు. ఓ ఆడపిల్లని అంత దారుణంగా చంపిన కసాయివాడిలో ఆ నిర్లిప్తత ఏమిటి?
‘‘అయ్యో... బిప్సీ...’’... కూతురి శవాన్ని చూసి కుప్పకూలిపోయింది షెరిల్ ప్లాటో. కంటికి ధారగా ఆమె ఏడుస్తూ ఉంటే, ఖాకీల గుండెలు సైతం క్షణంసేపు కదిలిపోయాయి.
రెండు రోజులుగా కూతురు కనిపిం చడం లేదని కంగారు పడుతోందామె. ఇప్పుడిలా శవమై కనిపించేసరికి ఆమె కన్నకడుపు తరుక్కుపోయింది.
‘‘అందరినీ ప్రేమించడం, అందరితో ఆప్యాయంగా ఉండటమే తెలిసిన నా చిట్టి తల్లికా ఈ గతి పట్టింది! ఎవరు చంపారు ఇన్‌స్పెక్టర్? నా కూతురిని ఎవరు పొట్టన బెట్టుకున్నారు?’’... ఆమె అరుపులకు స్టేషన్ దద్దరిల్లిపోయింది.
‘‘మిక్కీ డేవిడ్ వేగ్‌స్టాఫ్... అతడే మీ అమ్మాయిని చంపింది.’’
‘‘వ్వా....ట్?’’... షాక్ తిన్నట్టుగా అయ్యింది షెరిల్. ‘‘మిక్కీ చంపాడా? అదెలా సాధ్యం సార్? అతడు మా అమ్మాయిని ప్రేమించాడు. త్వరలోనే వాళ్లిద్దరికీ పెళ్లి జరగబోతోంది. నిశ్చితార్థం కూడా అయిపోయింది.’’
ఈసారి ఇన్‌స్పెక్టర్ షాక్ తిన్నాడు. ‘‘పెళ్లి చేసుకోబోతున్నాడా? మరి ఎందుకు చంపినట్టు? ఎంత అడిగినా నోరు తెరవడం లేదు’’ అంటూనే మిక్కీ ఉన్న సెల్‌వైపు నడిచాడు.
గోడకు చేరబడి కూర్చున్నాడు మిక్కీ. శూన్యంలోకి చూస్తున్నాడు. కళ్లలోను, ముఖంలోను అదే నిర్లిప్తత! ఇన్‌స్పెక్టర్ లోనికి వచ్చినట్టు తెలిసినా అతనివైపు చూసే ప్రయత్నం కూడా చేయలేదతడు.
‘‘మిస్టర్ మిక్కీ... ఎలిజబెత్ వాళ్ల అమ్మ వచ్చారు. నువ్వెవరో చెప్పారు. ఇక చెప్పాల్సింది నువ్వే. తననెందుకు చంపావ్?’’
నవ్వాడు మిక్కీ.
‘‘ఎందుకు నవ్వుతున్నావ్? నేనేమైనా జోక్ చేశానా? చెప్పు... ఎలిజబెత్‌ని ఎందుకు చంపావ్?’’
‘‘తనను ప్రేమించాను కాబట్టి.’’
‘‘ప్రేమించావు కాబట్టి చంపావా? ఏం వాగుతున్నావ్?’’ గర్జించాడు.
‘‘యెస్... అందుకే చంపాను. తను లేకుండా నేను ఉండలేను. నేను లేకుండా తను ఉండటానికి వీల్లేదు.’’
బుర్ర తిరిగిపోయింది ఇన్‌స్పెక్టర్‌కి. ప్రేమించడమేంటి? ప్రేమించినందుకు చంపడమేంటి? ఈ ప్రశ్నలకు సమాధానం అతడికి మిక్కీ దగ్గర త్వరగానే లభించింది. ఎలిజబెత్ జీవితమంతా అతనికి కళ్లముందు కనిపించింది.
బిప్సీ... ఎలిజబెత్ ముద్దుపేరు. ఓ మధ్య తరగతి కుటుంబంలో పుట్టింది. తండ్రి సంగీతకారుడు. ఇంట్లోనే అతనికో చిన్న స్టూడియో ఉండేది. తండ్రితో పాటు ఆ స్టూడియోలోనే ఎక్కువ గడిపేది. దాంతో సంగీతమంటే ఆసక్తి కలిగింది. స్వయంగా సాధన చేయడం మొదలు పెట్టింది. ఓసారి తండ్రితో కలసి ఓ ఫంక్షన్‌కు వెళ్లింది. అక్కడ పియానో కనిపిస్తే, ఉత్సాహంగా వచ్చినదేదో వాయించడం మొదలుపెట్టింది. అంతే, అందరూ ఆమె సంగీతానికి ముగ్ధులయ్యారు. ఆమెను ప్రశంసల వర్షంలో తడిపి ముద్ద చేశారు. ఆ రోజుతో సంగీతమంటే మరింత పిచ్చి పట్టుకుంది బిప్సీకి.
‘‘మ్యూజిక్ లేదు ఏమీ లేదు. నోరు మూసుకో’’... తండ్రి మాటతో కళ్లలో నీళ్లు తిరిగాయి బిప్సీకి. ఆయనెప్పుడూ అంతే. ఆడపిల్లలు బయటికి వెళ్లకూడదంటాడు. బుద్ధిగా కుదురుగా ఉండాలంటాడు. ఏది చేస్తానన్నా వద్దంటాడు. అతడి పేదరికం కూడా అందుకు కారణం కావచ్చు. కానీ అతని కారణాలు బిప్సీ చిట్టి మనసుకు తెలీదు. అందుకే అది పలుమార్లు గాయపడేది. అయినా ఆమె పట్టు వదల్లేదు. స్టోర్ రూమ్‌లో పడివున్న తన తల్లి పియానోను తీసి బాగు చేసుకుంది. దానిమీదే సాధన చేసేది. పాటలు రాసుకు నేది. తనే స్వరపరిచి చర్చిలో ఆలపించేది.
బిప్సీ తీయటి స్వరం వినిపించకపోతే చర్చి మూగబోయినట్టుగా ఉండేది. అందరూ ఆమె సంగీతాన్ని ఆస్వాదించే వారు. ఇది మాత్రమే కాదు. వయసులో చిన్నదైనా ఆమె మనసు చాలా పెద్దది. ఎవరు కష్టంలో ఉన్నా వెంటనే కదిలి పోయేది. వెళ్లి చేతనైన సాయం చేసేది. అందుకే ఆమె అంటే అందరికీ ఇష్టం.
తానో గొప్ప గాయని కావాలని తపించేది బిప్సీ. ఓ పక్క సంగీతం, మరోపక్క చదువు, ఇంకో పక్క చర్చిలో సేవ... ఎప్పుడూ బిజీబిజీగా ఉండేది. ఒంటరిగా ఉన్నప్పుడు ఓకే. కానీ పెళ్లి తర్వాత ఆమె జీవితంలోకి మరో వ్యక్తి వచ్చాక కూడా అలాగే విరామం లేకుండా గడపడంతో దంపతుల మధ్య పొర పొచ్చాలు వచ్చాయి. విడాకులు వారి బంధాన్ని తెంచేశాయి. ఆ తర్వాత ఆమె మనసులో స్థానం సంపాదించుకున్న వాడే... మిక్కీ డేవిడ్ వేగ్‌స్టాఫ్.
బిప్సీకి మిక్కీ అంటే ఇష్టం. మిక్కీకి బిప్సీ అంటే పిచ్చి. పెళ్లితో ఒక్కటవ్వాలను కున్నారు. నిశ్చితార్థం కూడా అయ్యింది. అంతలోనే ఓ రోజు బిప్సీ కనిపించకుండా పోయింది. వెతికినా ఫలితం లేకుండా పోయింది. రెండు రోజుల తర్వాత ఆమె మరణవార్త అందరినీ నివ్వెరపరిచింది.
కారణం తెలియదు కానీ, కొద్ది రోజుల్లో పెళ్లి ఉందనగా నిన్ను చేసుకోవడం ఇష్టం లేదని మిక్కీతో చెప్పింది బిప్సీ. మిక్కీ ఎంత నచ్చజెప్పినా వినలేదు. దాంతో షాపింగ్‌కు వెళ్దాం రమ్మంటూ ఆమెను తీసుకుపోయాడు. షాపింగ్‌మాల్ గ్యారేజ్‌లో కారును పార్క్ చేసి, తలుపులు లాక్ చేశాడు. పెళ్లికి ఒప్పుకొమ్మంటూ ఒత్తిడి చేశాడు. ఆమె ససేమిరా అంది. వాదన పెరిగింది. మిక్కీలో ఓర్పు నశించింది. బిప్సీ చేతుల్ని కట్టేసి రేప్ చేశాడు. రెండు రోజుల పాటు పలుమార్లు చేశాడు. అప్పటికీ ఆమె మనసు మారక పోవడంతో... కత్తితో పొడిచి చంపేశాడు.
మిక్కీ చెప్పింది విన్న పోలీసులకు ఒళ్లు జలదరించింది. పెళ్లి చేసుకోను అన్నందుకు ముప్ఫై తొమ్మిది సార్లు కర్కశంగా పొడిచి చంపేశాడు. ఇదేనా ప్రేమంటే?
కోర్టు కూడా మిక్కీని క్షమించలేక పోయింది. బిప్సీ ఎంత మంచిదో చర్చిలో వాళ్లు, స్నేహితులు, కుటుంబ సభ్యులు అంతా చెప్పాక కోర్టు తీవ్రంగా స్పందిం చింది. మిక్కీకి జీవితఖైదు విధించింది. బెయిలుకు కూడా అప్లై చేయడానికి లేనంత కఠిన కారాగార శిక్షను అనుభవించాలంటూ తీర్పు చెప్పింది.
జీపు ఎక్కబోతూ ఆగి ఎలిజబెత్ కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చాడు మిక్కీ. ‘‘క్షమించండి... మీ అందరినీ చాలా బాధపెట్టాను’’ అన్నాడు కన్నీళ్లతో.
కానీ వాళ్లు క్షమించగలరా? ప్రేమంటే అవతలివాళ్లు సుఖంగా ఉండాలని కోరు కోవడం. మన సుఖం కోసం వాళ్లను హింసించడం కాదు. ఈ విషయం అర్థం కాక రోజుకో మిక్కీ పుట్టుకొస్తున్నాడు. ప్రేమ పేరుతో ఎవరో ఒక అమాయక ఆడపిల్లను బలి తీసుకుంటున్నాడు. ప్రేమంటే ఇది కాదని వారికెలా అర్థమవడం!

No comments:
Post a Comment