విటమిన్ సి: కురుల పెరుగుదలకు బయోప్లె వనాయిడ్స్ తో పాటు, విటమిన్ సి ఎంతో ఉపయో గపడు తాయి. తల మాడుకు కావల్సింత రక్త ప్రసరణను అందించి, కురులు పెరిగేలా చేస్తుంది. కాబట్టి ఆహారంలో విలమిన్ సి అధికంగా ఉండేలా చూసుకోవాలి. అందుకు విటమన్ సి ఎక్కువగా ఉన్న ఆరెంజ్, ఆపిల్స్, ద్రాక్ష, ఆప్రి కాట్, లెమన్, రాస్ బెర్రీ మరియు స్ట్రాబెర్రీ అధికంగా తీసుకోవాలి.
విటమిన్ ఇ: విటమిన్ ఇ కురులకు మెరుపు వస్తుంది. పెలుసుగా ఉన్న కురు లు పట్టుకుచ్చులా మారు తాయి. తల మాడుకు రక్త ప్రసరణకు కావల్సి నంత ఆక్సిజన్ అందిస్తుంది. ముఖ్యంగా కురులు పెరగడానికి రక్త ప్రసరణ బాగా అవసరం. అందుకు అధిక శాతంలో విటమిన్ ఇ కలిగి ఉన్న మామిడి పండ్లు, కివి ఎక్కువగా తీసుకోవాలి. చేపలల్లోనూ ఈ విటమిన్ అధికంగా ఉంటుం ది.
బీటా కెరోటీస్: శరీరంలో బీటాకెరోటీన్ విటమిన్ ఎ' గా మారి శరీరానికి, కురులకు సహజత్వాన్ని అందజేస్తుంది. విటమిన్ ఎ, లేదా బీటా కెరోటిన్ కురులను ఆరోగ్యంగా ఉంచడం మాత్రమే కాదు(కురులతో పాటు చర్మాన్ని, గోళ్ళను) సహజంగా కురులు పెరగడానికి దోహదపడుతుంది. బీటా కెరీటిన్ అధికంగా ఉంటే దోసకాయను ఆహారంలో తీసుకోవడం వల్ల కురులు రాలిపోకుండా నివారించవచ్చు.
ఫోలిక్ ఆసిడ్: ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి వంటి లోపం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. కాబట్టి ఆహారంలో ఫోలిక్ యాసిడ్ ఉన్న ఆహారాలను అధికంగా తీసుకోవాలి. అందుకు ఆరెంజ్, స్ట్రాబెర్రీ, దోసకాయ, పుచ్చకాయ, రాస్ బెర్రీ, అవకాడో, మరియు అరటి పండ్లను తినడం వల్ల కురులకు కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ అందుతుంది. దాంతో కురులు ఆరోగ్యంగా పెరగడానికి సహాయ పడుతుంది.
మెగ్నీషియం: కురుల ఆరోగ్యకరమైన పెరుగుదలకు మెగ్నీషియం ఎంతగానో దోహదడుతుంది. అరటి పండులో ఈ పోషక పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఉండటం వల్ల వీటిని ఎక్కువగా తీసుకోవడం మంచిది.
ఇన్ అసిటోల్: విటమిన్ బి సంబంధితమైనది ఇన్ అసిటోల్. ఇది జుట్టు రాలడాన్ని అరికట్టి, పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ఇన్ అసిటోల్ పుష్కలంగా కూరగాయలు, పండ్లు దోసకాయ, ఆరెంజ్, ద్రాక్ష మరియు ఇతర సిట్రస్ పండ్లను తీసుకోవడంతో అందమైన కేశసంపదను పొందవచ్చు.
No comments:
Post a Comment