‘‘అమ్మో ఆడపిల్లా’’... సమాజం ఎంత మారిందనుకున్నా, ఎంత ఎదిగిందనుకున్నా... ఇప్పటికీ ఇదే మాట! ‘రోడ్డు పక్కన మూడు రోజుల పసికందు’, ‘ముళ్లపొదలో ఆర్నెల్ల బాలిక’, ‘బస్టాండులో పసిబిడ్డ’... రోజూ ఇలాంటి వార్తలు చూడటం, అయ్యో అనుకోవడం. పంజాబ్‌కు చెందిన ప్రకాశ్ కౌర్ కూడా అరవై ఏళ్ల క్రితం ఇలాగే ఓ రోడ్డు పక్కన పసికందుగా పడి, ఓ అనాథాశ్రమానికి చేరింది. అందుకే పెరిగి పెద్దయ్యాక ఆమె తన కోసం బతకలేదు. తనలాంటి వారికోసం బతుకుతోంది.
జలంధర్‌లోని ‘యునిక్ హోమ్’కు వెళ్లగానే గేటు ముందు ఓ ఊయల కట్టి ఉంటుంది. ఆడబిడ్డను భారమనుకునే వాళ్లు, రోడ్డు పక్కన ఎవరైనా చిన్నారిని చూసినవాళ్లు తీసుకొచ్చి ఆ ఊయల్లో పడుకోబెడతారు. అక్కడ బిడ్డను ఉంచగానే హోమ్‌లో అలారం మోగుతుంది. వెంటనే ప్రకాశ్‌కౌర్‌కు, ఆమె సహచరులకు తమ ఇంటికి కొత్త అతిథి వచ్చారని అర్థమైపోతుంది.
శియను పుట్టిన నాలుగు గంటలకే ఎవరో నల్లటి పాలిథిన్ కవర్లో పెట్టి ఓ కాలువలో పడేశారు. ఇంకెవరో ఆ పాపను తెచ్చి కౌర్‌కు అప్పగించారు. మరో చిన్నారి రేవా హైవే పక్కన దొరికింది. రజియా, రబియాలు జలంధర్ పక్కన పొలాల్లో దొరికారు. వీరందరినీ అమ్మలా ఆదరిస్తున్నారు ప్రకాశ్ కౌర్. రెండు దశాబ్దాలుగా ఆమె చేస్తున్నది ఇదే పని. దాదాపు అరవై మంది ఆడపిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నారు. 1993లో ఆరంభమైన ఈ హోమ్‌లో ఒకట్రెండు రోజుల వయసు నుంచి 20 ఏళ్ల వయసున్న అమ్మాయిల వరకూ ఉన్నారు. విరాళాలతో నడిచే ఈ హోమ్‌ను అన్నీ తానై నడిపిస్తున్నారు కౌర్. పిల్లలకు స్నానాలు చేయించడం దగ్గర నుంచి అన్నింట్లోనూ ఆమె పాత్ర ఉంటుంది. ఆమెకు సహాయకులు హోమ్‌లో పెరిగి పెద్దయిన అమ్మాయిలే. కొత్త పాప వస్తే అక్కడ సందడే సందడి. ఆ పాపను బుజ్జగిస్తూ, ఆడిస్తూ, పాలు పట్టిస్తూ మిగతా అమ్మాయిలు లోకం మరిచిపోతారు. ఒక ఆడపిల్లకు అందాల్సిన వసతులు, మురిపాలన్నీ ఇక్కడి అమ్మాయిలకు దొరుకుతున్నాయి.
ఇక్కడి పిల్లలకు మతం లేదు. కులం లేదు. ఒకే కుటుంబం. ఒకే తల్లి. ఒకే పుట్టినరోజు... అది ఏప్రిల్ 24. ఆ రోజు వంద కిలోల కేక్ తెప్పించి ఒకేసారి పుట్టిన రోజు జరుపుకుంటారు. ఇక్కడి పిల్లల్ని కౌర్ ఎవ్వరికీ దత్తత కూడా ఇవ్వరు. దీనికో కారణం ఉంది. గతంలో ఒకరిద్దరిని దత్తత ఇస్తే వాళ్లను సరిగా చూసుకోలేదు. దాంతో తిరిగి తెచ్చేసుకున్నారు. అంత ఇష్టం ఆమెకు ఆ పిల్లలంటే.
చదువులు, పెళ్లిళ్లు....
పిల్లలను పెంచితేనే సరిపోదంటారు ప్రకాశ్ కౌర్. వారికి చదువు చెప్పిస్తారు. చదువు పూర్తయిన వెంటనే పెళ్లి చేయరు. కొన్నాళ్లు ఉద్యోగాలకు పంపుతారు. దీనివల్ల వారిలో సొంతంగా బతకగలిగే ఆత్మవిశ్వాసం వస్తుందన్నది కౌర్ విశ్వాసం. తర్వాత మంచి సంబంధాలు చూసి పెళ్లి జరిపిస్తారు. కొందరు పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోగా, ఇంకొందరు మేము అమ్మతోనే ఉంటాం అంటూ కౌర్‌ను విడిచిపెట్టి వెళ్లడం లేదట. పెళ్లిళ్లు అయ్యి వెళ్లిపోయిన వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా ఈ అమ్మ అండగా ఉంటుంది. అల్కా అనే యువతికి పెళ్లి చేసి పంపితే కొంతకాలానికి భర్త ప్రమాదంలో చనిపోయారు. అత్తమామలేమో చిల్లిగవ్వ కూడా ఇవ్వకుండా తరిమేశారు. ప్రజా సంఘాలతో పోరాడి ఆమె వాటా ఆమెకు వచ్చేలా చేశారు కౌర్.
అమ్మాయిలు స్వతంత్రంగా బతకగలగాలి అన్నది కౌర్ అభిమతం. అందుకే వారు ఏ స్థితిలో హోమ్‌లో చేరారో పెద్దయ్యాక వారికి వెల్లడిస్తారు. దీనివల్ల జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే పట్టుదల కలుగుతుందంటారామె. ‘నేను డాక్టర్నయి, నన్ను విసిరేసిన తల్లికి నేనేంటో తెలియ చెబుతా. అమ్మాయి భారం కాదని రుజువు చేస్తా’ అని ముస్సోరిలో ఎనిమిదో తరగతి చదువుతున్న షీబా చెబుతోంది. డిగ్రీ చదువుతున్న లూసీకి ఇంగ్లిష్ ప్రొఫెసర్ కావాలని ఆశ. ఇక్కడున్న ప్రతి పిల్ల తల్లిదండ్రులూ ఈ అమ్మాయిని ఎందుకు వదులుకున్నామా అని చింతించాలి అంటారు కౌర్ భావోద్వేగంతో.
మూడు పెద్దగదులు మాత్రమే ఉన్న హోమ్‌ను విస్తరించడానికి ప్రస్తుతం ప్రయత్నాలు చేస్తున్నారు ప్రకాశ్‌కౌర్. ‘కొందరు ఇక్కడికొచ్చి ఈ అమ్మాయిలను పని మనుషులుగా పంపమని అడుగుతుం టారు. నాకు చాలా కోపం తెప్పిస్తుందా మాట. వీళ్లు అనాథలు కాదు, నా పిల్లలు అని ఘాటుగా సమాధానమిస్తా’ అంటారు కౌర్. అందుకేగా ఆ పిల్లలంతా ఆమెను అమ్మ అనేది!

No comments:
Post a Comment