all

Saturday, December 22, 2012

మహావిష్ణువు భువికి ఏతెంచే పుణ్యతిథి ముక్కోటి

భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్లో ప్రతిరోజూ ఒక పండగే! ప్రతి దినమూ ఒక ఉత్సవమే! సంవత్సరంలోని మూడొందల అరవై రోజులూ ఏదో ఒక విశేషమే కనిపిస్తుంది. ఆ వంకతోనైనా పూజలు చేసి, ఉపవాసాల్లాంటి నియమాలు పాటించి, పవిత్రమైన జీవనవిధానంలో కాలం గడుపుతూ, కొంతకాలానికైనా మానసిక ప్రవర్తనలో ఒక మార్పు కలిగి, ఆధ్యాత్మిక చింతన ఏర్పడి, మానవుడు దానవుడుగా కాక, భక్తి పారవశ్యంతో సంచరించి పరమ పురుషార్ధమైన మోక్షం వైపు పయనిస్తాడని పెద్దల విశ్వాసం. ఆవిధంగా ఏర్పడిందే ఏకాదశి వ్రతం.

మన సంవత్సర కాలాన్ని స్థూలంగా ఉత్తరాయణం, దక్షిణాయణం, అని రెండు భాగాలు చేశారు. ఒక్కొక్కటి ఆరు నెలల కాలం ఉంటుంది. ఉత్తరాయణం పుణ్యకార్యాలకు అనువైనదని, ఆ కాలంలో మరణించినవారికి స్వర్గం ప్రాప్తిస్తుందని ఒక నమ్మకం. అంతేకాదు, ఉత్తరాయణం దేవతలకు పగటివేళ అని, దక్షిణాయణం రాత్రికాలమని కూడా అంటారు. అందుకే అమ్మవారికి సంబంధించిన నవరాత్రులు దక్షిణాయణం లోకి వస్తాయి.


  


విష్ణుమూర్తి ఈ దక్షిణాయణంలో ఆషాఢ శుద్ద ఏకాదశి నుండి యోగనిద్రలో నాలుగు మాసాలు గడుపుతూ లోకం తీరుతెన్నులు పరిశీలిస్తూ ఉంటాడు. అందుకే ఆషాఢ శుద్ద ఏకాదశిని ''శయన ఏకాదశి'' లేదా ''తొలి ఏకాదశి'' అని పిలుస్తారు. జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రతి ఏకాదశి ఒక పర్వదినమే. సంవత్సరంలో పన్నెండు నెలలు ఉంటాయి. ఒక్కొక్క మాసానికి శుక్లపక్షంలో ఒకటి, కృష్ణ పక్షంలో ఒకటి చొప్పున రెండు ఏకాదశులు ఉంటాయి. అధికమాసం ఉన్న సంవత్సరం అయితే మరో రెండు అదనంగా ఉంటాయి. అప్పుడు 26 ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశి ప్రాముఖ్యాన్ని గూర్చి శంకరుడు పార్వతికి వివరించినట్లు పద్మపురాణం పేర్కొంది. విష్ణువు వైకుంఠం నుండి ముప్పై మూడు కోట్ల దేవతలతో ఈ ఏకాదశి రోజు భూమికి దిగివస్తాడు. కాబట్టి దీనికి ''ముక్కోటి'' అని పేరు వచ్చింది అంటారు.



ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, పూజలు, దానధర్మాలు చేసి, భగవన్నామ స్మరణతో కాలం గడుపుతూ రాత్రంతా జాగరణ చేసి, మర్నాడు అంటే, ద్వాదశినాడు ఆ ఘడియలు వెళ్ళకముందే పారణ చేయాలి. ఇది ఒక వ్రాతనియమం. మానవులకు ముక్తి కలిగించాచానికి స్వయంగా విష్ణువే ఏకాదశి వ్రతాన్ని ఏర్పాటు చేసినట్లు పురాణాలు ఘోషిస్తున్నాయి. ఈ వ్రతాన్ని ఆచరించిన వారిలో రుగ్మాంగదుడు, అంబరీషాదులు ముఖ్యులు. ఈ వ్రతానికి సంబంధించిన భవిష్యోత్తరపురాణాదులు ఎన్నో గాధలు, కధలు పేర్కొన్నాయి.




ఏకాదశినాడు ముఖ్యంగా ఉపవాసదీక్ష భక్తులు పాటించే ఒక నియమం అసలు ఉపవాసం అంటే ఏమితో చూడండి.. ఉప అంటే భగవంతుని సమీపంలో అని, వాసం అంటే ఉండటం అని అర్ధం. అంటే భగవంతుని పట్ల భక్తి శ్రద్ధలను ప్రకటిస్తూ కాలం గడపడం అన్నమాట. అయితే, ఆరోగ్యరీత్యానో, వయోభారం చేతనో కొంతమంది ఆహారం తీసుకొనక ఉపవాసం ఉండలేక పోవచ్చు. వారికి ప్రత్యామ్నాయంగా వాయుపురాణం -

'సక్తం హవిష్యాన్న మనోదనం వా
ఫలంతిలాః క్షీరమధాంబుచాజ్యం
యత్పంచగవ్యం యదివాపి వాయు
ప్రశస్త మంత్రోత్తర ముత్తరం చ'
అని పేర్కొంది.

ఉపవాసం చేయలేనివారు నీరు, పాలు, నువ్వులు, పండ్లు తినవచ్చు. లేదా ఉడకని పదార్ధాలు లేదా హనిశ్యాన్నం భుజించవచ్చు. అది కూడా చేతకాని వారు సక్తభోజనం అంటే రాత్రిపూట భోజనం చేయవచ్చు. అయితే ఏకాదశి నాడు భుజిస్తే చాంద్రాయణ వ్రతం చేసి ఆ పాపాన్ని పోగొట్టుకోవాలని శాస్త్రం చెప్తున్నది.



''మాసానాం మార్గశీర్షోహం'' అన్నాడు గీతాచార్యుడు. అందుకే ఈ మాసంలో వచ్చే మొదటి ఏకాదశికి ఒక ప్రాముఖ్యం ఏర్పడింది. మార్గశిర సుద్ద ఏకాదశిని మొక్శైక ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు. దీన్నే హరిదినమని, వైకుంఠ దినమని అంటారు. ఇది ఉత్తరాయన ప్రారంభాన్ని సూచిస్తుంది. సూర్యుడిణి చుట్టుముట్టిన చీకట్లు పటాపంచలై ఆయనకు మోక్షం అంటే విముక్తి కలగడంవల్ల దీన్ని మోక్ష ఏకాదశి అన్నారు.



వాస్తవానికి కాలగమనంలో తెలుగువారిది చాంద్రమానం. అయితే ముక్కోటి సౌరమానం ప్రకారం జరుపుకునే పండుగలు, ధనుస్సంక్రమణం తర్వాత వచ్చే ఏకాదశి ఇది. సాధారణంగా ఈ పండుగ మార్గశిరంలో కానీ పుష్యంలో కానీ వస్తుంది. దక్షిణాయణం వెళ్ళిపోతుంది కాబట్టి రాత్రిపోయి పగలు వస్తుంది. అందుకే విష్ణువు వైకుంఠం నుండి ముప్పై మూడు కోట్ల దేవతలతో ఈరోజు భూమికి దిగివస్తాడు. కాబట్టి దీనికి 'ముక్కోటి' అని పేరు వచ్చిందని అంటారు. 33 కోట్లను మూడు కోట్లు అనే పదం సూచిస్తుంది. దానికి సూచనగా విష్ణు ఆలయంలో ఉత్తరద్వారం తెరుస్తారు. దీనికి వైకుంఠద్వారం అని పేరు.

సూర్యుడు ఉత్తరాయన ప్రవేశాన్ని వైకుంఠ ద్వారం తెరవడం ద్వారా సూచిస్తారు. తెల్లవారుజామున దీనిగుండా వెళ్లినవారికి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములు అందరూ వైకుంఠ ద్వారం తెరిచినప్పుడు స్వర్గంలో ప్రవేశిస్తారని ఒక విశ్వాసం. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమానం. ఈనాడు విష్ణుమూర్తి మురాసుర సంహారం చేసాడని, శ్రీరంగ క్షేత్రంలో విభీషణుడు వచ్చి ఆ స్వామిని పూజిస్తాడని చెప్తారు. హిందువులందరూ ముక్కోటి ఏకాదశిని భక్తిశ్రద్ధలతో పాటించడం గమనించదగ్గ ఒక విశేషం.

వైభవోపేతం వైకుంఠ ఏకాదశి





పుష్య శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి, మోక్ష ఏకాదశి అని కూడా అంటారు. సహజంగానే ఏకాదశి తిథి ఎంతో ఉత్తమమైంది. ఇక వైకుంఠ ఏకాదశి పరమ
పవిత్రమైంది. ఈరోజు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి.
విష్ణుమూర్తి ముర అనే రాక్షసుని సంహరించి, ఇంద్రాది దేవతలను ఆనందింపచేసిన రోజిది. ఈ వైకుంఠ ఏకాదశి నాడు దేవుని దర్శించుకుని, ఉపవాసం ఉన్నవారికి స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి.
వైకుంఠ ఏకాదశినాడు చేసే దైవారాధన మూడు కోట్ల దేవతలకూ చెందుతుంది. ఈ విశిష్ట దినాన చేసే పూజతో మూడు కోట్ల దేవతలూ ప్రసన్నం అవుతారు. కనుక ఈరోజు విధిగా ఆలయానికి వెళ్తారు. భక్తిగా దేవుని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. ఉపవాసం ఉండి, పాలు, ఫలాలు మాత్రమే సేవిస్తారు. ముక్కోటి ఏకాదశినాడు దేవాలయాలన్నీ భక్తులతో కళకళలాడతాయి. ఇక వైష్ణవ దేవాలయాల సంగతి చెప్పనవసరం లేదు. కలియుగ వైకుంఠంగా చెప్పుకునే తిరుమలలో ముక్కోటి ఏకాదశి మహా వైభవోపేతంగా జరుగుతుంది.
ముక్కోటి ఏకాదశినాడు భక్తులు ముఖ్యంగా వైష్ణవులు ''విష్ణు సహస్రనామం''తో మొదలుపెట్టి స్వామివారికి అర్చనలు, పూజా కార్యక్రమాలు చేస్తారు. వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, పురాణ శ్రవణాలు, ధార్మిక ఉపన్యాసాలు నిర్వహిస్తారు. ఈ పుణ్య తిథినాడు యజ్ఞయాగాదులు జరిపితే మంచిది కనుక కొందరు యజ్ఞాలకు పూనుకుంటారు.




తిరుమల శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకునే భక్తులు ఇతర దినాల్లో కంటే, ముక్కోటి ఏకాదశి లాంటి విశేష పర్వదినాల్లో తిరుమల వెళ్ళడం మరింత శ్రేష్ఠమని నమ్మి, ఆ వేళ్టికి అక్కడ ఉండేలా ఏర్పాటు చేసుకుంటారు.
 నిజానికి రద్దీ విపరీతంగా ఉండటంవల్ల వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారిని దర్శించుకోవడం చాలా కష్టంతో కూడుకున్న పని.


అయినా లక్ష్యపెట్టకుండా వెళ్తారు.
వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి నాడు చనిపోయిన వారు తిన్నగా వైకుంఠానికి వెళ్తారని, మోక్షం పొందుతారని పూరాణాలు చెప్తున్నాయి.























సూర్యుడు ధనూరాశిలో ఉండే ధనుర్మాసంలో, శుక్ల ఏకాదశినాడు, ముక్కోటి దేవతలను వెంటబెట్టుకొని శ్రీమన్నారాయణుని దర్శనం కోసం బ్రహ్మ వైకుంఠానికి వెళ్లాడు. రావణాసురునితో పీడింపబడుతున్న దేవతలంతా దుఃఖంతో తమ కష్టాలు చెప్పుకోవడానికి వైకుంఠానికి చేరారు. ప్రభాతకాలంలో ఉత్తరద్వారం దగ్గర స్వామివారి దర్శనం కోసం నిలబడ్డాడు. 

అప్పుడు నారాయణుడు వారికి దర్శనం ఇచ్చాడు. దేవతలు ఆయనను స్తుతించి, అనుగ్రహాన్ని పొందారు. ముక్కోటి దేవతలూ స్వామిని దర్శించిన ఏకాదశి కనుక ఇది ముక్కోటి ఏకాదశి అయింది. ఆగమశాస్త్రం ప్రకారం దేవాలయాలకు తూర్పున సింహద్వారం, మిగిలిన దిక్కుల్లో కూడా ద్వారాలు ఉంటాయి. ముక్కోటి ఏకాదశినాడు ఉత్తరద్వారం నుండి ప్రవేశించి, ప్రభాతవేళ స్వామిదర్శనం చేసుకోవాలి. 

స్వామివారు దేవేరుల ఉత్సవ విగ్రహాలను ఉత్తర ముఖంగా ఉత్తర ద్వారానికి ఎదురుగా ఉంచుతారు కనుక దీనిని ఉత్తరద్వార దర్శనం అంటారు. 
సంవత్సరానికి పన్నెండు నెలలు. సూర్యుని గమనాన్ని బట్టి మొదటి ఆరు నెలలు ఉత్తరాయణం, తరువాత ఆరునెలలు దక్షిణాయనం అవుతుంది. మానవులు ఉత్తరాయణంలో దేవకార్యాలకు, దక్షిణాయనంలో పితృకార్యాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిని దేవయానం, పితృయానం అంటారు. ఉత్తరాయణంలో దేవయానంలో మరణించినవారు సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్లి మోక్షాన్ని పొందుతారు. దక్షిణాయనంలో పితృయానంలో పోయినవారు చంద్రమండలానికి చేరి, మళ్లీ జన్మిస్తారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఎదురుచూశాడు.

కృత్యోత్సవం తథా భూతం ఏకాదశ్యాం విశేషతః
విశంతి మోక్షం తస్మాత్ స మోక్షత్సవ ఇతీర్యతే ॥
ముక్కోటి ఏకాదశి వేకువజామున ఉత్తరద్వారం నుండి శ్రీమహావిష్ణుదర్శనం చేసుకొన్నవారికి మోక్షం తప్పక లభిస్తుంది. కనుక ఈ దర్శనాన్ని మోక్షోత్సవం అంటారు. వైఖానసుడు అనే రాజు రాజకార్య నిమగ్నుడై దేవతలను, పితృదేవతలను పూజించటం మానేశాడు. దాంతో పితృదేవతలు దుఃఖంతో కలలో కనబడ్డారు. 

‘నాయనా! నీవు దేవతార్చన, పితృదేవతార్చన చేయకపోవడం వలన మాకు ఉత్తమలోకాలు లభించటం లేదు. వైకుంఠ ఏకాదశినాడు స్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకొని ‘ఏకాదశీవ్రతం’ ఆచరించి, ఆ ఫలాన్ని ధారపోస్తే మాకు పుణ్యలోకాలు, నీకు ముక్తి లభిస్తాయి’ అన్నారు. వైఖానసుడు వారు చెప్పినట్లు చేశాడు. ఐహిక బాధ్యతలతో మునిగి దేవపితృకార్యాలను మరచిపోయే వారికి ముక్కోటి ఏకాదశి కర్తవ్యాన్ని గుర్తు చేస్తుంది. 

అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు మొత్తం పదకొండూ భగవంతుని యందు లగ్నం చేసి, ఏకాదశీవ్రతం చేసినవారికి తప్పక ముక్తి లభిస్తుంది. ఇహం కోసం పరాన్నీ, పరం కోసం ఇహాన్నీ నిర్లక్ష్యం చేయకుండా మానవుడు సమతూకంగా జీవించి, జన్మను సార్థకం చేసుకోవాలి. ముక్కోటిఏకాదశి మనకు ఇచ్చే సందేశం ఇదే.

Friday, December 21, 2012

ప్రసవం తర్వాత అధిక బరువును తగ్గించడం ఎలా...!

సాధారణంగా మహిళలు ప్రసవం తర్వాత బరువు పెరుగుతారా? సిజేరియన్ అయినా? సాధారణ డెలివరీ అయినా బరువు పెరగాల్సిందేనా? అంటే.. కాదని అంటున్నారు వైద్యులు. ఆహార నియమాలు, వ్యాయామంతో నాజూగ్గా ఉండొచ్చని పేర్కొంటున్నారు. డెలివరీ తర్వాత 4-5 నెలల పాటు విశ్రాంతి తీసుకోవడం, నెయ్యి, స్వీట్లు లాంటి కార్బోహైవూడేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. నిత్యం వ్యాయామం చేస్తూ, పోషక విలువలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే మళ్లీ సాధారణ స్థాయికి చేరుకోవచ్చు.

best tips postnatal weight loss

గర్భందాల్చిన నాటి నుంచి డెలివరీ అయ్యే వరకు బిడ్డ బరువుతో కలిపి మహిళలు 9-12 కిలోలు బరువు పెరుగుతారు. డెలివరీ తరువాత తల్లి గర్భంలో ఉండే ఉమ్మనీరు, యూట్రస్ వల్ల 5-6 కిలోల వరకు బరువు అధికంగా ఉంటారు. ఈ బరువు కూడా ఆరు నెలల్లో తగ్గిపోయి మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటారు. డెలివరీ అయిన తర్వాత పూర్తిగా విశ్రాంతి కల్పిస్తారు. ఈ సమయంలో ఎక్కువగా కార్బోహైవూడేట్లు ఉండే ఆహారం తీసుకున్నా.. శారీరక శ్రమ లేకపోవడం వల్ల బరువు పెరుగుతారు.

అధిక బరువుతో అనర్థాలు:

సాధారణ డెలివరీ అయితే వారం రోజుల తర్వాత, అదే సిజేరియన్ అయితే 10 రోజుల తరువాత సాధారణంగా అన్ని పనులు చేసుకోవచ్చు. వ్యాయామం కూడా చేయడం వల్ల బరువు పెరగకుండా జాగ్రతపడొచ్చు. సిజేరియన్ అయిన వాళ్లలో ఇంటి పనులు చేసినా, వ్యాయామం చేసినా మంచిది కాదనే అపోహలు ఎక్కువగా ఉంటాయి. ఇందులో ఏమాత్రం నిజం లేదని వైద్యులు చెబుతున్నారు. గర్భం దాల్చిన సమయంలో పెరిగిన బరువులో 60 శాతం వరకు తగ్గే అవకాశం ఉంటుంది. అధిక బరువు వల్ల మధుమేహం, హైపర్‌టెన్షన్ లాంటి ఆరోగ్య సమస్యలు ఎదురవ్వొచ్చు.వ్యాయామం ఉత్తమం: వ్యాయామంతో శరీరంలో రక్తవూపసరణ, జీర్ణవ్యవస్థ బాగా పనిచేయడంతో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. వ్యాయామం చేయలేనివారు రోజుకు కనీసం గంటపాటు వాకింగ్ చేయాలి. ఇవి కాకుండా థైరాయిడ్ సమస్య వల్ల కూడా బరువు పెరిగే అవకాశం ఉంటుంది.

తీసుకోవాల్సిన జాగ్రతలు:

1. సాధారణ డెలివరీ అయితే వారం రోజులు, సిజేరియన్ అయితే పది రోజుల తరువాత వ్యాయామం, వాకింగ్ చేయవచ్చు.

2. డెలివరీ అయిన ఆరువారాల తరువాత మళ్లీ సాధారణ వైవాహిక జీవితం గడపొచ్చు.

3. డెలివరీ తరువాత 10 రోజులకు మించి విశ్రాంతి తీసుకోవద్దు.

4. కార్బోహైవూడేట్లు తక్కువగా ఆహారం తీసుకోవాలి.

4. ప్రొటీన్లు, పాలు, గుడ్లు, చేపలు, నానబెట్టిన గింజలు తీసుకోవాలి.

5. పండ్లు, పళ్లరసాలు, తాజా కూరగాయలు తీసుకోవాలి.

ఏ సమయంలో ఏం తినాలి:

1. ఉదయం:
అల్పాహారంలో విటమిన్ బి ఎక్కువగా ఉన్న పదార్థాలుంటే మేలు. ఇడ్లీ, పెసరట్టు, గోధుమ, ఉప్మా, రొట్టెలు, దోశ, పాలు, ఏదైనా పండు తింటే మంచిది.పీచుపదార్థాలు: యాపిల్స్, నారింజ, క్యారెట్ ముక్కలు, బాదం, పిస్తా వివిధ రూపాల్లో తీసుకోవాలి.

2. మధ్యాహ్నం:
అన్నం, గోధుమ రొట్టెలు తీసుకోవాలి. ఐరన్, కార్బోహైవూడేట్స్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. కూరల్లో పాలకూర, ఆకుపచ్చటి కూరగాయలు తినాలి.

సాయంత్రం:
పండ్ల రసాలు, పుచ్చకాయ, క్యారెట్ రసం, పాలు తీసుకోవాలి.

3. రాత్రి: బియ్యం, పప్పుధాన్యాలుతో పాటు కోడిగుడ్డు తీసుకోవాలి. రాత్రి పది గంటల తరువాత ఆహారం తీసుకోవద్దు.

పని చేసుకోవచ్చు:
డెలివరీ అయిన వారం, పది రోజుల తరువాత అన్ని పనులు చేసుకోవచ్చు. వ్యాయామం చేస్తూ.. ఆహార నియమాలు పాటించడం వల్ల బరువు పెరగకుండా ఉంటారు. మోడలింగ్, సినిమా రంగానికి చెందినవారు లైపోసక్షన్, ప్లాస్టిక్ సర్జరీల వల్ల మళ్లీ సాధారణ స్థితికి చేరుకుంటారు.

ఊబకాయం వున్నవాళ్ళు ఆహారం, వ్యాయామం ఎలా ఉండాలి?

ఊబకాయం వున్నప్పుడు ఆహార నియమావళికి, వ్యాయామానికి మారడం అసాధ్యంలా అనిపిస్తుంది. ఐతే ఊబకాయం వల్ల వచ్చే సమస్యలు, ప్రతిబంధకాల నుంచి తప్పించుకోవాలంటే ఏకైక మార్గం దాన్ని ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళిక, మంచి వ్యాయామ నియమావళి తో ఎదుర్కోవడమే.

How Diet Exercise With Obesity

చర్యలు:

1. మొట్టమొదటి చర్య ఈ సవాలుకు భయపడకుండా ఉండడమే. ఒక పర్వతం అధిరోహించాలంటే ఎవరికైనా భయమేస్తుంది, కానీ మీ లక్ష్యం కష్ట సాధ్యమే కానీ అసాధ్యం కాదని తెలుసుకోవడం మిమ్మల్ని ఒక సానుకూల ధోరణి లోకి తీసుకువెళ్తుంది.

2. తరువాత మరింత అభివృద్ది చేసేలా మొదట్లో చిన్న చిన్న చర్యలు తీసుకోండి. బాగా తీవ్రంగా ఆహార వ్యాయామ ప్రణాళిక లోకి వెళ్ళిపోవడం చాలా ప్రలోభ పెడుతుంది కానీ మీరు పరిగెత్తలేనంత వేగంగా వెళ్ళడ౦ వల్ల ఉపయోగం వుండదు.

3. వ్యాయామాన్ని దైనందిన చర్యగా మార్చుకోండి. చర్విత చర్వణమే అయినా వాహనాలపై వెళ్ళే కంటే నడవడం, లిఫ్ట్ ఎక్కే బదులు మెట్లు ఎక్కడం లాంటి చిన్న చిన్న పనులు కూడా చాల తేడా చూపిస్తాయి.

4. భోజనం మానేయకండి. అది అనారోగ్యకరమే కాక అరుదుగా పనిచేస్తుంది.

5. క్రమంగా మీరు రోజూ తినే పరిమాణాన్ని తగ్గిస్తూ, మీ పని స్థాయిని పెంచుకుంటూ వెళ్ళండి.

6. మీకు నచ్చే ఆరోగ్యకరమైన ఆహారం తినండి. చాలా పళ్ళు రుచిగా వుండి మిఠాయిలకు ప్రత్యామ్నాయంగా పని చేస్తాయి.


చిట్కాలు:

1. వ్యాయామం వల్ల వచ్చే ప్రయోజనాలు గుర్తుంచుకోండి. వ్యాయామం చేసేటప్పుడు చాలా కష్టంగా అనిపించవచ్చు, అది ఎటువంటి ప్రయోజనాలు కలిగించట్లేదని కూడా అనిపించవచ్చు; కానీ వ్యాయామం మీ జీవ క్రియను వేగిరపరుస్తుంది - అంటే చేయడం ఆపివేసిన చాలా సేపటి తర్వాత కూడా అది మీ కాలరీలు కరిగేలా చేస్తుంది.

2. వ్యాయామం, ఆహారం మీ శరీరంలోకి ఎండార్ఫిన్ లను వదిలి మీకు ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, మీరు మరింత ఆరోగ్యంగా తయారై మీ రూపం మీ ఆత్మ విశ్వాసం స్థాయిని పెంచుతుంది.

3. క్రమంగా, మీరు తక్కువ తినడం వల్ల, మీ ఉదరం తక్కువ పరిమాణంలో ఆహారానికి సర్దుకుని సైజు తగ్గుతుంది. దీని వల్ల త్వరగా కడుపు నిండినట్టు అనిపించి మీకు ఆకలి తక్కువగా వేస్తుంది.

హెచ్చరికలు :

1. ఇది జీవన శైలిలో మార్పని గుర్తుంచుకోవడం ముఖ్యం. సమస్య కాస్త తగ్గినట్టు అనిపించగానే మీ పాత పద్ధతిలోకి వెళ్ళిపోతే ఈ ప్రయత్నం అంతా చేయడం వ్యర్ధమే అవుతుంది.

2. మీ కుటుంబం, స్నేహితులు మీ కొత్త రూపం మీద వ్యాఖ్య చేయడానికి చాలా నెలలు పట్టవచ్చు. ఈ సమయం వల్ల నిరుత్సాహ పడకండి ఎందుకంటే వ్యాయామం మొదలు పెట్టిన దగ్గర నుంచి మీరు ఆరోగ్యంగా చురుగ్గా వున్నట్టు అనిపిస్తుంది.మీ పైన మీరు మరీ వత్తిడి పెంచుకోకండి. మీకు అనుకూలమైన వేగం లోనే వెళ్ళండి.

 

వ్యాయామం తర్వాత తినకూడని ఆహారాలు...

సాధారణంగా ప్రతి రోజూ వ్యాయామం తర్వాత తీసుకొనే ఆహారం ఆరోగ్యపరంగా శరీరం మీద చాలా ప్రభావాన్ని చూపుతుంది.వ్యాయామం రూపంలో బాగా శారీరక శ్రమ చేశాక ఏం తినాలో, ఏం తినకూడదో అన్న సందేహం చాలామందిలో ఉంటుంది. చెమటలు కక్కుతూ జిమ్ బయటకు రాగానే పొగలు కక్కుతూ ఉండే తమకిష్టమైన ఆహారం తీసుకోవచ్చా లేదా అని తికమకపడుతుంటారు. ఈ విషయంలో కొమ్ములు... అదే... కండలు తిరిగిన వీరులు కాస్త కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. అలాంటి సందేహాలను తీర్చడానికి ఉపయోగపడేదే ఈ కథనం.

వ్యాయామం తర్వాత ఏం తినాలి, ఏ వేళలో తినాలి అన్న విషయం చాలా ప్రధానం. అది తెలుసుకోకపోతే చాలా సందర్భాల్లో కండలూ, బరువునే కాదు... శక్తినీ, పోషకాలను కోల్పోవాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యాన్నీ కోల్పోవాల్సి వస్తుంది. అందుకే మంచి వ్యాయామం తర్వాత తీసుకోవాల్సిన ఆహారం ఎలా ఉంటే ఆరోగ్యకరమో తెలుసుకుందాం.

ఆకుకూరలు, చేపలు, చికెన్, జ్యూసులు, నీళ్ళు, ఉప్పు కలిపిన నిమ్మరసం వంటివి ఆరోగ్యానికి చాలా మంచిది వీటితో వ్యాయామం తర్వాత మన శరీరానికి ప్రోటీన్లు అవసరమని గుర్తించాలి. ఆరోగ్యకరమైన ప్రోటీన్లు ఎక్కువగా ఉండి, కొవ్వు తక్కువగా ఉండే ఆహారాన్ని తలచుకుంటే తొలుత స్ఫురించేవి చికెన్, చేపలు. వాటిలోని పోషకాలు బాడీబిల్డింగ్‌కు, కండరాల టోన్ నిర్వహణకు ఉపయోగపడతాయి. మరి వ్యాయమం తర్వాత తీసుకొనే ఆహరం గురించి తెలుసుకొన్నాం. వ్యాయామం తర్వాత తీసుకోకూడని ఆహారాలేంటో ఒక సారి చూద్దాం...

 
చీజ్


చీజ్ లో శాచురేటెడ్ పదార్థాలు ఎక్కువగా కలిగి ఉండం చేత, వ్యాయామం చేసి వచ్చిన వెంటనే కొంత విశ్రాంతి తీసుకోవాలి. వ్యాయామం తర్వాత చీజ్ తో తయారు చేసిన ఎటువంటి ఆహారాలను తీసుకోకపోవడానికి ఆరోగ్యానికి చాలా మంచిది.


ఫ్రైడ్ చికెన్

వ్యాయామం చేసిన వెంటనే ఫ్రై చేసిన మాంసాహారాన్ని తినకూడదు. అంతే కాదు మాంసాహారంతో తయారు చేసి స్నాక్స్ కు దూరంగా ఉండాలి. అలా కాకుండా ఉడికించిన చికెన్ లేదా ఉడికించిన చేపలు నిరభ్యంతరంగా తినబోదు.


ధాన్యాలు



తణధాన్యాలు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే వ్యాయామం చేసిన వెంటనే వీటిని తినకూడదు. వీటి బదలు నట్స్, పండ్లను తినవచ్చు.


బ్రెడ్


బ్రెడ్, సాండ్ విచ్ వంటి స్నాక్స్ తినడం వల్ల శరీరంలోని రక్తంలోనికి చక్కరెలు త్వరగా అందుతాయి. వ్యాయం తర్వాత వెంటనే తినే ఆహారాల వల్ల విడుదలయ్యే చక్కెర స్థాయిలు శరీరానికి హానీ కలిగిస్తాయి.

 

పండ్ల రసం
వ్యాయామం చేసి వెంటనే చెమటు ఎక్కువగా బయటకు నెట్టబడుతాయి. అందుకోసం జ్యూస్ తాగాలనుకోవడం చాలా పొరపాటు. ఈ జ్యూస్ లలో ఉన్న చక్కర పదార్థాలు దేహంలో త్వరగా చేరుతుంది. దాంతో శరీరంలో చక్కర స్థాయిలు ఎక్కువ తక్కువలు అయ్యే అవకాశం ఉండటం చేతా వ్యాయం చేసిన వెంటనే పండ్లరసం తీసుకోకపోవడమే మంచిది.

గుడ్డు
గుడ్డు ఆరోగ్యానికి మంచిది. అయితే వ్యాయామం తర్వాత దీన్ని ఫ్రై చేసి తినకూడదు. ఫ్రై చేసి తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదు. ఇందులో నూనె పదార్థాలు కలవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు.



మిక్క్ షేక్


మిల్క్ షేక్ తాగడానికి చాలా రుచికరంగా ఉంటుంది, అయితే వ్యాయమం తర్వాత ఈ మిల్క్ షేక్ ను తాగడం వల్ల వ్యాయమం చేసినంత ప్రయోజనం శరీరానికి ఉండదు.



పచ్చి కూరగాయలు

పచ్చికూరగాల్లో అధిక పోషకపదార్థాలు అధికంగా ఉంటాయి. అయితే వీటిని వ్యాయామం చేసిన వెంటనే తినకూడదు. పచ్చికూరగాయలను వ్యాయామం తర్వాత వెంటనే తినడం వల్ల కండర శక్తి తగ్గిపోతుంది.

గ్రిల్డ్ మసాలా ఫిస్ ఫిల్లెట్-క్రిస్మస్ స్పెషల్

సాధారణంగా ఫిష్ వంటలంటే చాలా మాసాహారులకు చాలా ఇష్టం. అందులోనూ ఫిష్ మసాలా అంటే నోట్లో నీళ్ళు ఊరాల్సిందే. ఎర్రగా ఉండే గ్రేవి, డీఫ్ ఫ్రై చేసిన ఫిష్ ఫిల్లెట్..ఇలా ఒకటేమిటి. వివిధ రుచులు. అయితే ఎప్పుడూ రొటీన్ గా తయారు చేసే ఫిష్ వంటకాలకు భిన్నంగా ఇండియన్ స్టైల్ లో తయారు చేసుకొని గ్రిల్డ్ ఫిష్ మసాలా చాలా అద్భుతమైన రుచిని అందిస్తుంది. అందులోనూ ఇండియన్ మసాలాలు వాడటంతో మరింత టేస్టీగా ఉంటుంది.

గ్రిల్డ్ స్నాక్స్ అన్నీ కాంటినెంటల్ స్టైల్లో వండుతారు. అదే స్టైల్లో గ్రిల్డ్ మసాలా ఫిష్ అద్భుతమైన టేస్ట్ తో ఈవెనింగ్ స్నాక్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం....

christmas special grilled masala fish fillets

కావలసిన పదార్థాలు:

పాంప్రెట్ ఫిస్ ఫిల్లెట్: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: 2tbsp
జీలకర్ర పొడి: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
పసుపు: 1 pinch
అజ్వైన్(ఇంగువ): 1/2 tsp
నిమ్మరసం: 2tbsp
నూనె: 1tbsp
ఉప్పు: రుచికి సరిపడా
కొత్తిమీర తరుగు: 2tbsp

తయారు చేయు విధానం:

1. ముందుగా ఓవెన్ ను 300డిగ్రీల వరకూ వేడి చేయాలి.

2. తర్వాత ఫిష్ ఫిల్లెట్ ను శుభ్రం చేసి తడి ఆరనివ్వాలి. శుభ్రం చేసిన ఫిష్ ఫిల్లెట్ మీద ఉప్పు, పసుపు చిలకరించు పక్కన పెట్టుకోవాలి.

3. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ధనియాలపొడి మరియు జీలకర్రపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి.

4. ఇప్పుడు శుభ్రం చేసి ఉప్పు పట్టించి పెట్టుకొన్న ఫిష్ ఫిల్లెట్ ను ఈ అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని మ్యారినేట్(చేపమొత్తానికి బాగా పట్టించాలి)చేసి దాని మీద కొంచె అజ్వైన్ మరియు నిమ్మరసం చిలకరించి ఇరవై నిముషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

5. ఇరవై నిముషాల తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకొన్ని ఫిష్ ఫిల్లెట్ మీద నూనెను చిలకరించి ఓవెన్ గ్రిల్లింగ్ రాక్ మీద పెట్టాలి.

6. 60డిగ్రీల హీట్ పెట్టి 15-20నిముషాల పాటు ఫిఫ్ ను గ్రిల్(బేక్) చేయాలి. మద్య మద్యలో ఫిష్ ను అన్ని పక్కలకూ తిప్పుతూ బాగా కాలేలా చూసుకోవాలి. అంతే గిల్డ్ మసాలా ఫిస్ ఫిల్లెట్ తయారైన వెంటనే కొత్తిమీర తరుగుతో గార్నిష్ చేయాలి.

పది నిముషాల్లో హెల్తీ బ్రేక్ ఫాస్ట్ - ఫ్రూట్ వ్రాప్

గుడ్లు, సాండ్ విచ్ మరియు పోహ వంటి అతి సులభంగా, అతి త్వరగా తయారైయ్యే బ్రేక్ ఫాస్ట్ రిసిపీలన్నీ మనం ప్రయత్నించే ఉంటాం. అయితే వీటిలో ఏ బ్రేక్ ఫాస్ట్ ఆరోగ్యకరం. త్వరగా అయ్యే రిసిపి మాత్రమే కాదు ఆరోగ్యానికి, ఉపయోగపడే ఈ ఫ్రూట్ వ్యాప్ చాలా టేస్టీగా ఉంటుంది.

ఈ ఫ్రూట్ వ్రాప్ రిసిపి పది నిముషాల కంటే ఎక్కువ సమయం పట్టదు. మీరు చాలా అర్జెంట్ గా వెళ్ళాలి, అయితే బ్రేక్ ఫాస్ట్ మాత్రం మిస్ చేయకూడదు అనుకొనే వాళ్ళకి ఇది ఫర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అందుకు ఇంట్లో ఏవైతే ఉన్నాయో ఆ పండ్లను అన్నింటిని ఉపయోగించే హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తయారు చేసేయవచ్చు.

మరి మీరూ ప్రయత్నించండి. టేస్ట్ చూడండి...



easy fruit wrap breakfast 10 mins

కావలసిన పదార్థాలు:


రోటీ: 2
ఆపిల్: 1/2(చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
ద్రాక్ష: 5
దానిమ్మ(గింజలు): 2tbsp
పీయర్(బేరికాయ): 1/2 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
అరటి పండు: 1 (చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
మొయోనైజ్: 1tbsp
చాల్ మసాలా: 1/2tsp


తయారు చేయు విధానం:

1. చాలా మంది ఇళ్ళలో ముందు రోజు రాత్రి తయారు చేసిన చపాతీలు ఒకటో రెండో మిగిలే ఉంటాయి. వాటితో తయారు చేసుకోవచ్చు. బిజీ లైఫ్ లో ఆఫీసుల, స్కూల్స్, కాలేజ్ లు అని టైమ్ లేని వాళ్ళు బయట రెడీమేడ్ లో దొరికే చపాతీలను తీసుకొచ్చు స్టాక్ పెట్టుకోవచ్చు.

2. పైన ఇచ్చిన వస్తువుల్లో పండ్లు అన్నింటీని చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి.

3. కొన్ని గింజలున్న కాయలను పూర్తిగా కట్ తీసేయకండి గుప్పెడు అయితే సరిపోతాయి. కాబట్టి ఎంత అవసరమో అంతమాత్రం కాయనుండి గింజలను వేరు చేసి పెట్టుకోండి.

4. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకొన్న పండ్ల ముక్కలు, దానిమ్మ గింజలు, ఛాట్ మసాలా వేసి బాగా మిక్స్ చేయాలి.

5. ఇప్పుడు చపాతీలకు మొయోనైజ్ ను రాసి, దాని మీద కొంచె ఉప్పును చిలకరించాలి.

6. తర్వాత ఒక్కో చపాతీ మీద పండ్ల మిశ్రమాన్ని కావల్సినంత స్ప్రెడ్ చేయాలి.

7. ఈ ప్రూట్ చపాతీని రోల్ చేసి తినేయాలి అంతే సింపుల్ హెల్తీ బ్రేక్ ఫాస్ట్ రెడీ.

మీకు మంచి సువాస కావలనుకొంటే పుదీనా ఆకులను కట్ చేసి గార్నిష్ చేసుకోవచ్చు.

Thursday, December 20, 2012

గొంతు నొప్పి నివారణకు తక్షణ ఉపశమనం ఇచ్చే ఆహారాలు...!

శీతాకాలంలో ఆరోగ్యం గురించి సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలతో పాటు గొంతునొప్పి కూడా వస్తుంది. ఈ సీజన్‌లో చాలా మంది గొంతునొప్పితో బాధ పడుతుంటారు. గొంతులో ఇన్‌ఫెక్ష న్‌ కారక సూక్ష్మక్రిములు ఏర్పడటం వలన గొంతునొప్పి (త్రోట్‌ పెయిన్‌) మొదలవుతుంది. అలాగే చల్లటి పానీయాలు, చల్లటి తేమ గాలి సరి పడకపోవడం వల్ల, ఉపన్యాసాలు ఎక్కువగా ఇవ్వడం, విరామం లేకుండా పాటలు పాడటం వలన కొందరిలో గొంతునొప్పి వచ్చి వేధిస్తుంది.

 అయితే వీటిని నుండి అతి సులభంగా ఉపశమనం పొందాలంటే కొన్ని ఆహారాలను ప్రత్యేకంగా తీసుకోవాలి. ఆహారంతో గొంతునొప్పి మాయం అవుతుందా అంటే అవుననే చెప్పచ్చొ. మీ గొంతు అసౌకర్యంగా ఫీల్ అవుతున్నట్లు మీకు తెలియగానే కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం ప్రారంభించాలి. దాంతో గొంతు నొప్పి చెక్ పెట్టవచ్చు.

మనం సాధారణంగా ఇంట్లో వంటకు వినియోగించే కొన్ని వస్తువులు గొంతు నొప్పిని కూడా నివారిస్తాయి. ఉదాహరణకు టీ లిక్కర్ గొంతు నొప్పికి చాలా అద్భుతమైనటువంటిది. దీనికి కొంచెం అల్లం చేర్చితే చాలు. ఫలితం మెండుగా ఉంటుంది. అంతే కాదు గొంతు ఇన్ఫెక్షన్ కూడా నివారిస్తుంది. వేడి వేడి సూపులు.. మరికొన్నిఇతర ఆహారాలు కూడా గొంతు నొప్పిని చాలా సులభంగా తగ్గిస్తాయి. ఎక్కువగా గొంతు నొప్పితో బాధపడుతుంటే కనుక హాట్ చికెన్ సూప్ లేదా టమోటో సూప్ వంటివి చాలా అద్భుతంగా పనిచేసి గొంతునొప్పితో పాటు, ఇన్ఫెక్షన్ కూడా దూరం చేస్తుంది.గొంతు మరీ ఎక్కువగా ఇన్ఫెక్షన్ కు గురియైంటే కనుక అందుకు తేనె మరియు నిమ్మరసం కూడా మంచి ఔషధాలుగా పనిచేస్తాయి.

కొన్ని డైరీ ప్రొడక్ట్స్ కూడా కొంత వరకూ ఉపశమనాన్ని కలిగిస్తాయి. గడ్డ పెరుగు తినడం వల్ల గొంతులోపలి భాగానికి అంటుకొని కొంత వరకూ నొప్పిని తగ్గిస్తుంది. కొన్ని రకాల స్పైసీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల గొంతులో కష్టంగా.. కారంగా ఉన్నా కూడా జలుబు, దగ్గును, గొంతునొప్పికి నివారిణులగా బాగా పనిచేస్తాయి. ఉదాహరణకు మిరియాలను సూప్స్ లోనూ, టీ, కాఫీ లకు చేర్చి తాగడం వల్ల అద్భుతమైన ఫలితాలనిస్తుంది. మీ గొంతు నొప్పిని పోగట్టడానికి అలాంటి మరికొన్ని ఆహారాలు మీ కోసం...

గొంతునొప్పికి తక్షణ ఉపశమనాన్నిచ్చే ఆహారాలు..!





హాట్ చికెన్ సూప్: మీకు జలుబు ఎక్కువగా ఉందా అయితే మీ డాక్టర్ మీకిచ్చే ప్రిస్ర్కిప్షన్ లో ఈ హాట్ చికెన్ సూప్ ను కూడా చేర్చుకోండి. ఈ హాట్ చికెన్ సూప్ గొంతు నొప్పికి, గొంతు ఇన్ఫెక్షన్ కు చాలా బాగా పనిచేస్తుంది.



మసాలా ఛాయ్: టీ తయారు చేసే సమయంలో అందులో కొన్ని స్పైసీ(మసాలా)లను చేర్చి బాగా మరిగించి వేడి వేడిగా తాగాలి. మసాలాలు అంటే లవంగాలు, మిరియాలు, మరియు చెక్క గొంతు నొప్పిని, ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.




జింజర్ ఎలా(అల్లం రసం): గొంతు నొప్పిని పోగొట్టుటలో అద్భుతంగా పనిచేసే ఔషదం అల్లం రసం. అల్లంను నీళ్ళతో కానీ లేదా ఆల్కహాల్ తోకానీ మరిగించడం వల్ల ‘జింజర్ ఎలా' అనే ఓ చిక్కటి ద్రవం తయారవుతుంది. ఇది తగిన మోతాదులో తీసుకోవడం వల్ల గొంతు నొప్పిని క్షణాల్లో పోగొడుతుంది.




పెరుగు: సాధారణంగా పెరుగును చలువ పదార్థంగా భావిస్తుంటారు. అయితే ఇది నిజం కాదు పెరుగు కడుపును మాత్రమే చల్లబరుస్తుంది. ఈ పెరుగును గది టెంపరేచర్ లో తయారు చేసి తీసుకోవడం వల్ల గొంతు నొప్పికి ఓ మంచి ఔషదంగా పనిచేస్తుంది.

 

తేనె మరియు నిమ్మరసం: సిట్రస్ పండ్లలో యాంటీ వైరల్ గుణాలు కలిగి ఉంటాయి. అందువల్ల నిమ్మరసానికి కొంచెం తేనె చేర్చి గోరువెచ్చగా వేడి చేసి తాగాలి. దాంతో గొంతు నొప్పికి కొంత ఉపశమనం కలుగుతుంది.

 


సేజ్: సేజ్ అనేది మూలిక ఇందులో జలుబు, దగ్గు, గొంతునొప్పిని నివారించే గుణాలు మెండుగా ఉన్నాయి. ఈ మూలికను సూప్, సలాడ్స్, ఇతరపానీయాలతో కలిపి తీసుకోవచ్చు.




వెచ్చని ఓట్స్ మిశ్రమంతో పాటు బనానా: జలుబుగా ఉన్నప్పుడు ఓట్స్ ఉడికించి అందులో అరటిపండు వేసి బాగా మిక్స్ చేసి ఓ స్నాక్ లా తయారు చేసుకొని తింటే తప్పకుండా గొంతు స్వస్థపరుస్తుంది.




లికోరైస్ వేరు: ఈ వేరును బొటానికల్ గా గ్లిసిరిజా గ్లాబ్ర అని పిలుస్తారు. ఇందులో వ్యాధినిరోధక లక్షణాలు కలిగి ఉండటం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ నయం చేయడానికి బాగా సహాయపడుతుంది.




పెప్పర్(మిరియాలు): జలుబు చేసినప్పుడు కారంగా ఉండే నల్లని మిరియాలు తీసుకోవడం అంత అసౌకర్యంగా అనిపించకపోయినా.. ఇది ఖచ్చితంగా జలుబు, గొంతు నొప్పికి ఉత్తమ నివారిణిగా చెప్పవచ్చు.




ఆపిల్ సైడర్ వెనిగర్: గొంతు నొప్పికి ఉపయోగించే ఇంటి చిట్కాల్లో ఈ ఆపిల్ సైడర్ వెనిగర్ ను పురాతన కాలం నుండి ఉపయోగిస్తున్నారు. జలుబు, గొంతు నొప్పి ఉన్నప్పుడు ఈ ఆఫిల్ సైడర్ వెనిగర్ ను సలాడ్స్ మీద చల్లుకొని లేదా అలాగే నేరుగా ఒక చెంచా తీసుకోవడం వల్ల తప్పనిసరిగా ఉపశమనం పొందవచ్చు.

ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించాలనుకుంటున్నారా?

అధ్యయనాలు, పరిశోధనల ప్రకారం ఒక ఆరోగ్యకరమైన మనిషి రోజుకు 1500 మిల్లీగ్రాముల సోడియం చొప్పున వినియోగించాలి. దురదృష్టవశాత్తూ, చాలా మంది 3000 మిల్లీగ్రాముల కన్నా ఎక్కువ సోడియం వాడుతూ వుండడం వల్ల గుండె పోటు, స్ట్రోక్ లాంటి ఇతర రకాల గుండె జబ్బులు వస్తున్నాయి. కేవలం ఒక టీస్పూన్ ఉప్పులో సుమారు 2000 మిల్లీ గ్రాముల సోడియం వుంటుంది, అలాగే ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ లో దొరికే ఏ ఒక్క వస్తువులోనైనా తేలిగ్గా అంతే మోతాదు వుంటుంది.

దీర్ఘ కాలం ఎక్కువ సోడియం వాడడం రక్త పోటు, ఇతర బలహీన పరచే పరిస్థితులకు సంబంధించినది కావడం వల్ల సోడియం వాడకాన్ని నియంత్రణ లో ఉంచుకునే మార్గాలు వెతకడం ఆరోగ్యానికి మంచిది. సోడియం వాడకం మితిమీరి ఎక్కువైతే అది వెంటనే కొన్ని వైద్య లక్షణాలు చూపిస్తుంది - పగిలిన, రక్తమోడుతున్న పెదాలు, కడుపులో తిప్పడం లాంటివే కాక, కొన్ని తీవ్ర సందర్భాల్లో మరణాన్ని కూడా కలిగిస్తుంది. మీరు మీ ఆహారంలో ఉప్పు మోతాదు తగ్గించాలనుకున్నా లేక తొలగించాలనుకున్నా, మీ ప్రయత్నంలో ఉపయోగపడేందుకు ఇదిగో ఈ క్రింది సూత్రాలు పాటించండి.


చర్యలు:

1. మీ ఆహారాన్ని సహజ స్థితిలో లేదా ఉడికించిన స్థితి లో రుచి చూడడానికి అలవాటు పడ౦డి. మీ ఆహారాన్ని ఎప్పుడూ ఉప్పు కలపక ముందు రుచి చూడ౦డి. మీరు అలవాటు చొప్పున ఉప్పు వేసుకునే వారైతే, ఉప్పు కన్నా ముందు ఫోర్క్ తీసుకుని - ఉప్పు లేని ఆహారం రుచిని ఆస్వాదించడం మళ్ళీ నేర్చుకోండి. మొదట్లో చప్పగా వున్నట్టు అనిపించినా, ఆ భావన త్వరలోనే పోయి ఉప్పు ఆహార పదార్ధాల అసలు రుచిని ఎలా మరుగు పరుస్తుందో తెలుసుకుంటారు. మార్పు రావడానికి కొద్ది సమయం ఓపిక పట్టండి - ఓ రెండు మూడు నెలలకు గానీ మీ ఇంద్రియాలు ఉప్పు కోసం వెంపర్లాడడం మానవు.

2. ఆహార పదార్ధాల పై లేబుళ్ళు చదవండి, వెబ్ సైట్ లు చూసి మీరు రోజూ తినే ఆహారంలో సోడియం పరిమాణం ఎంత ఉందొ తెలుసుకోండి. మీరు తినే ఆహారంలో సోడియం పరిమాణం ఎంత వుందో తెలుసుకు౦టు౦టే ఉప్పు వాడకం తగ్గించాలని మీరు త్వరగా సమాధానపడతారు. వెచ్చాలు కొనేటప్పుడు సోడియం పరిమాణం ఎంత వుందో తెలుసుకోవడానికి లేబుళ్ళు చదవడం అలవాటు చేసుకోండి.


how follow low sodium diet

ఇంట్లో వండుకుని తినడం:

1. ఇంట్లో వంట చేసేటప్పుడు కూడా ఉప్పు వాడకం తగ్గించండి. అత్యవసరమైతే తప్ప ఉప్పు వేయడం మానేయండి. వంటకాల్లో సూచించిన దాంట్లో సగం ఉప్పే వేయండి, ఇంకా అలా సగం చేసుకుంటూ వెళ్ళండి. కుదిరితే, వంట చివర గానీ లేదా తినబోయే ముందు కానీ ఉప్పు వేయండి. ఇలా చేస్తే, ఉప్పుకి వంటకం లో కలవడానికి ఎక్కువ సమయం ఉండదు కాబట్టి కొంచెమే సరిపోతుంది.

2. తాలింపు కోసం వాడే వాటిలో సోడియం ఎంతుందో చూడండి. పంది మాంసపు ముక్కలు, రొమనో వెన్న, కొన్ని ఎంపిక చేసిన తాలింపు సామాను లాంటి చాలా పదార్ధాలు ఎక్కువగా ఉప్పుతో కూడి వుంటాయి కనుక సాధ్యమైనంత వరకు వాటిని వదిలేయండి
(కెచప్, ఆవ పెట్టిన ఊరగాయ బదులు బర్గర్ మీద పాలకూర, ఉల్లి, టమాటో వాడండి). ప్రత్యేకమైన తాలింపు పాకెట్ వుండే వాటికి - ఆ పాకెట్ లో తక్కువ పరిమాణం వాడండి లేదా పూర్తిగా తగ్గించండి. ఐతే, కొద్దిగానే అయినా ఈ రుచులు, తాలింపు ఉప్పు కలపడమే నేరుగా ఉప్పు కలపడం కన్నా మంచిది.

3. ఉప్పు బదులు ఉప్పు లేని తాలింపు వాడండి. ఉప్పు నుంచి దూరంగా ఉండడానికి అనేక ఇతర ప్రత్యామ్నాయాల శ్రేణి వుంది. వాటిలో మూలికలు, సుగంధ ద్రవ్యాలు, నిమ్మకాయ, వెల్లుల్లి, తాజా కూరగాయలు, మాంసం, కూరల ఉప్పు ఒరేగానో, నిమ్మ రసం, మిరియప్పొడి, మిరపగుండ, కారపు సాస్ లేదా సాల్సా కూడా కొద్దిగా రుచిని జోడిస్తాయి.

4. ప్రాసెస్ చేసిన ఆహారాలు మానివేయండి. తాజాగా తయారైనవి, మాంసం, మంచినీటి చేప లాంటివి ఉప్పు లేకుండా వుంటాయి లేదా కొద్ది పాటి సోడియం ను కలిగి వుంటాయి, కాగా సూప్ లు, శీతలీకరించిన ఆహారం, ప్రాసెస్ చేసినవి, రెస్టారెంట్ లో తయారయ్యేవి సాధారణంగా సోడియం అధికంగా కలిగి వుంటాయి. మీకు తాజా కూరగాయలు అందుబాటులో లేకపోతే సోడియం అధికంగా వుండే కూరగాయల కన్నా సోడియం లేని, లేదా తక్కువగా వుండే డబ్బాల్లో వున్న కూరగాయలు వాడడం మంచిది. అందుకే సోడియం పరిమాణం ఎంతుందో తెలుసుకోవడానికి లేబుళ్ళు చదవడం అలవాటు చేసుకోండి.

5. ఆహార పదార్ధాల మీద నుంచి సోడియం తొలగించండి. ఉప్పు కలిసిన వాటి కన్నా పైన ఉప్పు చల్లిన పదార్ధాలు ఎంచుకోండి. ఉదాహరణకు సాల్టైన్ లు కొనేటప్పుడు ‘సాల్ట్ కలపని పైముక్కల' కొనుగోలు మానేయండి ఎందుకంటే వాటి పైన కాకుండా ఉప్పు లోపల కలిసిపోయి వుంటుంది - అందువల్ల దాన్ని తొలగించడం కుదరదు. "ఉప్పు పైన' వుండే ఉత్పత్తులు కొద్ది సోడియం పరిమాణానికి ఎక్కువ రుచిని అందిస్తాయి, కనుక ఆ కోణంలో చూసినా అవే మంచివి.

6. టేబుల్ దగ్గర కూర్చున్నపుడు మీ ఉప్పు వాడే అలవాట్లు మార్చుకోండి. సాల్ట్ షేకర్ ముట్టుకోకండి. తగ్గించేటప్పుడు కూడా మొత్తం ఒంపుకోకుండా ఒక్కసారి షేక్ చేయండి - ఇక నెమ్మదిగా ఈ అలవాటుకి దూరం జరగండి. మసాలా దినుసులతో జాగ్రత్త - సాస్ లు ఇతర టాపింగ్స్ లో ఎక్కువ పరిమాణం లో ఉప్పు ఉంటుంది.

7. ఆహారాల్లో వున్న సోడియంను తగ్గించండి. మీరు ఎక్కువ సోడియం వున్న సూప్ ల లాంటి పదార్ధాలు కొంటే దాన్ని పల్చగా తయారు చేయడం వల్ల సోడియం స్థాయి తగ్గుతుంది. ఉదాహరణకు, మీరు లేబుల్ మీద సూచించినట్టుగా సూప్ తయారు చేస్తే, దాంట్లో సోడియం పరిమాణం ఎక్కువగా వుంటుంది. దాని బదులు మీరు క్యాన్ చేసిన సూప్ ను తీసుకుని బంగాళా దుంపలు, ఆకుకూరలు, ఉల్లిపాయలు, కారెట్లు లాంటి తాజా కూరగాయలు కలపండి. అలా కాకుండా దాన్ని నేరుగా వడ్డి౦చడం వల్ల తినే ప్రతివారికీ ఎక్కువ పరిమాణంలో సోడియం అందుతుంది.

8. ఇంట్లో తినండి. వేరే వాళ్ళ ఇళ్ళలోనో, రెస్టారెంట్లలోనో తింటే ఇతరులు తయారు చేసిన పదార్ధాలలో సోడియం పరిమాణం నియంత్రించడం మనకు సాధ్యం కాకపోవచ్చు. ఇంట్లో తింటున్నాం అంటే మీ ఆహారంలో సోడియం పరిమాణం ఎంత వుందో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది.

క్రిస్మస్ పుడ్డింగ్ - క్రిస్మస్ స్పెషల్

క్రిస్మస్ క్రైస్తవులకు చాలా ముఖ్యమైన పండుగ. ఈ పండుగను భారత దేశంలోనే కాక ప్రపంచంలోని అన్ని దేశాలలోను జరుపుకుంటారు. ఇది యేసుక్రీస్తు పుట్టిన రోజు పండుగ.

ప్రతి సంవత్సరం డిసెంబరు 25వ తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.ఈ క్రిస్మస్ కు ప్రత్యేకంగా కేకులు తయారు చేస్తారు. ప్రత్యేకంగా తయారు చేసే క్రిస్మస్ పుడ్డింగ్ క్రిస్మస్ రోజున రాత్రి డిన్నర్ కు సర్వ్ చేస్తారు. దీన్ని ప్లమ్ పుడ్డింగ్ అని కూడా అంటారు. ఈ పుడ్డింగ్ కు డ్రై ఫ్రూట్స్ చేర్చడం వల్ల ప్రత్యేకమైన రుచి రంగు కలిగి నోరూరిస్తుంటుంది.

మరి క్రిస్మస్ పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో చూద్దాం...

కావలసిన పదార్థాలు:

పాలు: 1ltr
పంచదార: సరిపడినంత
ఆరెంజ్ తొనలు: 12-14(గింజలు తీసినవి)
యాపిల్‌: 1(పై పొట్టు, గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా తరిగాలి)
ఆపిల్: 1 (తోలుతో సహా లావుపాటి ముక్కలుగా తరిగినవి)
కిస్‌మిస్‌లు, బాదం, జీడిపప్పు, పలుకులు: 1cup
బ్రెడ్‌ స్లైస్: 4-6
బేస్‌ తయారీకిచిన్నచిన్న ముక్కలుగా చిదిమిన బిస్కెట్‌లు : 2cups
వెన్న: 3tbsp

Christmas Pudding

తయారు చేయు విధానం:

1. ముందుగా బేస్‌ తయారీకి: బిస్కట్‌ ముక్కలకి వెన్నని బాగా పట్టించి ఈ మిశ్రమాన్ని బేకింగ్‌ డిష్‌ అడుగుభాగంలో సర్ది కదలకుండా ఉండేలా చేతులతో ఒత్తండి.

2. ఈ గిన్నెని గంటపాటు ఫ్రిజ్‌ లో ఉంచండి. ఆలోపు ఫుడ్డింగ్‌ ని తయారుచేసుకోండి. తాజా బ్రెడ్‌ ముక్కలని చిన్నచిన్న ముక్కలుగా తుంచి పెట్టుకోండి.

3. తర్వాత మందపాటి గిన్నెలో పాలుపోసి సగమయ్యేదాకా సన్నని సెగమీద మరిగించండి. దించి పంచదార, బ్రెడ్‌ముక్కలు వేసి కలిపి చల్లారనివ్వండి.

4. తరువాత కోసి ఉంచుకున్న ఆపిల్‌ ముక్కలు, డ్రైఫ్రూట్స్‌ వేసి కలిపి బేస్‌ తయారుచేసి ఉంచుకున్న గిన్నెలో పోయండి. గిన్నెను కుక్కర్‌లో పెట్టి పది పన్నెండు నిమిషాలు సన్నని సెగమీద ఉడికించండి. అప్పటికి సగం ఉడుకుతుంది.

5. దానిమీద చుట్టూ గుండ్రంగా ఆపిల్‌ముక్కలు సర్ది మళ్లీ పన్నెండు నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. తరువాత దించి మూత తీసి చల్లారనివ్వాలి. దీనిని కనీసం రెండుమూడు గంటల ఫ్రిజ్‌ లో ఉంచి తింటే చాలా బాగుంటుంది.

బటర్‌ స్కాచ్ కేక్- క్రిస్మస్ స్పెషల్

ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం క్రిస్మస్ వచ్చేసింది. మరి కొద్దిరోజూల్లో ప్రపంచమంతటా క్రిస్మస్ సంబరాలు అంబరాన్ని అంటుతాయి. క్రిస్మస్ అంటే ముందుగా ట్రీ గుర్తుకువస్తుంది. పిల్లలకయితే క్రిస్‌మస్ తాత గుర్తుకువస్తాడు. ఇంకా ఏం గుర్తుకువస్తాయి అని అడిగితే...ప్రశ్న పూర్తవకుండానే జవాబు వచ్చేస్తుంది. నోరూరించే కేకులని.

ఒకటి రెండూ కాదు ఆ సమయంలో బోలెడు రకాల కేకులు కెవ్వుమని కేక వేస్తాయి. పిల్లలు, పెద్దలు తేడా లేకుండా చాకులతో రెడీ అయిపోతారు. క్రిస్‌మస్‌ని కేకుతో ఆహ్వానిస్తారు. తియ్యగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈసారి ఏ రకం కేకు చేయాలా? అని ఆలోచిస్తున్నవారికి ఈ వెరైటీ కేకు అంధిస్తున్నా తయారు చేసి ఆనందించండి.






.కావలసిన పదార్థాలు:

మైదాపిండి: 100grms
వెన్న: 100grms
పంచదార పొడి: 100grms
కోడిగుడ్లు: 2-3
బేకింగ్ పౌడర్: 1tsp
వంట సోడా: 1/2tsp
పాలపొడి: 2tbsp
బటర్‌స్కాచ్ ఎసెన్స్: 1tsp
లెమన్ ఎల్లో ఫుడ్ కలర్: తగినంత
ఐసింగ్ కోసం: వెన్న: 100grms
ఐసింగ్ షుగర్: 200
గ్రాలెమన్ ఎల్లో కలర్: కొన్ని చుక్కలు
బటర్‌స్కాచ్ కాండీస్: అర కప్పు
వేడినీరు:కొద్దిగా

Butterscotch Cake Christmas Special

తయారు చేయు విధానం:
1. ముందుగా ఒక పాత్రలో కొంత మైదాపిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పాలపొడి, వెన్న, పంచదార వేసి కలపాలి.

2. తర్వాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గిలకొట్టాలి. దీనికి కోడిగుడ్ల సొన, బటర్‌స్కాచ్ ఎసెన్స్, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ చేర్చి మళ్లీ ఒకసారి మిక్సీలో గిలకొట్టాలి. మరీ పలచగా అనిపిస్తే మైదాపిండిని కొద్దికొద్దిగా చేర్చుతూ మళ్లీ మిక్సీలో గిలకొట్టాలి.

3. తరువాత ఎలక్ట్రిక్ ఓవెన్‌లోని గిన్నెలో కొద్దిగా డాల్డా రాసి, ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 40:50 నిమిషాలు బేక్ చేయాలి. బేకింగ్ పూర్తయి చల్లారాక కేక్‌పైన ఐసింగ్ చేయాలి.

4. ఐసింగ్ ఇలా: వెన్న, ఐసింగ్ షుగర్‌లను ఒక పాత్రలో వేసి నురుగు వచ్చేంత వరకు గిలకొట్టాలి. దీనికి ఎసెన్స్, ఫుడ్ కలర్, కొద్దిగా వేడినీరు చేర్చి మళ్లీ గిలకొట్టాలి. ఈ మిశ్రమాన్ని కేక్‌పైన పల్చగా పోసి బటర్ నైఫ్ సహాయంతో కేక్ అంతటా సమంగా సర్దాలి. ఆపైన బటర్‌స్కాచ్ క్యాండీస్‌తో అలంకరించాలి.

చికెన్ చిల్లీ టోస్ట్ - ఫర్ఫెక్ట్ బ్రేక్ ఫాస్ట్ రిసిపి

సాధారణంగా ప్లేయిన్ టోస్ట్ బట్టర్, లేదా జామ్ వంటి కాంబినేషన్ లో బయట తింటుంటాం. అలాగే ఇంట్లో కూడా తయారు చేసి తింటుంటాం. అయితే ప్లెయిన్ టోస్ట్ తిని, తిని బోర్ గా అనిపిస్తుంటే మాత్రం బ్రేక్ ఫాస్ట్ రిసిపీగా ఈ వెరైటీ చికెన్ చీజ్ చిల్లీ టోస్ట్ ను తయారు చేసుకోవచ్చు.

మీరు ఎప్పుడైనా చికెన్ టోస్ట్ ను ప్రయాత్నించారా?ఇది ఖరీదైనా అల్పాహార వంటకం కాదు. ఎందుకంటే చికెన్ గ్రేవి, కర్రీ, ఫ్రై వంటివి ఇంట్లో తయారు చేసి తినగా ఎంతో కొంత మిగిలి ఉంటుంది. దాన్నే ఇలా తయారు చేసుకోవచ్చు. ఉదయం తయారు చేసుకోవడం వల్ల బ్రేక్ ఫాస్ట్ పూర్తి అవుతుంది. చికెన్ కాలీ అవుతుంది.

ఈ బ్రేక్ ఫాస్ట్ రిసిపి పనిచేసే, జాబ్స్ కు వెళ్లే వారికి అతి త్వరగా బ్రేక్ ఫాస్ట్ రిసిపిని తయారు చేసుకోవచ్చు. ఎక్కువ సమయం పట్టదు. 15నిముషాల్లో తయారు చేసుకోవచ్చు. అందుకు చికెన్, దానికి కావల్సిన మసాలాలు, చీజ్ తురుము ఉంటే చాలు. వీటన్నింటినీ బేస్ గా పరిచి బేక్ చేస్తే చికెన్ చీజ్ చిల్లీ టోస్ట్ రెడీ. మరి మీరూ తయారు చేసి చూడండి.

బ్రెడ్ స్లైస్: 4
బట్టర్(వెన్న): 1tbsp
చికెన్(తినగా మిగిలిన చికెన్): 100grams(shredded)
పచ్చిమిర్చి: 4(తరిగి పెట్టుకోవాలి)
వెల్లుల్లి రెబ్బలు: 4(చితగొట్టుకోవాలి)
ఓరిగానో(ఇంగువ వేరు): 1tsp
చీజ్: 2cubes(తురుముకోవాలి)
టమోటో: 1(కట్ చేసుకోవాలి)
ఉప్పు: రుచికి సరిపడా

chicken cheese chilli toast

తయారు చేయు విధానం:
1. ముందుగా ఓవెన్ ను 300డిగ్రీ వరకూ ప్రీ హీట్ చేయాలి.
2. తర్వాత బ్రెడ్ స్లైసులకు బట్టర్ ను రాయాలి. ఆ బట్టర్ మీద లేయర్ గా చితగొట్టిపెట్టుకొన్న వెల్లుల్లి సర్ధాలి.
3. ఇప్పుడు వండి తినగా మిగిలిన చికెన్ ను చిన్న చిన్న ముక్కలుగా చేసి బ్రెడ్ మీద పరవాల. దాని మీద పచ్చిమిర్చి తురుము, ఉప్పు, ఓరిగానో ఇలా ఇకదాని తర్వాత ఒకటి చల్లుకోవాలి.
4. ఇప్పుడు చివరగా చీజ్ తురుము ను కూడా చల్లుకొని బేకింగ్ డిష్ లో పెట్టాలి.
5. ఇప్పుడు బ్రెడ్ ను 10 నిముషాల పాటు అరవై శాతం పవర్ లో వేడి చేయాలి. అంతే టమోటో స్లైస్ ను గార్నిష్ చేయాలి. అంతే చికెన్ చీజ్ చిల్లీ టోస్ట్ రెడీ.

దీన్ని వేడి టీ, కాఫీ లేదా బెవరేజస్ తో(థమ్సప్, కోక్,)వంటి వాటితో సర్వ్ చేయాలి.

పులావ్ స్పెషల్ సైడ్ డిష్- పొటాటో గ్రీన్ ఖుర్మా

పొటాటో కుర్మా ట్రెడిషినల్ రిసిపి. పులావ్, నాన్, చపాతీలోని అద్భుతంగా సూట్ అయ్యే ఈ గ్రీన్ కుర్మా తయారు చేయడం చాలా సులభంగా. గ్రీన్ కలర్, ఫ్లేవర్ కోసం కొత్తిమీర, పుదీనాను కొంచెం ఎక్కువగా ఉపయోగించాల్సి ఉంటుంది.
మసాలా కొబ్బరి పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేర్చడంతో మరింత అద్భుతమైన టేస్ట్ వస్తుంది.సాధారణంగా ఇంట్లో పొటాటోతో రకరకాల వంటలను వండుతుంటారు.
మిక్స్డ్ వెజిటేబుల్ కుర్మాలా అద్భుతమైన రుచిని అంధించే ఈ పొటాటో కుర్మాను మీరూ తయారు చేసి రుచి చూడండి...

కావల్సిన పదార్థాలు:
బంగాళదుంపలు: 4
ఉల్లిపాయ: 2
కొబ్బరి పొడి: 3tsp
పెరుగు: 1/2cup
కొత్తిమీర: 1
కట్టపుదీనా: 1కట్ట
పచ్చిమిర్చి: 4-6
గరం మసాలా పొడి: 1/2tsp
పసుపు: 1/2tsp
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1/2tsp
నూనె: సరిపడా
ఉప్పు: రుచికి సరిపడా

pulao special side dish potato green kurma

తయారు చేయు విధానం:
1. ముందుగా పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, పెరుగు, కొబ్బరి పొడి.. వీటిని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
2. తర్వాత బంగాళదంపలను చెక్కుతీసి ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3. ఇప్పుడు వెడల్పాటి పాన్ లో నూనె వేడి చేసి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడేవరకూ వేయించాలి.
4. ఇందులోనే పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మరో రెండు నిముషాలు వేయించి బంగాళదుంప ముక్కలు వేసి ఐదు నిముషాలు చిన్న మంటపై వేయించాలి.
5. తర్వాత అందలోనే గ్రైండ్ చేసి పెట్టుకొన్న మసాలా ముద్ద, తగినంత ఉప్పు, అరకప్పుడు నీళ్ళు పోసి కలిపి మూత పెట్టాలి. కూర ఉడికి నూనె తేలినప్పుడు గరం మసాలా పొడి కలిపి దింపేయాలి. ఈ ఖుర్మా పులావ్, నాన్, చపాతీలలోనికి చాలా బావుంటుంది.

గర్భాధారణ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు..!

గర్భం ధరించిన తర్వాత గర్భిణీలు ఏంతో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఈ సమయంలో జనన పూర్వక రక్షణ కీలక పాత్ర పోషిస్తుంది. దీనినే ప్రినాటల్ కేర్ అని అంటారు. తల్లి మరియు పుట్టబోయే బిడ్డకి అందించే ఆరోగ్య సంరక్షణ, విజ్ఞానం, ఆరోగ్య పరమైన మరియు మానసిక పరమైన సలహాలు, వనరులు మొదలైనవి జనన పూర్వక రక్షణలో ని ముఖ్యమైనవి.

గర్భం దాల్చిన విషయం తెలిసిన వెంటనే తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వైద్యున్ని వెంటనే సంప్రదించాలి.

ప్రాముఖ్యత:
గర్భధారణ ప్రారంభదశలోనే ప్రీనాటల్ కేర్ తీసుకోవడం వల్లన గర్భదారణకి సంబంధించిన సమస్యలని గుర్తించి, వాటిని పరిష్కరించే అవకాసం ఉంటుంది.

జననపూర్వక రక్షణ విధి:
తల్లి మరియు బిడ్డ యొక్క ఆరోగ్యం, బిడ్డ ఎదుగుదల, ఆహారనియమావళి వంటివి పర్యవేక్షించడమే జనన పూర్వక రక్షణ ఒక్క ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా కొన్నివిటమిన్స్ ని తీసుకోవడం ద్వారా తల్లి మరియు పుట్టబోయే బిడ్డ సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంటారు.
పుట్టుకతో వచ్చే వెన్నెముక మరియు మెదడుకి సంబంధించిన లోపాలని నిరోధించడానికి ప్రతి రోజు 400మిల్లీగ్రామ్స్ ఫోలిక్ ఆసిడ్ తీసుకోవాలి.
గర్భదారణ సమయంలో కొన్ని ఔషదాలు వాడకూడదు. మీ వైద్యుని ద్వారా వాటి గురించి తెలుసుకుని పుట్టబోయే బిడ్డకి హాని కలగకుండా జాగ్రత్తపడండి.
ఎక్స్ రేస్ వంటివి హాని కలిగించవచ్చు. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండండి. తల్లి తన శరీర బరువుని అదుపులో ఉంచుకోవాలి.
తగిన వ్యాయామం తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షకుల ద్వారా మీరు ఈ విషయాలు తెలుసుకోవచ్చు.

what is prenatal care

వైద్యుని పర్యవేక్షణ :
గర్భం దాల్చిన విషయం తెలిసినప్పటి నుంచి మీ వైద్యున్ని సంప్రదించి ఒక షెడ్యూల్ తెలుసుకోండి. నిపుణులు సూచించిన ప్రకారం నాలుగు వారాల నుండి 28 వారాల వరకు నెలకొక సారి వైద్యున్ని సంప్రదించాలి.
28 వారాల నుండి 36 వారాల వరకు నెలలో రెండు సార్లు మీ వైద్యున్ని సంప్రదించాలి.
35 సంవత్సరములు దాటిన మహిళలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు లేదా మరేవైన దీర్గ కాలిక సమస్యలతో బాధపడే వారు వైద్యున్ని మరింత తరచుగా సంప్రదించవలసి రావచ్చు.


జాగ్రత్తలు :
గర్భం దరించాక జాగ్రత్తలు తీసుకోవడాన్ని ప్రినాటల్ కేర్ అని అంటారు. అదే గర్భ దారణ కోసం ప్రయత్నిస్తున్న వారు తీసుకోబోయే జాగ్రత్తలని ప్రికన్సెప్షన్ జాగ్రత్తలుగా వ్యవహరిస్తారు. ప్రస్తుత ధోరణి గర్భదారణకి ప్రయత్నించేవారు కూడా తీసుకోవలసిన జాగ్రత్తలని తెలుసుకుని పాటిస్తున్నారు. గర్భదారణకి మూడు నెలల ముందు నుండే ఫోలిక్ ఆసిడ్ తీసుకోవడం, రోగనిరోధక శక్తి వాక్సిన్స్ ని తీసుకోవడం వంటివి ప్రికన్సేప్షన్ జాగ్రత్తలలోకి వస్తాయి. మీరు తగినంత వ్యాయామం చేస్తూ ఆరోగ్య కరమైన ఆహారాన్ని తినాలి. ఇంకా, మద్యపానం, ధూమపానం వంటి వాటికి దూరంగా ఉండాలి.

జననపూర్వక రక్షణ ప్రభావాలు:
తొలిదశలో నే గర్భాదారణకి సంబందించిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు, పుట్టబోయే మీ బిడ్డ క్షేమంగా ఉంటారు. గర్బదారణకి సంబందించిన ప్రమాదాలని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి జనన పూర్వక రక్షణ చాలా ఉపయోగపడుతుంది. పుట్టబోయే బిడ్డ రాకకి సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు తీసుకోవడంలో జనన పూర్వక రక్షణ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు.

ఇవన్ని పాటించడం ద్వారా ఆరోగ్యమైన మరియు ఆనందకరమైన తల్లి ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనిచ్చే అవకాశాలు మెండుగా ఉంటాయి.

మీ పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం ఎలా ?

ప్రస్తుత పోటీ ప్రపంచంలో పిల్లలు తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనలకి గురై ఆత్మవిశ్వాస లోపానికి గురవుతున్నారు. ఇలాంటి పోటి మరియు ప్రమాదకరమైన ప్రపంచంలో మసలడానికి పిల్లల్లో ఆత్మ విశ్వాసాన్ని పెంచే బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. చదువు సంధ్యలలో పిల్లలకి సహకరిస్తూనే ఆట పాటలలో కూడా పిల్లలని పాల్గొనేలా ప్రోత్సహించాలి. వాటిలో ని గెలుపు సాధించేందుకు తగిన ఆత్మవిశ్వాసాన్ని పిల్లల్లో పెంచాలి. తమ మిద తమకి నమ్మకం, ఆందోళనలని అధిగమించడం వంటివి తెలుసుకుంటే పిల్లలు తమ భవితని చక్కగా తిర్చిదిద్దుకోగలరు. జీవితం పట్ల వారిలో ఉండే భయాలు, అపనమ్మకాలు వంటివి తొలగి పోవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకొని బంగారు భవిష్యత్తుని రుపుదిద్దుకోగలరు. ఇవన్నీ తల్లిదండ్రుల సహకారం వల్లే సాధ్యపడతాయి.


how make your child confident

ఆత్మవిశ్వాస నిర్మాణం.



1.సమాజంలో మీకున్న ఇమేజ్ ని, మీలో ఉండే ఆత్మవిశ్వాసాన్ని, నిర్ణయాత్మక ఆలోచనలని, సమాజం పట్ల మీ బాధ్యతని పిల్లలకి తగిన సందర్భాలలో ప్రదర్శించడం ద్వారా వివరించండి. మీ పిల్లల ముందు మిమ్మల్ని ఎప్పుడూ తక్కువ చేసుకోకండి. నిశ్చితంగా ఆత్మవిశ్వాసంతో గౌరవ పరమైన పద్దతిలో సంఘర్షణలని పరిష్కరించడం ద్వారా పిల్లలకి సమస్యలనుండి పారిపోవడం తప్పించుకు తిరగడం వంటివి పరిష్కారాలు కాదని తెలియచేయండి.

2. మీ పిల్లల మంచి ప్రవర్తన పట్ల మీ సంతృప్తిని వారికి తెలియచేయండి. మీ పిల్లల యొక్క సామర్ధ్యాలని, ప్రతిభని మెచ్చుకునే కంటే వారు ఆ ప్రతిభని సామర్ధ్యాన్ని సంపాదించేందుకు పడిన కష్టాన్ని గురించి పొగడండి. "నువ్వు చాలా తెలివిగలవాడివి" అనడానికి బదులు "నువ్వు మంచి మార్కులు సంపాదించుకోవడానికి చేసే ప్రయత్నం వల్ల నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను" అని చెప్పండి. పిల్లల ప్రయత్నాలని ప్రోత్సహించడం ద్వారా ఆత్మవిశ్వాసాన్ని వారిలో కలుగచేయండి.

3. మీ పిల్లలు చేసే మంచి ప్రయత్నాల లో ఉండే గొప్పతనం చూపెట్టడానికి ప్రతి అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. మీ పిల్లలు గెలుచుకున్న బహుమతులని ఇంట్లో ప్రదర్శనకి పెట్టడం ద్వారా వారి ప్రయత్నానికి విలువ ఇస్తున్నట్టు తెలియచేయండి. మీ పిల్లల అభివృద్దిని గుర్తించే స్నేహితులతో, బంధువులతో మీ పిల్లలు సాధించిన విజయాల్ని పంచుకోండి. వారు గెలిచిన ప్రతి సందర్భాన్ని ఒక పుస్తకంలో వివరాలతో సహా పొందుపరచడం ద్వారా వారికి మీరు ఈ పుస్తకాన్నికొంత కాలం తర్వాత చూపెట్టి సంతోషపెట్టవచ్చు.

4. చింతని తగ్గించండి. మీ పిల్లలు చెప్పే సమస్యలు వినండి. వారు చెప్పే సమస్యలని చిన్న సమస్యలుగా కొట్టిపారేయకండి. తల్లిదండ్రులు తమ సమస్యలని వింటున్నారు అనే భావన వారికి కలుగచేయండి. మీకు వారి సమస్యలని చెప్పుకునే స్వేచ్చ వైపు ప్రోత్సహించండి.

5. వారి సమస్యలకి పరిష్కారాలని చూపడం ద్వారా వారి బాధను తగ్గించండి. గ్రేడ్స్, స్నేహితులు, బాడీ ఇమేజ్ వంటి వాటిలో సలహాలు ఇవ్వండి. మీ పిల్లలతోని చర్చించడం ద్వారా వారి పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రయత్నించండి. యుద్ధం, కరవు వంటి ప్రపంచ సమస్యల గురించి మీ పిల్లలు బాధపడుతూ ఉంటే వారితో చర్చించి మీ పిల్లల మీద వాటి ప్రభావం తెలుసుకోండి. వారికి జరుగుతున్న వాస్తవాలని తెలియచేయండి.

6. మీ పిల్లల భవిష్యత్తు ని బంగారు భవిష్యత్తు చేసే దిశానిర్దేశకులు మీరే. మీ సమస్యలని మీ పిల్లలపై రుద్దకండి. వారికి అనవసరపు ఆందోళనలు అత్రుతలు కలిగించకండి. భయం, అనుమానం వంటి భావాలను మీ పిల్లల ముందు వ్యక్తపరచకండి. ధైర్యం, సానుకూల దృక్పధం వంటివి వ్యక్తపరచడం ద్వారా చింత లేని జీవితం పొందవచ్చునని వారికి తెలియచేసీలా మసలుకోండి.

నిమ్మరసంతో బ్లాక్ హెడ్స్ మటు మాయం చేయండిలా..!?

మామూలుగా ఏ స్త్రీ లేదా పురుషుని అందాన్ని గురించి మాట్లాడేటప్పుడు ముఖాన్ని గురించి ముందుగా ప్రస్తావిస్తారు. ముఖమే ఎవరి అందానికైనా కొలబద్దగా ఉంటుంది. అందమైన ముఖానికి చక్కటి ముక్కు ఒక ఆకర్షణగా నిలుస్తుంది. కాని ఈ అందమైన నాసికా సౌందర్యాన్ని తగ్గిస్తాయి బ్లాక్ హెడ్స్. మిగిలిన వారిలో కూడా ఇది కనిపించినా, ప్రధానంగా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. వీటివల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకపోయినా ఇవి చికాకును తెప్పిస్తాయి. ఎంతో అందమైన ముఖం వున్నా వీటి వల్ల ఇబ్బందిగానే ఉంటుంది.

ముఖ్యంగా ఇవి ఒకసారి తీసేసినా పడే పడే వస్తూ ఉంటాయి. దీని వల్ల మానసికంగా కొంచెం దిగులు ఏర్పడుతుంది. పడే పడే అద్దంలో వీటిని చూసుకుంటూ ఉండటం కంటే తీసివేసే మార్గాన్ని చూడటం ఉత్తమం. వీటి నివారణోపాయం ఏమిటంటే బ్యూటీషియన్ దగ్గరకు వెళ్ళి వాటిని తగిన విధంగా తీసి వేయించుకుంటూ ఉండటం. ఇప్పుడు బ్లాక్ హెడ్స్ తీసివేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఇంట్లోనే బ్లాక్ హెడ్స్ కు చెక్ పెట్టవచ్చు.. దీనికి మంచి నివరాణోపాయం నిమ్మకాయ. ఒక్క వేసవిలోనే కాదు అన్ని కాలాల్లోనూ అరుదుగా దొరికుతుంది. దీని వల్ల బహు ప్రయోజనాలు ఉన్నాయి. పోషక విలువలు, ఔషధ విలువలు నిమ్మలో పుష్కలం. నిమ్మ ‘రసం'లోనే కాదు దాని తొక్కలోనూ, తొక్కనుంచి వచ్చే తైలంలోనూ ఔషధ గుణాలున్నాయి.

ముఖ్యంగా నిమ్మకాయలో విటమిన్ ‘సి' ఎక్కువగా ఉంటుంది. అందుకే ప్రతి రోజూ నిమ్మరసాన్ని ఏదో ఒకరంగా తీసుకోవడం చాలా మంచిది. ముఖ్యంగా ముఖంపై బ్లాక్‌హెడ్స్‌, వైడ్‌హెడ్స్‌తో చర్మరంధ్రాలు మూసుకుపోయినా, మొటిమల నివారణకైనా నిమ్మరసం చక్కని సౌందర్యసాధనంగా ఉపయోగపడుతుంది.


remove blackheads using lemon juice

1. లెమన్ స్ర్కబ్: ముందుగా గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత నిమ్మకాయను రెండు బాగాలుగా కట్ చేసి, ఒక భాగం తీసుకొని ముఖం మీద సున్నితంగా మర్ధన చేయాలి. ముక్కు చుట్టు కూడా బాగా స్ర్కబ్ చేయాలి. ఎందుకంటే బ్లాక్ హెడ్స్ ముక్కు చుట్టూ ఉంటాయి కాబట్టి. ముఖం అంతా మొదట స్ర్కబ్ చేసిన తర్వాత చివరగా ముక్కు చుట్టూ ఐదు నిముషాల పాటు స్ర్కబ్ చేసి ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయాలి. ఇలా రోజుకి రెండు సార్లు చేస్తే, బ్లాక్ హెడ్స్ మాయం అవుతాయి.

2. లెమన్(నిమ్మ)పంచదార స్ర్కబ్: ఇది సహజమైనటువంటి స్ర్కబ్. దీంతో తప్పకుండా బ్లాక్ హెడ్స్ ను నేచురల్ గా తగ్గిస్తుంది. నిమ్మకాయ సగభాగాన్ని తీసుకొని పంచదారలో అద్ది ముఖం అంతా మర్ధన చేయాలి. అలాగే ముక్కు చుట్టూ కూడా మర్దన చేయాలి లేదా ముఖం మీద కొంచె పంచదార చిలకరించుకొని నిమ్మ తొక్కతో బాగా రుద్దాలి. ఇలా చేయడం వల్ల బ్లాక్ హెడ్స్ తో పాటు దాని తాలూకు మచ్చలను కూడా మాయం చేస్తుంది.

3. నిమ్మరసం మరియు ఎగ్ వైట్: బ్లాక్ హెడ్స్ ను తొలగించడంలో నేచురల్ పద్దతుల్లో సహజంగా ఉపయోగించే వాటిలో ఇదొకటి. కొద్దిగా నిమ్మరసం తీసుకొని దానికి కొద్దిగా గుడ్డులోని తెల్లని సొన మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. ఇది ఆరిన తర్వాత ఫేస్ మాస్క్ లా తీసేయొచ్చు. లేదా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

4. నిమ్మరసం మరియు రోజ్ వాటర్: నిమ్మరసంలో కొద్దిగా రోజ్ వాటర్ వేసి, బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంలో కాటన్ బాల్స్ ను వేసి, కొద్దిసేపు నానబెట్టిన తర్వాత తీసి బ్లాక్ హెడ్స్ ఉన్న ప్రదేశంలో అలాగే ఉంచేసి కొద్దిసేపటి తర్వాత తీసి ముఖాన్ని శుభ్రం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది.


బ్లాక్ హెడ్స్ ను తొలగించడం లో నిమ్మ రసం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ చక్కటి చిట్కాలు పాటించి బ్లాక్ హెడ్స్ ను తొలగించుకోండి. సిట్రస్ జాతికి చెందిన పండ్లను ఉపయోగించి వైట్ హెడ్స్ ను కూడా తొలగించవచ్చు. ఈ చిట్కాలను రోజుకు రెండు సార్లు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు. నిమ్మరసం మీ చర్మాన్ని పొడిబారేలా చేస్తుంది. కాబట్టి ఈ చిట్కాలు ఉపయోగించిన తర్వాత ఏదైనా మంచి మాయిశ్చరైజర్ ను ముఖానికి అప్లై చేయండి.

నేచురల్ పద్దతుల్లో కేశాలను స్ట్రెయిట్ గా మార్చుకోవడం ఎలా...!

పండుగల సీజన్ వచ్చేస్తోంది. క్రిస్మస్, జనవరి ఫస్ట్, సంక్రాంతి, ఇలా...ప్రతి ఒక్కరూ ఈ పండుగలను, పార్టీలను ఎలా సెలబ్రేట్ చేసుకోవాలనే ఆలోచనల్లో మునిగితేలుతుంటారు. విలువైన వస్త్రాలు, మోడల్ మోడల్ నగలు, స్టైలిష్ చెప్పులు ఇలా ప్రతి ఒక్కటీ ఫర్ ఫెక్ట్ గా ఉండాలనుకుంటారు. ఇవేకాదు మరొక ముక్యమైన విషయం కూడా ఉంది. అదే మిమ్మల్ని మరింత సౌందర్యంగా కనబడేలా చేస్తుంది. అదేంటంటే హెయిర్ స్టైల్.


మీ అవుట్ ఫిట్ పర్సనాలిటీని పెంచే వాటిలో ప్రధానమైనది హెయిర్ స్టైల్.సాధారణంగా మనం రోజూ ఎంతో మందిని చూస్తుంటాం. ఒక్కొక్కరు ఒక్కో విధమైన హెయిర్ స్టౌల్ ను మెయింటైన్ చేస్తుంటారు. కొందరికి కర్లీ హెయిర్‌ వుంటే మరి కొందరికి స్ట్రెయిట్‌ హెయిర్‌ వుంటుంది. తమ సహజసిద్ధమైన కేశాలను ఇష్టపడేవారూ ఉన్నారు. అలా కాకుండా నిటారుగా ఉన్న జుట్టును వంకీలు తిప్పించుకునేవారు, నొక్కులుగా ఉన్న కురులను తిన్నగా మార్చుకునేవారూ ఉన్నారు. అయితే ఇప్పుడు అమ్మాయిల్లో ఎక్కువగా స్ట్రైయిటనింగ్ హెయిర్ స్టైల్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. స్ట్రెయిట్ హెయిర్ చేయించుకోవడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.


హెయిర్ ప్రొసీజర్స్ ఏమైనా చేయించుకున్నప్పుడు అంటే పెర్మింగ్, స్ట్రెయిటెనింగ్ వంటి వాటి వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతింటాయి. ఫలితంగా వెంట్రుకలు పొడిబారిపోయి, నిస్తేజంగా, నిర్జీవంగా మారిపోతాయి. కొన్ని సందర్భాలలో చివర్లు చిట్లిపోవడం, కుదుళ్లు పూర్తిగా దెబ్బతినడం కూడా జరుగుతుంటుంది. ఐరన్ మరియు కెమికల్స్ తో కురులను స్ట్రెయింట్ చేయించుకోవడం వల్ల కురులకు డ్యామేజ్ కలగవచ్చు. అందువల్ల కురులను స్టైయింట్ చేసుకోవడానికి కొన్ని హోంమేడ్ హెయిర్ ప్యాక్ లను ఎంపిక చేసుకోవడం వల్ల నేచురల్ గానే స్ట్రెయిట్ హెయిర్ ను పొందవచ్చు. అందుకోసం కొన్ని నేచురల్ హోంమేడ్ హెయిర్ ప్యాక్ లను మీకోసం కొన్ని...

 

అరటి మరియు పపాయ హెయిర్ ప్యాక్: బాగా పండిన అరటిపండును మరియు పపాయను ఒక బౌల్ లో ముక్కలు ముక్కలుగా చేసి, అందులోనే కొద్దిగా తేనె కూడా వేసి బాగా మిక్స్ చేసి తలకు ప్యాక్ లా వేసుకోవాలి. ఈ ప్యాక్ ఎండిన తర్వాత మంచి షాంపూతో చల్లటి నీటితో కురులను శుభ్రం చేసుకోవాలి. తర్వాత కొద్దిగా తడిగా ఉండంగానే తలను దువ్వుకోవాలి. దువ్వుని తర్వాత తడి ఆరే వరకూ ముడి వేయకుండా అలానే ఉంచుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ హెయిర్ నేచురల్ గానే స్టైయిట్ హెయిర్ ను పొందుతుంది.



ముల్తాని మట్టి మరియు బియ్యం పిండి: ఒక కప్పు ముల్తానీ మట్టి, ఐదు టీస్పూన్ల బియ్యం పిండి మరియు ఒక ఎగ్ వైట్ అన్నింటినీ ఒక బౌల్లో తీసుకొని బాగా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత తలకు గోరువెచ్చని నూనెతో బాగా మర్ధన చేసిన తర్వాత ఈ ప్యాక్ ను అప్లై చేసి అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి. ఇలా నెలకొకసారి చేసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 

కొబ్బరి నీళ్ళు మరియు నిమ్మరసం: ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కొబ్బరి పాలు మరియు నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టి ఇది క్రీమ్ లా చిక్కబడే టప్పుడు బయటకు తీసి తర్వాత కురులకు మరియు తలబాడుకు బాగా పట్టించాలి. పట్టించిన తర్వాత వేడినీళ్ళలో టవల్ ను ముంచి తలకు చుట్టి, ఒక గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారంలో మూడు సార్లు చేయడం వల్ల కురులు నిఠారుగా మారుతాయి.

 

ఆమ్ల(ఉసిరి) మరియు శీకాకాయ, బియ్యం పిండి: ఒక మిక్సింగ్ బౌల్లో అరకప్పు ఉసిరికాయ పొడి, అరకప్పు శీకాకాయ పొడి మరియు అరకప్పు బియ్యం పిండి వేసి, అందులోనే రెండు గుడ్లలోని తెల్లని సొన వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి ఒక గంట పాటు అలాగే ఉండాలి. తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల సహజంగానే మీ కురులకు స్ట్రెయింట్ గా మార్చుతుంది.




డీప్ కండీషనర్: కండీషనర్స్ కూడా మంచి హెయిర్ కేర్ ప్రొడక్టే. ఎందుకంటే మంచి కండీషనర్ ను అప్లై చేయడం వల్ల కురులు స్ట్రెయింట్ గా మారుతాయి. తలస్నానం చేసిన తర్వాత మీకు నచ్చిన కండీషనర్ ను తలకు పట్టించాలి. తలకు బాగా మసాజ్ చేసి తర్వాత తలస్నానం చేయడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ హోం మేడ్ హెయిర్ ప్యాక్ లను ఉపయోగించి మీ కురులకు కూడా స్ట్రెయిట్ గా మార్చేసుకోండి

మిమ్మల్ని యవ్వనంగా.. కాంతివంతంగా మార్చే వెజిటేబుల్ ఫేస్ ప్యాక్స్

సాధారణంగా అందం విషయంలో చాలా మంది మహిళలు ఎక్కువ శ్రద్దతీసుకొంటారు. అందుకోసం బయట బ్యూటీ ప్యార్లర్స్ కు వెళ్ళే వాళ్ళు కొంతమందైతే మరికొంత మంది ఇంట్లోనే కొన్ని హోంమేడ్ ఫేస్ ప్యాక్ లను ఉపయోగిస్తుంటారు. అలా సహజంగా మీ చర్మంలో మెరుపులు తీసుకు రావాలనుకొంటే కొన్ని సాధారణంగా మనం ఉపయోగించే పదార్థాలతో పేస్ ప్యాక్ లు వేసుకోవచ్చు. ఆ పదార్థాలు, పండ్లు కావచ్చు, కూరగాయలు కావచ్చు. ఇంకా మసాలా దినుసులు కావచ్చు. చాలా సార్లు పండ్లతో వేసుకొనే ఫేస్ ప్యాక్ ల గురించి మనకు చాలానే తెలుసు.


ముఖ్యంగా నిమ్మ, స్ట్రాబెర్రీ, అరటి, బొప్పాయి, ఇలాంటి వాటితో చాలా ఫేస్ ప్యాక్ లు, ఫేస్ వాష్ లు వేసుకొనే ఉంటారు. అదే కూరగాయలతో ఫేస్ ఫ్యాక్ వేసుకోవడం అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది కదూ..! కొన్ని కూరగాయలు అందానికి ఔషధాలుగా పనిచేస్తాయి. అందుకే చాలా మంది మహిళలు కూరగాయలతో(క్యారెట్, పొటాటో, టమోటోలతో) ఫేస్ ప్యాక్ లను వేసుకొంటారు. ఇవి చర్మానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి వెజిటేబుల్స్ తో హోం మేడ్ ఫేస్ ప్యాక్ లను ఎలా వేసుకోవాలో మీకోసం కొన్ని....


క్యారెట్ ఫేస్ ప్యాక్: భూమి(మట్టి)లోనే కాచే కూరగాయలు(దుంపలు)లో ‘విటమిన్ ఎ'అధికంగా ఉంటుంది. కాబట్టి విటమిన్ ఎ సున్నితమైన చర్మానికి చాలా అవసరం. ఇది నేచురల్ గా మొటిమలు, మచ్చలు, వైట్ హెడ్స్, పిగ్మెంటేషన్ మరియు సన్ టాన్ నుండి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి క్యారెట్ ను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి అందులో కొద్దిగా తేనె మరియు పాలు చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఐదు నిముషా పాటు మసాజ్ చేయాలి. ఇలా చేసిన ఇరవై నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే కాదు ఈ మిశ్రమాన్ని నల్లగా మారిన మోచేతులు, మోకాళ్ళమీద కూడా రుద్దుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మోచేతులు, మోకాళ్ళు తెల్లగా మారవచ్చు.

 


టమోటో ఫేస్ ప్యాక్: బాగా పండిన టమోటోను బాగా చిదిమి, అందులో కొద్దిగా నిమ్మరసం పిండి, అర చెంచా ముల్తానీ మట్టి, సాండిల్ వుడ్ పౌడర్ ను మిక్స్ చేసి, ఈ వెజిటేబుల్ ఫేస్ ఫ్యాక్ ను ముఖం మరియు మెడకు అప్లై చేయాలి. ఇది బాగా ఎండిన తర్వాత చల్లటి నీటితో శుభ్ర చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మెరుస్తుంటుంది. టమోటోతో ఇంకా చాలా ఫేస్ ప్యాక్ లను ఇంట్లో ప్రయత్నం చేయవచ్చు. టమోటో-షుగర్, టమోటో-నిమ్మరసం-పాలు, టమోటో-తేనె, నిమ్మరసం, టమోటో-పెరుగు లేదా ఉప్పు ఇలా.. ఎదైని రెండు లేదా మూడు మిశ్రమాలతో వెజిటేబుల్ ప్యాక్ వేయడం వల్ల గ్లోయింగ్ స్కిన్ మీ సొంత అవుతుంది.

 



పొటాటో (బంగాళదుంప)ఫేస్ ప్యాక్: వెజిటేబుల్ తో వేసుకొనే ఫేస్ ప్యాక్ లలో ఇది కూడా ఒకటి. మీ చర్మం పొడిబారిఉన్నట్లైతే బంగాళదుంపను చిదిమి లేదా చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి బాగా మసాజ్ చేయాలి. ఇది ముఖానికి మాయిశ్చరైజర్ గా పనిచేసి ముఖం మీద దురద, మంట వంటివి లేకుండా చేస్తుంది. బంగాల దుంపను తురిమి అందులో ఒక చెంచా పెరుగు వేసి బాగా మిక్స్ చేసి తర్వాత ముఖానికి అప్లై చేయాలి. పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.



అవొకాడో ఫేస్ ప్యాక్: కూరగాయలు చర్మాన్ని తేమగా ఉంచడమే కాకుండా మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇంకా చర్మాన్ని పొడిబారనియ్యకుండా కాపాడుతుంది. శీతాకాలంలో ఆయిల్ క్రీమ్ అప్లై చేయడం కంటే ఇలా చేయడం మంచిది. మిక్సీలో అవొకాడో ముక్కలను మరియు ఆరెంజ్ తొక్కను వేసి మెత్తగా గ్రైండ్ చేసి అందులో ఒక చెంచా పెరుగు కొంచెం ఎగ్ వైట్ వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి, మెడకు అప్లై చేయాలి. పది పదిహేను నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేయడం వల్ల పొడిబారిన చర్మాన్ని పోగొట్టి సున్నితంగా మారుతుంది.

 

ఉల్లిపాయ ఫేస్ ప్యాక్: ఉల్లిపాయలు తరగడం వల్ల కళ్ళ వెంట నీరుకారేలా చేస్తుంది. అయితే దీని వల్ల చర్మానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. మొటిమలు, మచ్చలు లేకుండా చర్మం మెరుస్తుండేలా ఉండాంటే ఉల్లిపాయ ఫేస్ ప్యాక్ అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలో విటమిన్ ఎ, సి, మరియు ఇ ఉన్నాయి. ఈ విటమిన్స్ చర్మానికి రక్షణ కల్పిస్తాయి. సూర్యరశ్మి నుండి చర్మానికి రక్షణ కల్పిస్తాయి. ఒక బౌల్లో అర చెంచా శెనగపిండి, సాండిల్ వుడ్ పౌడర్, పెరుగు, నిమ్మరసం, మరియు ఉల్లిపాయ పేస్ట్, కొద్దిగా పాలు వేసి బాగా మిక్స్ చేసి ఈ పేస్ట్ ను ముఖానికి అప్లై చేయాలి. పదినిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ హోం మేడ్ ఫేస్ ప్యాక్ ల వల్ల చర్మం తెల్లగా మారడమే కాకుండా, చర్మంలోని మృతకణాలను తొలగిస్తుంది.

 

బీట్ రూట్ ఫేస్ ప్యాక్: దుంపలులో ‘విటమిన్ ఎ'అధికంగా ఉంటుంది. కాబట్టి విటమిన్ ఎ సున్నితమైన చర్మానికి చాలా అవసరం. ఇది నేచురల్ గా మొటిమలు, మచ్చలు, వైట్ హెడ్స్, పిగ్మెంటేషన్ మరియు సన్ టాన్ నుండి రక్షణ కల్పిస్తుంది. కాబట్టి బీట్ రూట్ ను మిక్సీలో వేసి గ్రైండ్ చేసి అందులో కొద్దిగా తేనె మరియు పాలు చేర్చి బాగా మిక్స్ చేసి ముఖానికి పట్టించి ఐదు నిముషా పాటు మసాజ్ చేయాలి. ఇలా చేసిన ఇరవై నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.

 


క్యాబేజ్: క్యాబేజి తినడానికి రుచికి మాత్రమే కాదు ఇటు ఆరోగ్యం పరంగాను, అటు అందం పరంగాను చాలా బాగా పనిచేస్తుంది. దీంతో ఫేస్ ప్యాక్ వేసుకోవడం వల్ల చర్మానికి తాజాదనం వస్తుంది. ఇంకా కళ్ళ క్రింద ఉబ్బగా ఉన్న, బ్లాక్ సర్కిల్స్ ఉన్నా పోగొడుతుంది. క్యాబేజీ ఆకులను పేస్ట్ చేసి రసాని వేరుచేయాలి. దీనికి రెండు చెంచాల శనగపిండి, చెంచా తేనె కలపాలి. ఈ మిశ్రమాని ముఖానికి రాసుకొని పావుగంటయ్యాక తడి దూదితో తొలగించాలి. ఇది చర్మంపై పేరుకొన్న మురుకిని తొలగించి కాంతివంతంగా మార్చుతుంది.



కీరదోసకాయ: మెరిసే చర్మానికి మరో అద్భుతమైనటువంటి వెజిటేబుల్ కుకుంబర్(కీరదోసకాయ). కీర దోసకాయను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ లా తయారు చేసి ముఖానికి అప్లై చేసి బాగా ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మాన్ని టైట్ చేయడమే కాకుండా యంగ్ గా కనబడేలా చేస్తుంది. మరింత మంచి ఫలితం పొందాలంటే దీనికి కొంచెం నిమ్మరసం కలిపి అప్లై చేసుకోవచ్చు.