all

Friday, November 30, 2012

కొంగు ముడులు

కావలసిన పదార్థాలు
మైదా పిండి - పావుకిలో
బెల్లం - పావుకిలో
ఉప్పు - చిటికెడు
నూనె - వేయించడానికి సరిపడా
తయారీ విధానం
మైదా పిండిలో రెండు స్పూన్ల వేడి నూనె, ఉప్పు, కొద్దిగా నీళ్లతో గులాబ్‌జామూన్‌ పిండిలా కలిపి అరగంట నానబెట్టాలి. తర్వాత చిన్న ఉండలు చేసి పూరీల్లా వత్తుకోవాలి. వీటిని అరంగుళం వెడల్పుతో రిబ్బన్‌లా పొడవుగా కోసుకోవాలి. రెండు రిబ్బన్ల చొప్పున కలిపి మధ్యలో ముడి వేయాలి. ఇలా చేసుకున్న వాటిని కాగిన నూనెలో వేయించుకోవాలి. బెల్లం పొడిలో కొద్దిగా నీళ్లు పోసి ముదురు పాకం పట్టాలి. నూనెలో వేయించిన ముడులను పాకంలో కలపాలి. వీటిని వెంటనే విడివిడిగా తీస్తే ఒకదానికొకటి అంటుకోకుండా వుంటాయి.

ఆనపగింజల మిక్చర్‌

కావలసిన పదార్థాలు
ఆనపగింజలు - 1 కప్పు, కారం - అర టీ స్పూను
వేరుశనగపప్పు - పావు కప్పు
ఉప్పు - తగినంత, నూనె - తగినంత


తయారీ విధానం
ఆనపగింజలను నీళ్లలో రెండు గంటలు నానబెట్టాలి. తర్వాత నీళ్లు ఒంపేసి గింజలను నలిపి పై పొట్టు తీయాలి. తడి ఆరకుండానే కాగిన నూనెలో వేయించాలి. వీటిని బాండీలో నేరుగా వేయకుండా చిల్లుల గరిటెలో ఉంచే వేయించాలి. మొత్తం వేగాక బాండీలో నూనంతా తీసి అడుగున కొద్దిగా ఉంచాలి. అందులో వేరుశనగపప్పు వేయించాలి. వాటికి ముందుగా వేయించి పెట్టుకున్న ఆనపగింజలు కలిపి వేడి తగ్గకుండానే ఉప్పు, కారం కలపాలి. చల్లారిన తర్వాత సీసాలో నిల్వ చేస్తే 15 రోజులు వరకు నిల్వ ఉంటాయి. వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

గుంత పునుగులు


కావలసిన పదార్థాలు
బియ్యం - 2 కప్పులు
మినప్పప్పు - 1 కప్పు
నానబెట్టిన సెనగపప్పు - 2 స్పూన్లు
క్యారెట్‌ తురుము - 2 స్పూన్లు
పుదీన, కొత్తిమీర - కొద్దిగా
కరివేపాకు - 4 రెబ్బలు
అల్లం ముక్క - చిన్నది
పచ్చిమిర్చి - 2
జీలకర్ర - 1 స్పూన్‌
ఉప్పు - తగినంత
ఉల్లిపాయ ముక్కలు - 2 కప్పులు
నూనె - సరిపడా
తయారీ విధానం
బియ్యం, మినప్పప్పు నాలుగు గంటలు నానబెట్టి రుబ్బుకోవాలి. మర్నాడు ఈ పిండిలో సెనగపప్పు, క్యారెట్‌ తురుము, పుదీన, కొత్తిమీర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలియదిప్పాలి. పొంగనాల కళాయి స్టౌ మీద పెట్టి బాగా వేడయ్యాక గుంతల్లో కొద్ది కొద్దిగా నూనె వేయాలి. తర్వాత గరిటలో పిండి వేసి మూత పెట్టాలి. కొద్ది సేపటి తర్వాత వాటిని రెండో వైపు తిప్పాలి. రెండు వైపులా ఉడికితే పొంగనాలు రెడీ. వీటికి కాంబినేషన్‌గా పల్లీచట్నీ, కారం పొడి, టమాట పచ్చిమిర్చి రోటి పచ్చడి... ఇలా ఏదైనా బావుంటుంది.
 

పండ్లతో పంచామృతం

కావలసిన పదార్థాలు
కమలాలు - 2
తర్బూజా ముక్కలు - 1 కప్పు
ఖర్జూరాలు - 12
కిస్‌మిస్‌ - 16
కొబ్బరి కోరు - 5 స్పూన్లు
పెరుగు - 2 కప్పులు
పాలు - 2 కప్పులు
కొబ్బరి కాయనీరు - 1కాయది
తేనె - 5 స్పూన్లు
పంచదార - 5 స్పూన్లు
ఉప్పు - అర స్పూను
అరటిపండ్లు - 2
మిరియాలపొడి - 1 స్పూన్‌
పుచ్చకాయ ముక్కలు - 1 కప్పు


తయారీ విధానం
కమలాపండ్లను తొనలు, తర్బూజా, అరటి పండ్లను ముక్కలు చేసుకోవాలి. ఈ ముక్కలన్నింటినీ ఓ పాత్రలో తీసుకుని వాటిపై ఉప్పు, పంచదార, మిరియాల పొడి చల్లాలి. తర్వాత పాలు, కొబ్బరి నీళ్లు, పెరుగు, తేనె ఒక దాని తర్వాత మరొకటి పోయాలి. అన్నింటినీ కలిపి అరగంట ఫ్రిజ్‌లో పెట్టాలి. తినేముందు ఖర్జూర ముక్కలు, కిస్‌మిస్‌, కొబ్బరికోరు పైన చల్లుకుంటే చాలు. ఎంతో రుచికరమైన పండ్ల పంచామృతం రెడీ.

చలికాలం- పసితనం


చలికాలంలో ఎక్కువగా ఐదేళ్ల లోపల పిల్లల్లో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ. అవి ఇంట్లో నయమయ్యే జలుబు కావచ్చు. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన నిమ్మోనియా కావచ్చు. 20- 50% శ్యాసకోశ వ్యాధి ఉండొచ్చు. చాలావరకూ వైరస్‌ వల్ల దగ్గు, పడిశం, గొంతునొప్పి, బ్రాంకైటిస్‌, బ్రాంక్యురైటిస్‌, నిమోనియా రావచ్చు. రెండేళ్లలోపు పిల్లల్లో దీర్ఘకాలిక జబ్బులను పిల్లలు, పెద్దల్లో వైరస్‌ మూలంగా ఇబ్బందులు ఉండొచ్చు.
చిన్నపిల్లలు అంటే ఏడాదిలోపు బరువు తక్కువ నెలలు నిండకుండానే పుట్టినవాళ్లు, పుట్టుకతోనే గుండెజబ్బున్న వారిలో శ్వాసకోశ వ్యాధులు ఎక్కువ. ఇవి ఎక్కువగా నవంబరు, డిసెంబరులో మొదలై ఎక్కువగా జనవరి, ఫిబ్రవరి వరకూ ఎక్కువ శాతం బాధపడుపెడుతుంటాయి.
వైరస్‌ నుండి ఎలా కాపాడుకోవాలి?

కారణాలు:
1. చిన్న ఇల్లు, ఎక్కువ జనాభా
2. జనాభా గుంపుగా ఉన్నచో దగ్గు త్వరగా వ్యాపిస్తుంది.
3. డే కేర్‌ సెంటర్లు
4. తల్లిపాలు దొరకనపుడు
5. తల్లిదండ్రులకు చదువు లేనపుడు
6. ఇంట్లో పొగత్రాగడం
7. కట్టెల పొయ్యి పొగ

నియంత్రణ:
1. పిల్లలను అందరిలోనూ ఉంచకూడదు. విడిగా ఉండేలా మార్గం చూడాలి.
2. పిల్లను సినిమాలు వంటి సమూహాలు మూగే ప్రాంతాలకు తిప్పకూడదు.
పిల్లలు డే కేర్‌ సెంటర్లో ఉన్నపుడు తొందరగా జలుబు, దగ్గులకు లోనవుతారు. కనుక, ఎక్కువమంది లేని సెంటర్లో పిల్లలను చేర్చాలి. వారికి తినిపించేటప్పుడు చేతులు కడుక్కోవాలి. వంటగదికి దూరంగా పిల్లలను దూరంగా ఉంచాలి.
వచ్చిన తరువాత ఏం చేయాలి:

మూమూలు జలుబు అదే తగ్గిపోతుంది. ఇవి ఎపుడు ప్రమాదకరమో తల్లికి తెలియడం మంచిది.
1. పాలు తాగనపుడు
2. జ్వరాలు ఎక్కువగా ఉన్నపుడు
3. ఆయాసం పడుతున్నపుడు
... జలుబు ఉండి ఇవన్నీ కనిపించినపుడు పిల్లలను వైద్యుని వద్దకు తీసుకెళ్లడం అవసరం.

డా. శ్యామలాంబ,
శిశు వైద్య నిపుణులు  

ఫ్యాషన్

నెట్ శారీలో న్యూ ఫ్యాషన్ ట్రెండ్ తో మెరిసిపోతున్న సెలబ్రిటీలు...!

పండగ, పార్టీ... సందర్భం ఏదైనా ఆకట్టుకునేవి డిజైనర్ చీరలే. చీర కట్టు మన సంప్రదాయం. అంతేకాకుండా ఇప్పుడు చీర అంటే ఫ్యాషన్‌గా కూడా మారింది. అందుకే- ఇప్పుడు ఆడ వారు కూడా ఏదో ఒక సందర్భంలో చీరకట్టి మన సంప్రదాయాన్ని గుర్తుకు తెచ్చుకుంటున్నారు. చిన్న పిల్లలకు చీరల టైపు డ్రస్సులు వేస్తున్నారు. దాంతో పిల్లలు వాటిని చూసి చీరకట్టుపై ఇష్టం పెంచుకుంటున్నారు. నిజం చెప్పాలంటే చీరకట్టు స్త్రీకి గౌరవం తెస్తుంది. అయినా చీరకట్టులో ఉన్న సౌందర్యం డ్రస్సుల్లో ఎక్కడ ఉంటుంది చెప్పండి...?



ఐశ్వర్య రాయ్: మెరిసిపోయే ఈ ఇండియన్ బ్యూటీ ఈ నెట్ శారీలో మరింత అందంగా మెరిసిపోతోంది. మెరూన్ రేషమ్ జెరీ మరియు శారీ బాడర్ మీద థ్రెడ్ వర్క్ చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. చీరకు తగ్గట్టు ఫుల్ స్లీవ్ తో ఎంబ్రాయిడర్ చేసి బ్లౌజ్ ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది.


కరీనా కపూర్: కొత్తగా పెళ్ళైన పెళ్ళికూతరు కరీనా కపూర్ చీరలు కట్టడం అంటే చాలా ఇష్టం. ఈ బ్లాక్ కలర్ నెట్ చీర ఆమె జీరోసైజ్ కు ఫర్ ఫెక్ట్ గా కుదిరింది.

  ప్రీతీ జింటా: జబ్ థక్ హై జాన్ ప్రీమియర్ షోలో అద్భుతమైనటువంటి ఎల్లో కలర్ లంగాఓనీ నెటెడ్ శారీ ఒక మెరుపులా అలా మెరిసిపోయింది.

రాణి ముఖర్జీ: రాణీ ముఖర్జీ ఈ లంగాఓనీ స్టైల్ లో బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ నెటెడ్ శారీలో అద్భుతంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ బ్లౌజ్. ముత్యాల హారం, ముఖంలో పెద్దగా ఎర్రగా కనబడే బొట్టు మరింత ఆకర్షణీయంగా కనబడేలా
చేస్తున్నాయి.


కత్రినా కైఫ్: బాలీవుడ్ క్యూట్ డాల్ కత్రినా కైఫ్ ఈ క్యూట్ ఆఫ్ వైట్ శారీలో మరింత క్యూట్ గా కనబడుతోంది. చీర బాడర్ లో గోల్డెన్ ఎంబ్రాయిడరీ, దానికి ఎరుపు జాకెట్ అద్భుతంగా మ్యాచ్ అయ్యింది.


బిపాషా బసు: బాలీవుడ్ బాంబ్ షెల్ బిపాషా బసు. ఈ పీచ్ కలర్ నెట్ శారీలో మరింత సెక్సీగా కనబడుతోంది. అందమైనటువంటి ఈ నెట్ శారీకి ఓ బికినీ టైప్ బ్లౌజ్ లో తన ఆకతికి, తన స్టైల్ కు తగ్గట్టు వేసుకొన్నది.


దీపికా పడుకొనే: పొడగా ఉండే ఈ స్లిమ్ బాలీవుడ్ బ్యూటీ ట్రెడిషినల్ లుక్ తో అద్భుతంగా ఆకర్షనీయంగా కనబడుతోంది. పీచ్ కలర్ శారీలో చాలా బాగుంది. శారీ మీద వైట్ థ్రెడ్ వర్క్ చాలా క్లాసిక్ గా కనిపిస్తోంది.



జరీన్ ఖాన్: జరీన్ చేప కట్ లో కనిపించే ఈ లంగా ఓనీ శైలిలో వివిధ రంగులతో మిళితమైన ఈ శారీ లో చాలా క్యూట్ గా కనబడుతుందో.

చీరకట్టు భారతీయులకే పరిమితం. ఆరుగజాల చీరను వంటికి చుట్టుకోవడంతో సరిపెట్టుకోక దాన్ని అందంగా, ఆకర్షణీయంగా ఎలా కట్టుకోవాలో భారతీయ మహిళకు తెలిసినట్లుగా మరెవరికీ తెలియదేమో...! బెంగాలీ, మరాఠీ, తమిళనాడు, ఆంధ్రా.. ఇలా ప్రాంతాలు ఏవయినా, అక్కడి చీరకట్టు వేరయినా అందులోనూ ఓ అందం ఉంటుంది. అందుకే విదేశీయులు సైతం మన భారతీయ మహిళల చీరకట్టు పట్ల మోజుపడుతున్నారు. అందుకే ఇటీవలి కాలంలో చీరకట్టు సైతం కొత్త పుంతలు పోతోంది. ఫ్యాషన్ షోలలో కూడా చోటు దక్కించుకుంటోంది. ఈ అందాల భామల చీర కట్టు చీరకే కాదు, వారికి కూడా కొత్త అందాలను తెచ్చిపెడుతోంది కదూ..!
ప్రస్తుతరం వారు చీర కట్టులో వివిధ రకాలను ఉపయోగిస్తూ.. అందంగా ఇతరులను ఆకర్షిస్తుంటారు. అంతే కాదు ప్రస్తుత ట్రెండ్ లో నెటెడ్ శారీలు బాగా ఫేమస్ అయ్యాయి. ఈ నెటెడ్ శారీలు విజిబుల్ గా ఉండి చీరవెనుకున్న అందాలు కనిపించి కనబడనీయకుండా ఎదుటి వారిని ఆకర్షిస్తుంటాయి. అందుకే ప్రస్తుత కాలంలో రెడ్ కార్పెట్ పై, షాషన్ షో, ఈవెంట్ షో, ఇంకా పెళ్ళిళ్లలో ఇటువంటి చీరల ఎక్కుగా దర్శనమిస్తున్నాయి. ఈ నెటెడ్ శారీలు ఇండియన్ స్టైల్ లో కట్టుకోవడం వల్ల మరింత సెక్సీగా కనబడుతారు. నెట్ శారీలు చూడటానికి అందంగా కనబడ్డా వాటిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే నెట్ లా చాలా పలుచగా ఉండటం వల్ల ఏదైన తగులుకొన్నా చాలా సులభంగా చిరిగిపోయేందుకు అవకాశం ఉంది. కాబట్టి నెట్ శారీని ధరించి తర్వాత వాటిని తీసి భద్రగా మడిచి వార్డ్ రోబ్ లో భద్రపరచుకోవాలి. ముఖ్యంగా నెట్ శారీలోకి మీరు ధరించే ఆభరణాలు చాలా షార్ప్ గా ఉండకుండా చూసుకోవాలి. పొరపాటున ఏవైన నెట్ కు పట్టుకొన్న చిరిగిపోయే ప్రమాదం ఉంది.
మీకు నెట్ శారీ ధరించడం చాలా ఇష్టంగా ఉన్నా... అదీ ఇండియన్ స్టైల్ లో ఈ ట్రెండ్ కు సరిపోయే విధంగా ఎలా ధరించాలో ఇక్కడ కొందరు సెలబ్రెటీలు కట్టిన విధానం చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. దాంతో మీరు కూడా నెట్ శారీలో అందంగా.. ఆకర్షణీయంగా కనబడటానికి ప్రయత్నించవచ్చు...

రంగుల హంగులు ఏవైనా...
పువ్వులు, ఆకులు, లతలు...
డిజైన్ల మెరుపులు ఎన్నైనా నెటెడ్ మీద అవి అందంగా ఆవిష్కరించుకుంటాయి.
బెనారస్, టిష్యూ, రా సిల్క్..
మెటీరియల్ ఏదైనా... నెట్‌తో జత కలిసిందంటే డిజైనర్ల ఊహలకు కొత్త రెక్కలు పుట్టుకువస్తాయి.
వేడుక ఏదైనా ‘వల’పు చీరల్లో వనితలు వెలిగిపోయేలా చేస్తాయి.
మగువలు ముచ్చటిపడి మరి మరి కోరుకునే డిజైనర్ నెటెడ్ చీరలు ఈ వారం...


1- ఆకుపచ్చ, వంగపండు రంగుల కాంబినేషన్ గల ఫుల్‌నెట్ శారీ ఇది. బెనారస్ బార్డర్‌ని మల్టీ కలర్ దారాలతో పార్శీ డిజైన్ చేశారు. దీంతో చీర గ్రాండ్‌గా కనువిందుచేస్తోంది. డిజైనర్ స్లీవ్‌లెస్ బ్లౌజ్, టిష్యూపెటీకోట్ ఈ నెటెడ్ చీరకు కొత్త వన్నెలద్దుతున్నాయి.

2- చిలకపచ్చ రంగు ఫుల్ నెట్ శారీకి సెల్ఫ్ డిజైన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నీలిరంగు త్రెడ్ వర్క్, పార్షీ డిజైన్ బార్డర్, ఫ్యాన్సీ బ్లౌజ్ చూడముచ్చటగొలుపుతున్నాయి.

3- క్రీమ్ కలర్ ఫుల్ నెట్ శారీ చూపులను కట్టిపడేస్తోంది. మస్టర్డ్ కలర్ టిష్యూ బార్డర్ , త్రీడీ ఎఫెక్ట్‌తో చేసిన కాపర్‌సల్ఫేట్ డిజైన్, యాంటిక్ బుటా చీరకు సరికొత్త హుందాతనాన్ని తీసుకువచ్చాయి. టిష్యూ క్లాత్‌తో డిజైన్ చే సిన ఫ్యాన్సీ బ్లౌజ్ ధరించడంతో మోడ్రన్ కళ వచ్చింది.



అందమె ఆనందం

ఏదైనా తినే ముందు గ్లాసుడు నిమ్మరసం తాగుతాను. ఏ జ్యూస్ అయినా పంచదార మాత్రం వేసుకోను. చర్మానికి సహజసిద్దమైన మాయిశ్చరైజర్లను వాడతాను. ఆరోగ్యకరమైన ఆహారం, సానుకూల ఆలోచనలు చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.

డాక్టర్‌ని అడగండి - గైనకాలజీ

నాకు వయసు 20. పెళ్లయి ఏడాది అయ్యింది. రెండేళ్ల వరకు పిల్లలు వద్దనుకుంటున్నాం. ప్రస్తుతం గర్భనిరోధక మాత్రలు వాడుతున్నాం. వీటితో సైడ్‌ఎఫెక్ట్స్ ఏమిటి? వీటిని ఎంతకాలం వాడవచ్చు? వివరంగా చెప్పండి.
- ధనలక్ష్మి, పొద్దుటూరు
ఈస్ట్రోజెన్, ప్రోజెస్టిరాన్ అనే రెండు హార్మోన్ల కాంబినేషన్‌లో వాడే కాంట్రాసెప్టివ్ పిల్స్ పీరియడ్స్ సరిగ్గా వచ్చేందుకు, ప్రెగ్నెన్సీ రాకుండా నివారించేందుకు, ఓవర్ బ్లీడింగ్, పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించేందుకు వాడుకలో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం వీటిని హై డోస్‌లో ఇవ్వడం జరిగేది. వీటిని వాడడం వలన తలనొప్పి, వికారం, వాంతులు, బరువు పెరగడం, మొటిమలు రావడం, శరీరంలో నీరు చేరడం వంటి సైడ్‌ఎఫెక్ట్స్ వచ్చేవి. ప్రస్తుతం ఇవే ట్యాబ్లెట్లను తక్కువ మోతాదులో ఇస్తారు. మోతాదు తగ్గినందు వల్ల వాటి ప్రభావం, పనితీరు హై డోస్ పిల్స్‌కు ఏమాత్రం తగ్గలేదని, సైడ్‌ఎఫెక్ట్స్ ఎదురుకావడం లేదని గమనించారు. వీటిని ఏ ఇతర సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, భవిష్యత్తులో ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా రూపొందించారు. వీటిని రెండు నుంచి రెండున్నర ఏళ్ల వరకు కంటిన్యువస్‌గా వాడవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు వాడాల్సి వస్తే నాలుగు నుంచి ఆరు నెలల వరకు విరామం ఇచ్చి తిరిగి మొదలు పెట్టవచ్చు. వాటికి బదులుగా నేచురల్ మెథడ్స్, కండోమ్స్ వంటివి వాడవచ్చు.

మా వారికి సెమెన్ టెస్ట్ చేసి శుక్రకణాలు లేవని చెప్పారు. అవి పెరగాలంటే ఏం చేయాలి? మా సమస్యకు పరిష్కారం చెప్పండి.
- చంద్రకళ, నిడమనూరు


శుక్రకణాలు లేకపోవడాన్ని అజూస్పెర్మియా అంటారు. ఈ కండిషన్‌కు ముఖ్యమైన కారణాలు రెండు. మొదటిది హార్మోన్‌లలో అసమతుల్యత, హై ఫీవర్ వంటి కారణాల వల్ల శుక్రకణాలు ఏర్పడటంలోనే లోపం ఏర్పడటం. రెండవది శుక్రకణాలు సరిగ్గానే ఏర్పడినా విడుదల అయ్యే మార్గం సక్రమంగా లేకపోవడంతో వచ్చే అజూస్పెర్మియా. ఈ కండిషన్ ఉన్నవారు యూరాలజిస్ట్‌తో పరీక్ష చేయించుకుని, అందుకు కారణాన్ని కనుక్కోవడం ఎంతో ముఖ్యం. హార్మోన్ అసమతుల్యతకి తగిన ట్రీట్‌మెంట్ తీసుకోవడం, వేరికోసిల్ వంటి కండిషన్స్‌లో ఆపరేషన్ ద్వారా సరిచేయించుకోవడం, శుక్రకణాల విడుదల మార్గంలో అడ్డంకులు ఉన్నట్లయితే వాటిని ఆపరేషన్ ద్వారా సరి చేయడం... ప్రస్తుతం అందుబాటులో ఉన్న ట్రీట్‌మెంట్లు. శుక్రకణాలు విడుదల కాకపోయినా, లేదా అవి టెస్టిస్, ఎపిడైడిమిస్, వాస్‌కు పరిమితమైనట్లు గుర్తించినట్లయితే కొన్ని ప్రక్రియల ద్వారా వాటిని సేకరించి ఐవిఎఫ్ పద్ధతి ద్వారా ఫలదీకరణం చేయడం జరుగుతుంది. ఇక్కడ పేర్కొన్న ట్రీట్‌మెంట్ ఎంతో నైపుణ్యంతోనూ, ఖర్చుతోనూ కూడుకున్నది. ఫెర్టిలిటీ సెంటర్లలో ఈ విధానం అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీరు డాక్టర్‌ని కలుసుకుని వారి సలహా మేరకు ముందుకెళ్లండి.

questions & answers

నాకు వచ్చే నెలలో పెళ్లి. చలికాలం వల్ల చర్మం డ్రైగా, పొడిగా ఉంటుందని ఫేషియల్స్ చేయించుకున్నాను. కాని అవి ఏవీ నా ముఖానికి సూట్ కావడం లేదు. వీటి కారణంగా చర్మం ఇంకా నల్లబడింది. మేకప్ క్రీమ్‌లు వాడితే ముఖంపైన ప్యాచ్‌లుగా కనిపిస్తోంది. నా చర్మతత్వం మెరుగుపడటానికి, మృదువుగా, కాంతివంతంగా మారడానికి ఏం చేయాలి?
- పూర్ణిమ, ఈ మెయిల్


డ్రై స్కిన్‌కి ఎలాంటి మేకప్ వాడాలో కిందటి వారాల్లో చెప్పాను. ఆ జాగ్రత్తలు పాటించండి. ఇక చర్మం మృదువుగా మారడానికి మాయిశ్చరైజర్‌ని రాత్రి పూట తప్పనిసరిగా రాసుకోవాలి. మీరు బ్యూటీ నిపుణులచే మాత్రమే ఫేషియల్స్ చేయించుకోండి. ఫేషియల్స్‌లోdermalogica, remy laureబ్రాండ్ గల క్రీమ్‌లనే ఉపయోగించండి. లుక్ బాగుంటుంది. అలాగే డెర్మలాజిక బ్రాండ్‌లో నైట్ రిపేర్ క్రీమ్ ఉంటుంది. దీనిని రాత్రిపూట వాడండి. తేడా మీరే గమనిస్తారు.

నా వయసు 29. రెండేళ్ల క్రితం మలేరియా వచ్చింది. బాగా నల్లబడ్డాను. జుట్టు కూడా బాగా ఊడిపోయింది. ఇంకా ఈ సమస్య ఇలాగే ఉంది. పూర్వపు రంగు రావాలంటే ఏం చేయాలి?
- స్వాతి, ఇ - మెయిల్


మలేరియా వచ్చి రెండేళ్లు అయిందంటున్నారు. మలేరియా వచ్చినప్పటికీ... సాధారణంగా ఏడు నెలల నుంచి ఏడాది లోపు చర్మం, జుట్టు సాధారణ స్థితికి వస్తాయి. మీకు అలా జరగలేదంటే థైరాయిడ్, ఇతర ఆరోగ్యసమస్యలు ఏమైనా ఉన్నాయేమో డాక్టర్‌ను సంప్రదించి తెలుసుకోండి. అలాగే చర్మం, జుట్టు రంగు కూడా మారిందేమో చెక్ చేయించుకోండి. చిరాంజి (సారపప్పు. హెర్బల్ షాపులలో లభిస్తుంది)ని పాలలో రాత్రి నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్‌లా చేసి, ముఖానికి ప్యాక్ లా వేసుకోండి. ఆరిన తర్వాత శుభ్రపరుచుకోండి. రోజూ ఇలా చేస్తూంటే కొన్నాళ్ల కు మీ పూర్వపు రంగు వచ్చేస్తుంది. తలకు వారానికి ఒకసారైనా గుడ్డుతో ప్యాక్ వేసుకోండి. ఇంకా జుట్టు ఊడటానికి కారణమేంటో డాక్టర్‌ని అడిగి, వారు సూచించిన జాగ్రత్తలు పాటించండి.

నేను తలంటుకోవడానికి షికాయి, కుంకుడుకాయలు వాడతాను. వీటి వల్ల జుట్టు బాగా పొడిబారుతోంది. షాంపూలు వాడితే జుట్టు ఊడుతుందేమోనని భయం. జుట్టు పొడిబారకుండా ఏం చేయాలి?
- రోజా, ఇ - మెయిల్


పూర్వకాలంలో షాంపూలు, సబ్బులు లేవు. నూనెలు కూడా బాగా జిడ్డుగా ఉండేవి. పైగా వారానికి ఒకసారి తలంటుకోవడం వల్ల జుట్టు తేమను కోల్పోయేది కాదు. కాని, ఇప్పుడలా కాదు. జిడ్డు తక్కువగా ఉండే నూనెలను వాడుతున్నాం. పైగా వారంలో ఎక్కువసార్లు తలంటుకుంటున్నాం. కుంకుడుకాయలు, షికాయల్లో ఉండే ఆమ్లతత్వం వెంట్రుక తేమను ఎక్కువ తీసేస్తాయి. దీనివల్ల జుట్టు పీచులా తయారవుతుంది. నిపుణులను వద్దకు వెళ్లి జుట్టు తత్వాన్ని పరీక్షించుకోండి. దానికి తగిన చికిత్స తీసుకొని, వారు సూచనలు పాటించండి. ప్రస్తుతం keraspaseవాడండి. దీంట్లో షాంపూ, ఆయిల్, కండిషనర్ అన్నీ ఉంటాయి.

పెళ్ళికి ముందే కళ్ళ క్రింద నల్లటి వలయాల.. ఇవిగో చిట్కాలు...!

సాధారణంగా మనిషి ఎంత అందంగా.. ఎంత రంగుతో ఉన్నరానేది ముఖ్యం కాదు. ఎటువంటి లోపం లేకుండా ఉన్నారా లేదా అన్నదే ముఖ్యం. కనుముక్కుతీరు ఎంత చక్కగా ఉన్నా చర్మం అందంగా ఉంటేనే మరింత ఆకర్శణీయంగా కనిపిస్తుంది. వయసు పెరిగే కొద్దీ చర్మంలోని తేమ తగ్గిపోతుంటుంది. క్రమేపీ చర్మం మృదుత్వాన్ని కోల్పోయి బిరుసుగా తయారవుతుంది. ప్రస్తుతల కాలంలో వయస్సు పైబడిన వారికి మాత్రమే కాదు టీనేజ్ లో వున్న వారిని కూడా ఈ నల్లటి వలయాలు ఇబ్బంది పెడుతున్నాయి. ముఖం అందంగా కనబడటం కోసం ఎన్నో ఫేస్ ప్యాక్ లు, మరెప్నో, బ్యూటీ క్రీములు వినియోగిస్తుంటారు. అయితే అందంగా కనబడం ముఖ చర్మ ఒక్కటే కాదు ముఖంలో ఉన్న ప్రతి భాగం అందంగా కనబడేలా చూసుకోవాలి.
reduce dark circles before the wedding

ముందుగా ముఖంలో స్పష్టంగా కనిపించేది కళ్ళు. అవి మనని నడిపించడమే కాదు, ముఖానికి గొప్ప అందాన్నీ ఇస్తాయి. అంత ముఖ్యమైన నయనాలచుట్టూ ఏర్పడే నల్లటి వలయాలు అందవిహీనంగా కనిపిస్తాయి. అసలు ఈ డార్క్‌ సర్కిల్క్‌ ఎందుకు ఏర్పడ్తాయంటే నిద్ర తక్కువైనా, మానసిక వత్తిడి ఎక్కువైనా, మరేవైనా అనారోగ్య సమస్యలు తలెత్తినా ఇవి వాటికి బాహ్య సంకేతాలన్నమాట. మరి, ఈ వలయాలకు పరిష్కారం లేదా అంటే.. వుంది. డార్క్‌ సర్కిల్స్‌, రింకిల్స్‌ను పోగొట్టే లోషన్లు, ఆయింట్‌మెంట్లు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిల్లో కొన్ని చర్మానికి హాని చేసే ప్రమాదం వుంది కనుక, సహజమైన పద్ధతుల ద్వారానే డార్క్‌ సర్కిల్స్‌ను పోగొట్టుకునే ప్రయత్నం చేద్దాం. అప్పుడిక అందం, ఆకర్షణ మీ సొంతం.
మంచి నిద్ర: లేట్ నైట్ పార్టీలు, ఎక్కువ సేపు టీవీలు చూడటం వంటివాటికి దూరంగా ఉండాలి. రోజూ కనీసం 7-8గంటల నిద్ర అవసరం. నిద్ర సమయాన్ని మార్చినా కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది. కొందరు రాత్రి మేల్కొని పగలు నిద్రపోతుంటారు. ఇలా చేడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ఏర్పడటానికి కారణం అవుతుంది.
బాదాం ఆయిల్: రాత్రిపూట పడుకునేముందు కొద్దిగా ఆల్మండ్ క్రీమ్ ను కంటి చుట్టూరాసీ నెమ్మదిగా మసాజ్ చేయాలి ఇలా క్రమం తప్పకుండా చేస్తే డార్క్ సర్కిల్స్ తగ్గుముఖం పడతాయి. అల్ఫా హైడ్రోక్సియాసిడ్స్ లేదా రెటివాల్స్ గల నైట్ క్రీమ్ను ముఖానికి మెడకు రోజూ రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
టీ బ్యాగ్స్: ఫ్రిజ్‌లో పెట్టి తీసిన టీ బ్యాగుల్ని కళ్లపై ఉంచడం మనలో చాలామందికి తెలిసిందే. అయితే చేసే పొరబాటేంటంటే.. వాటిని నేరుగా వాడేస్తుంటారు. ఏం చేయాలంటే.. టీ బ్యాగుల్ని ముందుగా ఫ్రిజ్‌లో ఉంచి.. ఆ తరవాత కళ్లపై పెట్టుకోవాలి. అలాగే హెర్బల్‌ టీ బ్యాగుల్ని వాడకూడదు. వాటివల్ల అంత ప్రయోజనం ఉండదు.
బంగాళదుంప: బంగాళా దుంపలో చర్మాన్ని తేటపరిచే (SkinLightening) తత్త్వం ఉంది. ఇది ఈ సమస్యకు చక్కటి విరుగుడు. బంగాళా దుంప రసాన్ని కంటి దింద రాసి పదినిమిషాల తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఇలా వారానికి రెండు సార్లు చేసుంటే నలుపు క్రమంగా విరుగుతుంది. అలాగే బంగాళదుంపను తురిమి చిన్న వస్త్రంలో మూటలా కట్టాలి. ఈ మూటను ఒక్కో కంటిపై పదిహేను నుంచి ఇరవై నిమిషాల దాకా ఉంచాలి. ఆ తరవాత గోరువెచ్చని నీటిలో ముంచిన దూదితో కడిగేసుకుంటే చాలు.
నిమ్మరసం: నిమ్మరసం, టమాటరసం చెంచా చొప్పున తీసుకోవాలి. ఈ రెండింటినీ బాగా కలిపి నల్లనివలయాలపై ప్యాక్‌లా రాయాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే ఎంతో మార్పు కనిపిస్తుంది. నల్లని వలయాలు క్రమంగా తగ్గుతాయి. కీరదోస ముక్కల్ని స్త్లెసుల్లా కోసి ఫ్రిజ్‌లో ఉంచాలి. బాగా చల్లగా అయ్యాక కళ్లపై పెట్టుకోవాలి. పదిహేను నిమిషాల తరవాత వాటిని తొలగించాలి. ఇది ఎంతో మార్పు తెస్తుంది.
ఆహారం: ఇలా సౌందర్య చిత్కాలతోనే కాదు ఆహారము లో మార్పులతోనూ ఇదే ఫలితాన్ని పొందవచ్చును. విటమిన్ల లోకే"విటమిన్క్ష్ కి ఇదే గుణము(SkinLightening) ఉంది. కంటికింద మచ్చలతో భాధపదేవారు సౌందర్య ఛిట్కాలతోపాటు' కే ' విటమిన్ అధికంగా లభ్యమయ్యే ఆహారము తీసుకుంటే మెరుగైన ఫలితాలు త్వరగా కనిపిస్తాయి. "కే విటమిన్ పుష్కలంగా లభించే ఆహారపార్దాలు: క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రాకోలి, క్యారెట్, బీన్స్, సోయాబీన్స్, దోసకాయ, పచ్చిబఠానీలు, కాలేయము(Liver), చేప నూనె, పెరుగు, పాలు, అన్ని రకాల ఆకుకూరలు - పాలకురలో ఎక్కువ.

వేడినీళ్ళతో తలస్నానమా...?అయితే కేశాలు జాగ్రత్త...!

ప్రస్తుత కాలంలో రోజంతా పనితో, విపరీతమైన అలసటతో వేడెక్కిన బుర్ర ప్రశాంతంగా మారాలంటే వేడి నీటి కంటే మించిన మందు మరొకటి లేదు. ఆఫీసులో, వృత్తిజీవనంలో ఒళ్లు హూనం అయ్యాక ఇంటికి చేరగానే హాయిగా వేడినీటితో వీలైనంత ఎక్కువ సేపు స్నానం చేస్తే ఆ పని తాలూకూ ఒత్తిళ్లు మటుమాయం అవుతాయి. ఇంకా చెప్పాలంటే వేడినీటి స్నానంతో విసుగును, చిరాకును, వాష్ చేసేయవచ్చు. శరీరంలో ఇంద్రియాలన్నీ చురుగ్గా ఉండాలంటే వేడినీటి స్నానానికి మించి మరొక మందు లేదు.
hot water showers bad your hair

ఒకప్పుడు తలంటి స్నానం అంటే అది ఒక పెద్ద ప్రహసనంలా సాగేది. తలకే కాదు వంటికి కూడా నూనె రాసి, నలుగు పెట్టి మరీ స్నానం చేసేవారు. దీనితో అటు తల ఇటు శరీరం కూడా పరిశుభ్రమయ్యేవి. దీనివల్లే మసాజుల వంటివి ఆ కాలంలో తక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు అంతా హడావిడే.. అంతా ఇన్‌స్టాంట్‌.. ఒంటిమీద సోప్‌వాష్‌ పోసుకొని ఒళ్ళు రుద్దుకుని, షాంపూతో బరబరా తలరుద్దేసుకొని ఐదు నిమిషాలలోపే తలంటిని, స్నానాన్ని కూడా పూర్తి చేస్తున్నారు. కానీ స్నానమనే ప్రక్రియ రిలాక్సేషన్‌కు ఒక మంచి మందు.. ఇది భౌతిక, మానసిక ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుందనే విషయం బహుకొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం...
నలుగు పెట్టి స్నానం చేయడం వల్ల శరీరంలోని సెల్యులైట్‌ టోన్‌ అవుతుంది.. శరీరానికి కూడా మసాజ్‌ జరుగుతుంది. శరీరంలో రక్తసరఫరా పెరగడమే కాకుండా చర్మం నిగనిగలాడుతూ టోన్డ్‌గా ఆరోగ్యంగా కనుపిస్తుంది. వేడి నీళ్ళు పోసుకోవడం వల్ల ఆ ఆవిరి రక్తనాళాలు విస్తరించేలా చేసి రక్తసరఫరాను పెంచుతుంది. రక్తసరఫరా బాగా జరిగినప్పుడు రక్తపోటు తగ్గడమే కాదు నరాలపై ఒత్తిడి కూడా తగ్గి ఆందోళన, ఒత్తిళ్లనుంచి వ్యక్తి బయటపడతాడు.
మంచి స్నానం నిద్ర పట్టేందుకు కూడా దోహదం చేస్తుంది. రాత్రి వేళల్లో నిద్ర పట్టక సమస్యలు ఎదుర్కొనే వారు గోరు వెచ్చటి నీటితో ఒక పది పదిహేను నిమిషాలు స్నానం చేస్తే శరీరానికి, మనస్సుకు రిలాక్సేషన్‌ వచ్చి నిద్ర ఇట్టే పట్టేస్తుందిట. వేడినీటి స్నానం చర్మాన్ని బలపరచి, చర్మంపైగల క్రిములను సంహరిస్తుంది. నూనె మర్దన శరీరంలో రక్తసరఫరా మెరుగుపరచి ఆరోగ్యవంతమైన చర్మాన్నిస్తుంది. శరీర వెనుక భాగ చర్మం, కండరాలు, భుజాలు, మొదలైనవి గట్టిగా బలపడుతాయి. వేడినీరు తగిలితే ఆ భాగాల లోని నొప్పులు, మంటలు మొదలైనవి తగ్గుతాయి.
అయితే ముఖంపైన, తలపైన వేడినీరు వాడటం వలన జుట్టు ఊడే ప్రమాదం కూడా వుంది. ఎందుకంటే వేడినీళ్లు తలలోని చర్మ రంధ్రాలను కూడా తెరచుకొనేలా చేస్తుంది. దాంతో హెయిర్ రూట్స్ కి హానీ కలిగి హెయిర్ ఫాల్ కి దారి తీస్తుంది. వేడీ నీళ్ళు కురులను బర్న్ చేస్తాయి. ఎందుకంటే కురులు ప్రోటీన్ తో తయారైయ్యేటటువంటి కెరోటిన్. కాబట్టి ప్రోటీన్ ఎక్కువగ నష్టంపోవడం వల్ల హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది. సాధారణంగా ఆహారపదార్థాలను ఎక్కువ ఉడికించడం లేదా ఎక్కువ కాచడం వల్ల ప్రోటీనులు పూర్తిగా నాశనం అవుతాయి. అదే విధంగా వేడి నీళ్ళు తలకు తగలడం వల్ల కూడా తలలోని కురుకు సంబంధించిన ప్రోటీనులు నాశం అయ్యి హెయిర్ ఫాల్ కు దారితీస్తుంది.
షాంపూ మరియు వేడి నీళ్ళ చాలా చెడ్డ కాంబినేషన్. తలకు షాంపూ పట్టించేటప్పుడు గోరు వెచ్చని నీటి మాత్రమే ఉపయోగించాల్సి ఉంటుంది. వేడినీళ్ళకు, గోరువెచ్చని నీటికి చాలా వ్యత్యాసం ఉంది. అది తెలుసుకొని తలకు గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి. తలకు కండిషన్ చేసిన తర్వాత కోల్డ్ షవర్ (చల్లనీటి స్నానం) చాలా అవసరం. చల్లనీటి స్నానంతో కురులు సున్నితంగా తయారవుతాయి. కాబట్టి హెయిర్ ఫాల్ ను అరికట్టి మంచి హెయిర్ గ్రోత్ ను ఆశించే వారు తలకు వేడినీటి స్నానం చేయకపోవడమే మంచిది. కాబట్టి శరీరానికి వేడి నీటి స్నానం ఎంత రిలాక్స్ ఇస్తుందో... తలకు చల్లనీటి స్నానం అంత రిలాక్స్ ఇస్తుంది

చలికాలపు సౌందర్య రాశి.. నేచ్యురల్ ప్రూట్ ఫేస్ మాస్క్

ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచే సుగుణాలను తనలో నింపుకున్న నారింజను ఇంగ్లీషులో ఆరెంజ్‌ అని పిలుస్తుంటారు. పిల్లలు పెద్దలు ఇష్టంగా తినే పండ్లలో ఆరెంజ్ ఒకటి. దీనిలో పుష్కలంగా ఉండే సి విటమిన్ చర్మానికి నిగారింపు ఇస్తుంది. ఆరంజ్ లో ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి జ్యూస్ లా కాకుండా తొనలతో తినడమే మంచిది. తినడానికే కాదు, బ్యూటీ కేర్ కోసం కూడా ఆరంజ్ ఫ్రూట్ ని ఉపయోగించవచ్చు.
homemade orange face packs

ఆరెంజ్‌లో ఉన్న సి విటమిన్, పొటాషియం మరియు ఫోలిక్ ఆసిడ్ కలిగివుండటం ద్వారా చర్మ సౌందర్యాన్ని మరింత మెరుగు పరుస్తుంది. స్కిన్ డామేజ్, ఎల్లో పిగ్మెంట్లకు ఆరెంజ్ జ్యూస్‌నో రోజూ తీసుకోవడం ద్వారా చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రతి రోజూ 200 ఎం.ఎల్ ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా 60ఎంజీ విటమిన్ సి లభిస్తుందని పరిశోధనలో తేలింది. కాగా 200 మంది కాస్మెటిక్ ఎగ్జిక్యూటివ్ ఉమెన్‌పై ఈ పరిశోధన జరిగిందని యూకే కాస్మెటిక్ ఎగ్జిక్యూటివ్ ఉమెన్ వెల్లడించింది. శీతాకాలంలో ఆరెంజ్ ఎక్కువగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి శీతాకాలంలో వీటిని తీసుకోవడం వల్ల అటు అరోగ్యంతో పాటు, చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. మరి ఈ ఆరోగ్య ప్రధాయిని ఆరెంజ్ ఈ చలికాలంలో చర్మాన్ని ఏవిధంగా రక్షిస్తుందో చూద్దాం...
ఆరెంజ్ ఫేస్ ప్యాక్: ఇది తయారు చేయడం చాలా సులభం. మీరు దీన్ని పేస్ట్ చేయాల్సిన పనిలేదు. ఆరెంజ్ తొనలను తొలగించి వాటితో ముఖానికి మసాజ్ చేయాలి అంతే. ఇలా మర్ధన చేసిన పది నిముషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం టైట్ గా మర్చుతుంది. ముఖంలో జిడ్డును తొలగిస్తుంది. కాంతివంతంగా మార్చుతుంది . వయస్సు పైబడినట్లు కనబడనియ్యదు. ఇలా ప్రతి రోజూ స్నానం చేసే ముందు రెగ్యులర్ గా చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
ఆరెంజ్ జ్యూస్ మరియు పాలు: చర్మాన్ని శుభ్రం చేయడంలో ఇది చాలా ముఖ్యమైనది. ఈ హోంమేడ్ ఫేస్ ప్యాక్ డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగిస్తుంది. ఇంకా బ్లాక్ హెడ్స్ తొలగించి చర్మాన్ని ప్రకాశంవంతంగా మార్చుతుంది. ఆరెండింటిని మిక్స్ చేసి ముఖానికి పట్టించి మసాజ్ చేసి, పది నిముషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. దాంతో ముఖంలో మెరుపు సంతరించుకుంటుంది.
ఆరెంజ్ తొక్క మరియు పెరుగు: పేస్ స్క్రబ్ లో ఇది మరోక గొప్ప ప్రయోగం. ఈ ఫేస్ స్ర్క్ ఇటు మహిళలకు అటు పురుషులకు ఇద్దరికీ బాగా పనిచేస్తుంది. ఆరెంజ్ తొక్కను ఎండలో బాగా ఎండబెట్టి తర్వాత మెత్తగా పౌడర్ చేసి, ఇట్లో స్టోర్ చేసుకొని సమయం దొరికినప్పుడల్లా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి ఫేస్ ప్యాక్ అప్లై చేయొచ్చు. దాంతో ముఖంలో నల్ల మచ్చలు, మొటిమలు పూర్తిగా తొలగిపోతాయి.
ఆరెంజ్ జ్యూస్-నిమ్మరసం-పెరుగు: సాధారణంగా హోంమేడ్ ఫేస్ ప్యాక్ లో ఎక్కువగా ఉపయోగించేటటువంటి సాధారణ పదార్థాలు పెరుగు, నిమ్మరసం. వీటితో పాటు ఆరెంజ్ జ్యూస్ ను కూడా మిక్స్ చేయడం వల్ల చర్మ సంరక్షణకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సన్ బర్న్ నుండి కాపాడి చర్మాన్ని తెల్లగా మార్చుతుంది.
ఆరెంజ్ తొక్క మరియు ఓట్స్ స్క్రబ్: ఈ చాలా సులభమైనటువంటి చిట్కా. చర్మాన్ని నేచురల్ గా, క్లియర్ గా మార్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రెండిటి మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు అప్లై చేయడం వల్ల డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించడం తో పాటు, బ్లాక్ హెడ్స్, మచ్చలను తొలగించి ప్రకాశంవంతంగా మార్చుతుంది.

వేస్ట్ పేపర్ అని పారేయకండి..ఇలా వాడుకోండి

మనం అందరూ పర్యావరణ పరిరక్షణ గురించి వినే ఉంటాం. చెట్లను ఎలా సేవ్ చేయాలనేది.. వాటి వల్ల వాతారణానికి, ఎంత ప్రయోజనం అనేది కూడా అందిరికీ తెలిసిన విషయమే. అందుకే ప్లాస్టిక్ వాడకాన్ని, పాలిథిన్ కవర్ల వాడకాన్ని తగ్గించడానికి ఎన్నో పద్దతులను ప్రభుత్వాలు చేపడుతున్నాయి. ఇంకా పేపర్ వాడకాన్ని కూడా తగ్గించాయి. పేపర్ వాడకం తగ్గిన తర్వాతే టాబ్లెట్స మరియు మొబైల్ ఫోన్ల రూపంలో ఇలా పేపర్ ను సేవ్ చేయగలుగుతున్నారు. కానీ ప్రింట్ మీడియా మాత్రం పేపర్ ను ఉపయోగిస్తోంది. వార్తాపత్రిక, వార్షిక నివేధిక లేదా మ్యాగజైన్ రూపంలో ప్రతి రోజూ ఉపగిస్తున్నాం. వాటిని చదివిన తర్వాత కుప్పలుతెప్పలుగా ఇంటి నిండా కొద్దిరోజులు పెట్టుకొని తర్వాత అమ్మే వారికి ఇచ్చేస్తుంటాం. లేదా వాటి కాల్చేస్తుంటాం. అయితే వాటిని ఇంటి సౌకర్యార్తం ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించండి. వేస్ట్ న్యూస్ పేపర్స్ ఏవిధంగా ఉపయోగించుకోవాలో మీకోసం కొన్ని చిట్కాలు...
smart uses waste paper

1. క్లీనింగ్ గ్లాస్: వేస్ట్ న్యూస్ పేపర్ ను క్లీనింగ్ కోసం కామన్ గా ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా గ్లాస్ వస్తువులు, గ్లాస్ డోర్స్, గ్లాస్ విండోస్, గ్లాస్ మిర్రర్స్, టీవీ గ్లాస్ ఇలా వివిధ రాకాలైన వస్తువులను శుభ్రపరచడానికి వేస్ట్ న్యూస్ పేపర్ ను ఉపయోగించవచ్చు. న్యూస్ పేపర్ ను నీటిలో నానబెట్టి తర్వాత మరకబడిన గ్లాస్ వస్తువులను తుడవడం వల్ల శుభ్రపడుతాయి. తడి న్యూస్ వేస్ట్ న్యూస్ పేపర్ తో తుడిచిన తర్వాత పొడి న్యూస్ పేపర్ తో తుడవడం వల్ల మార్పు మీకే తెలుస్తుంది. గ్లాస్ వస్తువులు మిళమిళ మెరుస్తుంటాయి.
2. ర్యాక్ కవర్స్/షెల్ఫ్ కవర్స్: ఇంట్లో కానీ, ఆఫీసులోకానీ రాక్స్, షెల్ఫ్స్ లో వస్తువలు, లేదా బుక్స్ సర్ధే ముందు ఈ వేస్ట్ న్యూస్ పేపర్ ను ఉపయోగించడం వల్ల ర్యాక్స్ డ్యామేజ్ కాకుండా మరకలు, గీతలు పడకుండా ఉంటాయి. అంతే కాకుండా చూడటానికి చాలా క్లీన్ గా ఉంటుంది. కాబట్టి బుక్ ర్యాక్స్, షూర్యాక్స్, వార్డ్ రోబ్, క్యాబినేట్ ర్యాక్స్, కిచెన్ ర్యాక్స్ లో వస్తువులను సర్ధడానికి ముందు న్యూస్ పేపర్ ను బేస్ గా ఉపయోగించాలి.
3. త్వరగా తడి ఆరడానికి: త్వరగా ఆఫీసుకు వెళ్ళాల్సిన పరిస్థితిలో షూ నీటిలో తడిస్తే? ఆ తడిని వేస్ట్ న్యూస్ పేపర్ తో తుడవడం వల్ల త్వరగా పీల్చుకుంటుంది. అంతే కాదు వుడెన్ డెస్క్ మీద కాఫీ లేదా టీ పొరబాటును వలకబోతే న్యూస్ పేపర్ తో తుడవడం వల్ల అతి త్వరగా పీల్చుకుంటుంది. ఎమర్జెన్నీ టైమ్ లో షూను, టేబుల్స్ ను మరియు వస్తువును ఇలా తడి ఆర్పుకోవచ్చు.
4. ఇంటి డెకరేషన్: వేస్ట్ న్యూస్ పేపర్ ను పడేయడం లేదా అమ్మేయడానికి బదులు, కొంచెం సృజనాత్మకతను జోడించి ఇంటిని డెకరేట్ చేసుకోండి. న్యూస్ పేపర్ తో ఇంటిని డెకరేట్ చేయడానికి చాలా పద్దతులు ఉన్నాయి. ఇలా న్యూస్ పేపర్ ఉపయోగించడం వల్ల ఖర్చు తక్కు మరియు ఎకో ఫ్రెండ్లీ ఐడియా కూడానూ...ఉదాహరణకు ఫ్లవర్స్ లా తయారు చేసి వాటికి రంగులు అద్దండి. ఇంకా ల్యాంపులను తయారు చేసి అక్కడక్కడా హ్యాంగ్ చేయండి. చూడటానికి అందంగా ఆకర్షనీయంగా ఉంటుంది.
5. బొమ్మలు తయారీ: పిల్లలు ఎప్పుడు కొత్త బొమ్మలతో ఆడుకోవడానికి ఇష్టపడుతుంటారు. కాబట్టి వారికి కొత్త కొత్త బొమ్మలు.. ఏరోప్లేన్, బోట్, అనిమల్స్, మరయు బర్డ్స్? వంటివి తయారు చేసి పిల్లలకు ఇవ్వడం వల్ల వారు సంతోషంగా ఆడుకొంటారు. అంతే కాదు ఇటువంటి వాటితో పిల్లల రూమ్ ను కూడా డెకొరేట్ చేయొచ్చు.
6. ఎక్సట్రా మేకప్ తొలగించడానికి: ఒక్కో సందర్భంలో మేకప్ ఎక్కువవుతుంటుంది. లిప్ స్టిక్, లేదా పౌడర్ వంటివి ఎక్కవుఅవుతుంటాయి. అటువంటి సమయంలో వేస్ట్ న్యూస్ పేపర్ ను లిప్స్ మీద అద్దడం వల్ల ఆ ఎక్సట్రా లిప్ స్టిక్ ను తొలగించి లైట్ గా కనబడేలా చేస్తుంది.
7. వెజిటేబుల్స్ ఫ్రెష్ గా ఉంచడానికి: గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ను న్యూస్ పేపర్ లో చుట్టి ఫ్రిజ్ లో లేదా అలాగే ఆరబయట పెట్టడం వల్ల ఎక్కువ సమయం వెజిటేబుల్స్ ఫ్రెష్ గా ఉంటాయి.
8. ఐరన్ వస్తువులను శుభ్రపరచడానికి: తుప్పు పట్టిన ఐరన్ వస్తువులను న్యూస్ పేపర్ ఉపయోగించి తుడచడం వల్ల అతి సులవుగా తుప్పు వదిలిపోతుంది. ఆ తర్వాత వాటిని నీటితో శుభ్రం చేసుకోవచ్చు.
9. విత్తనాల నాణ్యత తెలుసుకోవడానికి: విత్తనాలు ఏవైనా సరే గార్డెన్ లో నాటాలనుకొన్నప్పుడు వాటిని తడిగా ఉన్న న్యూస్ పేపర్ లో చుట్టి రెండు మూడు రోజు అలాగే పెట్టి తర్వాత చూస్తే విత్తనాలు మొలకెత్తినట్లైతే వాటిని గార్డెన్ లో మొక్కలకోసం నాటువకోవచ్చు.

చలికాలంలో పిల్లల పట్ల పెద్దలు తీసుకోవల్సిన జాగ్రత్తలు...!

నవంబర్.. డిసెంబర్ మొదలైందంటే చాలు. చలి..చలి.. వాతావరణంలోని మార్పులతో పాటు శరీరంలో అనేక మార్పులకు చేటుచేసుకుంటుంది. అయితే ఇది ఈ మార్పులు పెద్దలకు మాత్రమే కాదు .. పిల్లల పట్లకూడా తీవ్రంగా ఉంటుంది. ఈ కాలంలో పిల్లలకు సంబంధించి పెద్దలకున్న అనేక సమస్యల్లో అసలు సమస్య పొద్దున్నే నిద్రలేవడం దగ్గర్నుంచి మొదలవుతుంది. పొద్దున్న ఎనిమిదవుతున్నా ఇంకా ముసుగులోని వెచ్చదనాన్ని విడిచిపెట్టి బయటకు రావడానికి ఇష్టపడని పిల్లల్ని ‘స్కూలుకి టైమ్ అవుతోందంటూ తిరిగి రొటీన్‌ లోకి తీసుకురావడానికి తల్లిదండ్రులు పడే అవస్థలు శీతాకాలంలో ప్రతి ఇంట్లోనూ సాధారణంగా కనిపించే దృశ్యాలు. ఇలా పొద్దున్నే లేవడమే కాదు, చలికాలంలో పిల్లలకు మరెన్నో సమస్యలు. వీటిలో ముఖ్యమైనవి ఆరోగ్యానికి సంబంధించినవి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
పిల్లలకు కాలాలతో పనిలేదు. కాలం ఏదైనా వారి ఆటలు, వారి ఐస్‌క్రీంలు, వారి చాక్లెట్లు, వారి కూల్‌డ్రింకులు వారివే. కాబట్టి తల్లిదండ్రులే ఈ విషయాలు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకొనే ముందు అసలు చలికాలంలోనే పిల్లలకు ఈ ఇబ్బందులు ఎందుకొస్తాయనే పరిజ్ఞానం తల్లిదండ్రులకు ఉండడం చాలా అవసరం.
చలికాలంలో పిల్లలపై ప్రభావం ఎలా ఉంటుంది: చలికాలంలో పిల్లల శరీరతత్వంలో జరిగే మార్పులు, వాతావరణంలో జరిగే మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి.
Winter Health Safety Tips Kids

1. చలికాలంలో ముఖ్యమైన మార్పు ఉష్ణోగ్రత పడిపోవడం. పెరిగిన చలితోపాటు, గాలితోడై చలిగాలులు శరీరానికి మరిన్ని ఇబ్బందులు కలిగిస్తాయి. శరీర ఉష్ణోగ్రత, బయటి ఉష్ణోగ్రతల్లో సమతుల్యత లోపించి సమస్యలు సృష్టిస్తుంది. శ్వాసకోశాలలో, సైనస్‌లతో, చర్మంమీద దాని ప్రభావం ఉంటుంది.
2. చలికాలం పిల్లల్లో ఆకలి తగ్గిస్తుంది. చిరుతిళ్ళపై పిల్లలకుండే సహజమైన ఆసక్తితో వాటిని తింటారేమోగానీ, నిజమైన పోషక విలువలు గల అసలైన భోజనం మాత్రం వారికి ఇష్టముండదు. తిండి తగ్గిపోవడంతో శరీరం లో శక్తి కూడా సన్నగిల్లుతుంది. రోగనిరోధక శక్తి తగ్గి రోగాలు తేలిగ్గా దాడిచేస్తాయి.
3. చలికాలం గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అది రకరకాల వైరస్‌ లకు, బాక్టీరియాకి స్థావరమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవ సరంలేదు. శ్వాస ద్వారా చలిగాలులతో పాటు వైరస్, బాక్టీరియా కూడా వచ్చి చేరుతాయి.
4. చలికాలంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువనే విషయం అందరికీ తెలిసిందే. ఈ కాలంలో సూర్యుడు తక్కువ సేపు ఉండడమే కాకుండాఎండ తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది. సూర్యకాంతి మనిషిని శక్తి వంతం చేస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో రోగనిరోధకశక్తి, విటమిన్ ‘డి' శక్తిని ప్రసాదించేది సూర్యుడే. చలికాలంలో పిల్లల శరీరాలు ఎండను గ్రహించడం తగ్గిపోవడంతో ఆలోపం కూడా కొన్ని వ్యాధుల విజృంభణకు అవకాశం ఇస్తుంది. తల్లిదండ్రులు పైన వివరించినట్టుగా చలికా లంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం చాలా వరకు అర్థమైపోతుంది.
ఆహారం: చలికాలంలో పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పోషక విలువలు కలిగిన ఆహారం మూడు పూటలా పిల్లలు తీసుకునేలా చూడాలి. భోజనం వేడివేడిగా, తాజాగా ఉండేలా చూడండి. ఫ్రిజ్‌లో పెట్టినవి వేడి చేసి ఇవ్వడం వంటివి చేయకండి. భోజనంలో కూరగాయలు, ముఖ్యంగా దుంపకూరలు ఉండేట్టుగా చూడండి. క్యారెట్, బీట్‌రూట్, బంగాళదుంప, చిలకడదుంప మొదలైన దుంపలు కూరగా గాని లేదా ఉడకబెట్టిగాని పిల్లలకు పెట్టండి. ఇవి పిల్లల్లో మలబద్దకాన్ని పోగొట్టే ఫైబర్, రోగనిరోధక శక్తి పెంచే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతలను కాపాడుతాయి. చలికాలంలో ప్రత్యేకంగా పండే ఆకుకూరలలో చలికాలం ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ప్రత్యేక ఔషధగుణాలు ఉంటాయి. వీటిలో ఉండే రకరకాల విటమిన్లు, ఒమెగా 3, ఫోలిక్ ఆసిడ్, కాల్షియం మొదలైనవి చర్మాన్ని పగలకుండా కాపాడుతాయి. వీటితో పాటు విటమిన్ ‘సి' గల పళ్ళు పిల్లలు ఎక్కువగా తినేలా చూడాలి. ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలతో తినిపించాల్సినవైతే ఇక వాళ్ళు తినకుండా చూడాల్సిన వాటిలో ముఖ్యమైనది ఫ్రిజ్ నీళ్లు. ఐస్‌క్రీంలు, పంచదార కలిసిన ఏదైనాసరే చలికాలంలో పిల్లలకు మంచిదికాదు. వాటిని పిల్లలు తినకుండా వీలైన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. చలికాలంలో వేడివేడి పల్లీలు గురించి చెప్పుకుంటుంటారు. నిజంగానే ఇవి పిల్లలకు ఎంతో మంచివి. చలికాలంలో వేయించిన పల్లీలులాంటి పప్పులు పిల్లలకు ‘ఇమ్యూన్ బూస్టర్'లుగా పనిచేస్తాయి.
దుస్తులు : చలికాలంలో కొన్ని స్కూళ్ళ యూనిఫాంలో స్వెట్టర్‌ లను కూడా జత చేశారంటే ఈ కాలంలో పిల్లలను చలి నుంచి కాపాడ్డానికి దుస్తులు విషయంలో ఎంత జాగ్రత్త వహించాలో తల్లిదండ్రులు ఆర్థం చేసుకోవాలి. మంకీ క్యాప్‌లు, స్వెటర్‌లు, కాళ్ళకు సాక్స్‌లు, రాత్రిపూట చలిని తట్టుకునే దుప్పట్లు వీటితో పాటు రెగ్యులర్‌ గా వేసే దుస్తులు కూడా చలికి తట్టుకునేవిగా ఉండేలా చూసుకోవాలి. కాటన్ జీన్స్, ఉన్ని దుస్తులనే ఎక్కువగా వాడాలి. లోదుస్తులు, పైన వేసుకునేవి ఎప్పుడూ పూర్తిగా పొడిగా ఉండేట్టు చూడాలి. తడిసిన దుస్తులు పిల్లల ఒంటిమీద ఎక్కువసేపు ఉండడం చలికాలంలో ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. పిల్లలు మంకీక్యాప్, స్వెట్టర్‌లు వేసుకోడానికి మారాం చేస్తారు. లేదా వేసిన కాసేపటికే తీసివేస్తారు. అలా వారు చేయకుండా చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి తల్లిదండ్రులు వాటిని తీసేయకుండా కాపాడాలి. ఒకవేశ అవి వేసుకోవడానికి పిల్లలకు దురదలు, బిగుతుగా ఉండడం వంటి సమస్యలుంటే వాటిని పరిశీలించి, వారికి సౌకర్యంగా ఉండేలా వాటిని మార్చాలి. చలికాలంలో దుస్తులతో పిల్లలకు ఎలర్జీలు వంటివి రాకుండా ఉండే నాణ్యతగల వాటినే కొనాలి.
ఎండ: చలికాలంలో అందరూ తపించిపోయేది ఎండకోసమే. కాస్త వీలు దొరికితే ఎండలో నిలబడాలనే ప్రయత్నం చేస్తారు. శీతాకాలం సూర్యుడు తక్కువ ప్రతాపంతో, కొంతసేపే ఉంటాడు కాబట్టి, ఉన్న కొద్ది సేపట్లోనే అత్యధిక సూర్యకాంతిని పిల్లల శరీరానికి పట్టేలా తల్లిదండ్రులు చూడాలి. అందుకే పిల్లల్ని ఎంత ఎక్కువసేపు ఎండలో ఆడుకోనిస్తే అంతమంచిది. ఎండవలన శరీరానికి కేవలం వేడి పుట్టడమే కాకుండా, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని అవయవాలన్నీ ఎంతో ఆరోగ్యవం తంగా చురుకుగా పనిచేస్తాయి. ఎండలో నిలబడడం వలన విటమిన్ ‘డి' అనేది శరీరానికి పుష్కలంగా లభిస్తుంది. చలికాలం వైరస్‌లతో పోరాడడానికి ఇది ఎంతో మంచిది.
డాక్టర్‌ని నిర్లక్ష్యం చేయకండి: చలికాలంలో పిల్లలకు సర్వసాధారణంగా వచ్చే అనారోగ్యాలు దగ్గు, తుమ్ములు, జలుబు, చర్మం పగలడం. ఇవి చెప్పుకోడానికి, చూడ్డానికి, చిన్నవిగానే అనిపిస్తాయి. దాంతో తల్లిదండ్రులు తమకు తెలిసిన చిన్న చిన్న చిట్కా వైద్యాలను పిల్లల మీద ప్రయోగించే ప్రయత్నంచేస్తారు. వాటితోనే తగ్గిపోతుందనుకుంటారు. కానీ చలికాలంలో పిల్లలకి సోకే వైరస్‌లు మామూలు చిట్కాలకు తగ్గవు. పైగా తేమతో శ్వాసకోశాలు కూడా అనారోగ్య పాలవుతాయి. ఈ కాలంలో తరచుగా పిల్లల డాక్టర్‌ని సంప్రదించి, వారి సలహాలను అనుసరించి మందులు తప్పనిసరిగా వాడాలి. పిల్లల పెంపకంలో తల్లిదండ్రులకు ఎదురయ్యే అనేక సవాళ్ళలో చలికాలంలో పిల్లల ఆరోగ్య పరిరక్షణ కూడా ఒకటి. తగిన జాగ్రత్తలతో, సూచించిన సలహాలతో ఈ చలికాలంలో కూడా పిల్లల్ని వెచ్చగా, ఆరోగ్యంగా ఉంచవలసిన బాధ్యత తల్లిదండ్రులదే.

బనానా పులిహోర స్పెషల్ బ్రేక్ ఫాస్ట్

అరటితో రకరకాలైన వంటకాలు చేసుకోవచ్చు. అరటి కూర,అరటి వేపుడు, అరటి బజ్జీ మెదలైనవి. అరటితో అల్పాహారాలు, అరటి పండు రసాలు కూడా చేసుకోవచ్చు. బనానా చిప్స్‌ అనునది అరటి కాయ నుండి తయారు చేయు ఓ అల్పాహారం. ఇది ప్రపంచ వ్యాప్తంగా బహు ప్రసిద్ధి. కేరళ వాళ్ళు వీటిని కొబ్బరి నూనెతో వేయించి తయారు చేస్తారు. అవి ఓ ప్రత్యేకమైన వాసన, రుచి కలిగి ఉంటాయి. అరటి పండ్లను జాం తయారు చెయ్యడంలో కూడా ఉపయోగిస్తారు. అరటి పండ్లను పండ్ల రసాలు తయారు చేయడం లోనూ, ఫ్రూట్‌ సలాడ్‌ లలోనూ, ఉపయోగిస్తారు. అరటితో పులిహోర ఎలాతయారు చేయాలో చూద్దాం...
banana pulihora

కావలసినపదార్థాలు:
అరటికాయ: 1-2
నిమ్మకాయ: 1
పచ్చిమిర్చి తరుగు: 2tbsp
పల్లీలు: 1/4cup
బియ్యం: 1cup
జీలకర్ర: 1/2tsp
ఆవాలు: 1tsp
శనగపప్పు: 1tsp
ఎండుమిర్చి: 6
కరివేపాకు: రెండు రెమ్మలు
ఉప్పు: రుచికి తగినంత
కొత్తిమీర: ఒక కట్ట
జీడిపప్పు: 8-10
నూనె: సరిపడా
పసుపు: 1/4tsp
తయారు చేయు విధానం:
1. ముందుగా పొడిపొడిలాడేలా అన్నం వండి పక్కన ఉంచుకోవాలి.
2. తర్వాత అరటికాయ చెక్కు తీసి, ముక్కలుగా కట్ చేసి, మూడు టీ స్పూన్ల నూనెలో వేయించి తీసి పక్కన పెట్టాలి.
3. ఇప్పుడు స్టౌ మీద పాన్ పెట్టి, నూనె వేసి కాగిన తరవాత అందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించి పక్కనుంచుకోవాలి.
4. తర్వాత పెద్ద పాత్రలోకి అన్నం తీసుకుని అందులో వేయించిపెట్టుకున్న పదార్థాలను వేసి బాగా కలపాలి.
5. తరవాత జీడిపప్పు, వేయించిన పల్లీలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే బనానా రైస్ రెడీ..

బదామీ పన్నీర్ గ్నేవీ: రైస్-రోటీ స్పెషల్

పన్నీర్ నాన్ వెంజ్ కాంబినేషన్ మాత్రమే కాదు వెజిటేరియన్ కాంబినేషన్ కూడా. పన్నీర్ తో తయారు చేసే ప్రతి వంటా ఎంతో రుచితో నోరూరించేస్తుంటి. చాలా ఇండ్లలో పన్నీర్ ను మహిళలే తయారు చేసుకొంటారు. పాలను బాగా మరింగించి అందులో కొద్దిగా నిమ్మరసం వేయగానే(సిట్రిక్ యాసిడ్ వల్ల) విడిపోతుంది. దాన్ని వడగట్టి పన్నీర్ గా తయారు చేసుకొంటారు. అయితే ఈ బిజీ లైఫ్ లో పన్నీర్ కూడా రెడీమేడ్ గా బయట మార్కెట్లో దొరుకుతోంది. పన్నీర్ ను వివిధ రకాలుగా వండుతారు. పన్నీర్ గ్రేవీ, పన్నీర్ మసాలా అనేవి ఇండియన్ వంటకాల్లో చాలా పాపులర్ వంటలు. కాబట్టి కొంచెం టేస్ట్ వెరైటీగా ఉండేందుకు బాదాం మిక్స్ చేసి ఎలా తయారు చేయాలో చూద్దాం...
badami paneer gravy recipe

పన్నీర్/కాటేజ్ చీజ్: 250gms (cut into cubes)
ఉల్లిపాయలు: 2
అల్లం: 1 inch
వెల్లుల్లి: 4:5 pods
బాదాం: 10:12 (soaked for 30 minutes)
పసుపు: 1tsp
కారం: 1tsp
ధనియాల పొడి: 1tsp
ఎండు మిర్చి: 3
టమోటో గుజ్జు: ½ cup
జీలకర్ర పొడి: 1tsp
పాలు: 1tbsp
గరం మసాలా: 1tsp
లవంగం: 1
పంచదార: ½ tsp
బిర్యానీ ఆకు: 1
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: 1 cup
తయారు చేయు విధానం:
1. ముందుగా బాదాం, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, మరియు రెండు ఎండు మిర్చి వీటన్నింటినీ మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా మెత్తగా పేస్ట్ ను తయారు చేసుకోవాలి.
2. తర్వాత స్టౌ మీద పాన్ పెట్టి, మీకు నచ్చిన సైజులు కట్ చేసి పన్నీర్ ముక్కలను అందులో వేసి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ ఫ్రై చేసుకోవాలి(కనీసం ఐదు నిముషాల పాటు మీడియం మంట మీద వేయించుకోవాలి) వీటి ఒక ప్లేట్ లోనికి తీసుకొని చల్లారనివ్వాలి.
3. తర్వాత ఒక బౌల్లో కారం, ధనియాలపొడి, పసుపు, ఉప్పు, కొద్దిగా నీళ్ళు పోసి చిక్కగా కలుపుకోవాలి .
4. ఇప్పుడు పన్నీర్ వేయించుకొన్న అదే సాన్ స్టౌ మీద పెట్టి అందులో కొద్దిగా నూనె వేసి, కాగిన తర్వాత అందులో బిర్యానీ ఆకు, లవంగాలు, ఎండు మిచ్చి, వేసి వేయించి కలిపి పెట్టుకొన్న కారం, ధనియాలపొడి లిక్విడ్ ను మసాలా దినుసులు వేగుతున్న పాన్ లో పోసి బాగా కలియ బెట్టాలి.
5. ఇప్పుడు అందులోనే ముందుగా మిక్సీలో పేస్ట్ చేసుకొన్న మసాలా మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలిపి ఎక్కువ మంటమీదా ఐదు నిముషాల పాటు ఉడికించాలి. ఐదు నుండి పదినిముషాల తర్వాత టమోటో గుజ్జును కూడా ఉడుకుతున్న మిశ్రమంలో పోయాలి.
6. రెండు మూడు నిముషాల తర్వాత గరం మసాలా, మరియు జీలకర్ర పొడి, చిలకరించి, అరకప్పు నీటిని పోసి బాగా ఉడికించాలి. ఈ మిశ్రమం గ్రేవీలా చిక్కబడేటప్పుడు అందులో వేయించి పెట్టుకొన్న పన్నీర్ ముక్కలు, కొద్దిగా పాలు, మరియు పంచదార వేసి బాగా కలిపి మరికొద్దిసేపు ఉడికించాలి. అంతే బాదాం పన్నీర్ గ్రేవీ రెడీ... కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ తరుగుతో గార్నిష్ చేసి రోటీ, రైస్ తో సర్వ్ చేయాలి.

Wednesday, November 28, 2012

కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం

కార్తీక మాసం అంతా స్నాన, దాన, జప, ఉపవాసాలు చేస్తే మంచిదని ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. అలా చేయడం కుదరనివారు ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, పౌర్ణమి రోజుల్లో ఈ నాలుగింటిలో ఏదో ఒక దాన్ని ఆచరించినా సరిపోతుందనీ... అందుకు కూడా శక్తిలేనివారు పౌర్ణమినాడు శివాలయంలో దీపం వెలిగించినా పౌండరీక యజ్ఞంచేసినంత ఫలం లభిస్తుందనీ ప్రతీతి. అదే ‘కార్తీక పౌర్ణమి ప్రాశస్త్యం’.
పౌర్ణమి... ప్రతినెలా వస్తుంది. కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత. మరే పున్నమికీ ఉండదు. ఖగోళపరంగా చూస్తే... ఏడాది మొత్తమీదా జాబిలి ఆరోజు ఉన్నంత ప్రకాశంగా మరేరోజూ ఉండదు. అంతలా వెలిగిపోయే వెనె్నలకే కన్ను కుట్టేలా గుడి ప్రాంగణాలూ జలాశయాలూ కార్తీక దీపాలతో శోభాయమానంగా వెలిగిపోతుంటాయా రోజు.
కార్తీక పౌర్ణమినాడు వేకువజామునే లేచి శివనామ స్మరణతో తలారా స్నానం చేసి భక్తిశ్రద్ధలతో దీపారాధన చేసి వాటిని అరటి దొప్పల్లో పెట్టి చెరువులు, నదుల్లో వదులుతుంటారు మహిళలు.
పెళ్లికాని అమ్మాయిలు కార్తీక దీపాలను నదుల్లో వదిలి, రాత్రికి తులసి కోటలో ఉసిరికొమ్మ (కాయలతో) పెట్టి తులసి పక్కన రాధాకృష్ణుల విగ్రహాన్ని ఉంచి పూజిస్తే కోరుకున్న వ్యక్తి భర్తగా వస్తాడని విశ్వసిస్తారు.
ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున ముతె్తైదువులు రెండు రకాల నోములు నోచుకుంటారు. ఒకటి కార్తీక చలిమిళ్ల నోము. ఈ నోముకోసం కార్తీక పౌర్ణమినాడు చలిమిడి చేసి మొదటి సంవత్సరం ఐదుగురు ముతె్తైదువులకు ఆపై సంవత్సరం పది మందికి మూడో ఏడాది పదిహేను మందికి చొప్పున వాయినాలిస్తారు. రెండోది కృత్తికా దీపాల నోము. ఆరోజు రాత్రికి శివాలయంలో 120 దీపాలను వెలిగిస్తారు. తరవాతి సంవత్సరం 240 దీపాలు, ఆపై సంవత్సరం 360 దీపాలు శివాలయంలో వెలిగిస్తారు. ఈ నోములు నోచుకుంటే శివసాన్నిధ్యం లభిస్తుందని పురాణ కథనం. ఇంకా... కార్తీక పౌర్ణమినాడు నమక చమక మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడౌతాడని పురాణాలు చెబుతున్నాయి. ఆరోజున ఉసిరికాయ దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుందట. లలితా సహస్రనామం భక్తిగా పఠిస్తే ఆ దేవి సకల ఐశ్వర్యాలనూ అందిస్తుందట.
దీపం అంటే అగ్ని. జ్ఞానానికీ ఆనందానికీ సిరిసంపదలకూ ప్రతీక. దీపకాంతిలో ఉండే ఎరుపు, పసుపు, నీలకాంతులు ముగురమ్మలకూ సంకేతం అని నమ్మిక. దీపారాధనవల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని పురాణ ప్రతీతి. వెలిగించే వాళ్లకి సహాయకులుగా ఉన్నా... కొడిగట్టబోతున్న దీపానికి నూనె పోసినా కూడా ఆ పుణ్యఫలం దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అలాగే ఈ రోజున... కంచు పాత్రలో ఆవు నెయ్యి పోసి దీపం వెలిగిస్తే పూర్వజన్మలో చేసిన పాపాలు నశిస్తాయని కార్తీక పురాణం చెబుతోంది.
ఇలా ఎన్నో రకాలుగా పౌరాణిక ప్రాశస్త్యం ఉంది కాబట్టే కార్తీక పౌర్ణమినాడు శివాలయాల్లో రాత్రంతా దీపాలు వెలిగిస్తారు. వాటినే దీప మాలలుగా పిలుస్తారు. గుడి ప్రాంగణాల్లో మెట్లన్నీ దీపాల అమరికతో శోభాయమానంగా కనిపిస్తాయి. ఇక... ఇలపై శివుని ఆవాసంగా భావించే మహా పుణ్య క్షేత్రం వారణాసిలో గంగానది తీరంలోని ఘాట్‌లన్నీ కార్తీక పున్నమినాడు దీపకాంతులతో ప్రకాశిస్తాయి. ఇవి ఆ రాత్రంతా వెలుగుతూనే ఉంటాయి. ఈ కార్యక్రమాన్ని కార్తీక దీపార్తన అంటారు స్థానికులు. ఆరోజు పుష్కర్‌తోపాటు గంగానదిలో స్నానం చేస్తే ముక్తిని పొందుతారన్నది మరో నమ్మకం.
----------------------------
భగవంతుడే పనిచేయడానికి ప్రేరణ అయతే చేసే పని ఆరాధన .
భగవంతునిపై భారం వేసి ముందుకు సాగితే ఫలితం శుభమే.
Samputi Magazine



కార్తీక పౌర్ణమి

కార్తీకపౌర్ణమి పవిత్రమైనది. ఈ రోజు చేసే స్నానం, దానం, హోమాల వలన అనంతమైన పుణ్యం వస్తుందంటారు. ఈ రోజు గంగాస్నానం చేసి సాయం సమయంలో దీపారాధన చేయాలి. ఈ రోజు చేసే దీపారాధన వలన పది యజ్ఞాలు చేసిన ప్రతిఫలం పొందవచ్చు. ఈ రోజు వ్రతం ఆచరించి సత్యనారాయణ కధను వినాలి. సాయంకాలం ఆలయాల్లో లేదా రావిచెట్టు,తులసిచెట్టు ఈ మూడింటో ఎక్కడో ఒక చోట దీపారాధన వెలిగించాలి. కాశీలో ఈ రీతిని జరుగుతుంటాయి. కార్తీక పౌర్ణమి చేసి జాగయరణ చేస్తే కోరుకున్నవన్ని నెరనేరతాయని చెబుతారు

చలికాలం చల్లగా జారుకోవడానికి..నులివెచ్చని జాగ్రత్తలు..!

సాధారణంగా వాతావరణ విషయంలో అన్ని కాలాల్లో కంటే చలికాలం అంటే చాలా మంది ఇష్టం ఎందుకంటే మరి కొద్దిసేపు ఎంచక్కా వెచ్చగా పడుకోవచ్చని. చలికాలంలో వీచే కఠినమైన చల్ల గాలుల వల్ల పడక మీద నుండి లేవబుద్ది కానీవ్వదు. మరి వాతావరణం చల్లగా చల్లగా ుంటే అలాగే ఎంతసేపైనా పడుకోవాలనిపిస్తుంది ఎవరికైనా. ఎందుకంటారూ?ఎందుకేంటండి.... చాలికాలం ఆరంభమైంది కదా మరి! ఈ చలికాలం మన టైమ్ ను తినేయడమే కాదు మన శరీరం మీదా అనేక ప్రభావాలు చూపిస్తుంది ప్రత్యేకంగా చర్మం మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. చలికాలం అనగానే ఓ వెరపు. బుగ్గలు ఎర్రగా అయిపోయి, పెదాలు, పాదాలు పగుళ్లు, చేతులు పొడిగా మారి, చర్మం చిట్లి... మొత్తానికి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది పరిస్థితి. ఈ కాలంలో చేతులు, పాదాలు, పెదాలు, శిరోజాలకు ఎదుర్యే సమస్యలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి. అవేంటో చూద్దాం..
winter season body care tips

చర్మ సంరక్షణ: ఈ కాలంలో చర్మాన్ని మృదువుగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం మాయిశ్చరైజర్లు వాడాలి. మీగడ ముఖానికి, చేతులకు రాసుకుని స్నానంచేయాలి. ఈ కాలంలో సబ్బుకన్నా సున్నిపిండి బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో ఒక స్పూను కొబ్బరినూనె వేసుకుని స్నానంచేయాలి. రాత్రి పడుకునేముందు కాళ్లు, చేతులకు క్రీము రాసుకుని పడుకోవాలి. లేదంటే కొబ్బరినూనె రాయాలి. ఫేస్‌ప్యాక్‌లు ముఖాన్ని మరింత పొడిగా మారుస్తాయి. అందుకని ఫేస్‌ప్యాక్‌లు పళ్ల మిశ్రమం వంటివైతే బెటర్‌. పగులుతున్నాయి కదాని పదేపదే పెదాలను తడి చేసుకోరాదు. పెదాలు పగలకుండా లిప్‌బామ్‌, విటమిన్‌ ఇ ఆయిల్‌ అప్లై చేయాలి. పాదాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి పడుకోబోయేముందు లోషన్‌ లేదా గ్లిజరిన్‌ రాసుకోవాలి. చర్మ సమస్యలు ఎదురైతే వైద్యుని సంప్రదించాలి.
ఎండనుండి: సన్‌స్క్రీన్‌ లోషన్స్‌ కేవలం ఎండాకాలంలో మాత్రమే కాదు. ఈ సమయంలోనూ అవసరమే! చలికాలంలో ఎండ చురుక్కు మంటుంది. అసలే చర్మం పొడిబారి ఉంటుంది. అది వేడితో మరింత ఇబ్బందిపడుతుంది.
శిరోజాలు: ఈకాలంలో ఎదురయ్యే జుట్టు పొడిబారడం, చిట్లటం, చుండ్రువంటివి రాకుండా జాగ్రత్తపడాలి. హెయిర్‌ డ్రైయ్యర్‌ వాడితే జుట్టు మరింత పొడిబారి ఊడిపోతుంది.
ఆహారం: చలికాలంలో ఆహారం వేడిగా తినడం చాలా అవసరం. అలా చేస్తే శక్తిని పునరుద్ధరించినట్లే! ముఖ్యంగా సూప్‌లు వంటివి శరీరానికి సత్తువనిస్తాయి. చలికాలంలో పీచు పదార్థాలు, పళ్లు, ఆకుకూరలు, కాయగూరలు బాగా తినాలి. ప్రోటీన్లు గల గింజధాన్యాలు, మాంసం తీసుకోవాలి. సీజనల్‌ పళ్లు తీసుకోవాలి. ఆయా కాలానికి అనుగుణంగా శరీరానికి ఏం అవసరమో అవన్నీ ఆ పళ్లలో ఉంటాయి మరి! వ్యాధులు దరిచేరకుండా రోగనిరోధకశక్తిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఆహారం తినడం, బయటి నీళ్లు తాగడం వంటివి చలికాలం అనికాదు, ఏం కాలంలోనూ మంచిదికాదు. చలికాలంలో దాహం వేయదు కదా అని నీళ్లు తాగడం తగ్గించకూడదు.
దుస్తులు: చలి గాలి సోకని మందపాటి దుస్తులు ధరించాలి. దుప్పట్లు, రగ్గులు చలికాలంలో కాచి వడబోసిన నీళ్ళను తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోకండి. మజ్జిగ, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్‌లు వంటి శీతల పానీయాలు తీసుకోవడం తగ్గించండి. స్నానానికి గోరువెచ్చని నీటిని ఉపయోగిస్తూ గ్లిజరిన్ సబ్బుకుగాని సున్నిపిండిని గానీ వాడాలి. చలికాలంలో సాధారణ సబ్బు వాడకం వలన ముఖం మీద చర్మం బిగుసుకుని బిరుసుగా గరుకుగా ఉంటుంది. అందువలన చలికాలములో సున్నిపిండి, కుంకుడుకాయలతో ఒళ్ళు రుద్దుకోవడం మంచిది.
పరిశుభ్రత: శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. స్వెట్టర్లు, రగ్గులు ఎండలో వేస్తుండాలి. ఈ నులివెచ్చని జాగ్రత్తలు చాలు... చలికాలం చలచల్లగా జారుకోడానికి!

శీతాకాలంలో మొటిమలు రావడానికి ప్రధాన కారణం..!?

సాధారణంగా చాలా మంది మొటిమలు, మచ్చలు ఏర్పడ్డానికి కారణం ఆయిల్ స్కిన్ మరియు వేడి వల్ల వస్తుంటాయి అనుకొంటుంటారు. అయితే ఇలాంటి సమస్యలు ఎక్కువగా వేసవి కాలంలోనే ఎదురౌతాయి. అలాగే శీతాకాలంలో కూడా మొటిమలు రావడానికి అవకాశం ఉంది. కొంత మందిని ఇచ్చిన వివరణ ప్రకారం వేసవిలో కంటే శీతాకాలంలోనే మొటిమలు ఎక్కువగా బాధిస్తాయని తెలిసింది. ఐతే ఇది చెమట, వేడి వల్ల వచ్చే మొటిమలు కాదా..? మరి అయితే శీతాకాంలో మొటిమలకు దారితీసే కారణాలేంటి? ఒక సారి చూద్దాం...
why do we get acne winter

1. ఎక్కువగా కోల్డ్ క్రీమ్స్ ను ఉపయోగించడం: లిక్విడ్ రూపంలో కాకుండి చిక్కగా ఉండే కోల్డ్ క్రీమ్స్ చర్మానికి రాయడం వల్ల మొటిమలు ఏర్పడ్డ ప్రదేశం, మొటిమల వల్ల ఏర్పడ్డ రంద్రాలు మొత్తం నల్లగా మార్చివేస్తుంది కోల్డ్ క్రీమ్. శీతాకాలంలో చాలా వరకు పొడి చర్మం కలిగి ఉంటారు. కాబట్టి కోల్డ్ క్రీమ్ ను అప్లై చేయడం వల్ల చర్మంలో తేమ బయటకు రానివ్వకుండా అడ్డుకుంటుంది. దాంతో ముఖంగా నల్లగా కనిపిస్తుంటుంది. దాంతో ముఖం అసహ్యంగా కనబడుతుంది.
2. థిక్(చిక్కటి)కోల్డ్ క్రీమ్: శీతాకాలంలో పొడి బారిన చర్మ సంరక్షణకు కోల్డ్ క్రీమ్ మాయిశ్చరైజర్ చేయడం సహజం. అయితే మాయిశ్చరైజింగ్ కోసం చాలా చిక్కగా ఉండేటటువంటి కోల్డ్ క్రీమ్ ఎంపిక చేసుకోవడం వల్ల చర్మ రంద్రాలను మూసుకొనేలా చేసి చర్మాన్ని నల్లగా మార్చుతుంది. కాబట్టి లైట్ గా ఉండే బాడీ లోషన్ లేదా ఫేష్ లోషన్ ను అప్లై చేయడం వల్ల మొటిమలు.. మచ్చల నివారణ పొందవచ్చు.
3. నో స్వెట్ -నో క్లీనింగ్: ఒక రకంగా చెమట కూడా మొటిమలు రావడానికి కారణమే. అయితే చెమట పట్టడం అనేది శరీర ఆరోగ్యానికి చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. చెమట పట్టడం వల్ల చర్మలోపల ఉన్న దుమ్ము, ధూళి చెమట రూపంలో బయటకు విసర్జింపబడుతుంది. అయితే శీతాకాలంలో ఎక్కువ చెమట పట్టదు. దాంతో దుమ్ము, ధూళి కణాలు చర్మంలోపలే నిలిచి ఉండిపోతాయి. ఈ టాక్సిన్స్ వల్ల శీతాకాలంలో మొటిమలు రావడానికి ప్రధాన కారణం అవుతుంది.
4. ముఖాన్ని సరిగా శుభ్రం చేసుకోకపోవడం: సాధారణంగా శీతాకాలంలో చలి వల్ల ఏదైనా చల్లని పదార్థాలు, చల్లని పానీయాలు తాకాలంటే ఇష్టం ఉండదు. చల్లని వాతావరణం వల్ల ముఖం కూడా సరిగా శుభ్రం చేసుకోరు. వేసవిలో శరీర సంరక్షణకు, ముఖ సంరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం, సరిగా ముఖాన్ని శుభ్రం చేసుకోకపోవడం ఫలితంగా చర్మం మురికిగా మారుతుంది. కొన్ని సార్లు మేకప్ తొలగించుకోవడం మర్చిపోతారు. దాంతో కూడా మొటిమలు మచ్చలు సులభంగా ఏర్పడుతాయి.
5. సన్ స్క్రీన్ ఉపయోగించకపోవడం: ఏకాలంలో నైనా సరే సూర్యకిరణాలు డైరెక్ట్ గా చర్మ మీద పడినప్పుడు చర్మ సమస్యలు ఏర్పడాటానికి అవకాశం ఉంది. చర్మం ఎర్రగా మారడం, దద్దుర్లు ఏర్పడం ఇవన్ని సూర్యరశ్మి వల్లే. కాబట్టి శీతాకాలంలో కూడా బయటకు వెళ్ళె అరగంట ముందే సన్ స్ర్కీన్ లోషన్ ను అప్లై చేసుకొని వెళ్ళాలి. చలికాలంలో సూర్యరశ్మి హానికరం కాకపోయినా, సూర్యకిరణాల్లో ఆల్ట్రావయొలెట్ కిరణాలు ఉండటం వల్ల చర్మనికి హానికలిగిస్తుంది. కాబట్టి సన్ స్ర్కీన్ లోషన్ తప్పనిసరి.
మరి మొటిమలు నిరోధించడానికి ఏమి చెయ్యాలి?
1. శీతాకాలంలో చర్మానికి ఒక సారి మాత్రమే కోల్డ్ క్రీమ్ ను అప్లై చేయాలి.
2. క్రమం తప్పకుండా ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఒక వేళ శుభ్రం చేసుకొన్న తర్వాత ముఖం డ్రైగా కనబడుతుంటే ఫేస్ వాష్ చేసుకొన్న ప్రతి సారి మాయిశ్చరైజర్ ను అప్లై చేయాలి.
3. ఎక్కువ నీళ్ళు తాగుతుండాలి. లేదంటే శరీరంలోపల అధిక వేడికి గురిఅవుతుంది. ఇటువంటి చిన్న చిన్న చిట్కాలతో శీతాకాలంలో ఏర్పడే మొటిమలను నివారించవచ్చు.

సహజమైన అందానికి పసుపు..గంధం..!

స్వాభావికంగా ఉండే కొన్ని మామూలు పదార్థాలతో జీవితాన్ని చాలా అందంగా చేసుకోవచ్చు. అలాంటి అందాన్ని పెంపొందించుకునే సాధారణ పదార్థాలను ఎప్పటి నుంచో మనం వాడుతూనే ఉన్నాం . సౌందర్య సాధనాలుగా ఉపయోగిస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఎన్నో కొత్త కొత్త సౌందర్య సాధనాలు వచ్చినా అవి మాత్రం ఆరోగ్యకరమైనవిగా ఎప్పుడో కాలానుగుణంగా నిలదొక్కుకొన్నాయి. ఇటీవల వాస్తవరూపంలో వాటి ఉపయోగాన్ని మరిచిపోతున్న నేపథ్యంలో ఆరోగ్యం కోసం వాటి ప్రాముఖ్యతను గుర్తుచేసుకుందాం. వాటిలో కొన్ని మీ కోసం........
Natural Skin Care With Turmeric Sandal
1. పసుపు: పసుపు కొమ్ములుగా పేర్కొనే ఒక మొక్కల వేళ్ళను పొడిగా మార్చి సౌందర్య సాధనంగా ఉపయోగిస్తారు. వంటలోనూ పసుపును విరివిగా వాడుతుంటారు. పసుపు కీటక వినాశనిగా పనిచేస్తుంది. దానితో పాటు ముఖానికి కూడా సౌందర్య సాధనంగా పసుపు రాసుకుంటారు. అందువల్ల ముఖానికి మెరుగైన ఛాయ వస్తుంది. అయితే దీర్ఘకాలంపాటు పసుపును ముఖానికి రాయడం అంత మంచిది కాదు. దానివల్ల ముఖం తడికోల్పోయి పొడిబారే అవకాశం ఉంది.
2. చందనం: మన తెలుగు సంసృతిలోని ఎన్నో ఉత్పవాల్లో కాళ్లకు పసుపుతో పాటు...మెడపై గంధం రాసుకేనే సంప్రదాయం కూడా ఉంది అంటే సౌందర్య సాధనాలను ఆరోగ్యకరమైన రీతిలో వేడుకలకు ఉపయోగించడం మన సంసృతిలో అంతర్భాగంగా మారింది. చందనాన్ని ఒక పరిమళ ద్రవ్యగా ఉపయోగించడంతో పాటు చలువచేసే సాధనంగా వాడతారు. సంప్రదాయంగా చందనం చెక్కను రాతి మీద అరగదీసి గందాన్ని తయారు చేసి వాడతారు. దీన్ని ముఖానికి రాసుకునే పౌడర్లలో పెఫ్యూమ్స్ లో, సబ్బుల్లో , ఫేస్ ప్యాకులుగానూ ఉపయోగిస్తున్నారు. చందనంతో ముఖానికి ప్యాక్ వేయడం వల్ల నిగారింపు వస్తుందన్న నమ్మకం అనాదిగా ఉన్నదే...
3. శనగపిండి: ముఖానికి ఉన్న జిడ్డు తొలగించడానికి దీన్ని ఒక ప్యాక్ లా వేసుకోవడం ఎప్పటి నుంచో అనుసరిస్తున్న పద్ధతి, దీన్ని పసుపు, పాలు, వెన్న, తేనె వంటి వాటితో కలిపి మిశ్రమంలా చేసి ముఖానికి రాసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన రీతిలో మేని ఛాయ మెరుగవుతుందన్నది విశ్వాసం.
4. కొబ్బరి నూనె: ఇది ముదిరిన కొబ్బరి నుంచి తీసే నూనె. శుభ్రమైన ఈ నూనెను మన సంసృతిలో తలకు రాయడం ఒక ఆనవాయితీ. తలకు రాసే ఎన్నో నూనెల కంటే ఇది శ్రేష్టమైనది. దీనితో పాటు ఆరోగ్యకరమైన, కేశాల కోసం మందార ఆకులు, ఉసిరి కలిపి వాడటం కూడా మామూలే. కొబ్బరి నూనెను శరీరానికి బాగా పట్టించి మర్ధన చేయడం వల్ల శరీరానకి కావలసిన తేమ అంది, చర్మం చూడటానికి సున్నితంగా, మెరుస్తూ కనిపిస్తుంది.
5. గోరింటాకు: ఇటీవల మెహందీ పేరిట ప్రాచుర్యం పొందిన ఆకు నుంచి తీసే ఈ ఉత్పాదనను సౌందర్య సాధనంగా ఎప్పటినుంచో మన సంసృతిలో ఉపయోగిస్తున్నారు. ఇది రంగును ఇచ్చే కలరింగ్ ఏజెంట్ గా మాత్రమేకాక...చల్లదనాన్ని ఇచ్చే సౌందర్యసాధనంగా పేరుపొందింది.ఇటీవల దీన్నీ తలకు వేసే రంగుల్లో ఉపయోగిస్తున్నారు. నిజానికి పెండ్లిసంబరాల్లో ముందుగా దీన్ని రాసుకోవడం అన్నది ఒక సంసృతి వేడుక.
6. సాంబ్రాణి: ఇది కొన్ని రసాయనాలతో పాటు కొన్ని మొక్కల బెరడుల నుంచి తీసే మిశ్రమం. సుగంధ పరిమళ సాధనమే అయినా చిన్న పిల్లల్లో ఆరోగ్యం కోసం దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. ప్రతి రోజూ చంటిపిల్లల స్నానం తర్వాత సాంబ్రాణిని నిప్పులపై వేస్తారు. అందులోనుంచి వచ్చే పొగ క్రిమి సంహారినిగా పనిచేస్తుంది. దానితో పాటు చంటిపిల్లలున్న గదిలో దుర్వాసనను పోగొడుతుంది. అంటే అక్కడ పేరుకొని హానికరమైన బ్యాక్టీరియాను దూరం చేస్తుందన్నామాట....