all

Tuesday, May 14, 2013

సుగంధ ద్రవ్యాలతో ఆరోగ్యం,,,,


 
NewsListandDetails జీవితంలో ఎంత ఎక్కువగా మందులు వాడితే చివరిదశలో శరీరం అంత అనారోగ్యానికి గురవుతుందని గుర్తుంచుకోండి. మనకు తేలిగ్గా లభించే వనమూలికలు, మన వంట ఇంట్లో ఉండే అనేక వస్తువులతో ఎన్నో తరుణ వ్యాధుల నుంచి విముక్తి పొందవచ్చు.









- స్త్రీలలో బుతుకాలంలో ఎక్కువ బ్లీడింగ్‌ అవుతున్నపుడు అల్లంపొడిని రెండు టీస్పూన్లు తీసుకుని ఒక కప్పు నీటిలో కలుపుకుని తాగండి. మంచి రిలీఫ్‌నిస్తుంది.

- దెబ్బలు, గాయాలు తగిలినప్పుడు ఆ భాగాన్ని శుభ్రంగా సబ్బుతో కడిగి తుడిచి దాల్చినచెక్క, లవంగపట్టను పౌడర్‌చేసి ఉంచుకుని ఆ పౌడర్‌ను గాయాలపై బాగా చల్లితే, అలా రెండు, మూడు రోజులు చేస్తే చిన్న చిన్న గాయాలు సులభంగా మానిపోతాయి.

- లవంగనూనె జేబురుమాలకు పట్టించి వాసన చూస్తే ముక్కుదిబ్బడ, జలుబు, గొంతు బొంగురుపోవటం అన్నీ తగ్గిపోతాయి.

- యాలకుల బాగా నూరి, మెత్తగా ఉన్న ఆ యాలకుల పొడిని నశ్యంలా పీలిస్తే ముక్కురంధ్రాలు బిగుసుకుపోయి, అవస్థపడేవారికి వెంటనే తుమ్ములు వచ్చేసి ముక్కురంధ్రాలు ఫ్రీ అవుతాయి. ఈ యాలకుల నశ్యం పీలిస్తే తలనొప్పి కూడా నెమ్మదిస్తుంది.

- నీరసాన్ని, నిస్సత్తువకు, స్ట్రెస్‌ను తగ్గించి మనిషిలో మంచి శక్తినివ్వడానికి వెల్లుల్లి బాగా పనిచేస్తుంది. ఇమ్యూనిటీని పెంచి, ఏజింగ్‌ ప్రాసెస్‌ను నిదానింపజేసే గుణం వెల్లులికి ఉంది.

- భోజనం చెయ్యగానే అరచెంచాడు సోంపు గింజలను నోట్లో వేసుకుని బాగా నమిలి తిని వెంటనే మంచినీరు తాగితే కడుపునొప్పి తగ్గుతుంది. క్రమంగా ఇది మూడురోజులు తీసుకుంటే నొప్పి మాయం.

- సోంపు గసగసాలు రెండూ 50గ్రా తీసుకుని విడివిడిగా దోరగా వేయించి, దంచి పొడిచేసుకోవాలి. నీటిలో కలిపి మెత్తగా నూరి, ఆవునెయ్యి 50గ్రా కలిపి తలకు మర్దనా చేసుకుని గంటసేపు ఆగి తలస్నానం చేస్తుంటే శిరోరోగాలు హరిస్తాయి.

- మెంతిపొడి రెండు స్పూన్లు పాలల్లో వేసుకుని తాగాలి. ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కాపాడుతుంది.

- వాముపొడిచేసి, ఓ రుమాలులో ఓ మూల మూటకట్టి వాసన చూస్తుంటే ఆస్తమా పేషంట్లకు మంచిది. ఊపిరితిత్తులకు మంచిది.

- కరక్కాయ, సైంధవలవణం కలిపి సేవిస్తే బుతువుల వల్ల వచ్చే వ్యాధులు రాకుండా నిరోధించవచ్చును.

- గొంతు సమస్యతో బాధపడుతున్నప్పుడు దాల్చిన చెక్క, యాలకులు, బిరియానీ ఆకు మూడింటినీ సమంగా తీసుకుని, చూర్ణం చేసి, డబ్బాలో ఉంచుకుని ఐదుగ్రాముల చూర్ణానికి ఒక గ్లాసు నీళ్లు కలిపి మరిగించి, సగం అయ్యాక వడగట్టి తాగితే గొంతు బాధ తగ్గుతుంది.

- ఒక కప్పు శొంఠి కషాయంలో ఒక చెంచా ఆముదం కలిపి వాడితే ఉదరశూల సంహారం అవుతుంది.

- బుతుస్రావం అధికంగా ఉన్నప్పుడు ధనియాలు బాగా వాడితే, బాగా ఉపశమనంగా ఉంటుంది.

- తెల్లబట్ట సమస్యతో బాధపడే స్త్రీలు శుభ్రపరిచిన జీలకర్రను కొద్దిగా నోటిలో పోసుకుని ఓ చెంచాడు చప్పరిస్తూ ఆ రసం మ్రింగుతుండాలి. ఇలా ఏడురోజులు చేస్తే గర్భాశయం, అండా శయం, యోని శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి. నెలసరి సజావుగా సాగడానికి ఇంగువ తోడ్పడుతుంది.

- మీ వంటలోనూ, శరీరగాయాలకు చర్మసౌందర్య రక్షణకు పసుపు పెట్టిందిపేరు. తప్పక వాడండి. ఆరోగ్యాన్ని పొందండి.

No comments: