all

Tuesday, May 14, 2013

ప్రకృతి చిత్రం

 

ఇంటిరియం
ఒక పువ్వు ఎందరి చూపులనో ఆకర్షిస్తుంది, నేచురల్ ఫ్లవర్ అయినా సరే ఆర్టిఫీషియల్‌దైనా సరే! అది ప్రకృతి చిత్రం, మనకు విచిత్రం. ఆ విచిత్రం ఆగి చూసేటట్లు చేస్తుంది. గోడకు ఫ్లవర్ పెయింటింగ్ పెట్టారంటే మీరు సున్నితమనస్కులన్నమాట. ఇంట్లో అతిథులు తొలి అడుగు పెట్టే చోటు ఇది. అందుకే ఇంటి అలంకరణలో మొదటిప్రాధాన్యం ఈ గదిదే.పెయింటింగ్ సైజ్ ఎంత ఉండాలనే విషయానికొస్తే పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్నవైతే వరుసగా మూడింటిని పెడితే బావుంటుంది. ఇలాంటప్పుడు మూడింటి ఫ్రేమ్ ఒకేరకంగా ఉండాలి.

పెయింటింగ్ మనకు నచ్చినది తెచ్చి గోడకు తగిలిస్తే ఒక్కోసారి మనం అనుకున్నంత అందం రాకపోవచ్చు. పెయింటింగ్ చతురస్రాకారంగా ఉండాలా, నిలువుగా ఉండాలా లేక దీర్ఘచతురస్రంగా ఉండాలా అనేది చిన్న ప్రశ్నగా కనిపిస్తుంది. కానీ నిజానికి అది పెద్ద సందేహమే. ఇలాంటప్పుడు మన ఇంట్లో గోడ గ్యాప్ ఎంత ఉంది, మిగిలిన ఆర్ట్‌పీస్‌లు ఎలా ఉన్నాయి వంటివి దృష్టిలో పెట్టుకోవాలి.

డ్రెస్సింగ్ మిర్రర్ పక్కన ఉన్న గోడ వెడల్పుగా ఉండడంతో దీర్ఘచతురస్రాకారంలో ఉన్న పెయింటింగ్ అమర్చారు. ఉడెన్ డ్రస్సింగ్ మిర్రర్‌కి కాంట్రాస్ట్‌గా గోడకు లేత చందనం రంగు వేశారు. మిర్రర్ టేబుల్‌కి చివరగా పెట్టిన ఫ్లవర్‌వాజ్ దానికి మ్యాచింగ్‌గా ఉంది. అందులో పూలరెక్కల పచ్చదనానికి కాంబినేషన్‌గా లైట్‌గ్రీన్ కలర్ పెయింటింగ్ సెలెక్ట్ చేశారు.

డాఫోడిల్స్ ఉన్న ఫోటో ఫ్రేమ్‌ను ఆ పూల ఆకుల రంగుకు మ్యాచ్ అయ్యే రంగు ఉన్న గోడకు తగిలించారు. ఇలా మన అభిరుచికి తగ్గట్టు రకరకాల పెయింటింగ్‌లతో ఇంటిని అలంకరించుకోవచ్చు.
చిత్రలేఖనం ఖరీదైన కళ, ఆస్వాదించే మనసు ఉంటే చాలదు దానిని కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత కూడా ఉండాలి... అని చాలామంది అనుకుంటారు.

కానీ ఇక్కడ కనిపిస్తున్న ఆఫ్రికన్ అమ్మాయిల కాన్వాస్ పెయింటింగ్‌లు 160 రూపాయల నుంచి దొరుకుతాయి. ఫ్రేమ్ ఉన్నవైతే ధర కొంచెం ఎక్కువ ఉంటుంది. సెలెక్షన్ మన టేస్ట్‌కు అనుగుణంగా ఉండడం ముఖ్యం అనుకుంటే మంచి పెయింటింగ్‌తో ఇంటి అందాన్ని పెంచుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంట్లో వాళ్లకు మృదువైన ఆలోచనలు కలిగిస్తూ ఇంటికి వచ్చిన అతిథులకు కనువిందు చేయడంలో అవి వాటి పాత్రకు న్యాయం చేస్తూనే ఉంటాయి.
 

No comments: