చిట్టి కథ
అక్కడికి కొంచెం దూరంలో ఒక గుమ్మడి తీగ అల్లుకుని ఉంది. దానికి కాసిన గుమ్మడికాయలు చాలా పెద్దవిగా ఉన్నాయి. కాశీనాథునికి నవ్వు వచ్చింది. ‘‘భగవంతుడికి ఆలోచనాజ్ఞానం తక్కువగా వున్నట్టుంది ఇంత పెద్ద మర్రిచెట్టుకు ఇంత చిన్నకాయలు, అంత సన్నగుమ్మడి తీగకు అంత పెద్దకాయలు సృష్టించాడు’’ అనుకుంటూ కాశీనాథుడు నిద్రపోయాడు. అతను నిద్రలేచి చూసేప్పటికి అతని మీద చిన్న చిన్న మర్రికాయలు పడి వున్నాయి. అతనికి వెన్నులో జలదరిచింది. ఒకవేళ ఆ గుమ్మడికాయలంత కాయలు ఈ మర్రిచెట్టుకు కాసి వుంటే అవి మీదపడి తన తల పగిలి చచ్చేవాడు. కాబట్టి దేవుడే తెలివైనవాడు ఎంతో దూరదృష్టి కలవాడు అనుకుని వెళ్లిపోయాడు కాశీనాథుడు. |
No comments:
Post a Comment