all

Tuesday, May 14, 2013

మెరిసే మేనికోసం...


 
NewsListandDetailsసాధారణంగా సమ్మర్‌లో సన్నీడేస్‌కు చాలామందికి ఎక్సైటింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే బయట టూర్లు, వేసవి విడుదులు బయట ప్రదేశాల్లో ఎక్కువగా గడపడానికి చాలామంది ఇష్టపడతారు.

అందుకు అనుకూలంగానే పిల్లలకు, పెద్దలకు వేసవి సెలవులు కూడా ఉంటాయి. వేసవిలో మీరు ఎక్కువ కాలం కుటుంబసభ్యులతో గడపడానికి, మీరు అనుకున్న ప్రదేశాలను సందర్శించడానికి, మీరు అనుకున్న పనులను పూర్తి చేయడానికి వేసవికాలం అనుకూలంగా ఉంటుంది.

అయితే, అదే సమయంలో వేసవి వేడి చర్మ సమస్యలను కూడా గురిచేస్తుంది. మరి ఈ వేసవిలో స్వేచ్ఛగా ఎంజాయ్ చేయాలంటే, ఈ వేసవి వేడి నుంచి చర్మాన్ని రక్షించుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి తెలుసుకోవడానికి ఇదొక మంచి సమయం.

సూర్యరశ్మి నుండి వెలువడే యువి కిరణాలు, మరి వేడి మనల్ని అనేక చర్మ సమస్యలకు గురిచేస్తుంది. సూర్యుని నుండి వెలువడే యువి కిరణాలు వల్ల చర్మం వదులవ్వడం, ముడతలు పడటం, ఊహించని మొటిమలు, వయస్సుమీద పడేలా కనిపించడం, ఇలా వివిధ రకాల చర్మ సమస్యలకు దారితీస్తుంది. వేసవి కాలంలో సూర్యుని నుండి వెలువడే యువి కిరణాలు వల్ల చర్మంలోని ఎలాస్టిన్‌ (ఫైబర్‌)ను డ్యామేజ్‌ చేస్తుంది. చర్మం వదులవ్వడం, స్ట్రెచ్‌ మార్క్స్‌ ఏర్పడ్డం వంటి సమస్యలు కూడా మొదలవుతాయి.

వేసవికాలంలో ఆరోగ్యకరమైన మెరిసే చర్మం పొందడం మనకు చాలెంజ్‌. ముఖ్యంగా వేసవి కాలంలో ప్రయాణాలు, బయట ఎక్కువ సమయాన్ని గడిపేవారికి, సైట్‌ వర్క్‌ లేదా ఇతర ఫ్రొఫిషినల్‌ డిమాండ్స్‌ ఒకవేళ మీకు బయట ప్రదేశాలకు వెళ్లాలనిపించకపోవడం. వేసవిని ఎంజాయ్ చేయాలనే ఫీలింగ్‌ లేకపోవడం ఉన్నట్లయితే అందుకు కారణం చర్మ సమస్యలున్నట్లు గుర్తించాలి. ఈ సమస్యలతో బాధపడటం కంటే సమ్మర్‌ స్కిన్‌ ప్రాబ్లమ్స్‌ను నివారించుకోవడం మంచిది. కాబట్టి, ఏదైన చర్మ సమస్య ఏర్పడటానికి ముందే వాటికి తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.

- సన్‌స్క్రీన్‌ లోషన్‌ను ప్రతి రెండు, మూడు గంటలకొకసారి ఉపయోగిస్తే మంచిది.
- కీరదోసకాయతో ముఖానికి మసాజ్‌ చేసుకుంటే బాగుంటుంది. దాంతోపాటు రోజ్‌వాటర్‌ను కూడా అప్లయ్ చేస్తే మంచిది.
- కీరదోసకాయ రసాన్ని పాలతో కలిపి చర్మానికి రాసుకుంటే మంచి ఫలితాన్నిస్తుంది.
- మాయిశ్చరైజర్‌తో మసాజ్‌ చేసుకుని గోరువెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రపరచుకుని సన్‌స్క్రీన్‌ లోషన్‌ను అప్లయ్ చేస్తే మంచిది.
- పొడిచర్మతత్వం స్కిన్‌ ఎలర్జీతో బాధపడే వారికి ఎండ ప్రభావంతో తెల్లమచ్చలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు రోజులలో రెండు, మూడుసార్లు మాయిశ్చరైజర్‌ వాడటం తప్పనిసరి. మంచినీళ్లు ఎక్కువగా తాగాలి.
- అంతేకాదు ఈ చర్మతత్వం వారికి లైట్‌ అలర్జీ సమస్య ఉంటుంది. ఇలాంటి వారు ఎండలో ఉన్నపుడే కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా లోషన్‌ రాసుకోవాలి. బయటకు వెడుతున్న ప్పుడు వెంట గొడుగు, గ్లవుజులు వంటివి తీసుకెళ్లడం మంచిది. కొందరికి కనుబొమల కింది భాగంలో రాషెస్‌ వస్తుంటాయి. వీటినివారణకు సలహాతో చలువ కళ్లద్దాలు ధరించాలి.

No comments: