all

Tuesday, May 14, 2013

చెరుకు రసంతో సహజశక్తి


 
NewsListandDetailsరోడ్డు పక్కన మిషన్‌లో పిండి గ్లాసులో ఇచ్చే చెరకురసం ప్రకృతి ప్రసాదించిన సహజశక్తి పుంజం. అప్పటికప్పుడు సర్వజీవకణాలకి శక్తినిచ్చే సాదర పానీయం. అనాదికాలం నుంచి తినే చెరకు ముక్క పిండి తయారుచేసిన రసం శక్తి సాధనాలుగా ఎంతో ప్రాధాన్యతని సాధించుకున్నాయి. ఈ చెరకు రసంతో ఏమేమి ప్రయోజనాలో తెలుసుకుందాం.

- చెరకు రసంలో అద్భుతశక్తి ఉంది. ఈ రసం, పిప్పిని పాలల్లో ఉడికించి తాగటం వల్ల పాలు తక్కువగా ఉన్న తల్లిలో, పాలు సమృద్ధిగా పెరుగుతాయి. అంటే తల్లిపాలని పెంచే హార్మోన్లు ఈ చెరకులో ఉన్నాయి. దాహాన్ని తీర్చే మంచి నేస్తం ఇది.


- ఐస్‌ లేకుండా చెరకు రసం తాగితే గొంతువాపు, జలుబు, ఫ్లూ వంటి వాటిని నివారించడంలో సహాయపడుతుంది. ఇందులో సామాన్య షుగర్‌ లేకపోవడం వల్ల షుగర్‌ వ్యాధి ఉన్నవారు అప్పుడప్పుడు తీసుకోవచ్చు. వాళ్లు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇది ఆల్కలైన్‌ కాబట్టి ప్రొస్టేట్‌ బ్రెస్ట్‌ క్యాన్సర్‌ ఉన్నవాళ్లు తాగితే చాలా మంచిది.

- మీరు ఎండలో ఎక్కువ శ్రమపడి వచ్చిన వెంటనే ఒక గ్లాసు చెరకు రసం తాగితే మీలో ద్రవదాతువు పెరిగి తిరిగి శక్తిని పొందుతారు. ఇది జీర్ణాశయాన్ని, మూత్రాశయాన్ని గుండెను, కంటిని, మేధస్సును, సెక్స్‌ఆర్గాన్స్‌ను శక్తిపరుస్తాయని పరిశోధనలు సూచించాయి.

- చెరకురసం మూత్రావరోధం తొలగించి మూత్రం సరళంగా పోయేటట్లు చేస్తుంది. శరీరంలో ఫెబ్రియల్‌ డిజార్డర్స్‌ ఉంటే తరచూ జ్వరం లాంటి జబ్బులు వస్తూ ఉంటాయి. వాళ్లు చెరకురసం తాగుతుంటే శక్తి పెరిగి ఆ రుగ్మత కూడా తగ్గిపోతుంది.

- సుఖవ్యాధుల వల్ల గాని, మరే ఇతర కారణాల వల్ల గాని మూత్రం మంటగా వస్తుంటే చెరకురసంలో నిమ్మరసం, అల్లపురసం కొబ్బరినీళ్లు కలిపి తాగితే తగ్గిపోతుంది. లివరు జబ్బులు, కామెర్లు ఉన్నవారికి చెరకు రసం చాలా హితకరం. ఇది జీర్ణశక్తిని పెంచుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.

No comments: