all

Tuesday, May 14, 2013

మంచి అలవాట్లు


 
NewsListandDetails- పిల్లలకు భోజనం వడ్డించే ముందు మీ చేతులను సోపు వాడి శుభ్రంగా మంచినీరుతో కడుక్కోండి. పిల్లలు భోజనం చేసే ముందు ఈ అలవాటును నేర్పండి.

- టాయ్ లెట్‌కు వెళ్లి వచ్చినప్పుడంతా పిల్లల చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం నేర్పండి. మలమూత్ర విసర్జన తరువాత లెట్రిన్‌ ఫ్లష్‌ చేయండి.

- పిల్లల చేతులను శుభ్రమైన తువాలుతో తుడుచుకోమనండి.

- పిల్లలకు స్నానం చేయిస్తున్నప్పుడు శుభ్రమైన మంచినీటినే వాడండి.

- కాలువలలో, వర్షాకాలంలో నీటితో నిండిన గుంటలలో పిల్లలను ఆడనివ్వకండి.

- పిల్లలను బయట ప్రాంతంలో మలమూత్ర విసర్జన జరగకుండా జాగ్రత్త పడండి. ఇవి ఆరోగ్యానికి హానిని కలిగిస్తాయి.
- త్రాగేనీరున్న పాత్రను ఎల్లప్పుడూ మూసి ఉంచండి. నీరు నిలువ ఉంచుకునే పాత్రను మంచినీటితో శుభ్రంగా కడగండి.

- పిల్లలు పడుకునే గదిలో బెడ్‌, పిల్లో, పిల్లో కవరు, బెడ్‌షీట్‌ వీటిని ప్రతినిత్యం శుభ్రపరచుకోండి.

- మూత ఉన్న చెత్తబుట్టను మీ వంట ఇంటిలో ఉంచుకోండి. చెత్తా చెదారం పేరుకునేలా ఉంచకండి.

- పిల్లలకు శుభ్రత ముఖ్యత్వాన్ని బోధించి వ్యక్తిగత శుభ్రతను గురించి కూడా తెలియజేయండి.

No comments: